Register as a Reviewer
సిగ్మా (Sigma)

సిగ్మా (Sigma)

02 Oct 2026
Overall Rating
3.7/10
14 Reviews

Sigma : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ ఆక్షన్ ఎంటర్టైనర్ "సిగ్మా" (Sigma). తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, తాజాగా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది.

Director: Jason Sanjay
Cast: Sundeep Kishan, Faria Abdullah, Raju Sundaram, Sampath Raj, Shiv Panditt, Anbu Thasan, Yog Japee, Magalakshmi, Sheela Rajkumar, Kamalesh, Kiran Konda

Available in:

Reviews

What critics and the public are saying about సిగ్మా (Sigma)

Media Reviews

11 Avg: 3.9/10
3

Not Good

Sigma movie review

వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్‌, విలన్ల గ్యాంగ్‌ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్‌ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్‌...

వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్‌, విలన్ల గ్యాంగ్‌ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్‌ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్‌ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీసుకెళ్లారు. 


ఆయా సీన్లలో ల్యాగ్‌ ఎక్కువగా ఉంటుంది. గురు పాత్రలో సందీప్‌ కిషన్‌ నటించి మెప్పించాడు. పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలోని డ్రామా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సామ్‌ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేయడం మైనస్‌గా చెప్పొచ్చు. పైగా ఆకట్టుకునేలా తీయడంలో తడబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్‌ అయ్యాడు. ఫైనల్‌గా సినిమా చూశాక.. జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా కంటే నటుడిగా ట్రై చేస్తే బెటర్‌ అనిపించింది. ఆడియెన్స్ సహనంతో ఆడుకున్న సిగ్మా. విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా సక్సెస్‌కాలేకపోయారు.

Oct 02, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Sigma movie review

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టే...

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టేకింగ్‌ను చూపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్ వేగం పెరిగినప్పటికీ యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా ఇలాంటి హీస్ట్ థ్రిల్లర్స్‌కు లాజిక్స్ చాలా అవసరం. ఇక్కడ మాత్రం లాజిక్ మిస్సయింది. 


అలాగే ఫైట్లలో తుపాకులు ఉన్నా కూడా కత్తులతో దాడులు చేసుకోవడం లాంటివి నమ్మశక్యంగా అనిపించవు. హాలీవుడ్ స్టైల్లో ఒక ఫిమేల్ క్యారెక్టర్‌ను మోసం, నమ్మకద్రోహం చేసేలా డిజైన్ చేసినా దాన్ని కూడా తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దర్శకుడు ఆలోచనలు బాగున్నా, రాసుకున్న స్క్రీన్ ప్లేలో నిలకడ లోపించడం సినిమాకు ప్రధాన మైనస్. లాజిక్స్ పక్కనపెడితే ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. ఏదో విజయ్ వీరాభిమానులకు సంజయ్ ఎలా డైరెక్ట్ చేసాడో తెలుసుకుందాం అనుకుంటే ఓసారి ట్రయల్ వేయొచ్చు. ఓవరాల్‌గా సిగ్మా.. యాక్షన్ డ్రామా.. కానీ చాలా కండీషన్స్ అప్లై..!

Oct 02, 2026 Read Review
Gulte
Gulte Website
3

Not Good

Sigma movie review

Sigma movie review : Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a T...

Sigma movie review :

Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a Telugu heroine, Faria Abdullah, to play the lead actress role.

Positives:

1.⁠ ⁠Nothing

Negatives:

1.⁠ ⁠Clueless Storytelling

2.⁠ ⁠Amateurish Direction

3.⁠ ⁠Outdated Writing

4.⁠ ⁠Loud Background Score

5.⁠ ⁠Excessive Slow Motion Shots

6.⁠ ⁠Unnecessary Item Song


Overall, with a bad first half and an equally bad second half, Sigma, tests your patience throughout its runtime and it definitely doesn’t deserve a watch not just in theatres but on OTT as well. Yes, pursuing passion is commendable but the first thing, Jason Sanjay, has to do is work as an assistant director for a handful of films for a few years, learn the craft, improve his writing skills and then attempt to make his second film as director. It may sound harsh but he’s not yet ready to direct a film and his lack of command in storytelling and direction, was to be seen in each and every sequence of, Sigma.


Oct 03, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
3

Not Good

Sigma movie review

లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగ...

లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగిపోయాయి.


వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌ లో అప్పుల తిప్పలు, యూట్యూబ్ ఛానెల్, డ్రగ్స్ పెన్ డ్రైవ్, విలన్‌ ని బ్లాక్‌మెయిల్ చేయడం... ఇలా అరడజను పాత సినిమాల ప్లాట్లను కలిపి రుబ్బిన రొటీన్ కథ ఇది. హీరో సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్ మరియు సిన్సియర్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే కష్టపడ్డాడు, కానీ రొటీన్ కథనాన్ని ఆయన ఒక్కడే కాపాడలేకపోయాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను కేవలం పేరుకే పరిమితం చేశారు, ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు.


ఫస్ట్ హాఫ్ అంతా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా దారుణమైన ల్యాగ్‌తో సాగుతుంది. ఎమోషనల్ సీన్లలో అసలు డెప్త్ లేదు, ఫ్లాట్ క్లైమాక్స్ ఇంకా పెద్ద హెడేక్. ఫైనల్ గా సుదీర్ఘమైన క్లైమాక్స్ చూస్తూ 5 సెకన్లకొకసారి ఎగ్జిట్ డోర్ వైపు చూసే పరిస్థితి దాపురించింది. 

Oct 02, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
3

Not Good

Sigma movie Review

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్...

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ (పిల్లి ఎలుక మధ్య ఆట)ను తలపించింది. చివరకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూసేలా చేశారు. కథ, కథనాల్లో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. కానీ, ఆ స్థాయిలో చేయలేదు.


ఓవరాల్ గా విజయ్ తనయుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్ కలిసి కొత్త తరహా సినిమా తీసి ఉంటారని ఆశిస్తే... బాగా డిజప్పాయింట్ చేశారు. ఇంతకు ముందు సందీప్ కిషన్ పరిచయం చేసిన దర్శకులు తమ మార్క్ చూపించారు. కానీ జేసన్ సంజయ్ ఓల్డ్ స్టైల్ సినిమా చేశారు. 'సిగ్మా' టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టు సినిమా చివరిలో ఓ మాట చెప్పారు ఫరియా అబ్దుల్లా. ఆ డైలాగ్ ఎందుకు రాయించారో అర్థం కాదు. అప్పటి వరకు చూసిన సినిమా కూడా అర్థం కాదు. ఫైనల్ గా కమర్షియల్ ఫార్మాట్‌ లో తీసిన అవుట్ డేటెడ్ సినిమా ఈ 'సిగ్మా'.

Oct 02, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Sigma movie review

సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ థియేటర్లలో విడుదలయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది! వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌‌లో అప్పుల బాధల్లో ఉన్న హీరో గురు, అనుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ పెన్ డ్రైవ్ సాధించి ఇంటర్నేషనల్...

సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ థియేటర్లలో విడుదలయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది! వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌‌లో అప్పుల బాధల్లో ఉన్న హీరో గురు, అనుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ పెన్ డ్రైవ్ సాధించి ఇంటర్నేషనల్ స్మగ్లర్ వెంకట రెడ్డి (సంపత్ రాజ్)ని బ్లాక్‌మెయిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సందీప్ కిషన్ తన సిన్సియర్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ... కొత్తదనం లేని కథ, ఆకట్టుకోని కథనం వల్ల దర్శకుడిగా జాసన్ సంజయ్ పూర్తిగా విఫలమయ్యాడు.


ఫస్ట్ హాఫ్ డల్ గా సాగడం, ఫరియా అబ్దుల్లా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేకపోవడం, ఎమోషన్స్‌‌లో డెప్త్ మిస్ అవ్వడం మరియు పూర్ డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. క్లైమాక్స్ కూడా ఫ్లాట్‌గా ముగియడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఓవరాల్‌గా సందీప్ కిషన్ ఎఫర్ట్స్ కోసం మాత్రమే రెగ్యులర్ మూవీ గోయర్స్ ఒకసారి టైమ్‌పాస్ కి ట్రై చేయవచ్చు! చివరగా సిగ్మా ఒక రొటీన్ అండ్ బోరింగ్ హీస్ట్ డ్రామా!


Oct 02, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

Sigma movie review

తమిళ స్టార్ హీరో విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కో...

తమిళ స్టార్ హీరో విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీరో ఆ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం... ఈ కాన్సెప్ట్ ఇప్పటికే దశాబ్దాల కాలంగా నలిగి నలిగి పోయింది. మళ్ళీ అదే కథను తీసుకుని అటూ ఇటూ తిప్పి జనాలకు చూపించాలనే ప్రయత్నం జేసన్ సంజయ్‌ చేశాడు.


అసలు జేసన్ సంజయ్‌ చెప్పిన కథలో ఏ కొత్తదనం చూసి లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అర్థం కాదు. సందీప్ కిషన్‌, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పై పెచ్చు కోట్ల రూపాయలను నీళ్ళ మాదిరి ఖర్చుచేయించాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అని ఇవాళ్టి తరం చెబితే... జనాలు వినే పరిస్థితి లేదు. నిజానికి ముక్కు ముఖం బాగున్న జేసన్ సంజయ్‌ దర్శకత్వం కంటే నటన మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో!


Oct 02, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
3

Not Good

Sigma Movie Review

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి సిగ్మాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పాలి. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అన...

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి సిగ్మాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పాలి. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అనుసరించిన కథనం చాలా పేలవంగా, నాసిరకంగా ఉన్నాయి. సినిమా సాగుతున్న కొద్ది ఈ టార్చర్ ఎప్పుడు ముగుస్తుందా? అనే ఫీలింగ్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 


నటీనటులు విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ఈ సినిమాను ఎలా ఒప్పుకొన్నాడు అనే మిలియన్ డాలర్ ప్రశ్నే. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవనే చెప్పాలి. కొంతలో కొంత సినిమాటోగ్రఫి బాగుంది. చాలా వరకు సన్నివేశాలను బాగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ గోల గోలగా ఉంటుంది. ఎడిటర్ పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తుంది. సన్నివేశాలను కూర్పు చేయడానికి ఎంత కష్టపడ్డారో సినిమా ఫ్లోను చూస్తే అర్ధమవుతుంది. ఆడియన్స్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండటమే మంచిదనేది సూచన, సలహా. దాంతో డబ్బు మాత్రమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. సిగ్మా సినిమా విషయంలో బీ కేర్ ఫుల్.


Oct 02, 2026 Read Review
Tupaki
Tupaki Website
4

Below Average

Sigma Movie Review

విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మ...

విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు సంజయ్.


హీరో-విలన్ల మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించదు. చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఉంటుంది తప్ప.. కథ ముందుకే కదలదు. హీరో హీరోయిన్ల ట్రాక్ అయితే అసలెందుకు పెట్టారో అర్థం కాదు. సందీప్ కిషన్ గురు పాత్రలో బాగానే నటించాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ బాగానే ఉన్నా, కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల బీజీఎం చాలా చోట్ల అతిగా అనిపిస్తుంది. ఓవరాల్ గా జేసన్ సంజయ్ కి కావాల్సిన వనరులన్నీ బాగానే సమకూరినా.. బలహీనమైన స్క్రిప్ట్.. సాధారణమైన టేకింగ్ తో అన్నింటినీ వేస్ట్ చేశాడు. తన అనుభవలేమి అడుగడుగునా కనిపించింది. కొన్ని సీన్లు చూస్తే.. జేసన్ ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదనిపిస్తుంది. చివరగా ‘సిగ్మా’.. ఆసక్తి లేని క్యాట్ అండ్ మౌస్ గేమ్!


Oct 02, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Sigma Movie Review

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సినిమా ఆరంభం లో...

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. 


సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను తీసుకోవడం పర్వాలేదు కానీ, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం బిగ్ మైనస్ అయ్యింది. సినిమా ఆరంభమే డల్ గా ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ ట్రాక్ లు కూడా ఎలాంటి సోల్ లేకుండా కనిపిస్తాయి.


ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘సిగ్మా’ ఒక బోరింగ్ యాక్షన్ ట్రీట్ గా మిగిలిపోయింది. హీరో సందీప్ కిషన్ తన వల్ల అయ్యినది అంతా ఈ సినిమా కోసం పెట్టేసాడు. తన హార్డ్ వర్క్, సిన్సియార్టీ ఇందులో కనిపిస్తుంది. కానీ జాసన్ కథా, కథనాల్లోనే చాలా బలహీనత ఉంది. సో హీరో ఆకట్టుకున్నా దర్శకుడు పనితనం ఇందులో డిజప్పాయింట్ చేస్తుంది. సో ఈ సినిమా ఆకట్టుకోదు.


Oct 02, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Sigma movie review

‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి...

‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి పొరబాట్లు కనిపించవు. కానీ రైటింగ్‌లో మాత్రం చాలా వరకు వీక్ అనిపిస్తుంది. జాసన్ సంజయ్.. కథని సరిగ్గా రాసుకోలేకపోయాడని అర్థం అవుతోంది. ఎమోషన్స్, లాజిక్స్ ఇలా అన్నింటినీ గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది.


ఫస్ట్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క కొత్త సీన్ కూడా కనిపించదు. ఇక సెకండాఫ్ ఆరంభమే.. ముగింపు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ప్రీ క్లైమాక్స్‌కే థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఎండింగ్‌ ఏంటో తెలిసిపోతుంది. అలా ఎక్కడా కూడా వావ్ అనిపించే మూమెంట్స్ కనిపించకపోవడంతే.. నీరసంగా, నిదానంగా అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌ గా సిగ్మా కొంత వరకు మెప్పిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. తమన్ పాటల కంటే ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. మిగిలిని అన్ని డిపార్ట్మెంట్స్ పర్లేదనిపిస్తాయి. చివరగా ‘సిగ్మా’ మీద భారీ అంచనాలు పెట్టుకోకుండా.. టైం పాస్ కోసం వస్తే.. పాటలు, ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్ అంటూ ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసే అవకాశం ఉంది. ఇక సందీప్ కిషన్ తన వంతుగా ప్రయత్నించినా.. జాసన్ సంజయ్ రైటింగ్ మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు.


Oct 03, 2026 Read Review

Public Reviews

3 Avg: 3.0/10
B
Baswaraj Students & Youth
2

Bad

Sigma movie review

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.total story and movie is an outdated, rehashed concept that South Indian cine...

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.


total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescue a completely flat screenplay devoid of emotional depth. Faria Abdullah is reduced to a irrelevant placeholder, while the high-pitched background score and pacing drag only amplify the headaches.


It is baffling how Lyca Productions burned millions on such a hollow script. A big brand name and star lineage are no longer enough to sell lazy storytelling to today's audience. With his good looks, Jason Sanjay should honestly reconsider acting over directing.

Oct 03, 2026
T
Talari Snehalatha IT Employee
4

Below Average

Sigma movie review

Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీ...

Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!


1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ముందు ఏదీ వర్కౌట్ అవ్వలేదు.


Lyca వాళ్ళు అసలు ఈ రొటీన్ స్టోరీలో ఏం చూసి అన్ని కోట్లు వాటర్ లా ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు! బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది తీసినా చూడటానికి యూత్ ఏమీ పిచ్చివాళ్లు కాదు. జేసన్ సంజయ్ కి మంచి లుక్స్ ఉన్నాయి, కాబట్టి డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే బెటర్!

Oct 03, 2026
A
Arige Srikanth Private Employee
3

Not Good

Sigma movie review

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి...

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..


1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి విపరీతంగా బోర్ కొట్టింది. సీన్ సీన్‌కి ల్యాగ్ పెరిగిపోతుంటే ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశా.


అసలు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ ఎలా ఒకే చేశాడో అర్థం కాలేదు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ గోలగా ఉంది. జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా కంప్లీట్ ఫ్లాప్... ఆయన యాక్టింగ్‌లో ట్రై చేయడం బెటర్! మీ మనీ, టైం సేవ్ చేసుకోవాలంటే థియేటర్‌ వైపు వెళ్లకపోవడమే బెటర్.

Oct 03, 2026

About This Movie

Story : 

కథ విషయానికి వస్తే... వైజాగ్ కి చెందిన గురు (సందీప్ కిషన్) తన తండ్రి చేసిన అప్పుల్ని తీర్చడానికి రకరకాల పనులు చేస్తూ, తల్లికి ఇష్టమైన ఒక హోమ్ లైబ్రరీని కూడా నడుపుతుంటాడు. అలాగే ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతూ, ఆ ఛానల్ కి వాయిస్ ఓవర్ కావాలని ఆర్జే సామ్ (ఫరియా)తో వర్క్ చేస్తుంటాడు. అలా గురు - సామ్ మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా, అప్పుల్ని తీర్చే క్రమంలో ఓ జూదంలో సంపాదించిన డబ్బులు కూడా పోగొట్టుకుంటాడు. అయితే దీన్ని అక్రమంగా నడిపిస్తున్న వారి నుండి గురుకి ఓ పెన్ డ్రైవ్ అండ్ కీ దొరుకుతుంది. దాని వల్ల సీజర్ అనే ప్రమాదకరమైన డ్రగ్ గురించి తెలుస్తుంది. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని గురు  విన్సెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కానీ దీని వెనకాల ఉంది ఇంటర్నేషనల్ స్మగ్లర్ కోట్లపాటి వెంకట రెడ్డి (సంపత్ రాజ్) అని తర్వాత తెలుస్తుంది. మరి గురుకి అనుకున్న విధంగా డబ్బు దొరికిందా? ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ ఏం చేసాడు? ఫైనల్ గా అప్పులు తీర్చేసాడా? లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

ముందుగా ఈ సిగ్మా అనే టైటిల్ పెట్టడం వల్ల, అండ్ టీజర్, ట్రైలర్స్ మేకింగ్ క్వాలిటీ హై స్టాండర్డ్ లో ఉండడం వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. పైగా దర్శకుడు దళపతి విజయ్ కొడుకు కాబట్టి సౌత్ ఫిల్మ్ లవర్స్ లో  అంచనాలు ఎక్కువయ్యాయి. ఇక సినిమాను చూస్తే సందీప్ కిషన్, జాసన్ సంజయ్ ను పూర్తిగా నమ్మి, సిన్సియర్ గా సినిమాకోసం కష్టపడ్డాడని తెలుస్తుంది. యాక్టింగ్ పరంగానే కాకుండా, పలు యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా సందీప్ బాగా చేసాడు. ఇక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాకి పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. పైగా అంత ఇంపార్టెన్స్ కూడా లేదు. ఇక విలన్ గా సంపత్ రాజ్ కు స్ట్రాంగ్ రోల్ దక్కింది. మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు. 

 

Minus Points :

అయితే టైటిల్ ని చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి సహనానికి పరీక్ష పెట్టినట్టయింది. సినిమాలో ఎలాంటి కొత్తదనం లేని కథ, కథనాలతో దర్శకుడు సంజయ్ వచ్చాడు. స్టోరీ పాయింట్ ఒకే. కానీ దాన్ని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసేటపుడు ఎంత ఎంటర్టైనింగ్ గా చూపించమనదే లెక్కలోకి వస్తుంది. కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వరకు పక్కన బెడితే, కనీసం నెక్స్ట్ సీన్ పై ఉత్కంఠ కూడా కలగదు. సినిమా స్టార్టింగ్ నుండే డల్ గా తీసుకుపోయిన డైరెక్టర్ ఇంటర్వెల్ కి గాని తెలుకోలేదు. పోనీ సెకండ్ హాఫ్ అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే.. ఓ రెండు ట్విస్ట్ లు మినహా ఏమి ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ తో ట్రాక్ కి అస్సలు కనెక్ట్ అవలేం. కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఇరికించాలని చూసినా, వాటికీ ఆడియన్స్ కనెక్ట్ ఎవరు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ లో డెప్త్ ఉండదు. పైగా కొన్ని ఇల్లాజికల్ సీన్స్ సినిమా ఫ్లోని డిస్ట్రబ్ చేసాయి. కొన్ని సీన్స్ ని రిపీట్ చేయడం సెట్ అవలేదు. కనీసం క్లైమాక్స్ నైనా నీట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే డీసెంట్ ఫీల్ వచ్చేదేమో. 

 

Technical Values : 
 
ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. కాకపోతే సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టినట్టు అనిపించదు. ఇక తెలుగు వెర్షన్ డబ్బింగ్ మైనస్ పాయింట్. అంత పర్ఫెక్ట్ గా ఏం చేయలేదు. అలాగే VFX వర్క్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. థమన్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫి అంతగా లేదు. ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అనవసరమైన ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఫైనల్ గా డైరెక్టర్ జాసన్ సంజయ్ కథకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, దర్శకుడిగా విఫలమయ్యాడు. 

 

Final Review :
 
ఓవరాల్ గా "సిగ్మా" ఒక పేలవమైన కథ, స్క్రీన్ ప్లే వల్ల, ఒక బోరింగ్ నార్మల్ ఆక్షన్ డ్రామాగా ఆకట్టుకోలేకపోతుంది. అయితే సందీప్ కిషన్ ఎఫర్ట్స్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం రెగ్యులర్ మూవీ లవర్స్ టైంపాస్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. అంతే గాని కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. మరి థియేటర్లో ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి.

Review Statistics

3.7
Overall Rating
Avg. of all reviews
14
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
3.9/10
Public
3.0/10
Why MRO?