Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1345 Reviews
Showing 133–144 of 1345 reviews

Palla Burusu movie review

Tupaki

By Tupaki

పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకు...

పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.

ప‌ళ్ళ‌బురుసు క‌థ న‌డిచేది ద‌శాబ్దాల కింద‌టి కాలంలో కాదు.. వ‌ర్త‌మానంలోనే. మ‌రి ఈ రోజుల్లో ప‌ల్లెటూళ్ల‌లో టూత్ బ్ర‌ష్ దొర‌క‌ని ప‌రిస్థితులు ఎక్క‌డైనా ఉన్నాయా? కానీ ఈ సినిమాలో త‌న కొడుకు బ్ర‌ష్ కొనివ్వ‌లేదని తండ్రి కోర్టుకెక్క‌తాడు మరి.


కానీ నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ లో నటించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ల నటన సహజంగా ఉంది. ఇక రచయిత - దర్శకుడు ఉదయ్ చౌహాన్ చెప్పాలనుకున్న పాయింట్.. ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా.. స్క్రిప్టు సరిగా రాసుకోకపోవడంతో.. ఊరికే సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడంతో పళ్ళబురుసు ఒక మామూలు ప్రయత్నంగా మిగిలిపోయింది. చివరగా: పళ్ళబురుసు.. అన్ని సినిమాలు బలగం అవ్వవు


5.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Palla Burusu movie review

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్న...

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదట కాస్త కామెడీగా సాగినా తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓ కొత్త పాయింట్ ని తీసుకొని దర్శకుడు మరింత ఎమోషనల్ చేసాడు.


ఒంటరితనం ఎంత భయంకరమైనది, ముసలితనంలో అది ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనే మెసేజ్ ని బాగా చూపించారు. అయితే క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు కానీ ఎమోషనల్ గా ముగిస్తే ప్రేక్షకుడు రియాలిటీకి కనెక్ట్ అయి బరువైన హృదయంతో బయటకు వెళ్ళేవాడు. మొత్తంగా ‘పళ్ళ బురుసు’ సినిమా కొడుకు పట్టించుకోవట్లేదని ఓ ముసలి తండ్రి పడే ఆవేదనను నవ్వించి ఏడిపిస్తూ చూపించిన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


6.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Palla Burusu movie review

Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a...

Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a decent below avarage movie. 


Climax portions

A couple of songs

Sudhakar Reddy’s natural performance


Drawbacks

Amateurish direction

Weak screenplay

Lack of cinematic moments

Unconvincing characterisation


Pallaburusu works to some extent during the climax and through its songs. But the weak screenplay and amateurish direction overshadow its sincere intentions. Despite a promising premise, the film tests the audience’s patience with weak writing, unconvincing characterisation and uneven execution.


Bottom Line: Good Intentions, Unconvincing Execution.

5.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Palla burusu movie review

Palla Burusu – Public ReviewPalla Burusu – Public ReviewPalla Burusu is a simple village-based family drama with a good emotional core. The father-son conflict feels relatable, and Sudhakar Reddy &amp...

Palla Burusu – Public Review


Palla Burusu – Public Review


Palla Burusu is a simple village-based family drama with a good emotional core. The father-son conflict feels relatable, and Sudhakar Reddy & Muraleedhar Goud give natural performances. A few emotional scenes, especially in the second half, work well.


But the story and screenplay feel routine, and the first half is slow. The movie has some good moments, but it doesn’t offer enough freshness to fully engage the audience.


Overall Good performances + genuine emotions, but an average story and slow narration make Palla Burusu a one-time watch for family audiences.

5.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Palla Burusu Movie review

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసు...

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు బలమైన భావోద్వేగాలను తగ్గ కథనం అల్లుకోవాలి. కానీ ఇందులో ఈ రెండూ లేవు. తండ్రీ కొడుకుల మధ్య దూరంతో పాటు… తండ్రి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. 


కొన్ని సీన్స్ అయితే టీవీ సీరియల్ కంటే అన్యాయంగా చిత్రీకరణ ఉంది. శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. మాములుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి చుట్టేసిన సినిమాను ప్రేక్షకులు ఆశించరు. ఆరంభం నుంచి చివరి వరకూ నీరసంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే.. "ఆసక్తి కలిగించని "పళ్ళబురుసు".

4.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Palla Burusu Movie Review

 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడ...

 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అయితే సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది. 


పెర్ఫార్మన్స్ పరంగా అందరు నటులు సహజంగా అద్భుతంగా నటించారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘పళ్ళ బురుసు’ కేవలం కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే మెప్పిస్తుంది. కోర్ లైన్, ఇతర కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గానే ఉన్నాయి. పైగా ఫస్టాఫ్ కథనం వీక్ గా సాగింది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో కథనం ఇలా ఉంటే బాగుండేది. సో వీటితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

5.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Telugu

Vishwanath and sons movie review

Vishwanath and Sons is not just a family drama; it is also an emotional love story that beautifully balances romance, relationships, and family values. Suriya and Mamitha Baiju bring a warm and natura...

Vishwanath and Sons is not just a family drama; it is also an emotional love story that beautifully balances romance, relationships, and family values. Suriya and Mamitha Baiju bring a warm and natural chemistry to the screen, making their love story one of the most engaging parts of the film.

The movie takes us through different shades of love — romantic love, family affection, emotional bonds, and the struggles that come with them. The emotions feel genuine, and several moments stay with you even after the movie ends.

Suriya gives a heartfelt performance, while Mamitha Baiju adds charm and freshness to the story.

8.0
out of 9
2 weeks ago
Aug 19, 2026 Tamil

vishwanath and sons movie review

ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో...

ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ కూడా బాగుంది. 


స్టోరీ ఫ్రెష్ స్టోరీ ఏం కాదు గాని, ట్రెండ్ కి తగ్గట్లుంది. బట్ నేనేం రివీల్ చేయను. సూర్య గురించి తెలిసిందేగా. బట్ మామితా బైజు మాత్రం థ్రిల్లింగ్ అసలు. ఎం ఎనర్జీ, ఎం ఆక్టింగు... అల్టిమేట్ అసలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి మొత్తం ఇక్కడే చెప్పేస్తాననిపిస్తుంది. ఆడియన్స్ మాత్రం డోంట్ మిస్ దిస్ క్లాసిక్. 

8.0
out of 9
2 weeks ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర...

ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి బైటికెళ్లిపోదామా అనిపించింది. అయినా సినిమాలో ఎదో ఒక్క మంచి సీన్ అయినా బాగుంటుందేమో అని క్లైమాక్స్ దాకా కూర్చున్నా. అదే నా తప్పయింది. ఇక సినిమా స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు. ఎదో పాత చింతకాయ పచ్చడి ఇది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఆడియన్స్ నా కామెంట్ చూసినా సినిమాకి వెళ్తే వాళ్ళ ఖర్మ. 

6.0
out of 9
2 weeks ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీ...

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి.


ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అనిపించింది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కోరుకునే ఆడియన్స్‌కు మాత్రం ‘మకుటం’ నిరాశ కలిగించే అవకాశం ఉంది.

4.0
out of 9
2 weeks ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half...

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half was average, but the second half felt like torture. They really took us for a ride with this one; I couldn't understand why it needed to be a three-hour movie. Even the handful of people in the theater were left wondering why they had bothered to show up.


I suspect even Vishal knew beforehand that this would be a flop. GV Prakash Kumar’s music was a letdown—not because the BGM wasn't good, but because it was wasted on a film like this. The only saving graces were the interval scene and the background score; aside from that, and perhaps the climax, the second half was tedious and filled with pointless scenes. The movie simply didn't work. If I had to rate it, I’d give it a 2/5.

5.0
out of 9
2 weeks ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

మకుటం (Makutam) 2026 Youtube Channel
మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ...

మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ్ ఏమో యావరేజ్. సెకండ్ హాఫ్ నరకం అనిపించింది. మకుటం అని చెప్పి పెద్ద టోపీయే పెట్టారండి. అసలు దీనికెందుకు 3 గంటల సినిమా అనిపించింది. మళ్ళీ సినిమాకి వచ్చిన పది మంది కూడా ఎందుకొచ్చామురా అని ఫీల్ అయ్యారు. 


నాకు తెలిసి విశాల్ కి కూడా ఇది ప్లాప్ అవుతుందని ముందే తెలుసనుకుంటా. అందుకే పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ దెబ్బేసాడు. బీజీఎమ్ బాగుంది. కానీ ఈ సినిమాకి ఆ మ్యూజిక్ వేస్ట్ అయింది. ఇక ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ సీన్, ప్లస్ బీజీఎమ్. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అంతే. మైనస్ పాయింట్ అంటే చాలానే ఉన్నాయి. పనికి మాలిన సీన్లతో చాలా బోరింగ్ కొట్టేసింది. సినిమా అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. రేటింగ్ కూడా ఇవ్వాలంటే 2/5 ఇస్తున్న అంతే. 



6.0
out of 9
2 weeks ago
Aug 18, 2026 Tamil
Why MRO?