Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 613–624 of 1045 reviews

Rakasa Movie Review

రాకాస ఎంటర్‌టైనింగ్ సినిమా. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ అద్భుతంగా వినోదాన్ని పంచింది. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు. నయన్ సారిక, గెటప్ శ్రీనులకు...

రాకాస ఎంటర్‌టైనింగ్ సినిమా. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ అద్భుతంగా వినోదాన్ని పంచింది. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు. నయన్ సారిక, గెటప్ శ్రీనులకు కూడా మంచి స్కోప్ దొరికింది. స్టోరీ యూనిక్‌గా ఉంది, కథను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్‌లో ఫన్, ఇంటెన్స్‌గా ఉంది. ఎమోషనల్ టచ్‌తో అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మానస శర్మ డైరెక్షన్ స్టాండ్‌ ఔట్‌గా ఉంది. నిహారిక కొణిదెల నిర్మాణ విలువలు బాగున్నాయి. 


సినిమా అంతటా ఎంతో వినోదాత్మకంగా సాగింది. అలాగే స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండిగ్ వరకు ఆసక్తికరంగా సాగింది. గెటప్ శ్రీను టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మొత్తం మీద థియేటర్‌లలో చూడదగ్గ మంచి సినిమా ఇది అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. మంచి కామెడీతో ఈ సినిమా ఫన్‌గా ఉంది. సాంగ్స్, బీజీఎం చాలా బాగున్నాయి. మేజిక్ మూవ్‌మెంట్స్, హిలేరియస్ సన్నివేశాలు ఎక్కడా అతి లేకుండా సరదాగా కుదిరాయి. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. వీఎఫ్ఎక్స్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓవరాల్ గా రాకాస సినిమా ఫామిలీ తో చూసే పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీగా చెప్పుకోవచ్చు. 

7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 News Channel
Sakshi

By Sakshi

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మ...


మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుతో ఓ డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.

నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించగా, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా అనిపించకపోయినా… నాసిరకం అనే భావన రాకుండా క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్‌గా ఉండగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా కనిపించాయి.

సమ్మర్ సీజన్ నేపథ్యంలో ‘రాకాస’ సినిమా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ హారర్-కామెడీ అంశాలు నచ్చేలా ఉన్నాయి.

మొత్తంగా ‘రాకాస’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒకసారి చూసే విధంగా ఉండే డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. 

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, ఓవరాల్ గా ఒక డీసెంట్ ఫన్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ డ్రామాగా చెప్పొచ్చు. 


నటీనటులు పెర్ఫార్మన్స్ పరంగా సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శీను, వెన్నెలకిషోర్ తదితరులు ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్ అద్భుతం అనిపించకపోయినా కూడా.. నాసిరకం అనే ఫీల్ అయితే కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ వండర్స్ క్రియేట్ చేయలేదు కానీ.. నాసిరకంగా అయితే అనిపించవు. నిర్మాణ విలువలతో మరోసారి ఆకట్టుకుంది మెగా ప్రొడ్యూసర్ నిహారిక. ఇక సమ్మర్ సీజన్ కావడంతో.. పిల్లలు ‘రాకాస’ని బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మరి పెద్దలు కూడా థియేటర్స్‌కి రావాల్సిందే కాబట్టి.. ‘రాకాస’కి కాసులు లోటైతే ఉండదు.

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, ఓవరాల్ గా ఒక డీసెంట్ ఫన్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ డ్రామాగా చెప్పొచ్చు. 


సంగీత్, వెన్నెల కిషోర్ అలాగే గెటప్ శ్రీనులు మంచి ఫన్ ని అందించారు. హీరోయిన్ నయన్ సారిక డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. అలాగే కొత్త దర్శకురాలు మానస శర్మ కొన్ని చోట్ల తడబడినప్పటికీ సెకండాఫ్ ని ఆమె సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే హర్రర్ మూవీ అనగానే భయపెట్టే సీన్లు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాకుండా డీసెంట్ గా... మరీ కొత్త రకమైన కథ ఎక్స్పెక్ట్ చేయకుండా, సో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే రాకాస చిత్రం మెప్పిస్తుంది. 

7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker movie Review

బైకర్ (Biker) 2026 Twitter Channel
'బైకర్' ఒక ఓకే అనిపించే స్పోర్ట్స్ డ్రామా. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా… కంటెంట్ మాత్రం పూర్తిగా క్లిక్ కాలేదు.ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది… ప్రీ-ఇంటర్వెల్ దగ్గరే కొంచెం పికప్ అవుత...

'బైకర్' ఒక ఓకే అనిపించే స్పోర్ట్స్ డ్రామా. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా… కంటెంట్ మాత్రం పూర్తిగా క్లిక్ కాలేదు.


ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది… ప్రీ-ఇంటర్వెల్ దగ్గరే కొంచెం పికప్ అవుతుంది. సెకండాఫ్ కొన్ని చోట్ల బాగున్నా… పేసింగ్ ఇష్యూస్ వల్ల ఫ్లో మిస్ అవుతుంది.


బైక్ రేసింగ్ సీన్స్ మాత్రం బాగా షూట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా కనిపిస్తాయి.


కానీ స్టోరీ పూర్తిగా ప్రెడిక్టబుల్… ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల మాత్రమే వర్క్ అవుతాయి. విలన్ ట్రాక్, కార్పొరేట్ యాంగిల్ బోర్ కొట్టించేలా ఉన్నాయి.


మొత్తానికి మంచి ప్రయత్నమే అయినా… పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది.

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

ముందుగా మోటోక్రాస్ రేసింగ్ ను ఎంచుకోవడంతోనే బైకర్ సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది. స్పోర్ట్స్ మూవీస్ లో ఉండే ఎమోషన్స్, ఘర్షణలు, డ్రామా అంతా 'బైకర్' మూవీలో ఉంటుంది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్ లు చాలా థ్...

ముందుగా మోటోక్రాస్ రేసింగ్ ను ఎంచుకోవడంతోనే బైకర్ సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది. స్పోర్ట్స్ మూవీస్ లో ఉండే ఎమోషన్స్, ఘర్షణలు, డ్రామా అంతా 'బైకర్' మూవీలో ఉంటుంది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్ లు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇక మూవీ ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రేసింగ్ సీక్వెన్స్ లు, తండ్రీ త‌న‌యుల మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. శర్వానంద్, రాజశేఖర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే నటి మాళవిక నాయర్ కూ మంచి పాత్ర దక్కింది. 


అయితే స్పోర్ట్స్ సీక్వెన్స్ ల మీద పెట్టిన శ్రద్ధ దర్శకుడు ఎమోషన్స్ మీద కాస్త ఎక్కువగా పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని టాక్ వినిపిస్తోంది. ఇక బైకర్ మూవీకి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ కు బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అయితే అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో చెప్పాలంటే కష్టం. 


7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 Youtube Channel
అంటే బ్రో… ‘బైకర్’ అనగానే ఫుల్ రేసింగ్, స్పీడ్, థ్రిల్ అనుకుంటే కాస్త బ్రేక్ వేయాలి. బట్ ఇది ఎమోషన్స్ తో కూడిన అసలు స్పోర్ట్స్ డ్రామా రేసింగ్ మూవీ. జస్ట్ బ్యాక్‌ డ్రాప్ మాత్రమే వేరే విధంగా ఉంది. శర్వా...

అంటే బ్రో… ‘బైకర్’ అనగానే ఫుల్ రేసింగ్, స్పీడ్, థ్రిల్ అనుకుంటే కాస్త బ్రేక్ వేయాలి. బట్ ఇది ఎమోషన్స్ తో కూడిన అసలు స్పోర్ట్స్ డ్రామా రేసింగ్ మూవీ. జస్ట్ బ్యాక్‌ డ్రాప్ మాత్రమే వేరే విధంగా ఉంది. శర్వానంద్ తో పాటు రాజశేఖర్ రోల్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. హీరో శర్వానంద్ ఉన్నా… ఎమోషన్, వెయిట్ అన్నీ రాజశేఖర్ దగ్గరే ఉన్నాయి.  


శర్వానంద్ ఓకే… తన పాత్రకి బాగా న్యాయం చేశాడు. కాకపోతే అంతకుమించి సినిమా కోసం ఫిజికల్ గా కష్టపడ్డాడు. మాళవిక నాయర్ కూడా గ్లామర్ మాత్రమే కాదు… సెకండాఫ్‌లో యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేసింది. జిబ్రాన్ BGM ప్లస్ రేసింగ్ సీన్స్‌ లో హైప్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఫీల్… రెండూ బాగా సెట్ అయ్యాయి. విజువల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమాని స్పోర్ట్స్ డ్రామా లు ఇష్టపడే మూవీ లవర్స్ ఈజీ గా ఒకసారి చూసేయొచ్చు.

7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 Youtube Channel
శర్వానంద్ నటించిన థియేటర్లో రిలీజ్ అయి రన్ అవుతుంది. టాక్ విషయానికి వస్తే... ‘బైకర్’ సినిమా యావరేజ్ డీసెంట్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సింపుల్ గా కథ గురించి చెప్పాలంటే రేసింగ్ అనే ఉపరితలానికి లోపల, తండ్ర...

శర్వానంద్ నటించిన థియేటర్లో రిలీజ్ అయి రన్ అవుతుంది. టాక్ విషయానికి వస్తే... ‘బైకర్’ సినిమా యావరేజ్ డీసెంట్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సింపుల్ గా కథ గురించి చెప్పాలంటే రేసింగ్ అనే ఉపరితలానికి లోపల, తండ్రి-కొడుకుల బంధాన్ని అన్వేషించే ఒక ఎమోషనల్ జర్నీ. రోల్స్ పరంగా శర్వానంద్, రాజశేఖర్ రోల్స్ బాగున్నా, ఎమోషన్స్ అంతగా పండలేదు. శర్వానంద్ తన పాత్రను అండర్‌ప్లేడ్‌గా, సహజంగా పోషించాడు. అలాగే రాజశేఖర్ రోల్ కూడాడీసెంట్ గా ఉంది. అతని పాత్రకు స్కోప్ ఎక్కువ ఉన్నా, డైరెక్టర్ సరైన ఎమోషనల్ సీన్లు రాసుకోలేదని అనిపిస్తుంది. 


టెక్నికల్ గా చూసుకుంటే... జిబ్రాన్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మంచి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. కాకపోతే స్టోరీ పరంగా చాలా రొటీన్ గా ఉంది. దాంతో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్ పై డైరెక్టర్ మరింత ఫోకస్ పెట్టి ఉంటె బాగుండేది. ఓవరాల్ గా సినిమా బీలో యావరేజ్ గా అనిపించింది. అంతగా నచ్చలేదు.

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 Youtube Channel
‘బైకర్’ అంటే ఫుల్ రేసింగ్ మూవీ అనుకుంటే కాస్త మోసపోతారు.ఇది అసలు రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఎమోషనల్ డ్రామా! చాలా డీసెంట్ గా నీట్ గా తీశారు. ముందు హీరో గురించి మాట్లాడితే…శర్వానంద్ ఓకే… తన పని పర్ఫ...

‘బైకర్’ అంటే ఫుల్ రేసింగ్ మూవీ అనుకుంటే కాస్త మోసపోతారు.

ఇది అసలు రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఎమోషనల్ డ్రామా! చాలా డీసెంట్ గా నీట్ గా తీశారు. ముందు హీరో గురించి మాట్లాడితే…

శర్వానంద్ ఓకే… తన పని పర్ఫెక్ట్ గా చేసేశాడు. కానీ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ హీరోతో ఈక్వెల్ గా రాజశేఖర్ కి ఉంటుంది. కానీ పెర్ఫార్మన్స్ కి స్కోప్ కాస్త తక్కువైంది. సునీల్ నారాయణ’గా అయన రోల్ సినిమాలో చాలా మంచి వెయిట్ ఉంది. 


అలాగే శర్వానంద్ తన వికాస్ రోల్ కోసం బాగా కష్టపడ్డాడని తెలుస్తూనే ఉంది. ఇటు మాళవిక నాయర్ కూడా కేవలం గ్లామర్ కాదు… యాక్టింగ్ కూడా చూపించింది. అతుల్ కులకర్ణి విలన్‌ గా సైలెంట్‌గా వచ్చి పని అయిపోయినట్టు వెళ్లిపోతాడు. ఇటు టెక్నికల్ గా జిబ్రాన్ బీజీఎమ్ అదిరిపోయింది. రేసింగ్ సీన్స్‌ లో హైప్, ఎమోషన్స్‌ లో ఫీల్ ని బాగా క్యారీ చేశాడు. ఇటు విజువల్ గా కూడా బైకర్ అదిరిపోయింది. కాకపోతే స్టోరీ రొటీన్ గా ఒకే ఫార్మాట్ లో ఉండి జెర్సీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఓవరాల్ గా టేకింగ్ వైస్ అల్టిమేట్ గా బైకర్ ఉంటుంది. 

7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 Youtube Channel
ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ‘బైకర్’. ముందుగా స్ట్రైట్ పాయింట్‌కి వస్తే… ఈ సినిమా రేసింగ్ గురించే అనిపించినా, లోపల మాత్రం ప్యూర్ ఎమోషనల్ డ్రామా. తండ్రి-కొడుకుల బాండింగ్‌ ను దర్శకుడు చాలా సింపుల్‌గ...

ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ‘బైకర్’. ముందుగా స్ట్రైట్ పాయింట్‌కి వస్తే… ఈ సినిమా రేసింగ్ గురించే అనిపించినా, లోపల మాత్రం ప్యూర్ ఎమోషనల్ డ్రామా. తండ్రి-కొడుకుల బాండింగ్‌ ను దర్శకుడు చాలా సింపుల్‌గా, కానీ ఎఫెక్టివ్‌గా చూపించాడు.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… రాజశేఖర్ గారు ‘సునీల్ నారాయణ’ పాత్రలో చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్‌ లో కనిపించారు. నిజానికి ఈ కథ లో ఆయన కూడా హీరోనే అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ లో వచ్చే సీన్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.


శర్వానంద్ కూడా తన పాత్రలో సెటిల్‌ గా నటించాడు. పైగా శర్వానంద్ లుక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రేసర్ గా బాగా సెట్టయ్యాడు.

టెక్నికల్‌గా జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద ప్లస్. రేసింగ్ సీన్స్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం, స్టోరీ కొత్తగా లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. కానీ సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ వల్ల సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిమ్. 

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 Youtube Channel
Thyview

By Thyview

అంటే ఫస్ట్ క్లియర్‌ గా సినిమా గురించి చెప్పాలంటే… ‘బైకర్’ అనేది ప్యూర్ రేసింగ్ సినిమా కాదు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ అసలు హీరో ఎవరు అంటే… శర్వానంద్ కాదు, రాజశేఖర్.&nbsp...

అంటే ఫస్ట్ క్లియర్‌ గా సినిమా గురించి చెప్పాలంటే… ‘బైకర్’ అనేది ప్యూర్ రేసింగ్ సినిమా కాదు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ అసలు హీరో ఎవరు అంటే… శర్వానంద్ కాదు, రాజశేఖర్. సునీల్ నారాయణ గా ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమాకి వేరే వెయిట్ వచ్చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకి బిగ్గెస్ట్ బూస్టప్ నిస్తాయి. ఇక శర్వానంద్ తన రోల్ వరకు చాలా బాగా చేసాడు, కానీ వెయిట్ అంత ఎక్కువగా కనిపించలేదు. పైగా తన రోల్ కోసం ఫిజికల్ గా చాలా కష్టపడ్డట్టు ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది.


ఇటు మాళవిక నాయర్ కూడా జస్ట్ గ్లామర్ కోసం కాదు… సెకండాఫ్‌ లో మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. విలన్‌గా అతుల్ కులకర్ణి సైలెంట్‌ గా తన పని చేసేశాడు. ఇక జిబ్రాన్ అదిరిపోయే బీజీఎమ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇటు విజువల్స్ కూడా నీట్ గా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అయింది. స్టోరీ కూడా కొత్తది కాదు, అయినా…

సెకండాఫ్ + క్లైమాక్స్ వల్ల సినిమా నిలబడింది. ఓవరాల్ గా బైకర్ ఒక డీసెంట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం అని చెప్పొచ్చు. మరీ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో లేదో తెలీదు గాని, డిస్సపాయింట్ అయితే చేయలేదు. 

7.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu

Biker Movie Review

Gulte

By Gulte

శర్వానంద్ ‘బైకర్’లో మోటోక్రాస్ రేసింగ్ అనేది ఒక లేయర్ మాత్రమే. అసలు కథ మాత్రం తండ్రి-కొడుకుల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆ కోణంలో సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. రాజశేఖర్ ఈ పాత్రను చాలా ఈజ్‌ త...

శర్వానంద్ ‘బైకర్’లో మోటోక్రాస్ రేసింగ్ అనేది ఒక లేయర్ మాత్రమే. అసలు కథ మాత్రం తండ్రి-కొడుకుల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆ కోణంలో సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. 

రాజశేఖర్ ఈ పాత్రను చాలా ఈజ్‌ తో, అనుభవంతో క్యారీ చేశారు. హీరోగా కనిపించకపోయినా… కథలో వెయిట్ మాత్రం ఆయనే మోశారు. క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్ సీన్ సినిమాలో బెస్ట్ మోమెంట్‌ గా నిలుస్తుంది. అక్కడ ఆడియన్స్‌ని టచ్ చేసే ఎమోషన్ వర్కౌట్ అయింది. మాళవిక నాయర్ పాత్రకు మంచి స్కోప్ ఉంది. మొదట గ్లామర్ టచ్ ఇచ్చి… తర్వాత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.



టెక్నికల్‌గా జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. రేసింగ్ సీన్స్‌లో ఎనర్జీ పెంచడమే కాకుండా… ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా వర్క్ అయింది. విజువల్స్ కూడా నైస్‌గా ఉన్నాయి. డైలాగులు తక్కువగా ఉన్నా, కొన్ని లైన్స్ మాత్రం స్ట్రైట్‌గా హిట్ అవుతాయి. మొత్తానికి ‘బైకర్’ రేసింగ్ మూవీ కంటే ఎమోషనల్ డ్రామాగా బెటర్‌గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించినా… సెకండాఫ్, క్లైమాక్స్ వల్ల ఓవరాల్‌గా ఓకే అనిపించే సినిమా

6.0
out of 9
3 months ago
Apr 03, 2026 Telugu
Why MRO?