సింగ్ గీతం (Sing Geetham)
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మూవీ "సింగ్ గీతం". ఆయన 94 ఏళ్ళ వయసులో డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించగా, జూన్ 12న థియేటర్లలో విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about సింగ్ గీతం (Sing Geetham)
Media Reviews
18 Avg: 6.8/10Super Hit
Sing Geetham Movie Review
హలొ బాసు.. సింగ్ గీతం సినిమా గురించి చెప్పాలంటే... సినిమా చాలా బాగుంది బాసు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకెళ్లినట్టనిపిస్తుంది బాసు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అంతా సెట్టయిపోతుంది. అది కూడా సినిమాలో చాలా వరకు మాటలతో కాకుండా పాటలతోనే సినిమా ఉంటుంది. ఇక సినిమా చూసాక నాకేమైంది అన్నట్టు అనిపి...
హలొ బాసు.. సింగ్ గీతం సినిమా గురించి చెప్పాలంటే... సినిమా చాలా బాగుంది బాసు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకెళ్లినట్టనిపిస్తుంది బాసు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అంతా సెట్టయిపోతుంది. అది కూడా సినిమాలో చాలా వరకు మాటలతో కాకుండా పాటలతోనే సినిమా ఉంటుంది. ఇక సినిమా చూసాక నాకేమైంది అన్నట్టు అనిపిస్తుందేమో జనాలకు... కానీ సినిమా చూసాక ఎంటర్టైన్ అవ్వడం ఖాయం.
అండ్ సింగీతం గారు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అనిపించినా ఈ సినిమా చూస్తే గ్యాప్ మొత్తం ఫిల్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ సినిమాలో అందరూ నటీనటులు బాగా పెర్ఫార్మ్ చేసారు. సింగీతం శ్రీనివాసరావ్ గారి డైరెక్షన్ గురించి చెప్పేంత అనుభవం, అర్హత లేదు గాని, సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేసారు ఆయన. అండ్ దేవిశ్రీ ప్రసాద్ నాలుగు సినిమాలకు చేయాల్సిన పనిని ఈ సినిమా ఒక్కదానికి చేసినట్టు వర్క్ చేసాడు. ఇక ఇలాంటి కైండ్ అఫ్ సినిమాను ఎవరూ ఇప్పటివరకు టచ్ చేయలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా సింగ్ గీతం సినిమా చాలా బాగుంది. నా రేటింగ్ 4/5
Hit
Sing Geetham Movie Review
చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్ గా భయపడ్డ! ఈ పాడడం అది వర్కౌట్ అవుతుందా అని! బట్ ఎస్ వర్కౌట్ అయింది. అండ్ ట్రైలర్ లో రివీల్ చేయని ప...
చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్ గా భయపడ్డ! ఈ పాడడం అది వర్కౌట్ అవుతుందా అని! బట్ ఎస్ వర్కౌట్ అయింది. అండ్ ట్రైలర్ లో రివీల్ చేయని పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి స్క్రీన్ మీద థ్రిల్ నిస్తాయి. ఓవరాల్ గా సినిమాలో ఎక్కడా ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. మేకింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ కాన్సెప్ట్ సూపర్ అసలు.
అండ్ జంబలకడి పంబలా కాన్సెప్ట్ ఉంది. కాకపోతే కొంతమందికి లిప్ సింక్ కుదరలేదు. అండ్ సినిమాలో అయితే అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. డిఎస్పీ గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యూనిక్ ఉన్న సినిమా. మంచి మెస్సేజ్ ఉన్న సినిమా అందరూ హ్యాపీగా చుడండి.
Hit
Sing Geetham movie Review
#SingGeetham సింగ్..గీతం : రేటింగ్ కు దూరంసింగీతం సృజన....నాగ్ అశ్విన్ కృషి....వైజయంతీ అభిరుచిమంచి విషయాల మీద మంచి సినిమాలు రావు అని..చెత్త సినిమాల మీద సదా సణిగేవారంతా..ఈ సినిమా చూడండి.నోట్ : కాస్త ఓపిక..అభిరుచి వుండాలి.ఇది భూమిలో వున్న బంగారం కోసం ఆశపడి భూమి పై వున్న పచ్చటి బంగారాన్ని పాడుచేసు...
#SingGeetham సింగ్..గీతం : రేటింగ్ కు దూరం
సింగీతం సృజన....నాగ్ అశ్విన్ కృషి....వైజయంతీ అభిరుచి
మంచి విషయాల మీద మంచి సినిమాలు రావు అని..
చెత్త సినిమాల మీద సదా సణిగేవారంతా..
ఈ సినిమా చూడండి.
నోట్ : కాస్త ఓపిక..అభిరుచి వుండాలి.
ఇది భూమిలో వున్న బంగారం కోసం ఆశపడి భూమి పై వున్న పచ్చటి బంగారాన్ని పాడుచేసుకున్న ఊరి కథ...
పట్టిందల్లా బంగారం అయితే బతుకు ఎంత దారుణంగా వుంటుందో
చెప్పిన ‘మిడాస్ టచ్’ మనుషుల వ్యధ...
బంగారం సంగతి అలా వుంచితే, మైనింగ్ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వసాన్ని పరోక్షంగా తెలియ చెప్పిన వ్యవస్థ వైనం.
Above Average
Sing Geetham movie Review
#SingGeetham Unique concept with its ups and downs, but deserves a try!A genuinely unique attempt that takes time to find its footing. The musical aspect works initially but starts to feel stretched in the middle portions, while the comedy only lands in bits. However, the film’s core lies in the emo...
#SingGeetham Unique concept with its ups and downs, but deserves a try!
A genuinely unique attempt that takes time to find its footing. The musical aspect works initially but starts to feel stretched in the middle portions, while the comedy only lands in bits. However, the film’s core lies in the emotional second half, and from the flashback till the climax, the emotional payoffs land well.
DSP’s music is the film’s biggest backbone and this is his best work in recent times. Kudos to Singeetham Srinivasa Rao and the Vyjayanthi team for attempting an unconventional concept like this.
May not be everyone’s cup of tea, but its uniqueness and emotional payoffs make it a decent watch that deserves a try.
Rating: 2.75/5
Hit
Sing Geetham movie Review
సోషియో ఫాంటసీ మూవీస్ తెలుగులో కొత్తేమీ కాదు. ఈ సింగ్ గీతం సినిమా కూడా అలాంటిదే! సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) మొదటి నుండి కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలని తాపత్రయపడే వ్యక్తి. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ సినిమాను...
సోషియో ఫాంటసీ మూవీస్ తెలుగులో కొత్తేమీ కాదు. ఈ సింగ్ గీతం సినిమా కూడా అలాంటిదే! సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) మొదటి నుండి కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలని తాపత్రయపడే వ్యక్తి. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ సినిమాను కేవలం ప్రయోగాత్మకంగానే కాకుండా ప్రయోజనాత్మకంగానూ రూపొందించే ప్రయత్నం చేశారు. ఇది అభినందించాల్సిన విషయం.
ఇక భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని కాపాడాలని, దాన్ని కొల్లగొట్టి బంగారం సంపాదించినా ఉపయోగం ఉండదని ఈ సినిమా ద్వారా తెలిపారు. తాను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలనే వరం ఇవ్వమని ఓ అత్యాశపరుడు దేవుడిని కోరుకోవడం, దాని పర్యావసానంకు సంబంధించిన కథ చాలా మంది చిన్నప్పుడు చదివి ఉంటారు. అదే ఇందులోనూ చూపించారు. పోగొట్టుకుంది రాబట్టు కోవాలంటే... పడగొట్టింది నిలబెట్టాలనే సందేశంతో సినిమా సాగింది. సినిమా కంటెంట్ బాగానే ఉన్నా, సామాన్య ప్రేక్షకుడు కోరుకునే వినోదాన్ని 'సింగ్ గీతం' పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వచ్చిన ఆడియన్స్ నిరాశకు గురికావటం ఖాయం. అయితే... పర్యావరణ హితాన్ని కాంక్షించే వారి మనసుల్ని ఈ సినిమా మెప్పిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ట్యాగ్ లైన్: సందేశాత్మకం... సింగ్ గీతం.
Super Hit
Sing geetham movie Review
సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం రావట్లేదు. అందుకే లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమాలు ఎలా తీయాలో నేర్పించినట్టనిపించింది. సింపుల్ స...
సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం రావట్లేదు. అందుకే లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమాలు ఎలా తీయాలో నేర్పించినట్టనిపించింది. సింపుల్ స్టోరీయే అయినా డైరెక్టర్ తన విజన్ తో మనకి బాగా అర్ధమయ్యేట్టు బాగాచూపించారు. అండ్ సినిమాలో ఎక్కడా కూడా ఒక సెకండ్ వెస్ట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు బెస్ట్ అనిపించింది ఈ సినిమా.
అండ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఎస్పీ. సీరియస్లి బ్రో సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బేసిగ్గా గోల్డ్ మైన్, చెట్టు సెంటిమెంట్ అంతా ఒకే గాని, దానికి మూలం, ఒక మనిషి ఆశ అత్యాశగా ఎప్ప్పుడు మారుతదో అప్పుడే నెక్స్ట్ వచ్చే తరాలు ఎంత నాశనమైతాయో సినిమాలో బాగా చూపించిన్రు. ఓవరాల్ గా ఇదంతా సింగీతం గారి మ్యాజిక్కె. ఎందుకంటే చాలా సినిమాలు రిస్క్ చేయకుండా, కొత్తదనం లేకుండా సేఫ్ జోన్ లో ఉండాలని మేకర్స్ ట్రై చేస్తారు. వాళ్లకి ఈ సినిమా చూపించాలి. అండ్ ఓవరాల్ గా సింగీతం సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకింత బాగా నచ్చుతదని.. సింగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో తెల్వదు గాని, ఈ సినిమాకైతే హ్యాపీగా వెళ్లిపోవచ్చు.
Super Hit
Sing geetham movie Review
ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని అభినందించాలి. ఇక సినిమాలో చెప్పినట్టు కుబేరపురంలో మాటలు పాటలుగా మారే శాపం నుండి ఊరి మొత్తం ఎలా బైటప...
ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని అభినందించాలి. ఇక సినిమాలో చెప్పినట్టు కుబేరపురంలో మాటలు పాటలుగా మారే శాపం నుండి ఊరి మొత్తం ఎలా బైటపడిందన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇక సింగీతం గారు ఈ సినిమాని చివరి వరకు ఒక అందమైన కథలా ప్రెజెంట్ చేసారు.
అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ హవర్ అదిరిపోయింది. అండ్ ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇక సినిమాలో కొంతమంది ఎంటర్టైన్మెంట్ తగ్గిందని, బోరింగ్ గా ఉందని అనుకోవచ్చు. బట్ సింగీతం మూవీస్ అన్ని అలా డీసెంట్ గానే ఉంటాయి. ఓవర్ గా అస్సలుండవ్. అండ్ సింగీతం గారు మళ్లీ మ్యాజిక్ చెసార్రా అంటూ మూవీ లవర్స్ హ్యాపీగా బైటికొచ్చారు. అండ్ సినిమాలో లాస్ట్ లో ఒక ఫేమస్ ఆక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దానికి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్లీ సింగ్ గీతం సినిమాకి ఫ్యామిలీని, స్పెషల్లీ కిడ్స్ ని తప్పకుండ థియేటర్ కి తీసుకెళ్లండి.
Hit
Sing geetham movie review
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం...
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం.
సినిమాలో ఓవరాల్ గా చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. అంటూ ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం గారు. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం. ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!
Hit
Sing geetham movie Review
మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. దర్శకుడిగా ఎప్పుడూ అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో వచ్చే సింగీతం శ్రీనివాస రావు మరోసారి సరికొత్త కాన్సెప్ట...
మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. దర్శకుడిగా ఎప్పుడూ అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో వచ్చే సింగీతం శ్రీనివాస రావు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో
మాటల బదులు పాటలు, పాట రూపంలో ప్రతి మాట - ఇదేనా 'సింగ్ గీతం'? కథలో ఉన్నది అంతేనా? అంటే... అసలు కాదు. ప్రేక్షకులకు అదొక సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ అంతే! ఆ పాటల మాటున మంచి ఎమోషన్ ఉంది. అంతర్లీనంగా ప్రకృతి గురించి ప్రజలకు ఇచ్చిన ఓ సందేశం ఉంది.
క్రియేటివిటీకి వయసుతో సంబంధం లేదని సింగీతం శ్రీనివాస రావు నిరూపించిన సినిమా 'సింగ్ గీతం'. కమల్ హాసన్ హీరోగా సినిమా తీయాలని సుమారు 40 ఏళ్ళ క్రితం ఈ కథ రాశారట. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ... ప్రేక్షకులందరికీ కొత్తగా అనిపించే కాన్సెప్ట్ 'సింగ్ గీతం'. ఇందులో కొత్త కాన్సెప్ట్ ఒక్కటే కాదు... రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో మేజిక్ చేసిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. హృదయానికి హత్తుకునే క్లైమాక్స్ ఉంది. ఇక కమర్షియల్ సినిమాలు అలవాటు పడిన, వాటిని ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. కానీ... థియేటర్లలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందీ సినిమా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.
Hit
Sing Geetham movie review
భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే...
భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం చాలా అరుదుగా కనిపించే ప్రయత్నం.
ఇక సినిమాకు DSP సంగీతం కథలో భాగమైపోతుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు, లాజిక్ గ్యాప్స్ ఉన్నా, దర్శకుడి విజన్ వాటిని అధిగమిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ కొత్త కథనాలను, సృజనాత్మక ఆలోచనలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా చూడదగ్గ చిత్రం. ఓవరాల్ గా ఈ సింగ్ గీతం మూవీ ఓ సాహసం, ఓ ప్రయోగం ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయాల్సిన సినిమాటిక్ జర్నీ. అయితే కొన్ని సినిమాలను రేటింగ్ లతో కొలవలేం. ఇది కూడా అంతే. కానీ దాదాపు క్లాసిక్ గానే ఈ సినిమాని భావించొచ్చు.
Above Average
Sing geetham movie Review
తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాల దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల డైరెక్ట్ చేసిన మూవీ "సింగ్ గీతం" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సింగ్ గీతం" సాధారణ సినిమా కాదు. ఇది ఒక మ్యూజికల్ ఫాంటసీ. ఇందులో పాత్రలు సంభాషణలు చెప్పవు. వారి మాటలే పాటలుగా మారుతాయి. హాలీవుడ్,...
తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాల దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల డైరెక్ట్ చేసిన మూవీ "సింగ్ గీతం" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సింగ్ గీతం" సాధారణ సినిమా కాదు. ఇది ఒక మ్యూజికల్ ఫాంటసీ. ఇందులో పాత్రలు సంభాషణలు చెప్పవు. వారి మాటలే పాటలుగా మారుతాయి. హాలీవుడ్, యూరోపియన్ సినిమాల్లో కనిపించే ఒపెరా శైలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. సినిమా మొదటి అరగంట ప్రేక్షకుడికి కొంత కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మనం అలవాటు పడిన కథన శైలికి ఇది పూర్తిగా భిన్నం. మొదట్లో ఈ ఫార్మాట్‌కు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ కథలోకి ప్రేక్షకుడు ప్రవేశించిన తర్వాత సినిమా తన ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్తుంది.
ఇక ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు వినూత్న ఆలోచన, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒపెరా శైలిలో తెరకెక్కిన ప్రత్యేక కథనం, అహిల్యా బమ్రూ నటన ప్రకృతి పరిరక్షణపై బలమైన సందేశం క్లైమాక్స్‌లో పండిన భావోద్వేగాలు అద్భుతమైన విజువల్స్, సినిమాటోగ్రఫీ అన్ని బలమయ్యాయి. అయితే బలహీనతల గురించి చెప్పుకుంటే... అందరికీ కనెక్ట్ కాని నరేషన్ స్టైల్ ఫస్టాఫ్ లో కొంత సాగదీత చాలా సింపుల్ గా ఉన్న ప్రధాన కథ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా నచ్చకపోవచ్చు.
ఓవరాల్ గా సింగీతం శ్రీనివాసరావు ప్యాషన్, నాగ్ అశ్విన్ విజన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలిసి రూపొందించిన అరుదైన సినీ అనుభూతి "సింగ్ గీతం". తెలుగు తెరపై ఇలాంటి ప్రయత్నాలు రావడం నిజంగా ఆనందించాల్సిన విషయం.
Hit
Sing geetham movie review
లెజెండరీ దర్శకుడు, ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో మాటలు అన్ని పాటలుగా పాడతారు, మాట్లాడుకోవడం తక్కువ అంతా పాడుకోవడమే, మొదటిసారి ప్రయోగం చేస్తున్నాము అ...
లెజెండరీ దర్శకుడు, ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో మాటలు అన్ని పాటలుగా పాడతారు, మాట్లాడుకోవడం తక్కువ అంతా పాడుకోవడమే, మొదటిసారి ప్రయోగం చేస్తున్నాము అని చెప్పడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సింగీతం కథ, మాటలు, కథనం రాయించి, ప్రీ ప్రొడక్షన్ చేయించి, వర్క్ షాప్ చేయించి నాగ్ అశ్విన్ చేతిలో ఈ సినిమా బాధ్యతలు పెట్టి ఆయన వీడియో కాల్స్ లో పర్యవేక్షణ, దర్శకత్వం చేసారని మూవీ యూనిట్ తెలిపారు.
అయితే రెగ్యులర్ కథని సింగీతం శ్రీనివాసరావు ఆయన మార్క్ కి తగ్గట్టు కొత్తగా మార్చి మంచి డైలాగ్స్ తో ఓ మెసేజ్ తో బాగా రాసుకున్నారు. కానీ కథనం పై మేకర్స్ మరింత దృష్టి పెట్టి ఉంటె బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. మొత్తంగా ‘సింగ్ గీతం’ సినిమా మనిషి ఆశ, పర్యావరణం అనే మెసేజ్ ను మ్యూజికల్ కామెడీగా ఓ ఊర్లో జరిగిన కథగా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
Above Average
Sing Geetham Movie Review
తెలుగు సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన సినిమా సింగ్ గీతం. కమల్ హాసన్ తో చేయాలనుకున్న ఈ సినిమాని ఇప్పుడు కొత్త వాళ్లతో రూపొందించారు. మాటలు పాటలుగా మారితే జనం పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకృతిని, చెట్లని రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీని తెరకెక్కించ...
తెలుగు సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన సినిమా సింగ్ గీతం. కమల్ హాసన్ తో చేయాలనుకున్న ఈ సినిమాని ఇప్పుడు కొత్త వాళ్లతో రూపొందించారు. మాటలు పాటలుగా మారితే జనం పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకృతిని, చెట్లని రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. మైనింగ్ పేరుతో చెట్లని కొట్టడం, ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల వచ్చే అనర్థాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు సింగీతం. దాన్ని సరదాగా, ఫన్నీగా, కొంత ఎమోషనల్‌గా, ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు.
అయితే కథనం పరంగా సినిమా సాగే తీరు మాత్రం కొంత సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. పాటలుగా మాట్లాడే తీరు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంది. బాగా సాగదీసినట్టుగా ఉంటుంది. చాలా సీన్లు లాజిక్ లెస్‌గా ఉంటాయి. సహజత్వం మిస్ అయ్యింది. ఈ సినిమా విషయంలో అభినందించే విషయం ఏంటంటే.. 95ఏళ్ల వయసులో సింగీతం చేసిన ప్రయత్నం. కొత్త ప్రయత్నానికి అభినందనలు చెప్పొచ్చు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన లెజెండ్ ఆయన. ఆడియెన్స్ కోణంలో, కమర్షియల్ యాంగిల్‌లో చూస్తే ఈ మూవీ ఆకట్టుకోకపోయినా, ఒక కొత్త కథని మనకు చూపించే విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. ఓవరాల్ గా సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో కొత్త ప్రయత్నం. ఆయనపై అభిమానంతో చూస్తే ఓకే, ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ లో చూస్తే డిజప్పాయింట్ తప్పదు.
Average
Sing Geetham movie Review
94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారతీయ సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంచుకొనే సినిమాలు అందించారు. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన సింగ్ గీతం మూవీ ఆడియన్స్ ముందుకు రాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే కాగితం మీద రాసుకోవడానికి బాగుందనిపించ...
94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారతీయ సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంచుకొనే సినిమాలు అందించారు. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన సింగ్ గీతం మూవీ ఆడియన్స్ ముందుకు రాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే కాగితం మీద రాసుకోవడానికి బాగుందనిపించే కథ అయినప్పటికీ.. తెర మీదకు వచ్చే సరికి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఎమోషనల్ డ్రామాగా, సెంటిమెంట్ సినిమానా, కామెడీ ప్రధానంగా సాగే సినిమానా అనే విషయాన్ని తేల్చుకోలేక సినిమా మొత్తం గందరగోళంగా మార్చారు. మాటలు కాకుండా పాటలు అనే కాన్సెప్ట్‌తో సినిమాను నడపడం పూర్తిగా బెడిసి కొట్టింది. ఇక ఈ సినిమాలో విషయం లేదని ఫిక్స్ అయ్యే టైమ్‌లో ముఖ్యంగా 10, 15 నిమిషాలు ఎమోషనల్ గా చెప్పిన కథతో అప్పటి వరకు వేగిన నసతో కొంత ఊరట కలిగించేలా ఉంటుంది. టోటల్ గా సింగ్ గీతం ప్రయోగం వికటించిందనే చెప్పాలి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అంతగా లేకపోయినా, కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషనల్ కంటెంట్ బాగా ఎలివేట్ చేశారు. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. కానీ కథ, కథనాల విషయంలో ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమా చూడటానికి ఒకే ఒక కారణం సింగీతం శ్రీనివాసరావు గారిపై ఉన్న అభిమానమే తప్పా.. కంటెంట్ గురించి, ఇతర విషయాల గురించి వెళితే నిరాశపడే అవకాశం ఉంది. ఓన్లీ మ్యూజిక్.. నో మ్యాజిక్.
Above Average
Sing Geetham movie review
సింగీతం శ్రీనివాసరావు చాలా ఏళ్ళ తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా సింగ్ గీతం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఫాంటసీ టచ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎంటెర్టైన్మెంట్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే సింగీతం వారి కాన్సెప్ట్ తో పాటు దర్శకత్వం డీసెంట్...
సింగీతం శ్రీనివాసరావు చాలా ఏళ్ళ తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా సింగ్ గీతం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఫాంటసీ టచ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎంటెర్టైన్మెంట్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే సింగీతం వారి కాన్సెప్ట్ తో పాటు దర్శకత్వం డీసెంట్ గా ఉంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాత సినిమాలు గుర్తు రాక మానవు. ముఖ్యంగా జంబలకడి పంబ లాంటి పేరడీ కాన్సెప్ట్ మూవీ సీన్స్ గుర్తొస్తాయి.
సినిమాలో చాలా భాగం పాటలతో కూడిన డైలాగ్స్ ఉండడం మంచి కాన్సెప్ట్. కానీ ఇది ఎంత వరకు ఆడియన్స్ కి నచ్చుతుందో చెప్పలేం. బట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇష్టపడే ఆడియన్స్ కి, అండ్ సింగీతం డైరెక్షన్ స్కిల్స్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఓవరాల్ గా ఒక వర్గం ఆడియన్స్ ఇష్టపడినా కూడా, మేకర్స్ పనితనాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.
Hit
Sing Geetham movie Review
At the age of 94, Singeetham Srinivasa Rao returns with Sing Geetham, a dream project he has carried with him for nearly 40 years. Produced by Nag Ashwin under Vyjayanthi Movies and Swapna Cinema, the film promised a concept as unique as the filmmaker himself through promotional content.PositivesSi...
At the age of 94, Singeetham Srinivasa Rao returns with Sing Geetham, a dream project he has carried with him for nearly 40 years. Produced by Nag Ashwin under Vyjayanthi Movies and Swapna Cinema, the film promised a concept as unique as the filmmaker himself through promotional content.
Positives
Singeetham’s Vision and Fresh Concept
DSP’s Songs & Background Score
Last Act
Socially Relevant Theme
Negatives
Prolonged Dialogue-Song parts in the First Half
Leisurely Pace In Pre-Interval Episodes
Not-so-amusing humour
VFX In parts
rating : 3.5
Above Average
Sing Geetham movie review
ట్రెండ్ కి భిన్నంగా ఆలోచించే దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ "సింగ్ గీతం". తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సింగ్ గీతం మూవీ ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్...
ట్రెండ్ కి భిన్నంగా ఆలోచించే దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ "సింగ్ గీతం". తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సింగ్ గీతం మూవీ ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం.
సింగ్ గీతం సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం చాలా అరుదుగా కనిపించే ప్రయత్నం. DSP సంగీతం కథలో భాగమైపోతుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు, లాజిక్ గ్యాప్స్ ఉన్నా, దర్శకుడి విజన్ వాటిని అధిగమిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ కొత్త కథనాలను, సృజనాత్మక ఆలోచనలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా చూడదగ్గ చిత్రం.
Hit
Sing geetham movie Review
లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగ చిత్రమే ‘సింగ్ గీతం’. తన 90ల వయస్సులో కూడా దర్శకత్వం మీద ఎంతో ఫ్యాషన్ తో చేసిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ విజన్ కూడా తోడై తెరకెక్కిన ఈ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. సినిమా విషయానికి వస్తే.. మొత్తంగా ‘సింగ్ గీత...
లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగ చిత్రమే ‘సింగ్ గీతం’. తన 90ల వయస్సులో కూడా దర్శకత్వం మీద ఎంతో ఫ్యాషన్ తో చేసిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ విజన్ కూడా తోడై తెరకెక్కిన ఈ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. సినిమా విషయానికి వస్తే.. మొత్తంగా ‘సింగ్ గీతం’ అనే చిత్రం సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి మరో వినూత్న విజయ ప్రయత్నం. 40 ఏళ్ల కితమే తనకి వచ్చిన ఈ ఆలోచన ఇప్పటికీ మెప్పించే విధంగా ఉంది అంటే ఆయన ఏ రీతి దర్శకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక తనకి తగ్గట్టుగా పాటలు, సంగీతం ప్రధానంగా సాగిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పనితనం కూడా మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా మరింత ప్లస్ అయ్యాయి. చిన్నపాటి పొరపత్యాలు ఉన్నాయి కానీ వాటిని మిగతా అంశాలు కప్పేస్తాయి. సో సింగీతం గారి మార్క్ విజన్ తో కూడిన అందమైన చందమామ కథ లాంటి సినిమా చూడాలి అనుకుంటే ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి ధారాళంగా ఈ సినిమాని వీక్షించవచ్చు.
Public Reviews
4 Avg: 7.5/10Hit
Sing Geetham Review
Sing Geetham Movie that will creative thinking and decent movie lovers and also the people with cool and calmness that all the movie is goes in the type of some problems faced by the village people with that talks with an song it is an different type of thinking By Director Sing Geetham Srinivas Rao...
Sing Geetham Movie that will creative thinking and decent movie lovers and also the people with cool and calmness that all the movie is goes in the type of some problems faced by the village people with that talks with an song it is an different type of thinking By Director Sing Geetham Srinivas Rao, I recommend that who are ready to watch fresh and new ideas including story will deffinitely watch it.
Super Hit
Sing Geetham Movie Review
just Singeetham srinivasarao gari movies ante istham kabatti, trailer chudakunda, talk vinakunda "Sing - Geetham movie ki vellipoya. movie chusaka single word lo cheppalante movie awsome. maa friends ki normal ga anipinchindi movie. but nenu ayana old movies ki pedda fan ni. technical ga singeetham...
just Singeetham srinivasarao gari movies ante istham kabatti, trailer chudakunda, talk vinakunda "Sing - Geetham movie ki vellipoya. movie chusaka single word lo cheppalante movie awsome. maa friends ki normal ga anipinchindi movie. but nenu ayana old movies ki pedda fan ni. technical ga singeetham garini judge chesentha ledu naku.
movie maree entertaining ga ledu gani, decent watchable. but 40 years back lone singeetham srinivasarao garu anukunna concept ippati genration vallaki kooda advanced ga undi nacchutundante mamulu kadu. verevalla gurinchi kadu gani personal ga na rating 8/10.
Hit
Sing Geetham movie review
Singeetam Srinivasa Rao garu is one of those rare directors whose name alone is enough to get me into a theatre. While I haven't watched all his films, classics like Aditya 369, Bhairava Dweepam, and Mayuri made me a fan for life.And Sing-Geetham is yet another reminder of why he's a legend. At 94,...
Singeetam Srinivasa Rao garu is one of those rare directors whose name alone is enough to get me into a theatre. While I haven't watched all his films, classics like Aditya 369, Bhairava Dweepam, and Mayuri made me a fan for life.
And Sing-Geetham is yet another reminder of why he's a legend. At 94, delivering a film that's this entertaining, relatable, and emotionally satisfying is no small feat. I laughed throughout, and the climax hit me right in the feels. Not sure about everyone else, but I walked out with a smile on my face and a full heart. Hats off, sir!
Super Hit
Sing Geetham Movie Review
బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన "సింగ్ గీతం" సినిమా వస్తుందని తెలిసి, ఫస్ట్ డేనే నైట్ షోకి వెళ్ళిపోయా. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్...
బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన "సింగ్ గీతం" సినిమా వస్తుందని తెలిసి, ఫస్ట్ డేనే నైట్ షోకి వెళ్ళిపోయా. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అదుర్స్. ముందు నేను జస్ట్ డైరెక్టర్ కోసమే లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. అందుకే జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు అనిపించింది. సింగీతం గారి మూవీస్ గురించి ఐడియా ఉంది కాబట్టి, ఆయన తీస్తే ఎట్లా ఉంటదో ఇమాజిన్ చేసుకొనే చుసిన. కాబట్టి నాకు బాగా నచ్చింది.
నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కైతే అంత నచ్చలేదు. బికాస్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే ఒచ్చారు. ఎదో కొత్త కాన్సెప్ట్ అని ఒకే ఒకే అన్నట్టుందన్నారు. బట్ సినిమాలో నేచర్ ని నాశనం చేయొద్దు అంటూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ నాకు నచ్చింది. ఇదొక్కడానికి ఫస్ట్ నేను కనెక్ట్ అయిపోయా. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో లేదో తెల్వదు. అందుకే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ చూసేయండి. ఫైనల్ గా సింగీతం సార్ హ్యాట్సాఫ్ సార్...
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... బీహార్ జైలు నుండి విడుదలైన ప్రతాప్ మన్నెం (అయాన్) అనే యువకుడు తన తండ్రి ఆస్తి, స్థలాన్ని సొంతం చేసుకోవాలని "కుబేరపురం" అనే గ్రామానికి వస్తాడు. అయితే తన తండ్రికి చెందిన స్థలంలోనే బంగారు గనులున్నాయని గ్రహిస్తాడు. అలాగే ఆ ఊళ్ళో రేణు (షాలిని కొండెపూడి), తన తండ్రి బ్రహ్మయ్య (బెనర్జీ) కూడా బంగారు గనిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టును దాన్ని అమ్మలా చూసుకునే గౌరీ (అహిల్యా బమ్రూ) వల్ల ఆ ఊరిలో ఒక్కసారిగా పలు మార్పులు సంభవిస్తాయి. ఆ ఊళ్ళో జనాలు అంతా మాట్లాడ్డం మానేసి పాటలు పాడుతుంటారు. దీంతో ప్రతాప్ అనుకున్న పని కూడా జరగదు. దీంతో ఊరికి వచ్చిన ఆ సమస్యను క్లియర్ చేయడానికి ప్రతాప్ ప్రయత్నిస్తాడు. మరి ఆ ఊరి జనం అంతా మళ్ళీ మామూలు అయ్యారా లేదా? అసలు ఆ ఊరికొచ్చిన సమస్య ఏంటి? ఆ ఊరి గత చరిత్ర ఏంటి? ప్రతాప్ అనుకున్నది సాధించడా? లేదా? అనేది మిగిలిన కథ.
Plus Points :
ముందుగా "సింగ్ గీతం" మూవీని డైరెక్ట్ చేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావుని మెచ్చుకొని తీరాలి. ఒక డిఫరెంట్ సబ్జెక్టుని తీసుకుని నేటి జెనరేషన్ కి అనుకూలంగా తీయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని మరోసారి ప్రూవ్ అయింది. దానికి నాగ్ అశ్విన్ సహకారం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడై మంచి సినిమాని ఆడియన్స్ కి అందించడంలో దోహదపడ్డారు. అన్నిటికి మించి సింగీతం 94 ఏళ్ళ వయసులో మళ్ళీ ఓ సినిమాని డైరెక్ట్ చేయడం మాములు విషయం కాదు. బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లో ఈ ఏజ్ లో సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి ఈయనే కావచ్చు.
ఇక సినిమాలో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తన క్లాసిక్ విజన్ లో చెప్పాలనుకున్న పాయింట్ బాగా రాసుకున్నారు. ఇదే సింగీతం శ్రీనివాసరావు గారి క్లాసిక్ ఆలోచన టాలెంట్ కి నిదర్శనం. ఇక సినిమా చూసాక ఆడియన్స్ కి కూడా కథల విషయంలో సంగీతం అడ్వాన్స్డ్ థాట్స్, ఆయన డైరక్షన్ స్కిల్స్ పై మరింత రెస్పెక్ట్ పెరుగుతుంది. సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా, రియాలిటీ సిచ్యుయేషన్స్ కి దగ్గరగా చూపించడం బాగుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న మనుషులకి వాళ్ళ తప్పుల్ని గుర్తు చేస్తూ, చాలా మందికి తెలిసిన సబ్జెక్టునే డైరెక్టర్ తన కోణంలో చూపించాడు. ఇక సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా బిగ్ అడ్వాంటేజ్ అయింది. చాలా క్రియేటివ్ గా ఇందులో మ్యూజిక్ ఉంటుంది. అలాగే సినిమాలో నటీనటులందరూ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు.
Minuspoints :
అయితే ఈ సినిమాలో చాలా మంచి పాయింట్స్ ఉన్నా, కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా కొన్ని లూప్ హొల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చాలా సీన్స్ రియాలిటీకి దూరంగా ఉంటాయి. పైగా సినిమాలోని ఊళ్ళో ఫెసిలిటీస్ రియాలిటీకి దూరంగా లాజిక్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే ఇందులో చూపించే కొన్ని ఫాంటసీ కథలు కూడా మనం ఆల్రెడీ చూసినట్టు ఉంటాయి. సో ఫ్రెష్ స్టోరీస్ చూడాలనుకునే వారు కొంత డిస్సపాయింట్ అవొచ్చు. అలాగే దేవిశ్రీ మ్యూజిక్ బాగున్నా కొత్తగా అనిపించలేదు. సినిమా కూడా కాస్త ల్యాగ్ అయిందేమో అన్న ఫీల్ వస్తుంది.
Technical values :
ఇక టెక్నికల్ గా చూస్తే.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభకి తోడు నిర్మాత నాగ్ అశ్విన్ సహకారం ఎంతో హెల్ప్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే అనుకూర్ సి అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ ఉంది. కొన్ని ల్యాగ్ సీన్స్ తగ్గించాల్సింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా సింగీతం శ్రీనివాసరావు ఐడియాకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చాడు.
Final Review :
ఇక ఓవరాల్ గా సింగ్ గీతం సినిమా సింగీతం శ్రీనివాసరావు నుండి వచ్చిన మరో డిఫరెంట్ ప్రయోగాత్మక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక నాలుగు దశాబ్దాలక్రితమే ఆయన అనుకున్న ఈ కాన్సెప్ట్ ని ఇప్పటికీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉండడం విశేషం. అలాగే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, కూడా హైలెట్ అయింది. మొత్తంగా సింగీతం మార్క్ విజన్ తో కూడిన కథని థియేటర్లలో పేక్షకులు ఈ వీకెండ్ హ్యాపీగా చూసేయొచ్చు.