Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
DC Movie review
DC... డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాని, అనిరుద్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ సినిమా ఇంటర్వెల్ సీన్ నుండి మొత్తం మారిపోయింది. స్పెషల్లీ వామికా గబ్బి ఎంటరైన తర్వాత స్పీడ్ గా ఎల్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే వెళ్ళిపోయింది. ఆక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్పెషల్లీ బీజీఎమ్ అదిరిపోయింది.
అండ్ సినిమా స్టోరీ పరంగా చూస్తే కొత్త రైటింగ్ అని చెప్పలేం. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటది. ఉన్న తక్కువ క్యారెక్టర్స్ తోనే డ్రామా బాగా బిల్డ్ చేసారు. అండ్ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఫ్యామిలీస్ కాస్త అలోచించి వెళ్తే బెటర్. అండ్ సినిమాలో హీరో కన్నా హీరోయిన్ కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక టైటిల్ కి తగ్గట్టే సినిమాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా న్యాచురల్ గా ఉంది. ఫైనల్ గా లోకి కి ఇది గ్రాండ్ డెబ్యూ అని చెప్పాలి. ఇక మైనస్ అంటే చాలా సింపుల్ స్టోరీ, అండ్ ఆక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే నచ్చే ఛాన్స్ ఉంది. మాస్ ఆక్షన్ లవర్స్ కైతే ఐ ఫీస్ట్. అండ్ నా రేటింగ్ ఈ సినిమాకి 3.25/5
DC Movie Review
By Thyview
"డిసి". డైరక్టర్ లోకేష్ కానగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించాడు. దేవదాస్ స్టోరీ ని తీసుకుని మార్చి కమర్షియల్ గా డిఫరెంట్ గా తీశారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇస్ a decent engeging action movie అనిపించింది. సినిమాకి మెయిన్ హైలెట్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్. మెయిన్ హీరో కూడా తానే అనిపించాడు. ఎందుకంటే సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. స్పెషల్లీ బీజీఎమ్ అయితే కుమ్మేసాడు.
అండ్ సినిమాలో లోకేష్ కానగరాజ్ డైరెక్టర్ గా ఎలాంటి సత్తా ఉన్నవాడో తెలిసిందే. ఇప్పుడు ఆక్టర్ గా డీసెంట్ అనిపించాడు. ఇక సంజనా, వామిక గబ్బి కూడా అదరగొట్టారు. ఇక యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయింది. ఇక సినిమా టెక్నికల్ గా కూడా సూపర్. కొన్ని షాట్స్ అయితే మైండ్ లోంచి పోవు. బట్ ఎడిటింగ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఫైనల్ గా చెప్పాలంటే లోకి హీరోగా డీసెంట్ డెబ్యూ ఇచ్చాడని చెప్పాలి.
DC Movie Review
By T2B Live
తమిళ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా మారి తీసిన మొదటి సినిమా డిసి(DC) ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయింది. కథగా చెప్పాలి అంటే చాలా నార్మల్ పాయింట్ తోనే తెరకెక్కిన DC మూవీ స్క్రీన్ ప్లే కూడా, మొత్తం యాక్షన్ సీన్స్ గన్స్, కత్తులతోనే నిండిపోయి ఉంటుంది. కానీ రెండున్నర గంటల సినిమాలో చాలా పార్ట్ బోర్ ఏమి కొట్టకుండా మొత్తం కూర్చుని చూసేలా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. హీరోగా లోకేష్ కనగరాజ్ ఆ పాత్రకి సెట్ అయ్యేలా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేయగా అందరి కన్నా బెటర్ గా క్యారెక్టర్ ఆర్క్ తో మెప్పించి వామిక గబ్బి ఫుల్ మార్కులు కొట్టేసింది.
ఇక డైరెక్టర్ సింపుల్ కథని వైలెన్స్ ను ఒక పొయెటిక్ వేలో చెప్పే క్రమంలో స్లో నరేషన్ ఉన్నా కూడా అనిరుద్ టెర్రిఫిక్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ సినిమాను సేఫ్ చేయడమే కాదు ఏం సినిమారా అనిపించేలా చేసింది. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ టేకింగ్, కొన్ని ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అలాగే అన్నింటికీ మించి అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఈజీగా చూడొచ్చు ఈ సినిమాను ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్.
DC Movie Review
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాకు కాస్త ఎమోషన్స్ జోడించి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించిన చిత్రం డిసి. అయితే కథగా ఇదేమీ కొత్తది కాదు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ ను జోడించి బాగానే డ్రైవ్ చేసినా… హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ కావడం, యాక్షన్ కు పెద్ద పీట వేయడం వల్ల కథలోని అసలు ఫ్లేవర్, ఎమోషన్స్ సైడ్ అయి పోయిన భావన కలుగుతుంది.
ఈ సినిమాకు మేజర్ ఎసెట్ సంగీతం. అనిరుధ్ నూటికి నూరు శాతం తన పనికి న్యాయం చేశాడు. ముఖేష్. జి సినిమాటోగ్రఫీ స్టోరీకి, నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ‘ప్రాణంలేని పువ్వు, ప్రాణం తీసే తుపాకీ ముందుకు నడిపిస్తున్నాయి’ లాంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రొటీన్ కథే అయినా దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పూర్తిగా హింసతో యాక్షన్ కు ఎక్కువ స్పేస్ ఇవ్వడంతో ఒక సెక్షన్ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం సినిమా నచ్చుతుంది. దర్శకుడిగానే కాదు... లోకేశ్ హీరోగా కూడా కంటిన్యూ కావచ్చు అనిపిస్తుంది.
DC Movie Review
By Gulte
Arun Matheswaran teamed up with the director-turned-actor Lokesh Kanagaraj for DC, a film based on Devdas, a hugely popular novel by Sarat Chandra Chattopadhyay. Wamiqa Gabbi and Sanjana Krishnamoorthy, played the female lead roles, while Anirudh Ravichander, scored the music and Sun Pictures produced the film.
Positives:
1. Background Score
2. Screenplay & Direction
3. Actors Performances
4. Dialogue Writing
5. Utmost Honesty In Narration
6. Pre-Interval to Climax
Negatives:
1. Editing In Parts
2. Excessive Violence
Overall, DC is a stunning addition to the list of films which are based on Devdas. It is brutal, honest, realistic, philosophical, poetic and yet very engaging and entertaining. Arun Matheswaran, Anirudh and the team came up with an emotional action spectacle that has every chance to touch your heart and make you root for the lead characters unconditionally. And yes, finally, the director, Arun Matheswaran, has every chance to score his much-deserved first commercial success with, DC. Go, watch it and fall in love with Das, Chandra and their unadulterated world.
DC Movie Review
By TV9 Telugu
డీసీ మూవీకి దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఎన్నాళ్ళయిందో ఒక అదిరిపోయే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూసి.. DC తో ఆ లోటు తీరిపోయిందని ఆడియన్స్ ఖచ్చితంగా అనుకుంటారు.
పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాంటిదే ఈ సినిమా.. వెరీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టు తీశాడు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ఇదేమీ తెలియని కథ కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన కథే.. సమాజానికి ఎదురెళ్లే ఒక గ్యాంగ్ స్టర్.. సమాజం చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి.. కలిసి చేసే ప్రయాణమే డిసి సినిమా. ఇక సినిమాని మెజారిటీ నిలబెట్టింది అనిరుధ్ బీజీఎమ్. ఇటు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తన మేకింగ్ స్టైల్ చూపించాడు.. మరోసారి పోలీసుల చేతిలో అణిచివేయబడుతున్న సామాన్యుల కథనే తీసుకున్నాడు. ఓవరాల్ గా డిసి.. గన్స్ అండ్ రోజెస్.. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్..!
DC Movie Review
By Tupaki
ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్పటి రోజుల్లో జరిగేది. చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్స్ జరగట్లేదు. అందుకు మారిన పరిస్థితులు.. ప్రేక్షకుల అభిరుచి కారణం. ఈ రోజుల్లో కేవలం మ్యూజిక్ వల్ల ఒక సాధారణమైన సినిమా కూడా మెరుగ్గా అనిపించడం చాలా అరుదే. ఆ అరుదైన జాబితాలో ‘డీసీ’ నిలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అయినా సరే.. ‘డీసీ’ బోర్ కొట్టకుండా సాగిపోయేలా చేయడంలో అరుణ్ మాదేశ్వరన్ టేకింగ్ కొంత పాత్ర పోషిస్తే.. మేజర్ క్రెడిట్ అనిరుధ్ రవిచందర్ కే చెందుతుంది.
ఓవరాల్ గా డిసి ని ఒక మామూలు కథనే, అందంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. దర్శకుడి అభిరుచిని చాటే సన్నివేశాలు చాలానే ఉన్నాయీ సినిమాలో. ముఖ్యంగా తొలిసారి తన గది దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన వేశ్య భావోద్వేగాన్ని చూపించే సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపిస్తోంది. చివరగా: డీసీ.. అనిరుధ్ షో..
DC Movie Review
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాస్ కమర్షియల్ మూవీస్‌కి కేరాఫ్. విజయ్‌ని మాస్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక గ్యాంగ్ స్టర్ ప్రధానంగా సాగే సినిమా. చూడ్డానికి యాక్షన్ ప్రధానంగా రన్ అవుతుంది. కానీ దీని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటుంది. కాకపోతే తెలుగు నటీనటులు లేరు. దీంతో కనెక్ట్ కావడానికి టైమ్ పడుతుంది.
అయితే దేవదాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్ దుమ్ములేపాడు. సెటిల్డ్ గా చేశాడు. దర్శకుడే కాదు, ఆయనలో అదిరిపోయే నటుడు కూడా ఉన్నాడని నిరూపించాడు. పార్వతిగా సంజనా కృష్ణమూర్తి అందంగా ఉంది. అంతే బాగా యాక్ట్ చేసింది. ఇక చంద్ర పాత్రలో వామికా గబ్బి దుమ్ములేపింది. అయితే సినిమాలో పోయిటిక్ స్టయిల్ కనిపిస్తుంది. ఆయా పోయెటిక్ ఎలిమెంట్లు కొంత స్లోగా అనిపించినా ఆకట్టుకుంటాయి. లైట్ గా హార్ట్ టచ్ చేస్తూ యాక్షన్, ఎమోషనల్‌గా మెప్పించే డీసీ. లోకేష్ కనగరాజ్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.
DC Movie Review
By ABP Desam
'డీసీ' టీజర్, ట్రైలర్లలో లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించిందన్నారు కొందరు. ఓటీటీలో 'చిన్ని' (తమిళ్ ఫిల్మ్ 'సాని కాయిదం') చూసిన ప్రేక్షకులకు అది అరుణ్ మాథేశ్వరన్ స్టైల్ అని తెలుసు. 'డీసీ'లో దర్శక రచయిత అరుణ్ మాథేశ్వరన్ క్లిష్టమైన కథను చెప్పలేదు. సింపుల్ కథను స్ట్రెయిట్‌గా చెప్పారు. సామాన్యులకు న్యాయం లభించినప్పుడు వ్యవస్థపై ఓ వ్యక్తి చేసిన తిరుగుబాటే 'డీసీ'. 'డీసీ'ని పైనుంచి చూస్తే... రివేంజ్ యాక్షన్ ఫిల్మ్. సింపుల్ స్టోరీని ఎక్సట్రాడినరీగా మార్చినది మాత్రం అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం. ఆయనతో పాటు ముఖేష్ జి సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్‌ను మర్చిపోలేం.
ఓవరాల్ గా డీసీ'... దాసు, చంద్రల కథ. ఇదొక మోడ్రన్ దేవదాసు కథ. బాల్యంలో కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ యువకుడు... ప్రేమను వెతుక్కున్న కథ. అయితే... అతని ప్రయాణం పూల పాన్పు కాదు. అడుగడుగునా ముళ్ళబాట. 'దండుపాళ్యం' లాంటి వయలెన్స్ సినిమాలను ప్రేక్షకులు చూశారు. అయితే... అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం రా అండ్ రస్టిక్ వయలెంట్ సినిమాను క్లాసీగా మార్చింది. తెరపై రక్తం పారుతున్నప్పటికీ... యాక్షన్ వస్తున్నప్పటికీ... నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చూసేలా గ్రిప్పింగ్‌గా తీశారు అరుణ్ మాథేశ్వరన్. డోంట్ మిస్ ఇట్.
DC Movie Review
By Great Andhra
After months of anticipation, Lokesh Kanagaraj’s acting debut, DC, has finally hit theatres. Packed with raw action, graphic violence and a dark emotional undercurrent, the Tamil action drama has generated considerable interest, helped in large part by Anirudh Ravichander’s music.
Highlights
Anirudh Ravichander’s music
Lokesh Kanagaraj’s screen presence
Wamiqa Gabbi’s performance
Climax
Action sequences
Drawbacks
Slow pace in parts
Heavy violence may not appeal to everyone
Limited emotional expression for the lead character
Overall, DC is a gritty action drama powered by Anirudh’s music, strong visuals and a confident acting debut from Lokesh Kanagaraj. It may not be a conventional mass entertainer, but it offers a distinctive theatrical experience for audiences comfortable with intense and graphic violence.
Bottom Line: Gritty Action with Strong Music.
DC Movie Review
By Filmi Beat
డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్ లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్ గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్ గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
DC Movie Review
By NTV Telugu
తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
చిన్న కథను ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్‌తో, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. హీరోగా లోకేష్ కనకరాజ్ తన పాత్రలో మెప్పించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు. అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్‌గా నిలిచాయి.
కథలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, దర్శకుడి స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మొత్తంగా ‘డిసి’ మంచి మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్‌కు ఇది ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఫైనల్ గా డిసి ఎంగేజింగ్ మూవ్మెంట్స్ ఉన్న ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పొచ్చు.