Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 493–504 of 1045 reviews

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
జెట్‌లీ’ సినిమా స్టార్ట్ అయ్యిన 10 నిమిషాల్లోనే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది… “ఏం జరుగుతోంది బాస్?” అనిపిస్తది. అదే ఫీలింగ్ సినిమా అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి ఫుల్ కన్ఫ్యూజన...

జెట్‌లీ’ సినిమా స్టార్ట్ అయ్యిన 10 నిమిషాల్లోనే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది… “ఏం జరుగుతోంది బాస్?” అనిపిస్తది. అదే ఫీలింగ్ సినిమా అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి ఫుల్ కన్ఫ్యూజన్‌ తో ఒక ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేశాడు. కానీ ఆడియెన్స్ మాత్రం స్టోరీ కన్నా… “ఇది ఏంటి?” అన్న డౌట్‌ తోనే కూర్చోవాల్సి వస్తుంది. హీరోగా సత్య మళ్లీ తన కామెడీ టైమింగ్ చూపించడానికి ట్రై చేశాడు. కొన్ని వన్‌లైనర్స్, పంచ్‌లు బాగానే పేలుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లు, పేర్లు, సిట్యుయేషన్స్ అన్నీ కలిపి ఒక గందరగోళం. నవ్వాలో, ఆలోచించాలో, లేక పక్క వాళ్లను అడగాలో అనిపించే పరిస్థితి. 


ఇక సెకండ్ హాఫ్‌ లోకి వచ్చేసరికి “ఓహ్… ఇది రివేంజ్ స్టోరీనా!” అని క్లారిటీ వస్తుంది. కానీ అప్పటికి ఆడియెన్స్ పేషెన్స్ ఆల్రెడీ టెస్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఏమాత్రం సాటిస్ఫై అయినట్టు అనిపించదు. ఫైనల్ గా జెట్లీ ఒక ఫుల్ కన్ఫ్యూషన్ ప్యాకెజీ అనిపిస్తది. ఓవరాల్ గా కొత్తగా ట్రై చేసారు గాని, సినిమా మాత్రం అంత లేదు. సినిమా నేరేషన్ లో ఏమాత్రం బలం లేదు. ఇట్స్ ఎ డిస్సపాయింటింగ్ ఫిలిం ఫర్ ఆడియన్స్. 

4.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
"జెట్‌లీ" మూవీ ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి లీనియర్ నెరేషన్‌ను వదిలి, మల్టిపుల్ లేయర్స్‌ తో కథను చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎంగేజిం...

"జెట్‌లీ" మూవీ ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి లీనియర్ నెరేషన్‌ను వదిలి, మల్టిపుల్ లేయర్స్‌ తో కథను చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎంగేజింగ్‌ గా కాకుండా కన్ఫ్యూజింగ్‌ గా మారింది.

హీరోగా సత్య తన పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేశాడు. అయితే, కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల అతని పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.


స్క్రీన్‌ ప్లే ఈ సినిమాకి మెయిన్ ఇష్యూ. ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక ఎమోషనల్ లేదా నేరేటివ్ కనెక్షన్ ఉండాలి. కానీ ‘జెట్‌లీ’లో అది మిస్సైంది. సెకండ్ హాఫ్‌లో రివేంజ్ డ్రామా యాంగిల్ రివీల్ అయినా, అప్పటికి ఆడియెన్స్ ఎంగేజ్‌మెంట్ తగ్గిపోయే అవకాశముంది. టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపించినా, రైటింగ్ మరియు నెరేషన్‌లో మరింత క్లారిటీ ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఓవరాల్ గా

‘జెట్‌లీ’ ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం తడబడింది. సింపుల్ గా చెప్పాలంటే... టేకాఫ్ బానే అయింది గాని, మధ్యలో కొంచెం ఎక్కువ షేక్ అయింది. లోడింగ్ కూడా కొంచెం అవుట్ డేట్ అయి, క్రాష్ లాండ్ అయింది. కానీ అందరూ సేఫ్ అన్నట్టుంటుంది. అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కానీ, జాగ్రత్తగా బైటికి రావచ్చు. 

5.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
‘జెట్‌లీ’ సినిమా చూస్తుంటే ఇదొక స్ట్రైట్ కథ కాదు… పూర్తిగా కన్ఫ్యూజన్ మీద నడిచే నెరేషన్ అనిపిస్తుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి కథను సింపుల్‌గా చెప్పకుండా, గందరగోళంగా ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. హ...

‘జెట్‌లీ’ సినిమా చూస్తుంటే ఇదొక స్ట్రైట్ కథ కాదు… పూర్తిగా కన్ఫ్యూజన్ మీద నడిచే నెరేషన్ అనిపిస్తుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి కథను సింపుల్‌గా చెప్పకుండా, గందరగోళంగా ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. హీరోగా Satya పలు పేర్లు, పలు ఫ్లాష్‌బ్యాక్‌ల మధ్య తానే కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తాడు… అదే ఫీలింగ్ ఆడియెన్స్‌ కూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కాకుండా సాగుతుంది. నవ్వాలా, సీరియస్‌ గా తీసుకోవాలా అనే సందేహం కొనసాగుతూనే ఉంటుంది. చివరికి ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అయినప్పటికీ, అప్పటికి కనెక్షన్ మిస్సయ్యే అవకాశం ఉంది. 


సత్య తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసినా, అది పూర్తిగా వర్కౌట్ అవదు. స్టోరీయే లేనపుడు ఎంత కామెడీ ఉంటే ఎం చేస్తారు. కామెడీని నమ్ముకున్న ప్రతి సినిమా సక్సెస్ అవదు కదా. ఇటు వెన్నెల కిశోర్ కూడా తన వరకు బానే ట్రై చేసాడు గాని, పూర్తి స్థాయిలో సినిమాను మోయలేకపోయాడు. ఓవరాల్ గా డైరెక్టర్ రితేష్ రానా ముందు సినిమాలు చూసి జెట్లీకి ఓటేశారంటే మోసపోతారు. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్తే కొంచెం నవ్వుకునే ఛాన్స్ ఉంది గాని, సినిమా మొత్తం నచ్చాలి అంటే కుదరని పని. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా… కానీ ఎంటర్టైన్‌మెంట్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా మిగిలిపోతుంది.

4.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee movie Review

Sakshi

By Sakshi

కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా నటించిన ‘జెట్‌లీ’ మూవీ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కథనంతో సినిమాను రూపొందించిన దర్శకుడు Ritesh Rana ఈసారి ఆడియన్స్ ని మరింత నవ్వించాలని ట్రై చేసినా,...

కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా నటించిన ‘జెట్‌లీ’ మూవీ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కథనంతో సినిమాను రూపొందించిన దర్శకుడు Ritesh Rana ఈసారి ఆడియన్స్ ని మరింత నవ్వించాలని ట్రై చేసినా, ఆ ప్రయోగం ప్రేక్షకులకు పూర్తిగా చేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథ ఏ దిశగా సాగుతుందో స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ నెలకొంటుంది. హీరో పాత్రలో సత్య ఎలా గందరగోళానికి గురవుతాడో… అదే పరిస్థితి ఆడియెన్స్‌ కి కూడా ఎదురవుతుంది. 


చివరికి కథ రివేంజ్ డ్రామా వైపు మళ్లినా… ఆ భావోద్వేగం ప్రేక్షకులకు బలంగా చేరలేదు. కామెడీ పరంగా కొన్ని సన్నివేశాలు నవ్వించినా, మొత్తం సినిమా స్థాయిలో ఎంటర్టైన్‌మెంట్ తక్కువగానే అనిపిస్తుంది. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక కొత్త ప్రయత్నం అయినప్పటికీ, స్పష్టమైన కథనం లేకపోవడం, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మాత్రం మెచ్చుకోవచ్చు. విమాన వాతావరణాన్ని రియలిస్టిక్ గా చూపించడానికి బాగానే కష్టపడ్డారు. కానీ ఓవరాల్ గా జెట్లీ ప్రయోగం వర్కౌట్ కాలేదు.

4.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee Movie Review

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృ...

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి. 


సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు. ఓవరాల్‌గా జెట్లీ.. కాస్త కామెడీ.. కాస్త కదుపులు అన్నట్టుగా ఉంది. 


5.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee Movie Review

కమెడియన్ గా అంతకంతా ఎదిగిపోతున్న సత్య ఈసారి హీరోగా ట్రై చేసిన మివై ‘జెట్‌లీ’. మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాల పరంగా కూ...

కమెడియన్ గా అంతకంతా ఎదిగిపోతున్న సత్య ఈసారి హీరోగా ట్రై చేసిన మివై ‘జెట్‌లీ’. మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాల పరంగా కూడా సినిమా పూర్తిగా గందరగోళమైన నెరేషన్‌ తో ముగిసినట్టుగా అనిపిస్తుంది. కథని కొత్తగా చూపించాలని ప్రయత్నించినా, కానీ ఆ ప్రయోగం ప్రేక్షకులకు అంతగా అర్థమయ్యేలా రూపుదిద్దుకోలేదు.  


ఇక సత్య తన వరకు బానే నటించాడు. ఇందులో చాలా మంది హీరోల్ని ఇమిటేట్ చేసాడు. సెకండ్ హాఫ్‌ లో కథ కాస్త క్లారిటీకి వచ్చినప్పటికీ, అప్పటికి ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయే అవకాశముంది. అసలు ఇది రివేంజ్ డ్రామా అనే విషయం చివర్లో తెలుస్తుంది. కానీ ఆ ఎమోషన్‌ను బలంగా ఎలివేట్ చేయడంలో సినిమా విఫలమైంది.

వన్‌లైనర్స్, పంచ్‌లు ఉన్నప్పటికీ, అవి విభిన్నంగా కాకుండా సాధారణంగానే అనిపిస్తాయి. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా. ఓవరాల్ గా జెట్ స్పీడ్ లో జెట్లీ విమానం ఎగురుతుంటే.. బ్రూస్ లీ టైపు పంచులతో సత్య చేసే కామెడీ ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి కాస్త మెప్పించొచ్చు, గాని అర్ధం కానీ వారికి ఇదో గందరగోళం సినిమాలా అనిపిస్తుంది.  

5.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee movie Review

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృ...

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి. 


సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు.

4.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee Movie Review

కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న Satya ప్రధాన పాత్రలో నటించిన ‘జెట్‌లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్తు వదలరా ఫ్రాంఛైజెస్ దర్శకుడు Ritesh Rana దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్...

కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న Satya ప్రధాన పాత్రలో నటించిన ‘జెట్‌లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్తు వదలరా ఫ్రాంఛైజెస్ దర్శకుడు Ritesh Rana దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మొదటి రెండు మూవీస్ తో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ జెట్లీ మూవీతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా కథ కథనంలో అంతగా పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ఇక ఈసారి కొత్త స్టైల్‌లో ట్రై చేసినా, అది ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



సినిమా మొదటి భాగం నుంచే కథ ఏ దిశగా సాగుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. సెకండ్ హాఫ్‌ లో కథ కొంత క్లారిటీకి వస్తూ, ఇది రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది. అయితే అప్పటికి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. కామెడీ పరంగా కొన్ని చోట్ల సత్య పంచ్‌లు నవ్విస్తాయి కానీ మొత్తం సినిమా స్థాయిలో ఆ మేజిక్ కనిపించదు. కనీసం స్క్రీన్‌ప్లే లో మరింత క్లారిటీ ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక విభిన్న ప్రయత్నం అయినప్పటికీ, ఎంటర్టైన్‌మెంట్ పరంగా మాత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

4.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee Movie Review

కమెడియన్ కం హీరో సత్య మెయిన్ లీడ్ లో నటించిన జెట్లీ మూవీ తాజాగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కథా, కథనాల గురించి ఏం మాట్లాడకపోవడమే బెటర్. ఎంతకూ మ...

కమెడియన్ కం హీరో సత్య మెయిన్ లీడ్ లో నటించిన జెట్లీ మూవీ తాజాగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కథా, కథనాల గురించి ఏం మాట్లాడకపోవడమే బెటర్. ఎంతకూ ముందుకు కదలని కథ, విసుగు తెప్పించే సన్నివేశాల కారణంగా నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ బూడిదలో పోసిన పన్నేరే అయ్యింది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌ ను ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల కేవలం సైగలకు కూడా అర్థవంతమైన ఆర్. ఆర్. ఇచ్చాడు. లిమిటెడ్ స్పేస్‌లో సినిమాటోగ్రాఫర్ సురేశ్ సారంగం తన ప్రతిభను కనపరిచాడు. 


మేకింగ్ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్‌ లో చెర్రీ, హేమలత ఈ సినిమాకు అవసరమైన దాని కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఎటొచ్చి కథను జడ్జ్ చేసుకోవడంలోనే అట్టర్ ఫెయిల్ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చెర్రీకి, మైత్రీ మూవీస్ వారికి ఈ కథ ఎలా నచ్చిందనే విషయం బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కథే లేకుండా కేవలం కామెడీ సీన్స్ రాసుకుని ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకుడు రితేష్ రానా సినిమా తీసినట్లుంది. ఎంత గాల్లో తీసిన సినిమా అయినా నేలవిడిచి సాము చేస్తామంటే కుదరదు కదా! అందుకే 'జెట్లీ' సినిమా థియేటర్లలో నిరాశతో కూడిన నిట్టూర్పులు, అసహనంతో వచ్చిన అరుపులు వినిపిస్తున్నాయి.


5.0
out of 9
2 months ago
May 04, 2026 Telugu

Jetlee Movie Review

ప్రజాపతి బ్యాంక్ దివాళాతో జెట్లీ సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమ...

ప్రజాపతి బ్యాంక్ దివాళాతో జెట్లీ సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. పొంతనలేని కథనం, అర్ధపర్థం లేని డైలాగ్స్, అసందర్భంగా సాగే కామెడీతో అనుక్షణం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా మూవీ సాగుతుంది. ఫస్టాఫ్ ముగిసే సమయానికే ఈ సినిమా గమ్యం లేని ఫ్లయిట్‌ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. 



ఇక కథలో బలం, కథనం పేలవంగా ఉండటంతో సత్య లాంటి కమెడియన్ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయ్యాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. నాసిరకమైన స్క్రిప్టును కూడా సత్య తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. ఏ పాత్ర కూడా ఆడియెన్స్‌ ను కనెక్ట్ చేసే విధంగా లేకపోవడం వల్ల అజయ్, కబీర్ సింగ్, రియా సింఘా, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్ల నటన నామమాత్రంగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఉన్నంతలో కాలభైరవ తన మ్యూజిక్‌తో కొంత బెటర్‌గా అనిపిస్తాడు. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. ఈ సినిమాలో థియేట్రికల్ వాల్యూ ఎక్కడా కనిపించదు. కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పించే సరుకు సినిమాలో కనిపించదు. కాబట్టి ఈ సినిమా తలరాత ఏమిటో మీకే అర్ధం అయి ఉంటుందనుకొంటా. 

3.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Jetlee Movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
జెట్‌లీ’ అనే సినిమా ఒక ప్రశ్నతో మొదలవుతుంది… “సినిమా అంటే కేవలం కథనా? లేక అనుభవమా?” దర్శకుడు Ritesh Rana ఈ చిత్రంతో కథను చెప్పడం కంటే… ఒక గందరగోళాన్ని అనుభవంగా చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తుంది...

జెట్‌లీ’ అనే సినిమా ఒక ప్రశ్నతో మొదలవుతుంది… “సినిమా అంటే కేవలం కథనా? లేక అనుభవమా?” దర్శకుడు Ritesh Rana ఈ చిత్రంతో కథను చెప్పడం కంటే… ఒక గందరగోళాన్ని అనుభవంగా చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. హీరో Satya ఎదుర్కొనే గందరగోళం… అదే ఆడియెన్స్‌కి కూడా ఫీల్ ఇస్తుంది. పైగా ఇది మాములు ప్రయోగం కాదు… లీనియర్ నేరేషన్‌కి విరుద్ధంగా, విభిన్నమైన నిర్మాణం. కానీ ఈ ప్రయోగం అందరికీ చేరువ అవుతుందా? అనేది ప్రశ్న.


సింపుల్ గా చెప్పాలంటే సినిమా 90 శాతం బొక్క కూడా అర్ధం కాదు అన్నట్టుంటుంది. అలాగే సత్య తన నటనతో, టైమింగ్‌తో కొన్ని క్షణాల్లో మెరిసినా… మొత్తం సినిమాను తన భుజాలపై మోసే స్థాయికి అది చేరలేదు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ తో ఒకే అనిపించేలా ఉంది గాని, థియేటర్లను ఆడియన్స్ ను రప్పిస్తుందా అంటే కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్ గా జెట్లీ సత్య, రితేష్ రానా మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళు కష్టమే. 

5.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
Thyview

By Thyview

‘జెట్‌లీ’ సినిమా చూసాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే — “బాస్… మనం ఏమి చూశాం?” స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇదొక కన్ఫ్యూజన్ రైడ్. హీరో Satya ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో… ఆడియెన్స్ కూడా అలాగే ఫీలవుతారు. అసలు కథ ఏంటి? కామె...

‘జెట్‌లీ’ సినిమా చూసాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే — “బాస్… మనం ఏమి చూశాం?” స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇదొక కన్ఫ్యూజన్ రైడ్. హీరో Satya ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో… ఆడియెన్స్ కూడా అలాగే ఫీలవుతారు. అసలు కథ ఏంటి? కామెడీనా? థ్రిల్లరా? లేక ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఆ? అన్నది అర్థం కాకుండా పోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రకరకాల పేర్లు, ఫ్లాష్‌ బ్యాక్స్, సీన్స్… ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ ప్లేటర్‌ లా ఉంటుంది. నవ్వాలా? సీరియస్‌ గా తీసుకోవాలా? అన్న డౌట్ ఆడియెన్స్‌ కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్లైట్‌ లో చిక్కుకున్నట్టు సినిమా మొత్తం థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది.


డైరెక్టర్ Ritesh Rana కొత్త స్టైల్‌ లో నెరేషన్ ట్రై చేశాడు. కానీ అది స్క్రీన్‌పై వర్క్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌కి దగ్గరగా వచ్చాక ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అవుతుంది… కానీ అప్పటికి ఆడియెన్స్ కనెక్షన్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సత్య కామెడీ, వన్‌ లైనర్స్ కొన్ని చోట్ల వర్క్ అవుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఓవరాల్ గా కొంచెం కొత్తదనం ట్రై చేశారు… కానీ ఎంటర్టైన్‌మెంట్ మాత్రం మిస్సయ్యింది.

5.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu
Why MRO?