Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1345 Reviews
Showing 109–120 of 1345 reviews

Irumudi Movie Review

Completed watching #Irumudi. The pre-climax and climax worked really well. The Ayyappa Deeksha is beautifully woven into the narrative and serves as the film’s central backdrop.The father-daughter rel...

Completed watching #Irumudi. The pre-climax and climax worked really well. The Ayyappa Deeksha is beautifully woven into the narrative and serves as the film’s central backdrop.


The father-daughter relationship is handled very effectively, while Shiva Nirvana’s writing and screenplay are strong.


Ravi Teja delivers a very natural performance, and Baby Nakshatra is terrific.


GV Prakash Kumar’s music - both the songs and background score - is a major plus.


Overall, #Irumudi is a blockbuster!

7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

#Irumudi Satisfactory Slow-Burn Emotional Thriller That Has Its Share of Writing Flaws but Is Hard-Hitting and Sincere Enough!First half is on the slow side but stays engaging and builds a neat emotio...

#Irumudi Satisfactory Slow-Burn Emotional Thriller That Has Its Share of Writing Flaws but Is Hard-Hitting and Sincere Enough!


First half is on the slow side but stays engaging and builds a neat emotional connect through the father-daughter bond. Second half works in parts. It has convenient writing and villains who feel overly cruel at times just for shock value. Despite that, a few key twists work, the emotional core stays intact, and the climax lands very well.


Ravi Teja delivers his best performance in recent times and this is easily his better outings in a while. Nakshatra is superb. Writing has its flaws and this template does feel familiar at times, but it remains sincere and meaningful enough to be given a try!


Rating: 2.75/5

6.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Irumudi Movie Review

స్వామియే శరణం అయ్యప్ప: ఈ story ఇలా ప్రెజెంట్ చేసినందుకు, ఈ story ని ఇలా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిసినా, మన రవితేజ గారు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఈ message ని delivery చేసినందుకు రవన్న మనం పెద్ద kudos చ...

స్వామియే శరణం అయ్యప్ప: ఈ story ఇలా ప్రెజెంట్ చేసినందుకు, ఈ story ని ఇలా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిసినా, మన రవితేజ గారు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఈ message ని delivery చేసినందుకు రవన్న మనం పెద్ద kudos చెప్పాలన్నమాట. దీక్ష వేయని నాకే ఆ అయ్యప్ప స్వామి దీక్ష సీన్స్ ఈ సినిమాలో ఆ పాటలు గాని సీన్స్ గాని superb గా అనిపించాయి. goosbumps తెప్పించాయి. ఇంక దీక్షలో ఉన్న వారికి ఈ సీన్స్ ఏ రేంజ్ లో అనిపిస్తాయో చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా heavy గా ఉంది ఇరుముడి సబ్జెక్టు. కొంచెం distrubing గా కూడా అనిపిస్తది. అందరూ ఈ సినిమాని ఒకే రకంగా recive చేసుకుని బైటికి వెళ్లరు అనిపిస్తుంది. ఈ సినిమాని ఈ tone లో ఎందుకు చెప్పారు, వేరే tone లో కూడా చెప్పుండొచ్చు అని కూడా అనిపించొచ్చు. అలాగే మీరనొచ్చు. ఇలాంటి సినిమాలు తమిళ్ లో తీస్తే ఇలాగే encourage చేస్తారు కదరా అనొచ్చు. నాకు ఏ భాష అయినా, ఒకేలా చూస్తాను. కానీ ఈ సినిమాలో నాకైతే కొంచెం వేరే విధంగా తీస్తే బాగుందనిపించింది.


ఇక రవితేజ గారు చాలా రోజుల తర్వాత veru settled role లో అద్భుతంగా నటించి చితక్కొట్టేశారని చెప్పొచ్చు. హీరోయిన్ కైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. బట్ డీసెంట్. సాయి కుమార్ గారు ప్లెయిడ్ ఏ వెరీ ఇంపార్టెన్స్ డీసెంట్ రోల్. అండ్ రవితేజ కూతురిగా నటించిన అమ్మాయి కూడా బ్రిలియంట్. ఇక జివి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ కి అయితే హెవీ టోన్ తో బైటికి వస్తారు. నాకైతే అయ్యప్ప దీక్ష సీన్స్, అలాగే ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ బాగా నచ్చాయి. ఇక సినిమాకైతే కొంచెం తక్కువ ఆలోచనలు పెట్టుకుని వెళ్తే, చాలా బాగా నచ్చుతుంది. 


7.0
out of 9
2 weeks ago
Aug 21, 2026 Tamil

Agadha movie review

అగధ (Agadha) 2026 Youtube Channel
అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చే...

అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చేసింది.. బట్ దిస్ అగధ.. నాకు తెలిసి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.. లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా మస్కా నో ఎదో ఉంది. బట్ డైరెక్టర్ గా అయితే ఫెయిల్ అయ్యారు. కొన్ని కళాఖండాలు తీసిన తర్వాత ఇప్పుడు అగధ సినిమా తీశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు కొడుతున్నాం ఈ సినిమాతో హిట్టు అన్నట్టు అన్నారు. 


కానీ ఈ సినిమాలో మాత్రం అన్నంత స్టఫ్ లేదు. అస్సలు బాలేదు సినిమా. మాములుగా నాకే సినిమాకి వెళ్లినా నిద్ర రాదు. కానీ ఈ సినిమాకి మాత్రం ఇంట్రడక్షన్ నుంచే కళ్ళు మూసుకుపోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. సింపుల్ గా సినిమా రిజల్ట్ గురించి చెప్పాలంటే కష్టమే... చాలా కష్టమే... ఇంకా చెప్పాలంటే ఎవరైనా చూసుంటే వాళ్ళని సినిమాలో ఎంత సేపు నిద్రపోకుండా ఉన్నారు అని అడగాల్సొస్తుంది. 

4.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha movie review

అగధ... రీసెంట్ టైమ్స్ లో నాకు ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్దాం అనిపించిన మూవీ. కానీ వెళ్ళాక తెలిసింది పెద్ద తప్పు చేసానని. ఆ తప్పుకి ఫలితం... నాకు రెండు గంటల టార్చర్. మాములుగా థ్రిల్లర్ మూవీస్ చాలా మంది...

అగధ... రీసెంట్ టైమ్స్ లో నాకు ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్దాం అనిపించిన మూవీ. కానీ వెళ్ళాక తెలిసింది పెద్ద తప్పు చేసానని. ఆ తప్పుకి ఫలితం... నాకు రెండు గంటల టార్చర్. మాములుగా థ్రిల్లర్ మూవీస్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అలా అనుకునే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ అగధ కి వెళ్ళాము. బట్ సినిమా అయితే రెండు గంటలు నరకం చూపించింది. 


సినిమాలో ఒక్క సీన్ కూడా నాకు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఒక సస్పెన్సు లేదు, ఒక హర్రర్ లేదు, కనీసం థ్రిల్ మోవ్మెంట్స్ షాకయ్యేలా ఒక్కటి కూడా లేవు. పైగా తీసింది ఓ ఫేడవుట్ అయిన డైరెక్టర్.. అందుకేనేమో ట్రెండ్ కి తగ్గట్టు అనిపించకుండా... ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా గురించి నేను చెప్పడం అనవసరం... ఎవరైనా చూడాలనుకుంటే ఓటిటికి షిఫ్ట్ అవ్వండి అదే బెటర్. 

4.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha movie review

అగధ (Agadha) 2026 Youtube Channel
అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు....

అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు. థ్రిల్ మూవ్మెంట్స్ అసలేమీ కనిపించలేదు. రైటింగ్స్ టూ బ్యాడ్ అని చెప్పాలి. చెప్పుకోవడానికి నాకైతే ఒక్క సీన్ కూడా లేదు. పాపం కష్టపడి మేకర్స్ తీశారు అనడానికి నాకొక్క సీన్ కూడా కనిపించలేదు. పైగా సినిమాలో మనుషుల కన్నా కాకులు మెయిన్ లీడ్ గా చేసారు అనిపించింది. 


సినిమాటోగ్రఫి అయితే సినిమాలో బాగుంది. బీజీఎమ్ కొంచెం బాగుంది. కాన్సెప్ట్ చిన్నగా బాగా రాసుకున్నా, స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. డైరెక్టర్ ఏం అనుకోని సినిమా తీశారో ఏం అర్ధం కాలేదు. రైటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. ఇక నా రేటింగ్ ఈ సినేమాకివ్వాలనిపిస్తే... 1.5/5


5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha Movie Review

MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre w...

MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its success.


Highlights

The climax twist

Cinematography


Drawbacks

Lack of novelty in the horror genre

Forced characters

Cliched episodes


Overall, “Agadha” does not provide excitment. It neither scares nor thrills consistently. Apart from the kala tantra episode and a few portions in the second half, it remains a routine horror drama. The ending also hints at a possible second part.


5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha Movie Review

అగధ (Agadha) 2026 News Channel
నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్...

నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి ఎలాంటి విధ్వంసం సృష్టించింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అన్న అంశాలే సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. దర్శకుడు ఎంఎస్ రాజు మాటల్లో ‘అగధ’కు భారీగా బిల్డప్ ఇచ్చినప్పటికీ.. తెరపై మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.


ముఖ్యంగా సెకండాఫ్‌పై పెట్టుకున్న అంచనాలు నిరాశపరుస్తాయి. కథనం మరింత ఆసక్తికరంగా సాగాల్సిన చోట నెమ్మదించడం సినిమాకు మైనస్‌గా మారింది. ఇక బ్లాక్ మ్యాజిక్‌ను చూపించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టెక్నికల్ టీమ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ఎమ్మెస్ రాజు కథ కొత్తగా ఎంచుకున్నా, ట్రీట్మెంట్ పాత గానే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అగధ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. 


5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha Movie Review

దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దా...

దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు. 


డైరెక్టర్ ఎమ్మెస్ రాజు మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్‌ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు. ఫైనల్ గా వన్ టైం వాచబుల్. 

5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha movie review

Tupaki

By Tupaki

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇ...

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ అగధ సినిమా. 


కానీ ఎప్పుడో ఒక సీన్లో మెరుపులు మెరిపించడమే తప్ప.. ఈ సినిమాలో ఫ్లో మాత్రం మిస్ అయింది. ఎగుడు దిగుడు కథనం.. అసహనం కలిగించే కొన్ని పాత్రల చిత్రణ.. ఆ పాత్రల్లో ఆర్టిస్టుల నటన.. స్లో నేరేషన్ అగధ ఫ్లోను దెబ్బ తీశాయి. రైటర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ కోసం ఎఫర్ట్ పెట్టారు కానీ.. అది సరిపోలేదు. ఆయన క్లారిటీ లేని రైటింగ్ వల్ల కథనం ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని సన్నివేశాల వరకు రాజు టేకింగ్ బాగున్నా.. కంప్లీట్ సినిమాను అందించలేకపోయారు. చివరగా: అగధ.. సరిపోని థ్రిల్



5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha Movie Review

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ త...

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే. 


సినిమాలో.. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్‌. కాకపోతే దాన్ని టెక్నికల్‌ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు. టెక్నికల్‌ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.

5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu

Agadha Movie Review

అగధ (Agadha) 2026 News Channel
దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎ...

దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ ఇందులో అదే మిస్ అయింది. 


టెక్నికల్ గా ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ పేలవమైన బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి చూసేలానే ఉంది. ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..! 

5.0
out of 9
2 weeks ago
Aug 20, 2026 Telugu
Why MRO?