Register as a Reviewer
Dacoit (డెకాయిట్)

Dacoit (డెకాయిట్)

10 Apr 2026
Overall Rating
5.7/10
20 Reviews

అడవి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ "డెకాయిట్". మృణాల్ ఠాకూర్ హీరొయిన్ గా నటించిన ఈ మూవీకి అడవి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించగా, షానియల్ డియో దర్శకత్వం వహించాడు.

Director: Shaneil Deo
Cast: Adivi Sesh, Mrunal Thakur, Anurag Kashyap, Prakash Raj, Sunil, Atul Kulkarni, Zayn Marie Khan, Kamakshi Bhaskarla

Available in:

Reviews

What critics and the public are saying about Dacoit (డెకాయిట్)

Media Reviews

20 Avg: 5.7/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

Dacoit Movie Review

"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి మంచి ఎలివేషన్ ఇస్తుంది. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఈ వ...

"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి మంచి ఎలివేషన్ ఇస్తుంది. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఈ విషయంలో టీమ్ మంచి వర్క్ చేసింది.


అడివి శేషు మరోసారి తన స్టైల్‌లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. మృణాల్ ఠాకూర్ కూడా స్క్రీన్‌పై మంచి ప్రెజెన్స్ చూపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతుంది. సినిమాలో కొన్ని ట్విస్టులు, ఎమోషనల్ మోమెంట్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. స్టోరీ రొటీన్ లైన్‌లో ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ వల్ల సినిమా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. అయినా కూడా ఓవరాల్‌గా సినిమా ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Apr 10, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Dacoit Movie Review

"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ అన్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ ఏదో తక్కువైంది అన్న ఫీల్ వస్తుంది. కంటెం...

"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ అన్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ ఏదో తక్కువైంది అన్న ఫీల్ వస్తుంది. కంటెంట్, రైటింగ్, స్క్రీన్‌ ప్లే కూడా అంతే ముఖ్యమైనవి. అక్కడికే ఈ సినిమా కొంచెం తగ్గిపోతుంది. స్క్రీన్‌ ప్లే లో కొన్ని ఆసక్తికరమైన ఐడియాస్ ఉన్నప్పటికీ, అవి పూర్తిగా ఎఫెక్టివ్‌ గా ఎగ్జిక్యూట్ కాలేదు. 


పైగా ట్విస్టులు ఉన్నా, అవి మనల్ని సర్ప్రైజ్ చేయవు. బట్ పెర్ఫార్మన్స్ వైస్ గా అడివి శేష్ తన పాత్రలో బెస్ట్ అండ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ అతను ఎంచుకునే కథల మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌ ను ఈ సినిమా పూర్తిగా మీట్ చేయలేదు. మృణాల్ ఠాకూర్ కూడా తన రోల్ కి సరిపడేలా నటించింది కానీ ఆమె పాత్రలో మరింత డెప్త్ ఉండాల్సింది. క్లైమాక్స్ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. కానీ ముందు వచ్చిన నరేషన్ దానికి సరైన బిల్డ్ ఇవ్వలేదు. అందుకే ఆ ఎమోషన్ కూడా పూర్తిగా హిట్ అవ్వదు. మొత్తానికి “డెకాయిట్” ఒక మిడ్-లెవల్ ఎఫర్ట్. ఐడియా ఉంది, టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉంది… కానీ వాటిని కలిపే రైటింగ్ లోపించడం వల్ల సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది. 

Apr 10, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
5

Average

Dacoit movie Review

డెకాయిట్” మూవీ గురించి షార్ట్ గా రివ్యూ చెప్పాలంటే... మనమే డైరెక్టర్ అన్న లెక్కలో మాట్లాడుకుంటే.. “సర్… మనం ఓ యాక్షన్ లవ్ స్టోరీ తీస్తాం… కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఉండదు… పర్లేదు కదా?” “పర్లేదు… టెక్నికల్‌ గా స్ట్రాంగ్‌గా చేస్తే చాలు!” అన్నట్టుగా ఉంది ఈ సినిమా. మూవీ స్టార్ట్ అవుతూనే మీరనుకుంటారు “ఇ...

డెకాయిట్” మూవీ గురించి షార్ట్ గా రివ్యూ చెప్పాలంటే... మనమే డైరెక్టర్ అన్న లెక్కలో మాట్లాడుకుంటే.. “సర్… మనం ఓ యాక్షన్ లవ్ స్టోరీ తీస్తాం… కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఉండదు… పర్లేదు కదా?” “పర్లేదు… టెక్నికల్‌ గా స్ట్రాంగ్‌గా చేస్తే చాలు!” అన్నట్టుగా ఉంది ఈ సినిమా. మూవీ స్టార్ట్ అవుతూనే మీరనుకుంటారు “ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుందని.. కానీ కొంచెం టైమ్ తర్వాతే అర్థమవుతుంది—“అరే ఇది ఎక్కడో చూసినట్టే ఉందే!” అని. 


అలాగే మూవీ లో ట్విస్టులు ఉంటాయి… కానీ అవి “వావ్” అనిపించవు. “ఓకే… ఇది కూడా ఊహించాం” అనిపించే రేంజ్‌ లోనే ఉంటాయి. స్క్రీన్‌ ప్లే మాత్రం “సర్… కొంచెం స్లోగా తీసుకెళ్దామా?” అన్నట్టుగా సాగుతుంది. మధ్యలో కొంత యాక్షన్, కొంత లవ్… కానీ ఏదీ పూర్తిగా ఎంగేజ్ చేయదు. ఇక క్లైమాక్స్ వస్తుంది… “ఇప్పుడు పెద్ద ట్విస్ట్ వస్తుంది!” అనిపిస్తుంది. ట్విస్ట్ వస్తుంది కూడా… కానీ అది చూసాక “ఇదేనా?” అనే ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. కొంచెం ఓవర్ ది టాప్‌గా కూడా అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే… “డెకాయిట్” అంటే టెక్నికల్‌గా బాగున్న, కానీ కంటెంట్ పరంగా చాలా సాధారణమైన సినిమా. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే డెఫినిట్‌గా డిసప్పాయింట్. అంచనాలు చాలా తగ్గించుకుంటే… “సరే చూసాం” అనిపించేంత మాత్రమే.


Apr 10, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
6

Above Average

Dacoit movie Review

“డెకాయిట్” గురించి సింపుల్‌గా చెప్పాలంటే… ఇది ఒక ఎబోవ్ యావరేజ్ డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అడవి శేష్ సినిమాల మీద ఇంతకు ముందు ఉండే నమ్మకంతోనే డెకాయిట్ కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మూవీ సూపర్ హైప్ తో రిలీజ్ కాగా, ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేస్తుందని టాక్ ని బట్టి తెలుస్తుంది...

“డెకాయిట్” గురించి సింపుల్‌గా చెప్పాలంటే… ఇది ఒక ఎబోవ్ యావరేజ్ డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అడవి శేష్ సినిమాల మీద ఇంతకు ముందు ఉండే నమ్మకంతోనే డెకాయిట్ కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మూవీ సూపర్ హైప్ తో రిలీజ్ కాగా, ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేస్తుందని టాక్ ని బట్టి తెలుస్తుంది. ప్లస్ పాయింట్స్ గురించి చెప్తే.. సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ ఇస్తుంది, మేకింగ్ కూడా రిచ్‌ గా కనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం ఎక్కడా కంప్లైంట్ పెట్టాల్సిన పని లేదు. 


కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… స్క్రీన్‌ప్లే.. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా గ్రిప్‌ లో పెట్టేలా ఉండదు. కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కానీ మధ్య మధ్యలో సినిమా డ్రాప్ అవుతుంది. ట్విస్టులు, టర్నింగ్స్ పెట్టారు కానీ అవి మనకు “వావ్” అనిపించేలా ఉండవు.

అయితే పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తన పాత్రలకు న్యాయం చేసారు. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఒక్క ముక్కలో డెకాయిట్ మూవీ గురించి చెప్పాలంటే... అందరి హృదయాల్ని డెకాయిట్ దోచుకుంటాడో లేదో తెలీదు గాని, అతని హృదయాన్ని మాత్రం ఆవిడ (హీరోయిన్) దోచుకుంది. ఈ ముక్కకి కంక్లూజన్ తెలియాలంటే మూవీ చూసాకే అర్ధమవుద్ది.

Apr 10, 2026 Watch
Venky Reviews
Venky Reviews Twitter Channel
5

Average

Dacoit Movie Review

అడివి శేష్ మెయిన్ లీడ్ గా నటించిన "డెకాయిట్" ఒక యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా నిలిచింది. టెక్నికల్‌గా బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే మాత్రం కొన్ని చోట్ల మాత్రమే పనిచేసింది. అలాగే సినిమా టెక్నికల్‌ గా సౌండ్‌గా ఉండటం దాని ప్రధాన బలం. విజువల్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, మేకింగ్ పరంగా అన్ని బాగున్నాయి....

అడివి శేష్ మెయిన్ లీడ్ గా నటించిన "డెకాయిట్" ఒక యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా నిలిచింది. టెక్నికల్‌గా బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే మాత్రం కొన్ని చోట్ల మాత్రమే పనిచేసింది. అలాగే సినిమా టెక్నికల్‌ గా సౌండ్‌గా ఉండటం దాని ప్రధాన బలం. విజువల్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, మేకింగ్ పరంగా అన్ని బాగున్నాయి. కానీ స్క్రీన్‌ప్లే, రైటింగ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ట్విస్టులు, టర్నింగ్స్ ఉన్నప్పటికీ అవి పూర్తిగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. 


కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయినా, చాలా చోట్ల Kshanam, Goodachari సినిమాలను గుర్తు చేసేలా ఉండటం వల్ల స్క్రీన్‌ప్లే రిపిటేటివ్, ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కొంచెం ఓవర్ ది టాప్‌గా అనిపిస్తుంది. Adivi Sesh తన పాత్రకు తగ్గట్టు నటించాడు. కానీ రాయలసీమ యాస మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. Mrunal Thakur పెర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. మొత్తానికి డెకాయిట్ అంచనాలు తగ్గించుకుని చూస్తే ఒకసారి చూడదగిన సినిమా.

Apr 10, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

Dacoit Movie Review

జనరల్ గా అడివి శేష్ మూవీస్ అంటే ఎలాంటి వంక పెట్టకుండా స్క్రీన్స్ కి ఆడియన్స్ అతుక్కుపోయి చూసే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే వరుస హిట్స్ సొంతమయ్యాయ్. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇవే అంచనాలతో డెకాయిట్ ని చూడగా, ఫైనల్ గా మూవీ మొత్తం అయ్యాక అడవి శేష్ ముందు మూవీస్ రేంజ్ లో...

జనరల్ గా అడివి శేష్ మూవీస్ అంటే ఎలాంటి వంక పెట్టకుండా స్క్రీన్స్ కి ఆడియన్స్ అతుక్కుపోయి చూసే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే వరుస హిట్స్ సొంతమయ్యాయ్. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇవే అంచనాలతో డెకాయిట్ ని చూడగా, ఫైనల్ గా మూవీ మొత్తం అయ్యాక అడవి శేష్ ముందు మూవీస్ రేంజ్ లో డెకాయిట్ ఇంపాక్ట్ ని అయితే చూపించలేకపోయింది. కానీ అదే నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె.. డీసెంట్ లవ్ స్టోరీ నుండి రివేంజ్ గా మారే డెకాయిట్ తర్వాత కొన్ని మంచి సీన్స్ తో టెంపో ని అలానే మెయిన్ టైన్ చేసి క్లైమాక్స్ 20 నిమిషాల బాగానే కూర్చోబెట్టి ఓ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ను ఆడియన్స్ కి కలిగేలా చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. 


అయితే అడివి శేష్ రాయలసీమ యాస అంత సూట్ అవ్వలేదు కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా మరోసారి కుమ్మేశాడు. ఇటు మృణాల్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేసి మెప్పించింది. ఇద్దరి పెయిర్ బాగుంది కానీ ఎందుకో కొన్ని చోట్ల లీడ్ పెయిర్ డబ్బింగ్ క్లియర్ గా వినిపించలేదు. సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో బాగానే ఉన్నా, సెకెండ్ హాఫ్ లో రిపీటివ్ సీన్స్ తో డ్రాగ్ అయ్యి ఫ్లాట్ గా మారిపోయింది. తిరిగి క్లైమాక్స్ ఆకట్టుకోవడంతో పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా అడవి శేష్ మూవీ లవర్స్ కి సినిమా డిస్సపాయింట్ చేస్తుంది. కానీ నార్మల్ ఆడియన్స్ కి మాత్రం ఒక డీసెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది.

Apr 10, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Dacoit Movie Review

డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా స్టోరీ పరంగా రొటీన్ అనిపించుకోగా, ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాలో కథ అంతగా లేకున్నా, ట్విస్టులు బాగా వస్తాయి, కానీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ కారణంగా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.మళ్లీ ఎపిసోడ్...

డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా స్టోరీ పరంగా రొటీన్ అనిపించుకోగా, ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాలో కథ అంతగా లేకున్నా, ట్విస్టులు బాగా వస్తాయి, కానీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ కారణంగా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

మళ్లీ ఎపిసోడ్స్ రిపీట్ అవుతూ సినిమా స్లోగా మారుతుంది. నరేషన్ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. ఎమోషనల్ కోర్ ఉన్నప్పటికీ, దానికి తగిన డెప్త్ లేకపోవడం, స్లో ట్రీట్‌మెంట్ కారణంగా అది పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది. 


ఓవరాల్‌గా కథ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా అనిపిస్తాయి. మోడర్న్ టచ్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ బాగున్నా... గ్రిప్పింగ్ మోమెంట్స్, ఇంటెన్సిటీ లోపించడం సినిమా మీద ప్రభావం చూపించింది. క్లైమాక్స్ విషయానికి వస్తే, ముందే ఊహించగలిగేలా ఉన్నా ఎమోషనల్‌ గా మాత్రం కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అయితే ముందుగా వచ్చిన స్లో నరేషన్ వల్ల ఆ ఇంపాక్ట్ అంత బలంగా అనిపించదు. యాక్షన్ ఎపిసోడ్స్ మరింత రా, నేచురల్‌గా ఉండి, లవ్ స్టోరీకి ఇంకా డెప్త్ ఇచ్చి ఉంటే సినిమా మరింత బెటర్‌గా ఉండేదనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా అడివి శేష్ సినిమాలపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ దృష్ట్యా “డెకాయిట్” కథ, ట్రీట్‌మెంట్ మిడ్‌గా, రొటీన్‌గా అనిపించడం మెయిన్ మైనస్. ఫైనల్ గా అంచనాలు తగ్గించుకుంటే ఒకసారి చూడొచ్చు. 

Apr 10, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Dacoit movie Review

అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి డెకాయిట్ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమాలో అడవి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో సినిమాని భుజాలపై నిలబెట్టారు. ముఖ్యంగా మృణాల్ సినిమా అంత...

అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి డెకాయిట్ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమాలో అడవి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో సినిమాని భుజాలపై నిలబెట్టారు. ముఖ్యంగా మృణాల్ సినిమా అంతా తన ఎమోషనల్ నటనతో అదరగొట్టేసింది. ఇక అనురాగ్ కశ్యప్ అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునయన.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.


ఇక టెక్నికల్ గా చూస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చాలా ప్లస్ అయ్యాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కట్ మాత్రం అదిరిపోయింది. గ్యాని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరింత ఎలివేట్ చేసింది. భీమ్స్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. ప్రేమకథకు యాక్షన్ జోడించి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో బాగా రాసుకున్నారు. డైలాగ్స్ కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో దర్శకుడిగా మారి మొదటి సినిమా బాగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘డెకాయిట్’ సినిమా ఎమోషనల్ ప్రేమ కథతో పాటు ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. 

Apr 10, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Dacoit movie Review

అడివి శేష్ అంటేనే విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఈయన ట్రాక్ రికార్డ్ పీక్స్ లో ఉంది. మూడేళ్ల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డెకాయిట్: ఒక ప్రేమ కథ. తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా. సినిమా గురించి మరియు మేకర్స్ టీం గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే,...

అడివి శేష్ అంటేనే విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఈయన ట్రాక్ రికార్డ్ పీక్స్ లో ఉంది. మూడేళ్ల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డెకాయిట్: ఒక ప్రేమ కథ. తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా. సినిమా గురించి మరియు మేకర్స్ టీం గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, ముందుగా అడివి శేష్ గురించి చెప్పుకోవాలి. తన మార్క్ నటనతో ఈ సినిమాను భుజాన వేసుకున్నాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తన పాత్రకు ప్రాణం పోశాడు. అలాగే మృణాల్ ఠాకూర్ తన నటనతో ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. అలాగే అనురాగ్ కశ్యప్ నటన చాలా రియలిస్టిక్ గా ఉండి సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే మిగతా ఆర్టిస్టులకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు దక్కలేదు. 


అయితే టెక్నికల్ గా భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. దనుష్ భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా, కథలోని మూడ్ కి తగ్గట్టుగా సాగింది. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ల నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా డెకాయిట్ ఒక డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ గా ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. 

Apr 10, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Dacoit movie Review

అడవి శేష్ మెయిన్ లీడ్ లో నటించిన డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటుల పరంగా అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు కొట్టేసారు. సినిమా మొత్తం ఒక రకంగా వీళ్ళే నడిపిస్తారు. ఆ తర్వాత ఇతర కీ రోల్స్ ప్లే చేసిన కామాక్షి భాస...

అడవి శేష్ మెయిన్ లీడ్ లో నటించిన డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటుల పరంగా అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు కొట్టేసారు. సినిమా మొత్తం ఒక రకంగా వీళ్ళే నడిపిస్తారు. ఆ తర్వాత ఇతర కీ రోల్స్ ప్లే చేసిన కామాక్షి భాస్కర్ల, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, జయన్ మారియా ఖాన్, సునీల్, అతుల్ కులకర్ణి వీళ్ళందరూ తమ రోల్స్ లో బాగానే మెప్పించినా, ఆ రోల్స్ ని స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. 


ఇక అడివి శేష్ అంటేనే థ్రిల్లర్ సినిమాలకు స్పెషలిస్ట్. ఆయన సినిమాల్లో ట్విస్టులు బావుంటాయనే పేరుంది. 'డెకాయిట్'లోనూ ట్విస్టులు ఉన్నాయి. అవి బావున్నాయి. కానీ ఇది థ్రిల్లర్ మూవీ కాదు... ప్రేమ కథ. అయితే ఆ ప్రేమకు అవసరమైన ఎమోషనే సినిమాలో మిస్ అయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లైమాక్స్‌ తప్ప 'హార్ట్' టచింగ్ మూమెంట్స్‌ లేవు. ఇక టెక్నికల్ పరంగా సాలిడ్ ఇంపాక్ట్ ఉన్న సినిమా ఇది. బీజీఎమ్ కూడా అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. అయితే ప్రేక్షకుల మనసు దోచుకోవడంలోనే డెకాయిట్ సినిమా విఫలమైంది. అయితే టెక్నికల్ స్టాండర్డ్స్, క్లైమాక్స్ కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.


Apr 10, 2026 Read Review
6

Above Average

Dacoit movie Review

అడవి శేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ తెలుగు ఆడియన్స్ ఇచ్చేసారు. అదే స్థాయి అంచనాలతో మినిమం కాకుండా భారీ అంచనాలతో విడుదలైంది డెకాయిట్ మూవి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అడవి శేష్ స్వయంగా అందించిన ఈ కథకు స్క్రీన్ ప్లే కూడా తానే ఇవ్వగా, షానియల్ డియో డైరెక్ట్ చేసాడు. దీనికి తోడు అబ్బూరి రవి డైలాగ...

అడవి శేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ తెలుగు ఆడియన్స్ ఇచ్చేసారు. అదే స్థాయి అంచనాలతో మినిమం కాకుండా భారీ అంచనాలతో విడుదలైంది డెకాయిట్ మూవి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అడవి శేష్ స్వయంగా అందించిన ఈ కథకు స్క్రీన్ ప్లే కూడా తానే ఇవ్వగా, షానియల్ డియో డైరెక్ట్ చేసాడు. దీనికి తోడు అబ్బూరి రవి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక షానియల్ డియో డైరెక్షన్ బాగానే చేసినా, దాన్ని అంతే ఇంట్రెస్టింగ్‌ గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. 


స్క్రీన్‌ప్లే పరంగా లోపలున్నాయి. అయితే సెకండాఫ్‌ ని బాగా డీల్‌ చేశారు. అదే సినిమాని నిలబెడుతుంది. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. విజువల్స్ గానూ ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం అదిరిపోయింది. భీమ్స్ మెప్పించారు. గ్యానీ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. మేజర్‌గా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పరంగా లోపాలు కనిపించాయి. అవన్నీ పక్కన పెడితే ఓవరాల్‌గా ఎంగేజ్‌ చేస్తూ డెకాయిట్ ఆకట్టుకునే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ, యాక్షన్‌ పరంగా ఆకట్టుకునే మూవీ డెకాయిట్‌. అడివి శేష్‌ చేసిన భిన్నమైన ప్రయత్నమని చెప్పొచ్చు.


Apr 10, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Dacoit Movie Review

అడివి శేష్, మృణాల్ థాకూర్ నటించిన డెకాయిట్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, సినిమాలో వీళ్ళ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. స్టోరీ పరంగా రొటీన్ గా ఉన్నా, టేకింగ్ పరంగా యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ వస్తుంది. పైగా దర్శకుడు షానియల్ డియో రాసుకొన్న క్లైమాక్స్, డిజైన్ చేస...

అడివి శేష్, మృణాల్ థాకూర్ నటించిన డెకాయిట్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, సినిమాలో వీళ్ళ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. స్టోరీ పరంగా రొటీన్ గా ఉన్నా, టేకింగ్ పరంగా యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ వస్తుంది. పైగా దర్శకుడు షానియల్ డియో రాసుకొన్న క్లైమాక్స్, డిజైన్ చేసిన సీన్లు హైలెట్‌ గా మారాయి. దాంతో సినిమాకి హిట్ కావాల్సిన హంగులను జోడించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అలాగే హరిగా అడివి శేష్, జూలియట్‌గా మృణాల్ థాకూర్ తమ పాత్రల్లో జీవించారు. మరోసారి ఇద్దరూ కూడా డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, జేయ్ మేరీ ఖాన్ తమ నటనతో సినిమాకు బలంగా మారారు. 


ఇక డెకాయిట్ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫి, నాగేంద్ర ఆర్ట్ వర్క్ సినిమాకు హైలెట్‌ గా మారింది. భీమ్స్ సిసిరోలియో పాటలు, బీజీఎం సినిమాకు అల్టిమేట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డెకాయిట్ మూవి యాక్షన్ లవర్స్ తో పాటు లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్లకు కూడానచ్చుతుంది. కాకపోతే కొత్తదనం ఆశిస్తే, కాస్త డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది. 

Apr 10, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Dacoit movie Review

తాజాగా విడుదలైన డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... మెయిన్ లీడ్ లో నటించిన అడవి శేష్, మృణాల్ తమ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. దర్శకుడు షానియల్ మేకింగ్ స్టైల్ బాగుంది. అలాగే అడవి శేష్ మరోసారి మంచి కథకుడిగా మెప్పించాడు. భీమ్స్ అందించిన పాటలు హుషారునిస్తాయి, కానీ కొన్ని చోట్ల నేపథ్యం సంగీతం కాస్త ల...

తాజాగా విడుదలైన డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... మెయిన్ లీడ్ లో నటించిన అడవి శేష్, మృణాల్ తమ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. దర్శకుడు షానియల్ మేకింగ్ స్టైల్ బాగుంది. అలాగే అడవి శేష్ మరోసారి మంచి కథకుడిగా మెప్పించాడు. భీమ్స్ అందించిన పాటలు హుషారునిస్తాయి, కానీ కొన్ని చోట్ల నేపథ్యం సంగీతం కాస్త లౌడ్‌గా అనిపిస్తుంది. ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను సీట్ల అంచుమీద కూర్చోబెట్టాయి. 


అయితే ఏ సినిమాలో అయిన చిన్నపాటి మైనస్ పాయింట్లు ఉండటమే సహజమే. ఇక ఈ డెకాయిట్ కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు సెకండాఫ్‌ లో సాగతీత అంశాలు ఉన్నాయి. చివరగా.. 'డెకాయిట్'.. పాత కథే అయినా, శేష్ తన యాక్షన్, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. మొత్తానికి ఈ సినిమాతో అడవి శేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్టే కనిపిస్తున్నాడు. కాకపోతే ఫైనల్ రిసల్ట్ ఆడియన్స్ చేతిలో ఉంది. 

Apr 10, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Dacoit Movie Review

తాజాగా విడుదలైన డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లిద్దరూ మంచి పెర్ఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా మృణాల్‌ చక్కని హావభావాలను ఆమె ప్రదర్శించింది. ఇక అడివి శేష్‌ పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది.&nb...

తాజాగా విడుదలైన డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లిద్దరూ మంచి పెర్ఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా మృణాల్‌ చక్కని హావభావాలను ఆమె ప్రదర్శించింది. ఇక అడివి శేష్‌ పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది. సునీల్‌, అతుల్ కులకర్ణి ఇతర ప్రధానపాత్రలు పోషించిన వారికి స్ట్రాంగ్ రోల్స్ పడలేదు. 


ఇక సాంకేతిక నిపుణుల పనితనం కూడా గొప్పగా ఉంది. జ్ఞానీ తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మూవీని నిలబెట్టాడు. భీమ్స్ అందించిన స్వరాలు ఓకే! ధనుష్‌ భాస్కర్‌ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ప్రొడక్షన్ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి వీల్లేదు. సుప్రియా యార్లగడ్డ ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. సునీల్‌ నారంగ్‌ ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్‌ ప్లేను కొత్తగా చెప్పాలనుకుని తడబడటం వల్ల 'డెకాయిట్‌' కొంత నిరాశకు గురి చేస్తుంది. భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వెళితే... ఓకే! ఓవరాల్ గా డీసెంట్ ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా డెకాయిట్ ఆకట్టుకునే అవకాశం ఉంది. 

Apr 10, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Dacoit Movie Review

డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... మూవీ లో అడివి శేష్ పెర్ఫామెన్స్ ఎప్పటిలానే చాలా బాగుంది. తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. అయితే పెర్ఫార్మన్స్ పరంగా మృణాల్ ఠాకూర్ శేష్ ని కూడా డామినేట్ చేసేసింది. భావోద్వేగాలు పండించడంలో తన ప్రత్యే...

డెకాయిట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే... మూవీ లో అడివి శేష్ పెర్ఫామెన్స్ ఎప్పటిలానే చాలా బాగుంది. తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. అయితే పెర్ఫార్మన్స్ పరంగా మృణాల్ ఠాకూర్ శేష్ ని కూడా డామినేట్ చేసేసింది. భావోద్వేగాలు పండించడంలో తన ప్రత్యేకతను ఆమె మరోసారి చాటుకుంది. అయితే అనురాగ్ కశ్యప్.. ప్రకాష్ రాజ్ పాత్రలు అనుకున్నంత స్థాయిలో లేవు. 


టెక్నికల్ గా చూస్తే... ‘డెకాయిట్’ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. ధనుష్ భాస్కర్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. భీమ్స్ సిసిరోలియో పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాలో మేజర్ హైలైట్. అబ్బూరి రవి మాటలు సంభాషణల్లో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్లు బాగానే మాట్లాడుకుంటాయి కానీ.. డైలాగుల్లో మాత్రం పదును లోపించింది. శేష్-షనీల్ డియో కలిసి వండిన కథలో విషయం ఉంది కానీ.. ఈసారి శేష్ మార్కు స్క్రీన్ ప్లే మాయాజాలం మిస్సయింది. సినిమాలో బిగి కనిపించలేదు. దర్శకుడిగా షనీల్ ఓకే అనిపించాడు. ఓవరాల్ గా డెకాయిట్ ఒకే అనిపించే థ్రిల్లర్ అనిపించుకుంది. 


Apr 10, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Dacoit Movie Review

షానియల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కిన డెకాయిట్ మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకు రాగా, మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మెయిన్ లీడ్ గా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ సినిమాని వాళ్ళ పెర్ఫానడిపించారు. బట్ ఈ రోల్స్ తప్ప మిగతా కీ రోల్స్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ లాంటి ఆర్టిస్ట్ లకు...

షానియల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కిన డెకాయిట్ మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకు రాగా, మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మెయిన్ లీడ్ గా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ సినిమాని వాళ్ళ పెర్ఫానడిపించారు. బట్ ఈ రోల్స్ తప్ప మిగతా కీ రోల్స్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ లాంటి ఆర్టిస్ట్ లకు స్ట్రాంగ్ రోల్స్ ఇవ్వలేదు. అలా చెప్పడం కంటే అసలు వాళ్ళని బాగా యూస్ చేసుకోలేదు అనిపిస్తుంది. 



స్టోరీ యావరేజ్ గా ఉంటుంది. టేకింగ్ బాగుంది. టెక్నికల్ గా సినిమాకి బీజీఎమ్ బావుంది.. కానీ సాంగ్స్ విషయంలో భీమ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడిటింగ్ విషయంలో ఫర్వాలేదు. ఇంకాస్త ట్రిమ్ కూడా చేసే అవకాశం ఉంది. నిర్మాత సుప్రియ అయితే ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అయితే ఎటొచ్చి సినిమా టైటిల్ అయిన 'డెకాయిట్‌' కంటే.. క్యాప్షన్‌గా ఇచ్చిన 'ఒక ప్రేమ కథ' డామినేషన్‌ యే ఎక్కువ ఉంది. క్లైమాక్స్‌ కి తగ్గట్లుగా స్క్రీన్‌ప్లే ని ఇంకాస్త రేసీగా.. ఫస్టాఫ్‌లో ఏమైనా బలమైన సీన్లు ఉండుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదేమో. ఓవరాల్ గా ఈ డెకాయిట్.. లో ప్రేమ ఉంది కానీ యాక్షన్ సరిపోలేదు.  

Apr 10, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Dacoit movie Review

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన డెకాయిట్ థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా కథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. శేష్, మృణాల్ పెర్ఫార్మన్స్ అల్టిమేట్ గా ఉంది. బట్ వాళ్ళ రోల్స్ కి తగ్గ స్ట్రాంగ్ ఎమోషన్స్ మూవీ ఓ మిస్ అయ్యాయి. ఇక టెక...

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన డెకాయిట్ థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా కథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. శేష్, మృణాల్ పెర్ఫార్మన్స్ అల్టిమేట్ గా ఉంది. బట్ వాళ్ళ రోల్స్ కి తగ్గ స్ట్రాంగ్ ఎమోషన్స్ మూవీ ఓ మిస్ అయ్యాయి. 


ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు షానియల్ డియో సినిమాను గ్రాండ్ కాన్వాస్ లో ఒక రేంజ్ విజువల్స్ చూపించారు. ఆ విజువల్స్ కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంతో మ్యూజిక్ డైరెక్టర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఎడిటింగ్ సినిమా నడిపించే ఫీలింగ్ కలిగించింది. ఇక ఎడిటింగ్ కట్ కట్ గా అనే స్టైల్ మాస్ ఎలిమెంట్స్ కి హెల్ప్ అయ్యింది. 


అయితే కథ ఎక్కడైతే అనిపించిందో, స్టోరీ చెప్పే మార్గం కూడా అదే లైన్ లో చాలా వరకు మాస్ అనిపించింది. టెక్నికల్ గా ఎక్కడా పెద్దగా నెగటివ్ పాయింట్స్ కనిపించలేదు. ఓవరాల్ గా ఈ డెకాయిట్ యాక్షన్ తో అలరిస్తూ, ఎమోషన్స్ తో ఏడిపిస్తాడు. 

Apr 10, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Dacoit Movie Review

“డెకాయిట్” అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా... పోస్టర్ లోనే Dacoit కి ఇచ్చిన “ఓ ప్రేమ కథ” ట్యాగ్‌లైన్ కూడా అదే అంచనాలను పెంచింది. కానీ థియేటర్‌లో కూర్చుని చూస్తే... సినిమా ఆ లైన్‌కు పూర్తిగా జస్టి ఫై అయ్యిందా అంటే కాస్త డౌట్ అనే ఫీలింగ్ వస్తుంది. అడవి శేష్ తన స్టైల్‌ లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్...

“డెకాయిట్” అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా... పోస్టర్ లోనే Dacoit కి ఇచ్చిన “ఓ ప్రేమ కథ” ట్యాగ్‌లైన్ కూడా అదే అంచనాలను పెంచింది. కానీ థియేటర్‌లో కూర్చుని చూస్తే... సినిమా ఆ లైన్‌కు పూర్తిగా జస్టి ఫై అయ్యిందా అంటే కాస్త డౌట్ అనే ఫీలింగ్ వస్తుంది. అడవి శేష్ తన స్టైల్‌ లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్‌ తో పాటు ఎమోషన్స్‌ ను కూడా హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడు. ఇక Mrunal Thakur స్క్రీన్‌ పై చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ఒక లెవెల్ వరకు హెల్ప్ చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ మాత్రం నిజంగా కనెక్ట్ అవుతాయి.


కానీ ప్రాబ్లమ్ ఎక్కడంటే... స్టోరీ. మొత్తం సినిమా రొటీన్ లైన్లోనే నడుస్తుంది. ఎక్కడో చూసినట్టే అనిపించే సీన్స్, ఊహించగలిగే ట్విస్ట్స్... ఇవన్నీ కలిసి ఎంగేజ్‌మెంట్‌ను తగ్గిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా... సెకండ్ హాఫ్‌లో మాత్రం డ్రాప్ క్లియర్‌గా కనిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో లాజిక్ పక్కన పెట్టేసిన ఫీలింగ్ కూడా వస్తుంది.


టెక్నికల్‌గా చూస్తే మాత్రం సినిమా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మేకింగ్ రిచ్‌గా ఉంది, విజువల్స్ క్లీన్‌గా ఉన్నాయి. డైరెక్టర్ టేకింగ్ కూడా డీసెంట్. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల అవన్నీ పూర్తి ఎఫెక్ట్ ఇవ్వలేకపోయాయి. ఓవరాల్ గా దొంగతనాలు బానే చేసారు గాని, ఆడియన్స్ మనసులు దోచుకోలేదు. 

Apr 10, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Dacoit movie Review

“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ కలిసిన స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ తెరపై మాత్రం ఆ అంచనాలకు విరుద్ధంగా కథ సా...

“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ కలిసిన స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ తెరపై మాత్రం ఆ అంచనాలకు విరుద్ధంగా కథ సాగడం గమనించదగ్గ విషయం.

హీరోగా Adivi Sesh, హీరోయిన్‌గా Mrunal Thakur తమ నటనతో సినిమాను కొంతవరకు నిలబెట్టారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో వారి పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

అయితే ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎంగేజ్‌మెంట్ ఉన్నా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేకుండా కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.


దర్శకుడు టేకింగ్ విషయంలో తన ముద్ర వేయగలిగాడు. మేకింగ్, నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అయితే కంటెంట్ పరంగా బలహీనతలు ఉండటం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ చూపించలేకపోయింది.

మొత్తంగా “డెకాయిట్” ఓ సరాసరి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కొత్తదనం, బలమైన కథ కోరుకునే ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే అవకాశం ఉంది. కానీ ఎమోషనల్ టచ్, యాక్షన్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి చూసేలా మాత్రం ఉంటుంది.




Apr 10, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Dacoit Movie Review

"డెకాయిట్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్లుగా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన కూడా బాగుంది. దీనికి తోడు కథా కథనాలు రొటీన్ గా ఉన్నాయి. కానీ డైరెక్టర్ టేకింగ్ బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ స...

"డెకాయిట్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్లుగా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన కూడా బాగుంది. దీనికి తోడు కథా కథనాలు రొటీన్ గా ఉన్నాయి. కానీ డైరెక్టర్ టేకింగ్ బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.


నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కానీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు శేష్ – మృణాల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. కాకపోతే స్టోరీ ఫ్రెష్ గా కావాలనుకునే ఆడియన్స్ కాస్త నిరాశ చెందొచ్చు.

Apr 10, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... హరి (అడివి శేష్) సరస్వతి (మృణాల్ ఠాకూర్) ఒకర్నొకరు ప్రాణంగా ప్రేమించుకొంటారు. కులాలు వేరైనా పెళ్లి  చేసుకోవాలని ఎన్నో కలలుగంటారు. కట్ చేస్తే... కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఓ హత్య కేసులో హరి కడప సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనిభవిస్తూ ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే తాను ప్రాణంగా ప్రేమించిన సరస్వతే హరి హత్య చేసాడని సాక్ష్యం చెప్పి జైలుకి వెళ్ళడానికి   కారణం అవుతుంది. అయితే తనని కావాలనే కావాలనే కేసులో ఇరికించిందని భావించి సరస్వతిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఓ టైం లో జైల్లో పరిచయమైన ఇసాక్ భాయ్ (అతుల్ కులకర్ణి) సాయంతో బైటికి వస్తాడు. అయితే బైటికి వచ్చిన తర్వాత హరి అనుకోకుండా సరస్వతితో కలిసి దొంగతనాలు చేస్తాడు. అసలు పగ  తీర్చుకోవాలని బైటికి వచ్చిన హరి సరస్వతితో దొంగతనాలు ఎందుకు చేయాల్సి వస్తుంది. మధ్యలో సరస్వతి పాప కథేంటి? చివరికి వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే మిగిలిన కథ. 

 

Technical values : డెకాయిట్ ఓ ప్రేమ కథ అంటూ మూవీ కి ట్యాగ్ లైన్ ఇచ్చినప్పుడే ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ రెండూ ఉంటాయని మేకర్స్ ఆడియన్స్ కి హింట్ ఇచ్చేసరికి అందరూ మంచి లవ్ స్టోరీ యాక్షన్ మిక్స్డ్ ఉంటుందని ఫిక్సయ్యారు. కానీ కథ దానికి రివర్స్ లో ఉంటుందని చూసాక తెలుస్తుంది. కథలో కొత్తదనం ఉంటుందని అనిపించినా సెకండ్ హాఫ్ వచ్చే సరికి నార్మల్ అయిపోతుంది. ముందుగా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే... అడివి శేష్.. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించాడు. కథలో పాత్రలోనూ రెండు రకాల షేడ్స్ ని చూపించాడు. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా అందంగా కనిపిస్తూనే, అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. పైగా కథలో చాలా స్ట్రాంగ్ రోల్ ఇది. వీళ్ళే కాక, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. 

 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే కథ, స్క్రీన్ ప్లే అందించిన హీరో అడవి శేష్ తన విషయంలో న్యాయం చేసాడు. దర్శకత్వం వహించిన షానియల్ డియో కి ఇది ఫస్ట్ మూవీ అయినా కూడా బాగా హ్యాండిల్ చేసాడు. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సినిమాని హీరోహీరోయిన్ల ఇద్దరి సైడ్ నుండి ఒక్కో విధంగా చూపించడం ఆకట్టుకుంటుంది, అలాగే లవ్ తో కూడిన ఎమోషనల్ ఎండింగ్ ఫ్రెష్ గా ఉంటుంది.

కాకపోతే హీరోయిన్ రోల్ ని స్ట్రాంగ్ గా రాసుకున్నా, అంత బాగా ఎలివేట్ చేయలేదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. ఎమోషన్స్ కి తగ్గ డైలాగ్స్ అంత బలంగా లేకపోవడం వల్ల పలు సన్నివేశాలు బోర్ కొట్టేస్తాయి. పైగా కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉండడం బోనస్ నెగిటివ్ అయింది. అయితే మ్యూజిక్ పరంగా భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎమ్ మంచి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా హైలెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

Final Review : ఓవరాల్ గా "డెకాయిట్" మూవీ ఒక ఎమోషనల్ లవ్ అండ్ డీసెంట్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే ల్యాగ్ అవడం వల్ల బోరింగ్ గా అనిపిస్తుంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మన్స్ కోసం, అలాగే యాక్షన్ మూవీ లవర్స్, లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ డెకాయిట్ ని డీసెంట్ మూవీగా భావించి చూసేయొచ్చు. కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.

Review Statistics

5.7
Overall Rating
Avg. of all reviews
20
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.7/10
Public
N/A