Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Veerabhadrudu movie Review
By 10TV Telugu
సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో డిస్సపాయింట్ లో ఉన్నారో తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాలతో వీరభద్రుడు తాజాగా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.
అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గురించి కాకుండా లాయర్లు, కోర్టు చుట్టూ, దేవుడు వీరభద్రుడు మీదే బేబీ కృష్ణ రివెంజ్ అన్నట్టు రొటీన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు.
పైగా సినిమాలో హీరో సూర్య అయినా కథ మొత్తం నడిచేది ఆర్జే బాలాజీ చుట్టూనే. అసలు హీరో సూర్యనా, ఆర్జే బాలాజీనా అనే సందేహం రాక మానదు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతారు. ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్టులో కేసు తేలక బాధ పడే పేదవాళ్ళు, తండ్రి ఎమోషన్, దేవుడి ఎమోషన్.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా దేవుడే దిగివచ్చినా ఇక్కడ సమాజంలో, కోర్టు, లాయర్లలో ఉన్న అవినీతిని, చెడుని తీసేయడం కష్టం, ఒక కోర్టు మారిస్తే సరిపోదు దేశంలో చాలా కోర్టుల్లో ఇదే పరిస్థితి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో చేసారు. మొత్తంగా ‘వీరభద్రుడు’ సినిమా కోర్టుల్లో జరిగే అవినీతిని అంతం చేయడానికి దేవుడే దిగి వస్తే ఏం జరిగింది, అని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు.
Veerabhadrudu movie Review
By TV9 Telugu
కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలయింది. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు పాయింట్ తో... అలాగే న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది.. అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ.
ఇక సూర్య వీరభద్రుడి పాత్రను కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరోలా కాకుండా, వ్యవస్థ చేతిలో మోసపోయిన సామాన్యుడి కోపానికి ప్రతీకగా మలచడం బాగుంది. సూర్య తన రెండు షేడ్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా నటించాడు. కానీ తన రోల్ ముందు అటుడిగా ఆర్జే బాలాజీ తేలిపోతాడు. అందువల్ల బలమైన ప్రతినాయకుడు ఉండడు. ఇక మ్యూజిక్ కూడా డిస్సపాయింట్ చేసింది. బీజీఎమ్ బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ బాలేదు. ఎడిటింగ్ ఓకే, అయితే ఇప్పటి ఆడియన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకుంటూనే, కథలోని ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు... ఓవరాల్ గా తక్కువ అంచనాలతో రెగ్యులర్ మూవీ లవర్స్ ని బాగానే అలరిస్తుంది సినిమా. సూర్య ఫాన్స్ కి మాత్రం ఐ ఫీస్ట్.
Veerabhadrudu movie Review
By ABP Desam
కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, కమర్షియాలిటీతో పాటు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నార్మల్ కథ రాసుకున్నారు ఆర్జే బాలాజీ & టీమ్. అందులో సక్సెస్ అయ్యారు. అయితే... దర్శకుడిగా మాత్రం కథకు సరైన క్యాస్టింగ్ ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆర్జే బాలాజీ.
వీరభద్రుడు' కథకు వస్తే... దేవుడు వచ్చినా న్యాయవ్యవస్థను మార్చలేడని ఆర్జే బాలాజీ చెప్పాలనుకున్నారు. సినిమాలో సూర్య వీరభద్రుడిగా రుద్ర తాండవం చేశారు. అయితే... సూర్యను చూడాలని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ & ఆయన స్క్రీన్ టైమ్ ఇబ్బంది పెడుతుంది. టెక్నికల్ గా మ్యూజిక్ ఫెయిల్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... ప్రేక్షకులకు 'వీరభద్రుడు' నచ్చుతాడు.
Veerabhadrudu Movie Review
By Filmi Beat
న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ వీరభద్రుడు సినిమా కూడా అలాంటి తరహా ఫాంటసీ పాయింట్ తో కథతో తెరకెక్కింది. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తోచని స్థితిలోను, గందరగోళంలోను పడటం వల్ల సినిమా అనుకొన్నంత ఇంపాక్ట్ చూపలేదని చెప్పాలి.
సినిమాలో ప్రధానమైన పాయింట్ ఫస్టాఫ్ లోనే ముగిసిపోతుంది. కానీ సెకండాఫ్ లో రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి సాగదీసి సినిమాను ముగించడం మూవీకి మైనస్ అయింది. కానీ వీరభద్రస్వామిగా, సూర్యగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను సూర్య తనదైన శైలిలో అదరగొట్టాడు. మిగతా రోల్స్ ఏమి అంత ఇంపాక్ట్ చేయలేదు. మ్యూజిక్ విషయంలో దెబ్బ పడగా, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా కథ, కథనాలు, గ్రాఫిక్స్ పై ఇంకా దృష్టి పెడితే.. ఫాంటసీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్ లో బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేది. కోర్టు రూమ్ డ్రామాలు, డివైన్ ఎలిమెంట్స్ తో సోషల్ ఇష్యూస్ మీద వచ్చి సినిమాలను ఇష్టపడే వారికి వీరభద్రుడు మూవీ నచ్చే అవకాశం ఉంది.
Veerabhadrudu movie Review
By NTV Telugu
కోలీవుడ్ స్టార్ Suriya నటించిన ‘వీరభద్రుడు’ ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన థియేటర్లలో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. స్టోరీ పాయింట్ కొస్తే... సమాజంలో పెరిగిపోతున్న అన్యాయాలు, మనుషుల ఆలోచనా విధానం చూసి “దేవుడు వచ్చినా మార్చలేడు” అనే పాయింట్‌తో దర్శకుడు RJ Balaji వీరభద్రుడుని తెరకెక్కించాడు. పైగా ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి, కాకపోతే దీన్ని కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేశాడు.
ఫస్ట్ హాఫ్ వరకు కథ ఓకే అనిపించినా… సెకండాఫ్‌లో మాత్రం సినిమా కాస్త ట్రాక్ తప్పినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉండాల్సింది. ఇక సూర్య ఫ్యాన్స్ కోసం పెట్టిన ఎలివేషన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. Trisha Krishnan పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం మైనస్ కాగా… ఆర్జే బాలాజీ మాత్రం హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నట్టుగా కనిపించాడు. ఓవరాల్ గా సూర్య నటన కోసం వీరభద్రుడు ఒక్కసారి చూసేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. ఫైనల్ గా వీరభద్రుడు మూవీ సూర్య అభిమానులకు పండగ లాంటి మూవీ అయినా, పెద్దగా అంచనాలు లేకుండా అయితే మెప్పించే అవకాశం ఉంది.
Samayam Telugu
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే పాయింట్ తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలొచ్చాయి, వస్తున్నాయి కూడా. కాకపోతే దర్శకుడు ఆర్జే బాలాజీ దీనికి కోర్ట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు అంతే.
కానీ కథకుడిగా మాత్రం దర్శకుడు అంతగాఆకట్టుకోలేదు. సూర్య ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం కాస్త సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో సూర్య పాత్ర మాత్రం ఒక గెస్ట్ రోల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకి స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో మాత్రం సూర్య అదరగొట్టేశాడు. త్రిష పాత్రకి పెద్ద స్కోప్ లేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ, ఇది సూర్య కోసం కాకుండా తన కోసమే రాసుకుని, తన కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా తన పాత్ర కనిపిస్తుంది. కాకపోతే సూర్య నటన ముందు తేలిపోతుంది ఆ పాత్ర. ఆర్జే బాలాజీ కేవలం దర్శకుడిగా ఈ మూవీని తీసి ఉంటే.. సెకండాఫ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఫలితం మరింత అద్భుతంగా వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.
Veerabhadrudu Movie Review
By Tupaki
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు కొన్ని ఫైనాన్షియల్ ఇస్యూస్ వల్ల ఆలస్యంగా విడుదలైనా, థియేటర్లలో మంచి జోష్ కనబరుస్తుంది. టాక్ పరంగా మాత్రం బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కథ విషయానికి వస్తే.. తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇంచుమించు అలాంటి కథే ఈ వీరభద్రుడు కూడా. అందువల్ల ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా, ఫ్రెష్ స్టోరీ కాకపోవడం బిగ్ మైనస్.
డైరెక్టర్ ఆర్జె బాలాజీ తీసింది నాసిరకం సినిమా అయితే... అందులోనూ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించడం ఆ పాత్ర సూర్య కి అపోజిట్ గా స్ట్రాంగ్ గా లేకపోవడం మైనస్. పైగా సాయి అభ్యంకర్ సాంగ్స్ మైనస్ అయ్యాయి. బీజీఎమ్ కొంచెం బెటర్. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫి బాగుంది. ఓవరాల్ గా డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ రైటింగ్ - టేకింగ్ లో కొత్తదనం చూపించలేకపోయాడు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. కానీ లాజిక్స్ పూర్తిగా పక్కన పెట్టి తోచినట్లుగా సన్నివేశాలు రాసి తీసేశాడు దర్శకుడు చివరగా వీరభద్రుడు.. మహిమ పని చేయలేదు.
Veerabhadrudu movie Review
By 123telugu
సూర్య నటించిన కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు గా విడుదల కాగా, నటుడు ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించాడు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘వీర భద్రుడు’ మూవీ కొన్ని మంచి మూమెంట్స్ తో సాగే యావరేజ్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సూర్య ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కథ పరంగా నిరాశపరిచిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. పైగా కొన్ని బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్‌గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది.
అయితే నాసిరకం డబ్బింగ్, తమిళ నేటివిటీ ఎక్కువ అవడం వల్ల తెలుగు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోతుంది. మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ అవలేదు. ఓవరాల్ గా సూర్య అభిమానులకు మంచి కిక్కిచ్చే ఈ మూవీని కొత్తదనం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
Godari Gattupaina movie Review
By Cinema Picha
‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సుదర్శన్ కామెడీ హైలెట్ అవుతుంది.
ఇక సినిమాలో మైనస్ పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే స్టోరీ. చాలా సింపుల్ గా తెలిసిన సీన్లే ఉంటాయి. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు రోల్ బిగ్ ప్లస్. హీరోహీరోయిన్లు కూడా డీసెంట్ గా ఆక్ట్ చేసారు. మ్యూజిక్ డీసెంట్ గా అనిపించింది. ఫన్ కూడా మెజారిటీ వర్కౌట్ అయేలా ఉంది. సో ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డీసెంట్ వాచబుల్ ఫీల్ వస్తుంది.
Godari Gattupaina Movie Review
By Thyview
గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, సినిమా కాస్ట్ ని చూస్తున్న ఫీలింగే వస్తుంది. అంటే సహజత్వం లేదన్నమాట.
లైలా లాంటి ఆర్టిస్టులకు స్ట్రాంగ్ రోల్స్ కూడా ఇవ్వలేదు. సినిమాలో కామెడికి స్కోప్ ఉన్నా, ఎక్కడా వాడలేదు. పెర్ఫార్మన్స్ వరకు సుమంత్ ప్రభాస్ decent గా చేశాడు. Jagapathi Babu కి importance ఇచ్చారు కానీ… ఆ character నుంచి audience expect చేసే emotional impact మాత్రం రావడం లేదు. Overall గా చెప్పాలంటే… ‘గోదారి గట్టుపైన’ ఒక beautiful looking village love story. కానీ heart touching cinema అవ్వాల్సింది… slow and routine experience గా మారిపోయింది. అందువల్ల డిస్సపాయింట్ చేసింది.
Godari Gattupaina movie Review
‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.
సింపుల్ గా చెప్పాలంటే నిబ్బా నిబ్బి కలుసుకుంటారు, కొట్లాడుకుంటారు, తర్వాత లవ్...ఇక ఫ్యామిలీ ట్విస్ట్.. అమ్మో, అయ్యో అడ్డం వస్తారు. ఇంకేముంది కలుస్తారా? లేదా? అంతే కథ. వెయ్యి సినిమాల్లో ఇలాంటి స్టోరీలు చూసాం.. ప్రతి సీన్ కూడా మనం ఈజీగా గెస్ చేస్తాం.. బట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక్క సీన్ ఉండదు. ఇక సాంగ్స్ కూడా ఆగం పట్టించినయి. ఓవరాల్ గా ‘గోదారి గట్టుపైన’ మంచి ప్రయత్నమే… కానీ థియేటర్లో గట్టిగా నిలబడేంత బలం మాత్రం సినిమాలో కనిపించదు. ఇక డెసిషన్ మీ పైనే ఉంది.