విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons)
Vishwanath And Sons : వీరభద్రుడు తో మాస్ కం బ్యాక్ ఇచ్చాక కంప్లీట్ క్లాస్ సినిమాతో విశ్వనాథ్ అండ్ సన్స్ (Viswanath and Sons) మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేసాడు సూర్య. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమైతా బైజు హీరోయిన్ గా నటించింది. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా, తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons)
Media Reviews
19 Avg: 6.5/10Hit
Vishwanath and sons movie review
విశ్వనాధ్ అండ్ సన్స్... first of all సినిమా చూసాక నా ఎక్స్పీరెన్స్ చెప్పాలంటే... బావుంది. చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిజిగా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న కపుల్స్ కైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో చాలా సేపు బోరింగ్ సీన్స్ తో అలా నడుస్తుంటే... మామితా ఎంటర్ అయిన తర...
విశ్వనాధ్ అండ్ సన్స్... first of all సినిమా చూసాక నా ఎక్స్పీరెన్స్ చెప్పాలంటే... బావుంది. చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిజిగా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న కపుల్స్ కైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో చాలా సేపు బోరింగ్ సీన్స్ తో అలా నడుస్తుంటే... మామితా ఎంటర్ అయిన తర్వాతే ఊపందుకుంటది. అండ్ సూర్య మామితా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.
సినిమాలో కొన్ని సీన్స్ కొంతమందికి డీసెంట్ గా, బోర్ ఫీల్ కూడా అవ్వచ్చు. స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో అలాంటి సీన్స్ ఉన్నాయి. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. becuase స్టోరీకి తగ్గట్టున్నాయి ఆ సీన్స్. ఇప్పుడు ఎక్కకపోతే తర్వాతైనా ఆ సీన్స్ మైండ్ లోకి బాగా ఎక్కుతాయి. కాకపోతే క్లైమాక్స్ కూడా ఇంకొంచెం నీట్ గా రాసుకోవాల్సింది అనిపించింది. అండ్ కమర్షియలైజ్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు. అవి అంత అనవసరం అనిపించింది. అండ్ టెక్నికల్లి మూవీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జివి ప్రకాష్ మాత్రం ఈసారి అంత లేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ డీసెంట్ మూవీ.
Average
Vishwanath and Sons Movie Review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చూసొస్తున్నా.. నాకు వెంకీ అట్లూరి సినిమాలంటే చాలా ఇష్టం.. కానీ వెంకీ ముందు సినిమాలతో ఈ సినిమాను పోల్చను... టెక్నికల్లి ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మెయిన్ మామితా చాలా బాగా చేసింది. అండ్ తాను తప్ప మిగతా వాళ్ళందరూ aged గానే క...
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చూసొస్తున్నా.. నాకు వెంకీ అట్లూరి సినిమాలంటే చాలా ఇష్టం.. కానీ వెంకీ ముందు సినిమాలతో ఈ సినిమాను పోల్చను... టెక్నికల్లి ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మెయిన్ మామితా చాలా బాగా చేసింది. అండ్ తాను తప్ప మిగతా వాళ్ళందరూ aged గానే కనిపిస్తారు. అండ్ సినిమాలో మంచి మంచి సీన్లు పడ్డాయందరికి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది.
అండ్ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. ఈ సినిమాలో నచ్చని విషయమేంటంటే... తమిళ్ లో మొత్తం సినిమా తీశారు, అది అంత నచ్చలేదు. కానీ తమిళ్ లో డైలాగ్స్ తెలుగు కంటే బాగున్నాయి. ప్రాబ్లెమ్ ఏంటంటే దీంట్లో నాకు వెంకీ అట్లూరి మార్క్ కనిపించలేదు. అండ్ సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేసారు. అయితే సినిమాలో స్టోరీలో ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లెమ్ ని చాలా పెద్దగా చూపించి, క్లైమాక్స్ లో ఆ ప్రాబ్లెమ్ ని చిన్నది చేసారు అది నాకు నచ్చలేదు. అండ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు అది అస్సలు నచ్చలేదు. జివి ప్రకాష్ అయితే దెబ్బేసాడు. మ్యూజిక్ ఎక్కడా ఎక్కలేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ వన్ టైం వాచబుల్.
Average
Vishwanath and Sons movie review
విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందంటే... అలా ఉందంతే... ఎలా ఉంటదంటే... మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు... ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ గా ఉంది. మమిత చాలా బాగా చేసింది. సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా క్లాసిక్ గా చేసారు. బట్ ఈ సినిమా చూస్తే... ఫైనల్లీ ఆయనకు డీసెంట్ సినిమా పడిందనిపించి...
విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందంటే... అలా ఉందంతే... ఎలా ఉంటదంటే... మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు... ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ గా ఉంది. మమిత చాలా బాగా చేసింది. సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా క్లాసిక్ గా చేసారు. బట్ ఈ సినిమా చూస్తే... ఫైనల్లీ ఆయనకు డీసెంట్ సినిమా పడిందనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ప్లాట్ పాయింట్ నాకు అంతలా ఎక్కాలా.
Actually ఈ సినిమా మన్మథుడు మూవీకి చాలా దగ్గరగా ఉంటది. ఈ సినిమాకి ఇంకా బాగా రాసుండాల్సింది. కానీ చాలా సింపుల్ గా డీల్ చేసాడు డైరెక్టర్. అందుకే అంత ఎక్కలేదు. సింపుల్ గా చెప్పాలంటే వెంకీ అట్లూరి సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. కానీ ఇది రెగ్యులర్ డ్రామాగా అనిపించింది. బట్ ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఇది చాలా బెటర్ సినిమా ఇది. అండ్ ఇది డబ్బింగ్ సినిమాలానే ఉంది. తెలుగు మేకర్స్ ఉన్నప్పుడు, కొంచెమైనా తెలుగులో ట్రై చేయొచ్చుగా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే అంత ఎక్కలేదు... ఓకే.
Hit
Mahidhar Vibes movie review
వెల్కమ్ టు తమిళ్ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) మూవీ రివ్యూ స్టారింగ్ సూర్య, మామితా బైజు. తమిళ్ మూవీ ఎందుకన్నానంటే ఇది తమిళ్ మూవీ. తమిళ్ లోనే షూట్ చేసారు. తెలుగులో డబ్ చేసారు. బట్ చాలా మంది అన్నట్టు సూర్య అడాప్టడ్ సన్ అఫ్ తెలుగు స్టేట్స్ అన్న ట్యాగ్ తీసేసి, వాళ్ళ తమ్ముడు కార్తీకి ఇవ...
వెల్కమ్ టు తమిళ్ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) మూవీ రివ్యూ స్టారింగ్ సూర్య, మామితా బైజు. తమిళ్ మూవీ ఎందుకన్నానంటే ఇది తమిళ్ మూవీ. తమిళ్ లోనే షూట్ చేసారు. తెలుగులో డబ్ చేసారు. బట్ చాలా మంది అన్నట్టు సూర్య అడాప్టడ్ సన్ అఫ్ తెలుగు స్టేట్స్ అన్న ట్యాగ్ తీసేసి, వాళ్ళ తమ్ముడు కార్తీకి ఇవ్వడం బెటర్. ఎందుకంటే అతను ఇక్కడికెప్పుడొచ్చినా తెలుగులోనే మాట్లాడతారు. తమిళ్ వాళ్ళకంటే తెలుగు ఫ్యాన్స్ ఏ ఇష్టమంటాడు.
కమింగ్ టు ది రివ్యూ.. బానే ఉంది సినిమా.. ఒక డీసెంట్ సినిమా. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డీవియేట్ అయిపోతుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. అందుకే కొంత నచ్చలేదు. అలాగే కొన్ని తెలుగులో కొన్ని సీన్స్ పై ఎఫర్ట్ పెట్టి ఉంటె బాగుండేది. కానీ కొంచెం కూడా పెట్టలేదు. యాక్టింగ్ కొస్తే సూర్య, మమితా సహా అందరూ బాగా చేసారు. ఓవరాల్ గా బాగానే ఉంది పర్లేదు. నా రేటింగ్ అయితే 3.8
Hit
Vishwanath and sons movie review
వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) సినిమాతో వచ్చేశాడు. సినిమా విషయానికి వస్తే... చాలా సింపుల్ పాయింట్ తోనే సినిమా తెరకెక్కగా డైరెక్టర్ సింపుల్ కథని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్...
వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) సినిమాతో వచ్చేశాడు. సినిమా విషయానికి వస్తే... చాలా సింపుల్ పాయింట్ తోనే సినిమా తెరకెక్కగా డైరెక్టర్ సింపుల్ కథని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న మూవీగా తీర్చిదిద్దాడు అని చెప్పాలి.
సూర్య మరోసారి తనదైన నటనతో మెప్పించగా, ఉన్న తక్కువ యాక్షన్ సీన్స్ లో కూడా కుమ్మేశాడు. ఇక హీరోయిన్ మమితా బైజు మాత్రం తన క్యూట్ యాక్టింగ్ తో ఫుల్ మార్కులు కొట్టేసి అందరి కన్నా బెటర్ గా జోరు చూపించింది. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు. ఇక జివి ప్రకాష్ సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ లెవల్ లో మెప్పించింది. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి మరీ లక్కీ భాస్కర్ రేంజ్ లో కాకపోయినా కూడా ఓ మంచి ఫ్యామిలీ మూవీతో సూర్యని బాగా ప్రజెంట్ చేయడమే కాకుండా సినిమా పరంగా కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. సినిమా చూసిన ఆడియన్స్ థియేటర్స్ నుండి వచ్చేటప్పుడు కచ్చితంగా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు.
Above Average
Vishwanath and sons movie review
Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words... HighlightsSuriya’s charismaEntertaining first halfMamitha Baiju...
Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words...
Highlights
Suriya’s charisma
Entertaining first half
Mamitha Baiju’s comic scenes
Drawbacks
Old-school melodrama in the second half
Lack of good songs
Ooty portions
Lengthy runtime
Overall, Vishwanath and Sons has its moments, particularly in the first half. The driver episode, the fun moments involving Suriya’s family and Mamitha Baiju, and the performances of the lead actors work well. However, the lengthy runtime, formulaic scenes and uneven second half prevent it from becoming a completely engaging family drama. Nevertheless, Vishwanath and Sons makes for a decent watch.
Above Average
Vishwanath and sons movie review
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవా...
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ లోపించడంతో పాటు స్టోరీ కొంతవరకు అంచనా వేసేలా మారుతుంది.
అలాగే సినిమాలో వయస్సు వ్యత్యాసం, సరోగసీ వంటి అంశాలను సంక్లిష్టం చేయకుండా చూపించడంలో డైరెక్టర్ విజయం సాధించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి సామాజిక సందేశాలను చక్కగా జోడించారు. సూర్య, మామితా బైజు అల్టిమేట్ పెర్ఫార్మన్స్ కి తోడు వెంకీ అట్లూరి డైరెక్షన్, జివి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. బంధాలు, అనుబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పే మంచి ప్రయత్నం.
Hit
Vishwanath and sons movie review
సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్ లో ఇద్దరూ లవర్స్ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్...
సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్ లో ఇద్దరూ లవర్స్ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఫీల్ గుడ్ టచ్‌తో చెప్పాడు వెంకీ. ఎమోషనల్ డైలాగ్స్, ఫన్నీ మూమెంట్స్, సూర్య–మామిత కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త వీక్‌గా అనిపించినా.. 2.5 గంటలకు పైగా ఉన్న రన్‌టైమ్‌లోనూ కథనాన్ని ఎంగేజింగ్‌గా నడిపించడం ప్లస్ పాయింట్. మొత్తంగా కొత్త కాన్సెప్ట్ కంటే వెంకీ అట్లూరి ట్రీట్‌మెంట్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఈ సినిమాకు అసలు బలం. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను క్రిస్పీగా కట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్.
Hit
Vishwanath And Sons movie review
సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్ అండ్ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్ విశ్వనాథ్ పాత్రల...
సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్ అండ్ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మెప్పించాడు. ఇక మ్యాడీ పాత్రలో మమితా బైజు ఇరగదీసింది. ఆద్యంతం నవ్విస్తూనే గుండెని బరువెక్కించింది.
దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ బాగుంది. స్క్రీన్ ప్లే సినిమాకి ప్రాణమని చెప్పొచ్చు. డైలాగ్‌లు కూడా అంతే బాగున్నాయి. టైట్‌గా రాసుకున్నారు. కొంత స్లో, రొటీన్ సీన్లు, ఊహించే సన్నివేశాలు మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు జోడించాడు. కుటుంబ విలువలు, ఇంట్లో ఉండే ఈగోలు, ఫన్, యాక్షన్ మేళవింపుగా రూపొందించారు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఫైనల్ గా ఫన్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్.
Hit
Vishwanath and sons movie review
సూర్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు కారణం ఆయన చేసిన సినిమాలు. గజినీ నుంచి వీరభద్రుడు వరకు... తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్య సినిమాలు చూస్తే, కంటెంట్ బేస్డ్ కథలు ఎక్కువ. ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయి. కొత్త తరహా కథలతో సినిమాలు చేసి సూర్య విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర...
సూర్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు కారణం ఆయన చేసిన సినిమాలు. గజినీ నుంచి వీరభద్రుడు వరకు... తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్య సినిమాలు చూస్తే, కంటెంట్ బేస్డ్ కథలు ఎక్కువ. ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయి. కొత్త తరహా కథలతో సినిమాలు చేసి సూర్య విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా అనేసరికి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి సార్, లక్కీ భాస్కర్ తరహాలో కాకుండా దర్శకుడు వెంకీ అట్లూరి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీశారు.
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో వెంకీ అట్లూరి మరీ కొత్త కథను చెప్పలేదు. సెంటిమెంట్, ఫామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉండే కథ రెడీ చేశారు అంతే. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రారంభం నుంచి దర్శకుడిగా కంటే రచయితగా వెంకీ అట్లూరి ప్రేక్షకులను కట్టి పడేశారు. ఫ్యామిలీ సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. టెక్నికల్ పరంగా కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాలో ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, వైబ్రెంట్ గా ఉండేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ అన్నీ బావున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ సినిమాకు ఎక్కువ వేల్యూ యాడ్ చేసింది.
ఫైనల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్... మంచి ఎంటర్టైనర్. వర్షాకాలంలో వీచే చల్లటి గాలి లాంటిది. సూర్య, మమితా బైజు నటనకు తోడు వెంకీ అట్లూరి డైలాగ్స్ & సన్నివేశాల్లో వినోదం, భావోద్వేగాలు మంచి అనుభూతి ఇస్తాయి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్.
Above Average
Vishwanath And Sons Movie Review
ఇలాంటి కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఈ విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. కొత్త కథ కాదు గాని, ఈ కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సినిమాలో సంజయ్ బాల్యం నుండి క్రీడాకారుడిగా, బిజినెస్ మెన్ గా అతను ఎదిగిన తీరు, వివా...
ఇలాంటి కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఈ విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. కొత్త కథ కాదు గాని, ఈ కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సినిమాలో సంజయ్ బాల్యం నుండి క్రీడాకారుడిగా, బిజినెస్ మెన్ గా అతను ఎదిగిన తీరు, వివాహ బంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉండటం, అందుకు చూపించిన కారణాలు... ఇవన్నీ ఆడియెన్స్ ను ఇంప్రస్ చేసేలా ఉన్నాయి.
ఆ తర్వాత సరొగసీ ద్వారా బిడ్డను ఇంటికి తీసుకు రావడం, ఆ తర్వాత కుటుంబంలో జరిగే పరిణామాలు, వాటిని అతను మ్యాడీ సాయంతో అధిగమించడం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇక పైకి ప్రాక్టికల్ పర్సన్ గా కనిపించినా, సంజయ్ మనసు లోతుల్లోని మెత్తదనాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. సూర్య పాత్రకు పూర్తి కాంట్రాస్ట్ గా మ్యాడీ పాత్రను తీర్చిదిద్దడం కొత్త రంగును యాడ్ చేసినట్టు అయ్యింది. రాధిక, రవీనా టాండన్ పాత్రలు హుందాగా బాగున్నాయి. ఇక సూర్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను అవసరం లేకపోయినా మిక్స్ చేశాడు. ఫైనల్ గా కథ, కథనాలలో కొత్తదనం లేకపోయినా... హాయిగా దీన్ని ఆస్వాదించే ఆస్కారం ఏర్పడిందనుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో ఈ మాత్రం ఎంగేజ్ చేసే మూవీ ఏదీ రాలేదనే చెప్పాలి. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ ఛాయిస్‌గా నిలువనుంది.
Hit
Vishwanath And Sons Movie review
ఒలంపిక్‌లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ కథను హై నోట్‌లో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కథ టేకాఫ్ అందుకొన్న తర్వాత ఏ ఒక్క క్షణంలో కూడా ల్యాండింగ్ అయ్యే ఛాన్సే రాకుండా సినిమాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో పూర్తిగా వినోదం, ఎమోషన్స్‌కు పె...
ఒలంపిక్‌లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ కథను హై నోట్‌లో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కథ టేకాఫ్ అందుకొన్న తర్వాత ఏ ఒక్క క్షణంలో కూడా ల్యాండింగ్ అయ్యే ఛాన్సే రాకుండా సినిమాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో పూర్తిగా వినోదం, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసి, సంజయ్‌కి మ్యాడీ ఇచ్చిన చిన్న స్ట్రోక్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ ను నమ్ముకొన్నాడు. భావోద్వేగంతో కూడిన ఎమోషనల్ సీన్లను ఒక్కొక్కటిగా పేర్చుకొంటూ పోయాడు.
రాధిక, రవీనా, మమితా బైజు, సూర్య, నాజర్ ఇలా అందరూ పీక్ రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టించారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు నడిపించిన ఫ్యామిలీ డ్రామా ఉద్వేగానికి గురి చేస్తుంది. ఫైనల్ గా ఈ మధ్యకాలంలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్లలో డైలాగ్స్ హృదయాన్ని టచ్ చేయడమే కాకుండా ఎమోషనల్‌గా మారుస్తాయి. నిర్మాతలు నాగవంశీ, సౌజన్య అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. లావిష్, రిచ్ సెట్స్ సినిమాను గ్రాండియర్‌గా మార్చాయి. సూర్య, మమితా, రాధిక, రవీనా పెర్ఫార్మెన్స్, దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్, విజన్ కోసం ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడాల్సిందే.
Hit
Vishwanath And Sons movie review
సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత...
సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.
ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్‌తో వెంకీ అట్లూరి రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక” వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఇంకాస్త బలంగా ఉంటే సినిమా మరింత ఇంప్రెస్ చేసేది. అయినప్పటికీ రెండున్నర గంటలకు పైగా ఉన్నా పెద్దగా బోర్ కొట్టకుండా సాగడం సినిమాకు ప్లస్. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్..క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ప్లెజెంట్ మూమెంట్స్.
Above Average
Vishwanath and sons movie review
విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదలైనపుడు సూర్య-మామిత బైజు కాంబినేషన్ అనగానే.. ఇదేదో ‘భగవంత్ కేసరి’ టైపు సినిమా అయ్యుండొచ్చని.. మామితకు ఫాదర్ ఫిగర్ లాంటి పాత్రలో సూర్య కనిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ టీజర్లో సూర్యకు జోడీగానే మామిత నటించిందని.. ఇది వయసు అంతరం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యం...
విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదలైనపుడు సూర్య-మామిత బైజు కాంబినేషన్ అనగానే.. ఇదేదో ‘భగవంత్ కేసరి’ టైపు సినిమా అయ్యుండొచ్చని.. మామితకు ఫాదర్ ఫిగర్ లాంటి పాత్రలో సూర్య కనిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ టీజర్లో సూర్యకు జోడీగానే మామిత నటించిందని.. ఇది వయసు అంతరం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో నడిచే కథ అని తెలిసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెంకీ అట్లూరి ఎంచుకున్న ఈ పాయింట్ ఒక స్టార్ హీరో సినిమాల్లో ఊహించలేనిది. ఐతే ఇక్కడి వరకు కొత్తదనం చూపించిన వెంకీ.. మిగతా సినిమాలో చూపించింది సగటు ప్రేమకథ.. ఫ్యామిలీ డ్రామానే. అయినా రెండున్నర గంటలకు పైగా నిడివిలో పెద్దగా బోర్ కొట్టకుండా ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాడు.
వెంకీ అట్లూరి రచయితగా.. దర్శకుడిగా మెప్పించాడు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద అతను సినిమాను నడిపించాడు. అతను ప్లెజెంట్ మూమెంట్స్ చుట్టూ కథాకథనాలను అల్లుకున్న తీరు.. వాటిని తెరపై ప్రెజెంట్ చేసిన వైనం బాగుంది. అతను డైలాగ్ రైటర్ గానూ ఆకట్టుకున్నాడు. "మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" లాంటి హృద్యమైన సంభాషణలతో పాటు యూత్ మెచ్చే ఫన్నీ డైలాగ్స్ కూడా రాశాడు వెంకీ. సెకండాఫ్ లో వెంకీ రైటింగ్.. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త కసరత్తు చెయ్యాల్సింది. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాగా ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.
Hit
Vishwanath and sons review
Done with #ViswanathAndSons. It’s about how Viswanath takes on responsibilities and sets things right.Venky Atluri has a mature way of handling things. I liked the way he ended the movie.Family entertainers can never go wrong when they are handled reasonably well.Suriya is extremely good. What surpr...
Done with #ViswanathAndSons. It’s about how Viswanath takes on responsibilities and sets things right.
Venky Atluri has a mature way of handling things. I liked the way he ended the movie.
Family entertainers can never go wrong when they are handled reasonably well.
Suriya is extremely good. What surprised me is how well Mamitha matched him with her performance.
This will be a sure-shot hit
Hit
Vishwanath and sons movie review
‘విశ్వనాథ్ అండ్ సన్స్’’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. వెంకీ అట్లూరి కథ, దర్శకత్వంతో పాటు జివి ప్రకాష్ అదిరిప...
‘విశ్వనాథ్ అండ్ సన్స్’’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. వెంకీ అట్లూరి కథ, దర్శకత్వంతో పాటు జివి ప్రకాష్ అదిరిపోయే బీజీఎమ్ సాంగ్స్, అలాగే సూర్య, మామితా బైజు పెర్ఫార్మన్స్ సినిమాకి మంచి హై ఇచ్చాయి.
ఓవరాల్ గా ఈ సినిమాలో సూర్య నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
Hit
Vishwanath and sons Movie Review
విశ్వనాధ్ అండ్ సన్స్... ఒక 2 hours 41 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ బెస్ట్ ఫ్యామిలీ సినిమా ఇది. చాలా బాగుంది guys ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా బానే ఉంది. ఓవరాల్ గా ప్లెసెంట్ గా ఉండే క్లాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఓవరాల్ గా మూవీ నవ్వించింది, ఏడ...
విశ్వనాధ్ అండ్ సన్స్... ఒక 2 hours 41 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ బెస్ట్ ఫ్యామిలీ సినిమా ఇది. చాలా బాగుంది guys ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా బానే ఉంది. ఓవరాల్ గా ప్లెసెంట్ గా ఉండే క్లాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఓవరాల్ గా మూవీ నవ్వించింది, ఏడిపించింది, ఆలోచించేలా చేసింది... సూర్య గారి stamina ఏంటో చూపించింది. ఇక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బేసిక్ స్టోరీ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన సూర్య, పెళ్లి చేసుకుని వారసుడ్ని ఇమ్మని తల్లి రాధికా అడిగితే.. సూర్య ఒక పనిచేస్తారు. ఆ డెసిషన్ ఏంటి? అందులో మామితా రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇక ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ అనే ఫీల్ కూడా రాకుండా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మామితా బైజు తో సీన్స్ చాలా బాగున్నాయి. రవీనా టాండన్ కి మంచి రోల్ పడింది. అండ్ సినిమాలో 40 vs 20 లవ్ కి రీసన్ కూడా ఇందులో బాగా చూపించారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అయితే దుమ్ములేపేసారు. మైనస్ పాయింట్ విషయానికి వస్తే... సినిమాటిక్ లైబర్టిని వాడుకుని కొన్ని అనవసరమైన సీన్స్ తీశారు అంతే... ఇదొక తెలుగు డైరెక్టర్ తీసిన తమిళ సినిమా కాబట్టి అందరికి ఈజీగా నచ్చుతుంది. ఓవరాల్ గా worth watchable movie.
Super Hit
Vishwanath and sons movie review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons) మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. first of all i have to say kudos to directer venky atluri గారు. అయన అనుకున్న story ని ఎక్కడా డీవియేట్ అవకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక 40 year and 20 year age గ్యాప్ మధ్యలో జరిగే ఒక స్టోరీని ఎలా అయితే చూపించాలి అని...
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons) మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. first of all i have to say kudos to directer venky atluri గారు. అయన అనుకున్న story ని ఎక్కడా డీవియేట్ అవకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక 40 year and 20 year age గ్యాప్ మధ్యలో జరిగే ఒక స్టోరీని ఎలా అయితే చూపించాలి అని అనుకున్నారో, ఆ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చాల beautiful writing, and excellent characterization, అండ్ చాలా neat presentation తో మన ముందుకు తీసుకొచ్చి, చాలా నీట్ సినిమాగా చాలా క్లాస్ సినిమాగా, ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ తో బైటికి వచ్చేలా చేసాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.
ఈ మూవీలో మన సూర్య గారి క్యారెక్టర్, మమతా క్యారెక్టర్, అలాగే రాధికా గారి క్యారెక్టర్ గాని వీళ్ళ ప్లేస్ లో వేరే ఎవ్వర్నీ ఊహించుకోలేం. ఎందుకంటే అంతలా వీళ్ళు నటించి మెప్పించారు. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే.. మమతా కుమ్మేసింది. సూర్య సెటిల్డ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో, మంచి ఎమోషనల్ సీన్స్ తో పర్ఫెక్ట్ గా కనిపించారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పై ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటె బాగుండేది.. బట్ బానే ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే కొన్ని సీన్స్ లో రైటింగ్ ఫెంటాస్టిక్ గా అనిపించింది. విశ్వనాధ్ అండ్ సన్స్ అగైన్ a very neat and clean film.
Average
Vishwanath and sons movie review
#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second half drifts into melodra...
#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!
After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second half drifts into melodrama with subplots that don’t really work and the fun becoming limited. The climax is handled a little better.
Suriya, Mamitha, and Radhika all deliver solid performances. Venky Atluri’s dialogue writing is the film’s biggest strength, while the music is adequate. The second half simply needed better writing. Still, it works once as a clean timepass family entertainer, though it had the potential to be much better.
Rating: 2.5/5
Public Reviews
4 Avg: 7.5/10Super Hit
Vishwanath and sons movie review
Vishwanath and Sons is not just a family drama; it is also an emotional love story that beautifully balances romance, relationships, and family values. Suriya and Mamitha Baiju bring a warm and natural chemistry to the screen, making their love story one of the most engaging parts of the film.The mo...
Vishwanath and Sons is not just a family drama; it is also an emotional love story that beautifully balances romance, relationships, and family values. Suriya and Mamitha Baiju bring a warm and natural chemistry to the screen, making their love story one of the most engaging parts of the film.
The movie takes us through different shades of love — romantic love, family affection, emotional bonds, and the struggles that come with them. The emotions feel genuine, and several moments stay with you even after the movie ends.
Suriya gives a heartfelt performance, while Mamitha Baiju adds charm and freshness to the story.
Super Hit
vishwanath and sons movie review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్...
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ కూడా బాగుంది.
స్టోరీ ఫ్రెష్ స్టోరీ ఏం కాదు గాని, ట్రెండ్ కి తగ్గట్లుంది. బట్ నేనేం రివీల్ చేయను. సూర్య గురించి తెలిసిందేగా. బట్ మామితా బైజు మాత్రం థ్రిల్లింగ్ అసలు. ఎం ఎనర్జీ, ఎం ఆక్టింగు... అల్టిమేట్ అసలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి మొత్తం ఇక్కడే చెప్పేస్తాననిపిస్తుంది. ఆడియన్స్ మాత్రం డోంట్ మిస్ దిస్ క్లాసిక్.
Hit
Vishwanath and Sons Movie review
విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons)... సినిమా చూసాక నా opinion చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నుండి మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చూసాం. మొన్న చూసిన వీరభద్రుడు కూడా నాకుaverage గా అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం superb గా ఉ...
విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons)... సినిమా చూసాక నా opinion చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నుండి మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చూసాం. మొన్న చూసిన వీరభద్రుడు కూడా నాకుaverage గా అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం superb గా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం lag అనిపించింది.
అండ్ సూర్య, మామితా తో పాటు రాధికా, రవీనా roles కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ ఎవరికీ వాళ్ళు వాళ్ళ రోల్స్ లో జీవించేసారు. జివి ప్రకాష్ మ్యూజిక్ biggest plus ఈ మూవీకి. స్పెషల్ గా directer వెంకీ అట్లూరి కి thanks చెప్పాలి ఆడియన్స్. overall its a worth watchable movie.
Hit
Vishwanath and sons movie review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons) మూవీ చూసొచ్చాను. ఫస్ట్ ట్రైలర్ చూసినపుడు ఎదో చిన్న డౌట్ ఒచ్చింది. మళ్ళీ ఏదైనా రొటీన్ క్లాస్ సినిమా దించుతున్నారా అని అనిపించింది. కానీ డైరెక్టర్ వెంకీ అట్లూరి మీద ఉన్న నమ్మకంతో, అతను ఇంతకు ముందు తీసిన సినిమాలను చూసి వెళ్ళాను. సినిమా చూసాక మరొక మంచి...
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons) మూవీ చూసొచ్చాను. ఫస్ట్ ట్రైలర్ చూసినపుడు ఎదో చిన్న డౌట్ ఒచ్చింది. మళ్ళీ ఏదైనా రొటీన్ క్లాస్ సినిమా దించుతున్నారా అని అనిపించింది. కానీ డైరెక్టర్ వెంకీ అట్లూరి మీద ఉన్న నమ్మకంతో, అతను ఇంతకు ముందు తీసిన సినిమాలను చూసి వెళ్ళాను. సినిమా చూసాక మరొక మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తుంది.
చాలా సింపుల్ స్టోరీని మంచి ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో, సెన్సిటివ్ గా క్లీన్, గా నీట్ గా చూపించాడు డైరెక్టర్. అండ్ సూర్య, మామితా బైజు ఎవరికీ వాళ్ళు పెర్ఫార్మన్స్ తో అల్లాడించారు. సూర్య తన స్టైలిష్ మేకోవర్ తో, ఒక ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తే... మామితా టీనేజ్ గర్ల్ గా ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ ని నవ్వించింది. అలాగే క్లైమాక్స్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా సూర్య మరో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టినట్టే.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అయిన సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఇంటర్నేషనల్ లెవెల్లో షూటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. కానీ 40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటాడు. కానీ తన తల్లి నిర్మల (రాధికా) వారసుడు కావాలనే కోరిక మేరకు పెళ్లి చేసుకోకుండా సరోగసి పద్దతి ద్వారా బిడ్డను కంటాడు. కానీ అనుకోకుండా ఆ కొడుకు అభయ్ కి బోన్ మ్యారో రిప్లేస్‌మెంట్ సర్జరీ అవసరమవుతుంది. దేంతో సరోగసి తల్లి 20 ఏళ్ళ మ్యాడీ (మామితా బైజు) సంజయ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సంజయ్ తో ఎలా ప్రేమలో పడుతుంది మ్యాడి. కానీ ఏజ్ గ్యాప్ అన్న ఒక్క రీసన్ తో సంజయ్ రిజెక్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వాళ్ళ లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది. అసలు సంజయ్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి కారణమేంటి? ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సంజయ్ ఎలా పరిష్కరించాడు. చివరికి మ్యాడి ప్రేమను సంజయ్ అంగీకరించాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
మాములుగా పెద్ద సినిమాలకి హీరోలు బిగ్గెస్ట్ ప్లస్ అవుతారు. అలాగే ఈ మూవీకి కూడా సూర్య బిగ్ ప్లస్. బట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకి హీరో కంటే ముందు కథ పెద్ద ప్లస్ అవుతుంది. అవును... డైరెక్టర్ వెంకీ అట్లూరి చాలా మంచి స్టోరీ లైన్ ని రాసుకుని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎంగేజింగ్ గా క్లాసిక్ గా తెరకెక్కించారు. ఇక సంజయ్ గా సూర్య చాలా సింపుల్ గా సెటిల్డ్ గా కనిపించాడు. ఎమోషన్స్ కూడా సిచ్యుయేషన్స్ కి తగ్గట్టు ఉండడంతో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ.. సూర్య నటించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మామితా బైజు సినిమాకి ఎంటర్టైన్మెంట్ పరంగా మంచి ప్లస్ అయింది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా, బరువైన భావోద్వేగాలను బాగా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇక రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ యాక్టింగ్ లో వాళ్ళ సీనియారిటీ చూపించారు. సుధ, సర్వదమన్ బెనర్జీ, హర్ష చెముడు, మాథ్యూ వర్గీస్, రఘుబాబు వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు.
Minus Points :
అయితే కథ వరకు బాగా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్న వెంకీ అట్లూరి దానికి తగ్గ స్క్రీన్ ప్లే కూడా బాగానే రాసినా, కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేయడంలో కొంచెం తడబడ్డాడు. విడివిడిగా సినిమాలో ఫ్యామిలీ సీన్స్ ని బాగానే డిజైన్ చేసుకున్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ ని బలంగా పండించే స్థాయిలో సీన్స్ రాసుకోలేదు. అలాగే హీరో, హీరోయిన్ లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్ చూపించి ఉంటే బాగుండేది.
Technical Values :
ఈ సినిమాకి డైరెక్టర్ వెంకీ రాసుకున్న స్టోరీ, అలాగే అయన స్క్రీన్ ప్లే టేకింగ్ మేజర్ బిగ్ ప్లస్. పలు ఎమోషనల్ సీన్స్ ని కూడా సెటిల్డ్ గా చూపించారు. పైగా సినిమాలో వాటికి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అయితే సినిమాలో కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
Final Review :
ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఒక డీసెంట్ ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా ఆడియన్స్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. సూర్య సెటిల్డ్ పెర్ఫార్మన్స్, మామితా బైజు ఎనర్జిటిక్ నటన, అలాగే సినిమా కథాంశం తాలూకు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. టెక్నికల్ గానూ ఎక్కడా పెద్దగా వంక పెట్టలేని ఈ సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుంది.
Review Statistics
Review Average
You Might Also Like
మకుటం (Makutam)
2026
డీసీ (DC)
2026