Register as a Reviewer
Rakasa (రాకాస)

Rakasa (రాకాస)

03 Apr 2026
Overall Rating
5.9/10
20 Reviews

ఈ వారం థియేటర్లలో విడుదలైన క్రేజి సినిమాల్లో "రాకాస" ఒకటి. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా, కొత్త దర్శకురాలు మానస శర్మ దర్శకత్వం వహించింది.

Director: Manasa Sharma
Cast: Sangeeth Shobhan, Nayan Sarika, Vennelakishore, Getupseenu, Bramhaji, Asish vidhyarthi

Available in:

Reviews

What critics and the public are saying about Rakasa (రాకాస)

Media Reviews

20 Avg: 5.9/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
4

Below Average

Rakasi Movie Review

రాకాస సినిమా... ఈ వీక్ థియేటర్లలో రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ఇదొకటి. సినిమా గురించి చెప్పాలంటే అంతగా నచ్చలేదు. సినిమా ముందు నుండి చెప్పాలన్నా, మొత్తం చూసి చెప్పాలన్నా, కథ గురించి పెద్దగా చెప్పాల్సిందేమి లేదు. ఎన్నో పాత సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా చూస్తుంటే... ఒక ఊరు.. ఊళ్ళో కోట.. కోటలో రాక్షసు...

రాకాస సినిమా... ఈ వీక్ థియేటర్లలో రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ఇదొకటి. సినిమా గురించి చెప్పాలంటే అంతగా నచ్చలేదు. సినిమా ముందు నుండి చెప్పాలన్నా, మొత్తం చూసి చెప్పాలన్నా, కథ గురించి పెద్దగా చెప్పాల్సిందేమి లేదు. ఎన్నో పాత సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా చూస్తుంటే... ఒక ఊరు.. ఊళ్ళో కోట.. కోటలో రాక్షసుడు... రాక్షసుడ్ని పీడ ఒదిలించే హీరో.. ఇదే పెద్ద హీరో అయితే సీరియస్ డ్రామాగా తీసేవాళ్ళేమో గాని, చిన్న హీరో, పైగా చిన్న కాన్సెప్ట్ కాబట్టి ఎంటర్టైన్ జోనర్ ని నమ్ముకున్నారు. 


బట్ ఇక్కడ మానస శర్మని అభినందించాల్సిందే. ఫస్ట్ మూవీ అయినా మూవీ తీయడానికి బానే కష్టపడింది. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ… “ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా?” అన్న ఫీలింగ్ వస్తుంది.

స్టోరీ కూడా ఫ్రెష్ కాదు… కామెడీ ని నమ్ముకుని బానే ట్రై చేసారు, కానీ mostly miss match. కొన్ని jokes కి outdated feel వస్తుంది. బీజీఎమ్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కానీ ఇదేదో స్టోరీ కంటెంట్ పై కూడా కొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా కామెడీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. 

Apr 03, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Rakasa Movie Review

‘రాకాస’ సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజయిన వన్ అఫ్ ది క్రేజీ సినిమా. బట్ సినిమా గురించి చెప్పాలంటే నచ్చలేదనే చెప్పాలి. సినిమాలో స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేకర్స్ బానే చెప్పడానికి ట్రై చేసారు గాని, వాళ్ళు చెప్పినంత సినిమా లేదిక్కడ. రొటీన్ స్టోరీ ఉంది సరే.. బట్ సినిమా వరకైనా ఫ్రెష్ స్క్రీన్ ప్...

‘రాకాస’ సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజయిన వన్ అఫ్ ది క్రేజీ సినిమా. బట్ సినిమా గురించి చెప్పాలంటే నచ్చలేదనే చెప్పాలి. సినిమాలో స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేకర్స్ బానే చెప్పడానికి ట్రై చేసారు గాని, వాళ్ళు చెప్పినంత సినిమా లేదిక్కడ. రొటీన్ స్టోరీ ఉంది సరే.. బట్ సినిమా వరకైనా ఫ్రెష్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి కానీ అది కూడా లేదు. ఏదో కాసేపు నవ్వుకోవచ్చు అన్నట్టుంటుంది కానీ, థియేటర్ నుంచి బైటికొచ్చాక ఆ నవ్వులు కూడా గుర్తుండవు అన్నట్టుంటుంది రాకాస. 


కంటెంట్ కూడా పాత సినిమాల్లో చూసినట్టే ఉంటుంది, బట్ కథ పరంగా చూస్తే… ‘అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక యువకుడి పోరాటం’ అనే మూల ఆలోచన కొత్తది కాదు. సంతోష్ శోభన్ సహా అందరూ కామెడీ చేయడానికి బానే ట్రై చేసారు.. ఆ విషయంలో అపీప్రిషియేట్ చేయాల్సిందే. హాస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కనిపించినా… సాంకేతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. విజువల్స్ సరిపడా ఉంటాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎక్కువగా వినిపించి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడడమే ఎక్కువనిపిస్తుంది. 

Apr 03, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
5

Average

Rakasa Movie Review

రాకాస’ సినిమా హారర్-కామెడీ జానర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సెటప్‌ తో స్టార్ట్ అయినా… పూర్తి స్థాయిలో ఆ ఇంపాక్ట్‌ ని మెయింటైన్ చేయలేకపోయింది. ముందు సంగీత్ శోభన్ సినిమా అని చెప్పి, వర్త్ సినిమా అన్న ఫీల్ తో వెళ్లారు. బట్ బైటికి వస్తూ వస్తూ... డీలా పడిపోతారు. ఎంటర్టైన్మెంట్ పరంగా డోకా ఉండదు, కానీ ఏదో మిస్ అయ...

రాకాస’ సినిమా హారర్-కామెడీ జానర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సెటప్‌ తో స్టార్ట్ అయినా… పూర్తి స్థాయిలో ఆ ఇంపాక్ట్‌ ని మెయింటైన్ చేయలేకపోయింది. ముందు సంగీత్ శోభన్ సినిమా అని చెప్పి, వర్త్ సినిమా అన్న ఫీల్ తో వెళ్లారు. బట్ బైటికి వస్తూ వస్తూ... డీలా పడిపోతారు. ఎంటర్టైన్మెంట్ పరంగా డోకా ఉండదు, కానీ ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుంది. అండ్ కామెడీ ఉంటుంది, ఆడియన్స్ నవ్వుతారు కూడా... కానీ ఫ్రెష్ కామెడీ లాంటిదేమీ ఉండదు. ఇలాంటి కథలను ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది, దర్శకురాలు నవ్వులు పండించాలనే ప్రయత్నం చేసినా కుదర్లేదు, కొన్ని జోక్స్ అయితే పూర్తిగా అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తాయి.


అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ నిజంగా నవ్విస్తాయి. అక్కడక్కడా సినిమా ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా లేకపోయినా, నాసిరకం అనిపించకుండా ఓకే స్థాయిలో ఉన్నాయి. విజువల్స్ కూడా సరిపడా ఉన్నాయి. మొత్తానికి మంచి ఐడియా ఉన్నా… కథలో కొత్తదనం లేకపోవడం, ఎగ్జిక్యూషన్ పూర్తిగా కన్విన్స్ చేయకపోవడం వల్ల ‘రాకాస’ సినిమా కాస్త బోర్ కొడుతోంది. కొత్తదనం కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిస్సపాయింట్ తప్పదు.. టైంపాస్ కోసం ఓసారి చూసేయొచ్చు. 

Apr 04, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
7

Hit

Rakasa Movie Review

రాకాస అంటూ ఆడియన్స్ ముందుకు ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ‘రాకాస’ ఒక హారర్ కామెడీ అనిపిస్తుంది కానీ… పూర్తిగా వర్క్ అయ్యిందా అంటే కాదు. ఫస్ట్ బిగెస్ట్ ఇష్యూ క్లైమాక్స్. సినిమాలో మొదట విలన్‌ ని ఫుల్ రూత్ లెస్ మాన్స్టర్ ల...

రాకాస అంటూ ఆడియన్స్ ముందుకు ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ‘రాకాస’ ఒక హారర్ కామెడీ అనిపిస్తుంది కానీ… పూర్తిగా వర్క్ అయ్యిందా అంటే కాదు. ఫస్ట్ బిగెస్ట్ ఇష్యూ క్లైమాక్స్. సినిమాలో మొదట విలన్‌ ని ఫుల్ రూత్ లెస్ మాన్స్టర్ లా భయంకరంగా build చేసి… చివర్లో సడన్ గా సింపతీ ట్రాక్ ఇవ్వడం ఎందుకు అని అనిపిస్తుంది. ప్రతి విలన్‌ కి బ్యాక్ స్టోరీ కంపల్సరీ నా? అన్న ఫీలింగ్ వస్తుంది.


పైగా స్టోరీ కూడా కొత్తది కాదు. ‘blind belief vs hero’ plot already చాలా సార్లు చూసాం. ‘శంబాలా’ వైబ్ కూడా కొంచెం గుర్తు వస్తుంది. ఇక బీజీఎమ్ కూడా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే లౌడ్ ఎక్కువైంది. విజువల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. పెర్ఫార్మన్స్ వైస్ సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు. దాంతో పాటూ హీరోయిన్, ఇతర కమెడియన్లు కూడా బాగానే వర్క్ చేసారు. ఫైనల్ గా కొన్ని fun moments ఉన్నా… overall మిక్స్డ్ బోర్ ఫీల్ వస్తుంది. బట్ రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. 

Apr 03, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
7

Hit

Rakasa Movie Review

ఫస్ట్ అఫ్ అల్ 'రాకాస' సినిమా చూసాక ముందుగా స్ట్రైట్‌ గా రివ్యూ చెప్పాలంటే… ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ సినిమా ఒక హారర్-కామెడీగా స్టార్ట్ అవుతుంది కానీ, అలాగే సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్‌ లో పూర్తిగా సంతృప్తి ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెప్పాలి. మొదట విలన్‌ ను...

ఫస్ట్ అఫ్ అల్ 'రాకాస' సినిమా చూసాక ముందుగా స్ట్రైట్‌ గా రివ్యూ చెప్పాలంటే… ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ సినిమా ఒక హారర్-కామెడీగా స్టార్ట్ అవుతుంది కానీ, అలాగే సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్‌ లో పూర్తిగా సంతృప్తి ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెప్పాలి. మొదట విలన్‌ ను చాలా క్రూరంగా చూపించి… చివర్లో సడన్‌గా ఒక సెంటిమెంట్ బ్యాక్‌స్టోరీ ఇవ్వడం అంతగా వర్క్ కాలేదు. ప్రతి విలన్‌ కు జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్న ఫీలింగ్ వస్తుంది.


స్టోరీ విషయానికి వస్తే… ‘బ్లైండ్ ఫెయిత్‌ కు వ్యతిరేకంగా హీరో పోరాటం’ అనే కాన్సెప్ట్ కొత్తది కాదు. ఇలాంటి కథలను మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసాం. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కామెడీ ట్రై చేసినా… ఎక్కువగా గ్యాగ్స్ వర్క్ కాలేదు. కొన్ని జోక్స్ అయితే పాతగా అనిపిస్తాయి. అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. అక్కడక్కడా సినిమా ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. టెక్నికల్‌ గా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్‌ గా అనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఓకే అనిపిస్తాయి. మంచి ఐడియా ఉన్నా, కొత్తదనం లేకపోవడం, ఎగ్జిక్యూషన్ మిస్సవడం వల్ల ‘రాకాస’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Apr 03, 2026 Watch
T2B Live
T2B Live Website
6

Above Average

Rakasa Movie Review

రాకాస సినిమా గురించి చెప్పాలంటే... తెలిసిన కథనే అయినా చెప్పే విధానం బాగుంటే మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ వెనకాడరు…లేడీ డైరెక్టర్ మానస శర్మ రొటీన్ కథనే ఎంచుకుని అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ నే మళ్ళీ ఆడియన్స్ కి తనదైన స్టైల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకునేలా మలిచింది. అయితే ఈ క్రమంలో కథ టేక...

రాకాస సినిమా గురించి చెప్పాలంటే... తెలిసిన కథనే అయినా చెప్పే విధానం బాగుంటే మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ వెనకాడరు…లేడీ డైరెక్టర్ మానస శర్మ రొటీన్ కథనే ఎంచుకుని అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ నే మళ్ళీ ఆడియన్స్ కి తనదైన స్టైల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకునేలా మలిచింది. అయితే ఈ క్రమంలో కథ టేక్ ఆఫ్ కి టైం పట్టింది. సినిమా మొదలు పెట్టిన తర్వాత ఫస్టాఫ్ లో చాలా టైం వరకు స్లోగానే సాగుతుంది. ఏంటి ఇంకా అనుకున్న రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ రావడం లేదు అని ఆడియన్స్ అనుకుంటున్న టైంలో, ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు నుండి ఎంటర్ టైన్ మెంట్ మొదలవుతుంది.


ఓవరాల్ గా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ కి డోకా లేకుండా ఆకట్టుకుంటూ సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా చాలా బాగా ఆకట్టుకునేలా సాగింది అని చెప్పాలి. సంగీత్ శోభన్ మరోసారి తనదైన కామెడీతో మెప్పించాడు…తనకి తోడూగా గెటప్ శ్రీను అండ్ వెన్నెల కిషోర్ లు తమ కామెడీతో కుమ్మెశారు…హీరోయిన్ నయన్ సారికా కూడా ఆకట్టుకోగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ మరింత బెటర్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఫస్టాఫ్ ను ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ లెవల్ లో ఉండేది.

Apr 03, 2026 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Rakasa Movie Review

ఈ వారం విడుదలైన రాకాస సినిమా గురించి చెప్పాలంటే... ఒక డీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా సినిమాని చెప్పుకోవచ్చు. సినిమాలో కంటెంట్ విషయానికి వస్తే... కథ పరంగా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ వరకు డోకా ఉండదు. సంగీత్ శోభన్ మొదలుకొని గెటప్ శీను, వెంన్నెల కిశోర్, బ్రహ్మజీ సహా అందరూ నవ్వించారు....

ఈ వారం విడుదలైన రాకాస సినిమా గురించి చెప్పాలంటే... ఒక డీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా సినిమాని చెప్పుకోవచ్చు. సినిమాలో కంటెంట్ విషయానికి వస్తే... కథ పరంగా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ వరకు డోకా ఉండదు. సంగీత్ శోభన్ మొదలుకొని గెటప్ శీను, వెంన్నెల కిశోర్, బ్రహ్మజీ సహా అందరూ నవ్వించారు. హీరోయిన్ నయన్ సారిక కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ అనగానే ఏదో మొక్కుబడి పాత్ర ఇవ్వకుండా.. కథలో కీలకంగా ఉండేలా తన పాత్రను తీర్చిదిద్దింది దర్శకురాలు మానస.


తనికెళ్ళ భరణి తన నటనా అనుభవం చూపించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే... చిన్న సినిమా అయినప్పటికీ.. సాంకేతికంగా ‘రాకాస’ బాగుంది. ఒక చిన్న స్థాయి కామెడీ సినిమాకు మించిన నిర్మాణ విలువలు చూపించారు. పరిమిత బడ్జెట్లోనే సెట్స్.. వీఎఫెక్స్ బాగా తీర్చిదిద్దారు. అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. రాక్షసుడిలో ఎమోషనల్ చూపించే సన్నివేశాల్లో వచ్చే బిట్ సాంగ్.. బీజీఎం హృద్యంగా సాగాయి. మిగతా పాటలు పర్వాలేదు. రాజు ఎదురోలు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మానస శర్మ కథ అంత గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా కూడా లేదు. కథలో చాలా విషయాలు సిల్లీగా.. హడావుడిగా అనిపిస్తాయి. ఏదీ సీరియస్ గా తీసుకునేలా లేకపోవడం బలహీనతే. కానీ ఈ లోపాలను మన్నించవచ్చు అనిపించేలా కామెడీ అయితే పండించగలిగింది మానస. ఆమె టేకింగ్ ట్రెండీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా రాకాస ఓసారి చూసేయడానికి బాగుంటుంది. 


Apr 03, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Rakasa Movie Review

రాకాస మూవీ గురించి చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ మూడ్‌ లో సాగుతుంది. క్యారెక్టర్స్ పరిచయం, కామెడీ ట్రాక్స్, కొన్ని సన్నివేశాల్లో సరదా ఎలిమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ముగియడం సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ఇది...

రాకాస మూవీ గురించి చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ మూడ్‌ లో సాగుతుంది. క్యారెక్టర్స్ పరిచయం, కామెడీ ట్రాక్స్, కొన్ని సన్నివేశాల్లో సరదా ఎలిమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ముగియడం సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ఇది సెకండ్ హాఫ్‌కు మంచి బేస్ వేస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కథ అసలు ట్రాక్‌లోకి వస్తుంది. ఎమోషనల్ సీన్స్, డ్రామా, క్లైమాక్స్ అన్ని కలిసి మంచి ఎంగేజింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది. 


ఇక పెర్ఫార్మన్స్ పరంగా సంగీత్ శోభన్ అల్టిమేట్ కామెడీ తో ఆడియన్స్ ని నవ్వించాడు. సినిమా మొత్తం ఒక్కడే అన్నట్టు రెచ్చిపోయాడు. తనతో పాటు హీరోయిన్ నయన్ సారిక రోల్ కూడా బాగుంది. గెటప్ శీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ అందరూ తమ తమ రోల్స్ లో బాగానే మెప్పించారు. ఓవరాల్ గా రాకాస కామెడీ జోనర్ లో హారర్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన మూవీగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఈ వారం ఫామిలీతో చక్కగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. 


Apr 03, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Rakasa Movie Review

నిహారిక కొణిదెల నిర్మాణం లో తెరకెక్కిన రాకాస సినిమా ఈ వారమే థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది. సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాకాస సినిమా స్టోరీ పరంగా రొటీన్ గానే ఉన్నా, ఆడియన్స్ ని బాగానే నవ్వించింది. సినిమా మొత్తం నవ్విస్తూనే అక్కడక్కడా భయపెట్టారు. అయితే...

నిహారిక కొణిదెల నిర్మాణం లో తెరకెక్కిన రాకాస సినిమా ఈ వారమే థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది. సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాకాస సినిమా స్టోరీ పరంగా రొటీన్ గానే ఉన్నా, ఆడియన్స్ ని బాగానే నవ్వించింది. సినిమా మొత్తం నవ్విస్తూనే అక్కడక్కడా భయపెట్టారు. అయితే ‘రాకాస’లో బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్. ఫుల్ క్రూరంగా చూపించిన విలన్‌ కు చివర్లో సడన్‌ గా సెంటిమెంట్ బ్యాక్‌ స్టోరీ ఇవ్వడం అంతగా వర్క్ కాలేదు. ప్రతి విలన్‌కు జస్టిఫికేషన్ అవసరమా? అన్న ఫీలింగ్ వస్తుంది.  


ఇక సంగీత్ శోభన్ సినిమా మొత్తం ఫన్ తో ఎంటర్టైన్ చేసాడు. అలాగే మిగతా కమెడియన్స్ కూడా ఎవరి రోల్స్ కి తగ్గట్టు వాళ్ళు నవ్వించారు. పెర్ఫార్మన్స్ పరంగా బాగున్నా, స్టోరీ కూడా కొత్తగా అనిపించదు. ‘బ్లైండ్ ఫెయిత్‌కు వ్యతిరేకంగా హీరో పోరాటం’ అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. ‘శంబాలా’ లాంటి కథనే ఈసారి కామెడీ టచ్‌ తో చూపించినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్‌ లో కామెడీ ఎక్కువగా వర్క్ కాలేదు. గ్యాగ్స్ ఫోర్స్ చేసినట్టుగా అనిపిస్తాయి. కొన్ని పాత జోక్స్ అయితే పూర్తిగా మిస్ అయ్యాయి. అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నా… స్టోరీ, ఎగ్జిక్యూషన్‌ లో కొత్తదనం లేకపోవడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. టైంపాస్ కోసం ఓసారి చూసేయొచ్చు


Apr 03, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Rakasa Movie Review

ఈ వారం థియేటర్లలో విడుదలైన రాకాస మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, నిహారిక కొణిదెల నిర్మించింది. సినిమా విషయానికి వస్తే... సినిమాలో వీరబాబుగా సంగీత్‌ శోభన్‌ చక్కగా నటించాడు. అతనిలోని ఈజ్‌ క్యారెక్టర్‌కు బ...

ఈ వారం థియేటర్లలో విడుదలైన రాకాస మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, నిహారిక కొణిదెల నిర్మించింది. సినిమా విషయానికి వస్తే... సినిమాలో వీరబాబుగా సంగీత్‌ శోభన్‌ చక్కగా నటించాడు. అతనిలోని ఈజ్‌ క్యారెక్టర్‌కు బాగా ఉపయోగపడింది. కొన్ని సీన్స్‌లో డైలాగ్‌ చెబుతుంటే ఖలేజాలో మహేశ్‌ బాబు గుర్తొస్తాడు. అతని కామెడీ టైమింగ్‌ బావుంది. హీరో తర్వాత ఎక్కువగా అలరించింది సోము పాత్రధారి వెన్నెలకిశోర్‌. నయన్‌సారిక క్యారెక్టర్‌ ఓకే అనేలా ఉంది.


అయితే హీరో హీరోయిన్‌ కి మధ్య లవ్‌ సీన్స్‌ కూడా పెద్దగా లేవు. బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, రోహ‌న్ రాయ్, తనికెళ్ల భరణి, గెటప్‌ శ్రీను తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. అనుదీప్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌ అయింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. కోట, విలేజ్‌ సెటప్‌ అంతా గ్రాండ్‌గా ఉంది, సీజీ వర్క్‌లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవలసింది. కెమెరా వర్క్‌ బాగానే ఉంది. ఎడిటింగ్‌ ఓకే. కథానుగుణంగా నిహారిక బాగానే ఖర్చు పెట్టారు. ఓ చిన్న కథతో దర్శకురాలు పాస్‌ అయ్యారనే చెప్పవచ్చు. కామెడీ హారర్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవాళ్లు ఓసారి రాకాస సినిమాను చూడొచ్చు.


Apr 04, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Rakasa Movie Review

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రాకాస మూవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా హారర్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాజిక్స్ వెతక్కుండా హ్యాపీగా సినిమా చూస్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక కథ పరంగా పాత చింతకాయ పచ్చడే అయినా, సంగీత...

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రాకాస మూవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా హారర్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాజిక్స్ వెతక్కుండా హ్యాపీగా సినిమా చూస్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక కథ పరంగా పాత చింతకాయ పచ్చడే అయినా, సంగీత్ శోభన్ సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను హిలేరియస్ గా నవ్విస్తారు. నయన్ సారిక తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. రాధ్య గెస్ట్ పాత్రలో అలరించింది. రాజు పాత్రలో అనూప్ సింగ్ బాగానే నటించాడు. జబర్దస్త్ రోహిణి కూడా తన నటనతో నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, వాసు ఇంటూరి, రోహన్ రాయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.


సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ సీన్స్, వర్కౌట్ అవ్వని కామెడీ కట్ చేస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కోట సెటింగ్ కోసం బాగా కష్టపడ్డారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కథ సింపుల్ అయినా స్క్రీన్ ప్లే, సస్పెన్స్ కామెడీతో బాగా రాసుకొని తెరకెక్కించింది దర్శకురాలు మానస శర్మ. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. ఓవరాల్ గా ‘రాకాస’ ఆసక్తికరంగా సాగిన సస్పెన్స్ కామెడీ సినిమా.

Apr 03, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Rakasa Movie Review

నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ మూవీ హారర్-కామెడీగా మంచి సెటప్‌తో మొదలవుతుంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తీసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నా… ఎగ్జిక్యూషన్ మాత్రం మధ్యస్థంగా అనిపిస్తుంది. అయితే సినిమాకు హీరో సంగీత్ శోభన్ పెర్ఫార్మన్స్ బిగ్ ప్లస్ అయింది. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని బాగాన...

నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ మూవీ హారర్-కామెడీగా మంచి సెటప్‌తో మొదలవుతుంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తీసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నా… ఎగ్జిక్యూషన్ మాత్రం మధ్యస్థంగా అనిపిస్తుంది. అయితే సినిమాకు హీరో సంగీత్ శోభన్ పెర్ఫార్మన్స్ బిగ్ ప్లస్ అయింది. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని బాగానే నవ్వించాడు. నయన్ సారిక తన పాత్రకు తగ్గట్టు నటించారు. గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని చోట్ల వర్క్ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో నవ్వులు రప్పించడంలో కొంచెం తడబడింది.


టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ ఓకే అనిపిస్తాయి. పెద్దగా వావ్ ఫ్యాక్టర్ లేకపోయినా… నాసిరకం అనిపించవు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డీసెంట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సరిపడా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రం బాగానే కనిపిస్తాయి. హారర్ ఎలిమెంట్స్ కంటే ఫన్, ఫాంటసీ మిక్స్ ఎక్కువగా ఉంది. అయితే చాలా చోట్ల క్రింజ్ కామెడీలా అనిపిస్తుంది. పైగా ఈ జోనర్ లో ఇంతకంటే బెటర్ సినిమాలు చూసాం కాబట్టి, కొన్ని సన్నివేశాలు ఎంజాయ్ చేయించగలిగినా… మొత్తం మీద సినిమా యావరేజ్ గా అనిపించవచ్చు. కాసేపు థియేటర్లో నవ్వుకోడానికి మాత్రం వెళ్లొచ్చు, కొత్తదనం ఆశిస్తే మాత్రం తప్పే. 

Apr 03, 2026 Read Review
6

Above Average

Rakasa Movie Review

మిస్టరీ, కామెడీ థ్రిల్లర్‌ సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. నవ్విస్తూ, థ్రిల్‌ కి గురిచేస్తూ ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే "రాకాస" మూవీని రూపొందించారు. ఇందులో కొంత ఫాంటసీ ఎలిమెంట్లని జోడించారు. సంగీత్‌ శోభన్‌ మెయిన్ లీడ్ లో నటించగా సినిమాకి తన పెర్ఫార్మన్స్ తో హైలెట్ అయ్యాడు. అలాగే నయన్ సారిక కూడ...

మిస్టరీ, కామెడీ థ్రిల్లర్‌ సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. నవ్విస్తూ, థ్రిల్‌ కి గురిచేస్తూ ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే "రాకాస" మూవీని రూపొందించారు. ఇందులో కొంత ఫాంటసీ ఎలిమెంట్లని జోడించారు. సంగీత్‌ శోభన్‌ మెయిన్ లీడ్ లో నటించగా సినిమాకి తన పెర్ఫార్మన్స్ తో హైలెట్ అయ్యాడు. అలాగే నయన్ సారిక కూడా తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో అలరించింది. అలాగే గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌.. ఇలా ఆర్టిస్ట్ ల నటన ఒక హైలైట్‌ అయితే, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ మరో హైలైట్‌. బీజీఎం అదిరిపోయింది. కోటకి ఉన్న స్టోరీ, కోటలోని ఎపిసోడ్లు హిలేరియస్‌గా ఉంటాయి. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్లు అదిరిపోయేలా ఉంటాయి.


మైనస్‌ విషయానికి వస్తే, కామెడీ కొన్ని చోట్ల ఓవర్‌ బోర్డ్ వెళ్లినట్టుగా ఉంటుంది. కొన్ని ట్రాక్‌లు లెన్తీగా ఉండటం. కోటలో హర్రర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లపై ఇంకా బాగా ప్లాన్‌ చేయాల్సింది. ఓవరాల్‌గా రాకాస.. ఆద్యంతం నవ్విస్తూ, థ్రిల్‌కి గురిచేసే మూవీ అవుతుంది. ఈ సమ్మర్‌ కి హాయిగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది. సినిమాలో సప్రైజ్ లు మరో బోనస్. 

Apr 03, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Rakasa Movie Review

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన రాకాస మూవీ ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే... చాలా సినిమాల్లో ఉన్నట్టే ఒక కోట.. కోటలో రాక్షసుడు.. దాన్ని ఛేదించే హీరో... హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, సినిమా మొత్తం వన్ మ్యాన్ ష...

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన రాకాస మూవీ ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే... చాలా సినిమాల్లో ఉన్నట్టే ఒక కోట.. కోటలో రాక్షసుడు.. దాన్ని ఛేదించే హీరో... హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా నడిపించాడు. సంగీత్ శోభన్ మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ టైమింగ్. ఇప్పుడీ 'రాకాస'లోనూ అది వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్‌లో ఆయన వన్ లైనర్స్ పేలాయి. హీరోయిన్ నయన్ సారిక చాలా బాగుంది. 'ఆయ్'తో ఆమె ఆకట్టుకుంది. 


హీరో స్నేహితుడిగా గెటప్ శ్రీను తనదైన శైలిలో నటించారు. ఇంటర్వెల్ తర్వాత ఆయనకు, 'వెన్నెల' కిశోర్, సంగీత్ మధ్య మంచి సీన్స్ పడ్డాయి. సెకండాఫ్ హైలైట్ అదే. ముఖ్యంగా పిశాచి ఎపిసోడ్ భలే పేలింది. తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఓకే. ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా కుటుంబం కలిసి చూసేలా తీసిన క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస'. థియేటర్లకు ఫ్యామిలీతో కలిసి వెళ్లొచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు. వేసవిలో చక్కటి వినోదాత్మక తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఈ కామెడీ & ఫాంటసీ థ్రిల్లర్ నవ్విస్తుంది. డోంట్ మిస్ ఇట్.

Apr 03, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Rakasa Movie Review

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాస ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పుకుంటే కథ పరంగా చాలా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దర్శకురాలు మానస శర్మకి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల...

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాస ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పుకుంటే కథ పరంగా చాలా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దర్శకురాలు మానస శర్మకి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. ఇక ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సంగీత్ శోభన్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. ఇక తన పరిధి మేరకు చక్కగా నటించింది నయన్ సారిక. వెన్నెల కిషోర్ & గెటప్ శ్రీను వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోసింది. 


అలాగే అనుదీప్ దేవ్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. రన్ టైమ్ చాలా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్. విట్టలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్‌ను ఇప్పటి జనరేషన్‌ కి తగ్గట్లు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు. సెకండాఫ్‌లో చిన్నపాటి తడబాటు ఉన్నా, ఓవరాల్‌గా డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశారు. ఇటు నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఓవరాల్‌ గా రాకాస.. ఫన్ ఫాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్.. నో లాజిక్ ఓన్లీ కామెడీ..!

Apr 03, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించా...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో సహజంగా నటించగా, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్‌తో నవ్వులు పంచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే… వీఎఫ్ఎక్స్ అద్భుత స్థాయిలో లేకపోయినా, నాసిరకం అనిపించకుండా క్లీన్‌గా రూపొందించారు. అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్‌గా ఉండగా, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా ఉన్నాయి.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ‘రాకాస’ సినిమా ఫ్యామిలీస్ ని, ముఖ్యంగా అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలను మిస్ అవుతున్న పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. 


Apr 03, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Rakasa Movie Review

రాకాస ఎంటర్‌టైనింగ్ సినిమా. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ అద్భుతంగా వినోదాన్ని పంచింది. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు. నయన్ సారిక, గెటప్ శ్రీనులకు కూడా మంచి స్కోప్ దొరికింది. స్టోరీ యూనిక్‌గా ఉంది, కథను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్‌లో ఫన్,...

రాకాస ఎంటర్‌టైనింగ్ సినిమా. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ అద్భుతంగా వినోదాన్ని పంచింది. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు. నయన్ సారిక, గెటప్ శ్రీనులకు కూడా మంచి స్కోప్ దొరికింది. స్టోరీ యూనిక్‌గా ఉంది, కథను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్‌లో ఫన్, ఇంటెన్స్‌గా ఉంది. ఎమోషనల్ టచ్‌తో అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మానస శర్మ డైరెక్షన్ స్టాండ్‌ ఔట్‌గా ఉంది. నిహారిక కొణిదెల నిర్మాణ విలువలు బాగున్నాయి. 


సినిమా అంతటా ఎంతో వినోదాత్మకంగా సాగింది. అలాగే స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండిగ్ వరకు ఆసక్తికరంగా సాగింది. గెటప్ శ్రీను టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మొత్తం మీద థియేటర్‌లలో చూడదగ్గ మంచి సినిమా ఇది అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. మంచి కామెడీతో ఈ సినిమా ఫన్‌గా ఉంది. సాంగ్స్, బీజీఎం చాలా బాగున్నాయి. మేజిక్ మూవ్‌మెంట్స్, హిలేరియస్ సన్నివేశాలు ఎక్కడా అతి లేకుండా సరదాగా కుదిరాయి. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. వీఎఫ్ఎక్స్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓవరాల్ గా రాకాస సినిమా ఫామిలీ తో చూసే పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీగా చెప్పుకోవచ్చు. 

Apr 03, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుతో ఓ డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.న...


మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుతో ఓ డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.

నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించగా, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా అనిపించకపోయినా… నాసిరకం అనే భావన రాకుండా క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్‌గా ఉండగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా కనిపించాయి.

సమ్మర్ సీజన్ నేపథ్యంలో ‘రాకాస’ సినిమా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ హారర్-కామెడీ అంశాలు నచ్చేలా ఉన్నాయి.

మొత్తంగా ‘రాకాస’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒకసారి చూసే విధంగా ఉండే డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. 

Apr 03, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, ఓవరాల్ గా ఒక డీసెంట్ ఫన్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ డ్రామాగా చెప్పొచ్చు. 


నటీనటులు పెర్ఫార్మన్స్ పరంగా సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శీను, వెన్నెలకిషోర్ తదితరులు ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్ అద్భుతం అనిపించకపోయినా కూడా.. నాసిరకం అనే ఫీల్ అయితే కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ వండర్స్ క్రియేట్ చేయలేదు కానీ.. నాసిరకంగా అయితే అనిపించవు. నిర్మాణ విలువలతో మరోసారి ఆకట్టుకుంది మెగా ప్రొడ్యూసర్ నిహారిక. ఇక సమ్మర్ సీజన్ కావడంతో.. పిల్లలు ‘రాకాస’ని బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మరి పెద్దలు కూడా థియేటర్స్‌కి రావాల్సిందే కాబట్టి.. ‘రాకాస’కి కాసులు లోటైతే ఉండదు.

Apr 03, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Rakasa Movie Review

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. కొత్త దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సంగీత్ శోభన్ - నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, ఓవరాల్ గా ఒక డీసెంట్ ఫన్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ డ్రామాగా చెప్పొచ్చు. 


సంగీత్, వెన్నెల కిషోర్ అలాగే గెటప్ శ్రీనులు మంచి ఫన్ ని అందించారు. హీరోయిన్ నయన్ సారిక డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. అలాగే కొత్త దర్శకురాలు మానస శర్మ కొన్ని చోట్ల తడబడినప్పటికీ సెకండాఫ్ ని ఆమె సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే హర్రర్ మూవీ అనగానే భయపెట్టే సీన్లు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాకుండా డీసెంట్ గా... మరీ కొత్త రకమైన కథ ఎక్స్పెక్ట్ చేయకుండా, సో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే రాకాస చిత్రం మెప్పిస్తుంది. 

Apr 03, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... వేల సంవత్సరాలు క్రితం రాకవర అనే కుగ్రామం శాపానికి గురైన కారణంగా తరతరాలుగా ఆ ఊరిలో ఉన్న ఒక కోట లోని 'రాకాస' అనే బ్రహ్మ రాక్షసుడికి కొన్ని హెచ్చరికల వల్ల  ఊరి నుండి ఒక ప్రాణాన్ని బలిగా పంపుతూ వస్తారు. లేకపోతే ఊరి మొత్తాన్ని రాక్షసుడు నాశనం చేస్తాడని నమ్ముతారు. అలా ఆ నాటి నుండి నేటికాలం వరకు బలి పంపే ఆచారం వస్తుంది. ఈ క్రమంలో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) ను కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా బలికి పంపుతారు. నిజం చెప్పాలంటే అనుకోకుండా ఆ ఉచ్చులో ఇరుక్కుంటాడు. నిజానికి తన స్నేహితుడైన బాలరాజును (గెటప్ శీను) కాపాడుకునే ప్రయత్నంలో అదంతా మూఢనమ్మకమని నిరూపించే ప్రయత్నంలో... కోటలోకి వెళ్తాడు వీరబాబు. మరి ఆ కోటలోకి వెళ్లిన తరువాత పిరికివాడైన వీరబాబు బయటపడ్డాడా లేదా? అసలు రాకాస కథేంటి? మధ్యలో వీరబాబు పై మనసు పడ్డ సుబ్బలక్ష్మి (నయన్ సారిక) కథేంటి? ఓవరాల్ గా రాకాస నుండి తప్పించుకుని వీరబాబు బయటికి వచ్చాడా లేదా అనేది కథ.

Detailed Description: ఇక రాకాస సినిమా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఫాంటసీ టచ్ యాడ్ చేసి తెరకెక్కించగా, మరీ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేదు గాని, ఓవరాల్ గా ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేయకుండా మెప్పిస్తుందని చెప్పాలి. దర్శకురాలు మానస శర్మకు ఇది తొలి సినిమా అయినా కూడా చక్కగా హ్యాండిల్ చేసారు. స్టోరీ పరంగా పాత విఠలాచార్య సినిమాల్లా అనిపించినా కూడా, కథనంలో మంచి ఫన్ తో పాటు థ్రిల్స్ ని జెనరేట్ చేసారు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా సంగీత్ శోభన్ సినిమాకి బ్యాక్ బోన్ అయ్యాడని చెప్పాలి. తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. అలాగే హీరోయిన్ నయన్ సారిక తన రోల్ లో డీసెంట్ గా చేసింది. అలాగే వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసారు. 

ఇక టెక్నికల్ గా చూస్తే... రాకాస సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ కానీ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్ బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే ఫాంటసీ టచ్ ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా కొన్ని లాజిక్ లేని సీన్స్ ప్రేక్షకుడికి విసుగు తెప్పించేలా ఉన్నాయి. కొన్ని సీన్లు రియాలిటీకి దూరంగా కూడా ఉంటాయి. చాలా పాత సినిమాలు ఈ సినిమా చూస్తుంటే గుర్తొస్తాయి. అందువల్ల నెక్స్ట్ సీన్లో ఏం జరుగుద్దో ఈజీగా గెస్ చేస్తారు. ఇక నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. నిహారిక కొణిదెల బ్యానర్ నుండి ఇది మరో మంచి ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇక  అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్ గా ఉండగా, ఎదురోలు రాజు కెమెరా వర్క్, అన్వర్ అలీ ఎడిటింగ్ బాగున్నాయి. 

Final Review : ఓవరాల్ గా రాకాస గురించి చెప్పాలంటే డీసెంట్ కామెడీ హర్రర్ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఫన్ తో పాటు, దర్శకురాలు మానస శర్మ దర్శకత్వ ప్రతిభ కూడా తోడై, ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. మరీ ఓ రేంజ్ లో భయపెట్టే థ్రిల్లర్ గా కాకపోయినా, థియేటర్లో కాసేపు నవ్వుకునే ఎంటర్టైనర్ గా రాకాస ఖచ్చితంగా అలరిస్తుందని చెప్పొచ్చు.

Review Statistics

5.9
Overall Rating
Avg. of all reviews
20
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.9/10
Public
N/A