Telusu Kada (తెలుసు కదా)
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాను మహిళా దర్శకురాలైన నీరజా కోన తెరకెక్కించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, థమన్ మ్యూజిక్ అందించాడు.
Available in:
Reviews
What critics and the public are saying about Telusu Kada (తెలుసు కదా)
Media Reviews
7 Avg: 5.3/10Above Average
Telusu Kada Movie Review
తెలుసు కదా...మూవీ చూసాక సింపుల్ గా ఒపీనియన్ చెప్పాలంటే డైరెక్టర్ నీరజ కోన ని ముందుగా అప్రిషియేట్ చేయాలి. ఒక ఫిమేల్ డైరెక్టర్ అయ్యుండి, అది కూడా ఫస్ట్ మూవీ అయి ఉండి, మేల్ పాయింట్ అఫ్ వ్యూ బేస్డ్ మూవీని ఇంత చక్కగా హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. సినిమా వరకు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అయినట్ట...
తెలుసు కదా...మూవీ చూసాక సింపుల్ గా ఒపీనియన్ చెప్పాలంటే డైరెక్టర్ నీరజ కోన ని ముందుగా అప్రిషియేట్ చేయాలి. ఒక ఫిమేల్ డైరెక్టర్ అయ్యుండి, అది కూడా ఫస్ట్ మూవీ అయి ఉండి, మేల్ పాయింట్ అఫ్ వ్యూ బేస్డ్ మూవీని ఇంత చక్కగా హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. సినిమా వరకు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ మూవీస్ లో ఉన్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పటి జనరేషన్ కి మార్చి చెప్పినట్టు ఉంది. కాకపోతే అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టు కథని మార్చిన విధానం బాగుంది. బట్ స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయి ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ వస్తుంది. అలాగే ట్విస్ట్లు పెద్దగా లేకపోయినా, ఫన్ ఎలిమెంట్స్ కి మూవీ చాలా దూరంగా ఉంది. డైరెక్టర్ కామెడీ విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. కానీ వైవా హర్ష కూడా తన రోల్ లో బాగానే నవ్వించాడు. ఇన్ ఫాక్ట్ ఆడియన్స్ కి హీరో రోల్ తర్వాత అంతగా కనెక్ట్ అయ్యేది ఫ్రెండ్ పాత్రనే. ఓవరాల్ గా అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అవకపోవచ్చు.
Average
Telusu kada Movie Review
తెలుసు కదా... అంటే తెలిసినట్టుగానే సినిమా మొత్తం ఉంది. సింపుల్ గా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పాత చింతకాయ పచ్చడిని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు మార్చి తీశారు. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ యే అయినా నీరజ కొనని ఇలాంటి సబ్జెక్టు హ్యాండిల్ చేసిన విధానంలో అభినందించాలి. ఒక ఫిమేల్ మేల్ పాయి...
తెలుసు కదా... అంటే తెలిసినట్టుగానే సినిమా మొత్తం ఉంది. సింపుల్ గా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పాత చింతకాయ పచ్చడిని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు మార్చి తీశారు. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ యే అయినా నీరజ కొనని ఇలాంటి సబ్జెక్టు హ్యాండిల్ చేసిన విధానంలో అభినందించాలి. ఒక ఫిమేల్ మేల్ పాయింట్ అఫ్ వ్యూ లో సబ్జెక్టు ని బాగానే రాసుకుందంటే చాలా మంచి విషయం. కాకపోతే ఎఫర్ట్ ఎంత పెట్టినా, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడంతో ఆశించిన మేర ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. నవీన్ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. సినిమా సీన్ల పరంగా కనెక్ట్ అవుతుంది. కానీ కలిపి చూస్తే రొటీన్ ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే సినిమా అంతగా కనెక్ట్ కాదు గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ఒక రకంగా మెప్పించొచ్చు.
Above Average
Telusu kada Movie Review
తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. జ్ఞానశేఖర్ విజువల్స్ బాగున్నా...
తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. జ్ఞానశేఖర్ విజువల్స్ బాగున్నాయి. నవీన్ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. దర్శకురాలు నీరజ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్ చేయడం మామూలు విషయం కాదు. చాలా బాగా తెరకెక్కించారు. సినిమాని చాలా క్లాసీగా తీశారు. మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలిమెంట్లు జోడిస్తే బాగుండేది. కామెడీ ట్రాక్‌కి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కానీ లేటెస్ట్ ట్రెండ్‌ని ఆవిష్కరించిన తీరు మాత్రం బాగుంది. ఒక లేడీ డైరెక్టర్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథని చెప్పడం, అంతే ఓపెన్‌గా తెరకెక్కించడం ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఆడియన్స్ కాన్సెప్ట్ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
Above Average
Telusu kada movie Review
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి, మాజీ లవర్ రావడం... ఆ తర్వాత ముగ...
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి, మాజీ లవర్ రావడం... ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులతో కూడిన ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. పెర్ఫార్మన్స్ వరకూ సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రలో అదరగొట్టాడు. తనతో పోటీ పడి రాశి, శ్రీనిధి పెర్ఫార్మ్ చేసారని చెప్పాలి. అలాగే కీ రోల్ ప్లే చేసిన వైవా హర్షతో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. తమన్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ టేకింగ్ ఓకే. కాకపోతే స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఎండింగ్ ఊహించినంత బెస్ట్ గా లేకపోవడంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టం.
Average
Telusu Kada Movie Review
దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకం...
దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ ను ఇచ్చింది. ఎస్. థమన్ స్వరపర్చిన 'మల్లిక గంథ' సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దంత చెప్పుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్ గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.
Below Average
Telusu Kada Movie Review
తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య వయలెన్స్, బ్లడ్ బాత్ సినిమాలకి ఎక్కువగా అలవాటు అయిపోయిన ఆడియన్స్‌కి ఇలాంట...
తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య వయలెన్స్, బ్లడ్ బాత్ సినిమాలకి ఎక్కువగా అలవాటు అయిపోయిన ఆడియన్స్‌కి ఇలాంటి స్లో నెరేషన్ కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఫీల్ గుడ్ మూవీస్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ కి నచ్చవచ్చు. ఇక థమన్ చాలా రోజుల తర్వాత మంచి క్లాసిక్ సాంగ్స్, ఫీల్ గుడ్ బీజీఎమ్ ఇచ్చాడు. అలానే సొగసు చూడతరమా పాట కూడా కొన్నాళ్లు వినపడుతుంది. సినిమాటోగ్రఫీ పనితనం కూడా బావుంది. స్క్రీన్ ప్లే బలంగా లేకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టం.
Average
Telusu kada movie Review
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గ...
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గురూ పోటీ పడి నటించారు. వీళ్ళతో పాటు వైవా హర్ష రోల్ కూడా బాగుంది. అయితే కథ పరంగా పాత సినిమాలనే అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టుగా తీసినట్టుంది. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా కథనం సాగింది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా, దర్శకురాలు సీన్స్ ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేయలేకపోయారు. సిద్ధూ ఫ్యాన్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది. సాధారణ ప్రేక్షకులు ఒకసారి వీలైతే చూడొచ్చు.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అనాథగా పెరుగుతాడు. అనాధగా పెరగడం వల్ల తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలని కలలుగంటూ, పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. ఈ క్రమంలో ఆల్రెడీ ఒకమ్మాయిని ప్రేమిస్తాడు.. కానీ అది బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత వరుణ్ లైఫ్ లోకి అంజలి శర్మ (రాశిఖన్నా) వస్తుంది. వీళ్ళ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు హ్యాపీగా లైఫ్ సాగుతుంది. కానీ అంజలికి ఓ కారణంవల్ల పిల్లలు పుట్టరని తెలుస్తుంది. ఈ క్రమంలో డాక్టర్ రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) తమకు సాయం చేస్తానని వీళ్ళ లైఫ్ లోకి వస్తుంది. అక్కడే ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మరి వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన రాగ ఎవరు? ఆమె వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా సాగింది. మొత్తానికి వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా? అనేది సినిమా కథ.
Technical values : సినిమా విషయానికి వస్తే.. కథ చాలా సింపుల్ గా ఉంటుంది. అనాథగా ఉండే హీరో ఫ్యామిలీ కావాలనుకుంటాడు. ఇలాంటి కథలతో చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే ఇందులో ఇంకో హీరోయిన్ ఎంట్రీతో కథనం మారి ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారిపోతుంది. ఇక సినిమాలో ఎప్పట్లాగే సిద్ధూ జొన్నలగడ్డ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్స్ రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి లు తమ పాత్రల్లో బాగా నటించి సినిమాకి ప్లస్ అయ్యారు. ముఖ్యంగా ఈ ముగ్గురి నడుమ జరిగే డ్రామా కొన్ని సీన్స్ మాత్రం బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అలాగే వైవా హర్ష రోల్ సినిమాలో బాగుంది.
అయితే సినిమాలో కోర్ లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా, ఏవో పాత సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి గాని, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సిద్ధూ రోల్ తన ఫ్రెండ్ రోల్ తప్ప మిగతా రోల్స్ ఏమి కనెక్ట్ అవనట్టు ఉంటాయి. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే కూడా ఏవో పాత సినిమాల్లో ఇద్దరు భార్యల కథలోకి భర్త ఇరుక్కున్న కథల్లా కాన్సెప్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంది. ఇక దర్శకురాలిగా నీరాజకోన హీరో పాత్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. హీరోయిన్ల పాత్ర ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. థమన్ ఇచ్చిన సాంగ్స్ పర్లేదు. బీజీఎమ్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయ్. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త ఎడిట్ చేయాల్సింది.
Final Review : ఇక ఓవరాల్ గా సినిమా గురించి "తెలుసు కదా" అంటే ఆడియన్స్ కి నిజంగా అంతా తెలిసిన సినిమాగానే ఉంది. ఓ రెండు ట్విస్ట్ లు మినహా కథాకథనాలు ఊహించిన విధంగానే సాగుతాయి. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథే అయినా, స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే చాలా మందికి కనెక్ట్ అయ్యేది. అయితే సిద్ధూ ఫ్యాన్స్ కి బాగానే నచ్చుతుంది. కానీ అన్నివర్గాల ఆడియన్స్ ని అలరించడం కష్టం.