Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

826
Total Reviews
Showing 145–156 of 826 media reviews
సింగ్ గీతం (Sing Geetham)

Sing Geetham Movie Review

చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్...

చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్ గా భయపడ్డ! ఈ పాడడం అది వర్కౌట్ అవుతుందా అని! బట్ ఎస్ వర్కౌట్ అయింది. అండ్ ట్రైలర్ లో రివీల్ చేయని పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి స్క్రీన్ మీద థ్రిల్ నిస్తాయి. ఓవరాల్ గా సినిమాలో ఎక్కడా ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. మేకింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ కాన్సెప్ట్ సూపర్ అసలు. 


అండ్ జంబలకడి పంబలా కాన్సెప్ట్ ఉంది. కాకపోతే కొంతమందికి లిప్ సింక్ కుదరలేదు. అండ్ సినిమాలో అయితే అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. డిఎస్పీ గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యూనిక్ ఉన్న సినిమా. మంచి మెస్సేజ్ ఉన్న సినిమా అందరూ హ్యాపీగా చుడండి. 


7.0
out of 10

Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing Geetham movie Review

#SingGeetham సింగ్..గీతం : రేటింగ్ కు దూరంసింగీతం సృజన....నాగ్ అశ్విన్ కృషి....వైజయంతీ అభిరుచిమంచి విషయాల మీద మంచి సినిమాలు రావు అని..చెత్త సినిమాల మీద సదా సణిగేవారంతా..ఈ సినిమా చూడండి.నోట్ : కాస...

#SingGeetham సింగ్..గీతం : రేటింగ్ కు దూరం


సింగీతం సృజన....నాగ్ అశ్విన్ కృషి....వైజయంతీ అభిరుచి

మంచి విషయాల మీద మంచి సినిమాలు రావు అని..

చెత్త సినిమాల మీద సదా సణిగేవారంతా..

ఈ సినిమా చూడండి.


నోట్ : కాస్త ఓపిక..అభిరుచి వుండాలి.

ఇది భూమిలో వున్న బంగారం కోసం ఆశపడి భూమి పై వున్న పచ్చటి బంగారాన్ని పాడుచేసుకున్న ఊరి కథ...


పట్టిందల్లా బంగారం అయితే బతుకు ఎంత దారుణంగా వుంటుందో

చెప్పిన ‘మిడాస్ టచ్’ మనుషుల వ్యధ...


బంగారం సంగతి అలా వుంచితే, మైనింగ్ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వసాన్ని పరోక్షంగా తెలియ చెప్పిన వ్యవస్థ వైనం.


7.0
out of 10

Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing Geetham movie Review

#SingGeetham Unique concept with its ups and downs, but deserves a try!A genuinely unique attempt that takes time to find its footing. The musical aspect works initially but starts to feel stretched i...

#SingGeetham Unique concept with its ups and downs, but deserves a try!


A genuinely unique attempt that takes time to find its footing. The musical aspect works initially but starts to feel stretched in the middle portions, while the comedy only lands in bits. However, the film’s core lies in the emotional second half, and from the flashback till the climax, the emotional payoffs land well.


DSP’s music is the film’s biggest backbone and this is his best work in recent times. Kudos to Singeetham Srinivasa Rao and the Vyjayanthi team for attempting an unconventional concept like this.


May not be everyone’s cup of tea, but its uniqueness and emotional payoffs make it a decent watch that deserves a try.


Rating: 2.75/5

6.0
out of 10

Above Average

సింగ్ గీతం (Sing Geetham)

Sing Geetham movie Review

సోషియో ఫాంటసీ మూవీస్ తెలుగులో కొత్తేమీ కాదు. ఈ సింగ్ గీతం సినిమా కూడా అలాంటిదే! సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) మొదటి నుండి కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలని తాపత్రయపడే వ్యక్తి...

సోషియో ఫాంటసీ మూవీస్ తెలుగులో కొత్తేమీ కాదు. ఈ సింగ్ గీతం సినిమా కూడా అలాంటిదే! సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) మొదటి నుండి కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలని తాపత్రయపడే వ్యక్తి. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ సినిమాను కేవలం ప్రయోగాత్మకంగానే కాకుండా ప్రయోజనాత్మకంగానూ రూపొందించే ప్రయత్నం చేశారు. ఇది అభినందించాల్సిన విషయం. 


ఇక భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని కాపాడాలని, దాన్ని కొల్లగొట్టి బంగారం సంపాదించినా ఉపయోగం ఉండదని ఈ సినిమా ద్వారా తెలిపారు. తాను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలనే వరం ఇవ్వమని ఓ అత్యాశపరుడు దేవుడిని కోరుకోవడం, దాని పర్యావసానంకు సంబంధించిన కథ చాలా మంది చిన్నప్పుడు చదివి ఉంటారు. అదే ఇందులోనూ చూపించారు. పోగొట్టుకుంది రాబట్టు కోవాలంటే... పడగొట్టింది నిలబెట్టాలనే సందేశంతో సినిమా సాగింది. సినిమా కంటెంట్ బాగానే ఉన్నా, సామాన్య ప్రేక్షకుడు కోరుకునే వినోదాన్ని 'సింగ్ గీతం' పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వచ్చిన ఆడియన్స్ నిరాశకు గురికావటం ఖాయం. అయితే... పర్యావరణ హితాన్ని కాంక్షించే వారి మనసుల్ని ఈ సినిమా మెప్పిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ట్యాగ్ లైన్: సందేశాత్మకం... సింగ్ గీతం.


7.0
out of 10

Hit

పెద్ది (Peddi Movie)

Peddi Movie Review

పెద్ది... ప్రెసెంట్ హిట్ లేని టాలీవుడ్ ని సేవ్ చేయడానికి వస్తుందనిపించింది. టీజర్ సాంగ్స్ తో హోప్స్ వచ్చాయి. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే సినిమా అబొవ్ యావరేజ్ అనిపించింది. కొంత ఇన్స్పైరింగ్ గా ఉండడం...

పెద్ది... ప్రెసెంట్ హిట్ లేని టాలీవుడ్ ని సేవ్ చేయడానికి వస్తుందనిపించింది. టీజర్ సాంగ్స్ తో హోప్స్ వచ్చాయి. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే సినిమా అబొవ్ యావరేజ్ అనిపించింది. కొంత ఇన్స్పైరింగ్ గా ఉండడం వల్ల కొంత నచ్చింది. సేమ్ చందు ఛాంపియన్ మూవీ స్టోరీల ఉంది. బట్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ సాలిడ్ గా ఉంది. ఇక జాన్వీ కపూర్ రోల్ ఇబ్బంది కరంగా ఉంటుంది. 


రామ్ చరణ్ గారు 200 పెర్సెంట్ సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ కూడా ఉన్నంతవరకు బాగా చేసారు. ఇక క్లైమాక్స్ లో దేశం కోసం సైనికుడు ఎంత సేవ చేస్తారో, ఆటగాడు కూడా అంతే సేవ చేస్తారు అని క్లైమాక్స్ లో చెప్పారు. బట్ సినిమాలో గుర్తింపు కోసమే అంత కష్టపడతాడు అని ముందే తెలిసిపోవడం, చాలా సీన్స్ ని గెస్ చేయడం వల్ల సినిమా కొంచెం డిస్సపాయింట్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా చూసేవాళ్లకు నచ్చోచ్చు. టోటల్ ఫ్రెష్ స్టోరీగా ఇమాజిన్ చేసుకుని చూస్తే లైట్ గా డిస్సపాయింట్ అవుతారు. 

6.0
out of 10

Above Average

పెద్ది (Peddi Movie)

Peddi movie Review

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది(Peddi Movie) సినిమా వచ్చేసింది. చప్పగా సాగుత...

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది(Peddi Movie) సినిమా వచ్చేసింది. చప్పగా సాగుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోయడానికి వచ్చిన పెద్ది అనుకున్నట్టుగానే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాడు. ఇక కథ మరీ అద్బుతం అనిపించే కథ ఏమి కాదు, చాలా నార్మల్ స్టోరీనే డైరెక్టర్ తీసుకుని హీరోకి ఆ పాయింట్ చుట్టూ పెర్ఫార్మెన్స్ కి అలాగే ఎలివేషన్స్ కి మంచి స్కోప్ ఉండేలా కథని ప్రిపేర్ చేసుకున్నాడు.


ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఎంచుకున్న పాయింట్ బాగున్నా తన ఎక్స్ పీరియన్స్ అంతంత మాత్రమె అవ్వడంతో, రామ్ చరణ్ రోల్ వరకు ఎమోషనల్ క్లైమాక్స్ వరకు మెప్పించాడు, కానీ మిగిలిన కథని సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. అలా అని సినిమా మరీ బోర్ ఫీల్ అయ్యేలా ఏం చేయదు. మూడు గంటల లెంగ్త్ లో కొన్ని సీన్స్ కొంచం క్రింజ్ లా అనిపించినా కూడా, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ అంతా కూడా బాగా ఆకట్టుకుని ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు.

అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు రోల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. రంగస్థలంకి ఏమాత్రం తీసిపోని యాక్టింగ్ తో రామ్ చరణ్ ప్రతీ సీన్ లో కుమ్మేశాడు. తన కష్టం కోసం ఈజీగా సినిమాను చూసేయోచ్చు. 

7.0
out of 10

Hit

పెద్ది (Peddi Movie)

Peddi movie review

Gulte

By Gulte

Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teame...

Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teamed up with a one-film-old director, Buchi Babu Sana, for a multi-sport drama, Peddi.


1.⁠ ⁠Ramcharan’s Terrific Performance

2.⁠ ⁠Inspiring Emotional Drama

3.⁠ ⁠Second Half

4.⁠ ⁠R. Rathnavelu Cinematography

5.⁠ ⁠A. R. Rahman’s Music


Negatives:


1.⁠ ⁠Janhvi Kapoor’s Role In The First Half

2.⁠ ⁠Visual Effects In Pre-Interval Sequence

3.⁠ ⁠Special Song Placement


Final Verdict: Ramcharan Wins Gold


Rating – 3/5

7.0
out of 10

Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing geetham movie Review

సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయ...

సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం రావట్లేదు. అందుకే లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమాలు ఎలా తీయాలో నేర్పించినట్టనిపించింది. సింపుల్ స్టోరీయే అయినా డైరెక్టర్ తన విజన్ తో మనకి బాగా అర్ధమయ్యేట్టు బాగాచూపించారు. అండ్ సినిమాలో ఎక్కడా కూడా ఒక సెకండ్ వెస్ట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు బెస్ట్ అనిపించింది ఈ సినిమా. 


అండ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఎస్పీ. సీరియస్లి బ్రో సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బేసిగ్గా గోల్డ్ మైన్, చెట్టు సెంటిమెంట్ అంతా ఒకే గాని, దానికి మూలం, ఒక మనిషి ఆశ అత్యాశగా ఎప్ప్పుడు మారుతదో అప్పుడే నెక్స్ట్ వచ్చే తరాలు ఎంత నాశనమైతాయో సినిమాలో బాగా చూపించిన్రు. ఓవరాల్ గా ఇదంతా సింగీతం గారి మ్యాజిక్కె. ఎందుకంటే చాలా సినిమాలు రిస్క్ చేయకుండా, కొత్తదనం లేకుండా సేఫ్ జోన్ లో ఉండాలని మేకర్స్ ట్రై చేస్తారు. వాళ్లకి ఈ సినిమా చూపించాలి. అండ్ ఓవరాల్ గా సింగీతం సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకింత బాగా నచ్చుతదని.. సింగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో తెల్వదు గాని, ఈ సినిమాకైతే హ్యాపీగా వెళ్లిపోవచ్చు. 





8.0
out of 10

Super Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing geetham movie Review

Thyview

By Thyview

ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని...

ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని అభినందించాలి. ఇక సినిమాలో చెప్పినట్టు కుబేరపురంలో మాటలు పాటలుగా మారే శాపం నుండి ఊరి మొత్తం ఎలా బైటపడిందన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇక సింగీతం గారు ఈ సినిమాని చివరి వరకు ఒక అందమైన కథలా ప్రెజెంట్ చేసారు. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ హవర్ అదిరిపోయింది. అండ్ ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇక సినిమాలో కొంతమంది ఎంటర్టైన్మెంట్ తగ్గిందని, బోరింగ్ గా ఉందని అనుకోవచ్చు. బట్ సింగీతం మూవీస్ అన్ని అలా డీసెంట్ గానే ఉంటాయి. ఓవర్ గా అస్సలుండవ్. అండ్ సింగీతం గారు మళ్లీ మ్యాజిక్ చెసార్రా అంటూ మూవీ లవర్స్ హ్యాపీగా బైటికొచ్చారు. అండ్ సినిమాలో లాస్ట్ లో ఒక ఫేమస్ ఆక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దానికి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్లీ సింగ్ గీతం సినిమాకి ఫ్యామిలీని, స్పెషల్లీ కిడ్స్ ని తప్పకుండ థియేటర్ కి తీసుకెళ్లండి. 


8.0
out of 10

Super Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing geetham movie review

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోత...

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం.



సినిమాలో ఓవరాల్ గా చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. అంటూ ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం గారు. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం. ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!


7.0
out of 10

Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing geetham movie Review

మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. ద...

మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. దర్శకుడిగా ఎప్పుడూ అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో వచ్చే సింగీతం శ్రీనివాస రావు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో

మాటల బదులు పాటలు, పాట రూపంలో ప్రతి మాట - ఇదేనా 'సింగ్ గీతం'? కథలో ఉన్నది అంతేనా? అంటే... అసలు కాదు. ప్రేక్షకులకు అదొక సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ అంతే! ఆ పాటల మాటున మంచి ఎమోషన్ ఉంది. అంతర్లీనంగా ప్రకృతి గురించి ప్రజలకు ఇచ్చిన ఓ సందేశం ఉంది.


క్రియేటివిటీకి వయసుతో సంబంధం లేదని సింగీతం శ్రీనివాస రావు నిరూపించిన సినిమా 'సింగ్ గీతం'. కమల్ హాసన్ హీరోగా సినిమా తీయాలని సుమారు 40 ఏళ్ళ క్రితం ఈ కథ రాశారట. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ... ప్రేక్షకులందరికీ కొత్తగా అనిపించే కాన్సెప్ట్ 'సింగ్ గీతం'. ఇందులో కొత్త కాన్సెప్ట్ ఒక్కటే కాదు... రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో మేజిక్ చేసిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. హృదయానికి హత్తుకునే క్లైమాక్స్ ఉంది. ఇక కమర్షియల్ సినిమాలు అలవాటు పడిన, వాటిని ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. కానీ... థియేటర్లలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందీ సినిమా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.

7.0
out of 10

Hit

సింగ్ గీతం (Sing Geetham)

Sing Geetham movie review

భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా...

భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం చాలా అరుదుగా కనిపించే ప్రయత్నం. 


ఇక సినిమాకు DSP సంగీతం కథలో భాగమైపోతుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు, లాజిక్ గ్యాప్స్ ఉన్నా, దర్శకుడి విజన్ వాటిని అధిగమిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ కొత్త కథనాలను, సృజనాత్మక ఆలోచనలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా చూడదగ్గ చిత్రం. ఓవరాల్ గా ఈ సింగ్ గీతం మూవీ ఓ సాహసం, ఓ ప్రయోగం ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయాల్సిన సినిమాటిక్ జర్నీ. అయితే కొన్ని సినిమాలను రేటింగ్ లతో కొలవలేం. ఇది కూడా అంతే. కానీ దాదాపు క్లాసిక్ గానే ఈ సినిమాని భావించొచ్చు. 

7.0
out of 10

Hit

Why MRO?