ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)
ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. కొన్ని కారణాల వల్ల కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయింది.
Available in:
Reviews
What critics and the public are saying about ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)
Media Reviews
10 Avg: 5.0/10Hit
Transfer Trimurthulu Movie Review
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలా...
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్, ఎమోషనల్ అంశాలకు ప్రయారిటీ ఇస్తారు, సినిమాలను చూస్తారనే భావనతో పదే పదే ఇలాంటి అంశాలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే దాన్ని అంతే రియాలిటీగా, కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. ఈ కథలో ఈ కేసుని బలవంతంగా పెట్టినట్టుగానే, ఇరికించినట్టుగానే ఉంటుంది. ప్రారంభం నుంచి సినిమా చాలా డ్రైగా, స్లోగా సాగుతుంది. వడ్డే నవీన్‌ని ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆయన పాత్రలో ఆ పవర్‌లేదు. పైగా బలమైన సీన్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఓవరాల్ గా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, రొటీన్, బోరింగ్, ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తో తీసిన మూవీ `ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు`. వడ్డే నవీన్ రీఎంట్రీ బెడిసికొట్టిందని చెప్పొచ్చు.
Above Average
Transfer Trimurthulu Movie Review
90స్ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అక...
90స్ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది.
ఇప్పుడు దర్శకుడు కమల్ తేజ కూడా కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. అయితే మెజారిటీ సీన్స్ స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!
Average
Transfer Trimurthulu movie Review
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుం...
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది.
నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు.
Below Average
Transfer Thrimurthulu movie Review
సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్...
సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది.
దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పి... బోరింగ్ త్రిమూర్తులును అంటగట్టారు డైరెక్టర్.
Below Average
Transfer Trimurthulu movie Review
వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్...
వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.
అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి తగ్గట్టు రోల్స్ కి కూడా కనెక్ట్ అయ్యేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత లేదు. మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉండేది. ఓవరాల్ గా సినిమా అంత ఇంప్రెస్ చేయదు.
Average
Transfer Trimurthulu Movie Review
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ విషయానికి వస్తే... నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ కథ చుట్టూ అల్లుకొన్న కోర్టు రూమ్ డ్రామా. అమ్మాయి మానబంగం కేసు, సీఎం పబ్లిక్ స్టంట్స్ లాంటి అంశాలను మేలవించి విభిన్నమైన కథగా చెప్పేందుకు దర్శకుడు కమల్ తేజ ప్రయత్నం చేశాడు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ప్రస్తావించి ఉంట...
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ విషయానికి వస్తే... నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ కథ చుట్టూ అల్లుకొన్న కోర్టు రూమ్ డ్రామా. అమ్మాయి మానబంగం కేసు, సీఎం పబ్లిక్ స్టంట్స్ లాంటి అంశాలను మేలవించి విభిన్నమైన కథగా చెప్పేందుకు దర్శకుడు కమల్ తేజ ప్రయత్నం చేశాడు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ప్రస్తావించి ఉంటే.. సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా సన్నివేశాలను అల్లుకొని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత తన వయసుకు తగిన, తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పాత్రను ఎంచుకొని వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇవ్వడం సానుకూలమైన అంశంగా మారింది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌కు తగినట్టుగా బ్యాలెన్స్‌గా పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఫస్టాఫ్ లో కొంత ల్యాగ్‌ను తగ్గించి ఉంటే సినిమా వేగం పెరిగి ఉండేది. కథ డిమాండ్ మేరకు నిర్మాతగా వడ్డే నవీన్ ఎక్కడా రాజీ పడలేదనే విషయం అవుట్‌పుట్ స్పష్టమైంది. పోలీస్, కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొన్న సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు.
Average
Transfer Trimurthulu Movie Review
వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అ...
వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అయితే సినిమా కంటెంట్ మాత్రం ఏమి లేదు. కెరీర్ బిగినింగ్‌లో ఎలా హ్యాండ్సమ్‌లో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ డాన్స్, ఫైట్స్‌లో తేలిపోయారు.
దర్శకుడు కమల్ తేజ రాత బావున్నా... తీసే విషయంలో తడబడ్డాడు. సీన్లు పరంగా చూస్తే కొన్ని ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫర్ వైజాగ్, అరకు ప్రాంతాల అందాలను బాగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తన పనికి న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం ప్లస్ అయింది. పాటలు బాగానే ఉన్నాయి కానీ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. ఎడిటింగ్ కాస్త మైనస్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా త్రిమూర్తుల్ని తెరపై చూడాలంటే కొంత ఓపిక కావలసిందే!
ట్యాగ్‌లైన్: ఓల్డ్ ట్రీట్‌మెంట్
Below Average
Transfer Trimurthulu movie Review
Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine commercial entertainer with a crime element woven into the narrative.Highlights:Vadde Naveen’s age-defyin...
Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine commercial entertainer with a crime element woven into the narrative.
Highlights:
Vadde Naveen’s age-defying screen presence
The core conflict
Drawbacks:
Outdated execution
Unnecessary hero elevations
Several unconvincing scenes
Contrived narrative episodes
Vadde Naveen had an opportunity to make a truly impactful comeback, but the decision to embrace an old-fashioned narrative style ultimately limits the film’s effectiveness.
Bottom Line: Outdated
Average
Transfer Trimurthulu Movie Review
Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our review to find out if the film is worth watching in theaters.Vadde Naveen makes a comeback after a l...
Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our review to find out if the film is worth watching in theaters.
Vadde Naveen makes a comeback after a long gap and suits his role well. His looks are intact, and the kind of role he has chosen is apt for a comeback.
Positives
1. Core Plot
2. Vadde Naveen
Negatives:
1. Outdated Screenplay
2. Needless Commercial Elements
3. Illogical Scenes
4. Convenient Writing
5. Lack of Emotional Depth
At a time when many popular heroes are attempting comebacks as character artists, Vadde Naveen chooses to return as a lead hero. There is nothing wrong with that, but the subject he has chosen feels outdated and fails to generate any interest whatsoever.
Bottom Line: ‘Outdated’ Trimurthulu
Average
Transfer Trimurthulu Movie Review
ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో య...
ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో యావరేజ్ టాక్ అందుకుంది.
ఓవరాల్ గా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. వడ్డే నవీన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. పైగా ఉన్న ఎమోషన్ లో, ఉన్న కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.
Public Reviews
6 Avg: 5.3/10Above Average
Trimurthulu Review
Tri Murthulu oka family-commercial entertainer. Cinema first half decent ga start ayyi, comedy scenes konni baga workout ayyayi. Hero performance natural ga undi, emotional scenes lo kuda manchi effort kanipisthundi.Second half konchem slow anipinchina, climax lo emotional touch tho story ni complet...
Tri Murthulu oka family-commercial entertainer. Cinema first half decent ga start ayyi, comedy scenes konni baga workout ayyayi. Hero performance natural ga undi, emotional scenes lo kuda manchi effort kanipisthundi.
Second half konchem slow anipinchina, climax lo emotional touch tho story ni complete chesaru. Music average ga undi, background score konni scenes ni elevate chesindi. Cinematography neat ga undi, production values kuda decent.
Average
Transfer Trimurthulu Movie Review
Good intentions, but poor execution.
Transfer Trimurthulu feels like a story we've seen many times before, without the emotional depth or excitement needed to stand out.
Average
Transfer Trimurthulu Movie Review
A familiar story, weak execution, and lack of engaging moments make Transfer Trimurthulu a dull watch.
Vadde Naveen's comeback doesn't get the powerful treatment it deserved.
Average
Transfer Trimurthulu Movie Review
Transfer Trimurthulu is a routine political drama with an outdated storyline and slow narration.
Despite its social message, the film fails to create much impact and ends up feeling predictable.
Above Average
Transfer Trimurthulu Movie Review
Transfer Trimurthulu is a routine political-action drama centered on an honest police constable fighting against a powerful politician's son accused of a serious crime. While the story aims to blend social issues, politics, and heroism, the execution feels outdated and predictable.The film moves at...
Transfer Trimurthulu is a routine political-action drama centered on an honest police constable fighting against a powerful politician's son accused of a serious crime. While the story aims to blend social issues, politics, and heroism, the execution feels outdated and predictable.
The film moves at a slow pace, lacks engaging moments, and struggles to create emotional impact. Despite giving importance to Vadde Naveen's comeback and hero elevations, the character lacks the strength needed to leave a lasting impression. The screenplay feels repetitive, and the conflict never becomes truly compelling.
Verdict: An outdated and predictable drama that fails to bring anything fresh to the genre. Vadde Naveen's comeback doesn't make the impact fans might have hoped for.
Average
Transfer Trimuthulu Movie Review
వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డానికి ఫ్యామిలీ తో థియేటర్ కి వెళ్ళాం. first of all screen మీద వడ్డే నవీన్ ని చూసాక అప్పుడెలా ఉన్...
వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డానికి ఫ్యామిలీ తో థియేటర్ కి వెళ్ళాం.
first of all screen మీద వడ్డే నవీన్ ని చూసాక అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అనిపించారు. కాకపోతే కొంచెం లావయ్యారు. అండ్ సినిమా మాత్రం మేం అంత ఎంజాయ్ చేయలేదు. because ఇలాంటి storys మేం చాలా చూసేసాం. మేమనే కాదు తెలుగులో చాలా movies వచ్చాయి. ఎదో హీరోని చూడ్డానికి వెళ్ళాం కానీ, సినిమాలో ఎం లేదని ఫినిష్ అయ్యాక గాని తెలీలేదు. ఇంకొంచెం మంచి స్క్రిప్ట్ తో ఎంట్రీ ఇచ్చి ఉంటె బాగుండేది.
About This Movie
Story : నిజాయితీ గల కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్) తన భార్య లక్ష్మి (రాశి సింగ్) వాళ్ళ పాపతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ అతని నిజాయితీ వల్లే పలు ఇబ్బందులు ఎదుర్కుంటూ రెగ్యులర్ గా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో అరకు లోని ఓ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ కాగా, అక్కడ ప్రియమ్మ అనే యువతి రేప్ కు గురయితే దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ దొరుతుకుంది. అయితే ఆ కేసు 20 ఏళ్లగా పక్కనపెట్టేస్తారు. ఈ క్రమంలో దీని వెనకున్నది ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్), ఆమె కొడుకు సంతోష్ బాబు అని తెలుస్తుంది. అయితే కొడుకుని సీఎం చేయాలనీ కల గంటున్న కమల, తన పార్టీ తరపున మేనిఫెస్టో రిలీజ్ చేసే టైమ్ కి సంతోష్ బాబు గిరిజన అమ్మాయిని రేప్ చేసి చంపేశాడనే విషయాన్ని కానిస్టేబుల్ త్రిమూర్తులు బయటపెడతాడు. అయితే అసలు ఈ కేసుకి త్రిమూర్తులకు సంబంధం ఏంటి ? రేప్ కాబడిన ప్రియమ్మకి న్యాయం జరిగిందా? ఫైనల్ గా ఈ కేసును కానిస్టేబుల్ త్రిమూర్తులు ఎలా చేధించారు? అన్నది మిగిలిన కథ.
Plus Points :
2010లో ‘శ్రీమతి కల్యాణం’ అనే మూవీ తర్వాత దాదాపు 16 ఏళ్లకు వడ్డే నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్, పేరుండడం ఆయనకు కలిసొచ్చే పాయింట్. ఇక సినిమాలో కానిస్టేబుల్ త్రిమూర్తులుగా చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ గా కనిపించాడు. వింటేజ్ వడ్డే నవీన్ మరోసారి కనిపించారు. అలాగే లక్ష్మీ పాత్రలో రాశీ సింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మిగతా కీ రోల్స్ లో నటించిన శిల్ప తులస్కర్, రఘుబాబు, దేవీ ప్రసాద్, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాసరావు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.
MinusPoints :
అయితే వడ్డే నవీన్ తన రోల్ వరకు బాగానే చేసినా, ఆ రోల్ లో కొత్తదనం లేకుండాపోయింది. కథ కూడా చాలా సినిమాల్లో అరిగిపోయిన పాత క్యాసెట్ లాంటి కథే. దాన్ని ఈ జెనరేషన్ కి మ్యాచ్ అయ్యేలా, మంచి స్క్రీన్ ప్లే రాయడంలో దర్శకుడు తడబడ్డాడు. అలాగే కథకు అవసరమైన స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. చాలా సీన్స్ ని ముందే గెస్ చేసేయొచ్చు. అలాగే హీరో – విలన్ సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఒక్క క్లైమాక్స్ మినహా అన్ని రొటీన్ గానే అనిపిస్తాయి.
Technical values :
ఇక టెక్నికల్ విషయానికి వస్తే... దర్శకుడు కమల్ తేజ నార్ల తన టేకింగ్ తో మెప్పించినా, బలమైన కథా కథనాలు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ బాగుంది. పాటలు అంతగా లేవు కానీ బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.
Final Review :
ఫైనల్ గా "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన వడ్డే నవీన్ బాగానే ఆకట్టుకున్నా, పస లేని కథ, కథనాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నా, అసలైన కథని, ఎమోషనల్ కంటెంట్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమాని రెగ్యులర్ మూవీ ఆడియన్స్ ఓసారి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ట్రై చేయొచ్చు గాని, అందర్నీ మెప్పించలేదు.