బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
Bethlehem Kudumba Unit : మలయాళ స్టార్ నివిన్ పౌలీ (Nivin Pauly), మమిత బైజు (Mamitha Baiju) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit). మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుండగా, తాజాగా తెలుగులో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.
Reviews
What critics and the public are saying about బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
Media Reviews
13 Avg: 6.6/10Above Average
Bethlehem Kudumba unit movie review
బెత్లేహెం కుడుంబ యూనిట్.. బేసిగ్గా మలయాళంలో రెండు వారాల కిందే వచ్చింది.. కానీ తెలుగు వెర్షన్ చూద్దామని అనుకుని ఇప్పుడు చూసొచ్చా... ఇక సినిమా గురించి చెప్పుకుంటే... ఎందుకో అంత బాలేదు సినిమా.. అంటే అంత ఏమి ఎక్కలేదు సినిమా.. అదేందో ఎదో రకంగా ఉంది సినిమా.. రెండున్నర గంటల సినిమా చూస్తే... కూడా నాలుగు గంట...
బెత్లేహెం కుడుంబ యూనిట్.. బేసిగ్గా మలయాళంలో రెండు వారాల కిందే వచ్చింది.. కానీ తెలుగు వెర్షన్ చూద్దామని అనుకుని ఇప్పుడు చూసొచ్చా... ఇక సినిమా గురించి చెప్పుకుంటే... ఎందుకో అంత బాలేదు సినిమా.. అంటే అంత ఏమి ఎక్కలేదు సినిమా.. అదేందో ఎదో రకంగా ఉంది సినిమా.. రెండున్నర గంటల సినిమా చూస్తే... కూడా నాలుగు గంటల సినిమా చూసిన ఫీల్ కలిగింది నాకు.. మలయాళం సినిమా ఇది పక్కా మలయాళం ఛాయలు ఉంటాయి కానీ ఫ్రెష్ ఫీల్ అయితే ఎక్కలేదు.
అండ్ సినిమాలో కామెడీ కూడా ఎక్కలేదు. ఎదో కొన్ని సీన్స్ నవ్వించాయి గాని గుర్తుపెట్టుకునేలా లేవు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చోచ్చు ఈ సినిమా... కానీ నాకైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానో ఏమో అంత ఎక్కలేదు. బట్ సినిమాలో హీరోహీరోయిన్లు బాగానే యాక్ట్ చేసారు. సో ఇక చెప్పాల్సింది ఎం లేదు, బాగా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కుడుంబ యూనిట్ నచ్చాలంటే గుడుంబా తీసుకోవాలి. ఇక నా రేటింగ్ ఈ సినిమాకు ఇవ్వాల్సి వస్తే... 2.75\5
Hit
Bethlehem Kudumba Unit movie Review
సో బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సో సినిమా ఎలా ఉందంటే మాములుగా లేపలేదు భాయ్ ఈ మూవీని. ok its good. అండ్ సినిమాలో హీరో నివిన్ పౌలి ఒక పెద్దమనిషిలాగానే ఉంటాడు. న్యాచురల్ గా క్యారెక్టర్ బాగుంది. ఇక సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు మధ్య ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని బాగా చూపించారు...
సో బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సో సినిమా ఎలా ఉందంటే మాములుగా లేపలేదు భాయ్ ఈ మూవీని. ok its good. అండ్ సినిమాలో హీరో నివిన్ పౌలి ఒక పెద్దమనిషిలాగానే ఉంటాడు. న్యాచురల్ గా క్యారెక్టర్ బాగుంది. ఇక సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు మధ్య ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని బాగా చూపించారు. అండ్ సినిమాలో ప్రేమలు ఎఫెక్ట్ చాలా కనిపించింది. చాలా సీన్లు ప్రేమలుని గుర్తుచేస్తాయి. కాకపోతే సినిమాలో మీమ్స్ డైలాగ్స్ ని ఇరికించినట్టు అనిపిస్తుంది.
అండ్ సినిమా సెకండ్ హాఫ్ ని మాత్రం బాగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అనవసరంగానే లాగినట్టు అనిపించింది. ఓకే వన్ టైం వాచబుల్. ఇక తెలుగులో సాంగ్స్ మాత్రం అష్ట దరిద్రంగా ఉన్నాయి. డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ కార్ సీన్స్ చాలా బాగున్నాయి. జెన్యూన్ గా నవ్వుకోవచ్చు. సో ఓవరాల్ గా బెత్లేహెం కుటుంబ యూనిట్ బాగుంది. డీసెంట్. ఒకసారైతే పక్కా చూసేలానే ఉంది.
Above Average
Bethlehem kubumba unit movie review
బెత్లేహెం కుడుంబ యూనిట్... మలయాళంలో few వీక్స్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయి, ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే మూవీ చూసాక కొంచెం మిక్స్డ్ ఫీలింగే కలిగింది. ఇక సినిమాలో ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరో హీరోయిన్లు వాళ్ళ పెద...
బెత్లేహెం కుడుంబ యూనిట్... మలయాళంలో few వీక్స్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయి, ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే మూవీ చూసాక కొంచెం మిక్స్డ్ ఫీలింగే కలిగింది. ఇక సినిమాలో ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరో హీరోయిన్లు వాళ్ళ పెద్దల్ని ఒప్పించి ఎలా పెళ్లిచేసుకున్నారనేది స్టోరీ. ఇక నివిన్ పౌలి - మామితా బైజు ఇద్దరూ పోటీ పడి మరి బాగా నటించారు. అండ్ మూవీలో వీళ్ళ ప్రపోజల్ సీన్ హైలెట్.
ఇక మూవీలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చాలా సింపుల్ వే లో ఉంటుంది. అందరికి అర్ధమేయ్యేలా, ఫ్యామిలీ కూడా చూసేలా ఉంది. మైనస్ అంటే రన్ టైం ఒక్కటే.. కొంచెం ల్యాగ్ ఫీల్ ఒస్తుంది. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ చాలానే చూసాం.. ఇందులో కొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అంతే. ఫైనల్ గా ఒక ఫీల్ గుడ్ మలయాళ లవ్ స్టోరీలా తక్కువ అంచనాలతో చూస్తే నచ్చుతుంది.
Above Average
Bethlehem kudumba unit movie review
బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే il iked it. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ. మూవీ అయితే ఏం తేడా అవ్వకుండా క్లీన్ గా ఎల్లిపోతుంది. స్టోరీ ఏంటంటే గిరీష్ ఏ.డి సినిమాల్లో పెద్దగా స్టోరీ ఉండదు. కానీ ఈ మూవీలో స్టోరీ యావరేజ్ గా ఉన్నా, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక...
బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే il iked it. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ. మూవీ అయితే ఏం తేడా అవ్వకుండా క్లీన్ గా ఎల్లిపోతుంది. స్టోరీ ఏంటంటే గిరీష్ ఏ.డి సినిమాల్లో పెద్దగా స్టోరీ ఉండదు. కానీ ఈ మూవీలో స్టోరీ యావరేజ్ గా ఉన్నా, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఎంటెర్టైనింగ్ గా ఉంటుంది. ఇక సినిమాలో పెద్దగా హెవీ డైలాగ్స్ కూడా ఉండవు. సింపుల్ ఫన్ క్యూట్ మూమెంట్స్.. అండ్ చాలా లైఫ్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్ లో. సో ఆర్గానిక్ గా స్టోరీ ముందుకు వెళ్తా ఉంటది.
అండ్ సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు చాలా నాచురల్ గా చేసారు. ఇక సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. మిక్సింగ్ కూడా బాగుంది. మూవీలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ కూడా బాగుంది. సినిమాలో ప్రతి పాయింట్ ని కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఎంతలో చెప్పాలో అంతలోనే చెప్పారు. ఓవరాల్ గా మూవీ బాగా నచ్చేసింది. ఇట్స్ వర్త్ వాచబుల్.
Hit
Bethlehem Kudumba Unit movie review
ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా,...
ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.
ఇక ఈ మూవీలో ప్రపోజల్ సీన్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాలేజీ వార్షికోత్సవంలో జరిగే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. సంభాషణల్లోని పంచ్‌లు బాగా పేలాయి. అయితే అక్కడక్కడా కొన్ని మైనస్‌లు లేకపోలేదు. జోయెల్ ప్రియురాలి అన్నయ్య క్యారెక్టర్ కథలో అంతగా ఇమడలేదు. అలాగే వినయ్ ఫోర్ట్ చిన్న పాత్ర, పదే పదే వచ్చే మద్యపాన సన్నివేశాలు కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెత్లెహెం కుటుంబ యూనిట్ బెస్ట్ ఛాయిస్..
ఓవరాల్‌గా బెత్లెహెం కుటుంబ యూనిట్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!
Hit
Bethlehem Kudumba Unit movie review
'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్...
'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తాయి. అందుకు కారణం... ఆయా సన్నివేశాలను గిరీష్ ఏడీ తీసిన విధానంతో పాటు నటీనటుల ప్రతిభ కూడా! కొన్ని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. ఫస్టాఫ్ అంతా క్యూట్, ఫన్ మూమెంట్స్‌తో వెళుతుంది. సెకండాఫ్‌లోనూ వినోదమే ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు.
అయితే హీరో లవ్ ఫెయిల్యూర్ గానీ, హీరోయిన్ కోసం పడిన తపనను గానీ ఎక్కువ చూపించలేదు. అందువల్ల, ప్రేమలో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ లోటును కామెడీ కవర్ చేసింది. సినిమాలో నివిన్ పౌలి - మమితా బైజు నటనలో మెలోడ్రామా గానీ, ఓవర్ డోస్ గానీ లేవు. ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వచ్ఛమైన వినోదం, సహజత్వానికి దగ్గరగా అనిపించే ప్రేమ, ఆహ్లాదకరమైన నటనతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' మంచి అనుభూతి ఇస్తుంది. క్లీన్ అండ్ ఆర్గానిక్ రొమాంటిక్ కామెడీ ఇది. తొలకరి చినుకులా, ప్రేమలో పడిన తర్వాత వచ్చే ఫీలింగ్‌లా బావుంటుంది. డోంట్ మిస్ ఇట్.
Above Average
Bethlehem Kudumba Unit Movie Review
బెత్లెహామ్ కుటుంబ యూనిట్ – షార్ట్ రివ్యూసింపుల్ కథ.. నేచురల్ లొకేషన్స్.. క్లీన్ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’. నివిన్ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంగీత్ ప్రతాప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.ఎలాంట...
బెత్లెహామ్ కుటుంబ యూనిట్ – షార్ట్ రివ్యూ
సింపుల్ కథ.. నేచురల్ లొకేషన్స్.. క్లీన్ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’. నివిన్ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంగీత్ ప్రతాప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
ఎలాంటి అనవసర హడావిడి లేకుండా ఫన్, రొమాన్స్, చిన్నపాటి ఎమోషన్స్‌ను దర్శకుడు గిరీష్ చక్కగా బ్యాలెన్స్ చేశారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, క్లీన్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్.
మొత్తంగా.. సింపుల్ లవ్‌స్టోరీతో హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’ మంచి ఎంటర్‌టైనర్.
Above Average
Bethlehem Kudumba unit Movie Review
Bethlehem Kudumba unit movie review : Positives:1. First Half2. Organic Comedy At Most Parts3. Nivin & Mamitha’s Chemistry4. Good MusicNegatives:1. Dragged-Out Second Half2. Predictable Narration3. Lack of Emotional DepthOverall, Bethlehem Kudumba Unit, is definitely a worthy...
Bethlehem Kudumba unit movie review :
Positives:
1. First Half
2. Organic Comedy At Most Parts
3. Nivin & Mamitha’s Chemistry
4. Good Music
Negatives:
1. Dragged-Out Second Half
2. Predictable Narration
3. Lack of Emotional Depth
Overall, Bethlehem Kudumba Unit, is definitely a worthy watch for the genuine fun it offers and an excellent first half. You can happily watch it and laugh out loud with your friends and family. It may not be as wholesome as ‘Premalu’, but it certainly is a breezy entertainer which let you have a smile on your face at most parts. However, a bit more care in giving emotional depth, would have made the film even better.
Bottom Line – Fun Worked
Hit
Bethlehem movie Review
‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’ : నివిన్ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినోదంతో పాటు లైట్ ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఆకట్టుకుంటుంది. దర్శకుడు గిరీష్ కథను చాలా సింపుల్ గా ఉంచి, కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ మూమెంట్స్‌ను సహజంగా కథలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధ...
‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’ : నివిన్ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినోదంతో పాటు లైట్ ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఆకట్టుకుంటుంది. దర్శకుడు గిరీష్ కథను చాలా సింపుల్ గా ఉంచి, కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ మూమెంట్స్‌ను సహజంగా కథలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం. అనవసరమైన సన్నివేశాలు, ఓవర్ ది టాప్ కామెడీకి వెళ్లకుండా.. కథకు అవసరమైనంత మేరకే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు.
నివిన్ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ తమ పాత్రలను సహజంగా పోషించి సినిమాకు మంచి ఫీల్‌ను తీసుకొచ్చారు. సంగీత్ ప్రతాప్ తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాడు. సహజమైన లొకేషన్స్, సింపుల్ మేకింగ్ సినిమాకు ఫ్రెష్ లుక్‌ను అందించాయి.
మొత్తంగా.. బలమైన కథ కంటే సహజమైన కథనం, మంచి కెమిస్ట్రీ, క్లీన్ కామెడీపై ఆధారపడిన లైట్ హార్ట్‌డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహామ్ కుటుంబ యూనిట్’. పెద్దగా అంచనాలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంపిక. చివరిగా బెత్లేహెం కుడుంబ యూనిట్ ఒక చిల్, టైం పాస్ ఎంటర్టైనర్. ఫన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్...
Hit
Bethlehem Kudumba Unit movie review
పెద్ద హడావిడి లేకుండా సింపుల్ కథ, పచ్చని పరిసరాల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టేస్తుంటారు మలయాళ మేకర్స్. అందుకే ఆ చిత్రాలకు టాలీవుడ్ లో అంత క్రేజ్. ఓటీటీల్లోనే కాకుండా థియేట్రికల్‌గా కూడా మాలీవుడ్ చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తుంది. తాజాగా వచ్చిన అలాంటి సింపుల్ సినిమానే బెత్...
పెద్ద హడావిడి లేకుండా సింపుల్ కథ, పచ్చని పరిసరాల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టేస్తుంటారు మలయాళ మేకర్స్. అందుకే ఆ చిత్రాలకు టాలీవుడ్ లో అంత క్రేజ్. ఓటీటీల్లోనే కాకుండా థియేట్రికల్‌గా కూడా మాలీవుడ్ చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తుంది. తాజాగా వచ్చిన అలాంటి సింపుల్ సినిమానే బెత్లెహామ్ కుటుంబ యూనిట్. నివీన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేమలు తరహా లోనే దర్శకుడు గిరీష్ మరోసారి సింపుల్ కథ, ఫన్ ఎలిమెంట్స్ కి, చిన్నపాటి భావోద్వేగాలను మిళితం చేసి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచారు.
ఇటు నివిన్ పౌలి - మామితా బైజు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ కూడా పెర్‌ఫార్మర్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. సంగీత్ ప్రతాప్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పైగా స్ర్కీన్ ప్లే పర్ఫెక్ట్ గా కుదిరింది. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. సింపుల్ లైన్ తో పడిపడి నవ్వేలా దర్శకుడు చక్కగా సీన్స్ రాసుకున్నాడు. మలయాళం నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది బెస్ట్ గా నిలుస్తుంది. చిన్న లవ్‌స్టోరీ, వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
Hit
Bethlehem Kudumba Unit movie review
మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్త...
మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్తమ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినోదం విషయంలో ఈ సినిమా ‘ప్రేమలు’ స్థాయిని గుర్తుచేస్తూ చివరివరకు ఆకట్టుకుంటుంది.
దర్శకుడు గిరీష్ ఏడీ ‘ప్రేమలు’ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో హిట్ కొట్టారు. హింస, క్రైమ్ ప్రధానంగా సాగే సినిమాల నడుమ ఇలాంటి ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీలు రావడం ప్రేక్షకులకు మంచి ఊరట. ఓవరాల్ గా చెప్పాలంటే, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చక్కని రొమాంటిక్ కామెడీ డ్రామా. నివిన్ పౌలీ, మమితా బైజుల నటన, దర్శకుడు గిరీష్ ఏడీ మార్క్ హిలేరియస్ కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌లో కాస్త సాగతీతను తగ్గించి, భావోద్వేగాల తీవ్రత మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా హాయిగా చూసి నవ్వుకోదగ్గ మంచి చిత్రమిది. ఈ వీకెండ్ కు నిరభ్యంతరంగా థియేటర్‌లో చూడొచ్చు.
Hit
Bethlehem Kudumba unit movie review
బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్మాయి.. 90స్ అబ్బాయిని జత కలిపి ఓ ప్రేమ కథను అల్లుకున్నారు. అమ్మాయిలోని అల్లరి తనం, అబ్బాయిలోని అమాయక...
బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్మాయి.. 90స్ అబ్బాయిని జత కలిపి ఓ ప్రేమ కథను అల్లుకున్నారు. అమ్మాయిలోని అల్లరి తనం, అబ్బాయిలోని అమాయకత్వాన్ని జోడించి రాసుకున్న సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. తెరపై నివిన్ పౌలీ, మమిత జంట బాగుంటుంది. ఇద్దరూ తమ తమ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద ఎలివేషన్స్, దెబ్బకు వంద మందిని గాల్లోకి లేపేయడం, విపరీతమైన రక్తపాతం ఏమీ లేని ఓ సింపుల్ లవ్ అండ్ కామెడీగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
ఇక సినిమాలో టెక్నికల్ గానూ చాలా వరకు ఓ పెయింటింగ్‌లా అనిపిస్తుంది. కేరళ అందాలు కనువిందుని చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ కూడా చాలా సింపుల్ గానే కనిపించినా ఎంతో ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. చివరగా.. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ అనే టైటిల్ చూసి.. ఇదేదో వెరైటీ సినిమా అనుకోకండి.. ఇది జెన్ జీ అమ్మాయి, 90స్ అబ్బాయి క్యూట్ ప్రేమ కథ.
Hit
Bethlehem kudumba unit movie review
#BethlehemKudumbaUnit A Fun Rom-Com That Keeps Things Simple and Entertaining!Sensible and lighthearted take on an age-gap love story. First half is fun and filled with small moments that keep you smiling, while the second half maintains the same flow before dipping in the middle and starts to feel...
#BethlehemKudumbaUnit A Fun Rom-Com That Keeps Things Simple and Entertaining!
Sensible and lighthearted take on an age-gap love story. First half is fun and filled with small moments that keep you smiling, while the second half maintains the same flow before dipping in the middle and starts to feel stretched out in the pre-climax with some drag and an out of place fight. However, the simple yet heartwarming climax brings it back together nicely.
Nivin Pauly plays the older role perfectly, while Mamitha once again steals the show. It relies on familiar rom com tropes and doesn’t offer anything particularly new, but remains entertaining throughout with a few heartwarming moments along the way. Girish AD delivers another enjoyable rom com after Premalu. Winner!!
Rating: 3/5
Public Reviews
4 Avg: 6.5/10Above Average
Bethlehem Kudumba unit movie review
Bethlehem Kudumb Unit arrived in Malayalam two weeks ago, and I finally watched the Telugu version. Honestly, the film didn’t quite work for me. Despite having a runtime of around two and a half hours, it felt much longer, almost like watching a four-hour film. The movie carries the typical Malayala...
Bethlehem Kudumb Unit arrived in Malayalam two weeks ago, and I finally watched the Telugu version.
Honestly, the film didn’t quite work for me. Despite having a runtime of around two and a half hours, it felt much longer, almost like watching a four-hour film.
The movie carries the typical Malayalam flavour, but unfortunately, it lacks the fresh feel I expected. The comedy has a few entertaining moments, but nothing really memorable.
Regular movie lovers might enjoy it, but my expectations were probably a little too high. Nivin Pauly and Mamitha Baiju perform well and are among the positives. Overall, it didn’t impress me.
Hit
Bethlehem Kudumba Unit movie review
just now finished Bethlehem kudumba unit movie on first show.. its a simple, feel-good romantic comedy that relies on natural storytelling, clean humour, and relatable emotions. Director Girish keeps the narrative straightforward, blending romance, fun, and light emotional moments effectively.Nivin...
just now finished Bethlehem kudumba unit movie on first show.. its a simple, feel-good romantic comedy that relies on natural storytelling, clean humour, and relatable emotions. Director Girish keeps the narrative straightforward, blending romance, fun, and light emotional moments effectively.
Nivin Pauly and Mamitha Baiju share good chemistry and deliver natural performances, while Sangeeth Prathap adds extra entertainment with his comic timing. The well-written screenplay and clean presentation are major strengths.
Overall, it’s a refreshing and enjoyable Malayalam rom-com that works well for audiences looking for a light-hearted and entertaining watch.
Hit
Bethlehem Kudumba Unit movie review
Bethlehem Kudumba Unit is the kind of film that keeps things simple and lets the characters do the talking.A Gen-Z girl meets a 90s boy — and that contrast becomes the soul of this love story. Her playful chaos and his innocent charm create some genuinely fresh and enjoyable moments. Nivin Pauly and...
Bethlehem Kudumba Unit is the kind of film that keeps things simple and lets the characters do the talking.
A Gen-Z girl meets a 90s boy — and that contrast becomes the soul of this love story. Her playful chaos and his innocent charm create some genuinely fresh and enjoyable moments.
Nivin Pauly and Mamitha Baiju make a lovely pair on screen. Their chemistry feels natural, and both performances stay grounded without trying too hard. The film also scores visually. No massive elevations. No unnecessary action. Just love, comedy, emotions and good vibes.
Final Verdict: Simple in scale, refreshing in feel.
Above Average
Bethlehem Kudumba Unit movie Review
బెత్లెహెం కుటుంబ యూనిట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే.. simple stories కూడా right wayలో చెబితే ఎంత cuteగా ఉంటాయో ఈ సినిమా చూపించింది. Gen-Z అమ్మాయి, 90s అబ్బాయి.. ఈ combination itself interestingగా అనిపిస్తుంది. అమ్మాయిలోని అల్లరి, అబ్బాయిలోని innocenceని చాలా naturally blend చేసిన సీన్స్ fre...
బెత్లెహెం కుటుంబ యూనిట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే.. simple stories కూడా right wayలో చెబితే ఎంత cuteగా ఉంటాయో ఈ సినిమా చూపించింది. Gen-Z అమ్మాయి, 90s అబ్బాయి.. ఈ combination itself interestingగా అనిపిస్తుంది. అమ్మాయిలోని అల్లరి, అబ్బాయిలోని innocenceని చాలా naturally blend చేసిన సీన్స్ freshగా అనిపించాయి.
నివిన్ పౌలీ & మమిత జంట screen మీద చాలా naturalగా ఉంది. ఇద్దరి chemistry, performances సినిమాకు major plus. ఇక visuals అయితే Kerala beautyని చాలా beautifully capture చేశాయి. Production design, costumes అన్నీ simpleగా ఉన్నా storyకి perfectగా suit అయ్యాయి.
No unnecessary elevations, no over-the-top action.. just a feel-good love story with comedy & emotions.
Overall: Cute, refreshing & easy-going romantic entertainer.
About This Movie
Story :
క్యాటరింగ్ బిజినెస్ చేసే జస్టిన్ (Nivin Pauly)కి తన ఏరియాలో మంచి పేరు ఉంటుంది. కానీ మిడిల్ ఏజ్ వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండడం వల్ల ఏరియాలో వాళ్లంతా కామెంట్స్ చేస్తుంటారు. అవేం పట్టించుకోకుండా జస్టిన్ తన ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జస్టిన్ పక్కింటికి యాశ్లే (Mamitha Baiju) ఫ్యామిలీ అద్దెకు వస్తారు. ఈ క్రమంలో యాశ్లేకి - జస్టిన్ కి మెల్లిగా పరిచయం ఏర్పడి, యాష్లే జస్టిన్ కి ప్రపోజ్ చేస్తుంది. అయితే వీళ్లిద్దరికీ 10ఏళ్లకు పైగా గ్యాప్ ఉంటుంది. అందుకే జస్టిన్ ముందు యాక్సెప్ట్ చేయకపోయినా, చివరికి తన ప్రేమను అంగీకరిస్తాడు. అయితే వాళ్ళ ఇరు ఫ్యామిలీలకు ఇది ఇష్టం ఉండదు. ఈ క్రమంలో జస్టిన్ - యాశ్లే ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
బేసిగ్గా మలయాళ సినిమాలంటే తెలుగులో సాఫ్ట్ కార్నర్ ఉంది. రీసెంట్ గా వచ్చిన మలయాళ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇంతకు ముందు వచ్చిన ప్రేమలు మూవీ తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదే డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో సినిమాకి మంచి హై ఒచ్చింది. దాంతో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఫ్రెష్ గా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సింపుల్ కథతో వచ్చి ఆడియన్స్ ప్రేమలు రేంజ్ లో ఆకట్టుకునే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. పూర్తిగా ఎంటర్టైనింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఈ మూవీలో ఫ్రెష్ లవ్ సీన్స్ తో పాటు ఫన్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. పైగా లవ్ స్టోరీ అయినప్పటికీ ఎక్కడా లిమిట్స్ దాటకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లా అన్నివర్గాల ఆడియన్స్ ని అలరించేలా మూవీ తీసినందుకు డైరెక్టర్ గిరీష్ ఏడీని అభినందించి తీరాలి. అలాగే డబ్బింగ్ వెర్షన్ కూడా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఇక హీరో హీరోయిన్లుగా నివిన్ పౌలీ - మమితా బైజు ఇద్దరూ పోటీ పడి తమ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా, వీళ్ళ కెమిస్ట్రీ సినిమాకు మంచి ప్లస్ అయింది. అలాగే జస్టిన్ తమ్ముడు జోయెల్ పాత్రలో సంగీత్ ప్రతాప్ కామెడీని సినిమాకి ఎక్స్ట్రా బోనస్ అయింది.
Minus Points :
అయితే ఈ సినిమాకి లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కుదిరినా, స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేవి తక్కువయ్యాయి. సినిమాని పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దుదామని అనుకున్న మేకర్స్ బలమైన ఎమోషన్స్ సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవడంలో తడబడ్డారు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే డల్ అయిన ఫీల్ వస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఇంతకు మించి పెద్దగా నెగిటివ్ అంశాలేమి లేవు.
Technical Values :
టెక్నికల్ గా చూసుకుంటే... విష్ణు విజయ్ అందించిన సంగీతం చాలా బాగుంది. అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్రెష్ గా డీసెంట్ గా ఉంది. అలాగే అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ న్యాచురల్ గా ఉంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే అక్కడక్కడా కొన్ని సీన్లు చిన్నగా ఎడిట్ చేయాల్సింది. డైరెక్టర్ గిరీష్ ఏడీ ‘ప్రేమలు’ తర్వాత అంతకు మించిన మంచి మూవీ తీసి ప్రేమలుని మించి సక్సెస్ కొట్టారని చెప్పొచ్చు. ఎక్కడా అనవసరమైన రొటీన్ సీన్లు లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.
Final Review :
ఫైనల్ గా ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామా, ఒక చక్కని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా, అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. ముఖ్యంగా నివిన్ పౌలీ - మమితా బైజుల పెర్ఫార్మన్స్ తో పాటు, గిరీష్ ఏడీ తన మార్క్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన డైరెక్షన్ సినిమాకి చాలా ప్లస్ అయింది. కాకపోతే సినిమా స్టోరీకి తగ్గట్టు బలమైన ఎమోషన్స్ కూడా పండిస్తే మరింత ఆకట్టుకునేది. ఓవరాల్ గా యూత్ మాత్రమే కాదు, అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.