Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 505–516 of 1045 reviews

Jetlee movie Review

‘మత్తువదలరా’తో సత్యలోని టైమింగ్‌ను రితేష్ రానా అద్భుతంగా వాడుకున్నాడు. రితేష్ రానా మేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అదే రితేష్ రానా ఇప్పుడు సత్యని హీర...

‘మత్తువదలరా’తో సత్యలోని టైమింగ్‌ను రితేష్ రానా అద్భుతంగా వాడుకున్నాడు. రితేష్ రానా మేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అదే రితేష్ రానా ఇప్పుడు సత్యని హీరోగా పెట్టి ‘జెట్‌లీ’ అని మూవీని తీశాడు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా డిస్సపాయింట్ చేసారు. నటీనటులందరూ బాగానే పెర్ఫార్మ్ చేసినా, మెయిన్ కథను వదిలేసారు. 


ఇక టెక్నికల్‌ గా చూసుకుంటే జెట్‌లీ కి చాలా తక్కువ బడ్జెట్‌ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్, వీఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా నాసిరకంగా కనిపిస్తాయి. ఆర్ఆర్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఆర్ఆర్‌తోనే చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశారు. మాటలు చాలా వరకు మీమ్స్ రిఫరెన్స్‌లానే అనిపిస్తాయి. చాలా సినిమాల మీద కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. పెట్టిన ఖర్చుకి, తీసిన అవుట్‌పుట్‌కి వచ్చే ఫలితానికి సంబంధం ఉండకపోవచ్చేమో. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నారు.. వారిద్దరూ చూసుకుంటారు.. నవ్విస్తారు.. ఎంటర్టైన్ చేస్తారు.. పైగా రితేష్ రానా.. అని ఎక్కువగా ఆశించి వస్తే మాత్రం ఆడియెన్స్ భంగపడతారు. ఓవరాల్ గా జెట్‌లీ చూస్తే థియేటర్స్‌లో ప్రేక్షకుల ఆర్తనాదాలు అని చెప్పుకోవచ్చు.

4.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara movie Review

కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియన్స్ నుం...

కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది జెట్లీ. సినిమా కథ కథనాల పరంగా కూడా అంతగా మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. కాల భైరవ మ్యూజిక్ బీజీఎమ్ బాగుంది.


ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘జెట్ లీ’ సినిమా స్ట్రిక్ట్ గా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే కామెడీ ఫ్లిక్ అని చెప్పొచ్చు. సత్య, వెన్నెల కిషోర్ లతో రితేష్ ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం మాత్రం ప్యాకెడ్ గా లేదు. దర్శకుడు ఈ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సో కొన్ని చోట్ల నవ్వించినా కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టిస్తుంది. తక్కువ అంచనాలతో చూస్తే ఒకసారి ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. 

5.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Jetlee movie Review

Tupaki

By Tupaki

సత్య మెయిన్ లీడ్ లో నటించిన ‘జెట్లీ’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఎ...

సత్య మెయిన్ లీడ్ లో నటించిన ‘జెట్లీ’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉన్నా, ప్రతి ఆడియన్ ఎంతో కొంత కథను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇందులో అంత ఏమి కనిపించలేదు. ఇక సాంకేతికంగా చూస్తే పాటలు లేని ఈ సినిమాలో కాలభైరవ బీజీఎమ్తో కొంత వరకు మెప్పించాడు. రితేష్ రాణా శైలికి తగ్గట్లే అతను ఆర్ఆర్ ఇచ్చాడు. 


సురేష్ సారంగం ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగా చేశారు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక జయేంద్రతో కలిసి రితేష్ రాణా రాసిన కథలో పెద్దగా విషయం లేదు. స్క్రీన్ ప్లే తో మాయ చేయాలని చూసినా.. అది వర్కవుట్ కాలేదు. రితేష్ డైలాగులు మాత్రం ఆకట్టుకుంటాయి. తన రైటింగ్-టేకింగ్ లో తన సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని చోట్ల కనిపించింది కానీ.. అందులో నిలకడ లేకపోయింది. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో రితేష్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా జెట్లీ.. అంచనాలను కుదిపేశాడు. 

4.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara movie review

కర (Kara) 2026 Youtube Channel
Thyview

By Thyview

ధనుష్ నుంచి మరో సినిమా వస్తే ఎక్స్‌ పెక్టేషన్స్ ఆటోమేటిక్‌ గా పెరుగుతాయి. అదే ‘కర’. ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ మాస్ సినిమా కాదని క్లియర్… కానీ థియేటర్‌లోకి వెళ్లాక ఫీల్ ఏమిటి అంటే… “ఇది స్లో కుక్డ...

ధనుష్ నుంచి మరో సినిమా వస్తే ఎక్స్‌ పెక్టేషన్స్ ఆటోమేటిక్‌ గా పెరుగుతాయి. అదే ‘కర’. ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ మాస్ సినిమా కాదని క్లియర్… కానీ థియేటర్‌లోకి వెళ్లాక ఫీల్ ఏమిటి అంటే… “ఇది స్లో కుక్డ్ మూవీ బాస్!” ముందుగా ధనుష్ గురించి మాట్లాడాలి… కరసామి పాత్రలో మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. ఎక్కడా ఓవర్ చేయకుండా, చాలా రియలిస్టిక్‌గా క్యారీ చేశాడు. హీరోయిన్ Mamitha Baiju కూడా చాలా నేచురల్‌గా నటించింది… ఎక్కడా యాక్టింగ్ చేస్తున్న ఫీల్ రావడం లేదు. 


టెక్నికల్‌గా సినిమా బాగానే ఉంది. 90’s వైబ్‌ ను సెటప్ చేసిన విధానం సూపర్. G. V. Prakash Kumar ఇచ్చిన BGM కొన్ని సీన్స్‌ లో బాగా ఎలివేట్ చేసింది… కానీ songs మాత్రం “ఓకే ఓకే” అన్నట్టే..

ఇప్పుడు అసలు విషయం… సినిమా పేస్! First half ఓకే అనిపిస్తుంది… కానీ second half లో కొంచెం లాగ్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు లాంటి సీరియస్ పాయింట్ టచ్ చేసినా… narration కొంచెం tight గా ఉంటే ఇంకో లెవెల్ ఉండేది. ఓవరాల్ గా “కర” అనేది మాస్ మసాలా కాదు కాస్త ఓపికతో చూడాల్సిన రియలిస్టిక్ డ్రామా. దాంతో పాటు అంచనాలు తగ్గించుకొని చూస్తే నచ్చొచ్చు. 

6.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 Website
ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమిత...

ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసి కర స్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన సహజంగా ఉంది. వైట్ కాలర్ క్రిమినల్ తరహా పాత్రను జయరామ్ పోషించారు. పాత్రకు అవసరమైన కన్నింగ్ నేచర్‌ను కేవలం కళ్ళలో చూపించారు. 


ఇక ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు కనెక్ట్ అయ్యే సినిమా 'కర' అని చెప్పాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకుండా లోనులు తీసుకున్న మధ్య తగరతి ప్రజలను కొందరు అధికారులు జలగల్లా పీల్చుకుని తింటున్న సమయంలో ఎదురు తిరిగిన ఓ దొంగ కథ 'కర'. ధనుష్ లేని సినిమాను ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. నిదానంగా మొదలై చివరకు ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది.

6.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 News Channel
తమిళ స్టార్ Dhanush సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆయన నటించిన ‘కర’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా...

తమిళ స్టార్ Dhanush సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆయన నటించిన ‘కర’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, తెలుగులో కూడా అదే స్థాయిలో రిలీజ్ కావడం విశేషం.

ఈ సినిమాలో కరసామి పాత్రలో ధనుష్ తనదైన నటనతో మెప్పించాడు. అలాగే హీరోయిన్‌గా నటించిన Mamitha Baiju సహజమైన నటనతో ఆకట్టుకుంది. పాత్రలకు తగ్గట్టుగా ఇద్దరూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం సినిమాకు ప్లస్‌గా మారింది.

టెక్నికల్ విషయాల్లోకి వెళ్తే, 90వ దశకపు వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. సంగీత దర్శకుడు G. V. Prakash Kumar అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం ఇచ్చింది. అయితే పాటలు మాత్రం పెద్దగా గుర్తుండేలా లేవు. విజువల్స్ నేచురల్‌గా ఉండగా, యాక్షన్ సన్నివేశాలు సాధారణంగా కనిపిస్తాయి.

కథ విషయానికి వస్తే, రైతులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య ఉన్న సమస్యలను టచ్ చేసే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అయితే సినిమా నడక కొంత స్లోగా ఉండటం, కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపించడం మైనస్‌గా మారింది.

మొత్తంగా ‘కర’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకపోయినా, మంచి కంటెంట్‌తో తీసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.

6.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara Movie Review

కర (Kara) 2026 Website
ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్ట...

ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇక హీరోయిన్ మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించగా, తన పాత్రలో డీసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే నటన పరంగా మరింత రాణించాల్సింది. కందస్వామిగా కెఎస్ రవికుమార్ జీవించాడు. ఇక జయరామ్, సూరజ్ కరుణాస్, పృథ్వీ రాజన్ తదితరులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. 


ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. తేని ఈశ్వర్ కథకు తగ్గట్టు కెమెరా వర్క్ బాగా చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మార్క్ సినిమాలో కనిపించలేదు సందర్భానుసారం వచ్చే రెండు పాటలు సోసో… తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుష్ గత చిత్రం 'ఇడ్లీ కడై' కూడా ఇదే తరహాలో తండ్రి సెంటిమెంటుతో వచ్చినదే. ఈసారి కూడా అదే జానర్ సినిమా కావటం వల్ల కర ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

5.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara Movie Review

కర (Kara) 2026 Website
తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు...

తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు కథా కథనాల విషయంలో నిరాశపరచగా, ధనుష్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. కథలో ఆయన పాత్రకు ఉన్న బలం స్క్రీన్‌ పై అంతగా కనిపించలేదు. అలాగే హీరోయిన్ మమిత బైజు నటన కూడా కొంచెం ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపించింది. 


అయితే సీనియర్ నటులు కె.ఎస్. రవికుమార్, ఎం.ఎస్. భాస్కర్ మాత్రం తమ పాత్రల్లో బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇక కర సినిమా మొదటి భాగం సరాసరిగా అనిపించగా, రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగింది. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. ఓవరాల్ గా కర సినిమా ధనుష్ అభిమానులను కూడా మెప్పించలేకపోయింది.

4.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara Movie Review

కర (Kara) 2026 Website
తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు....

తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది. 


టెక్నికల్‌ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా లేవు. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్‌ గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్‌ ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్‌ గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.

5.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 Website
కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియా...

కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం పరవాలేదు.


కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కర సినిమా డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

6.0
out of 9
2 months ago
May 01, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 Youtube Channel
వాలా 2 సినిమా విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏమీ లేదు. కానీ ఉన్న చిన్న లైఫ్ స్టోరీస్‌ ని బాగానే కనెక్ట్ అయ్యేలా చూపించారు. హషీర్, అలన్, అజిన్, వినాయక్ – వీళ్లందరూ కొత్త వాళ్లే కానీ,...

వాలా 2 సినిమా విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏమీ లేదు. కానీ ఉన్న చిన్న లైఫ్ స్టోరీస్‌ ని బాగానే కనెక్ట్ అయ్యేలా చూపించారు. హషీర్, అలన్, అజిన్, వినాయక్ – వీళ్లందరూ కొత్త వాళ్లే కానీ, యాక్టింగ్ విషయంలో మాత్రం సర్ప్రైజ్ ఇస్తారు. ఫేక్ ఫీలింగ్ లేదు… నేచురల్ వైబ్స్ ఉంటాయి. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ అంటే ఫుల్ టైం పాస్. ఫ్రెండ్స్, ఫన్, కామెడీ… థియేటర్‌ లో స్మైల్ తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయి. కానీ… సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా కాస్త స్లో అవుతుంది.


అక్కడక్కడా లాగ్ అనిపించే ఫీల్ ఉంటుంది. అయినా క్లైమాక్స్ మాత్రం గేమ్ ఛేంజర్. ఫ్యామిలీ ఎమోషన్స్, రియలైజేషన్… మిడిల్ క్లాస్ వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. టెక్నికల్‌గా ఓకే… మ్యూజిక్, విజువల్స్ డీసెంట్. కానీ డబ్బింగ్ ఇంకాస్త బెటర్ అయితే ఫీల్ డబుల్ అయ్యేది. ఓవరాల్ గా “వాలా 2” అంటే హై వోల్టేజ్ సినిమా కాదు. కానీ ఫ్రెండ్స్‌ తో కూర్చుని కూల్‌ గా చూడొచ్చు. లైట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ తో వెళ్తే… మంచి ఫీల్ గుడ్ మూవీగా వాలా 2 ని థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయొచ్చు.

6.0
out of 9
2 months ago
Apr 28, 2026 Telugu

Vaazha 2 Movie Review

వాలా 2 (Vaazha 2) 2026 Youtube Channel
కొన్ని సినిమాలు చూస్తుంటే… అవి కథలు కాకుండా మన జీవితాలే అన్న భావన కలుగుతుంది. అలాంటి ఫీల్ ఇచ్చే సినిమాల్లో తాజాగా చేరింది ‘వాలా 2’. మూవీలో అందరూ పరిచయం లేని వాళ్లే అయినా వాళ్ళు మాములుగా నటించలేదు… జీవ...

కొన్ని సినిమాలు చూస్తుంటే… అవి కథలు కాకుండా మన జీవితాలే అన్న భావన కలుగుతుంది. అలాంటి ఫీల్ ఇచ్చే సినిమాల్లో తాజాగా చేరింది ‘వాలా 2’. మూవీలో అందరూ పరిచయం లేని వాళ్లే అయినా వాళ్ళు మాములుగా నటించలేదు… జీవించారు అనిపించేంత నేచురల్‌గా తమ పాత్రలను మోశారు. దర్శకుడు సావిన్ SA కథను ఎక్కడా అతి చేయకుండా, చిన్న చిన్న క్షణాల ద్వారా పెద్ద భావాలను చెప్పాడు.


సినిమా మొత్తం ఒక స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు, ఫ్రెండ్షిప్, యూత్ ఫ్రీడమ్… ఇవన్నీ లైట్‌గా తీసుకెళ్తుంటే, సెకండ్ హాఫ్‌లో అదే జీవితానికి సంబంధించిన బాధ్యతలు, దూరాలు, మానసిక మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్… ఎలాంటి హంగులు లేకుండా, మనసును నెమ్మదిగా తాకేలా మలిచారు. ఓవరాల్ గా పేర్లేదు అనిపించేలా ఉంటుంది. కాకపోతే తెలుగు డబ్బింగ్‌లో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే అనుభూతి మరింత పెరిగేది. ముఖ్యంగా కొన్ని ప్రాస కోసం చెప్పిన డైలాగులు అంతగా సెట్ అవలేదు. ఇదంతా పక్కన బెడితే ఓవరాల్ గా వాలా 2 సినిమాని డీసెంట్ వాచబుల్ మూవీగా ఎంజాయ్ చేయొచ్చు.


6.0
out of 9
2 months ago
Apr 28, 2026 Telugu
Why MRO?