Register as a Reviewer
ది ప్యారడైజ్ (The Paradise)

ది ప్యారడైజ్ (The Paradise)

Upcoming Expected Release: 24 Sep 2026

"జడల్" గా బాక్స్ ఆఫీస్ పై "హడల్" పుట్టించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న న్యాచురల్ స్టార్...

Director: Srikanth Odela
Cast: Natural Star Nani, Mohan Babu, Kayadu Lohar, Sonali Kulkarni, Raghav Juyal & Others.

About This Movie

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "ది ప్యారడైజ్" (The Paradise) టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అఫిషియల్ టీజర్ ని మేకర్స్ కాసేపటికిందే సోషల్ మీడియాలో విడుదల చేయగా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. టీజర్ మొత్తం పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సాలిడ్ విజువల్స్ అండ్ బీజీఎమ్ తో నిండి ఉన్న ఈ టీజర్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

 

టీజర్ లో జడల్ పాత్రలో నాని నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తూ, ఆడియన్స్ ని తన పెర్ఫార్మెన్స్ తో కిక్ ఇచ్చేనందుకు రెడీ అవుతున్నాడు. టీజర్ ని గమనిస్తే... హైదరాబాద్ లో ప్యారడైజ్ వరల్డ్ లో తమ జాతి కోసం, వారి గుర్తింపు కోసం జడల్ చేసే పోరాటమే ఈ సినిమా కథగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohanbabu), రాఘవ్ జుయల్ బలమైన ప్రతినాయకులుగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

 

ఒక పవర్ ఫుల్ మాస్ టీజర్ గా కనిపిస్తున్న ఈ వీడియోలో లాస్ట్ లో నాని   రక్తసిక్తమైన బ్లేడ్ లతో దిష్టి పోవాలని చెప్పే డైలాగ్ కైతే అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్‌ తో ది ప్యారడైజ్ మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ (Anirudh) అల్టిమేట్ బీజీఎంతో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్ఎల్‌వి సినిమాస్ (LLV Cinemas) బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 24, 2026న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాతో నాని పాన్ ఇండియా సక్సెస్ అందుకుని నేషనల్ వైడ్ గా తన క్రేజ్ ను ఏ రేంజ్ లో పెంచుకుంటాడో చూడాలి.

Why MRO?