Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1033
Total Reviews
Showing 13–24 of 1033 media reviews
బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

Bethlehem Kudumba Unit movie review

మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్ర...

మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్తమ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినోదం విషయంలో ఈ సినిమా ‘ప్రేమలు’ స్థాయిని గుర్తుచేస్తూ చివరివరకు ఆకట్టుకుంటుంది.


దర్శకుడు గిరీష్ ఏడీ ‘ప్రేమలు’ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో హిట్ కొట్టారు. హింస, క్రైమ్ ప్రధానంగా సాగే సినిమాల నడుమ ఇలాంటి ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీలు రావడం ప్రేక్షకులకు మంచి ఊరట. ఓవరాల్‌ గా చెప్పాలంటే, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చక్కని రొమాంటిక్ కామెడీ డ్రామా. నివిన్ పౌలీ, మమితా బైజుల నటన, దర్శకుడు గిరీష్ ఏడీ మార్క్ హిలేరియస్ కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌లో కాస్త సాగతీతను తగ్గించి, భావోద్వేగాల తీవ్రత మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా హాయిగా చూసి నవ్వుకోదగ్గ మంచి చిత్రమిది. ఈ వీకెండ్‌ కు నిరభ్యంతరంగా థియేటర్‌లో చూడొచ్చు.

7.0
out of 10

Hit

బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

Bethlehem Kudumba unit movie review

 బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్...

 బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్మాయి.. 90స్ అబ్బాయిని జత కలిపి ఓ ప్రేమ కథను అల్లుకున్నారు. అమ్మాయిలోని అల్లరి తనం, అబ్బాయిలోని అమాయకత్వాన్ని జోడించి రాసుకున్న సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. తెరపై నివిన్ పౌలీ, మమిత జంట బాగుంటుంది. ఇద్దరూ తమ తమ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద ఎలివేషన్స్, దెబ్బకు వంద మందిని గాల్లోకి లేపేయడం, విపరీతమైన రక్తపాతం ఏమీ లేని ఓ సింపుల్ లవ్ అండ్ కామెడీగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.



ఇక సినిమాలో టెక్నికల్‌ గానూ చాలా వరకు ఓ పెయింటింగ్‌లా అనిపిస్తుంది. కేరళ అందాలు కనువిందుని చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ కూడా చాలా సింపుల్‌ గానే కనిపించినా ఎంతో ఎఫెక్టివ్‌ గా అనిపిస్తాయి. చివరగా.. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ అనే టైటిల్ చూసి.. ఇదేదో వెరైటీ సినిమా అనుకోకండి.. ఇది జెన్ జీ అమ్మాయి, 90స్ అబ్బాయి క్యూట్ ప్రేమ కథ.


7.0
out of 10

Hit

బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

Bethlehem kudumba unit movie review

#BethlehemKudumbaUnit A Fun Rom-Com That Keeps Things Simple and Entertaining!Sensible and lighthearted take on an age-gap love story. First half is fun and filled with small moments that keep you smi...

#BethlehemKudumbaUnit A Fun Rom-Com That Keeps Things Simple and Entertaining!


Sensible and lighthearted take on an age-gap love story. First half is fun and filled with small moments that keep you smiling, while the second half maintains the same flow before dipping in the middle and starts to feel stretched out in the pre-climax with some drag and an out of place fight. However, the simple yet heartwarming climax brings it back together nicely.


Nivin Pauly plays the older role perfectly, while Mamitha once again steals the show. It relies on familiar rom com tropes and doesn’t offer anything particularly new, but remains entertaining throughout with a few heartwarming moments along the way. Girish AD delivers another enjoyable rom com after Premalu. Winner!!


Rating: 3/5

7.0
out of 10

Hit

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie Review

రోమాంచకం... సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని జోక్స్ నవ్వించాయి. ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్...

రోమాంచకం... సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని జోక్స్ నవ్వించాయి. ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఒక లవ్ స్టోరీలో ఉండే సీన్స్ కి ఎస్టాబ్లిష్ అనిపించలేదు. అస్సలు నచ్చలేదు నాకు. దీనికి థియేటర్లలో చూడ్డం వర్త్ కాదని అనిపిస్తుంది. ఇక ఫ్యామిలితో చూడొచ్చా అంటే... కొన్ని డైలాగ్స్, సీన్స్ ఇబ్బందిగా అనిపించొచ్చు.. కానీ చూసేలానే ఉంది. 


ఇక సుమంత్ ప్రభాస్, అనంతిక బాగా చేసారు. మ్యూజిక్ బాగుంది, రెండు సాంగ్స్ వినాలనే ఉన్నాయి. మూవీ లో ఎంటర్టైన్ అయ్యే సీన్స్ ఎక్కువ ఎం లేదు. అసలు సినిమాలో పెద్ద మైనస్ కథే అవుతుంది. హీరో హీరోయిన్ తెలియకుండానే, పెద్ద పరిచయం కూడా లేకుండానే డీప్ లవ్ లో ఉంటారు. అందుకే అక్కడ ఎమోషన్స్ సీన్స్ అస్సలు పండలేవు. డైరెక్టర్ కూడా లవ్ ఫీల్ వచ్చేలా ఎం లేదని తెలిసే, ఫ్రెండ్స్ కామెడీ పై ఫోకస్ చేసినట్టున్నాడు. సినిమా చాలా స్లో మోషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఫైనల్ గా ఈ మూవీకి నా రివ్యూ ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అస్సలు కలగలేదు. ఓవరాల్ గా చూస్తే... నా రేటింగ్ ఇవ్వాలంటే 2\5. 

5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

రోమాంచకం మూవీ రివ్యూ.. అసలు ఆ సినిమా పదం అర్ధం ఏంటని గూగుల్ రివ్యూ చేశాను... థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్, గూస్బంప్స్ ఇండ్యూసింగ్ అని... అర్ధం. అంటే సినిమా ఇలా ఉంటదని తీసారా? లేక ఇవి తప్ప మిగతావన్ని ఉంటాయన...

రోమాంచకం మూవీ రివ్యూ.. అసలు ఆ సినిమా పదం అర్ధం ఏంటని గూగుల్ రివ్యూ చేశాను... థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్, గూస్బంప్స్ ఇండ్యూసింగ్ అని... అర్ధం. అంటే సినిమా ఇలా ఉంటదని తీసారా? లేక ఇవి తప్ప మిగతావన్ని ఉంటాయని తీసారా అని అర్ధం కాలేదు. నాకైతే రెండోదనే అనిపించింది. ఇక ఈ సినిమా గురించి ఏం చెప్పడం అంటే ఏముంటది అసలు ఏం లేదు. సినిమాలో హీరో ఎదో డేటింగ్ అప్ పెడతాడు. 


అండ్ సినిమాలో అసలు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఎలా మొదలైందో కూడా తెలీదు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు కలిసేదే కొన్ని రోజులు... కాదు కొన్ని గంటలనే చెప్పాలి. అందులో ఎక్కడ లవ్ మొదలయ్యిందేమో క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకంటే ఘోరం ఎమోషన్స్.. అస్సలు కనెక్ట్ అవలేం. చాలా సీన్లు ఎదో పెట్టాలని పెట్టినట్టు అనిపిస్తది. ఏ సీన్ ఎందుకు పెట్టారో మేకర్స్ కైనా అర్థమైందా లేదా అనిపిస్తుంది. మరెంటో లెక్క అర్ధం కాలేదు. అండ్ సినిమాలో ఏవో ఆడపిల్లల కష్టాలు అంటూ ఏదేదో సంబంధం లేకుండా చెప్తారు. ఇక క్లైమాక్స్ లో రెండు మూడు ఇరికించిన జోకులుంటాయి. ఓవరాల్ గా నాకైతే అస్సలు ఎక్కలేదు. 

5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie Review

రోమాంచకం సినిమా ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి అటెన్షన్‌ రాబ‌ట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్...

రోమాంచకం సినిమా ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి అటెన్షన్‌ రాబ‌ట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్‌ ను, కామెడీని జ‌త చేసి న‌వ్వించే ప్ర‌య‌త్నాలు చేశారు, గానీ ఇప్ప‌టికే వంద‌ల కొద్ది సినిమాల్లో చూసిందే మ‌ళ్లీ ఇక్క‌డ కూడా రిపీట్ అవుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌ పెట్టినట్టు అయ్యింది. సినిమా చూసే ప్రేక్ష‌కుడికి త‌ర్వాత జ‌ర‌గ‌బోయేదేంటో ఇట్టే తెలిసి పోతూ రొటీన్‌ గా సాగిపోతుంది. 


మొద‌టి నుంచి రొమాంటిక్ మూవీ అంటూ చెప్పుకొచ్చిన‌ప్ప‌టికీ ఓ పాట‌లో మిన‌హా మ‌రెక్క‌డా ఆ ల‌వ్ అనేది కనిపించదు. ఆ మేర‌కు హీరోహీరోయిన్ల మ‌ధ్య బ‌ల‌మైన‌ స‌న్నివేశాలు సైతం లేవు. ఇక క్లైమాక్స్ అయితే ఇటీవ‌ల వ‌చ్చిన 'పాపం ప్ర‌తాప్' క్లైమాక్స్‌ను గుర్తు చేసి అస‌లు ఏం జ‌రుగుతుందిరా, ఎందుకురా ఇదంతా అనిపిస్తుంది. ఎడిటింగ్‌, డైలాగుల విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. అయితే సినిమా క్యాప్ష‌న్‌ లో చెప్పిన‌ట్టుగా ప్రేమ లోపించినా అక్క‌డ‌క్క‌డ హాస్యంతో న‌వ్వించారు. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే.. జెన్ జీ, నిబ్బిల‌కు ‘రోమాంచకం. 



5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

మన ఈ బిజీ లైఫ్ లో, కాసేపు టెన్షన్స్ అన్ని పక్కనబెట్టి, మన ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఏసుకుని వెళ్లి, సరదాగా 2 hours ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకెళ్ళండి. ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఫన్ ఉంటుంది. మీ స్ట్ర...

మన ఈ బిజీ లైఫ్ లో, కాసేపు టెన్షన్స్ అన్ని పక్కనబెట్టి, మన ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఏసుకుని వెళ్లి, సరదాగా 2 hours ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకెళ్ళండి. ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఫన్ ఉంటుంది. మీ స్ట్రెస్ అంతా తీసేసుకున్నట్టుంటది. చాలా రోజుల తర్వాత ఒక ప్లెజెంట్ సినిమా చూసిన ఫీల్ ఉంటది. ఇలాంటి సినిమా ఒక మంచి రిలీఫ్ఇస్తుంది. నా సజ్జెషన్ ఏంటంటే ఈ వీకెండ్ ఎల్లి ఫ్రెండ్స్ బ్యాచ్ తో ఈ సినిమాని చూసేయండి. 


ఎక్కువగా సీరియస్ గా ఏ పాయింట్ ని డీల్ చేయకుండా, అంటే డీల్ చేయడానికి సినిమాలో చాలా పాయింట్స్ సీరియస్ గా ఉన్నాయి. అంటే వాటిని కూడా ఒక ఫన్ టోన్ లో డీల్ చేస్తూ, ఇంసెంట్ ఆక్చుఅల్లి ఒక మంచి మెసేజ్ చెప్తూ అది కూడా ప్రీచి గా ఉండడానికి ట్రై చేసారు. కానీ సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. కొన్ని సీన్స్ అయితే ఫ్రెండ్స్ మధ్యలో జరిగే conversations సీన్స్ బాగుంటాయి. పెర్ఫార్మన్స్ వైస్ అందరూ బాగా చేసారు. టెక్నికల్లి కూడా సినిమా బాగుంది. చాలా రోజులయింది ఇలానే స్ట్రెస్ బస్ ఉన్న సినిమా చూసి. స్టోరీ వైస్ గా చూస్తే రొటీన్ స్టోరీయే. ఓవరాల్ గా మంచి సినిమా ఇది వీకెండ్ లో ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయండి. 

7.0
out of 10

Hit

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

Tupaki

By Tupaki

ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. క...

ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.


హీరో హీరోయిన్ల కంటే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఫేమ్ నరేంద్ర రవి పాత్ర సెకండాఫ్ ను కొంత ఎంగేజింగ్ గా మార్చింది. సినిమాలో క్లైమాక్స్ బాగానే పండింది. అక్కడ కూడా కామెడీ వర్కవుట్ అయింది. ట్విస్టు ఓకే. ‘రోమాంచకం’ టైటిల్ కు న్యాయం చేసే సినిమా కాదు. ఓవరాల్ గా కథాకథనాల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఆశిస్తారు. చివరగా ‘రోమాంచకం’ టైటిల్‌ కు తగ్గ రోమాంచనం లేకపోయినా.. టైంపాస్ బడ్డీ కామెడీ కోసం ఓ లుక్కేయొచ్చు!

5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

Thyview

By Thyview

‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ...

‘రోమాంచకం’ మూవీని సందీప్ రెడ్డి వంగ ప్రెసెంట్ చేసారు... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఆక్చుయల్లి మూవీ టైటిల్ చూసి, ప్రొడక్షన్ హౌస్ చూసి, అలాగే ప్రమోషన్స్ వల్ల మంచి హై తో సినిమాకెళ్ళాను. కానీ మూవీ లో అస్సలు అంత ఏం లేదు. సినిమా మెయిన్ లీడ్ మధ్య అసలు కెమిస్ట్రీ కూడా లేదు. అసలు హీరో హీరోయిన్లు ఎందుకు లవ్ చేసుకుంటారో కూడా అర్ధం కాదు. 


అసలు ఈ సినిమాలో ప్లస్ ఏమున్నదంటే కామెడీ.. అది తప్ప ఇంకేమి బాగా లేదు. సినిమాలో కథేంటంటే... హీరో ఓ అప్ స్టార్ట్ చేస్తాడు. ఆ అప్ ద్వారానే హీరోయిన్ ని మీట్ అయ్యి లవ్ చేస్తాడు. కానీ అసలు వీళ్ళ మధ్య లవ్ జెనరేట్ అవ్వడానికి ప్రాపర్ రీసన్ కూడా ఉండదు. సినిమాలో నరేంద్ర రవి కామెడీ హైలెట్ అయింది. అసలు సినిమాలో రైటింగ్ స్ట్రాంగ్ ఉంటె ఎంతో కొంత నచ్చేది. సుమంత్ క్యారెక్టరైజేషన్ బాగున్నా, దానికి జస్టిఫికేషన్ ఉండదు. ఇక హీరోయిన్ అనంతిక కు చాలా లిమిటెడ్ స్క్రీన్ టైం వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాని కామెడీయే కాపాడాలి. ఇంక సినిమా గురించి చెప్పేదేం లేదు. 


5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam Movie Review

#Romanchakam REVIEW: #iDreamMedia Rating (2.25/5)కుర్రకారు కామెడీ సినిమా..పెద్దగా కథ ఏమీ వుండదు..సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమేనవ్వు వచ్చిన చోట నవ్వడం…నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.మ్యాడ్-పంచతంత...

#Romanchakam REVIEW:

#iDreamMedia Rating (2.25/5)


కుర్రకారు కామెడీ సినిమా..

పెద్దగా కథ ఏమీ వుండదు..


సీన్లు సీన్లుగా చూసుకుంటూ వెళ్లడమే

నవ్వు వచ్చిన చోట నవ్వడం…


నవ్వు రాని టైమ్ లో వెయిట్ చేయడం.

మ్యాడ్-పంచతంత్రం ల సినిమాల ఇమిటేషన్


ప్లస్ పాయింట్లు


కామెడీ


మైనస్ పాయింట్లు


ఆరంభంలో కొంత


మలిసగం మధ్యలో మరి కొంత


పంచ్ లైన్: పరాచకం

5.0
out of 10

Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dial...

#Romanchakam Artificial Short Film Vibes With Only a Few Comedy Scenes Working!


Film is boring for most of its runtime, with tiring staging, barely any plot, and an artificial short film feel. Few dialogues and comedy scenes work in both halves, along with the climax, but the rest feels very dragged. Love story portions are practically nonexistent, while the weak writing and editing make it feel like a bunch of chaotic scenes stitched together


Narendra Ravi is the only real saving grace and carries the film with his comic timing. Without him, this would’ve been an even more exhausting watch. This really doesn’t feel like something Sandeep Reddy Vanga would sign off on. Disappointing!


Rating: 2/5

4.0
out of 10

Below Average

రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా...

సో ‘రోమాంచకం’ మూవీ ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. బేసిగ్గా సినిమాలో వంద జోకులుంటాయంటే.. అందులో ఒక పది పదిహేను జోక్స్ నచ్చాయి. అది కూడా ఈ మూవీలో ఉన్న కమెడియన్స్ లో ఒక్కరే బాగా చేసారు. ఈ సినిమా లవ్ స్టోరీనా, లేదా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే నార్మల్ కామెడీ స్టోరీనా అస్సలు అర్ధం కాలేదు. మెయిన్ సినిమాలో ఫస్ట్ 30 మినిట్స్ వరస్ట్. క్రింజ్... ప్రాబ్లెమ్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతకు ముందు చాలా సినిమాలొచ్చాయి. 


కానీ దీంట్లో అది వర్కౌట్ కాలేదు. అండ్ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో కొన్ని పంచ్ లు తప్ప ఏం వర్కౌట్ కాలేదు. అన్ని సీన్లు కూడా చాలా ఏళ్ళ నుండి ఎన్నో సినిమాల్లో చుసిన సీన్ల లాగానే ఉన్నాయి. బట్ చాలా మంది నవ్వుకున్నారు. నాకు మాత్రం నవ్వు రాలేదు. అండ్ సినిమాలో సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా అర్ధం కాలేదు. అసలు హీరోకే సరైన క్యారెక్టర్ డిజైన్ చేయలేదు. అక్కడే దొబ్బింది ఈ సినిమా. ఎన్నో సినిమాల చూసిన డైలాగ్స్ వినిపిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మరీ కామెడీ చేసారు. బట్ సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ లో వస్తుందన్న ఒకే ఒక్క రీసన్ తోనే సినిమాకి వచ్చాను. మరి నార్మల్ ఆడియన్స్ కి కామెడీ ఇష్టం ఉన్నోళ్లకు నచ్చోచ్చేమో... నాకు మాత్రం నచ్చలేదు. 

4.0
out of 10

Below Average

Why MRO?