Register as a Reviewer
మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

11 Sep 2026
Overall Rating
5.2/10
17 Reviews

Mahendragiri Varahi : టాలీవుడ్ లో మోస్ట్ అండర్రేటెడ్ హీరోస్ లో ఒకరైన సుమంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "మహేంద్రగిరి వారాహి". సిద్ధూ జొన్నలగడ్డ ప్రత్యేకపాత్రలో నటించిన ఈ మూవీని సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Santhosh Jagarlapudi
Cast: Sumanth, Meenakshi Goswami, Aishwarya Rajesh, Malvika Nair, Manju Bhargavi, Brahmanandam, Rajeev Kanakala, Vennela Kishore, Vamsee Chaganti, Kamal Kamaraju, Srinivas Vadlamani & others.

Available in:

Reviews

What critics and the public are saying about మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Media Reviews

12 Avg: 5.3/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Mahendragiri Varahi Movie Review

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వ...

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి సినిమా చూసానన్న ఫీల్ వచ్చింది. 


కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ప్రాబ్లెమ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. అందుకే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పాను. ఇక సినిమాలో సుమంత్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ రోల్స్ లిమిటెడ్ గానే ఉంది. కానీ బాగుంది. అండ్ ఈ సినిమా వల్ల చాలా మంది వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ట్విస్ట్ రివీల్ చేసేటపుడు కొన్ని సప్రైజ్ చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ బాగా లేవు. అండ్ వారాహి అమ్మవారి గురించి కొంచెం ఎక్కువ చెప్పి ఉంటె ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. ఓవరాల్ గా సుమంత్ కోసం, డివోషనల్ థ్రిల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక దీనికి నా రేటింగ్ 2.75/5.

Sep 11, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Mahendragiri Varahi movie Review

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్...

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డౌట్ ని లాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో అవి మాములే కదా. అండ్ రెండు క్యారెక్టర్ల విషయంలో ట్విస్ట్ లు ఎక్సపెక్ట్ చేయలేదు. అది బాగా అనిపించింది. 


అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ మొత్తం బోర్ కొట్టేసింది. ఫ్లాట్ గా వెళ్తుంది. కథ ఏం ముందుకెళ్ళదు. అండ్ VFX దారుణంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి బడ్జెట్ కూడా ఎక్కువ లేదు. ఇక రివీల్ అయిన ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ పార్ట్ టు తీయొచ్చు అనుకుంటే కూడా తీసే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక కార్తికేయ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందొ, ఇందులో హీరో సుమంత్ రోల్ కూడా అలాగే ఉంది. కానీ సుమంత్ సహా అందరు ఆర్టిస్ట్ లు బాగానే చేసారు. ఒకటి నచ్చలేదు ఏంటంటే ఐశ్వర్య రాజేష్ ట్విస్ట్ ని ట్రైలర్ లోనే రివీల్ చేసారు అది నచ్చలేదు. సో ఓవరాల్ గా మహేంద్రగిరి వారాహి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సగం బాగుంది. నా రేటింగ్ అయితే 3.25\5.


Sep 11, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Mahendragiri Varahi movie review

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరి...

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ నుండి మొత్తం ట్రాక్ తప్పుతుంది. ఒక ఆర్గానిక్ ఫ్లో అనేది సినిమాలో మిస్ అయింది. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇంటర్వెల్ బ్లాక్ ఇంపార్టెంట్, అది సినిమాలో వర్కౌట్ అయింది. అయితే సినిమాలో క్లైమాక్స్ లో క్లారిటీ మిస్ అయింది. చాలా సీన్స్ కి ట్విస్ట్ రివీల్స్ వర్త్ అనిపించవు. అండ్ హీరో సినిమాలో అన్ని సమస్యలను సాల్వ్ చేయడు. అండ్ సినిమాలో ఐశ్వర్య, సిద్ధూ జొన్నలగడ్డ కామియోస్ బాగున్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవు. VFX వరెస్ట్ గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ సినిమా మొత్తం స్టోరీ చెప్పటానికి బాగా ట్రై చేసినా, వర్త్ ట్విస్ట్ లు, ఎమోషన్స్ పండకపోకపోయేసరికి, ఓ డీసెంట్ డివోషనల్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. 

Sep 11, 2026 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Mahendragiri Varahi movie review

సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్‌ ఆస్తికుడిగా మా...

సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్‌ ఆస్తికుడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. అయితే సినిమాలో హీరో సమస్యని ఛేదించడానికి లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. దాంతో క్లయిమాక్స్ ట్విస్ట్ ను కన్వెన్సింగ్‌ గా చెప్పడానికి దర్శకుడికి టైమ్‌ సరిపోలేదు. దానికి తోడు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ సాగదీయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. 


మొత్తం మీద దర్శకుడు ఏదో అనుకుని, మరేదో తీశాడనే భావనే కలుగుతుంది. సంతోష్‌ జాగర్లపూడికి ఈ తరహా సినిమా తీయడంలో అనుభవం ఉన్నా.. ఎందుకో ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. క్లయిమాక్స్ ట్విస్ట్ తప్పితే... సినిమా అంతా సాదాసీదాగా సాగిపోవడంతో 'మహేంద్రగిరి వారాహి' ప్రేక్షకులను మెప్పించడం కష్టమే!


Sep 11, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Mahendragiri Varahi movie Review

‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.సినిమా ప్రామిసింగ్ ఆరంభంతో, మంచి ఇంటర్వెల్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్...

‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.


సినిమా ప్రామిసింగ్ ఆరంభంతో, మంచి ఇంటర్వెల్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం పాయింట్‌కే కట్టుబడి తీయడం బిగ్ ప్లస్. సిద్ధూ నటన, ఐశ్వర్య రాజేష్ క్యామియో సీన్స్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు బాగా వర్కవుట్ అయ్యాయి.


అయితే, కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అవ్వడం, ల్యాగ్, ప్రమోషన్స్‌లోనే ఐశ్వర్య పాత్రను రివీల్ చేయడం వల్ల థియేటర్ థ్రిల్ కొంత తగ్గింది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త పకడ్బందీగా ఉంటే నెక్స్ట్ లెవల్‌లో ఉండేది.


ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్లర్ లవర్స్‌కు ఒక డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వాచ్!


Sep 11, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Mahendragiri Varahi movie Review

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌ గా ఉంది.. వారాహి మొదలవ్...

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌ గా ఉంది.. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌ గా మొదలైంది.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అయిపోతుంది. సెకండాఫ్‌ కు చాలా ప్రశ్నలు వదిలేసి సస్పెన్స్ మెయింటేన్ చేసారు. అమ్మవారి శాపం నుంచి తప్పించుకోలేక వచ్చే మరణాలు చూస్తుంటే.. కచ్చితంగా దానివెనక ఏదో రహస్యం ఉందనే విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు సంతోష్.. 


కానీ మరీ ఊహించలేనంత ట్విస్టులు మాత్రం ఉండవు.. ఆ టైమ్‌కు పాస్ అయిపోతాయి. సిద్ధూతో పాటు ఐశ్వర్య రాజేష్ క్యామియో బాగుంది.. ఇక అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లాంటివి ఇరికించకుండా తీసుకున్న పాయింట్‌ కే కట్టుబడి ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. ఇక ప్రీ క్లైమాక్స్, ముగింపు సన్నివేశాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు, వాటిని రాసుకున్న తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కొన్ని సీన్లకు సరైన వివరణ ఇవ్వకుండా వదిలేయడం నిరాశపరుస్తుంది. ఇక ప్రమోషన్స్‌ లోనే ఐశ్వర్య రాజేష్ పాత్రను బయట పెట్టేయడం వల్ల థియేటర్లో ఆ థ్రిల్ చాలా వరకు మిస్ అవుతుంది. స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం పకడ్బందీగా, లాజిక్స్‌తో రాసుకుని ఉంటే ఈ మిస్టిక్ థ్రిల్లర్ స్థాయి మరింత పెరిగి ఉండేది.

ఓవరాల్‌గా మహేంద్రగిరి వారాహి.. డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!


Sep 11, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Mahendragiri varahi movie review

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీ...

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ టచ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి డివోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.


‘మహేంద్రగిరి వారాహి’ అంటూ వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ రాసిన కథ, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, డివోషనల్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

Sep 11, 2026 Read Review
6

Above Average

Mahendragiri Varahi movie Review

ఒక కుటుంబంలో అమ్మవారి శాపం, దేవుడి శాపం కథతో `మురారి` సినిమా వచ్చింది. అది పెద్ద హిట్‌. మళ్లీ అలాంటి కథతోనే ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీని రూపొందించారు. శాపం ఉందనేది ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆ రాజవంశానికి చెందిన వాళ్లు ఎలా ఫేస్‌ చేశారు? దాన్నుంచి బయటపడ్డారా? బలయ్యారా? అనేదే కథ. దాన్ని ట్విస్...

ఒక కుటుంబంలో అమ్మవారి శాపం, దేవుడి శాపం కథతో `మురారి` సినిమా వచ్చింది. అది పెద్ద హిట్‌. మళ్లీ అలాంటి కథతోనే ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీని రూపొందించారు. శాపం ఉందనేది ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆ రాజవంశానికి చెందిన వాళ్లు ఎలా ఫేస్‌ చేశారు? దాన్నుంచి బయటపడ్డారా? బలయ్యారా? అనేదే కథ. దాన్ని ట్విస్ట్ లతో నడిపించడం విశేషం. ఇక సినిమా ప్రారంభంలో శాపానికి సంబంధించిన బ్యాక్‌ స్టోరీని వివరిస్తారు. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చాక ఆ ఎమోషన్‌ గానీ, ఆ పెయిన్‌గానీ సినిమాలో క్యారీ కాదు. కథ బాగున్నా, దాన్ని కన్విన్సింగ్‌ గా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. 


సిద్ధార్థ్‌ పాత్రలో సుమంత్‌ ఫర్వాలేదనిపించాడు. ప్రారంభంలో ఆయన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. సెకండాఫ్‌లో బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంది. దాన్ని అంతా సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచన వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. దేవుడికి సంబంధించిన కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా ఆ కోవకి చెందిన మూవీనే. అయితే అందులో ట్విస్ట్ లు, టర్న్ లతో నడిపించిన తీరు బాగుంది. ఇలాంటి డివైన్‌ మూవీస్‌ ఇష్టపడేవారికిది నచ్చే చిత్రమవుతుంది.



Sep 11, 2026 Read Review
One India
One India Website
5

Average

Mahendragiri Varahi movie review

అక్కినేని సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. థ్రిల్లర్ జానర్లో ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి బజ్ ఏర్పడుతోంది. తాజాగా సుమంత్ కథానాయకుడిగా, సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. థియే...

అక్కినేని సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. థ్రిల్లర్ జానర్లో ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి బజ్ ఏర్పడుతోంది. తాజాగా సుమంత్ కథానాయకుడిగా, సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


ఇక సినిమాలో స్టార్టింగ్ లో, అలాగే సిద్దు జొన్నలగడ్డ కామియో పాత్ర ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. యూట్యూబర్‌ గా సుమంత్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను డైరెక్టర్ చాలా ఆసక్తికరంగా మలిచారు. క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉండి ఆకట్టుకుంటాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కొంచెం కత్తెర వేయాల్సిన అవసరం కనిపిస్తుంది.


అయితే స్టోరీలో కొన్ని లాజిక్‌లు లోపించడం మైనస్‌గా మారింది. స్టోరీలో దైవ ప్రభావం చివర్లోనే చూపించడం, మధ్యలో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉండటం సినిమా వేగాన్ని తగ్గిస్తాయి. సాంకేతిక పరంగా చూస్తే వీఎఫ్ఎక్స్ పనితనం, ఏఐ వాడకం నాణ్యంగా లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఫైనల్‌గా.. మొత్తానికి 'మహేంద్రగిరి వారాహి' సినిమా కొన్ని మంచి ఆకట్టుకునే క్షణాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగిన చిత్రం.

Sep 11, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
5

Average

Mahendragiri Varahi movie Review

సినిమా విషయానికి వస్తే.. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం.. లాంటి అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ.సుమంత్ చావుల వెనక రీసెర్చ్ చేసే పాత్రలో బాగానే నటించాడు. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మా...

సినిమా విషయానికి వస్తే.. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం.. లాంటి అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ.


సుమంత్ చావుల వెనక రీసెర్చ్ చేసే పాత్రలో బాగానే నటించాడు. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి.పాత కథే అయినా కొత్త దేవతని తీసుకొని రొటీన్ కథనంతోనే ఊహించని ట్విస్టులతో తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.


మొత్తంగా ‘మహేంద్రగిరి వారాహి’ 200 ఏళ్ళ క్రితం రాజవంశానికి ఇచ్చిన శాపం, దాంతో జరిగే చావులతో సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా. 

Sep 11, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

Mahendragiri varahi movie review

మహేంద్రగిరి వరాహి పేరుతో ఒక ఆసక్తికరమైన మిస్టరీ-డివోషనల్ కథను చెప్పాలనే ప్రయత్నం కనిపించినా, తెరపై ఆ మ్యాజిక్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. మొదటి నుంచే కథలోకి తీసుకెళ్లాల్సిన మిస్టరీని సాగదీస్తూ నెమ్మదిగా నడిపించడంతో ప్రేక్షకుడి సహనం పరీక్షకు గురవుతుంది. కాన్సెప్ట్‌లో ఉన్న ఆసక్తి, స్క్రీన్‌ప్లేలో క...

మహేంద్రగిరి వరాహి పేరుతో ఒక ఆసక్తికరమైన మిస్టరీ-డివోషనల్ కథను చెప్పాలనే ప్రయత్నం కనిపించినా, తెరపై ఆ మ్యాజిక్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. మొదటి నుంచే కథలోకి తీసుకెళ్లాల్సిన మిస్టరీని సాగదీస్తూ నెమ్మదిగా నడిపించడంతో ప్రేక్షకుడి సహనం పరీక్షకు గురవుతుంది. కాన్సెప్ట్‌లో ఉన్న ఆసక్తి, స్క్రీన్‌ప్లేలో కనిపించకపోవడం ప్రధాన సమస్య.


ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం మరింత గందరగోళంగా మారి, కొన్ని సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. పాత్రల ఎమోషన్స్ కూడా బలంగా కనెక్ట్ కావు. VFX, గ్రాఫిక్స్ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భారీగా చూపించాలనుకున్న విజువల్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. నటీనటులు తమ వంతు ప్రయత్నం చేసినా, బలహీనమైన రైటింగ్‌ను పూర్తిగా కాపాడలేకపోయారు. మొత్తంగా మంచి ఐడియాను ఆసక్తికరమైన సినిమాగా మార్చడంలో మహేంద్రగిరి వరాహి తడబడింది. మిస్టరీ కోసం వెళితే నిరాశే ఎక్కువగా మిగులుతుంది.

Sep 11, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Mahendragiri Varahi movie review

మిస్టరీ, మైథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మహేంద్రగిరి వారాహి మొదటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వరల్డ్‌ లోకి తీసుకెళ్తుంది. సుమంత్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఆయన యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు ప్లస్‌ గా నిలుస్తాయి.అయితే ఫస్ట్ హాఫ్‌ లో కథన...

మిస్టరీ, మైథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మహేంద్రగిరి వారాహి మొదటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వరల్డ్‌ లోకి తీసుకెళ్తుంది. సుమంత్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఆయన యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు ప్లస్‌ గా నిలుస్తాయి.

అయితే ఫస్ట్ హాఫ్‌ లో కథనం కొంచెం స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.


కథలో ఉన్న మైథాలజికల్ బ్యాక్‌ డ్రాప్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సినిమా గ్రిప్ పెరుగుతుంది.

మొత్తానికి కొత్త కాన్సెప్ట్ టచ్ ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే ఇంకా షార్ప్‌ గా ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది. సుమంత్ ఫ్యాన్స్, మైథాలజీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓసారి ట్రై చేయొచ్చు.


Sep 15, 2026 Read Review

Public Reviews

5 Avg: 5.2/10
T
Tharuni Small Business Owner
5

Average

Mahendragiri Varahi movie review

To be honest, I did not like Mahendragiri Varahi that much. mainly there were no big surprises in the theater. The movie starts well with a 200-year-old family curse and a god-related mystery. This part creates good interest, and the interval scene is also quite good. But in the second half, the mov...

To be honest, I did not like Mahendragiri Varahi that much. mainly there were no big surprises in the theater. The movie starts well with a 200-year-old family curse and a god-related mystery. This part creates good interest, and the interval scene is also quite good.


But in the second half, the movie goes completely off track and loses its flow. The hero does not even solve all the main problems in the story. Also, the graphics (VFX) look very cheap and poor.


and sumanth did very good job, decent acting. and Cameo roles by Siddhu and Aishwarya Rajesh are nice.


but the ending lacks clarity and the emotional scenes do not connect with us. Overall, it is just an average mystery movie that misses its mark.

Sep 14, 2026
B
Baru Sri Harshitha Students & Youth
6

Above Average

Mahendragiri Varahi movie review

Guys, budget tight ga undi, so direct ga chepthunna... 'Mahendragiri Varahi' naku push ga anthaga nachaledu bro. theater ki vellaka ah visual surprise element completely missing. Starting lo aah curse mystery & Mahendragiri devotional track padagane, "Okay, second half gattiga plan chesaru emo"...

Guys, budget tight ga undi, so direct ga chepthunna... 'Mahendragiri Varahi' naku push ga anthaga nachaledu bro. theater ki vellaka ah visual surprise element completely missing. Starting lo aah curse mystery & Mahendragiri devotional track padagane, "Okay, second half gattiga plan chesaru emo" ani hype ekkindhi. Plus, interval bang super ga padindi!


But bro, second half nunchi cinema track thappi rodded. Hero annitiki solution kani pettaedu anukunte, aayana kooda sagam scene-la ke parimitam aypoyadu. VFX graphics matram chala worst ga unnai. aah screen-labudhi chusthe college project VFX laga anipinchindi. overall money waste.

Sep 16, 2026
T
Talari Snehalatha IT Employee
5

Average

Mahendragiri Varahi movie review

just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity perigi, interval workout aina... second half nunchi story track thappesindi.asalu movie lo Organic fl...

just ippude Mahendragiri Varahi first show chusocchanu. movie Trailer lonae story cheppeyadam valla cinemalo peddhaga suspense ledhu. Curse & devotional elements valla modhatlo koncham curiosity perigi, interval workout aina... second half nunchi story track thappesindi.


asalu movie lo Organic flow miss avvadam, worst VFX visuals, and climax lo clarity lekapovadam cinema ni debbatheesayi. and aishwarya role ento trailer lone reveal chesesariki ika movie lo suprise avvaru.


twists worth ga levu. Emotions sarigga pandaka, idhi oka below average devotional thriller ga migilipoyindi. inka evaraina chudakapothe better to shift ott.

Sep 13, 2026
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

Mahendragiri Varahi movie review

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే...

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయొచ్చు.


మెయిన్ గా సెకండాఫ్ నుంచి కథ పూర్తిగా ట్రాక్ తప్పి ఒక స్పష్టమైన ఆర్గానిక్ ఫ్లో మిస్ అయింది. హీరో కూడా అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, క్లైమాక్స్‌ లో క్లారిటీ కొరవడటం నిరాశపరుస్తుంది. ఐశ్వర్య, సిద్ధూల క్యామియోలు ఒకే. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ కన్నా తక్కువ అనిపించింది నాకు. ఓటిటి లో చూస్తే కొంచెం నచ్చేదేమో. 

Sep 11, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Mahendragiri Varahi movie Review

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf...

కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.


Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, climax లో సరైన క్లారిటీ లేకపోవడం నిరాశపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా VFX క్వాలిటీ worest గా ఉండటం సినిమా స్థాయిని దెబ్బతీసింది.


Twist లు worth అనిపించకపోవడం, emotions ప్రేక్షకుడికి connect కాకపోవడంతో Directer పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. fInal గా నాకైతే అంత నచ్చలేదు.

Sep 12, 2026

About This Movie

Story :

 

మహేంద్రగిరి అనే ఊరిలో వారాహి అమ్మవారు కొలువై ఆ ప్రాంత ప్రజలకు అభయంగా నిలుస్తుంది. అయితే మహేంద్రగిరికి చెందిన రాజవంశాన్ని వాళ్ళు చేసిన ఓ తప్పు వల్ల, వారాహి అమ్మవారి శాపం వెంటాడుతుంటుంది. ఆ శాపం వల్ల ఆ వంశంలో పుట్టిన మగవాళ్లు 33 నిండితే చనిపోతుంటారు. ఆ వంశంలోని రాజేంద్ర వర్మ (సిద్దూ జొన్నలగడ్డ), నరేంద్ర వర్మ (వంశీ చాగంటి) అలాగే చనిపోతారు. ఇదిలా ఉండగా యూట్యూబర్‌ గా వీడియోస్ చేసే సిద్ధార్థ్ (సుమంత్) మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాడు. ఈ క్రమంలో రాజవంశానికి, మహేంద్రగిరి అమ్మవారి యొక్క శాపం గురించి తెలిసి దానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ఆ ఊరికి వస్తాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ తెలుసుకుందేంటి? సిద్ధార్థ్ కి ఆ రాజకుటుంబానికి సంబంధమేంటి? మధ్యలో సిద్దార్థ్ సోదరుడు రాజీవ్‌ కథేంటి? సిద్ధార్థ్ కి సాయం చేసిన వ్యక్తి ఎవరు? రాజకుటుంబాన్ని నిజంగా ఆ శాపం వెంటాడుతుందా? లేక ఇంకేదైనా కుట్ర దాగి ఉందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.

 

Plus Points :

 

ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది సుబ్రహ్మణ్యపురం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిందని అనుకున్నారు. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక డైరక్టర్ సంతోష్ జాగర్లమూడి రాసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. అలాగే ఈ ‘మహేంద్రగిరి వారాహి’ స్థల పురాణం సహా మూవీలో డివోషనల్ టచ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్  ఆకట్టుకుంటాయి. అలాగే అనుప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. అతనికి కం బ్యాక్ లాంటిది అని చెప్పొచ్చు. ఇక సుమంత్ పాత్ర చాలా బాగుంది. ఇలాంటి డీసెంట్ రోల్స్ సుమంత్ కి కొట్టిన పిండి. అలాగే కీ రోల్స్ లో నటించిన ఐశ్వర్య రాజేష్, సిద్ధూ జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి తమ రోల్స్ లో సప్రైజ్ చేయడమే కాకుండా, మూవీకి ప్లస్ అయ్యారు. అలాగే మాళవికా నాయర్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల సహా అందరూ బాగా నటించారు. స్పెషల్ గా బ్రహ్మానందం పాత్ర స్క్రీన్ పై సప్రైజ్ చేస్తుంది. ఇక డైరెక్టర్ మూవీలో ఉన్న సస్పెన్స్ ని, ట్విస్ట్ లని బాగా మెయింటైన్ చేసాడు. ఆ ట్విస్ట్ లని రివీల్ చేసే విధానం కూడా బాగుంది. 

 

Minus Points :

 

అయితే ఇలాంటి డివోషనల్ టచ్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ని రాసుకున్నపుడు, ఆ కథ, కథనాలతో ఆడియన్స్ స్టన్ అయ్యేలా, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సాగాలి. కానీ ఇందులో అదే మిస్ అయింది. కొన్ని ట్విస్ట్ లు, ఎమోషన్స్ వరకు ఒకే. కానీ కథ పరంగా ఎక్ష్పెక్ట్ చేసినట్టే అంతా నడుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక్క ట్విస్ట్ మినహా మిగతా అంతా సినిమా ఊహించినట్టే ఉంటుంది. రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకి ఇది బాగా అర్ధమవుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే మైంటైన్ చేసిన డైరెక్టర్ ఆ తర్వాత సాగదీత సీన్స్ తో బోర్ కొట్టించాడు. ప్రతినాయక పాత్రలు కూడా అంతగా ఇంప్రెస్ చేయవు. సినిమాటిక్ లిబర్టీ ని కూడా మరీ ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక మూవీలో వెన్నెల కిశోర్, బ్రహ్మానందం పాత్రల ట్విస్ట్ లు బాగున్నా, వాటిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా అంటే.. డౌటే అని చెప్పాలి.


Technical Values :

 

టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే... డైరెక్టర్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. క్లైమాక్స్ ని ఇంకా ఆసక్తికరంగా చూపించి ఉంటే బాగుండేది. అయితే పాత్రల క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇక మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. VFX వర్క్స్ , సినిమాటోగ్రఫీ వర్క్ మూవీకి హైలెట్ అయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అలాగే అనూప్ రూబెన్స్ బీజీఎమ్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్లేదు. కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. 

 

Final Review :

 

మొత్తంగా "మహేంద్రగిరి వారాహి" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో డివోషనల్ టచ్ తో సహా, కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. డైరెక్టర్ సంతోష్ జాగర్లమూడి రాసిన స్టోరీతో పాటు, సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ని కొంతవరకు ఆకట్టుకుంటాయి. అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా, సాగదీత సీన్ల వల్ల, అలాగే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ వల్ల మూవీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని మెప్పించకపోవచ్చు. ఫైనల్ గా డివోషనల్ టచ్ ఉన్న ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఓ వర్గం ఆడియన్స్ ని, రెగ్యులర్ మూవీ లవర్స్ ని మహేంద్రగిరి వారాహి కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా  తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.

 

Review Statistics

5.2
Overall Rating
Avg. of all reviews
17
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.3/10
Public
5.2/10
Why MRO?