Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 421–432 of 1045 reviews

Suriya’s Veerabhadrudu Film Review

Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the...

Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments. 

The music by Sai Abhyankkar adds good energy to the film. 

However, the movie carries strong Tamil nativity, which may not connect with everyone. 

Overall, Veerabhadrudu is a decent mass entertainer and a satisfying comeback film for Suriya fans.

8.0
out of 9
2 months ago
May 19, 2026 Telugu

Godard gattupaina

godari gattupaina : Honestly, Godari Gattupaina feels like a visually rich Instagram reel stretched into a movie. The Godavari scenery and rural setup are super pleasing, and Sudarshan comedy gives s...
godari gattupaina : Honestly, Godari Gattupaina feels like a visually rich Instagram reel stretched into a movie. The Godavari scenery and rural setup are super pleasing, and Sudarshan comedy gives some entertaining moments. overall its a decent watchable village drama. rating 5/10
6.0
out of 9
2 months ago
May 19, 2026 Telugu

Veerabhadrudu

veerabhadrudu : Suriya’s Veerabhadrudu had a decent setup, but the film ends up feeling below average overall. A few mass moments and Suriya’s screen presence work to an extent, but the story doesn’t...
veerabhadrudu : Suriya’s Veerabhadrudu had a decent setup, but the film ends up feeling below average overall. A few mass moments and Suriya’s screen presence work to an extent, but the story doesn’t offer anything fresh or exciting. Apart from a few engaging moments and decent music, the film mostly feels flat. Overall, Veerabhadrudu is a one-time watch only for hardcore Suriya fans. my rating 5.5/10
6.0
out of 9
2 months ago
May 19, 2026 Telugu

Veerabhadrudu movie Review

Thyview

By Thyview

సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎ...

సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మూవీ నాచొచ్చు. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సీన్లు బానే ఉంటాయి. కానీ స్టోరీ వైస్ గా చూస్తే నచ్చకపోవచ్చు. సినిమా చూస్తే డైరెక్టర్ ఆర్ జె బాలాజీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసాడని తెలుస్తుంటే ఉంటుంది. 


సరిగా గమనిస్తే... సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఓ స్టోరీ, సెకండ్ హాఫ్ లో మరో స్టోరీ ఉంటుంది. అది ఒక రకంగా మైనస్ అవచ్చు. ఇక సూర్య పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టాడు. విలన్ గా నటించిన అర్జె బాలాజి పర్వాలేదన్పించాడు. సాంగ్స్ అంత బాలేవు. తమిళ్ నేటివిటీ మసాలా ఎక్కువయింది. ఓవరాల్ గా వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. బట్ నార్మల్ ఆడియన్స్ గురించి చెప్పలేం. అయితే క్రేజీ సినిమాలు ఏమి ఈ మధ్య కాలంలో రాలేవు కాబట్టి, సూర్య వీరభద్రుడు సినిమాని ఓసారి టైంపాస్ కి చూసేయొచ్చు. 

6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్...

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్టోరీ అంత బాగాలేదనిపిస్తుంది. ఇక స్టోరీ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా స్టోరీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు డైరెక్టర్. కథ పరంగా స్టోరీ ఫస్ట్ హాఫ్ కే ఎండ్ అయిపోయిన ఫీల్ వస్తది. 


ముఖ్యంగా అర్జె బాలాజీ ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న స్క్రిప్ట్ కి సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రిప్ట్ కి సంబంధమే ఉండదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్టుబుల్ గా లేవు. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ తేలిపోయింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ లౌడ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవర్ఫుల్ గా బాగానే ఉంది. కానీ స్టోరీ వైస్ గా చూస్తే, ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా ఉంచే స్క్రిప్ట్ పరంగా ఏమి వర్కౌట్ అవలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టమే.  


6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా ర...

సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సాయి అభ్యంకార్ మ్యూజిక్ అయితే ఏమాత్రం బాలేవు. బీజీఎమ్ ఒకే. ఇక సూర్య పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ స్క్రీన్ టైం లెంగ్త్ తక్కువ. అలాగే డైరెక్ట్ చేయడమే కాకుండా విలన్ గా నటించిన ఆర్ జె బాలాజీ పెర్ఫార్మన్స్ బాగుంది. బట్ సూర్య ముందు తేలిపోతాడు. 


ఇక ఈ సినిమాలో లాజిక్ లు పక్కన పెడితేనే సినిమా చూడగలరు ఆడియన్స్. పైగా సూర్య - అర్జె బాలాజీ మధ్య సీన్స్ ఇల్లాజికల్ గా అనిపించడమే కాకుండా, తల తోక లేని సీన్స్ అన్నట్టు ఉంటుంది. ఇక త్రిష రోల్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్ గా వీరభద్రుడు సినిమా ఫ్యాన్స్ కి నచ్చేట్టు ఉంటుందేమో గాని నార్మల్ ఆడియన్స్ పెద్దగా చూసేట్టు లేదు. ఇక ఫ్రెష్ మూవీస్ కోరుకునే ఆడియన్స్ దీని జోలికెళ్లకపోవడం మంచిది. 

5.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా...

సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటివి అంత ఎక్సయిటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కొన్ని ఓవర్ ది టాప్ అయిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి అయితే ఏ సీన్ ఎటు పోతుందో అర్ధం కానట్టుంటుంది. 


అయితే సినిమాలో కొన్ని పాత సినిమాల రిఫరెన్స్ లు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యాన్స్ కి బానే అనిపించినా, నార్మల్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సాంగ్స్ అయితే ఏమంత బాగాలేవు. కొన్ని అర్ధం కానీ విధంగా ఉన్నాయి. సాయి అభ్యంకార్ మ్యూజిక్ బానే ఉంది. సో ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ అయితే అబొవ్ యావరేజ్. సోది లేకుండా ఒక్క ముక్కలో మూవీ గురించి చెప్పాలంటే... సూర్య లాస్ట్ మూవీస్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ బాగుందని కాదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ చెప్పాలంటే 2.5 ఇవ్వొచ్చు. 

6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie review

వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూ...

వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్ లు కూడా బాగున్నాయి. 

ఇక “సమాజాన్ని దేవుడు కూడా మార్చలేడు” అనే పాయింట్ కొత్తది కాదు. కానీ కోర్ట్ డ్రామాగా చెప్పాలని ట్రై చేశారు. 


ట్రైలర్ చూస్తే ఏదో గట్టిగా ఉంటుందనిపిస్తుంది. సూర్య స్క్రీన్ స్పేస్ తగ్గింది. డైరెక్టర్ ఆర్జె బాలాజీ తన స్క్రీన్ టైం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. అయినా కానీ సూర్య ఫ్యాన్స్ కి ఉన్నంత సేపు మంచి కిక్ ఇస్తాడు. క్లైమాక్స్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ ఫీల్ వస్తుంది. త్రిష పాత్ర కూడా జస్ట్ అలా వచ్చి వెళ్లిపోతుంది. కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే మూవీ నిలబడేది. మొత్తానికి ‘వీరభద్రుడు’లో రెగ్యులర్ మూవీ లవర్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గాని, ఫ్రెష్ నెస్ కోరుకుంటే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.  

6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడ...

రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద్రుడు సినిమా డైరెక్టర్ ఇది వరకే ప్రమోషన్స్ లో చెప్పినట్లు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. 


ఫ్రెష్ స్టోరీలు ఎక్స్ పెర్ట్ చేసే ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కథ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చు. కానీ కమర్షియల్ మూవీస్, మాస్ మూమెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్ లాంటివి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో ఈజీగా రీసెంట్ టైంలో వచ్చిన సూర్య మూవీస్ లో బెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. సూర్య తనదైన స్టైల్ లో యాక్టింగ్ అండ్ డైలాగ్స్ హీరో ఎలివేషన్స్ తో పాటు, తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో కుమ్మేశాడు. ఇక ఆర్ జే బాలాజీ విలన్ గా జస్ట్ ఓకే అనిపించగా, డైరెక్టర్ గా ఫ్యాన్స్ కోసం ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ ను పెట్టినా, కథ పరంగా వీక్ పాయింట్ నే ఎంచుకున్నాడు. ఓవరాల్ గా వీరభద్రుడు బాగానే ఆకట్టుకోవచ్చు. అయితే కొంచం తమిళ్ ఫ్లేవర్ తగ్గించి కథ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే పెర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అయ్యేది. అయినా సినిమా ఒకసారి చూడొచ్చు.

6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half! The first half is passable despite a slow start, w...

#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half!


The first half is passable despite a slow start, with the emotional and mass scenes working in parts. However, the second half falters. The writing starts off grounded but turns illogical and messy.


This feels like a fan-made film for Suriya. His screen presence is superb, though the role offers limited acting scope. RJ Balaji does better as an actor than director. He gets some commercial moments right but his overall execution lacks clarity and conviction. Sai Abhyankar’s music is hit or miss.


Slightly better than Suriya’s recent films and may connect a bit more with the Tamil audience, but still doesn’t meet the expectations. Below Average to Average Watch! #VeeraBhadrudu


Rating: 2.25-2.5/5

5.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

Sakshi

By Sakshi

సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపిం...

సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపించినా… స్క్రీన్‌పైన ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన ఈ కథ రొటీన్ ట్రాక్‌లో పడిపోయింది. సూర్య ఫ్యాన్స్‌కు మాత్రం కొన్ని సీన్స్‌లో గూస్‌బంప్స్ వస్తాయి. కానీ అదే సమయంలో సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా, కొన్ని సీన్లు చికాకు తెప్పిస్తాయి. సూర్య పాత్ర కంటే ఆర్జే బాలాజీ పాత్రే ఎక్కువగా కనిపించడం మరో మైనస్. 


దర్శకుడిగా ఓకే అనిపించిన బాలాజీ… నటుడిగా మాత్రం సూర్య ముందు నిలబడలేకపోయాడు. త్రిష పాత్ర కూడా పేరుకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచినా… సెకండాఫ్ పూర్తిగా నీరసంగా మారింది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా రాసి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. మొత్తంగా ‘వీరభద్రుడు’లో మెసేజ్ ఉంది… సూర్య పెర్ఫార్మెన్స్ ఉంది… కానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లే కూడా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  

6.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu

Veerabhadrudu Movie Review

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’...

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోతుంది. 


కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎన్నో వందల చిత్రాల్లో ఈ కాన్సెప్ట్ చూసే ఉంటారు ఆడియన్స్. రీసెంట్ గా గోపాల గోపాల, బ్రో వంటి చిత్రాల్లో కూడా ఈ నేపథ్యాన్ని వాడారు. దర్శకుడు బాలాజీ ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తెరకెక్కించాడు గాని, నార్మల్ ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు ‘కాంతారా’ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కి ఆడియన్స్ లోను కాకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదని ఫీలయిన వారికి ద్వితీయార్ధంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.

5.0
out of 9
2 months ago
May 16, 2026 Telugu
Why MRO?