Register as a Reviewer
Dhurandhar The Revenge (ధురంధర్ ది రివేంజ్)

Dhurandhar The Revenge (ధురంధర్ ది రివేంజ్)

19 Mar 2026
Overall Rating
7.1/10
20 Reviews

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇక కొన్ని నెలల గ్యాప్ లోనే తాజాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ "ధురంధర్ ది రివేంజ్" పేరిట విడుదలై థియేటర్లలో ట్రెండ్ అవుతుంది.

Director: AdityaDhar
Cast: RanveerSingh, AdityaDhar, R.Madhavan, Sanjaydutt, ArjunRampal, SaraArjun

Available in:

Reviews

What critics and the public are saying about Dhurandhar The Revenge (ధురంధర్ ది రివేంజ్)

Media Reviews

20 Avg: 7.1/10
Great Andhra
Great Andhra Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్: ది రివెంజ్’ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తన స్టాండ్‌ ను మరింత బలంగా చూపించాలనే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సీక్వెల్‌లో దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను మరింత హై నోట్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ అంశాలు కొన్ని చోట్ల థియేటర్లలో విజిల్స్ తెప్పించినా, కొన్నిచోట్...

ధురంధర్: ది రివెంజ్’ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తన స్టాండ్‌ ను మరింత బలంగా చూపించాలనే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సీక్వెల్‌లో దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను మరింత హై నోట్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ అంశాలు కొన్ని చోట్ల థియేటర్లలో విజిల్స్ తెప్పించినా, కొన్నిచోట్ల అతిశయోక్తిగా అనిపిస్తాయి.


ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. కానీ సెకండాఫ్‌ లో యాక్షన్, హై మూమెంట్స్‌ తో సినిమా ట్రాక్‌ లోకి వస్తుంది. క్లైమాక్స్ మాస్ ఫీలింగ్‌ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇస్తుంది. అయితే నాలుగు గంటల నిడివి కారణంగా మధ్య మధ్యలో ల్యాగ్ ఫీల్ తప్పదు. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే సినిమా ప్రధానంగా హీరో చుట్టూనే తిరుగుతుంది. అతని యాక్షన్, ఎమోషనల్ సీన్స్ సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. మాధవన్ తన స్టైల్‌లో కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. 


టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్. యాక్షన్ సీన్స్, విజువల్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. దర్శకుడు కథను లోతుగా చెప్పడం కంటే, స్టైల్, ఎలివేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే ‘ధురంధర్: ది రివెంజ్’ మాస్ ఎలిమెంట్స్, దేశభక్తి కోణంతో కూడిన కమర్షియల్ స్పై యాక్షన్ డ్రామా. ఫస్ట్ పార్ట్ నచ్చిన వారికి ఇది కూడా నచ్చే అవకాశం ఉంది. కానీ కొత్తదనం ఆశిస్తే మాత్రం మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది.

Mar 19, 2026 Read Review
One India
One India Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన "ధురంధర్" కి సీక్వెల్ గా వచ్చిన 'ధురంధర్ ' - ది రివెంజ్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ పార్ట్ లో 'ధురంధర్ ది రివెంజ్' స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా చూపించారు. సినిమా సెకండ్ పార్ట్ అజయ్ ఖన్నా పాత్ర చనిపోయిన తర్వాత బలోచి ల్యారీలో జరిగే...

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన "ధురంధర్" కి సీక్వెల్ గా వచ్చిన 'ధురంధర్ ' - ది రివెంజ్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ పార్ట్ లో 'ధురంధర్ ది రివెంజ్' స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా చూపించారు. సినిమా సెకండ్ పార్ట్ అజయ్ ఖన్నా పాత్ర చనిపోయిన తర్వాత బలోచి ల్యారీలో జరిగే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. హమ్జాగా రణ్వీర్ సింగ్ పాకిస్థాన్ రాజకీయాల్లో ఎదిగిగిన తీరు, దాని కోసం వేసిన ఎత్తులు కూడా ఆడియన్స్‌కి కిక్కిస్తాయి. ముఖ్యంగా భారత్ కు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన పలు ముఖ్యమైన ఘటనలను కూడా ప్రస్తావించారు.


ఇవే కాకుండా నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ సీన్లన్నీ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. సెకండాఫ్‌లో కూడా మొత్తం పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులు, భారత్‌కి వ్యతిరేకంగా పనిచేసే పలువుర్ని ఏరిపారేసే సీన్లు ఇవన్నీ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. అలానే హమ్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీనా (సారా అర్జున్)కి కూడా ఇందులో రెండు మూడు బలమైన సీన్లు పడ్డాయి. ఇక క్లైమాక్స్‌లో ఒక పాత్రలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ని ఇస్తుంది. ఓవరాల్‌గా ఇదొక అదిరిపోయే "దేశభక్తి ఉన్న రివెంజ్ డ్రామా".


Mar 19, 2026 Read Review
T2B Live
T2B Live Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్2 గురించి చెప్పాలంటే.. ముందుగా కథ గురించే చెప్పాలి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేస్తుందని చెప్పాలి. కథ మెయిన్ పాయింట్ విషయానికి వస్తే మొదటి పార్ట్ లో ల్యారీ బాద్ షా ని చంపినా ఇంకా శత్రువులు చాలా మంది ఉండటంతో ఒక్కొక్కరినీ ఎలా మట్టుపెట్...

ధురంధర్2 గురించి చెప్పాలంటే.. ముందుగా కథ గురించే చెప్పాలి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేస్తుందని చెప్పాలి. కథ మెయిన్ పాయింట్ విషయానికి వస్తే మొదటి పార్ట్ లో ల్యారీ బాద్ షా ని చంపినా ఇంకా శత్రువులు చాలా మంది ఉండటంతో ఒక్కొక్కరినీ ఎలా మట్టుపెట్టాలి అని ఎదురు చూసే హీరో ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలవుతుంది. తన ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రజెంట్ టైంలో, ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో ఎలా ఎదిగాడు, తన నిజం గురించి అందరికీ తెలిసే టైంకి తను చేయాలి అనుకున్నది చేశాడా లేదా అనేది స్టోరీ. 


క ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైని ఏమాత్రం తగ్గించకుండా స్టార్ట్ అయిన ధురంధర్2 ప్రతి సీన్ ని కథలో లోతుగా చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తాడు. ల్యాగ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఆసక్తిని మరింతగా పెంచేస్తూ దావూద్ ఇబ్రహీంని సీన్ లోకి తీసుకు రావడం అలాగే ఫస్ట్ పార్ట్ మొదట్లో ఫ్లైట్ హైజాక్ చేసిన పాకిస్తాన్ విలన్ ని చూపించడం తో మళ్ళీ ఆసక్తి పెంచుతారు. ఓవరాల్ గా మూవీ లెంగ్త్ ఎక్కువైనా అదిరిపోయే డ్రామా సీన్స్ తో ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుంది. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇది కదా సినిమా అంటే అన్న ఫీలింగ్ తో రావడం మాత్రం ఖాయం. 

Mar 19, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్’పై వచ్చిన ప్రాపగాండ విమర్శలను పక్కన పెట్టి, ఈ సీక్వెల్‌ ధురంధర్2 లో దర్శకుడు ఆదిత్య ధర్ మరింత బలంగా తన కథను ఆడియన్స్ కు చెప్పాడు. దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను కలిపి రియలిస్టిక్‌ గా ప్రెజెంట్ చేశారు. ఈ సన్నివేశాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయనడంలో ఆశ్చర్యం లేదు....

ధురంధర్’పై వచ్చిన ప్రాపగాండ విమర్శలను పక్కన పెట్టి, ఈ సీక్వెల్‌ ధురంధర్2 లో దర్శకుడు ఆదిత్య ధర్ మరింత బలంగా తన కథను ఆడియన్స్ కు చెప్పాడు. దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను కలిపి రియలిస్టిక్‌ గా ప్రెజెంట్ చేశారు. ఈ సన్నివేశాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయనడంలో ఆశ్చర్యం లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉన్నా… సెకండాఫ్ నుంచి సినిమా పికప్ అవుతుంది. క్లైమాక్స్ మాస్‌ గా, ఎమోషనల్‌ గా కూడా ఆకట్టుకుంటుంది . అయితే నిడివి ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల వైలెన్స్ ఎక్కువ కావడం మైనస్ అయింది.


పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా ఎక్కువగా రణవీర్ సింగ్ మీదే నడుస్తుంది. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా బాగా ఆకట్టుకుంది. ఇక మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా నిలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ కూడా స్టైలిష్‌ గా ఉన్నాయి. అలాగే దేశభక్తి, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ తో కూడిన సాలిడ్ ఎంటర్టైనర్ గా ధురంధర్ అలరిస్తుంది. ఇక సినిమాలో చూపించే కొన్ని నిజ జీవిత సంఘటనల సన్నివేశాలు ఆడియన్స్ కి కథలోకి మరింత ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. 

Mar 19, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్ 2 సినిమా మొదలవుతూనే కథ ఇండియా బ్యాక్‌డ్రాప్‌ లో జస్కరిత్ సింగ్ కథతో స్టార్ట్ కావడం సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ట్రాక్‌లోకి వెళ్లిన తర్వాత గ్యాంగ్ వార్, రెగ్యులర్ స్పై థ్రిల్లర్ టోన్‌లో సాగుతుంది. అయినా యాక్షన్ బ్లాక్స్, నటీనటుల అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల ధురంధర్ సినిమా బ...

ధురంధర్ 2 సినిమా మొదలవుతూనే కథ ఇండియా బ్యాక్‌డ్రాప్‌ లో జస్కరిత్ సింగ్ కథతో స్టార్ట్ కావడం సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ట్రాక్‌లోకి వెళ్లిన తర్వాత గ్యాంగ్ వార్, రెగ్యులర్ స్పై థ్రిల్లర్ టోన్‌లో సాగుతుంది. అయినా యాక్షన్ బ్లాక్స్, నటీనటుల అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల ధురంధర్ సినిమా బోర్ కొట్టదు.


రణ్‌వీర్ సింగ్ డ్యూయల్ షేడ్స్‌ లో అద్భుతంగా నటించి ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌ కు తీసుకెళ్లాడు. మాధవన్ డీసెంట్ ఎలివేషన్స్‌ తో తన రోల్ తో మెప్పించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, ఎమోషనల్ సీన్స్‌లో బాగుంది.


అయితే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్‌ ప్లే బలంగా ఉండటంతో నాలుగు గంటల నిడివి ఉన్నా సినిమా చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే ఇది కూడా తప్పకుండా నచ్చుతుంది.


Mar 19, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

‘ధురంధర్ ది రివెంజ్’ సినిమా కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు… పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మిక్స్ అయిన సాలిడ్ డ్రామా. హంజా క్యారెక్టర్ సినిమాకు ప్రాణం పోస్తుంది. అతని జర్నీ, టెర్రర్ నెట్‌వర్క్‌ను ఒక్కొక్కటిగా ఛేదించే ట్రాక్ చాలా ఎంగేజింగ్‌ గా ఉంటుంది.సినిమాలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి డ్రగ్...

‘ధురంధర్ ది రివెంజ్’ సినిమా కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు… పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మిక్స్ అయిన సాలిడ్ డ్రామా. హంజా క్యారెక్టర్ సినిమాకు ప్రాణం పోస్తుంది. అతని జర్నీ, టెర్రర్ నెట్‌వర్క్‌ను ఒక్కొక్కటిగా ఛేదించే ట్రాక్ చాలా ఎంగేజింగ్‌ గా ఉంటుంది.



సినిమాలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి డ్రగ్స్, టెర్రరిజం ఎలా నడుస్తాయో చాలా రియలిస్టిక్‌ గా చూపించారు. ఖలిస్తాన్ ప్లాన్, యువత బ్రెయిన్‌ వాష్ వంటి అంశాలు షాక్ ఇస్తాయి. ‘నోట్ల రద్దు’ ట్విస్ట్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ప్రెజెంటేషన్ కూడా హైలైట్ .



ఎమోషనల్‌గా రణవీర్ హమ్జా గా మారకంటే ముందు ఫ్యామిలీ ట్రాక్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సీక్రెట్ డైరీ ఎపిసోడ్ స్ట్రాంగ్‌గా వర్క్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొదలైనా… తరువాత సినిమా బాగా పికప్ అవుతుంది. వయలెన్స్, పాలిటిక్స్ డోస్ ఎక్కువగా ఉన్నా, డైరెక్షన్ & పెర్ఫార్మెన్స్ దాన్ని కవర్ చేస్తాయి. ఓవరాల్ గా ధురంధర్ ని ఒక సాలిడ్ రివెంజ్ డ్రామా గా చెప్పుకోవచ్చు. 


Mar 19, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
8

Super Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్ ది రివెంజ్ పేరుతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ ప్రేక్షకులని తన అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే అందరూ తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పించగా, ఇందులో అంతకు మించి, హంజా అలీ మజారి/జస్కిరాత్ సింగ్ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేసాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కోసం చ...

ధురంధర్ ది రివెంజ్ పేరుతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ ప్రేక్షకులని తన అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే అందరూ తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పించగా, ఇందులో అంతకు మించి, హంజా అలీ మజారి/జస్కిరాత్ సింగ్ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేసాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కోసం చాలానే కష్టపడి బాగానే దెబ్బలు కూడా తగిలించుకున్నాడు అని తెలుస్తుంది. సారా అర్జున్ ఫస్ట్ పార్ట్ లో లవ్ యాంగిల్ చూపిస్తే ఇందులో ఎమోషనల్ మోడీ లో కూడా బాగానే నటించింది. 


అలాగే SP చౌదరి అస్లాంగా సంజయ్ దత్ మెప్పిస్తారు. ఇక అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ జీవించేశారని చెప్పాలి. చాలా బాగా నటించారు. ISI లీడర్ పాత్రలో విలన్ గా అర్జున్ రాంపాల్ ఫస్ట్ పార్ట్ లో కొంతే కనిపించినా సెకండ్ పార్ట్ లో మాత్రం మెయిన్ విలన్ గా మారి అదరగొట్టేసాడు. మిగతా నటీనటులు రాకేష్ బేడీ, అశ్విన్ ధర్, గౌరవ్ గెరా, మనవ్ గోహిల్.. వారి వారి పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్, ఈ సినిమా డైరెక్టర్ భార్య యామి గౌతమ్ చిన్న పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఆ పాత్ర ఆడియన్స్ ని సప్రైజ్ చేస్తుంది.

టెక్నికల్ గా చూస్తే సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త సినిమాటిక్ షాట్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు మాత్రం యావరేజ్. యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేసారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్.


ఇక భారతదేశం, పాకిస్తాన్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాటిక్ గా రాసుకున్న కథ బాగుంది. మొత్తంగా ‘దురంధర్ ది రివెంజ్’ సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సిన దేశభక్తి సినిమాగా చెప్పుకోవచ్చు. 

Mar 19, 2026 Read Review
7

Hit

Dhurandhar The Revenge Movie Review

‘ధురంధర్’ సక్సెస్‌ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అ...

‘ధురంధర్’ సక్సెస్‌ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.

మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, నోట్ల రద్దు ట్విస్ట్ హైలైట్స్.


పాకిస్తాన్ బ్యాక్‌ డ్రాప్‌ లో హీరో ఎదుగుదల, టెర్రరిస్ట్ ట్రాక్ బాగున్నా… ఈ మధ్యలో సినిమా కాస్త స్లో అవుతుంది. సెకండాఫ్‌ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, హై మూమెంట్స్ ఉన్నా… నేరేషన్ మళ్లీ డ్రాప్ అవుతుంది.

క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ దేశభక్తి ఫీల్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో హైలైట్ కాగా, సంజయ్ దత్, మాధవన్ పాత్రలు కూడా బాగా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తానికి 

హై మూమెంట్స్, యాక్షన్ కోసం మాత్రమే కాదు.. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాగా ధురంధర్ అలరిస్తుంది. 

Mar 19, 2026 Read Review
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

‘ధురంధర్: ది రివెంజ్’ ఒక హై వోల్టేజ్ ఇండియన్ స్పై యాక్షన్ డ్రామా. సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా—అన్ని అయి కమర్షియల్ ట్రీట్ ఇవ్వాలని ట్రై చేశారు. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపించినా, సినిమా మొత్తం ఒక్క వ్యక్తిపైనే ఆధారపడకుండా ఇతర పాత్రలు కూడా తమ స్థాయిలో సపోర్ట్ చేస్తాయి.సంజయ్ దత...

‘ధురంధర్: ది రివెంజ్’ ఒక హై వోల్టేజ్ ఇండియన్ స్పై యాక్షన్ డ్రామా. సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా—అన్ని అయి కమర్షియల్ ట్రీట్ ఇవ్వాలని ట్రై చేశారు. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపించినా, సినిమా మొత్తం ఒక్క వ్యక్తిపైనే ఆధారపడకుండా ఇతర పాత్రలు కూడా తమ స్థాయిలో సపోర్ట్ చేస్తాయి.


సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్లు కూడా ఓ రేంజ్ లో ఉండి ఆకట్టుకుంటాయి. ఇక రణవీర్ సింగ్ తర్వాత ఆడియన్స్ ని ఆ రేంజ్ ఇంప్రెస్స్ చేసే రోల్ మాధవన్ దే. అజయ్ సైన్యల్ గా తన కూల్ మరియు కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో బాగానే నిలిచాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు కథలో ప్రెజెన్స్ ఇవ్వగలిగాయి. అయితే ఈ పాత్రలను ఇంకా బలంగా డెవలప్ చేసి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది.


స్టోరీ పరంగా చూస్తే రివెంజ్ లైన్ కొత్తగా అనిపించదు. కొన్ని సీన్స్ బాగున్నా, మొత్తం కథనం ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వదు. యాక్షన్ సీన్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు. వయలెన్స్ ఎక్కువగా ఉండటం కొంతమందికి మైనస్ అనిపించొచ్చు. టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ను ఎలివేట్ చేస్తుంది. విజువల్స్ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీలింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఇండియన్ అసలైన రా ఏజెంట్ సినిమాగా ఈ సినిమాని ప్రతి ఆడియన్ ఎక్స్పీరెన్స్ చేయాలి. 

Mar 19, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

"ధురంధర్: ది రివెంజ్" సినిమా గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే, ఇది వ్యక్తిగత ప్రతీకారం, దేశభక్తి, శక్తి మధ్య నడిచే ఒక తీవ్ర భావోద్వేగ ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో కథ కంటే పాత్ర ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో పూర్తిగా లీనమైపోయి, ఒక ఆవేశం, అంతర్గత పోరాటం, బాధ ఇలా అన్నింటిని...

"ధురంధర్: ది రివెంజ్" సినిమా గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే, ఇది వ్యక్తిగత ప్రతీకారం, దేశభక్తి, శక్తి మధ్య నడిచే ఒక తీవ్ర భావోద్వేగ ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో కథ కంటే పాత్ర ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో పూర్తిగా లీనమైపోయి, ఒక ఆవేశం, అంతర్గత పోరాటం, బాధ ఇలా అన్నింటిని ని తన నటనలో చూపించాడు. ఓవరాల్ గా రణవీర్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. అయితే ఈ తీవ్రతకు సరిపడే స్థాయిలో కథనం నిర్మాణం బలంగా అనిపించదు.


ఇక ఇటు మాధవన్ పాత్ర వ్యూహాత్మకత, కూల్ గా కనిపిస్తుంటే కనిపించని భావోద్వేగంతో కూడిన వైల్డ్ పవర్ ని చూపిస్తాడు. అలాగే సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు కథలో కీలకంగా ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో వైలెన్సు ని పెంచలేవు. సారా అర్జున్ పాత్ర పరిమితంగా ఉండటం వల్ల పెద్దగా ఇంపార్టెన్స్ రెండో పార్ట్ లో ఉండదు. ఇక సినిమా లో ఎక్కువ వైలెన్స్ సీన్లు ఉండడం వల్ల కొంతమంది ఫ్యామిలీస్ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమాగా చెప్పుకోవచ్చు. మొత్తానికి, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ఒక శక్తివంతమైన స్పై రివెంజ్ డ్రామాగా అంతకు మించిన రియల్ ఇండియన్ స్పై మూవీగా చెప్పుకోవచ్చు. 

Mar 19, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
8

Super Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్ ది రివెంజ్.. ఇది ప్రతి ఇండియన్ సైనికుడికి సంబంధించిన కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ స్పై మూవీస్ లో ఇది కొత్త రకం సినిమా. చాలా రియలిస్టిక్ గా చాలా వరకు రియల్ ఇన్సిడెంట్స్ ని సినిమాలో చూపించి బలమైన ఎమోషన్ ని ప్రేక్షకులకు కట్టిపడేలా చూపించాడు దర్శకుడు. రణ్‌వీర్ సింగ్ మొదలుకుని మాధవన్ సహా ఎవర...

ధురంధర్ ది రివెంజ్.. ఇది ప్రతి ఇండియన్ సైనికుడికి సంబంధించిన కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ స్పై మూవీస్ లో ఇది కొత్త రకం సినిమా. చాలా రియలిస్టిక్ గా చాలా వరకు రియల్ ఇన్సిడెంట్స్ ని సినిమాలో చూపించి బలమైన ఎమోషన్ ని ప్రేక్షకులకు కట్టిపడేలా చూపించాడు దర్శకుడు. రణ్‌వీర్ సింగ్ మొదలుకుని మాధవన్ సహా ఎవరి రేంజ్ లో వారు సినిమాకి ప్రాణం పెట్టేసారు. మిగతా క్యాస్ట్ కూడా తమ తమ స్థాయిలో బాగా సపోర్ట్ చేసింది. హమ్జా క్యారెక్టర్‌లో రణ్‌వీర్ పూర్తి ఎనర్జీతో స్క్రీన్‌ను మోస్తాడు. 


ఇక మాధవన్ గురించి చెప్పాలంటే… చాలా కూల్, కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా చాలా నేచురల్‌ గా కనిపిస్తాడు. సంజయ్ దత్ తన ఎక్స్‌పీరియన్స్‌ తో స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. అర్జున్ రాంపాల్ కూడా తన పాత్రలో స్టైలిష్‌గా కనిపిస్తూ బాగానే మెప్పించాడు. సారా అర్జున్ పాత్రకి స్కోప్ తక్కువే అయినా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు తగ్గట్టే సెటిల్ అయ్యారు. యాక్షన్ పరంగా సినిమా చాలా హై లెవెల్‌లో ఉంటుంది. కొన్ని చోట్ల వయలెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. మ్యూజిక్ యాక్షన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేస్తుంది. క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీల్ ఉన్నా… మొత్తం ఎనర్జీతో నడుస్తుంది.

Mar 19, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్ ది రివెంజ్... దిస్ ఈజ్ ఇండియన్ సినిమా... ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది పూర్తిగా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అని చెప్పాలి. రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో కథ ఉంది, కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం హమ్జా అలీనే. హమ్జా పాత్రలో ఆయన పూర్తిగా మునిగిపోయి యాక్షన్ సన్నివేశాల్లో బీస్ట్‌ లా రగిలిపోతూ,...

ధురంధర్ ది రివెంజ్... దిస్ ఈజ్ ఇండియన్ సినిమా... ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది పూర్తిగా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అని చెప్పాలి. రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో కథ ఉంది, కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం హమ్జా అలీనే. హమ్జా పాత్రలో ఆయన పూర్తిగా మునిగిపోయి యాక్షన్ సన్నివేశాల్లో బీస్ట్‌ లా రగిలిపోతూ, భావోద్వేగ సీన్స్‌ లో కంటతడి పెట్టించేలా నటించాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆయన ప్రెజెన్స్‌ నే ప్రధానంగా ఫీల్ అవుతాం. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసినా… స్పాట్‌లైట్ మాత్రం హీరోపైనే ఉంటుంది. 


యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండటం సినిమాకు మాస్ ఫీల్ ఇస్తుంది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ ను మరింత ఎలివేట్ చేస్తాయి. అయితే క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ అనిపించే అవకాశం ఉంది. మొత్తానికి ఇది కథ కంటే హీరో ప్రెజెన్స్‌ పై నడిచే సినిమా. రణ్‌వీర్ నటన కోసం తప్పకుండా చూడదగ్గ యాక్షన్ ఎంటర్టైనర్. అలా అని హీరో పాత్రపై మొత్తం సినిమా ఉండదు. దేశం కోసం ఈ మధ్య ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అందరి కథలు ఇందులో ఉంటాయి. 

Mar 19, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

మొత్తానికి ధురంధర్ 2 సినిమా నిజంగా మన ఇండియన్ పర్ఫెక్ట్ స్పై సినిమా లాగే చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం.. అంటే రణ్‌వీర్ సింగ్ ఒక్కడే. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్‌గా డామినేట్ చేశాడు. హమ్జా క్యారెక్టర్‌లో ఎంటర్ అయ్యాక… “ఇంకెవరూ అవసరం లేదే!” అనిపించేలా వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో ప...

మొత్తానికి ధురంధర్ 2 సినిమా నిజంగా మన ఇండియన్ పర్ఫెక్ట్ స్పై సినిమా లాగే చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం.. అంటే రణ్‌వీర్ సింగ్ ఒక్కడే. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్‌గా డామినేట్ చేశాడు. హమ్జా క్యారెక్టర్‌లో ఎంటర్ అయ్యాక… “ఇంకెవరూ అవసరం లేదే!” అనిపించేలా వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో పిచ్చిగా రగిలిపోయాడు… ఎమోషనల్ సీన్స్‌లో కూడా కంటతడి పెట్టిస్తాడు. ఈ క్యారెక్టర్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌ లో టాప్‌ లో ఉండేలా ఉంది.  


మాధవన్ తన క్యారెక్టర్ లో కూల్‌ గా సెట్ అయ్యాడు… సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఓకే. అయితే ఒక్క హీరోయిన్‌ కు మాత్రం ఈ సినిమాలో స్కోప్ తక్కువే. ఇక సినిమా మొత్తం వయలెన్స్ హై లెవెల్‌లో ఉంటుంది. అది కూడా ఓ రేంజ్‌లోనే చూపించారు. మ్యూజిక్, BGM యాక్షన్ సీన్స్‌ను మరింత హైప్ చేస్తాయి. కానీ క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం హై వోల్టేజ్ ఆక్షన్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇండియన్ స్పై ఏజెంట్ నేపథ్యాన్ని, దేశభక్తితో కలిపి సరిహద్దుల బైట కూడా తెలీని యుద్ధాలు చాలా ఉన్నాయని ఆడియన్స్ కి చెప్పే ప్రయత్నం చేసారు.

Mar 19, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
7

Hit

Dhurandhar The Revenge Movie Review

‘ధురంధర్ 2’లో రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. హమ్జా పాత్రలో ఆరంభం నుంచి ముగింపు వరకు ఆకట్టుకుంటూ వన్ మ్యాన్ షోగా నిలిచారు. యాక్షన్ సన్నివేశాల్లో క్రూరత్వాన్ని, భావోద్వేగ దృశ్యాల్లో నిగూఢతను సమానంగా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం స...

‘ధురంధర్ 2’లో రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. హమ్జా పాత్రలో ఆరంభం నుంచి ముగింపు వరకు ఆకట్టుకుంటూ వన్ మ్యాన్ షోగా నిలిచారు. యాక్షన్ సన్నివేశాల్లో క్రూరత్వాన్ని, భావోద్వేగ దృశ్యాల్లో నిగూఢతను సమానంగా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.


ఇతర పాత్రల్లో ఆర్. మాధవన్ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో మెప్పించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్రకు ప్రాధాన్యం తక్కువగా ఉన్నప్పటికీ, కనిపించిన మేరకు ఆకట్టుకుంది.


సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక అంశాలు అధికంగా ఉన్నాయి. అయితే కథకు అనుగుణంగా దర్శకుడు వాటిని సమర్థవంతంగా వినియోగించారు. సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. క్లైమాక్స్‌లో స్వల్పంగా ల్యాగ్ అనిపించినా, మొత్తం కథనం ఆసక్తికరంగా సాగుతుంది.


మొత్తానికి, ‘ధురంధర్ 2’ యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా ప్రేక్షకులను అలరించే చిత్రం. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Mar 19, 2026 Watch
Tupaki
Tupaki Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది...

రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 


ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.


Mar 19, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్‌ లో ఎంత క్రూరంగా క...


ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్‌ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.


మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రెండో పార్ట్ లెంగ్త్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఇక టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని బాగా కుదిరాయి. ఓవరాల్ గా ధురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.  

Mar 19, 2026 Read Review
Gulte
Gulte Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకె...

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే నిలిచింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్ర చిన్నదే అయినా ఓకే.


టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. లాంగ్ రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా బోర్ అనిపించకుండా మేనేజ్ చేశారు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ కొద్దిగా వీక్‌గా ఉన్నా ఓవరాల్ ఫీల్‌పై పెద్దగా ప్రభావం లేదు. దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా నడిపిస్తూ, ట్విస్ట్స్‌తో ఎంగేజ్ చేశాడు. మాస్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో బాగా వర్క్ అవుతాయి. మొత్తానికి ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. రణ్‌వీర్ సింగ్ కోసం అయినా థియేటర్‌లో చూసేయాల్సిన సినిమా. 

Mar 19, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.సంజయ్ దత్, ఆర్ మాధవన్,...


ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.


సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది.


టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది, వీఎఫ్ఎక్స్ కొంచెం వీక్ అయినా ప్రభావం తగ్గించవు.


దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్స్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు. బలమైన డైలాగ్స్, మాస్ సీన్స్ థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.


Mar 19, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Dhurandhar The Revenge Movie Review

‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ...

‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేయబడగా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, తరువాత కథ పికప్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. మొత్తానికి ‘ధురంధర్: ది రివేంజ్’ మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.

Mar 19, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
7

Hit

Dhurandhar The Revange Movie Review

‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరి...

‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని బాగా ప్రయత్నించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌లో ఉన్న ఆగ్రహం, బాధ, ప్రతీకారం వంటి భావాలను బాగా చూపించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ వేగం పెరుగుతుంది. కొన్ని ట్విస్ట్స్, క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కథనం కొన్నిచోట్ల డ్రాగ్ అయ్యిందనే ఫీలింగ్ వస్తుంది. నటీనటుల విషయానికి వస్తే హీరో రణవీర్ సింగ్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్ర కూడా కథకు సరిపడేలా ఉంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం టైట్‌గా ఉండాల్సింది. మొత్తంగా ‘ధురంధర్: ది రివేంజ్’ అద్భుతమైన రివెంజ్ డ్రామాగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాగా ఆకట్టుకుంటుంది.

Mar 19, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : పాకిస్థాన్‌లో కరాచీ ప్రాంతంలో ల్యారీ పట్టణంలో ఇండియన్ ఏజెంట్‌ గా పనిచేసే హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ (రణ్‌వీర్ సింగ్) కూలి నుండి ఎదిగి, అక్కడి డాన్ రెహ్మత్ డెకాయిట్‌ (అక్షయ్ ఖన్నా)ను హతమార్చి అతడి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొంటాడు. అక్కడి నుండి కరాచీ కేంద్రంగా భారత్‌ పై చేసే కుట్రలు విచ్చిన్నం చేస్తూ, తీవ్ర వాదులను అంతమొందిస్తూ ఉంటాడు.  ఈ క్రమంలో జస్కిరాత్ సింగ్ రాంగీ గతం ఏంటి? జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు హమ్జా ఆలీ మజారీగా మారాడు. ఇండియాలో హత్య కేసులో దోషిగా ఉన్న జస్కిరాత్‌ ను హమ్జాగా ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఎందుకు మార్చాడు? భారత్‌ లో నోట్ల రద్దు వెనుక జస్కిరాత్ సింగ్ పాత్ర ఏమిటి? కరాచీలో తలదాచుకొన్న దావూద్ ఇబ్రహీంను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ ఎలా శిక్షించారు? తనకు అప్పగించిన మిషన్‌ ను హమ్జాగా జస్కిరాత్ సింగ్ ఎలా పూర్తి చేశాడు?  అనేది కథ. 

Technical values : సినిమా గురించి మాట్లాడితే ముందుగా దర్శకుడు ఆదిత్య ధర్ గురించే చెప్పుకోవాలి. దాదాపు 4 గంటల నిడివి ఉన్నా కూడా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమాని డైరెక్ట్ చేసాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా దేశభక్తిని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
 
ఇక సినిమాలో రణవీర్ సింగ్ నటన పరంగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేసాడు. అలాగే అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు పూర్తి న్యాయం చేసారు. దీంతో పాటు దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలు, ప్రధాని మోదీ నోట్ల రద్దు వ్యవహారం కథలో కీలకంగా చూపించగా, వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

టెక్నికల్ గా ఎడిటింగ్ చాలా బాగుంది. 4 గంటల నిడివి ఉన్నా కూడా ఎక్కడా పెద్దగా బోర్ కొట్టదు. బీజీఎమ్ కూడా అద్భుతంగా ఉంది. చాలా సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. కాకపోతే విఎఫ్ఎక్స్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. 

Final Review : ఓవరాల్ గా ​'ధురంధర్: ది రివెంజ్' మూవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచే ఒక మంచి సీక్వెల్ గా చెప్పొచ్చు. కొన్ని పొలిటికల్ ఇష్యూస్, రొటీన్ సాంగ్స్, హింసాత్మక సీన్లు పక్కన బెడితే అన్ని రకాల వర్గాల ఆడియన్స్ తప్పక చూసే మూవీగా ధురంధర్ నిలిచే అవకాశం ఉంది.

Review Statistics

7.1
Overall Rating
Avg. of all reviews
20
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
7.1/10
Public
N/A