రావు బహదూర్ (Rao Bahadur)
టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఒకరైన సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రావు బహదూర్". వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about రావు బహదూర్ (Rao Bahadur)
Media Reviews
12 Avg: 5.5/10Above Average
Rao Bahadur movie Review
రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ...
రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి డైరెక్టర్ వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆడియన్స్ చూడొచ్చా అంటే... టీజర్, ట్రైలర్ చూసాక మూవీ గురించి డిసైడ్ అవ్వండి. కొత్తదనం కోసం చూడొచ్చు కానీ, ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం కష్టమే.
అండ్ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ సప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో సత్యదేవ్ వన్ మ్యాన్ షో తో ఇంప్రెస్ చేసారు. ఇక సినిమాలో సింపుల్ గా పాయింట్ మొత్తం చెప్పాలంటే హ్యుమానిటీ గురించి డిఫరెంట్ గా చెప్పినట్టుంది. అండ్ హీరో సహా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ ప్రొడక్షన్ డిసైనింగ్ కూడా బాగున్నాయి. అండ్ ఎండింగ్ మాత్రం కొత్తగా ఉన్నా అంతగా ఎక్కలేదని చెప్తాను. ఫ్రెష్ స్టోరీ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కోసం ఈ మూవీ ఆడియన్స్ ట్రై చేయొచ్చు.
Average
Rao Bahadur Movie Review
#RaoBahadur An Ambitious Experiment That Never Fully Clicks and Tests Your Patience at times! A very bold and unconventional attempt that struggles to justify its ambition. The first half tests your patience and largely serves as setup. Second half offers better drama and an interesting climax, but...
#RaoBahadur An Ambitious Experiment That Never Fully Clicks and Tests Your Patience at times!
A very bold and unconventional attempt that struggles to justify its ambition. The first half tests your patience and largely serves as setup. Second half offers better drama and an interesting climax, but the narrative is dragged out and too lengthy. The social commentary has potential, but it gets lost within the drama instead of leaving a lasting impact.
Satya Dev delivers a fantastic performance. Venkatesh Maha comes up with a very unique idea, but becomes too self-indulgent, and the film ultimately gets lost in translation.
Rating: 2.25/5
Average
Rao bahadur movie review
రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది ఏ విధంగానూ రెగ్యులర్, రొటీన్ సినిమా కాదు. ఆలా అని థియేటర్ లో ఆడుతుంది అని చెప్పలేము. కానీ థియేటర్ లో చుడండి. నిజమైన కొత్త సినిమా అనుభూతి ఇస్తుంది. ఇది కాలక్షేపంగా చూసేది కాదు, ప్రతి సీన్ ను డీకోడ్ చేసుకుంటూ చూడాలి. అప్పుడే దర్శకుడి మీద... నిర్మాతల మీద నటుల మీ...
రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది ఏ విధంగానూ రెగ్యులర్, రొటీన్ సినిమా కాదు. ఆలా అని థియేటర్ లో ఆడుతుంది అని చెప్పలేము.
కానీ థియేటర్ లో చుడండి. నిజమైన కొత్త సినిమా అనుభూతి ఇస్తుంది. ఇది కాలక్షేపంగా చూసేది కాదు, ప్రతి సీన్ ను డీకోడ్ చేసుకుంటూ చూడాలి. అప్పుడే దర్శకుడి మీద... నిర్మాతల మీద నటుల మీద గౌరవం పెరుగుతుంది.
పంచ్ లైన్ - మళ్ళి మళ్ళి రాదు.. బహదూర్
Above Average
Rao Bahadur movie Review
సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో తెరకెక్కిన రావు బహదూర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీ సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ రావు బహదూర్ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్తసంబంధాలు అనే సున్నితమైన...
సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో తెరకెక్కిన రావు బహదూర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీ సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ రావు బహదూర్ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్తసంబంధాలు అనే సున్నితమైన అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
రాజరికపు అహంకారం ఎంత గుడ్డిగా ఉంటుందో డైరెక్టర్ తన మేకింగ్‌లో లోతుగా చర్చించారు. 1960ల కాలంలో ఉన్న కుల వివక్ష, 2020 వచ్చినా పోదు అని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా క్లాస్‌గా, మేధావులకు నచ్చేలా తీశాడు కానీ మాస్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది కచ్చితంగా చెప్పలేం. ఓవరాల్‌గా రావు బహదూర్.. రెగ్యులర్ కాదు.. డిఫెరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!
Above Average
Rao Bahadur movie Review
అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్ పై నడిచే మూవీ ఈ రావు బహదూర్. కథగా ఇది చాలా చిన్నపాయింట్. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప...
అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్ పై నడిచే మూవీ ఈ రావు బహదూర్. కథగా ఇది చాలా చిన్నపాయింట్. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప్ప విషయం. ఒక కొత్తరకమైన పాయింట్ తో ఈ మూవీ తీయడాన్ని అభినందించాలి. కానీ తీసిన విధానం, చెప్పిన తీరుని మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
రామప్ప రావు బహదూర్‌గా సత్యదేవ్ ఇరగదీశాడు. విభిన్నమైన షేడ్స్ లో ఆయన అదరగొట్టారు. యంగ్ కుర్రాడిగా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా, వృద్ధుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. దర్శకుడు వెంకటేష్ మహా మంచి కథలను తెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన మెప్పించలేపోయాయి. ప్రయోగం మాత్రం చేశారని చెప్పొచ్చు. ప్రయోగం బాగుంది, కానీ ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా చేయడంలో విఫలమయ్యారు. అనుమానం పెనుభూతం అన్నట్టు, ఇది ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.
Above Average
Rao bahadur Movie Review
"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న రావు బహదూర్ సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా ల...
"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న రావు బహదూర్ సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా లోతుగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్.. సత్యదేవ్ అద్భుతమైన నటన వెంకటేష్ మహా రచన, దర్శకత్వం క్లైమాక్స్ ట్విస్ట్ బలమైన భావోద్వేగాలు కులం, వంశం, అనుమానం వంటి అంశాలపై లోతైన చర్చ సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్.. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం DNA పరీక్షలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించడం సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు కొంత నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఒకసారి ట్రై చేయొచ్చు.
Above Average
Rao bahadur movie Review
సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'రావు బహదూర్' ప్రేక్షకులను పరీక్షించే చిత్రంగా నిలుస్తుంది. ప్రారంభం నుంచే మిస్టరీతో కథను నడిపించిన దర్శకుడు, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యాన్ని దాచిపెడతాడు. అయితే ఆ ఆసక్తిని కొనసాగించే క్రమంలో కథనం మరీ క్లిష్టంగా మారిపోవడంతో ఫస్ట్ హాఫ్‌లోనే చాలా మం...
సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'రావు బహదూర్' ప్రేక్షకులను పరీక్షించే చిత్రంగా నిలుస్తుంది. ప్రారంభం నుంచే మిస్టరీతో కథను నడిపించిన దర్శకుడు, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యాన్ని దాచిపెడతాడు. అయితే ఆ ఆసక్తిని కొనసాగించే క్రమంలో కథనం మరీ క్లిష్టంగా మారిపోవడంతో ఫస్ట్ హాఫ్‌లోనే చాలా మందికి కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది.
సెకండాఫ్‌లో కథ కాస్త స్పష్టతకు వచ్చినా, ప్రేక్షకుడు అంతవరకు ఓపికగా ప్రయాణించాల్సిందే. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు కొంత బలం చేకూర్చినా, మొత్తం ప్రయాణాన్ని పూర్తిగా సంతృప్తికరంగా మార్చలేవు. సత్యదేవ్ తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, దర్శకుడు వెంకటేష్ మహా కొత్త తరహా కథ చెప్పాలనే ప్రయత్నం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
మొత్తంగా, రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌ను ఆశించే వారికి 'రావు బహదూర్' అంతగా నచ్చకపోవచ్చు. కానీ ప్రయోగాత్మక కథలు, నెమ్మదిగా విప్పుకునే మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక విభిన్న అనుభూతిని అందిస్తుంది. ఫైనల్ గా టాలీవుడ్ లో ఇప్పటివరకు ట్రై చేయని రియలిజం మ్యాజిక్ తో కూడిన ఒక ఎంగేజింగ్ సైకలాజికల్ డ్రామా ఈ రావు బహదూర్.
Average
Rao Bahadur movie Review
సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్ కు ముందు ఆయన వేసిన ట్వీట్ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్...
సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్ కు ముందు ఆయన వేసిన ట్వీట్ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమా కంటెంట్‌ను కొంత మెరుగుపరిచాడు.
రావు బహదూర్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే.. డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది. కానీ ఆ పాయింట్ ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమా కథ చెప్పడంలో తెలివి ఉండాలి. కానీ ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్ గా ఎమోషనల్ డ్రామా, ఈ డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఎక్కువ పెషన్స్ తప్పనిసరి. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.
Average
Rao Bahadur Movie Review
Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a...
Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a film made in this manner before.
Highlights
Satyadev’s terrific performance
The final twists and payoff
The portions after the police officer’s entry
Drawbacks
Uneven and slow-moving first half
Lengthy runtime
Self-indulgent narration in several stretches
Overall, Rao Bahadur is a sincere attempt to tell a story in a distinctive manner. The idea is admirable, and the climax justifies much of the film’s thematic ambition, with Satyadev delivering a performance worthy of applause. However, the painfully slow narration, overstretched screenplay and self-indulgent storytelling make it a tiresome watch. Those willing to invest patience may appreciate its intent, but for many viewers, the film’s pacing will prove to be a major hurdle.
Average
Rao Bahadur Movie Review
'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. సెకండాఫ్ లో కథ కాస్త పుంజుకుని,...
'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే.
సెకండాఫ్ లో కథ కాస్త పుంజుకుని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా, అందరికీ నచ్చే సినిమా కాకపోయినా... కొత్త తరహా కథలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. వెంకటేష్ మహా డైరెక్షన్ బావున్నా, స్క్రీన్ ప్లే ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలనుకునే ఆడియన్స్ ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్తే మంచిది.
Average
Rao Bahadur Movie Review
రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన...
రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదేమో. అలా ఉంది సినిమా. అయితే తెలుగులో ఇలాంటి టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం కొత్త అని చెప్పుకోవచ్చు.
భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే ప్రశ్నలు కలుగుతాయి. ఇక కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఓవరాల్ గా ఇది సత్య దేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్‌లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్‌గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ చివరి ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదొక వినూత్న ప్రయోగం, ప్రయత్నం అని మాత్రం చెప్పుకోవచ్చు.
Above Average
Rao Bahadur Movie Review
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్...
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి.
సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story :
90స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ఓ రాజకుటుంబానికి చెందిన భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప (సత్యదేవ్) చాలా యేళ్ళుగా లివర్ క్యాన్సర్ తో బాధ పడుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తేల్చిన ప్రతిసారి బతికి ప్రాణాలు పోకుండా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే రామప్ప జీవితంలో చోటు చేసుకొన్న ఓ విషాద సంఘటన మానసికంగా కుంగదీస్తుంది. పైగా ఓ అనుమానం పెనుభూతంలా అతడిని పట్టి పీడిస్తుంది. ఈ క్రమంలో రామప్ప చివరి రోజులు ఎలా గడిచాయి? అతని స్నేహితుడు డాక్టర్ ఆచారి (వికాస్ ముప్పల)తో ఎలాంటి అనుబంధం ఉంది? రామప్పను బతికించడానికి ఆచారి చేసిన ప్రయత్నాలు ఏంటి? మధ్యలో రామప్పను రేణుక (దీపా థామస్) ఎందుకు పెళ్లి చేసుకుంది. రామప్ప పెంపుడు కొడుక్కి ఎదురైన అవమానాలు ఏంటి? ఇంతకీ రామప్పను వేధిస్తున్న ఆ అనుమానం వెనుక నిజం తెలిసిందా? చివరికి రామప్ప జీవితం ఎలా ముగిసిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
PlusPoints :
ముందుగా రావు బహదూర్ సినిమా సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో వస్తుందనగానే మంచి క్రేజ్ జనాల్లో మొదలైంది. దానికి తోడు మహేష్ బాబు సమర్పణలో మూవీ అనగానే ఇండస్ట్రీలోనూ మంచి హైప్ వచ్చేయగా, టీజర్, ట్రైలర్లు కూడా జనాల్లో ఆసక్తి పెంచేసాయి. అయితే సినిమా రిలీజ్ తర్వాత లెక్కలు తారుమారయ్యాయి. సినిమా కథ సింపుల్ గానే ఉన్నా, దాని చుట్టూ అనుమాన పెనుభూతం కాన్సెప్ట్ తో అల్లుకున్న స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. దానికి తోడు సత్యదేవ్ రావు బహదూర్ గా డిఫరెంట్ వేరియేషన్స్ తో సాలిడ్ పెర్ఫార్మన్స్ తో చితగ్గొట్టాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో కొంత సేపు బాగానే ఉన్న సినిమా చాలా వరకు డల్ గా సాగుతుంది. అలాగే పలు కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ తో పాటు క్లైమాక్స్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.
MinusPoints :
అయితే రావు బహదూర్ కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నా, దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. పైగా కథ ముందుకు వెళ్లే కొద్దీ సాగదీత ఎక్కువైపోయిన ఫీల్ వస్తుంది. ఒక్క క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం భరించిన ఫీల్ కూడా వస్తుంది. అయితే చాలా మంది కేరాఫ్ కంచరపాలెం డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా దర్శకుడు కావడం వల్ల ఈ సినిమాపై మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడడం వల్ల డిస్సపాయింట్ అవుతున్నారు. ఓవరాల్ గా కథనం ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే లెక్క వేరేలా ఉండేది.
Technical values :
టెక్నికల్ గా చూసుకుంటే... ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయింది. పీరియాడిక్ నేపథ్యంలో వేసిన సెట్స్ కూడా చాలా బాగున్నాయి. పైగా కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ వర్క్ కూడా బాగా కుదిరింది. సాంగ్స్ డీసెంట్ గా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగానే ఉన్నా, కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా దాన్ని ఇంట్రెస్టింగ్ వే లో ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు.
FinalReview :
ఫైనల్ గా రావు బహదూర్ సినిమా ఒక డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన థ్రిలర్ మూవీగా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించొచ్చు. అనుమానం అనే పెనుభూతం కాన్సెప్ట్ పై డైరెక్టర్ కొనసాగించిన సస్పెన్స్, దానికి తగ్గ సత్యదేవ్ పెర్ఫార్మన్స్, క్లైమాక్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి. అయితే సాగదీత కథనం వల్ల, మూవీ ఆడియన్స్ కి బోర్ ఫీల్ తెప్పిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఆడియన్స్ కి అర్ధం కావాలన్నా కొంచెం టైం పడుతుంది. ఓవరాల్ గా సత్యదేవ్ పెర్ఫార్మన్స్ కోసం, తక్కువ అంచనాలతో మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.