ఓ సుకుమారి (Oh Sukumari Teaser)
Oh Sukumari Teaser : ముట్టుకుంటే షాక్కొట్టేంత సుకుమారి... ఈ అమ్మాయి! త్వరలోనే వచ్చేస్తోంది!
Available in:
About This Movie
సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఓ సుకుమారి". చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న "ఓ సుకుమారి" సినిమాలో దామిని రోల్ లో ఐశ్వర్య రాజేష్ నటించారు.
టీజర్ ని గమనిస్తే... సినిమాలో ఓ లోకల్ పొలిటికల్ లీడర్ అయిన ఓ యువకుడు (తిరువీర్) పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఓ అరుదైన సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్యను దాచి పెట్టి పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేస్తారు. అయితే దామినిని టచ్ చేస్తే హీరోకి ఓ షాక్ లా కొడుతుంది. అప్పట్లో మగధీర సినిమాలో హీరో హీరోయిన్ ను టచ్ చేస్తే గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లు ఈ మూవీలోనూ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఉంది. అయితే అలా ముట్టుకుంటే షాక్ ఎందుకు కొడుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి భరత్ దర్శన్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, శివానంద్, కోట జయరామ్, అంజిమామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఓ సుకుమారి సినిమాను గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తుండగా, అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.