Register as a Reviewer
Happy Raj (హ్యాపీ రాజ్)

Happy Raj (హ్యాపీ రాజ్)

27 Mar 2026
Overall Rating
5.0/10
5 Reviews

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు కం హీరో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ రాజ్’. కామెడీ & లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో విడుదలైంది.

Director: Maria Raja Elanchezian
Cast: GV Prakash kumar, Sri Gouripriya, Geroge Mariyan, Abbas

Available in:

Reviews

What critics and the public are saying about Happy Raj (హ్యాపీ రాజ్)

Media Reviews

5 Avg: 5.0/10
Gulte
Gulte Website
4

Below Average

Happy Raj Movie Review

హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే… ఇది పూర్తిగా సెకండాఫ్ కోసం బిల్డప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యూత్‌ను టార్గెట్ చేసే సీన్స్—ఇవన్నీ కలిపి రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. జీవీ ప్రకాశ్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి టెంప్లేట్ మూవీ చేశాడా? అనే సందేహం...

హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే… ఇది పూర్తిగా సెకండాఫ్ కోసం బిల్డప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యూత్‌ను టార్గెట్ చేసే సీన్స్—ఇవన్నీ కలిపి రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. జీవీ ప్రకాశ్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి టెంప్లేట్ మూవీ చేశాడా? అనే సందేహం కూడా కలుగుతుంది. మొత్తానికి ఫస్టాఫ్‌లో పెద్దగా కొత్తదనం లేకుండా సాదాసీదాగా సాగుతుంది.


అయితే సెకండాఫ్‌లో తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను బలంగా ప్రెజెంట్ చేస్తూ ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథ పరంగా, కథనం పరంగా కూడా ఆడియన్స్ కి రెండు గంటలు బోర్ కొడుతోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జార్జ్ మార్యన్ వన్ మ్యాన్ షో చూపించాడు. జీవీ ప్రకాశ్ కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఒదిగిపోయాడు. అబ్బాస్ రీ ఎంట్రీ డీసెంట్‌గా ఉంది. 

టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యంలో విజువల్స్‌ని బాగా చూపించింది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఫస్టాఫ్‌ లో కొంచెం లౌడ్‌గా అనిపించినా, సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడంలో సహాయపడింది. మొత్తంగా చూస్తే, రొటీన్‌ స్టఫ్ తో క్లైమాక్స్ పై మాత్రమే డైరెక్టర్ ఫోకస్ చేసాడని అనిపిస్తుంది. 

Mar 27, 2026 Read Review
5

Average

Happy Raj Movie Review

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ రాజ్ ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హ్యాపీ రాజ్‌ మూవీ టెక్నీకల్‌ గా చూస్తే.. జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద మైనస్‌. సౌండింగ్‌ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంది. మధన్‌ క్రిస్ట...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ రాజ్ ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హ్యాపీ రాజ్‌ మూవీ టెక్నీకల్‌ గా చూస్తే.. జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద మైనస్‌. సౌండింగ్‌ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంది. మధన్‌ క్రిస్టోఫర్‌ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మరియా రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా మొత్తం బాగా లేకపోవడంతో క్లైమాక్స్ హైలైట్ అయ్యింది. ఆకట్టుకుంది.


ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌, జార్జ్ మరియన్‌, అబ్బాస్‌, శ్రీ గౌరీ ప్రియా పెర్ఫార్మన్స్ పరంగా మంచి ప్లస్ అయ్యారు. అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌ సీన్లు మంచి ప్లస్ అయ్యాయి. కానీ సరైన కథనం, పాటలు, బీజీఎం, కామెడీ, సాగదీత, ఫస్టాఫ్‌, సెకండాఫ్‌ కూడా కొంచెం మైనస్ అయ్యాయి. తండ్రి గొప్పతనాన్ని, పల్లెటూరి వాళ్లల్లో ఉండే బ్యూటీని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాండింగ్‌ని ఆవిష్కరించే మూవీ ఇది. క్లైమాక్స్ మినహా మిగతా సీన్లు చాలా యావరేజ్ గా ఉన్నాయి.


Mar 27, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Happy Raj Movie Review

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో మంచి ఫామిలీ డ్రామాగా టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి వస్తే... ఈ సినిమా లో జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడ...

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో మంచి ఫామిలీ డ్రామాగా టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి వస్తే... ఈ సినిమా లో జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడి పాత్రలో జివి ప్రకాశ్ ఒదిగిపోయాడు. అలాగే సినిమాకి జార్జ్ మేరియన్ నటన కూడా మంచి ప్లస్ అయింది. తండ్రి పాత్రలో ఆయన జీవించారు. ‘ప్రేమ దేశం’ ఫేమ్ అబ్బాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్‌గా మెప్పించారు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించి, జివి ప్రకాశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. 


ఇక టెక్నికల్ గా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కాస్త లౌడ్‌గా అనిపించింది.. పాటలు పర్లేదు. మదన్ క్రిస్టోఫర్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.. సెకండాఫ్‌లో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడిగా మరియా రాజా మంచి కథ తీసుకున్నాడు.. దాన్ని పూర్తిస్థాయిలో చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా ఓవరాల్‌గా ఎమోషనల్ డ్రామా చూపించారు. ఓవరాల్‌గా హ్యాపీ రాజ్.. ఓ నాన్న కథ.

Mar 27, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Happy Raj Movie Review

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హ్యాపీ రాజ్ మూవీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఎమోషన్” అనే ఫీలింగ్ ఇస్తుంది. ఫస్టాఫ్ స...

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హ్యాపీ రాజ్ మూవీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఎమోషన్” అనే ఫీలింగ్ ఇస్తుంది. 

ఫస్టాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసేవాళ్లకి ఒక్క డౌట్ వస్తుంది. “ఇది సెకండాఫ్ కోసం టైంపాస్ చేస్తున్నారా?” లౌడ్ మ్యూజిక్, కొంచెం ఓవర్ కామెడీ, మాస్ & యూత్ టార్గెట్ కంటెంట్… ఇవన్నీ కలిపి చూసినప్పుడు జీవీ ప్రకాశ్ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు? అనిపిస్తుంది. అంత రొటీన్ అనిపిస్తుంది. కానీ కానీ అసలు మ్యాజిక్ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. 


డైరెక్టర్ మారియా రాజా ఇక్కడే గేమ్ మార్చేస్తాడు. ఫాదర్-సన్ ఎమోషన్స్‌ ని గుండెల్లో దిగేలా చూపించాడు. ముఖ్యంగా జార్జ్ మార్యన్ అయితే పూర్తిగా వన్ మ్యాన్ షో చివరి 30 నిమిషాలు అయితే… literally కంటతడి పెట్టించేలా ఉంటాయి. మూవీ అయిపోయే సరికి హార్ట్ హేవీగా బయటికి రావాల్సిందే. స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ గ్రిప్ ఇవే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. జార్జ్ మార్యన్ — నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ తో పాటు జీవీ ప్రకాశ్ - మాస్ + ఎమోషన్ రెండింటిలోనూ సెటిల్ అయ్యాడు. అలాగే అబ్బాస్ — రీ ఎంట్రీ కూడా సాలిడ్ కిక్కిస్తుంది. ఇటు శ్రీ గౌరి ప్రియ - గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్‌లో కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. 


Mar 27, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Happy Raj Mpvie Review

జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హ్యాపీ రాజ్. మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుం...

జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హ్యాపీ రాజ్. మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. కానీ దర్శకుడు ఆడియన్స్ కి కథ గురించి సరిగా చెప్పడంలో తడబడ్డాడు. కొన్ని సీన్స్ చక్కగా అనిపించినా, మరికొన్ని సీన్స్ ఇంకా బెటర్‌ గా తీసి ఉండాల్సింది. 


జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కొంతవరకు ఫర్వాలేదనిపిస్తుంది. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌ గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ మరియు జార్జ్ మరియన్ తమ పర్ఫార్మెన్స్‌ లతో మెప్పిస్తారు. అలాగే అబ్బాస్ రోల్ కూడా బాగుంది. కానీ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ కాస్త విసిగించినా, సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫామిలీ లవ్ డ్రామాలను ఇష్టపడేవారు హ్యాపీ రాజ్ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.


Mar 27, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే... గ్రామీణ ప్రాంత యువకుడైన ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ (జీవీ ప్రకాశ్) తన తండ్రి ముత్తు (జార్జ్ మారన్) కారణంగా పలు అవమానాలు పడడమే కాకుండా, లవ్ బ్రేకప్ కూడా జరుగుతుంది. దీంతో ఆనంద్ బెంగుళూర్ కి వచ్చి జాబ్ చేస్తూ, అక్కడ కావ్య (శ్రీ గౌరి ప్రియ) అనే సాఫ్ట్‌వేర్ కొలీగ్ తో ప్రేమలో పడుతాడు. తను కూడా ప్రేమిస్తుంది. అయితే పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ మీటింగ్ లో కావ్య తండ్రి రాజేశ్ (అబ్బాస్) ముత్తును అవమానిస్తాడు. దాంతో కావ్య, రాజ్ మధ్య దూరం పెరుగుతుంది. అసలు ఆనంద్ రాజ్ లైఫ్‌ లో తండ్రికి జరిగే అవమానాలు ఏంటి? తండ్రి మోసిన అవమాన భారాన్ని రాజ్ ఎలా తగ్గించాడు? చివరకు రాజ్ - కావ్యాలు కలిసారా లేదా అనేది కథ.

సినిమా కథ పరంగా.. చిన్న కథే అయినా డైరెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. దాంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ గా చక్కగా చూపించారు. లవ్ స్టోరీ బాగానే ఉన్నా, తండ్రి కొడుకుల ఎమోషన్స్ పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది.  జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. దాంతో పాటు జార్జ్ మరియన్, అబ్బాస్ తమ పాత్రల్లో మెప్పించారు. 

ఇక సినిమాలో ఎంటర్టైనింగ్ గా కంటెంట్ బాగున్నా, కొన్ని లాజిక్ లేని సీన్లు ఆడియన్స్ కి ఎక్కవు. హీరో హీరోయిన్ల మధ్య గొడవలకు సరైన కారణం ఉండదు. ఇక దర్శకుడు మరియా రాజ ఇళంజెళియన్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను అందించడానికి ట్రై చేసినా, కొంచెం తడబడ్డాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ప్లస్ అవుతుంది. ఓవరాల్‌ గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. డీసెంట్ ఫామిలీ స్టోరీస్ ని ఇష్టపడే ఆడియన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ ని హ్యాపీ రాజ్ మూవీ ఆకట్టుకుంటుంది.

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
5
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A