Papam Prathap (పాపం ప్రతాప్)
టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "పాపం ప్రతాప్". విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీని ఎస్.పి. దుర్గా నగేష్ డైరెక్ట్ చేసాడు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది.
Available in:
Reviews
What critics and the public are saying about Papam Prathap (పాపం ప్రతాప్)
Media Reviews
1 Avg: 5.0/10Average
Papam Prathap Movie Review
తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కన...
తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినా, కథాకథనాలు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బేసాయి. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా నీట్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు.
అలాగే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి లైన్ ని తీసుకున్నా, కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి కానీ, ఇదే స్టోరీ లైన్ కి తగ్గ డెప్త్, లాజిక్ ని మాత్రం తాను మిస్ అయ్యారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పాపం ప్రతాప్’ లో యువ నటుడు తిరువీర్, అజయ్ ఘోష్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కగా మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్ నెస్ తక్కువ అయ్యింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించే సింపుల్ విలేజ్ డ్రామాలా మిగిలింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ట్రై చెయ్యండి.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story : కథ విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ప్రతాప్ (తిరువీర్) తాను చిన్నప్పట్నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ని పెద్దలు వద్దన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. బుజ్జమ్మకి కూడా ప్రతాప్ అంటే ఇష్టం. కానీ వీళ్ళ పెళ్లి ప్రతాప్ తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కి ఇష్టం ఉండదు. ఏది ఏమైనా అంతా సవ్యంగా గడుస్తుంది అన్న తరుణంలో ప్రతాప్ ఓ వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలుసుకున్న బుజ్జమ్మ పెళ్ళైన మూడు రోజులకే ప్రతాప్ పై కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇది ఏకంగా ఊళ్ళో పంచాయితీ వరకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రతాప్ తనకున్న సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించుకున్నాడా? ఫైనల్ గా ప్రతాప్ - బుజ్జమ్మ కలిసారా? లేదా? అనేది కథ.
ఇక సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది నటీనటుల గురించి... సినిమాలో తిరువీర్ తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాకుండా, మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. అమాయకత్వంతో పాటు, ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. హీరోయిన్ రోల్ చేసిన పాయల్ రాధాకృష్ణ కి మాత్రం కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక హీరో తండ్రిగా నటించిన అజయ్ ఘోష్ నటన సినిమాకు మంచి ప్లస్ అయింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ని కూడా చూపించారు. మిగతా నటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక మైనస్ గురించి చెప్తే.. సినిమాలో హీరో సమస్య గురించి సస్పెన్స్ ఉంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయగా, ఆ తర్వాత ఆ సమస్య గురించి తెలిసాక కూడా హీరోయిన్ అంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిందో, దానికి హీరోయిన్ చెప్పే రీసన్ అంతబాగా రాసుకోలేదు. ఈ పాయింట్ కి ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. పైగా ఈ మాత్రం దానికా ఇంత సాగదీసింది అన్న ఫీల్ వస్తుంది. పైగా సెకండ్ హాఫ్ మరింత ల్యాగ్ అయిపోతుంది. మెయిన్ గా హీరోకు ఉన్న సమస్యని ఆడియన్స్ కి అర్ధమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ గా, కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
Technical values : టెక్నికల్ గా చూసుకుంటే.. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే కె.ఎమ్. రాధాకృష్ణన్ అందించిన సంగీతం, ప్లస్ బీజీఎమ్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక దర్శకుడు దుర్గా నగేష్ మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా, దాన్ని ఆసక్తిగా మలచలేకపోయాడు. ముఖ్యంగా కథలో బలమైన ఎమోషన్ మిస్ అయింది.
Final Review : ఓవరాల్ గా "పాపం ప్రతాప్" మూవీ లో తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం కూడా బాగుంది. కాకపోతే స్ట్రాంగ్ నేరేటివ్ లేకపోవడంతో ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు, గాని రెగ్యులర్ మూవీ లవర్స్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.