రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)
Ramba Oorvasi Menaka : అచ్చొచ్చిన జోనర్ లో రాబోతున్న అల్లరోడు... ఈసారి గట్టి కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.
Available in:
About This Movie
టాలీవుడ్ లో కామెడీ మూవీస్ కి కేరాఫ్ గా నవ్వుల రారాజు అనిపించుకున్న "అల్లరి నరేష్" గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. నాలుగేళ్ళ కిందట "నాంది" తో మంచి సక్సెస్ అందుకున్నాక వచ్చిన నాలుగైదు మూవీస్ నిరాశపరిచాయి. పైగా అన్ని ప్రయోగాత్మక సినిమాలే. ఇక ఇప్పుడు మళ్ళీ ఒకప్పటి తన జోనర్ అయిన కామెడీ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ వస్తున్నాడు. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ దృష్టిలో అల్లరి నరేష్ నుండి కామెడీ సినిమా వస్తుందంటే, కళ్ళు మూసుకొని టికెట్స్ కొనేందుకు రెడీ అయిపోతారు.
తాజాగా నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రంభ ఊర్వశి మేనకా". చంద్ర మోహన్ చింతాడా దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపూర్ణ బ్యానర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై నిమ్మకాయల ప్రసాద్, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా టీజర్ ని తాజాగా మేకర్స్ విడుదల చేయగా, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అయితే టీజర్ ని గమనిస్తే... అప్పట్లో నరేష్ నటించిన యముడికి మొగుడు సినిమా గుర్తొస్తుంది. ఆ మూవీలో హీరో కోసం స్వర్గం నుండి దేవత దిగొచ్చినట్టు, ఈ "రంభ ఊర్వశి మేనక" చిత్రంలో కూడా హీరో కోరుకున్నాక తన కోసం ఈ ముగ్గురు దేవతలు దిగొస్తారు. ఆ తర్వాత జరిగే సరదా సన్నివేశాల చుట్టూ అల్లుకున్న కథాంశమే ఈ సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తుంది. టీజర్ అయితే మంచి ఎంటర్టైనింగ్ గా నే అనిపించింది. ఇక ఈ చిత్రం లో ఇంద్రుడిగా వెన్నెల కిశోర్ నటించగా , రంభ, ఊర్వశి, మేనకల పాత్రల్లో రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణు ప్రియ నటించారు. మెయిన్ హీరోయిన్ గా సురభి నటించింది. అంతే కాదు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ కమెడియన్లు ఉండడం ఒకప్పటి ఇవివి సత్యనారాయణ సినిమాలను గుర్తు చేసినట్టుంది.
ఏది ఏమైనా టీజర్ చూస్తుంటే ఈ సారి అల్లరోడు మంచి కం బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించగా, సినిమాను సెప్టెంబర్ 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తునట్టు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో అల్లరోడు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.