ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)
Dharmasthala Niyojakavargam : రూరల్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త పొలిటికల్ డ్రామా... చిన్న సినిమా పెద్ద కథ..
Available in:
About This Movie
టాలీవుడ్ లో పొలిటికల్ డ్రామాలకు ఎప్పుడూ హై డిమాండ్ ఉంటుంది. కానీ ఈ మధ్య పొలిటికల్ నేపథ్యంలో మూవీస్ చాలా తక్కువ వస్తున్నాయి. అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ కే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. అయితే తాజాగా పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో "ధర్మస్థల నియోజకవర్గం" పేరుతో తాజాగా ఓ సినిమా రానుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
"ధర్మస్థల నియోజకవర్గం" పేరిట విడుదలైన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ సీన్లతో ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తుంది. ట్రైలర్ లో "దేశంలో అంతర్యుద్ధాలను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులు రాకుండా చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం వెనుక డీప్ స్టేట్ పవర్ ఉందంటూ"... వచ్చే సాయికుమార్ వాయిస్ ఓవర్ తో హైప్ ని అమాంతం పెంచేశారు. ఇక ఈ ధర్మస్థల నియోజకవర్గపు సామంత రాజు(ఎమ్మెల్యే) భైరాజ్ గా సాయి కుమార్ కనిపించనున్నారు.
అలాగే సీనియర్ నటుడు సుమన్ ప్రత్యేక పాత్రలో ప్రత్యర్థిగా ఈ మూవీలో కనిపించనున్నాడు. "మనీ తప్ప మానవత్వంతో సంబంధం లేని మృగాల మధ్య బతుకుతున్నాం" అంటూ సుమన్ చేత చెప్పించిన డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించగా మేరు భాస్కర్ నిర్మించారు. ఈ మూవీని సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టాలీవుడ్ లో మరో లీడర్ లాంటి సినిమాలా ప్రేక్షకుల్ని ఆలోచింపచేసే సినిమా అవుతుందా లేదా చూడాలి.