Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1345 Reviews
Showing 97–108 of 1345 reviews

Irumudi movie review

రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా....

రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.

‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా. త్రినాథ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబమే అతడి ప్రపంచం. కానీ తన కూతురి జీవితంలో జరిగే ఓ విషాద ఘటన అతడిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను బయటకు తీసే కొద్దీ.. కథ వ్యక్తిగత సమస్య నుంచి పెద్ద పోరాటంగా మారుతుంది.


ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, కుటుంబ ఎమోషన్స్‌పై ఫోకస్ చేసిన సినిమా.. సెకండాఫ్‌లో అసలు రంగు చూపిస్తుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు కథకు ప్రాణం. తండ్రి బాధ, కోపం, కూతురికి న్యాయం చేయాలనే పట్టుదల ప్రేక్షకుడిని కూడా ఆ ఎమోషన్‌లోకి తీసుకెళ్తాయి.

త్రినాథ్‌గా రవితేజ తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కనపెట్టి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అరుపులు, యాక్షన్ కంటే కళ్లలో కనిపించే బాధతోనే ఎక్కువ ప్రభావం చూపించాడు. అయితే కథలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని లాజిక్స్ సాధారణ ప్రేక్షకుడికి ప్రశ్నలు రేకెత్తించవచ్చు. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం బలంగా రీచ్ అవుతుంది. మొత్తంగా.. ‘ఇరుముడి’ ఓ రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఓ తండ్రి గుండెల్లో మొదలైన బాధ.. చివరికి ప్రతీకారంగా ఎలా మారిందో చెప్పే ఎమోషనల్ డ్రామా. సింగిల్ వర్డ్ లో దీక్ష ఫలించింది. 


7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్...

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే మూవీ ఇది. సినిమాలో రవితేజ కనిపించరు, త్రినాథ్‌ మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించి ఆకట్టుకున్నాడు. 


ఇక సినిమాలో సెంటిమెంట్‌, ఎమోషనల్‌ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా సీరియస్‌ గా సాగుతున్నా, మధ్య మధ్యలో రవితేజ మార్క్ ఫన్‌ కూడా ఉంటుంది. తండ్రికూతురు మధ్య ఉన్న కెమిస్ట్రీని బలంగా చూపించారు. క్లైమాక్స్ మాత్రం కొంత రెగ్యూలర్‌గానే ఉంది. కొన్ని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. అంతగా వర్కౌట్‌ కాలేదు. ఎమోషనల్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఉత్కంఠకు గురి చేసే సీన్లు బాగున్నాయి. పైగా సినిమాలో అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే సందేశం బాగుంది. ఫైనల్ గా అయ్యప్పస్వామి భక్తుల బ్యాక్‌ డ్రాప్‌లో తండ్రికూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగిన ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా ఇరుముడి. రవితేజ చేసిన కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ. అమ్మాయిలను, ముఖ్యంగా ఆడ పిల్లల్ని భయంతో కాదు, ధైర్యంతో పెంచాలని చెప్పడం బాగుంది.




8.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi movie review

Sakshi

By Sakshi

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతుర...

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను బలంగా నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను గట్టిగా హిట్ చేస్తాయి.


త్రినాథ్‌గా రవితేజ నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి బాధ, కోపం, కసితో కూడిన పాత్రను ఆయన బాగా క్యారీ చేశాడు. అమ్మాయిలపై జరిగే అన్యాయం, తండ్రి ఆవేదనను కలిపి చెప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు, కథలోని కొన్ని అంశాలు అందరికీ సులభంగా కనెక్ట్ కాకపోవచ్చు. అయినా కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్లి ఎమోషన్‌ను నమ్ముకున్న ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలుస్తుంది.


7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను...

ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సందర్భంలో తండ్రికి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఓ ప్రమాదం. కూతురి దగ్గర తండ్రి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ప్రేక్షకులు ఫీలయ్యేలా తీశారు శివ నిర్వాణ.


అయితే 'ఇరుముడి'... రెగ్యులర్ రవితేజ సినిమా కాదు. మాస్ కమర్షియల్ రొటీన్ అనిపించే సినిమాలకు భిన్నమైన సినిమా. అలాగని, రవితేజ ఫైట్స్ చేయలేదా? అంటే... చేశారు. అవన్నీ కథలో భాగంగా వచ్చాయి. కావాలని ఫైట్ చేసినట్టు అనిపించదు. కథ, కథలో కీలకమైన ట్విస్ట్ రొటీన్ అనిపించినా... ప్రారంభం నుంచి ముగింపు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలను కవర్ చేసింది. కమర్షియాలిటీ కోసం శివ నిర్వాణ పక్కకు అడుగులు వేయలేదు. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టి ఆడపిల్ల తండ్రిగా జీవించారు. ఆయన్ను కొత్తగా చూడటం బావుంది. కుటుంబ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులకు అమితంగా నచ్చే చిత్రమిది.


7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi movie Review

రవితేజ నటించిన ఇరుముడి సినిమా థియేటర్లలో తాజాగా విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాలో కొన్ని సీన్లు, ట్విస్టుల ద్వారా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియచేసేందుకు తీసిన ఈ...

రవితేజ నటించిన ఇరుముడి సినిమా థియేటర్లలో తాజాగా విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాలో కొన్ని సీన్లు, ట్విస్టుల ద్వారా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియచేసేందుకు తీసిన ఈ సినిమాలోని ప్రధానాంశం బాగా ఎక్కేస్తుంది. అయితే త్రినాథ్‌ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదలై... రకరకాల మలుపులు తిరిగి అతను గురుస్వామిగా మారడంతో కథ సుఖాంతమౌతుంది. ఈ మధ్యలో ప్రేక్షకులకు కొన్ని కొరుకుడు పడని వాస్తవాలు, అంగీకరించలేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వీటిని అధిగమించేలా... అయ్యప్ప మాలలో రవితేజ కనిపించిన ప్రతి సన్నివేశం డివోషనల్ టచ్ తో బాగుంది. 


 ఇక సినిమాకి జివి ప్రకాష్ సంగీతం ప్రాణం పోసింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి అన్ని బాగున్నాయి. ప్రథమార్థం తండ్రీ కూతుళ్ళ అనుబంధంతో సరదాగా సాగిన ఈ సినిమా, ద్వితీయార్థంలో కథలోతుల్లోకి వెళ్ళే సరికీ భారంగా మారింది. అయితే చివరి ఇరవై నిమిషాలు రేసీగా సాగింది. ఏదేమైనా... డివోషనల్‌ బ్యాక్ డ్రాప్‌ లో, తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ తో, నటీనటుల సహజ నటనతో రూపుదిద్దుకున్న 'ఇరుముడి' ఇటీవల వచ్చిన రవితేజ చిత్రాలతో పోల్చితే ఫార్ బెటర్ మూవీ! 

7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవ...

టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ క్యారెక్టర్లను రెండు, మూడు సీన్లలో ఎస్టాబ్లిష్ చేసి.. ఆయన కూతురు మణెమ్మతో బంధాన్ని భావోద్వేగంగా ఎస్టాబ్లిష్ చేసి సినిమాను పరుగులు పెట్టించాడు. ఎలాంటి హంగామా, ఆర్భాటం లేకుండా, రవితేజ్ ఇమేజ్‌ కు భిన్నంగా ఫీల్ గుడ్ సీన్స్ తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. 


ఇరుముడి సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, అయ్యప్ప స్వామి డివైన్, రూరల్ డ్రామాగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ అంశాలను పర్‌ఫెక్ట్‌ గా బ్లెండ్ చేశారు. దాంతో ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ఎమోషనల్ కనెక్ట్ చేసి సినిమాతో జర్నీ చేసేలా ఉంటుంది. రవితేజ కెరీర్‌ లో ది బెస్ట్ మూవీ. బేబీ నక్షత్ర, ఆడపిల్లలందరూ బాగా నటించారు. ఈ వారం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను చూడాలంటే.. ఇరుముడిని ఏ మాత్రం ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi movie review

మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జ...

మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జరిగే విషాద ఘటన, ఆ తర్వాత అతడి పోరాటం చుట్టూ తిరుగుతుంది. కూతురు మణెమ్మకు జరిగిన అన్యాయం, ఊర్లో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల వెనుక అసలు నిజాన్ని తెలుసుకునే క్రమంలో త్రినాథ్ చేసే పోరాటం కథకు ప్రధాన బలం. ముఖ్యంగా చివరి అరగంటలో డ్రామా, ఎమోషన్ పీక్స్‌కు చేరుతాయి. రవితేజ తన పాత్రలోని బాధ, కోపం, కసిని అద్భుతంగా పలికించాడు.


కథలో కొన్ని అంశాలు సగటు ప్రేక్షకుడికి జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా.. దర్శకుడు కమర్షియల్ మూసను పక్కనపెట్టి చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా తెరకెక్కించాడు. ఓవరాల్‌గా ‘ఇరుముడి’ మాస్ కంటే ఎమోషన్‌ను నమ్ముకున్న సినిమా. రవితేజ పెర్ఫార్మెన్స్, బలమైన క్లైమాక్స్, హృద్యమైన మెసేజ్ సినిమాకు ప్రధాన హైలైట్స్. ఫైనల్ గా డివోషనల్ టచ్ ఉన్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్. 

8.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

Tupaki

By Tupaki

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసి...

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. కానీ ఈసారి దెబ్బపడలేదు. ఏ ముహూర్తంలో ఇరుముడి టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసారో తెలీదు గాని, సినిమా ఆడియన్స్ లోకి రిలీజ్ కి ముందే ఖచ్చితంగా చూడాలన్నట్టు మైండ్ లో ఫిక్స్ అయినట్టున్నారు. చాలా ఏళ్ళ తర్వాత రవితేజ సినిమాకి ఓ రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి


పైగా మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ఇలాంటి సినిమాకు ఒప్పుకోవడం.. ఆయన్ని పెట్టి శివ నిర్వాణ ఈ సినిమా తీయాలనుకోవడం షాకింగే. అయితే ‘ఇరుముడి’లో సగటు తెలుగు ప్రేక్షకులు ‘జీర్ణించుకోలేని’ విషయాలు చాలానే ఉన్నాయి. ఐతే ‘ఇలా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు’ అనే స్టాక్ డైలాగును దాటి ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే. మాస్ చిత్రాల మూసలో మరుగున పడిపోయిన రవితేజలోని పెర్ఫామర్ ను ఈ సినిమాలో చూడొచ్చు. తెర మీద పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు ఎంత బాగా ఫీలయ్యారంటే.. ఆ కథ వారికి అంతగా కనెక్ట్ అయినట్లు. ‘ఇరుముడి’లో చివరి అరగంటలో ప్రేక్షకుల భావోద్వేగాలు అలాగే పతాక స్థాయికి వెళ్తాయి. హీరో పాత్ర తాలూకు బాధను.. కసిని ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఫీలవుతారు. ఫైనల్ గా చివరగా ఇరుముడి.. డ్రామా బలంగా.. మెసేజ్ హృద్యంగా ఆకట్టుకుంటుంది. 






7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi movie review

‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా...

‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాల్ని జోడించి ఇరుముడిని శివ నిర్వాణ ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 


త్రినాథ్ గా రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. కానీ కథలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే అవి ఏం అంత అనిపించవు. కొన్ని చోట్ల సినిమా కాస్త వీక్‌గా అనిపించినా.. టోటల్‌గా చూసుకుంటే మాత్రం ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. రవితేజకు చాలా రోజులకు మంచి విజయం వచ్చినట్టే. అలాగే శివ నిర్వాణకు దర్సకుడిగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక కమర్షియల్‌గా ఇది ఏ రేంజ్‌కి వెళ్తుంది అన్నది మున్ముందు తెలుస్తుంది. 

7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi movie review

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ...

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


అయితే కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. ఐతే, రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.


8.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

Gulte

By Gulte

#Irumudi - Empowering & EngagingFirstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a pa...

#Irumudi - Empowering & Engaging


Firstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a parent of a girl child, the film will prompt you to reflect and may lead you to make some changes in your current parenting approach.


Throughout the first half of the film, Shiva Nirvana superbly built the tension. The bond between the father and the son, Sai Kumar's dialogues about girls and parenting, and the undercurrent suspense and thrill were nicely built along with a good pre-interval sequence in the first half.


Shiva Nirvana succeeded in writing the emotional drama and the twist in the second half well. However, the episode after the twist reveal, should have been a bit better. But, the director made sure to end the film with a very emotional climax. Also, the action episode with the ‘Mallepoola Pallaki’ song in the background, brought the roof down in the theatre with loud cheers from the audience.


Overall, Irumudi is empowering, thought provoking and entertaining. Raviteja is most likely to earn a lot of respect for doing such a socially relevant film.


Rating - 3/5

6.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

ఇరుముడి... సినిమా గురించి చెప్పాలంటే good. చాలా మంచి decent message oriented సినిమా. అండ్ unnessesery commerial elements లేని సినిమా. రవితేజ గారికి performance oriented movies లో వన్ అఫ్ ది బెస్ట్ సిన...

ఇరుముడి... సినిమా గురించి చెప్పాలంటే good. చాలా మంచి decent message oriented సినిమా. అండ్ unnessesery commerial elements లేని సినిమా. రవితేజ గారికి performance oriented movies లో వన్ అఫ్ ది బెస్ట్ సినిమా. కొంతమందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళకి సినిమా taste లేదనుకొని వదిలేయాలి. అలాంటి వాళ్ళకోసం రొట్ట సినిమాలు తీసే రవితేజ ఈ పరిస్థితికొచ్చాడు అనిపిస్తుంది. ఏదేమైనా ఫైనల్ గా రవితేజ మంచి సక్సెస్ ఫుల్ కం బ్యాక్, చాలా మంచి హిట్టు ఈ సినిమాతో కొట్టాడు, come back ఇచ్చాడు అని చెప్పొచ్చు. 


and సినిమాలో కొంచెం heavy sences ఉన్నాయి. కొన్ని సార్లు తీసుకోలేకపోవచ్చు. మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మెయిన్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటది సినిమా. ఇంకొకటి నాకనిపించిందేంటంటే, లాస్ట్ లో స్క్రీన్ ప్లే కొంచెం టూ మచ్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ మిగతా అంత బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగా ఉంది. సాంగ్స్ బాగా తీశారు. అండ్ అయ్యప్ప మాల వేసుకునే భక్తులకు ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. అండ్ ఫ్యామిలీస్ కి మంచి ఆప్షన్. అండ్ యాక్టింగ్ రవితేజ సహా అందరూ చాల బాగా చేసారు. అండ్ ఇరుముడి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి కం బ్యాక్ ఇచ్చారు రవన్న. 

8.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil
Why MRO?