Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 709–720 of 1045 reviews

Ustaad Bhagat singh movie Review ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. స్క్రీన్‌పై పవన్ కనిపించే ప్రతి సీన్‌లో ఆయన స్వాగ్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. స్క్రీన్‌పై పవన్ కనిపించే ప్రతి సీన్‌లో ఆయన స్వాగ్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు పూర్తి సంతృప్తినిస్తాయి. అయితే కథ, కథనం విషయానికి వస్తే దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి పూర్తిగా మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో పాత కథన శైలి స్పష్టంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్, మాస్ సీన్స్ బాగున్నప్పటికీ మొత్తం సినిమా మీద ప్రభావం చూపలేకపోయాయి. తొలిప్రేమ రిఫరెన్స్ సీన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. హీరోయిన్‌లుగా శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా, వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. విలన్ పాత్ర బలహీనంగా ఉండటం సినిమాకు మైనస్. టెక్నికల్‌గా విజువల్స్ బాగున్నా, ఎడిటింగ్ లోపాలు, లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా అనిపించే అవకాశముంది.
5.0
out of 9
4 months ago
Mar 20, 2026 Telugu

Ustaad Bhagat singh Movie Review

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పండగే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, స్వాగ్ బాగానే కనిపిస్తాయి. కానీ కంటెంట్ విషయంలో సినిమా పూర్తిగా మ...
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పండగే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, స్వాగ్ బాగానే కనిపిస్తాయి. కానీ కంటెంట్ విషయంలో సినిమా పూర్తిగా మెప్పించదు. దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) మాస్ ఎలివేషన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి, ఎమోషన్‌ను కొంత మిస్ అయ్యాడు. ఫస్టాఫ్ ఎక్కువగా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం బెటర్‌గా ఉంటుంది. ముఖ్యంగా తొలిప్రేమ రిఫరెన్స్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతాయి. పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్స్‌గా నిలుస్తాయి. అయితే రొటీన్ స్టోరీ, బలహీనమైన విలన్ ట్రాక్, వర్కౌట్ కాని కామెడీ సినిమాకు మైనస్. శ్రీలీల, రాశీ ఖన్నా పాత్రలు పరిమితంగానే ఉంటాయి. పార్థిబన్ నటన బాగున్నా, క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా అనిపించదు. టెక్నికల్‌గా చూస్తే విజువల్స్ రిచ్‌గా ఉన్నా, ఎడిటింగ్ వీక్‌గా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకులకు ఇది రొటీన్ కమర్షియల్ సినిమా అనిపించే అవకాశం ఉంది.
5.0
out of 9
4 months ago
Mar 20, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

శ్రీ విష్ణు హీరోగా, యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన “విష్ణు విన్యాసం” కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా టెక్నికల్‌గా బాగానే ఉన్నా, కంటెంట్ పరంగా మాత్రం మిక్స్‌...

శ్రీ విష్ణు హీరోగా, యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన “విష్ణు విన్యాసం” కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా టెక్నికల్‌గా బాగానే ఉన్నా, కంటెంట్ పరంగా మాత్రం మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా పెద్దగా గుర్తుండవు. అయితే నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో కామెడీని బాగా హైలైట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ మాత్రం కలర్‌ఫుల్‌గా, కనువిందు చేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా కనిపిస్తాయి. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికి వస్తే… ఎడిటింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో క్లారిటీ లేకపోవడం, సన్నివేశాలు వెనకా ముందు అనిపించడం సినిమా ప్రభావాన్ని తగ్గించాయి. కథ కూడా చాలా చిన్నదిగా ఉండటం, దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నారో స్పష్టంగా కనెక్ట్ కాకపోవడం మైనస్. అయితే కామెడీ ట్రాక్ మాత్రం కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయ్యింది. శ్రీ విష్ణు తన స్టైల్‌లో ఫ్రీడమ్ తీసుకుని చేసిన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా చూస్తే… టెక్నికల్‌గా బాగున్నా, బలహీనమైన కథనం వల్ల “విష్ణు విన్యాసం” పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని కామెడీ సన్నివేశాల కోసం మాత్రమే ఒకసారి చూడదగ్గ సినిమా.

6.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie review

“విష్ణు విన్యాసం”… ఒక ఐడియాగా చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జాతకాలు, వాస్తు వంటి నమ్మకాల మీద ఒక లైట్ కామెడీ డ్రామా చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను స్క్రీన్‌పై కన్విన్సింగ్‌గా మలచడ...

“విష్ణు విన్యాసం”… ఒక ఐడియాగా చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జాతకాలు, వాస్తు వంటి నమ్మకాల మీద ఒక లైట్ కామెడీ డ్రామా చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను స్క్రీన్‌పై కన్విన్సింగ్‌గా మలచడంలో సినిమా తడబడింది. శ్రీ విష్ణు తనకు బాగా తెలిసిన జోనర్‌లోనే ఉన్నాడు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల పని చేస్తాయి. కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల కొత్తదనం అనిపించదు. క్యారెక్టర్‌లో డెప్త్ కంటే మేనరిజమ్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో మీమ్ కల్చర్‌ను ఎక్కువగా వాడటం పెద్ద మైనస్. అది కథలో భాగంగా కాకుండా, ఆడియన్స్‌ను ఫోర్స్ చేసి నవ్వించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఫలితంగా కామెడీ నేచురల్‌గా రాదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా టోన్‌కు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాయి. నేరేషన్ విషయంలో ఫస్టాఫ్ కొంతవరకు హోల్డ్ చేసినా, సెకండాఫ్‌లో రైటింగ్ వీక్ అవ్వడంతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. ముఖ్యంగా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌కు సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోయారు.

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్క...

అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్కడో చూసినట్టుంది కదా?” అనిపిస్తుంది. శ్రీ విష్ణు మాత్రం తన స్టైల్‌లో వన్ లైనర్స్ కొడుతూ సినిమాను లాగడానికి ట్రై చేశాడు. కొన్ని చోట్ల నవ్వు వస్తుంది… కానీ చాలా చోట్ల అదే కామెడీ రిపీట్ అవుతూ బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఈ మీమ్ మ్యూజిక్… మీమ్ రిఫరెన్స్‌లు… అబ్బా! సినిమా చూస్తున్నామా లేక రీల్స్ చూస్తున్నామా అన్న కన్ఫ్యూజన్. పాటలు వస్తే “సరే… అయిపోండి ప్లీజ్” అనిపించే రేంజ్ సెకండాఫ్ కి వెళ్లేసరికి సినిమా పూర్తిగా స్లో అయి… డ్రాగ్ ఫీల్ వస్తుంది. మొత్తానికి చెప్పాలంటే… పూల చొక్కా వేసుకుని వెళ్తే కూడా ఫ్రెష్ ఫీలింగ్ రాదు

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie review

విష్ణు విన్యాసం”… టైటిల్ వినగానే ఏదో ఫ్రెష్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం పాత ఫార్ములానే. జాతకాలు, వాస్తు, సిల్లీ కాన్‌ఫ్లిక్ట్… ఇవన్నీ కలిపి ఒక లైట్ ఎంటర్‌టైనర్ చేయ...

విష్ణు విన్యాసం”… టైటిల్ వినగానే ఏదో ఫ్రెష్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం పాత ఫార్ములానే. జాతకాలు, వాస్తు, సిల్లీ కాన్‌ఫ్లిక్ట్… ఇవన్నీ కలిపి ఒక లైట్ ఎంటర్‌టైనర్ చేయాలని ట్రై చేశారు. శ్రీ విష్ణు తన స్ట్రెంగ్త్ అయిన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. కొన్ని వన్ లైనర్స్, కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. కానీ అదే స్టైల్ రిపీట్ అవుతుండటం వల్ల ఒక దశ తర్వాత బోర్ ఫీలింగ్ వస్తుంది. సినిమాలో మీమ్ రిఫరెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోవడం మైనస్. కామెడీని నేచురల్‌గా కాకుండా ఫోర్స్డ్‌గా తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండవు… ఫ్లో కూడా బ్రేక్ అవుతుంది. కథ చాలా సింపుల్ అయినా, దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఫస్టాఫ్ ఓకే అనిపించినా… సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా డ్రాగ్ అవుతుంది. మొత్తానికి… శ్రీ విష్ణు ఫ్యాన్స్‌కు కొంతవరకు ఓకే అనిపించొచ్చు. కానీ ఓవరాల్‌గా చూస్తే ఇది అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. Verdict: ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే… లేదంటే స్కిప్ చేయొచ్చు.

6.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

ఈ విష్ణు విన్యాసం ఏంట్రా బాబు! స్టోరీ అంటే… చాలాసార్లు చూసిన అదే ఓల్డ్ టెంప్లేట్. శ్రీ విష్ణు వచ్చి తన మార్క్ వన్ లైనర్స్ కొడతాడు… మనం నవ్వుతామా అంటే… ఈసారి అంతగా కుదర్లేదు! ఫస్ట్ హాఫ్ లో కొంచెం నవ్వు...

ఈ విష్ణు విన్యాసం ఏంట్రా బాబు! స్టోరీ అంటే… చాలాసార్లు చూసిన అదే ఓల్డ్ టెంప్లేట్. శ్రీ విష్ణు వచ్చి తన మార్క్ వన్ లైనర్స్ కొడతాడు… మనం నవ్వుతామా అంటే… ఈసారి అంతగా కుదర్లేదు! ఫస్ట్ హాఫ్ లో కొంచెం నవ్వులు పడతాయి అనిపిస్తుంది… కానీ వెంటనే మీమ్ మ్యూజిక్, మీమ్ రిఫరెన్స్‌లు ఓవర్‌గా వాడేసి పూర్తిగా ఇరిటేట్ చేస్తారు. “ఇది సినిమా చూస్తున్నామా లేక యూట్యూబ్ మీమ్ వీడియోనా?” అన్న ఫీలింగ్ వస్తుంది. సెకండాఫ్ కి వస్తే… కథ ఏదో వెళ్లిపోతుంది… కామెడీ కూడా పూర్తిగా డ్రాప్ అవుతుంది. కొన్ని సీన్స్ తప్పితే మొత్తం డ్రాగ్. పాటలు వస్తే స్కిప్ కొట్టాలని అనిపిస్తుంది… అంత బోర్! శ్రీ విష్ణు మాత్రం తన స్టైల్‌లో ట్రై చేశాడు… కానీ ఈసారి ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు అన్నమాట. సినిమా మొత్తం ఆయన ఒక్కడే లాగలేడు కదా! ఈ సినిమా చూసేలోపే మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోండి… లేదంటే డిజప్పాయింట్ అవుతారు!

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie review

Thyview

By Thyview

ఇది ఒక అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. స్టోరీ చాలా సింపుల్… శ్రీ విష్ణు మార్క్ వన్ లైనర్స్ మీదే సినిమా నడుస్తుంది. కానీ ఈసారి ఆ కామెడీ క్లిక్ కాలేదు. అదే డబ్బింగ్ స్టైల్, అదే టైమింగ్ రిపీట్ అవుతూ బోర...

ఇది ఒక అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. స్టోరీ చాలా సింపుల్… శ్రీ విష్ణు మార్క్ వన్ లైనర్స్ మీదే సినిమా నడుస్తుంది. కానీ ఈసారి ఆ కామెడీ క్లిక్ కాలేదు. అదే డబ్బింగ్ స్టైల్, అదే టైమింగ్ రిపీట్ అవుతూ బోర్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా మీమ్ రిఫరెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మీమ్ మ్యూజిక్ చాలా చోట్ల ఇరిటేట్ చేస్తాయి. నవ్వించే ప్రయత్నం ఎక్కువగా ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది. పాటలు కూడా అసలు వర్కవుట్ కాలేదు… సినిమాకి ఫ్లోనే బ్రేక్ చేస్తాయి. ఇలాంటి సినిమాలకు పెద్ద స్టోరీ అవసరం లేదు… కానీ ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, కన్సిస్టెంట్ కామెడీ మాత్రం అవసరం. ఇక్కడ అవే మిస్సయ్యాయి. కొన్ని సీన్స్ మాత్రమే నవ్విస్తాయి, మిగతా టైమ్ డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది. శ్రీ విష్ణు తన వంతు ట్రై చేసినా… సినిమా మొత్తాన్ని సేవ్ చేయలేకపోయాడు. Overall: లైట్‌గా వెళ్తే కూడా అంతగా వర్కవుట్ కాదు.

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

#VishnuVinyasam – పనిచేయని పాత స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్! ఈ సినిమా చాలా బేసిక్ స్టోరీతో, టిపికల్ శ్రీ విష్ణు వన్‌లైనర్స్‌తో సాగుతుంది. కానీ ఈసారి ఆయనకు సెట్ అయిన డబ్బింగ్ స్టైల్ కామెడీ రిపిటేటివ్‌గా అ...

#VishnuVinyasam – పనిచేయని పాత స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్! ఈ సినిమా చాలా బేసిక్ స్టోరీతో, టిపికల్ శ్రీ విష్ణు వన్‌లైనర్స్‌తో సాగుతుంది. కానీ ఈసారి ఆయనకు సెట్ అయిన డబ్బింగ్ స్టైల్ కామెడీ రిపిటేటివ్‌గా అనిపిస్తూ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా చోట్ల హాస్యం ఫోర్స్డ్‌గా, ఓవర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా వాడిన మీమ్ రిఫరెన్స్‌లు, మీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాటలు కూడా బలహీనంగా ఉండి, సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ఇలాంటి సినిమాలకు స్ట్రాంగ్ స్టోరీ అవసరం లేకపోయినా, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడం, కామెడీ చాలా చోట్ల మాత్రమే వర్కవుట్ కావడం వల్ల సినిమా పూర్తిగా ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. శ్రీ విష్ణు తన వంతు ప్రయత్నం చేసినా, మొత్తంగా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ⭐ రేటింగ్: 2/5 🎬

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam Movie Review

విష్ణు విన్యాసం స్టోరీ లైన్ సింపుల్ — జాతకాలపై నమ్మకం ఉన్న లెక్చరర్ హీరో, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు.. కానీ ఆమె జాతకం వల్లే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, స్క్రీన్‌పై ఎగ్జిక్య...

విష్ణు విన్యాసం స్టోరీ లైన్ సింపుల్ — జాతకాలపై నమ్మకం ఉన్న లెక్చరర్ హీరో, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు.. కానీ ఆమె జాతకం వల్లే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయదు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అవుతూ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా స్లో అయి, డ్రాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా, దానికి సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోవడంతో గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల తన వన్ లైనర్స్‌తో నవ్విస్తాడు. హీరోయిన్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ కథ చుట్టూ తిరిగే ప్రధాన అంశాన్ని బలంగా ప్రెజెంట్ చేయలేకపోవడం మైనస్. టెక్నికల్‌గా చూస్తే సాంగ్స్ ఓకే, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లాజిక్‌లు మిస్సవడం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే.. అప్ & డౌన్స్ ఉన్న ఈ సినిమా, లాజిక్స్ పక్కన పెట్టి టైంపాస్ కోసం ఒకసారి చూసేయొచ్చు.

5.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam Movie Review

విష్ణు విన్యాసంలో కామెడీకి మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు యదునాథ్ మారుతీ రావు, దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వులు పండుతాయి. రధన్ మ్యూజిక్ పెద్దగా గుర్తుండ...

విష్ణు విన్యాసంలో కామెడీకి మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు యదునాథ్ మారుతీ రావు, దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వులు పండుతాయి. రధన్ మ్యూజిక్ పెద్దగా గుర్తుండదు, సినిమాకు మైనస్‌గా మారింది. అయితే సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను, ముఖ్యంగా యాక్సిడెంట్ ఎపిసోడ్‌ను ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ ఓకే, నిర్మాణ విలువలు పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది పూర్తిగా శ్రీ విష్ణు షో. తన స్టైల్ మ్యానరిజమ్స్, వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ ట్యాగ్‌కు తగ్గట్టుగా నవ్వులు పంచాడు. నయన్ సారిక అందంగా కనిపిస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో బాగానే చేసింది. కానీ సత్య పాత్ర మాత్రం ఆశించినంతగా వర్కవుట్ కాలేదు. మిగతా నటీనటులు తమ పాత్రలకు సరిపడా చేశారు కానీ వారికి పెద్దగా స్కోప్ దక్కలేదు. మొత్తంగా చూస్తే.. స్ట్రాంగ్ స్టోరీ, ఫుల్ లెంగ్త్ కామెడీ మిస్ అయిన ఈ సినిమా, శ్రీ విష్ణు కామెడీ కోసం అంచనాలు లేకుండా వెళితే ఒకసారి చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది

6.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

వాస్తు, జాతకాల నేపథ్యంలో వచ్చిన విష్ణు విన్యాసంలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, బలమైన కథ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. హీరో బలహీనతను ఉపయోగించుకునే పాత్రలు, హీరోయిన్ జాతకం చుట్టూ నడిచే డ్రామా ఉన్నప్పట...

వాస్తు, జాతకాల నేపథ్యంలో వచ్చిన విష్ణు విన్యాసంలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, బలమైన కథ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. హీరో బలహీనతను ఉపయోగించుకునే పాత్రలు, హీరోయిన్ జాతకం చుట్టూ నడిచే డ్రామా ఉన్నప్పటికీ సన్నివేశాల్లో బలం కనిపించదు. ఇది పూర్తిగా శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. నయన్ సారిక ఓకే అనిపించగా, సత్య తదితరులు ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రధన్ మ్యూజిక్ గుర్తుండదు. రెండో భాగం రిపీట్ ఫీల్‌తో నెమ్మదిగా అనిపిస్తుంది. మొత్తంగా కథ కంటే కామెడీ కోసం చూసే వారికి, శ్రీ విష్ణు అభిమానులకు ఈ సినిమా ఓకే అనిపించవచ్చు

6.0
out of 9
4 months ago
Mar 17, 2026 Telugu
Why MRO?