Register as a Reviewer
మకుటం (Makutam)

మకుటం (Makutam)

22 Aug 2026
Overall Rating
4.9/10
9 Reviews

Makutam : కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా లాస్ట్ ఇయర్ మధగధరాజా తో మంచి సక్సెస్ అందుకోగా, తాజాగా "మకుటం" సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు విశాల్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

Director: Vishal
Cast: Vishal, Anjali, Dushara Vijayan, John Vijay, Jeya prakash, Ajay, Vamsi Krishna, Abu Salim, Arjai, Vj Jhansi, Padam Kumar, Sabhumon

Available in:

Reviews

What critics and the public are saying about మకుటం (Makutam)

Media Reviews

6 Avg: 4.8/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Makutam movie review

మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ్ ఏమో యావరేజ్. సెకండ్ హాఫ్ నరకం అనిపించింది. మకుటం అని చెప్పి పెద్ద టోపీయే పెట్టారండి. అసలు దీనికెంద...

మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ్ ఏమో యావరేజ్. సెకండ్ హాఫ్ నరకం అనిపించింది. మకుటం అని చెప్పి పెద్ద టోపీయే పెట్టారండి. అసలు దీనికెందుకు 3 గంటల సినిమా అనిపించింది. మళ్ళీ సినిమాకి వచ్చిన పది మంది కూడా ఎందుకొచ్చామురా అని ఫీల్ అయ్యారు. 


నాకు తెలిసి విశాల్ కి కూడా ఇది ప్లాప్ అవుతుందని ముందే తెలుసనుకుంటా. అందుకే పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ దెబ్బేసాడు. బీజీఎమ్ బాగుంది. కానీ ఈ సినిమాకి ఆ మ్యూజిక్ వేస్ట్ అయింది. ఇక ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ సీన్, ప్లస్ బీజీఎమ్. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అంతే. మైనస్ పాయింట్ అంటే చాలానే ఉన్నాయి. పనికి మాలిన సీన్లతో చాలా బోరింగ్ కొట్టేసింది. సినిమా అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. రేటింగ్ కూడా ఇవ్వాలంటే 2/5 ఇస్తున్న అంతే. 



Aug 14, 2026 Watch
Filmi Beat
Filmi Beat Website
5

Average

Makutam movie review

మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట్విస్ట్ ఉన్న కథ అయినప్పటికీ.. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం, సెకండాఫ్ కోసమే ఫస్టాఫ్‌ ను మరీ సాగదీశ...

మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట్విస్ట్ ఉన్న కథ అయినప్పటికీ.. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం, సెకండాఫ్ కోసమే ఫస్టాఫ్‌ ను మరీ సాగదీశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా, విశాల్ మూడు, నాలుగు గెటప్స్‌ లో తన క్యారెక్టర్‌ ను కొత్తగా ట్రై చేశాడు. వయసు మళ్లిన క్యారెక్టర్, యంగ్ క్యారెక్టర్‌ లో ఒదిగిపోయాడు.


సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ ఫర్వాలేదనిపిస్తాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ స్టాండర్డ్స్‌ కు ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మాణ విలువలను పాటించారు. భాషా తరహా ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Aug 14, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Makutam Movie review

హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సినిమాల్లో మూస ధోరణి ఎక్కువైంది. మార్క్ ఆంటోనీ, మద గజ రాజా హిట్స్ అయినా రొటీన్ కమర్షియల్ కథలతో తీసిన స...

హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సినిమాల్లో మూస ధోరణి ఎక్కువైంది. మార్క్ ఆంటోనీ, మద గజ రాజా హిట్స్ అయినా రొటీన్ కమర్షియల్ కథలతో తీసిన సినిమాలే అవి. ఈ తరుణంలో విశాల్ మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారడంతో ఎటువంటి సినిమా తీస్తారోనని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం చూశారు.


మకుటం చూస్తే… హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ విశాల్ 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళారని అనిపించింది. అసలు ఎటువంటి కొత్తదనం లేకుండా వచ్చిన సినిమా 'మకుటం'. హీరోగా, దర్శకుడిగా విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఏ విధంగానూ హెల్ప్ అవ్వదు. స్కిప్ చేయడం బెటర్. ఇటువంటి కథలు, సన్నివేశాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు పదుల సంఖ్యలో చూశారు. దర్శకుడిగా విశాల్ నుంచి ఇంత రొటీన్ ఫిల్మ్ వస్తుందనుకోలేదు. బాగా డిజప్పాయింట్ చేశారు.

Aug 14, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Makutam movie Review

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సినిమా విషయానికి వస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. బలహీనమైన కథ, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొ...

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సినిమా విషయానికి వస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. బలహీనమైన కథ, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. సినిమాలో విశాల్ యాక్టింగ్ మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. 


మహా అయితే క్లైమాక్స్ లో ఆడవాళ్లతో తీసిన ఫైట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అంతకుమించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పేవలమైన కథతో విశాల్ దర్శకుడిగా పరిచయం కావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. రొటీన్ ఫార్ములాతో వెళుతున్నపుడు ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. పాత్రల్లో వైవిధ్యం చూపించాలి. ఆ జాగ్రత్తలేవీ తీసుకోలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. సో… దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇక సింపుల్ గా ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్తదనం లేని మకుటం. 

Aug 14, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
4

Below Average

Makutam movie review

విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన నేరేషన్ లేకపోవడం...

విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన నేరేషన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అవి కథకు పూర్తిగా బలం చేకూర్చలేకపోయాయి. 


విశాల్ తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే బలమైన కథ, ఆకట్టుకునే కథనం లేకపోవడంతో సినిమా స్థాయి ఆశించినంతగా కనిపించలేదు. ఓవరాల్‌గా ‘మకుటం’ సాధారణ కథ, బోరింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. విశాల్ అభిమానులు ఆయన పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి ప్రయత్నించవచ్చు. ఒక్కముక్కలో సినిమా గురించి చెప్పాలంటే ఇదొక పాత చింతకాయ పచ్చడి కథ. 

Aug 14, 2026 Read Review
123telugu
123telugu Website
4

Below Average

Makutam movie review

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మా...

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. 


ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల అవి సరిగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఇంట్రెస్టింగ్ నేరేషన్ లేకపోవడం వల్ల సినిమా అంతగా ఆకట్టుకోలేదు. విశాల్ పెర్ఫార్మన్స్ కోసమైతే ఒకసారి ట్రై చేయొచ్చు.  


Aug 14, 2026 Read Review

Public Reviews

3 Avg: 5.0/10
T
Talari Snehalatha IT Employee
6

Above Average

Makutam movie review

ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియ...

ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి బైటికెళ్లిపోదామా అనిపించింది. అయినా సినిమాలో ఎదో ఒక్క మంచి సీన్ అయినా బాగుంటుందేమో అని క్లైమాక్స్ దాకా కూర్చున్నా. అదే నా తప్పయింది. ఇక సినిమా స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు. ఎదో పాత చింతకాయ పచ్చడి ఇది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఆడియన్స్ నా కామెంట్ చూసినా సినిమాకి వెళ్తే వాళ్ళ ఖర్మ. 

Aug 18, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
4

Below Average

Makutam movie review

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి. ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధ...

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి.


ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అనిపించింది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కోరుకునే ఆడియన్స్‌కు మాత్రం ‘మకుటం’ నిరాశ కలిగించే అవకాశం ఉంది.

Aug 17, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Makutam movie review

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half was average, but the second half felt like torture. They really took us for a ride with this one; I...

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half was average, but the second half felt like torture. They really took us for a ride with this one; I couldn't understand why it needed to be a three-hour movie. Even the handful of people in the theater were left wondering why they had bothered to show up.


I suspect even Vishal knew beforehand that this would be a flop. GV Prakash Kumar’s music was a letdown—not because the BGM wasn't good, but because it was wasted on a film like this. The only saving graces were the interval scene and the background score; aside from that, and perhaps the climax, the second half was tedious and filled with pointless scenes. The movie simply didn't work. If I had to rate it, I’d give it a 2/5.

Aug 18, 2026

About This Movie

Story : 

ఇక స్టోరీ విషయానికి వస్తే... మెడికల్ రిప్రజెంటివ్‌ గా పనిచేసే కృప (విశాల్) తను ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య జమున (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తన పరిస్థితి  ఎలా ఉన్నా, కార్ కొనాలన్నా డ్రీం పూర్తి చేసుకుని, సెకండ్ హ్యాండ్ కార్ కొని ఫ్యామిలీ తో వెకేషన్‌ కు వెళ్తాడు. అయితే అనుకోకుండా అక్కడ ఓ లోకల్ మాఫియా వాళ్ళు కారుపై కాల్పులు జరుపడంతో జమున, కూతురు చనిపోతారు. ఈ క్రమంలో కృప కారుపై జరిగిన దాడి గురించి తెలిసి తండ్రి లింగ (విశాల్) కోపంతో ఊగిపోతాడు. కానీ తన తండ్రి కారణంగానే భార్య, కూతురును కోల్పోయానని కృప తండ్రిని అపార్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలో కృపాకరం ఫ్యామిలీ పై ఎవరు అటాక్ చేసారు... వారిపై కృప పగదీర్చుకున్నాడా? అసలు లింగకు, కృప మధ్య వైరం ఎందుకొస్తుంది? చివరికి వీళ్ళు కలిసారా లేదా అనేది మిగిలిన కథ.

 

PlusPoints :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విశాల్. మొదట్నుంచి చివరి వరకు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా  సెకండ్ హాఫ్ లో కీ సీన్స్ లో విశాల్ ఎమోషనల్ సీన్స్ లో తన నటనానుభవం మొత్తం చూపించాడు. డిఫరెంట్ రోల్స్ లో, డిఫరెంట్ వేరియేషన్స్ తో  మెస్మరైజ్ చేశాడు. ఇక దుషారా విజయన్ కి తక్కువ స్క్రీన్ టైం ఉన్నా, తన రోల్ లో బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే అంజలి తన పాత్రలో జీవించింది. చాలా బరువైన పాత్ర లభించిందని చెప్పాలి. ఇక మిగతా కీ రోల్స్ లో నటించిన వారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

 

Minus Points :

అయితే మకుటం సినిమా దాదాపు రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కింది. చాలా సీన్స్ ఎక్కడో చూసినట్టే ఉంటాయి. పైగా సినిమాలో మూస ధోరణి ఎక్కువైంది. ఇక దర్శకుడు విశాల్ సినిమాకి సరైన కథా, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. కథ వరకు ఓకే అనుకున్నా, దానికి సరైన ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయినా రాసుకోవాల్సింది. చాలా సీన్స్ ఊహాజనితంగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక్క క్లైమాక్స్ మినహా ఏది ఆకట్టుకోలేదు. చాలా సీన్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే పది సినిమాల కథలు కలిపి ఈ సినిమా అల్లినట్టు ఉంటుంది. 

 

Technical Values :

ఇక మకుటం సినిమాకు సంబంధించి దర్శకుడిగా విశాల్ తగిన న్యాయం చేయలేదు కానీ, సినిమాటోగ్రాఫర్‌ రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. స్టోరీ అంతగా లేకపోయినా, సినిమాకి తగ్గట్టు కీ సీన్స్ ని తెరకెక్కించారు. ఎడిటింగ్ వర్క్ కూడా బాగాలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ ఈసారి దెబ్బేసాడు. పాటలు వినసొంపుగా లేవు, బీజీఎమ్ పర్వాలేదు. అయితే మకుటం సినిమాకి దర్శకుడిగా విశాల్ న్యాయం చేయలేదు కానీ, నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ తో కలిపి, ఈ సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. 

 

Final Review : 

ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల అవి సరిగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఇంట్రెస్టింగ్ నేరేషన్ లేకపోవడం వల్ల సినిమా అంతగా ఆకట్టుకోలేదు. విశాల్ పెర్ఫార్మన్స్ కోసమైతే ఒకసారి ట్రై చేయొచ్చు.

 

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
9
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
4.8/10
Public
5.0/10
Why MRO?