Register as a Reviewer
పళ్ళ బురుసు (Palla Burusu)

పళ్ళ బురుసు (Palla Burusu)

14 Aug 2026
Overall Rating
5.4/10
11 Reviews

బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో, ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "పళ్ళ బురుసు". గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Uday Chauhan
Cast: Sudhakar Reddy, Muralidhar Goud, Prajwal Yadma, Gomathy

Available in:

Reviews

What critics and the public are saying about పళ్ళ బురుసు (Palla Burusu)

Media Reviews

6 Avg: 5.3/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Palla Burusu movie review

movie review of the film Palla Burusu : సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్టయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సినిమా గురించి చెప్పాలంటే బాగుందండి సినిమా. ఒక తండ్రికి కొడుకు పళ్ళ బురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడివరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్సప్లోర్ చేస్తుంది అనే విషయం మీదుంటుంది ఈ...

movie review of the film Palla Burusu : సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్టయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సినిమా గురించి చెప్పాలంటే బాగుందండి సినిమా. ఒక తండ్రికి కొడుకు పళ్ళ బురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడివరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్సప్లోర్ చేస్తుంది అనే విషయం మీదుంటుంది ఈ సినిమా. ఇండెప్త్ గా చాలా మెసేజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. కానీ ఏది రుద్దకుండా, మంచి సీన్స్ తోటి బాగా వర్కవుట్ చేసారు. 


చాలా ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం సినిమాలో. కానీ మొత్తానికి ఒక మంచి ఫీల్ తోటి, చిన్న స్మైల్ తోటి థియేటర్ బైటికి వస్తాం. కామెడీ కూడా న్యాచురల్ గా భలే పండాయి. మెయిన్ గా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాలో ఇప్పటిరోజుల్లో మనం మానవ సంబంధాలకు ఎంత దూరంగా ఎల్లిపోతున్నాం, పెద్దవాళ్ళు మన దగ్గరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం రిటర్న్ ఇవ్వాల్సింది ఏముంది అన్నది బాగా చూపించారు. అండ్ సినిమాలో తండ్రీకొడుకుల మిస్టేక్స్ ని రెండు సైడ్స్ లో బాగా చూపించారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి సినిమా అండి, ఫ్యామిలీతో చూడాలి. 

Aug 15, 2026 Watch
Tupaki
Tupaki Website
5

Average

Palla Burusu movie review

పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.ప‌ళ్ళ‌బురు...

పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.

ప‌ళ్ళ‌బురుసు క‌థ న‌డిచేది ద‌శాబ్దాల కింద‌టి కాలంలో కాదు.. వ‌ర్త‌మానంలోనే. మ‌రి ఈ రోజుల్లో ప‌ల్లెటూళ్ల‌లో టూత్ బ్ర‌ష్ దొర‌క‌ని ప‌రిస్థితులు ఎక్క‌డైనా ఉన్నాయా? కానీ ఈ సినిమాలో త‌న కొడుకు బ్ర‌ష్ కొనివ్వ‌లేదని తండ్రి కోర్టుకెక్క‌తాడు మరి.


కానీ నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ లో నటించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ల నటన సహజంగా ఉంది. ఇక రచయిత - దర్శకుడు ఉదయ్ చౌహాన్ చెప్పాలనుకున్న పాయింట్.. ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా.. స్క్రిప్టు సరిగా రాసుకోకపోవడంతో.. ఊరికే సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడంతో పళ్ళబురుసు ఒక మామూలు ప్రయత్నంగా మిగిలిపోయింది. చివరగా: పళ్ళబురుసు.. అన్ని సినిమాలు బలగం అవ్వవు


Aug 15, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Palla Burusu movie review

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. ఇ...

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదట కాస్త కామెడీగా సాగినా తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓ కొత్త పాయింట్ ని తీసుకొని దర్శకుడు మరింత ఎమోషనల్ చేసాడు.


ఒంటరితనం ఎంత భయంకరమైనది, ముసలితనంలో అది ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనే మెసేజ్ ని బాగా చూపించారు. అయితే క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు కానీ ఎమోషనల్ గా ముగిస్తే ప్రేక్షకుడు రియాలిటీకి కనెక్ట్ అయి బరువైన హృదయంతో బయటకు వెళ్ళేవాడు. మొత్తంగా ‘పళ్ళ బురుసు’ సినిమా కొడుకు పట్టించుకోవట్లేదని ఓ ముసలి తండ్రి పడే ఆవేదనను నవ్వించి ఏడిపిస్తూ చూపించిన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


Aug 14, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Palla Burusu movie review

Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a decent below avarage movie. Climax portionsA couple of songsSudhakar Reddy’s natural performan...

Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a decent below avarage movie. 


Climax portions

A couple of songs

Sudhakar Reddy’s natural performance


Drawbacks

Amateurish direction

Weak screenplay

Lack of cinematic moments

Unconvincing characterisation


Pallaburusu works to some extent during the climax and through its songs. But the weak screenplay and amateurish direction overshadow its sincere intentions. Despite a promising premise, the film tests the audience’s patience with weak writing, unconvincing characterisation and uneven execution.


Bottom Line: Good Intentions, Unconvincing Execution.

Aug 14, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

Palla Burusu Movie review

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు బలమైన భావోద్వేగాలను తగ్గ కథనం అల్లుకోవాలి. కానీ ఇందులో ఈ రెండూ లేవు. తండ్రీ కొడుకుల మధ్య...

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు బలమైన భావోద్వేగాలను తగ్గ కథనం అల్లుకోవాలి. కానీ ఇందులో ఈ రెండూ లేవు. తండ్రీ కొడుకుల మధ్య దూరంతో పాటు… తండ్రి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. 


కొన్ని సీన్స్ అయితే టీవీ సీరియల్ కంటే అన్యాయంగా చిత్రీకరణ ఉంది. శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. మాములుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి చుట్టేసిన సినిమాను ప్రేక్షకులు ఆశించరు. ఆరంభం నుంచి చివరి వరకూ నీరసంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే.. "ఆసక్తి కలిగించని "పళ్ళబురుసు".

Aug 14, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Palla Burusu Movie Review

 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్య...

 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అయితే సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది. 


పెర్ఫార్మన్స్ పరంగా అందరు నటులు సహజంగా అద్భుతంగా నటించారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘పళ్ళ బురుసు’ కేవలం కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే మెప్పిస్తుంది. కోర్ లైన్, ఇతర కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గానే ఉన్నాయి. పైగా ఫస్టాఫ్ కథనం వీక్ గా సాగింది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో కథనం ఇలా ఉంటే బాగుండేది. సో వీటితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

Aug 14, 2026 Read Review

Public Reviews

5 Avg: 5.4/10
T
Talari Snehalatha IT Employee
7

Hit

Palla Burusu movie review

పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. In...

పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.

సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.


ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా చూపించారు. Father-Son ఇద్దరి Mistakes ని కూడా Both Sides నుంచి చూపించడం నచ్చింది. కొన్ని Emotional Moments బాగా Connect అవుతాయి. Theatre నుంచి మంచి Feel తో బయటికి వస్తాం.


నాకైతే బలగం తర్వాత చూసిన వన్ అఫ్ ది బెస్ట్ rural backdrop ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇది. worth movie..

Aug 15, 2026
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

Palla burusu movie review

Palla Burusu has an interesting and relatable core idea, but the execution falls short. The story revolves around a small point and stretches it too much, with several silly and slow-paced scenes testing the audience’s patience.The message in the movie and emotional points are good, but the weak scr...

Palla Burusu has an interesting and relatable core idea, but the execution falls short. The story revolves around a small point and stretches it too much, with several silly and slow-paced scenes testing the audience’s patience.


The message in the movie and emotional points are good, but the weak screenplay fails to create the impact expected.


Overall A decent concept with good performances, but average writing and dragged-out narration make Palla Burusu just an okay one-time watch.

Aug 16, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Palla burusu movie review

‘పళ్ళ బురుసు’ కాన్సెప్ట్ పరంగా ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా.. దాన్ని స్క్రీన్ పై ఆసక్తికరంగా నడిపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చిన్న పాయింట్ చుట్టూ కథను ఎక్కువగా సాగదీయడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.కానీ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుక...

‘పళ్ళ బురుసు’ కాన్సెప్ట్ పరంగా ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా.. దాన్ని స్క్రీన్ పై ఆసక్తికరంగా నడిపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చిన్న పాయింట్ చుట్టూ కథను ఎక్కువగా సాగదీయడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.


కానీ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్ బాగున్నా.. బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవడంతో ఆ ఎమోషన్ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు.


ఓవరాల్‌గా నా అభిప్రాయం చెప్పమంటే.. మంచి పాయింట్ ఉన్నా.. రొటీన్ ట్రీట్‌మెంట్, స్లో నరేషన్ కారణంగా ‘పళ్ళ బురుసు’ యావరేజ్ గా అనిపించింది.

Aug 16, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
5

Average

Palla Burusu movie review

Palla Burusu oka simple village backdrop lo vachina family emotional drama. Father-son relationship ni base cheskoni manchi emotional point tho teesaru. Sudhakar Reddy, Muraleedhar Goud performances natural ga unnayi. Konni emotional scenes especially second half lo baaga connect avutayi.Kaani story...

Palla Burusu oka simple village backdrop lo vachina family emotional drama. Father-son relationship ni base cheskoni manchi emotional point tho teesaru. Sudhakar Reddy, Muraleedhar Goud performances natural ga unnayi. Konni emotional scenes especially second half lo baaga connect avutayi.


Kaani story, screenplay konchem routine ga anipistayi. First half slow ga untundi, konni scenes unnecessary ga drag ayyinattu anipinchindi.


Overall ga Manchi emotions, natural performances unnayi… kaani routine story & slow narration valla Palla Burusu naku oka decent one-time watch anipinchindi.

Aug 15, 2026
T
Tharuni Valluru Small Business Owner
5

Average

Palla burusu movie review

Palla Burusu – Public ReviewPalla Burusu – Public ReviewPalla Burusu is a simple village-based family drama with a good emotional core. The father-son conflict feels relatable, and Sudhakar Reddy & Muraleedhar Goud give natural performances. A few emotional scenes, especially in the second half,...

Palla Burusu – Public Review


Palla Burusu – Public Review


Palla Burusu is a simple village-based family drama with a good emotional core. The father-son conflict feels relatable, and Sudhakar Reddy & Muraleedhar Goud give natural performances. A few emotional scenes, especially in the second half, work well.


But the story and screenplay feel routine, and the first half is slow. The movie has some good moments, but it doesn’t offer enough freshness to fully engage the audience.


Overall Good performances + genuine emotions, but an average story and slow narration make Palla Burusu a one-time watch for family audiences.

Aug 14, 2026

About This Movie

Story : 

తెలంగాణాలో ఓ మారుమూల పల్లెటూర్లో ఒంటరిగా జీవనం సాగిస్తుంటాడు శంభో (సుధాకర్ రెడ్డి). కొడుకు, కూతురు వేరే ఊళ్లలో సెటిల్ అవడంతో ఈయన బాగోగులు కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు శంభో పంటి నొప్పి వస్తుందని హాస్పిటల్ కి వెళ్తే, తాను వాడే వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ని వాడమని సలహా ఇస్తారు. అందుకని తన కొడుకు తిరుపతికి (మురళీధర్ గౌడ్) ఫోన్ చేసి పళ్ళ బురుసు (టూత్ బ్రష్), కొన్ని మందులు తీసుకురమ్మంటాడు. కానీ తనకున్న సమస్యల వల్ల తిరుపతి తండ్రిని అంతగా పట్టించుకోడు. పైగా తిరుపతి తన కూతురి పెళ్లి చేయాలనీ తండ్రి పొలాన్ని అమ్ముదామని ప్లాన్ చేస్తాడు. కానీ తండ్రిని పెళ్ళికి కూడా పిలవడు. దీంతో కొడుకు చేష్టలకు విసుగెత్తిపోయిన శంభో పరిష్కారం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఈ క్రమంలో అసలు ఈ తండ్రీకొడుకుల మధ్య గొడవేంటి? నిజంగా తండ్రి పళ్ళ బురుసు కొనివ్వలేదని కేసేసాడా? లేక ఇంకేదైనా సమస్య ఉందా? చివరికి జరిగిందేంటి? అనేది మిగిలిన కథ. 

 

Plus Points :

పల్లెటూరి వాతావరణంలో తండ్రి కొడుకుల మనస్పర్థల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. వయసుమళ్ళిన తల్లిదండ్రులు పిల్లల నుండి ఏం కోరుకుంటారో, అనే సున్నితమైన అంశాన్ని దర్శకుడు ఉదయ్ చౌహాన్ మంచి ఎమోషన్స్ తో చూపించాడు. ఈరోజుల్లో తన బిజీ లైఫ్ వల్ల తల్లిదండ్రులకి దూరమయ్యే పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోల్పోతున్నారో ఈ సినిమాలో చూపించారు మేకర్స్. ఇక బలగం తో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి మళ్ళీ అదే తరహా తండ్రి పాత్రలో సహజంగా నటించారు. అలాగే కొడుకు పాత్రలో మురళీధర్ గౌడ్ చాలా బాగా మెప్పించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన సీనియారిటీ చూపించాడు. అలాగే ప్రజ్వల్, గోమతి రెడ్డి సహా, కొందరు సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ పరిధి మేరకు బాగా మెప్పించారు.

 

Minus Points :

దర్శకుడు ఈ సినిమాకి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. పైగా ఇలాంటి కథల్ని కొన్ని వందల సినిమాల్లో చూసి ఉంటాం. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అందువల్ల ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఉండదు. ఇక తండ్రి కొడుకుల మధ్య వైరం మెయిన్ పాయింట్ కాగా, వాటికి గల కారణాలను స్ట్రాంగ్ గా రాసుకుని ఉండాల్సింది. అలాగే క్లైమాక్స్ వరకు సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ అంతగా ఇంప్రెసివ్ గా లేదు.

 

Technical Values :

ఇక పళ్ళ బురుసు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ గ్రామీణ వాతావరణంలో ఉన్న సహజత్వం. చాలా న్యాచురల్ గా  ఈ చిత్రంలో సీన్లను తెరకెక్కించారు. వినోద్ కే బంగారి కెమెరా వర్క్ కెమెరా పనితనం బాగుంది. పవన్ సి హెచ్ సంగీతం బాగుంది. కానీ ఇంకా సాన పెట్టాల్సింది. సృజన ఎడిటింగ్ ఓకే అన్నట్టుంది, కొన్ని సీన్లు ఎడిట్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ ఉదయ్ చౌహన్ మంచి పాయింట్ ని ఎంచుకోగా, కొన్ని అనవసరమైన సీన్లతో కొన్ని చోట్ల బోర్ కొట్టించాడు. తెలిసిన కథనే కావడం వల్ల ఆడియన్స్ కి మరింత బోర్ కొట్టింది. కాకపోతే క్లైమాక్స్ ని బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. 


Final Review :

ఇక ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే... "పళ్ళ బురుసు" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కొంతవరకు ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల ఫ్రెష్ మూవీస్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. సెకండ్ హాఫ్ ని ఇంకాస్త బలమైన స్క్రీన్ ప్లే తో రాసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక వర్గం ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంతవరకు నచ్చే ఛాన్స్ ఉంది. 

Review Statistics

5.4
Overall Rating
Avg. of all reviews
11
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.3/10
Public
5.4/10
Why MRO?