Kantara Chapter 1 (కాంతారా చాప్టర్ 1)
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో నటించిన డివోషనల్ యాక్షన్ మూవీ "కాంతార చాప్టర్ 1". కాంతారా సినిమాకి ముందు జరిగిన కథగా వచ్చిన ఈ సినిమాకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా, హోంబలె ఫిల్మ్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.
Available in:
Reviews
What critics and the public are saying about Kantara Chapter 1 (కాంతారా చాప్టర్ 1)
Media Reviews
7 Avg: 6.7/10Hit
Kantara Chapter 1 Movie Review
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ "కాంతార: చాప్టర్-1". ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ్నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఇంట్రెసింగ్ గా మలచడంలో అద్భుతమైన పాత్ర వహించాడు. హీరోగా కంటే డైరెక్టర్ గా తన ఎఫ...
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ "కాంతార: చాప్టర్-1". ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ్నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఇంట్రెసింగ్ గా మలచడంలో అద్భుతమైన పాత్ర వహించాడు. హీరోగా కంటే డైరెక్టర్ గా తన ఎఫర్ట్స్ ని మెచ్చుకుని తీరాలి. రిషబ్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్స్ నుండి టెక్నిషియన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ రాకింగ్ మ్యూజిక్ అండ్ బీజీఎమ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, కెమెరా వర్క్ విజువల్స్ గా అన్ని బాగున్నాయి. ఇక డివోషనల్ టచ్ తో కూడిన ఈ సినిమా అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పాలి. క్లైమాక్స్ లో రిషబ్ మాత్రమే కాకుండా రుక్మణి వసంత్ రోల్ కి ఫిదా అయిపోతారు ఆడియన్స్. ఇక క్లైమాక్స్ కూడా రెండో పార్ట్ గురించి వెయిట్ చేసేలా చేస్తుంది. ఓవరాల్ గా మస్ట్ వాచబుల్.
Hit
Kantara chapter 1 movie Review
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "కాంతార: చాప్టర్-1" మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాకి నటనాపరంగానే కాదు రిషబ్ శెట్టి టీమ్ ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు గాని బీజీఎమ్ నెక్స్ట్...
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "కాంతార: చాప్టర్-1" మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాకి నటనాపరంగానే కాదు రిషబ్ శెట్టి టీమ్ ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు గాని బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో సాగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువ. హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. ఇక తనకు సమకూరిన వనరులన్నింటినీ గొప్పగా ఉపయోగించుకుంటూ రైటర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. కథాకథనాల్లో.. సన్నివేశాల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు. ప్రథమార్ధంలో కాస్త బోర్ కొట్టించి ఉండొచ్చు. కానీ ఇలాంటి విభిన్నమైన కథను తెరపైకి తీసుకురావడంలో రిషబ్ పడ్డ కష్టాన్ని అతడి తపనను ఎంత కొనియాడినా తక్కువే. ప్రేక్షకులకు విజువల్స్ రూపంలో పరంగా గొప్ప అనుభూతిని పంచడానికి అతను పెట్టిన ఎఫర్ట్ గొప్పది.
Hit
Kantara Chapter 1 Movie Review
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పరంగా తొలి సగంలో కొంత సాగదీసినట్లు అనిపించినా, సెకండ్ హాఫ...
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పరంగా తొలి సగంలో కొంత సాగదీసినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకుని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే అనుభూతిని అందించిందనడంలో సందేహం లేదు. రిషబ్ శెట్టి నటన, సెకండ్ హాఫ్ కథనం, క్లైమాక్స్, ఇవన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సాంకేతిక విలువల పరంగానూ సంగీతం, ఆర్ట్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. భారీ అంచనాల కారణంగా 'కాంతార' చూసిన ఫీలింగ్ కలగకపోయినా, రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో, అద్భుతమైన సాంకేతిక విలువలు, సెకండ్ హాఫ్ కథనం కోసం ఈ సినిమాను ఒకసారి తప్పక చూడొచ్చు.
Hit
Kantara Chapter 1 Movie Review
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటన పరంగా నటీనటులు హీరో మొదలుకొని హీరోయిన్ విలన్ సహా అందరూ అద్భుతంగా నటించారు. అయితే దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. అయి...
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటన పరంగా నటీనటులు హీరో మొదలుకొని హీరోయిన్ విలన్ సహా అందరూ అద్భుతంగా నటించారు. అయితే దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. అయితే సాంకేతిక నాణ్యత మరియు యాక్షన్ డిజైన్ లో మేకర్స్ శ్రమ అద్భుతంగా ఉంది. కానీ భావోద్వేగ లోతు మరియు కథనంలో తడబడింది. అజనీష్ లోకనాథ్ సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అయితే ఫిక్షనల్ చారిత్రాత్మక సబ్జెక్టు కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ కథలో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవకపోవచ్చు.
Above Average
Kantara Chapter 1 Movie Review
రిషబ్ శెట్టి నటించి నిర్మించిన కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా గొప్ప థ్రిల్ తో పాటు ఓ డివైన్ ఫ్యాక్టర్‌ను అందించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో కాంతార చాప్టర్ 1 మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి అంచనాలు అందుకోవడం దర్శకుడు రిషబ్ శెట్టికి పెద్ద సవాలే ముందు నిలిచింది...
రిషబ్ శెట్టి నటించి నిర్మించిన కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా గొప్ప థ్రిల్ తో పాటు ఓ డివైన్ ఫ్యాక్టర్‌ను అందించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో కాంతార చాప్టర్ 1 మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి అంచనాలు అందుకోవడం దర్శకుడు రిషబ్ శెట్టికి పెద్ద సవాలే ముందు నిలిచింది. అయితే ఈ ఛాలెంజ్‌ను సరియైన రీతిలో తీసుకొని చక్కటి ఫీల్‌తో సినిమాను అందించారు. రుక్మిణి వసంత్ సహా, జయరాం, గుల్షన్ దేవయ్య వారి పాత్రల్లో నటించి మెప్పించారు. చాలా లోపాలు నేరేషన్ పరంగా ఉన్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చేలా కమర్షియల్ హంగులు దట్టించి సినిమాను క్లీన్‌గా అందించాడు. భారీ అంచనాలు లేకుండా వెళితే.. మంచి సినిమాను చూశామనే తృప్తి, అనుభూతితో బయటకు రావొచ్చు. కాంతార ప్రీక్వెల్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.
Above Average
Kantara Chapter 1 movie Review
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించింది. ఇక రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించగా, హీరో పాత్రకేమాత్రం తగ్గకుండా రుక్మిణి వసంత్ తన పాత్రలో నటించి మెప్పించింది. గుల్షన్ దేవయ్య క్యారెక్టర్...
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించింది. ఇక రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించగా, హీరో పాత్రకేమాత్రం తగ్గకుండా రుక్మిణి వసంత్ తన పాత్రలో నటించి మెప్పించింది. గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కాస్త వెరైటీగా ఉంది. జయరామ్ కూడా తన పాత్రలో మెప్పించారు. అజినీష్ లోక్‌నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. ఓవరాల్‌గా కాంతారలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి సూపర్ హిట్ అయ్యారు. కానీ ఈ చాప్టర్ 1 విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో డైరెక్టర్‌గా ఆయన మెప్పించలేదేమో అనిపించింది. కానీ యాక్టర్‌గా మాత్రం మరోసారి ఇరగదీశారు. అలా అని ఇది బాలేదా అంటే బావుంది.. కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయింది. ఓవరాల్‌గా కాంతార చాప్టర్ 1.. అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు..!
Hit
Kantara Chapter 1 Movie Review
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్ తో వచ్చిన ఈ ‘కాంతార: చాప్టర్ 1’లో.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రిషిబ్ శెట్టి పవర్ ఫుల్ నట...
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్ తో వచ్చిన ఈ ‘కాంతార: చాప్టర్ 1’లో.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రిషిబ్ శెట్టి పవర్ ఫుల్ నటన మరియు దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే రుక్మిణి వసంత్ పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ, ఒకటి రెండు సన్నివేశాలు రోటీన్ గా సాగడం కాస్త మైనస్ అయింది. అయినప్పటికీ, రిషిబ్ శెట్టి తన నటనతో, కాంతార ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం కాంతార అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే.. కాంతారా మూవీకి ముందు జరిగిన కథగా ఈ సినిమా నేపథ్యం నడుస్తుంది. సినిమాలో కూడా కాంతార ముగింపు దగ్గరే ఈ కథ మొదలైనట్టు చూపిస్తారు. పంజుర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ (రిషిబ్ శెట్టి) ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన తండ్రి మాయం అయ్యే విషయం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంటుందని శివకి ఊళ్ళో వారు చెప్తుంటారు. అలా శివ తన పూర్వీకుల చరిత్రను తెలుసుకుంటాడు. ఇక పూర్తి కథలోకి వెళితే కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉన్నా, ఆ అడవి జోలికి వెళ్లరు. ఇక కాంతారా కి చెందిన బర్మ (రిషబ్ శెట్టి) తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ సందర్భంలో యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? కనకావతి, రాజశేఖర రాజ్యానికి బర్మ ఎలా శత్రువు అవుతాడు. వీళ్ళ పోరాటంలో గెలిచింది ఎవరు? చివరికి ఏమవుతుందనేది కథ.
Technical values : కాంతారా చాప్టర్ వన్ సినిమాని హీరో రిషబ్ శేట్టియే అంతా దగ్గరుండి నడిపిస్తాడు. హీరోగా దర్శకుడిగా తన సత్తా మరోసారి చాటాడని చెప్పాలి. వందల ఏళ్ల నాటి కాంతారా కథను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే నటుడిగా ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఇందులో నటించాడు. అలాగే రిషబ్ శెట్టికి సంబంధించి మరో పాత్ర సప్రయిజ్ చేస్తుంది. అలాగే రుక్మిణి వసంత్ పాత్ర కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రుక్మిణి కూడా రిషబ్ తో పోటీ పడి నటించింది. అలాగే జయరాం, గుల్షన్ దేవయ్య వారి పాత్రలో బాగానే మెప్పించారు. కథ మొదటి పార్ట్ లాగానే ఉండి ఆకట్టుకోగా, స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా రాసుకున్నాడు రిషబ్.
టెక్నికల్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దర్శకుడిగా రిషబ్ తన ఎఫర్ట్ ని సిన్సియర్ గా పెట్టాడు. దానికి తోడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాని నిలబెట్టడంలో హెల్ప్ అయ్యాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. విజయ్ కిరాగందూర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా నెమ్మదించింది. క్లైమాక్స్ ట్విస్ట్ వరకు సినిమాకి హై రాదు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది.
Final Review : ఓవరాల్ గా ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులతో పాటు, రెగ్యులర్ ప్రేక్షకులను కూడా ఇంప్రెస్ చేస్తుంది. రిషబ్ శెట్టి నటనతో పాటు, దర్శకుడిగానూ తన ప్రతిభతో మెప్పించారు. అలాగే రుక్మిణి వసంత్ పెర్ఫార్మన్స్, అజనీష్ లోకనాథ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ సినిమాకి బలమైంది. థియేటర్లో మస్ట్ వాచబుల్ మూవీ కాంతారా. యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషన్స్ పరంగానూ ఆకట్టుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.