రోమాంచకం (Romanchakam)
తెలుగులో "మేమ్ ఫేమస్" సినిమాతో హీరోగా ఫేమ్ సాధించిన "సుమంత్ ప్రభాస్" హీరోగా లేటెస్ట్ గా "రోమాంచకం" అనే సినిమా తెరకెక్కింది. అనంతిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సందీప్ రెడ్డి వంగ సమర్పణలో వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కగా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Available in:
Reviews
What critics and the public are saying about రోమాంచకం (Romanchakam)
Media Reviews
12 Avg: 5.0/10Average
Romanchakam movie Review
రోమాంచకం... సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని జోక్స్ నవ్వించాయి. ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఒక లవ్ స్టోరీలో ఉండే సీన్స్ కి ఎస్టాబ్లిష్ అనిపించలేదు. అస్సలు నచ్చలేదు నాకు. దీనికి థియేట...
రోమాంచకం... సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని జోక్స్ నవ్వించాయి. ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఒక లవ్ స్టోరీలో ఉండే సీన్స్ కి ఎస్టాబ్లిష్ అనిపించలేదు. అస్సలు నచ్చలేదు నాకు. దీనికి థియేటర్లలో చూడ్డం వర్త్ కాదని అనిపిస్తుంది. ఇక ఫ్యామిలితో చూడొచ్చా అంటే... కొన్ని డైలాగ్స్, సీన్స్ ఇబ్బందిగా అనిపించొచ్చు.. కానీ చూసేలానే ఉంది.
ఇక సుమంత్ ప్రభాస్, అనంతిక బాగా చేసారు. మ్యూజిక్ బాగుంది, రెండు సాంగ్స్ వినాలనే ఉన్నాయి. మూవీ లో ఎంటర్టైన్ అయ్యే సీన్స్ ఎక్కువ ఎం లేదు. అసలు సినిమాలో పెద్ద మైనస్ కథే అవుతుంది. హీరో హీరోయిన్ తెలియకుండానే, పెద్ద పరిచయం కూడా లేకుండానే డీప్ లవ్ లో ఉంటారు. అందుకే అక్కడ ఎమోషన్స్ సీన్స్ అస్సలు పండలేవు. డైరెక్టర్ కూడా లవ్ ఫీల్ వచ్చేలా ఎం లేదని తెలిసే, ఫ్రెండ్స్ కామెడీ పై ఫోకస్ చేసినట్టున్నాడు. సినిమా చాలా స్లో మోషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఫైనల్ గా ఈ మూవీకి నా రివ్యూ ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అస్సలు కలగలేదు. ఓవరాల్ గా చూస్తే... నా రేటింగ్ ఇవ్వాలంటే 2\5.
Average
Romanchakam movie review
రోమాంచకం మూవీ రివ్యూ.. అసలు ఆ సినిమా పదం అర్ధం ఏంటని గూగుల్ రివ్యూ చేశాను... థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్, గూస్బంప్స్ ఇండ్యూసింగ్ అని... అర్ధం. అంటే సినిమా ఇలా ఉంటదని తీసారా? లేక ఇవి తప్ప మిగతావన్ని ఉంటాయని తీసారా అని అర్ధం కాలేదు. నాకైతే రెండోదనే అనిపించింది. ఇక ఈ సినిమా గురించి ఏం చెప్పడం అంటే ఏముంటది...
రోమాంచకం మూవీ రివ్యూ.. అసలు ఆ సినిమా పదం అర్ధం ఏంటని గూగుల్ రివ్యూ చేశాను... థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్, గూస్బంప్స్ ఇండ్యూసింగ్ అని... అర్ధం. అంటే సినిమా ఇలా ఉంటదని తీసారా? లేక ఇవి తప్ప మిగతావన్ని ఉంటాయని తీసారా అని అర్ధం కాలేదు. నాకైతే రెండోదనే అనిపించింది. ఇక ఈ సినిమా గురించి ఏం చెప్పడం అంటే ఏముంటది అసలు ఏం లేదు. సినిమాలో హీరో ఎదో డేటింగ్ అప్ పెడతాడు.
అండ్ సినిమాలో అసలు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఎలా మొదలైందో కూడా తెలీదు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు కలిసేదే కొన్ని రోజులు... కాదు కొన్ని గంటలనే చెప్పాలి. అందులో ఎక్కడ లవ్ మొదలయ్యిందేమో క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకంటే ఘోరం ఎమోషన్స్.. అస్సలు కనెక్ట్ అవలేం. చాలా సీన్లు ఎదో పెట్టాలని పెట్టినట్టు అనిపిస్తది. ఏ సీన్ ఎందుకు పెట్టారో మేకర్స్ కైనా అర్థమైందా లేదా అనిపిస్తుంది. మరెంటో లెక్క అర్ధం కాలేదు. అండ్ సినిమాలో ఏవో ఆడపిల్లల కష్టాలు అంటూ ఏదేదో సంబంధం లేకుండా చెప్తారు. ఇక క్లైమాక్స్ లో రెండు మూడు ఇరికించిన జోకులుంటాయి. ఓవరాల్ గా నాకైతే అస్సలు ఎక్కలేదు.
Average
Romanchakam movie Review
రోమాంచకం సినిమా ట్రైలర్, పాటలు విడుదలైనప్పటి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల నుంచి మంచి అటెన్షన్ రాబట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్ ను, కామెడీని జత చేసి నవ్వించే ప్రయత్నాలు చేశారు, గానీ ఇప్పటికే వందల కొద్ది సినిమాల్లో చూసింద...
రోమాంచకం సినిమా ట్రైలర్, పాటలు విడుదలైనప్పటి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల నుంచి మంచి అటెన్షన్ రాబట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్ ను, కామెడీని జత చేసి నవ్వించే ప్రయత్నాలు చేశారు, గానీ ఇప్పటికే వందల కొద్ది సినిమాల్లో చూసిందే మళ్లీ ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. సినిమా చూసే ప్రేక్షకుడికి తర్వాత జరగబోయేదేంటో ఇట్టే తెలిసి పోతూ రొటీన్ గా సాగిపోతుంది.
మొదటి నుంచి రొమాంటిక్ మూవీ అంటూ చెప్పుకొచ్చినప్పటికీ ఓ పాటలో మినహా మరెక్కడా ఆ లవ్ అనేది కనిపించదు. ఆ మేరకు హీరోహీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలు సైతం లేవు. ఇక క్లైమాక్స్ అయితే ఇటీవల వచ్చిన 'పాపం ప్రతాప్' క్లైమాక్స్‌ను గుర్తు చేసి అసలు ఏం జరుగుతుందిరా, ఎందుకురా ఇదంతా అనిపిస్తుంది. ఎడిటింగ్, డైలాగుల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. అయితే సినిమా క్యాప్షన్ లో చెప్పినట్టుగా ప్రేమ లోపించినా అక్కడక్కడ హాస్యంతో నవ్వించారు. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే.. జెన్ జీ, నిబ్బిలకు ‘రోమాంచకం.
Hit
Romanchakam movie review
మన ఈ బిజీ లైఫ్ లో, కాసేపు టెన్షన్స్ అన్ని పక్కనబెట్టి, మన ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఏసుకుని వెళ్లి, సరదాగా 2 hours ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకెళ్ళండి. ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఫన్ ఉంటుంది. మీ స్ట్రెస్ అంతా తీసేసుకున్నట్టుంటది. చాలా రోజుల తర్వాత ఒక ప్లెజెంట్ సినిమా చూసిన ఫీల్ ఉంటది. ఇలాంటి సినిమా...
మన ఈ బిజీ లైఫ్ లో, కాసేపు టెన్షన్స్ అన్ని పక్కనబెట్టి, మన ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఏసుకుని వెళ్లి, సరదాగా 2 hours ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకెళ్ళండి. ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఫన్ ఉంటుంది. మీ స్ట్రెస్ అంతా తీసేసుకున్నట్టుంటది. చాలా రోజుల తర్వాత ఒక ప్లెజెంట్ సినిమా చూసిన ఫీల్ ఉంటది. ఇలాంటి సినిమా ఒక మంచి రిలీఫ్ఇస్తుంది. నా సజ్జెషన్ ఏంటంటే ఈ వీకెండ్ ఎల్లి ఫ్రెండ్స్ బ్యాచ్ తో ఈ సినిమాని చూసేయండి.
ఎక్కువగా సీరియస్ గా ఏ పాయింట్ ని డీల్ చేయకుండా, అంటే డీల్ చేయడానికి సినిమాలో చాలా పాయింట్స్ సీరియస్ గా ఉన్నాయి. అంటే వాటిని కూడా ఒక ఫన్ టోన్ లో డీల్ చేస్తూ, ఇంసెంట్ ఆక్చుఅల్లి ఒక మంచి మెసేజ్ చెప్తూ అది కూడా ప్రీచి గా ఉండడానికి ట్రై చేసారు. కానీ సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. కొన్ని సీన్స్ అయితే ఫ్రెండ్స్ మధ్యలో జరిగే conversations సీన్స్ బాగుంటాయి. పెర్ఫార్మన్స్ వైస్ అందరూ బాగా చేసారు. టెక్నికల్లి కూడా సినిమా బాగుంది. చాలా రోజులయింది ఇలానే స్ట్రెస్ బస్ ఉన్న సినిమా చూసి. స్టోరీ వైస్ గా చూస్తే రొటీన్ స్టోరీయే. ఓవరాల్ గా మంచి సినిమా ఇది వీకెండ్ లో ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయండి.
Average
Romanchakam movie review
ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా...
ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
హీరో హీరోయిన్ల కంటే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఫేమ్ నరేంద్ర రవి పాత్ర సెకండాఫ్ ను కొంత ఎంగేజింగ్ గా మార్చింది. సినిమాలో క్లైమాక్స్ బాగానే పండింది. అక్కడ కూడా కామెడీ వర్కవుట్ అయింది. ట్విస్టు ఓకే. ‘రోమాంచకం’ టైటిల్ కు న్యాయం చేసే సినిమా కాదు. ఓవరాల్ గా కథాకథనాల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఆశిస్తారు. చివరగా ‘రోమాంచకం’ టైటిల్ కు తగ్గ రోమాంచనం లేకపోయినా.. టైంపాస్ బడ్డీ కామెడీ కోసం ఓ లుక్కేయొచ్చు!
Average
Romanchakam movie review
‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ్ళాను. కానీ మూవీ లో అస్సలు అంత ఏం లేదు. సినిమా మెయిన్ లీడ్ మధ్య అసలు కెమిస్ట్రీ కూడా లేదు. అసలు ...
‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ్ళాను. కానీ మూవీ లో అస్సలు అంత ఏం లేదు. సినిమా మెయిన్ లీడ్ మధ్య అసలు కెమిస్ట్రీ కూడా లేదు. అసలు హీరో హీరోయిన్లు ఎందుకు లవ్ చేసుకుంటారో కూడా అర్ధం కాదు.
అసలు ఈ సినిమాలో ప్లస్ ఏమున్నదంటే కామెడీ.. అది తప్ప ఇంకేమి బాగా లేదు. సినిమాలో కథేంటంటే... హీరో ఓ అప్ స్టార్ట్ చేస్తాడు. ఆ అప్ ద్వారానే హీరోయిన్ ని మీట్ అయ్యి లవ్ చేస్తాడు. కానీ అసలు వీళ్ళ మధ్య లవ్ జెనరేట్ అవ్వడానికి ప్రాపర్ రీసన్ కూడా ఉండదు. సినిమాలో నరేంద్ర రవి కామెడీ హైలెట్ అయింది. అసలు సినిమాలో రైటింగ్ స్ట్రాంగ్ ఉంటె ఎంతో కొంత నచ్చేది. సుమంత్ క్యారెక్టరైజేషన్ బాగున్నా, దానికి జస్టిఫికేషన్ ఉండదు. ఇక హీరోయిన్ అనంతిక కు చాలా లిమిటెడ్ స్క్రీన్ టైం వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాని కామెడీయే కాపాడాలి. ఇంక సినిమా గురించి చెప్పేదేం లేదు.
Average
Romanchakam Movie Review
#Romanchakam REVIEW: #iDreamMedia Rating (2.25/5)కుర్రకారు కామెడీ సినిమా..పెద్దగా కథ ఏమీ వుండదు..సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమేనవ్వు వచ్చిన చోట నవ్వడం…నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.మ్యాడ్-పంచతంత్రం ల సినిమాల ఇమిటేషన్ప్లస్ పాయింట్లుకామెడీమైనస్ పాయింట్లుఆరంభంలో కొంతమలిసగం మధ్యలో మరి కొంతపంచ్ లైన...
#Romanchakam REVIEW:
#iDreamMedia Rating (2.25/5)
కుర్రకారు కామెడీ సినిమా..
పెద్దగా కథ ఏమీ వుండదు..
సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమే
నవ్వు వచ్చిన చోట నవ్వడం…
నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.
మ్యాడ్-పంచతంత్రం ల సినిమాల ఇమిటేషన్
ప్లస్ పాయింట్లు
కామెడీ
మైనస్ పాయింట్లు
ఆరంభంలో కొంత
మలిసగం మధ్యలో మరి కొంత
పంచ్ లైన్: పరాచకం
Below Average
Romanchakam movie review
#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dialogues and comedy scenes work in both halves, along with the climax, but the rest feels very dragged....
#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!
Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dialogues and comedy scenes work in both halves, along with the climax, but the rest feels very dragged. Love story portions are practically nonexistent, while the weak writing and editing make it feel like a bunch of chaotic scenes stitched together
Narendra Ravi is the only real saving grace and carries the film with his comic timing. Without him, this would’ve been an even more exhausting watch. This really doesn’t feel like something Sandeep Reddy Vanga would sign off on. Disappointing!
Rating: 2/5
Below Average
Romanchakam movie review
సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా చేసారు. ఈ సినిమా లవ్ స్టోరీనా, లేదా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే నార్మల్ కామెడీ స్టోరీనా అస్సలు అర్ధం కాల...
సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా చేసారు. ఈ సినిమా లవ్ స్టోరీనా, లేదా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే నార్మల్ కామెడీ స్టోరీనా అస్సలు అర్ధం కాలేదు. మెయిన్ సినిమాలో ఫస్ట్ 30 మినిట్స్ వరస్ట్. క్రింజ్... ప్రాబ్లెమ్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతకు ముందు చాలా సినిమాలొచ్చాయి.
కానీ దీంట్లో అది వర్కౌట్ కాలేదు. అండ్ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో కొన్ని పంచ్ లు తప్ప ఏం వర్కౌట్ కాలేదు. అన్ని సీన్లు కూడా చాలా ఏళ్ళ నుండి ఎన్నో సినిమాల్లో చుసిన సీన్ల లాగానే ఉన్నాయి. బట్ చాలా మంది నవ్వుకున్నారు. నాకు మాత్రం నవ్వు రాలేదు. అండ్ సినిమాలో సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా అర్ధం కాలేదు. అసలు హీరోకే సరైన క్యారెక్టర్ డిజైన్ చేయలేదు. అక్కడే దొబ్బింది ఈ సినిమా. ఎన్నో సినిమాల చూసిన డైలాగ్స్ వినిపిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మరీ కామెడీ చేసారు. బట్ సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ లో వస్తుందన్న ఒకే ఒక్క రీసన్ తోనే సినిమాకి వచ్చాను. మరి నార్మల్ ఆడియన్స్ కి కామెడీ ఇష్టం ఉన్నోళ్లకు నచ్చోచ్చేమో... నాకు మాత్రం నచ్చలేదు.
Average
Romanchakam movie Review
‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించద...
‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించదు. అనంతిక ఓకే చేసిన స్క్రిప్ట్ కదా.. పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని ఎవరైనా ఊహించి, ఆశించి వస్తే మాత్రం దారుణంగా నిరాశ చెందాల్సి వస్తుంది.
టెక్నికల్ గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. బీజీఎం కంటే.. పాటలు చాలా హృద్యంగా అనిపిస్తాయి. తెరపై పాటల్ని చూస్తుంటే ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంటుంది. లొకేషన్స్ కూడా ఎక్కువగా లేకుండా.. ఉన్నంత వరకు బాగా చూపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది.
ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే... ఎదిగీఎదగని.. ఓ ఇమ్మెచ్యూర్.. నిబ్బానిబ్బిలానే హీరో హీరోయిన్లు తెరపై కనిపిస్తారు. పాత్రల్నే అలా రాసుకున్నట్టుగా, కథనే అలా డీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. చాలా చోట్ల జెన్ జీ ని రిఫర్ చేసుకున్నాడు డైరెక్టర్. బహుషా తలాతోక లేనట్టుగా అనిపించే ఈ మూవీ జెన్ జీ ఆడియెన్స్‌కి నచ్చితే నచ్చొచ్చు. కొన్ని పాటలు, కొంత కామెడీ చాలు అనుకుంటే మాత్రం ‘రోమాంచకం’ ఓ ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. చివరగా ఈ సినిమాకి పెట్టుకున్న క్యాప్షన్స్‌లో చెప్పాలంటే.. గోరంత ప్రేమ, కొండంత హాస్యం, పిసరంత ఉత్కంఠ.
Above Average
Romanchakam movie Review
‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క...
‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా సినిమాని తీసాడు డైరెక్టర్. సినిమా మొత్తం కామెడీయే హైలెట్ గా మెయిన్ గా సాగుతుంది. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, ‘రోమాంచకం’ వినోదమే ప్రధానంగా సాగే ఒక టైమ్‌పాస్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. సుమంత్ ప్రభాస్ నటన, అతని స్నేహితుల గ్యాంగ్ మధ్య వచ్చే నవ్వుల సన్నివేశాలు సినిమాను ముందుకు నడిపించాయి. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు కాస్త నిరాశపరిచినా, ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ వారాంతంలో ఈ చిత్రం మంచి ఆప్షన్.
Below Average
Romanchakam movie review
సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళ వల్ల మంచి కామెడీ జెనెరేట్ అయింది. అసలు సినిమా అయితే చాలా వరకు నిబ్బా నిబ్బి స్టోరీ కంటే అద్వా...
సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళ వల్ల మంచి కామెడీ జెనెరేట్ అయింది. అసలు సినిమా అయితే చాలా వరకు నిబ్బా నిబ్బి స్టోరీ కంటే అద్వానంగా ఉంది. ఎదో జాతిరత్నాలు సినిమాలాగా, లేదా మ్యాడ్ సినిమాల్లాగా ఫన్ తో లాగిద్దాం అని ట్రై చేసారు దెబ్బేసింది.
ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఏం అంత లేదు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ ఏం అంత లేదు. ఎంత సేపు ఫ్రెండ్స్ ఎదో అనడం దానికి హీరో రియాక్షన్ ఇవ్వడం అంతే.. లవ్ స్టోరీ కూడా బాగాలేదు. ఎమోషన్స్ అస్సలే ఏం బాగాలేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత పెట్టాలో అంతే పెట్టారు కాబట్టి పెద్దగా లాస్ ఏం అవ్వలేదు కావచ్చు. హీరో అసలేం చూసి సినిమా యాక్సెప్ట్ చేసాడో ఏమో మరి. ఏమో సినిమాలో క్యామియో చేసిన అనుదీప్ కోసమే ఇంకా ఆడియన్స్ వెళ్లొచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగాలేదు. నా రేటింగ్ అయితే ఈ సినిమాకు 2/5
Public Reviews
5 Avg: 4.6/10Average
Romanchakam movie review
Predictable and derivative, Romanchakam fails to breathe fresh life into its blend of romance, suspense, and humor. The screenplay runs on auto-pilot, offering zero surprises from start to finish. For a film centered on love, the romance feels empty—crippled by weak lead dynamics and a complete lack...
Predictable and derivative, Romanchakam fails to breathe fresh life into its blend of romance, suspense, and humor. The screenplay runs on auto-pilot, offering zero surprises from start to finish.
For a film centered on love, the romance feels empty—crippled by weak lead dynamics and a complete lack of emotional depth. Rather than wrapping up cleanly, the climax descends into chaotic confusion, testing the audience's patience instead of engaging them.
Weak editing and flat dialogues further drag down the narrative. Ultimately, Romanchakam misses the mark across all fronts, offering a tedious cinematic experience.
Below Average
Romanchakam movie review
Romanchakam is a thoroughly routine affair that rehashes familiar tropes without offering anything new. Attempting a blend of romance, suspense, and comedy, the film suffers from an utterly predictable screenplay that leaves no room for surprise. Despite its romantic positioning, the core romance is...
Romanchakam is a thoroughly routine affair that rehashes familiar tropes without offering anything new. Attempting a blend of romance, suspense, and comedy, the film suffers from an utterly predictable screenplay that leaves no room for surprise.
Despite its romantic positioning, the core romance is virtually non-existent; weak lead chemistry and unconvincing writing prevent any real emotional connection.
The climax only deepens the flaw, replacing logical storytelling with sheer confusion and leaving viewers frustrated. Coupled with sluggish editing and lackluster dialogue, Romanchakam fails to deliver a meaningful impact, making for a dull and disappointing watch.
Below Average
Romanchakam movie review
Story completely routine. Already chala movies lo chusina love, suspense & comedy elements ni mix chesi present chesaru, but ekkada fresh feel raadhu. Screenplay predictable ga undadam valla next scene enti anedi easy ga guess cheyyachu.Romantic movie ani cheppina, actual romance almost missing....
Story completely routine. Already chala movies lo chusina love, suspense & comedy elements ni mix chesi present chesaru, but ekkada fresh feel raadhu. Screenplay predictable ga undadam valla next scene enti anedi easy ga guess cheyyachu.
Romantic movie ani cheppina, actual romance almost missing. Hero-heroin madhya chemistry weak ga undadam, convincing love scenes lekapovadam valla emotional connect assalu build avvaledu.
Climax ayithe movie ni inka confuse chesindi. Logic kanna confusion ekkuva, impact kanna frustration ekkuva. Editing & dialogues kuda sharp ga lekapovadam minus point.
Average
Romanchakam movie review
just now finished Romanchakam first show. trailer chusi oka youthful romantic comedy ani expectations create chesindi. But movie chusina tarvatha aa expectations complete ga satisfy avvaledane feeling vastundi.Story-wise, routine love track ki suspense and comedy elements add chesaru. Concept lo nov...
just now finished Romanchakam first show. trailer chusi oka youthful romantic comedy ani expectations create chesindi. But movie chusina tarvatha aa expectations complete ga satisfy avvaledane feeling vastundi.
Story-wise, routine love track ki suspense and comedy elements add chesaru. Concept lo novelty limited ga undadam, screenplay predictable ga move avvadam major drawbacks. Chala situations mundhe guess chesestam.
Romantic angle kuda expected level lo establish avvaledu. Hero-heroin madhya chemistry ni elevate chese strong scenes lekapovadam valla love track impact taggindi.
However, movie completely disappointing ani cheppalem. Konni comedy portions genuine ga entertain chestayi.
Overall: A routine romantic drama with occasional laughs, but lacks the freshness and emotional connect needed to make a strong impact.
Average
Romanchakam movie review
ట్రైలర్, సాంగ్స్ చూసి రోమాంచకం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ అనుకున్నా… సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదు. రొటీన్ లవ్ స్టోరీకి సస్పెన్స్, కామెడీ యాడ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ కథలో వచ్చే ట్విస్టులు, సీన్స్ చాలావరకు ముందే గెస్ చేసేయొచ్చు.రొమాన్స్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో ఉన్నంత లవ్...
ట్రైలర్, సాంగ్స్ చూసి రోమాంచకం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ అనుకున్నా… సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదు. రొటీన్ లవ్ స్టోరీకి సస్పెన్స్, కామెడీ యాడ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ కథలో వచ్చే ట్విస్టులు, సీన్స్ చాలావరకు ముందే గెస్ చేసేయొచ్చు.
రొమాన్స్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో ఉన్నంత లవ్ సినిమాలో కనిపించదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.
క్లైమాక్స్ అయితే కొంత కన్ఫ్యూజింగ్‌గా అనిపించింది. ఎడిటింగ్, డైలాగ్స్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బెటర్ అవుట్‌పుట్ వచ్చేది.
అయితే అక్కడక్కడా కామెడీ మాత్రం నవ్విస్తుంది.
About This Movie
Story :
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి రోమాంచకం అనే ఓ స్టార్టప్ యాప్ బిజినెస్ పెడతాడు. ఈ క్రమంలో ఆ యాప్ ద్వారా చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక) పరిచయమై ప్రేమకు దారి తీస్తుంది. అయితే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత అన్వేష్ కోసం మైథిలి హైదరాబాద్ కి వస్తుంది. ఇటు అన్వేష్ కూడా మైథిలి కోసం ఓ ఫ్లాట్‌ని ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో మైథిలి వచ్చాక అన్వేష్ కి అతని ఫ్రెండ్స్ కి అనూహ్య సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యల నుండి అన్వేష్ - ఫ్రెండ్స్ బయటపడ్డారా లేదా? చివరికి మైథిలీ - అన్వేష్ ల ప్రేమ కథ ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ముందుగా ఈ "రోమాంచకం" సినిమా కథపై కాకుండా సిచ్యుయేషనల్ కామెడీ పైనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ కూడా ఇది చాలా చిన్న కథ, కామెడీ ప్రధానంగా ఉంటుందని ముందే క్లారిటీ ఇవ్వడం వల్ల ఆడియన్స్ కాస్త ఎక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తారు. అదే మంచిదయింది. అలాగే చాలా సీన్లు జాతిరత్నాలు వంటి సినిమాలని గుర్తు చేస్తాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక సుమంత్ ప్రభాస్ ఇంతకు ముందు సినిమాల్లో లాగానే మంచి ఎనర్జీతో నటించి మెప్పించాడు. కాకపోతే డైలాగ్ డెలివరీలో ఇంకొంచెం వేరియేషన్స్ చూపించాలి. అలాగే హీరోయిన్ అనంతిక కూడా తన వరకు బాగానే నటించింది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దక్కింది ఈ సినిమాలో. అయితే హీరో ఫ్రెండ్స్ గా నటించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ సినిమాకి హైలెట్ గా నిలిచారు. వీరి కామెడీయే సినిమాను నిలబెట్టింది. మధ్యలో ఉపేంద్ర లిమాయే రోల్ కూడా అక్కడక్కడా నవ్విస్తుంది.
Minus Points :
అయితే రోమాంచకం సినిమాకి కథ చిన్నగా రాసుకున్నా, ఇంట్రెస్టింగ్ వే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమా స్టార్ట్ అయ్యాక మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవడానికి చాలా టైం తీసుకుంది. మధ్యలో కొన్ని సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు. ఫక్తు కామెడి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో ఫ్రెష్ కామెడీ అయితే మిస్ అయింది. లవ్ స్టోరీ సింపుల్ గా బాగానే ఉన్నా, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ పండలేదు. అలాగే మూవీలో ఎమోషన్స్ కూడా అంతగా లేవు. అసలు ఒక లవ్ స్టోరీ లో ఉండాల్సిన బలమైన ఎమోషన్స్ ఏం లేవు. అవి లేకపోతే ఏం ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ కారు. సింపుల్ గా చెప్పాలంటే ఓ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలాగే ఈ సినిమా తీశారు.
Technical Values :
టెక్నికల్ గా చూస్తే... ఈ సినిమాకి "వాసుకి వైభవ్" ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. అలాగే బీజీఎమ్ కూడా మంచి ప్లస్ అయింది. కానీ సాంగ్స్ ప్లేస్ మెంట్స్ సరిగా లేవు. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ ఫ్రెష్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఇక డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తీసుకున్న చిన్న కథని ఆడియన్స్ కి నచ్చేలా ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు. కామెడీ బాగానే ఉంది. కానీ ఆ కామెడీని ఆడియన్స్ కి నచ్చేలా చేయడంలో ఫోకస్ పెట్టి లవ్ స్టోరీని పక్కనెట్టేసాడు. ఎడిటింగ్ వర్క్ పర్లేదు.
Final Review :
సో ఓవరాల్ గా "రోమాంచకం" సినిమా ఒక టైం పాస్ సినిమాగా వన్ టైం వాచబుల్ గా ఒక వర్గం ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో, ఓన్లీ కామెడీ మీదే డిపెండ్ అవడం వల్ల సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. స్లో గా సాగే ఫస్ట్ హాఫ్, వర్కౌట్ అవని ఎమోషనల్ సీన్ల వల్ల సినిమా నిరాశపరుస్తుంది. వరాల గా ఓ ఇమ్మెచ్యూర్... నిబ్బా నిబ్బిలానే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఆడియన్స్ కి కనిపిస్తారు. కథ కూడా అలానే ఉంటుంది. అందువల్ల యంగ్ యూత్ వరకు ఈ సినిమా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. కానీ అందర్నీ అంటే కష్టమే. అయితే లాంగ్ రన్ లో ఎలా ఆడుతుందో చూడాలి.