Peddi movie Review
పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయింట్ కూడా ఇదే. ఇక బుచ్చిబాబు స్క్రీన్ ప్లే కూడా బాగుంటది. బేసిగ్గా ఇదంతా ఒక రైలు కథ. సినిమాలో చాలా థింగ్స్ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది.
అయితే ఇండియాలో చాలా ఊళ్లలో సినిమాలో చూపించిన ప్రాబ్లెమ్ ఉంటది. అందుకే ఊరి వాళ్లకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో చాలా సీన్స్ ఊహించినట్టే ఉంటాయి, కానీ కొన్ని సీన్స్ అన్ ఎక్స్పెటెడ్ గా ఉంటాయి. ఇక మ్యూజిక్ మీద కూడా ఏఆర్ రెహమాన్ గట్టి ఎఫర్ట్ పెట్టారు. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ రేంజ్ లో బాగా చేసారు. ఇక శివన్న, జగపతి బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ కె సరైన రోల్ లేదు. డైరెక్షన్ పరంగా సింపుల్ కథనే తీసుకున్నా, బుచ్చిబాబు బాగానే హ్యాండిల్ చేసారు. అయితే హిందీలో ప్రాపర్ రిలీజ్ ఉంటె సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయినా లాంగ్ రన్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పెద్ది కి నా రేటింగ్ 4.3/5
Super Hit
Peddi Movie Review
By Thyview
పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసేలా లేదు. ఇక సీన్స్ గురించి చెప్పుకుంటే ఇంట్రో సీన్, సాంగ్స్, ఫైట్స్ కూడా బానే ఉంటాయి. కానీ ఏదో మిస్ అవుతుందనిపిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కుస్తీ ఫైట్ సీన్ స్టార్ట్ అవగానే ఇక్కడినుండి సినిమా రియలిస్టిక్ గా ఉందనిపిస్తుంది. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. బట్ బుచ్చిబాబు తన ఐడియాస్ స్క్రీన్ పై సరిగా చెప్పలేదు ఏదో మిస్ అయిందనిపిస్తుంది. పైగా కొన్ని విఎఫెక్స్ షాట్స్ కూడా బాగాలేవు. లిప్ సింక్స్ అయితే కొంతమంది కి అస్సలు సెట్ అవలేదు. అండ్ 350 cr బడ్జెట్ అంటే నమ్మేలా లేదు. ఎందుకంటే చాలా వరకు సెట్స్ వేసి తీశారు. ఇక జాన్వీ కపూర్ అచ్చియమ్మ ట్రాక్ కూడా అంత లేదు. ఇక విజువల్స్ గా సినిమా బాగుంది. జగపతి బాబు, శివన్న కూడా షైన్ అయ్యారు. అయితే బుచ్చిబాబు ఐడియాస్ బాగున్నా దాని ఎక్స్యూగుషన్ అంత లేదు. కానీ సినిమాలో ఒక హానెస్టీ ఉంటది. కొంచెం లైట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తే మంచి సినిమా అన్న సంతృప్తితో బైటికొస్తారు.
Hit
Peddi Movie Review
By Ideal Brain
Completed watching the movie:
#Peddi’s final portion makes you emotional.
It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.
Ram Charan and the film deserve national awards.
This is not an entertainment-oriented film; it’s an emotionally driven, content-rich film.
It’s appreciable that a big star like Ram Charan took up such a content-driven project.
Loved the English lyrics and the music that play in the background during #Peddi’s elevation sequences! A.R. Rahman’s score is absolutely top-notch.
Technically, #Peddi is brilliant!
On the whole, #Peddi is an inspirational film with solid box-office potential!
Above Average
Peddi Movie Review
#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration!
The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end of Massa Massa is the film’s biggest highlight and is executed well. Post that, the film drags with ups and downs, though the climax is wrapped up neatly.
Ram Charan is terrific and clearly carries the film. His transformation and effort are evident throughout. ARR’s music works well and is another highlight. Buchi Babu Sana succeeds in presenting an honest story, but the screenplay and editing could have been better.
Has its share of flaws, but can be watched with expectations in check for Ram Charan’s performance, the music, and the honest story.
Rating: 2.75/5
Above Average
Peddi movie Review
By Devi Priya
పెద్ది… నా రేటింగ్.…… 3/5
పెద్ది…కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ కాదు
సిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్
పెద్ది ఓ సీరియస్ అటెంప్ట్
అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్
కథ ఎలా డ్రయివ్ చేస్తే అలా వెళ్లిన సెకండాఫ్.
…
పెద్ది..రామ్ చరణ్ నమ్మకం
పెద్ది...రెహమాన్..రత్నవేలు వర్క్
పెద్ది..నిర్మాత ధైర్యం
పెద్ది..దర్శకుడు బుచ్చిబాబు స్టామినా
…
అందరికీ నచ్చుతుందా? అన్నదే ప్రశ్న.
పంచ్ లైన్... మళ్లీ చూడగలమా ఏంటీ !
Above Average
Peddi Movie Review
By One India
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన 'పెద్ది' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన'తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. అయితే 'పెద్ది'ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చెప్పడం సరైంది కాదు. ఇది ఒక గ్రామం ఆత్మగౌరవం కోసం పోరాడిన యువకుడి కథ. అయితే బుచ్చిబాబు కథ రొటీన్ గా రాసుకున్నా, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన భావన కలిగించినా, ప్రేక్షకుడు పాత్రలతో కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే సాగుతుంది.
ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు పెద్ద బలం. సెకండాఫ్‌లో కుస్తీ, అథ్లెటిక్స్, ఢిల్లీ ఎపిసోడ్స్, రాజకీయ వ్యవస్థతో పోరాటం, గ్రామ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇక సినిమాకి రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటన, బుచ్చిబాబు ఎమోషనల్ కథనం, 40 నిమిషాల క్లైమాక్స్, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ పాత్రలతో పాటు ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం కూడా బిగ్ ప్లస్ అయింది. ఓవరాల్ గా "పెద్ది.. కేవలం ఒక ఆటగాడి కథ కాదు.. ఒక ఊరి గౌరవం కోసం సాగిన పోరాట గాథగా ఆడియన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది.
Hit
Peddi Movie Review
By TV9 Telugu
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఊరి కోసం పోరాడే హీరో కథే ఈ పెద్ది. ఇక సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెద్ది పాత్రకి సంపూర్ణ న్యాయం చేసిన చరణ్ పెద్దిగా జీవించేసాడు. తనదైన హావభావాలతో భావోద్వేగమైన నటనతో మెప్పించాడు. ఇక జాన్వికపూర్ పాటలకే పరిమితమైంది. మిగతా నటీనటులందరూ మెప్పించారు.
ఇక తెరపై హీరో రామ్ చరణ్ అయితే తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్. ఆయన రీ రికార్డింగ్ చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది.. సినిమా స్థాయిని పెంచేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ప్రాణం. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.. కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి అతడిని తప్పు పట్టడానికి లేదు. బుచ్చిబాబు తన వంతు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేసాడు.. హీరో దొరికాడు కదా అని కమర్షియల్‌గా కాకుండా మంచి కథ చెప్పాడు. గ్రాఫిక్స్ విషయాల్లో అక్కడక్కడా చూసుకోవాల్సిందే. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా పెద్ది.. మనసును కదిలించే కొండ కింద ఊరోడి కథ..!
Hit
Peddi Movie Review
By Sakshi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా, తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు స్పోర్ట్స్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ప్రేక్షకులను కదిలిస్తుంది.
అయితే కథ పరంగా చూస్తే ఇది కొత్త కథ కాదు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండగా, స్క్రీన్‌ప్లే కూడా కొంతవరకు రొటీన్‌గా అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ బ్లాక్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. ఓవరాల్‌గా ‘పెద్ది’ కొత్త కథ చెప్పకపోయినా, బలమైన ఎమోషన్స్, రామ్ చరణ్ అద్భుత నటన, స్పోర్ట్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో మెప్పించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
Hit
Peddi Movie Review
రామ్ చరణ్ నటించిన పెద్ది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఊరు గుర్తింపు కోసం, తన గుర్తింపు కోసం ఒక క్రీడాకారుడు తన ఆటతో చేసే పోరాటమే ఈ పెద్ది సినిమాగా చెప్పొచ్చు. అయితే సినిమాలో మెయిన్‌గా కథని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎమోషన్స్ ని క్యారీ చేయడానికి ఎక్కువగా టైమ్ తీసుకున్నారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ గ్రౌండ్ లోకి పెద్ది దిగిన సన్నివేశంతో రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని సాలిడ్‌గా ప్లాన్ చేశారు బుచ్చిబాబు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా ఉంది. ఎంగేజ్ చేస్తుంది. చివరి అరగంట ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరగా రెగ్యూలర్ గానే ముగింపు తీసుకుంటుంది.
అయితే సినిమాకి మ్యూజిక్ యావరేజ్ గా నిలిచింది. కానీ బీజీఎం బాగా ఇచ్చాడు ఏఆర్ రెహమాన్. రత్నవేలు కెమెరా వర్క్ బాగుంది. రామ్ చరణ్‌లోని ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. ఎడిటింగ్ పరంగా లోపాలున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా మంచి కథని రాసుకున్నాడు, కానీ ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రజెంట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఆయన సక్సెస్ అయిన అంశం ఏంటంటే రామ్ చరణ్‌తో బాగా చేయించగలిగాడు. నటీనటుల నుంచి తన బెస్ట్ తీసుకున్నాడు. ఓవరాల్ గా కథగా ఊహించేలా ఉన్నా, ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం అయినా చూడగలిగే మూవీ.
Hit
Peddi Movie Review
By Great Andhra
మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఊరి గుర్తింపు కోసం పోరాడే పెద్ది అనే యువకుడి కథ చుట్టూ సినిమా సాగుతుంది. కూలీ కుటుంబం నుంచి వచ్చిన పెద్ది తన అసాధారణ క్రీడా ప్రతిభతో ఎలా ఎదిగాడు? తన గ్రామం కోసం ఎంత దూరం వెళ్లాడు? అనేదే కథాంశం. ఇక సినిమాకు ప్రధాన బలం రామ్ చరణ్ నటన. రంగస్థలం తర్వాత మరోసారి బలమైన పాత్రలో కనిపించిన ఆయన, యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటాడు. జగపతి బాబు, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర మాత్రం నిరాశపరిచింది. పైగా సినిమాలో పాటలకు, ఎక్స్పోజింగ్ కి మాత్రమే అనట్టుంటుంది.
కథ పరంగా చూస్తే ఇది పూర్తిగా కొత్త కథ కాదు. చాలా సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్, లిప్ సింక్ సమస్యలు కనిపిస్తాయి. అయితే దర్శకుడు భావోద్వేగాలను బాగా హ్యాండిల్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. టెక్నికల్ గా A. R. Rahman అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. స్పోర్ట్స్ ఎపిసోడ్స్, ఎమోషనల్ బ్లాక్స్ థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తాయి. ఓవరాల్‌గా ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా. కథ పరంగా వంక పెట్టేలా ఉన్నా, ఓసారి పక్కాగా చూసేయొచ్చు.
Hit
Peddi Movie Review
By 10TV Telugu
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. కథ పరంగా అంతగా లేకపోయినా, బుచ్చిబాబు స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ మరోసారి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్, ఆ తర్వాత క్లైమాక్స్ వరకు అలాంటి సీన్స్ స్టార్ హీరో చేయడానికి ధైర్యం కావాలి. చరణ్ ఆ సీన్స్ చేయడమే కాదు చేసి ఏడిపించాడు కూడా.
అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా తమ నటనలో సీనియారిటీ చూపించారు. ఎఆర్ రహ్మాన్ ఊరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ ద్వారా వచ్చిన ట్రోల్స్ కి సినిమా ద్వారా సమాధానం చెప్పాడు. ఇక టెక్నికల్ గానూ సినిమా ఔట్స్టాండింగ్ గా ఉంది. మొత్తంగా ‘పెద్ది’ ఊరు, తన మనుషులకు గుర్తింపు కోసం ఒక ఆటగాడిగా ఏం చేసాడు? అందరిలో ఎలా స్ఫూర్తి నింపాడు అని కమర్షియల్ గా ఎమోషనల్ గా తెరకెక్కించారు. కొత్తదనం కోరుకోకుండా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుంది.
Super Hit
Peddi Movie Review
By ABP Desam
రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బలమైన కథా కథనాలు రాసుకోవడంలో దర్శకుడు బుచ్చిబాబు విఫలమయ్యాడు. కాని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు బుచ్చి. తనలోని నటుడిని బయటికు తీసుకువచ్చే క్యారెక్టర్ చేయడానికి ఎప్పుడూ రెడీ ఉండే రామ్ చరణ్ మరోసారి తన యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో చూపించారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ తమ పెర్ఫార్మన్స్ తో మరో హైలెట్ గా నిలిచారు.
అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా కథ కన్నా, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే అది బాగానే ఉంది కానీ, బలమైన కొత్త తరహా కథ తీసుకోలేకపోయారు బుచ్చిబాబు. దివ్యేందు శర్మ, రవి కిషన్, బోమన్ ఇరానీ వంటి ఆర్టిస్టులకు సరైన రోల్స్ పడలేదు. ఓవరాల్ గా కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమా పెద్ది. అయితే... కమర్షియాలిటీ కంటే కంటెంట్ హైలైట్ అవుతుంది. కథలో ఎమోషనల్ సీన్స్ హై ఇస్తాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, అలాగే లాస్ట్ 30 మినిట్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. బుచ్చిబాబు రచనలో నిజాయతీని అభినందించాలి. రామ్ చరణ్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. పెద్ది... నటుడిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన కోసం సినిమా చూడాలంతే
Hit