Avatar 3 Fire And Ash (అవతార్ 3 ఫైర్ అండ్ అష్)
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన "అవతార్" ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిందో తెలిసిందే. విజువల్ వండర్ గా మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఆ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్2 కూడా అదే స్థాయిలో మెప్పించగా, ఇప్పుడు మూడో పార్ట్ కూడా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ పేరిట తీసుకొచ్చారు. మరి ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పించిందో చూద్దాం.
Available in:
Reviews
What critics and the public are saying about Avatar 3 Fire And Ash (అవతార్ 3 ఫైర్ అండ్ అష్)
Media Reviews
10 Avg: 5.4/10Average
Avatar 3 Fire And Ash Movie Review
"అవతార్ 3 ఫైర్ అండ్ యాష్" అంటూ వచ్చిన హాలీవుడ్ మూవీ కథ పరంగా డిస్సపాయింట్ చేయగా, కథనంలో కూడా స్లో అయింది. ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ ఎంత బాగా ఇస్తుందో, అంతే బోర్ ఫీల్ ఇస్తుంది. పార్ట్ 3 తో ఆపేస్తే బెటర్ అని క్రిటిక్స్ నుంచి రివ్యూలొచ్చాయి.

Above Average
Avatar 3 Fire And Ash Movie Review
అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో పార్ట్ అవతార్ 3 ఫైర్ అండ్ యష్ ఫ్యాన్స్ ని బాగానే మెప్పించింది. అయితే కథనంలో తడబడ్డారు. రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. అయితే ఓవరాల్ గా నాలుగో పార్ట్ అక్కర్లేదు ఇక చాలు అనేలా పార్ట్ 3 ఉంది.

Below Average
Avatar 3: fire And Ash Movie Review
అవతార్ సిరీస్ ఫ్యాన్స్‌ని మెప్పించినా, కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, రన్ టైమ్ ఎక్కువవడం వల్ల ‘అవతార్’ సిరీస్ లో వీక్ సినిమాగా అనిపిస్తుంది.
అవతార్ సిరీస్ ఫ్యాన్స్‌ని మెప్పించినా, కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, రన్ టైమ్ ఎక్కువవడం వల్ల ‘అవతార్’ సిరీస్ లో వీక్ సినిమాగా అనిపిస్తుంది.
Average
Avatar 3 Fire And Ash Movie Review
పండోరా గ్రహం నేపథ్యంలో సాగె అవతార్ 3 విజువల్స్ పరంగా బాగానే ఉన్నా, కథా కథనాల్లో నెమ్మదించింది. ఫలితంగా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు.
పండోరా గ్రహం నేపథ్యంలో సాగె అవతార్ 3 విజువల్స్ పరంగా బాగానే ఉన్నా, కథా కథనాల్లో నెమ్మదించింది. ఫలితంగా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు.
Average
Avatar3 Fire And Ash movie review
అవతార్ సిరీస్ లో మూడో భాగంగా రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ ఆష్ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఒక్కసారి చూసేలా ఉంది.
అవతార్ సిరీస్ లో మూడో భాగంగా రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ ఆష్ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఒక్కసారి చూసేలా ఉంది.
Average
Avatar 3 Fire And Ash Movie Review
అవతార్ సిరీస్ కి కొనసాగింపుగా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ ఆష్ థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకున్నా, విజువల్ వండర్ గా ఆకట్టుకుంది.
అవతార్ సిరీస్ కి కొనసాగింపుగా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ ఆష్ థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకున్నా, విజువల్ వండర్ గా ఆకట్టుకుంది.
Above Average
Avatar3 Fire And Ash Movie Review
జేమ్స్ క్యామెరూన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన అవతార్ పార్ట్ 3 విజువల్ వండర్ గా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
జేమ్స్ క్యామెరూన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన అవతార్ పార్ట్ 3 విజువల్ వండర్ గా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
Above Average
Avatar 3 Fire And Ash
అవతార్ సిరీస్ లో మూడో భాగంగా రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ విజువల్ వండర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
Above Average
Avatar 3 Fire And Ash
అవతార్ సిరీస్ లో భాగంగా జేమ్స్ కెమెరున్ తెరకెక్కించిన అవతార్ 3 థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకోగా, విజువల్ గా ఆకట్టుకుంటుంది.
అవతార్ సిరీస్ లో భాగంగా జేమ్స్ కెమెరున్ తెరకెక్కించిన అవతార్ 3 థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకోగా, విజువల్ గా ఆకట్టుకుంటుంది.
Above Average
Avatar 3 Fire And Ash Movie Review
అవతార్ సిరీస్ లో భాగంగా జేమ్స్ కెమెరున్ తెరకెక్కించిన అవతార్ 3 క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
అవతార్ ఫస్ట్ పార్ట్ లో వేరే ప్రపంచంలో ఉన్న అడవులను, సెకండ్ పార్ట్ లో సముద్రాల్ని చూపించిన దర్శకుడు మూడో పార్ట్ లో 'అగ్ని' ని ప్రధానంగా చూపించాడు. పండోర గ్రహంలో అగ్నిజాతి (యాష్ పీపుల్) అనే కొత్త రకం తెగ ఈ స్టోరీలో ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు కనిపించేంత బాగానే ఉన్నా, క్రూరులు, మూర్ఖులు. ఇక కథలోకి వెళ్తే "జేక్ సల్లీ" తన భార్య "నేతిరి" తో పాటు తన కుటుంబంతో సముద్ర జాతులతో జీవిస్తుంటాడు. అయితే జేక్ సల్లీ పెద్ద కొడుకు నెటెయమ్ చావుకి అతని చిన్న కొడుకు లోక్ కారణం అని భావిస్తాడు. ఇదిలా ఉండగా జేక్ కూతురు కిరి, ఆని పెంపుడు కొడుకు స్పైడర్ మధ్య జరిగిన కథ ఏంటి? జేక్ పై పగతో రగిలిపోతున్న క్వారిచ్ తన పగను తీర్చుకోవడానికి ఏం చేసాడు. మొత్తంగా కార్విచ్ - వరాంగ్ తో కలిసి జేక్ సల్లీ కుటుంబాన్ని ఏం చేసారు. జేక్ తన కుటుంబాన్ని వాళ్ళ నుండి కాపాడుకున్నారా లేదా అనేది కథ.
Technical Values : ఎప్పట్లాగే చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన మేకింగ్ తో ఆకట్టుకున్నారు. విజువల్స్ మొదటి రెండు పార్ట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. పంచ భూతాల్లో ఒకటైన అగ్నిని పార్ట్ లో మెయిన్ గా చూపించడం బాగుంది. అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంతకు ముందు వాటిలా 3వ పార్ట్ మెప్పించలేకపోయింది. మెయిన్ గా 3.20 గంటల మూవీ నిడివి మైనస్ అయింది. ప్రేక్షకుల్ని ఇంతసేపు డైరెక్టర్ కూర్చోబెట్టలేకపోయాడు. అంతే కాదు కథా, కథనాల్లో బలం లోపించగా, ఎమోషనల్ డెప్త్ ఏమాత్రం కనెక్ట్ కాలేదు. పైగా ఇందులో కొన్ని డైలాగ్స్ కామన్ ఆడియన్స్ కి అర్ధం కాలేదు. అయితే టెక్నికల్ పరంగా మేకర్స్ అందరూ బాగా కష్టపడ్డారని చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంలో, VFX విభాగంలో అభినందించాలి.
Final Review : వరల్డ్ వైడ్ హాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన "అవతార్: ఫైర్ అండ్ యాష్" థియేటర్లలో బాగానే సందడి చేస్తున్నా, ఇంతకు ముందు పార్ట్స్ కి తగ్గట్టు ఉందని ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. అద్భుతమైన విజువల్స్, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా, కథనం విషయంలో కాస్త తడబడ్డారని చెప్పొచ్చు. అయితే ఎమోషన్స్ తగ్గినా, స్లో నేరేషన్ ఉన్నా, ఈ విజువల్ వండర్ ని ఖచ్చితంగా ఓసారి థియేటర్లో అయితే చూడచ్చు.