Register as a Reviewer
నాగబంధం (NagaBandham)

నాగబంధం (NagaBandham)

03 Jul 2026
Overall Rating
5.4/10
29 Reviews

Naga Bandham Movie : విజువల్ వండర్ గా నాగబంధం... ఇక బలమైన కథ,కథనాలు తోడవ్వాలి అంతే!

Director: Abhishek Nama
Cast: Virat Karrna, Nabha Natesh, Aishwarya Menon, Daksha Nagarkar, Mahesh Manjrekar, Jagapathi Babu, Murali Sharma

Available in:

Reviews

What critics and the public are saying about నాగబంధం (NagaBandham)

Media Reviews

20 Avg: 5.5/10
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
6

Above Average

Nagabandham movie Review

నాగ బంధం మూవీ రివ్యూ... ఎం చెప్తామండి why నాగబంధం అన్నట్టుంది. ఇలాంటి సినిమాలతో చాలా కష్టం. అదే దోస ఎన్ని సార్లు. ఇక ఈ సినిమాలో హీరో కర్ణ యాక్టింగ్ జీరో అని చెప్పాలి. అనాలని కాదు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేదని అనిపించింది. నభా నటేష్ కూడా అంతే. అండ్ సినిమాకి డబ్బులు బానే ఖర్చు పెట్టినట్టు...

నాగ బంధం మూవీ రివ్యూ... ఎం చెప్తామండి why నాగబంధం అన్నట్టుంది. ఇలాంటి సినిమాలతో చాలా కష్టం. అదే దోస ఎన్ని సార్లు. ఇక ఈ సినిమాలో హీరో కర్ణ యాక్టింగ్ జీరో అని చెప్పాలి. అనాలని కాదు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేదని అనిపించింది. నభా నటేష్ కూడా అంతే. 

అండ్ సినిమాకి డబ్బులు బానే ఖర్చు పెట్టినట్టు తెలిసిపోతుంది. అదొక్కటే... ఈ సినిమాకి ప్లస్ అయింది. అంటే రిచ్ విజువల్స్ తప్ప ఎం లేదు. 


ఇక అసలు నాగబంధం ఏంటి అంటే సినిమా మొత్తం చూసినా అసలు చెప్పరు. ఫైనల్ గా సెకండ్ పార్ట్ అని ట్విస్ట్ ఇచ్చారు. అండ్ 3 గంటల సినిమాలో కథ ఎక్కడా పొంతన లేకుండా ఉంటుంది. కొన్ని సీన్లయితే మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తారు.. అండ్ ఇందులో కొన్ని CGలు, VFX లు ఉంటాయి.. వరెస్ట్ అనిపిస్తది. మరీ ఓవర్ గా ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే బోయపాటి సినిమాల కంటే అన్యాయంగా ఉంటాయి ఈ సినిమాలో. ఓవరాల్ గా విజువల్స్ కోసం ఓసారి ట్రై చేస్తే చేయండి.. లేదు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బుర్ర పాడే. 

Jul 04, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
6

Above Average

Nagabandham movie Review

నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుం...

నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా రిఫరెన్స్ సీన్స్ చాలా ఉంటాయి. 


వరెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఒక పెద్ద ఆక్షన్ సీక్వెన్ జరుగుతుంటే సడన్ గా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సీన్ నడుస్తూ ఉంటది. అది అస్సలు కనెక్ట్ కాలేదు. మే బీ కనెక్ట్ అయ్యుంటే సినిమా నచ్చి ఉండేదేమో. క్యాస్టింగ్ కూడా బాలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఆక్షన్ సీన్స్ బాగున్నా, సందర్భం లేకుండా ఉన్నాయనిపిస్తోంది. అండ్ లెంగ్త్ కూడా చాల ఎక్కువైపోయింది. సగం నుండే థియేటర్ లోంచి లేచిపోదాం అనుకున్నా... కానీ ఎదో ఓపిక పట్టి ఉన్నందుకు... పార్ట్ 2 అని చెప్పి కొంప ముంచాడు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుందనిపించినా ఫైనల్ గా ఎం లేదనిపిస్తుంది. నిద్రొచ్చేస్తుంది. కానీ ఓవర్ లౌడ్ మ్యూజిక్ వల్ల థియేటర్లో నిద్ర కూడా పోలేం. 

Jul 03, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

NagaBandham movie Review

సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్...

సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే. 


ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు. 

Jul 03, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

NagaBandham movie Review

ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అ...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు. 


ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు. 

Jul 03, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Naga Bandham movie Review

ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వె...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా. 


కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది. 

Jul 03, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Nagabandham movie Review

నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే.....

నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు. 


ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.

Jul 03, 2026 Watch
Venky Reviews
Venky Reviews Twitter Channel
4

Below Average

Nagabandham movie Review

#Nagabandham An Outright Tedious Watch!A film that starts with intrigue but progressively gets worse. The second half is even weaker, with outdated writing and scene staging that borders on parody. What should have been an engaging storyline turns into a tedious watch that’s hard to sit through and...

#Nagabandham An Outright Tedious Watch!


A film that starts with intrigue but progressively gets worse. The second half is even weaker, with outdated writing and scene staging that borders on parody. What should have been an engaging storyline turns into a tedious watch that’s hard to sit through and unbearable in many places.


Apart from the artwork, set design, and bits of the music, there’s very little to appreciate. There’s clearly effort behind the film, but when it fails to get the basics right, it leads to lifeless narration and a disappointing overall experience.


Outright Bad.


Rating: 1.75/5

Jul 03, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

NagaBandham Movie Review

పేరుకు అప్ కమింగ్ యాక్టర్స్ తో తెరకేక్కినా కూడా బడ్జెట్ పరంగా మీడియం టు హై బడ్జెట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ బంధం(Naga Bandham Movie) మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. కాన్సెప్ట్ పరంగా అనేక లేయర్స్ తో తెరకెక్కిన కథ నాగ బం...

పేరుకు అప్ కమింగ్ యాక్టర్స్ తో తెరకేక్కినా కూడా బడ్జెట్ పరంగా మీడియం టు హై బడ్జెట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ బంధం(Naga Bandham Movie) మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. కాన్సెప్ట్ పరంగా అనేక లేయర్స్ తో తెరకెక్కిన కథ నాగ బంధం….సినిమా మొదలు అవ్వడం ఆసక్తిగానే స్టార్ట్ అయ్యి తర్వాత ట్రెజర్ హంట్ గా మారి అక్కడ నుండి అడ్వెంచర్ మోడ్ లోకి వెళ్లి తర్వాత హిస్టారికల్ గా మారి అక్కడ నుండి సనాతన ధర్మం కోసం సాదువులు ఏం చేశారు.? అక్కడ నుండి తిరిగి ప్రజెంట్ టైంకి వచ్చి క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. 


ఇక చాలా స్ట్రెంగ్త్ ఉన్న కథ ని చాలా బేసిక్ స్క్రీన్ ప్లే తో చెప్పడంతో సినిమా చాల స్లోగా సాగిపోయినట్లు అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రతీ చోట బడ్జెట్ బాగానే కనిపించింది. ఇక డైరెక్టర్ మంచి కథనే తీసుకున్నా కూడా చెప్పే క్రమంలో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో స్క్రీన్ ప్లే విషయంలో అంచనాలను అందుకోలేదు. కానీ కొన్ని సీన్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఓవరాల్ సినిమాలో కొన్ని ప్లస్ లు మైనస్ లు ఉండగా ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే నిరాశ కలుగుతుంది..తక్కువ ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం ఓపిక తెచ్చుకుని చూస్తె ఒకసారి సినిమా చూడొచ్చు అనిపించవచ్చు. 

Jul 03, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

NagaBandham Movie Review

విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండ...

విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. స్టార్ క్యాస్ట్ ఎవరూ లేకపోయినా భారీ బడ్జెట్, భారీ సెట్స్ వేసి, అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో డివోషనల్ థ్రిల్లర్ అని బాగా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.


కథ డివోషనల్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసారు కానీ అది ఫోకస్ గా నడిపించలేదు. హిందూ మతం, సనాతన ధర్మం గురించి ఓ రెండు మూడు సార్లు డైలాగ్స్ తో చెప్పించారు. సనాతన ధర్మం కథలో చూపించకుండా డైలాగ్స్ తో చెప్పడం విశేషం. ఇక నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్, అనంత పద్మనాభ స్వామి అని ప్రమోట్ చేయడంతో ఇదేదో ట్రెజర్ హంట్ అని ఓ రేంజ్ లో ఊహించుకొని వెళ్తాము. కానీ కథలో అంత స్కోప్ ఉన్నా అసలు కథ వదిలేసి అక్కర్లేని ట్రాక్స్, డైలాగ్స్ తో నడిపించారు. ఇక సినిమా అంతా నాగబంధం వెనక ఏముంటుంది అని నడిపించి అసలు అదేంటో ఎక్కడా చెప్పకుండానే సినిమా ముగించడం గమనార్హం. అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఎదురు చూడాల్సిందేనట. మొత్తంగా ‘నాగబంధం’ సినిమా బ్రహ్మ కమలం కోసం విలన్ చేసే ప్రయత్నం, దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అని సనాతన ధర్మం మెసేజ్ తో సాగుతుంది.

Jul 03, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Naga Bandham movie Review

నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే... నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం వంటి అంశాలతో మొదలయ్యే కథ ఫస్ట్ హాఫ్‌లో మంచి మిస్టరీ, అడ్వెంచర్ ఫీల్‌ను అందిస్తుంది. హీరో రుద్ర ప్రయాణం, విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి...

నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే... నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం వంటి అంశాలతో మొదలయ్యే కథ ఫస్ట్ హాఫ్‌లో మంచి మిస్టరీ, అడ్వెంచర్ ఫీల్‌ను అందిస్తుంది. హీరో రుద్ర ప్రయాణం, విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ భాగానికి బలంగా నిలుస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, పాట కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఆసక్తిని కొనసాగించడంలో సక్సెస్ అవుతుంది.


సెకండాఫ్‌లో మాత్రం సినిమా పూర్తిగా మరో దారిలో ప్రయాణిస్తుంది. హీరో తన గతం, నాగబంధం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే క్రమంలో కథ హిందూ పురాణాలు, సనాతన ధర్మం, ప్రాచీన రహస్యాల వైపు మళ్లుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించగా, ఎమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేవు. సినిమా అంతా నాగబంధం రహస్యాన్ని ఛేదించే ప్రయాణంగా చూపించినప్పటికీ, క్లైమాక్స్‌లో అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కథను నేరుగా పార్ట్-2 కోసం వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. దీంతో సినిమా పూర్తి అనుభూతిని ఇవ్వలేకపోతుంది. చివరగా మంచి కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, ఆసక్తికరమైన సెటప్ ఉన్నప్పటికీ, కథనం తడబడటం, నిడివి ఎక్కువ కావడం, క్లైమాక్స్‌ను పూర్తిగా సీక్వెల్‌పై ఆధారపడేలా ముగించడం వల్ల 'నాగబంధం' పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. 

Jul 03, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

NagaBandham movie Review

మరణాన్ని జయించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నాగబంధం' ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, అడ్వెంచర్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ అనూహ్యంగా మారడంతో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్‌లో అసలు కథను పార్ట్-2 కోసం దాచేయడం నిరాశపరుస్తుంది. నిడివి కూడా సినిమాకు పెద్ద మైనస్. మొత్తంగా, భారీ ఆలోచనతో వచ్చిన 'నా...

మరణాన్ని జయించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నాగబంధం' ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, అడ్వెంచర్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ అనూహ్యంగా మారడంతో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్‌లో అసలు కథను పార్ట్-2 కోసం దాచేయడం నిరాశపరుస్తుంది. నిడివి కూడా సినిమాకు పెద్ద మైనస్. మొత్తంగా, భారీ ఆలోచనతో వచ్చిన 'నాగబంధం' కథ కంటే సెటప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సినిమాగా అనిపిస్తుంది.


సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో హింసాత్మకమైన సీన్లు, యాక్షన్ సీక్వెన్స్, భారీ హిందుత్వ డైలాగులు, అన్నిటికి మించి సాలిడ్ విజువల్స్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు గాని, అంతకంటే వాల్యుబుల్ అయిన కథ, కథనాలపై దృష్టి పెట్టలేదు. ప్రేక్షకుడ్ని సీట్లో కూర్చోబెట్టేవి ఇవే. కానీ మేకర్స్ అవే గాలికొదిలేశారు. 

Jul 03, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Nagabandham movie Review

పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్...

పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు అభిషేక్ నామా. 


అయితే ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సనాతన ధర్మం అనే అంశాలను వాడుకుంటూ వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అదే ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చిన సినిమా నాగబంధం. ఇందులో కూడా మొదటి నుంచి హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాలు, వాటి సంరక్షణ చుట్టూనే కథ అల్లుకున్నారు. కథలో సహజంగా దైవభక్తి ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. నాగబంధంలో కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయితే.. మరికొన్ని మాత్రం అతికించినట్లు అనిపిస్తాయి. విరాట్ కర్ణ పర్లేదనిపించాడు. దర్శకుడు అభిషేక్ నామా కూడా తన వంతు బాధ్యత బాగానే పూర్తి చేసారు. కథపై ఇంకాస్త లోతుగా వెళ్లుంటే బాగుండేది. చివర్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చారు. ఓవరాల్‌ గా నాగబంధం.. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే పోరాటం..!

Jul 03, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Nagabandham movie Review

హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇస్లాం చక్రవర్తులు దోచుకు వెళ్ళినట్టు చరిత్ర పుస్తకాల్లో చదివాం. అయితే ముస్లిం రాజుల అరాచకాలను తట్టుకుని మరీ అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాల్లో నేలమాళిగలో బంగారు ఖజానాలు భద్రంగా ఉన్నట్టు వార్తల్లో చదివాం. అటువంటి నేపథ్యంలో నాగబంధం మహిమ, నాగ సాధువుల వీరోచిత పోరాటాన్ని చూపిం...

హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇస్లాం చక్రవర్తులు దోచుకు వెళ్ళినట్టు చరిత్ర పుస్తకాల్లో చదివాం. అయితే ముస్లిం రాజుల అరాచకాలను తట్టుకుని మరీ అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాల్లో నేలమాళిగలో బంగారు ఖజానాలు భద్రంగా ఉన్నట్టు వార్తల్లో చదివాం. అటువంటి నేపథ్యంలో నాగబంధం మహిమ, నాగ సాధువుల వీరోచిత పోరాటాన్ని చూపించిన సినిమా 'నాగబంధం'. అయితే దర్శకుడు అభిషేక్ నామా సరైన కథా, కథనాలు ఎంచుకోవడంలో విఫలమయ్యాడు. 


ఇక సినిమా ప్రారంభం ఆసక్తి రేకెత్తిస్తుంది. హిమాలయాలు, రంగనాథ ఆలయం, బ్రహ్మ కమలం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా వెళుతుంది. ఎప్పుడైతే రుద్ర కుటుంబ కలహాలు కథలో ఫ్రంట్ సీట్ తీసుకున్నాయో... అప్పట్నుంచి అసలు కథ పక్కదారి పట్టింది. ఆసక్తి మాత్రం కించిత్ ఉండదు. 'నాగబంధం' సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ డిజైన్. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ లుక్ కనిపించడం వెనుక ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కోరాలాత్ పడిన కష్టం, ఆయన కృషి కనిపిస్తాయి. అభిషేక్ నామా కథలో విషయం ఉంది. మంచి సినిమా తీయాలనే ఆలోచన కనిపిస్తుంది. కానీ, ఆ కథ తెరపైకి వచ్చే క్రమంలో చాలా తప్పులు జరిగాయి. సన్నివేశాల నుంచి వీఎఫ్ఎక్స్ వరకు అడుగడుగునా కొన్ని లోపాలు కనిపిస్తాయి. ప్రేక్షకులలో ఆసక్తి పెంచేలా సినిమా ముందు సాగలేదు. డిజప్పాయింట్ చేసిందీ 'నాగబంధం'.


Jul 03, 2026 Read Review
5

Average

Naga Bandham Movie Review

విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమ...

విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్తి ఉన్న బ్రహ్మకమలం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. 


అయితే ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని,సెంటిమెంట్‌ ని క్యాష్‌ చేసుకోవాలని మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. బోల్తా పడుతున్నారు. అదే తేడా కొడుతుంది. సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌గా మారుతున్నాయి. ఇప్పుడు వచ్చిన `నాగబంధం` పరిస్థితి కూడా ఇదే అని చెప్పొచ్చు. నాగబంధం ఇడిపించడం అనే పాయింట్‌ మీద ఈ మూవీ కథ సాగుతుంది. ఓవరాల్ గా దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న కథలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. స్క్రీన్‌ ప్లే పరంగానూ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సీన్‌ కి, మరో సీన్‌ కి సంబంధం లేదు, సింక్‌ అయ్యేలా లేవు. విజువల్స్ పరంగా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. బడ్జెట్‌ పరంగా రాజీ లేదు. కానీ మిగిలిన విషయంలో విఫలమయ్యారు. విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కథగా, సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమా. ఒక రకంగా ఇది ఆడియెన్స్ పై నాగబంధం ప్రయోగమని చెప్పొచ్చు.  


Jul 03, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

NagaBandham movie Review

Producer Abhishek Nama has turned into a full-fledged Director with a VFX intense movie, Nagabandham. The movie starring Pedha Kapu fame Virat Karna has attracted eyeballs for its Devotional Backdrop, Sprawling Anantha Padmanabha Swamy Set, and the quality.Positives:Anantha Padmanabha Swamy SetLarge...

Producer Abhishek Nama has turned into a full-fledged Director with a VFX intense movie, Nagabandham. The movie starring Pedha Kapu fame Virat Karna has attracted eyeballs for its Devotional Backdrop, Sprawling Anantha Padmanabha Swamy Set, and the quality.


Positives:

Anantha Padmanabha Swamy Set

Largely Good VFX Portions


Negatives:

Unnecessary Family Drama

Poor Writing

Confusing Screenplay

Repeat Sequences in Second Half


Finally, Nagabandham is an ambitious outing which should be commended for its technical output as the makers spent more on the making than remunerations. But then, a similar ambition is not felt in the writing department making it a disappointing fare.


Bottomline : Big Ambition, Disappointing Output

Jul 03, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

NagaBandham movie Review

స్టార్ క్యాస్ట్ లేదు.. స్టార్ డైరెక్టర్ కాదు... అయినా సరే గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సినిమా నాగబంధం. తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే అద్భుత శక్తులు కలిసిన బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ ఇది. 'నాగబంధం' మ...

స్టార్ క్యాస్ట్ లేదు.. స్టార్ డైరెక్టర్ కాదు... అయినా సరే గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సినిమా నాగబంధం. తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే అద్భుత శక్తులు కలిసిన బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ ఇది. 'నాగబంధం' మంచి కాన్సెప్ట్‌ తో మొదలై, ఫస్ట్ హాఫ్‌లో అడ్వెంచర్, యాక్షన్, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. 


కానీ ఇంటర్వెల్ తర్వాత కథ ఒక్కసారిగా మరో ట్రాక్‌లోకి వెళ్లడంతో కనెక్టివిటీ తగ్గుతుంది. క్లైమాక్స్‌లో ప్రధాన మిస్టరీని పార్ట్-2 కోసం వదిలేయడం నిరాశ కలిగిస్తుంది. మూడు గంటల నిడివి కూడా సినిమాకు మైనస్. మొత్తంగా, మంచి విజువల్స్, ఆసక్తికరమైన సెటప్ ఉన్నా... స్క్రీన్‌ప్లే, లెంగ్త్ కారణంగా 'నాగబంధం' పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. vfx సీన్స్ విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఫైనల్ గా నాగబంధం... విజువల్ గ్రాండియర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్. 

Jul 03, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Naga Bandham movie Review

మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ నాగబంధం సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం...

మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ నాగబంధం సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం, ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్టులతో బాగానే ఎంగేజ్ చేస్తుంది.


అయితే ప్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమాకు ఆ టైమ్‌లో వచ్చే రొమాంటిక్‌ పాట, ఒకటి రెండు సీన్స్ స్పీడు బ్రేకులు వేస్తాయి. 

ఇక సెకండాఫ్ లో హీరో వాస్తవాలు తెలుసుకోవడం మొదలు పెట్టాక మరో కథ చూస్తున్నామా అనే ఫీల్ వస్తుంది. ఫస్టాప్ ఒకలా నడిచి సడన్‌గా హిందూ మతం, సనాతన ధర్మం.. నరకడాలు, చంపడాలతో కొత్త టర్న్ తీసుకోవడంలో ఆడియెన్స్ కు కనెక్ట్ కాదు. పైగా సినిమా ముగింపులో తొలి షాట్ నుంచి ఆఖరి వరకు నాగబంధం తెరవాలంటూ స్టోరీ నడిపి, చివరికి దాని వెనక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది. చివరిగా మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెండున్నర గంటలకు కుదించి రిపీటెడ్ సీన్స్ లేకుండా చేసి ఉంటే అందరినీ ఆకట్టుకునేది. పట్టుతప్పిన ‘నాగబంధం’.

Jul 03, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Naga Bandham Movie Review

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరా...

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...

ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.


ఒక దశ తర్వాత విజువల్స్.. భారీతనం కూడా ఎంగేజ్ చెయ్యలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు.. సనాతన ధర్మం.. హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా.. ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిలిం కావడానికి తగ్గ కథ.. సాంకేతిక హంగులు.. భారీతనం 'నాగబంధం'కు కుదిరినా.. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి ఇవ్వలేక పోయింది. రచయిత.. దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెసెంట్ చెయ్యడంలో.. రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. కథ కూడా ఓకే కానీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కేవలం విజువల్స్.. ఎఫెక్ట్స్.. భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్కేయొచ్చు.


చివరగా: నాగబంధం.. విజువల్స్ అద్భుతం.. విషయం పరిమితం. 



Jul 03, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

NagaBandham Movie Review

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్ట...

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. 


అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్‌ గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథలో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్సందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.

Jul 03, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

NagaBandham Movie Review

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది...

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది. 


విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.


Jul 03, 2026 Read Review

Public Reviews

9 Avg: 5.4/10
K
KOLUGURU SURESH Students & Youth
6

Above Average

Nagabandham Review

Nagabandham movie gurinchi em cheppali bayya vallu cheskunna protions hype mathram mamuluga ledhu kani aa range cinema assalu ledhu kani okate oppukovali cinema lo aa visual and vfx goosebumps theppisthayi ani cheppochu. kani cinema lo antha eemi ledhu bayya routine story inka screenplay sarigga lek...

Nagabandham movie gurinchi em cheppali bayya vallu cheskunna protions hype mathram mamuluga ledhu kani aa range cinema assalu ledhu kani okate oppukovali cinema lo aa visual and vfx goosebumps theppisthayi ani cheppochu. kani cinema lo antha eemi ledhu bayya routine story inka screenplay sarigga lekapovadam valla cinema hit ayye chances thakkuva.Technical ga team bagunna kani audience ni dissapoint chesindhi ani cheppochu.

Jul 06, 2026 Watch
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
6

Above Average

Nagabandham movie review

రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అంత మ్యాటర్ లేదు సినిమాలో.. ఎదో కొంత VFX ఎఫెక్ట్స్ తప్ప makers దేనిమీదా focus చేయలేదనిపిస్తుంది. ...

రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అంత మ్యాటర్ లేదు సినిమాలో.. ఎదో కొంత VFX ఎఫెక్ట్స్ తప్ప makers దేనిమీదా focus చేయలేదనిపిస్తుంది. 


అండ్ ఏదైనా సినిమాకు కొంచెం relaxation కోసం పోతారు. నేను మాత్రం కావాలని, రెండొందలు బొక్కపెట్టుకుని నిద్రపోడానికి సినిమాకెళ్ళాను...


ఇంతకుమించి నేనేమీ చెప్పలేను.


ఫైనల్ గా ఇది నాగబంధం కాదు.. నస బంధం...

Jul 06, 2026
T
Talari Snehalatha IT Employee
4

Below Average

Nagabandham Movie Review

just now finished nagabandham movie. coming to the movie review... movie was below avrage... hero and heroines not need to learn acting more. and abhishek namas concept idea was actually good.. but the diection was very bad. i am not satisfied. only visuals are good.my suggestion... b...

just now finished nagabandham movie. 


coming to the movie review... movie was below avrage... 

hero and heroines not need to learn acting more. 

and abhishek namas concept idea was actually good.. but the diection was very bad. i am not satisfied. only visuals are good.


my suggestion... better to shift another movie in this weekend.

Jul 05, 2026
T
Tharuni Valluru Small Business Owner
5

Average

Nagabandham movie Review

I watched Nagabandham with decent expectations, and overall it was a satisfying experience. The story kept me interested from the beginning, especially the mystery and emotional moments. The visuals were impressive, and the background music added intensity to many scenes. The performances felt genui...

I watched Nagabandham with decent expectations, and overall it was a satisfying experience. The story kept me interested from the beginning, especially the mystery and emotional moments. The visuals were impressive, and the background music added intensity to many scenes. The performances felt genuine, though a few parts in the second half could have been tighter.


The climax was engaging and wrapped up the story well. It may not be a perfect film, but it delivers good entertainment with a mix of suspense, emotion, and action. I enjoyed watching it and would recommend it for a one-time theatrical experience.


Jul 06, 2026
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

NagaBandham movie Review

Just now finished Nagabandham, and it was just an average movie for me. The story had a good idea, but the screenplay was worest. Some scenes were interesting, while others were predictable and could have been better. visuals are very nice, but the emotional scenes didn't connect much. The backgroun...

Just now finished Nagabandham, and it was just an average movie for me. The story had a good idea, but the screenplay was worest. Some scenes were interesting, while others were predictable and could have been better. visuals are very nice, but the emotional scenes didn't connect much. The background music was okay. climax not impressive. 

Jul 06, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Nagabandham movie Review

నాగబంధం మూవీ రివ్యూ... అంజి 1080p - నాగబంధం 144p ఇంతకంటే సింపుల్ గా రివ్యూ ఎవ్వరూ చెప్పలేరు. అంజి లాంటి కథనే తిప్పి తిప్పి మూడు గంటలు కథను ఏవేవో సంబంధం లేని సీన్లతో అల్లేసాడు డైరెక్టర్.. హీరో బ్రహ్మకమలం తీసుకొద్దామని వెళ్తాడు. విలన్ అది తెస్తే అమరుడై లోకాల్ని శాసించే రేంజ్ కి ఎదుగుతాడని వా...

నాగబంధం మూవీ రివ్యూ... 


అంజి 1080p - నాగబంధం 144p 


ఇంతకంటే సింపుల్ గా రివ్యూ ఎవ్వరూ చెప్పలేరు. అంజి లాంటి కథనే తిప్పి తిప్పి మూడు గంటలు కథను ఏవేవో సంబంధం లేని సీన్లతో అల్లేసాడు డైరెక్టర్.. హీరో బ్రహ్మకమలం తీసుకొద్దామని వెళ్తాడు. విలన్ అది తెస్తే అమరుడై లోకాల్ని శాసించే రేంజ్ కి ఎదుగుతాడని వాళ్ళ నమ్మకం అంతే...


దీనికన్నా సీరియల్ బెటర్ అనిపిస్తది. మళ్ళా ఆ ఓవర్ బిజీఎమ్ సౌండ్ వల్ల నిద్ర కూడా పోలేదు. అన్ని ఎక్కడో అక్కడ చూసిన సీన్ల లాగే ఉంటది ఈ నాగబంధం. ఫైనల్ గా చెప్దామంటే.. ఒక మంచి పాయింట్ కూడా కథ గురించి తెలుస్తలేదు. ఎదో ఆ grand visuals తప్ప సినిమాలో ఇంకేం లేదు మరి చెప్పడానికి... నా సజెషన్ ఏంటంటే సినిమాకు వెళ్లకపోతేనే మంచిది... అంత ఇంట్రెస్ట్ ఉంటె ఓటిటిలోకి వచ్చాక చుస్తే డబ్బులైన మిగులుతయి.

Jul 06, 2026
A
6

Above Average

Nagabandham Movie Review

నాగబంధం... ఈ పేరు విని ఎదో కోడి రామకృష్ణ సినిమాల్లో లాగా మాంచి visual wonder ఉంటదనుకున్న... బట్ మూవీ లెక్క వేరే ఉంది.. సినిమా చూసాక మూడు గంటలు టార్చర్ ఉన్నది భాయ్.. హీరో తెల్వకపోయినా, కథ నచ్చితే చాలు అనుకుంటే... సినిమాలో chinna కథ పెట్టుకుని పెద్ద సినిమా తీసిండు.. సరే మొత్తం సినిమా అయిపోయాక regular...

నాగబంధం... ఈ పేరు విని ఎదో కోడి రామకృష్ణ సినిమాల్లో లాగా మాంచి visual wonder ఉంటదనుకున్న... బట్ మూవీ లెక్క వేరే ఉంది.. సినిమా చూసాక మూడు గంటలు టార్చర్ ఉన్నది భాయ్.. హీరో తెల్వకపోయినా, కథ నచ్చితే చాలు అనుకుంటే... సినిమాలో chinna కథ పెట్టుకుని పెద్ద సినిమా తీసిండు.. సరే మొత్తం సినిమా అయిపోయాక regular movies లాగా happy ending ఇస్తారేమో అనుకుంటే... మొత్తం చెప్పకుండా రెండో పార్ట్ లో చూడమని పెంట పెట్టారు. కానీ నేను ముందు చెప్పినట్టు ఇది కోడి రామకృష్ణ సినిమాలు చూసి inspire అయినట్లనే ఉంటది. చాలా మందికి అంజి, దేవి పుత్రుడు సినిమాలు గుర్తొస్తాయి. 

Jul 06, 2026
B
Baswaraj Students & Youth
6

Above Average

Nagabandham movie review

నాగబంధం... బైట ఏదేదో అంటున్నారు గాని... అనుకున్నంత bad ఎం లేదు మూవీ బానే ఉంది. అందరికి సినిమాల విషయంలో ఒక్కో టేస్ట్ ఉంటది. నాకేమో సినిమాల గురించి debate లు పెట్టేంత ఓపికలేదు.. బేసిగ్గా నేనేమో కొంచెం entertainment ఉంటె చాలు, లేదా ఏదన్నా చూడ్డానికి సినిమా బాగుంటే చాలు... అంటే సింపుల్ గా ఒక్క రెండు మూడ...

నాగబంధం... బైట ఏదేదో అంటున్నారు గాని... అనుకున్నంత bad ఎం లేదు మూవీ బానే ఉంది. అందరికి సినిమాల విషయంలో ఒక్కో టేస్ట్ ఉంటది. నాకేమో సినిమాల గురించి debate లు పెట్టేంత ఓపికలేదు.. బేసిగ్గా నేనేమో కొంచెం entertainment ఉంటె చాలు, లేదా ఏదన్నా చూడ్డానికి సినిమా బాగుంటే చాలు... అంటే సింపుల్ గా ఒక్క రెండు మూడు ప్లస్ పాయింట్స్ అన్నా ఉండాలనుకుంటాం కదా. 


ఈ సినిమాకొచ్చే సరికి visuals సూపర్ అసలు. అండ్ ఆ టెంపుల్ సీన్, డైలాగ్స్ బాగుంటాయి. కాకపోతే క్లైమాక్స్ డిస్సపాయింట్ చేసాడు డైరెక్టర్. అసలే మూడు గంటలు తీసి బోర్ కొట్టించాడు అనుకుంటే... నాగబంధం గురించి తెలవాలంటే రెండో పార్ట్ చూడాలి అన్నాడు.. అందుకే మరీ బావుంది అనలేను... కథ ఫిక్షనల్ అని తెల్సిందే కదా.. ఇగ ట్రైలర్ లోనే కాన్సెప్ట్ మొత్తం చెప్పినపుడు ఇంకేం చెప్తాం..

Jul 04, 2026
A
A Varadharaju Students & Youth
6

Above Average

NagaBandham movie Review

మాములుగా నేనేదైనా సినిమా రిలీజ్ తర్వాత టాక్ ని బట్టే వెళ్తా... బట్ నాగబంధం సినిమా ట్రైలర్ చూసి ఎదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రిలీజ్ డే రోజే వెళ్ళాను. బట్ నేను చేసింది చాలా తప్పని మూవీ చూసాక తెలిసింది. ఎంతలా అంటే మూడు గంటలు టార్చర్ తట్టుకునేట్టు కూడా లేకపోవడం... మూవీ చూడలేను... నిద్రకూడా పోలేను.. అసల...

మాములుగా నేనేదైనా సినిమా రిలీజ్ తర్వాత టాక్ ని బట్టే వెళ్తా... బట్ నాగబంధం సినిమా ట్రైలర్ చూసి ఎదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రిలీజ్ డే రోజే వెళ్ళాను. బట్ నేను చేసింది చాలా తప్పని మూవీ చూసాక తెలిసింది. ఎంతలా అంటే మూడు గంటలు టార్చర్ తట్టుకునేట్టు కూడా లేకపోవడం... మూవీ చూడలేను... నిద్రకూడా పోలేను.. అసలు హీరో ఎవరో అర్ధం కాదు, విలన్ గురించి ఐడియా ఉండదు.


ఒకడేమో నాగబంధం అడుగుతాడు.. ఇంకోడెమో బ్రహ్మకమలం అంటాడు. ఏవో కొన్ని విజువల్స్ తప్ప కథ పెద్దగా ఏమిలేదు. అండ్ నాగబంధం డైరెక్టర్ కి దండం పెట్టాలి... ఇలాంటి సినిమా మళ్ళీ తీయకు అని... ఇంతకు మించి నేనేం చెప్పలేను. అలా ఉంది ఈ కళాఖండం... 

Mar 06, 2026

About This Movie

Story : 1960ల మధ్య కాలంలో ఇద్దరు అర్కియాలజిస్టులు టెస్లా, అలీ(రిషబ్) హిమాలయాలలో సర్వే చేస్తుండగా, అక్కడ ఓ కాలవృక్ష బంధనంలో బందీగా ఉన్న బైరాగి (గరుడ రామ్) అనే తాంత్రికుడు అలీని వశపరుచుకుని, ప్రపంచాన్ని శాసించే శక్తులు గల బ్రహ్మ కమలాన్ని కనిపెట్టి తీసుకు రావాలని ఆదేశిస్తాడు. అయితే టెస్లా తనకు దొరికిన నాగంబంధం పుస్త‌కాన్ని ఆర్కియాలజీ శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)కు అందిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరంగపురం అలయంలో ఉన్న బ్రహ్మ కమలం అపహరణకు గురవుతుంది. అయితే దాన్ని అగంతకులు తీసుకెళుతుండగా నాగ సర్పాలు వెంటపడి అడ్డుకుంటాయి. ఈ క్రమంలో బ్రహ్మ కమలం ఎలాగైనా సాధించాలని రుద్ర (విరాట్ కర్ణ) శ్రీరంగపురానికి వస్తాడు. అయితే ఈ కథలో రుద్ర ఎవరు? ఆ బ్రహ్మ కమలం తస్కరించినవారెవరు? అసలు రుద్ర -అలీ గత జీవితానికి సంబంధమేంటి? చివరికి బ్రహ్మ కమలం సాధించారా? లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

PlusPoints :

ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే... (ట్రెజర్ హంట్) నిధి నిక్షేపాల నేపథ్యంలో చాలా మూవీస్ కొన్ని వందల సినిమాలొచ్చాయి. అయినా సరే ఆ కాన్సెప్ట్ తో మళ్ళీ వచ్చే కొత్త సినిమాలకు ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. అదే నాగబంధం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక నాగబంధం అని టైటిల్ వినగానే నాగసర్ప బంధాలతో ముడిపడి సినిమా ఉంటుందని తెలిసిపోయింది. సినిమా కథ ప్రారంభం కూడా చాలా ఇంట్రెస్టింగ్ వే లో మొదలై ఆ గ్రాండ్ విజువల్స్ తో డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఇక రంగనాథ స్వామి ఆలయ చరిత్ర కలగలిపి, గ్రాండ్ విజువల్స్, భారీ సెట్టింగ్స్ తో సినిమాని రిచ్ గా ప్రెసెంట్ చేసారు మేకర్స్. అలాగే హీరో విరాట్ కర్ణ రకాల డిఫరెంట్ షేడ్స్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నభా నటేష్ కి కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కింది. ఇక దక్ష నగర్కార్, జగపతి బాబు, మురళి శర్మ, గరుడ రామ్, రిషబ్ షానే వాళ్ళ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు. 


MinusPoints :

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా, స్క్రీన్ ప్లే మాత్రం ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్ మొత్తం ఊహాజనితంగా ఉండి ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుంది. మంచి యాక్షన్ సీన్స్ వచ్చి ఆకట్టుకున్నా, ఆ సీన్స్ అయిపోగానే అంతేనా అన్నట్టుంటుంది. పైగా చాలా సీన్స్ పలు సినిమాల్లో చూసిన ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ ని మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ సరిగా చేయాల్సింది. ఇక అన్నిటికి మించి కొన్ని సాంగ్స్ ని సరైన ప్లేస్ లో పెట్టకపోవడం వల్ల అవి సినిమా ఫ్లో ని దెబ్బతీశాయి. పైగా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చిన్న కథపై, గ్రాండ్ విజువల్స్ పై మాత్రమే మేకర్స్ ఆధారపడగా, కొంచెం కథనంపై కసరత్తు చేసుంటే బాగుందనిపించింది.

 

Technical values :

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... సినిమాను గ్రాండియర్ గా ప్రెజెంట్ చేయడానికి మేకర్స్ బానే ఖర్చుపెట్టారు. రంగనాథ స్వామి ఆలయం సెట్ మొదలుకొని, ఆ హిమాలయాలు, నాగబంధం విజువల్స్ అదిరిపోయాయి. టెంపుల్ సీన్స్ మంచి డివైన్ ఫీల్ తీసుకొచ్చాయి. ఇక జునైద్ కుమార్, అభి అందించిన సాంగ్స్ అంతగా లేకపోయినా, బీజీఎమ్ వర్క్ చాలా బాగుంది. సౌందర్ రాజన్ ఎస్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే మాత్రం ఆర్ సి ప్రణవ్ చాలా సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. VFX వర్క్ బాగున్నా, కొన్ని చోట్ల AI ని నమ్ముకున్నారు. ఇక దర్శకుడు అభిషేక్ నామా మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేదు. కనీసం క్లైమాక్స్ బాగా రాసుకున్నా, సినిమా బడ్జెట్ కి న్యాయం జరిగేది. 

 

FinalReview : 

ఓవరాల్ గా నాగబంధం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించినా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు అభిషేక్ నామా తడబడ్డాడు. సాగదీత సీన్స్ వల్ల, రొటీన్ క్లైమాక్స్ వల్ల సినిమాపై ఒపీనియన్ పూర్తిగా మారే ఛాన్స్ ఉంది. అయితే విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్, ఆ టెంపుల్ డివోషనల్ టచ్ అలాగే యాక్షన్ సీన్స్ కోసం సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. అయితే కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

Review Statistics

5.4
Overall Rating
Avg. of all reviews
29
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.5/10
Public
5.4/10
Why MRO?