Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

635
Total Reviews
Showing 241–252 of 635 media reviews
యూత్ (Youth)

Youth Movie Review

యూత్ (Youth) 2026 News Channel
Sakshi

By Sakshi

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం సరదాగా నవ్వుకునే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుం...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం సరదాగా నవ్వుకునే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కెన్ కరుణాస్ తన పాత్రకు తగ్గట్టు సహజంగా నటించారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ తమ పాత్రల్లో క్యూట్‌గా కనిపిస్తూ మెప్పించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి అనుభవజ్ఞుల నటన కూడా సినిమాకు బలంగా నిలిచింది.


స్కూల్, కాలేజ్ విద్యార్థులతో పాటు యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సరదాగా చూసేలా తెరకెక్కించారు. కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి.

సంగీతం పరంగా జీవీ ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మద్దతు ఇచ్చాయి. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపించడం మైనస్‌గా మారింది. మొత్తంగా చూస్తే… యూత్ సినిమా లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెప్పొచ్చు

6.0
out of 10

Above Average

యూత్ (Youth)

Youth Movie Review

Tupaki

By Tupaki

కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా బాగా ఇంప్రెస్ చేసాడు. అలాగే ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అని...

కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా బాగా ఇంప్రెస్ చేసాడు. అలాగే ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అనిల్ కుమార్ బాగా పెర్ఫామ్ చేసింది. క్యూట్ గా అనిపిస్తూనే చక్కగా హావభావాలు పలికించింది. మీనాక్షి.. ప్రియాంశి ఓకే అనిపిస్తారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో సూరజ్.. దేవదర్శిని చాలా బాగా నటించారు. వారి పాత్రలు.. నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. 


అలాగే సాంకేతికంగా జి.వి.ప్రకాష్ కుమార్ ‘ముత్త కలక్కి’ వైరల్ పాటతో ముందే ఈ సినిమాకు చాలా ప్రయోజనం చేకూర్చి పెట్టాడు. తెలుగులో ఆ పాట లిరిక్స్ అంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ.. బీట్ వల్ల తెరపై ఈ పాట బాగానే క్లిక్ అయింది. నిర్మాణ విలువలు సినిమాలకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. కెన్ తన టీంతో కలిసి యూత్ ను మెప్పించేలా ఒక సింపుల్ కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తెర మీద బాగా ప్రెజెంట్ చేశాడు. తన టేకింగ్ బాగుంది. వినోదంతో పాటు ఎమోషన్లనూ అతను బాగా హ్యాండిల్ చేశాడు.

6.0
out of 10

Above Average

యూత్ (Youth)

Youth Movie Review

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'యూత్'. కథ, కథనాలను కూడా తానే రాసుకుని డైరెక్ట్ చేయగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక హీరోతో పాటు హీరోయిన్లు మీనాక్షి, ప్రియాంషి,...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'యూత్'. కథ, కథనాలను కూడా తానే రాసుకుని డైరెక్ట్ చేయగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక హీరోతో పాటు హీరోయిన్లు మీనాక్షి, ప్రియాంషి, అనిష్మ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ ముగ్గురు గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా మెప్పించారు. కెన్ తండ్రిగా సూరజ్, తల్లిగా దేవదర్శిని ఎమోషనల్ కంటెంట్‌ను పండించారు. 


ఇక యూత్ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ హైలెట్. తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలుసుకొని ఆర్పీ పట్నాయక్, ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల పాటలను ఈ కథలో జొప్పించిన విధానం ఈ సినిమాను మరింత క్రేజీగా మార్చేసింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగం పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ సినిమా పక్కాగా మాస్ ఎలిమెంట్స్‌తో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే కాకుండా టీనేజ్ లవ్ స్టోరి. సన్నివేశాలు నవ్వించడమే కాకుండా హృదయాన్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. అంచనా లేకుండా వెళ్లిన సంతృప్తిని అందిస్తుంది.

6.0
out of 10

Above Average

యూత్ (Youth)

Youth Movie Review

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా… యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది....

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా… యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కెన్ కరుణాస్ తన పాత్రకు తగ్గట్టు నేచురల్‌గా నటించాడు. కథను తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు హీరోయిన్లు క్యూట్‌గా కనిపిస్తూ పాత్రలకు న్యాయం చేశారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ నటుల అనుభవం వారి ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తుంది.


సినిమా టార్గెట్ ఆడియన్స్ యూత్. స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌ను ఎక్కువగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సరదాగా నవ్వుకునేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ విషయంలో జీవీ ప్రకాష్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. కామెడీ ట్రాక్ కూడా చాలా వరకు వర్క్ అవుతుంది. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపిస్తాయి. అవే మైనస్ పాయింట్. మొత్తంగా

కొత్తదనం ఆశించకుండా… లైట్‌గా ఎంజాయ్ చేయాలనుకునే వారికి యూత్ ఓకే అనిపించే సినిమా. ఫుల్ నవ్వుల కోసం కాదు… కానీ టైమ్ పాస్ కోసం వెళ్లొచ్చు.

5.0
out of 10

Average

యూత్ (Youth)

Youth Movie Review

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా 'యూత్' కథకు తగ్గట్టు కెన్ కరుణా...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా 'యూత్' కథకు తగ్గట్టు కెన్ కరుణాస్ నటించారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్... ముగ్గురు అమ్మాయిలు క్యూట్ గా ఉన్నారు. పాత్రలకు తగ్గట్టు నటించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు అనుభవం వాళ్ళ నటనలో కనిపించింది. 


ఇక ఈ సినిమా స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు... 'యూత్' అందరూ తమ స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా 'యూత్ 2026'. కెన్ కరునాస్ నటన, జీవీ ప్రకాష్ సంగీతం, కామెడీ బావున్నాయి. కథలో కాస్త రొటీన్ సీన్స్ ఉన్నాయంతే! అదొక్కటీ పక్కన పెడితే... కామెడీని ఎంజాయ్ చేయవచ్చు.

6.0
out of 10

Above Average

యూత్ (Youth)

Youth Movie Review

తమిళంలో తెరకెక్కిన "యూత్" (Youth) సినిమా రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం తెలుగులో విడుదలైంది. కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే, ప్రేక్షక...

తమిళంలో తెరకెక్కిన "యూత్" (Youth) సినిమా రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం తెలుగులో విడుదలైంది. కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే, ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కెన్ కరుణాస్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. 


లవ్ స్టోరీ, కామెడీ, సంగీతం మరియు ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు కలిసొచ్చాయి. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం, స్లోగా సాగే సెకండాఫ్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా యూత్‌ఫుల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ ‘యూత్’ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది.

7.0
out of 10

Hit

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

అసలు బ్యాండ్‌మేళం అంటే థియేటర్‌లో ఫుల్ నవ్వులు, ఎంజాయ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం… కానీ ఇక్కడ జరిగిందేంటి అంటే… నవ్వుల కంటే గోలే ఎక్కువగా వినిపిస్తుంది! హర్ష రోషన్, శ్రీదేవి జంట చూసేందుకు ఓకే… కానీ పూ...

అసలు బ్యాండ్‌మేళం అంటే థియేటర్‌లో ఫుల్ నవ్వులు, ఎంజాయ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం… కానీ ఇక్కడ జరిగిందేంటి అంటే… నవ్వుల కంటే గోలే ఎక్కువగా వినిపిస్తుంది! హర్ష రోషన్, శ్రీదేవి జంట చూసేందుకు ఓకే… కానీ పూర్తి స్థాయిలో లవ్ ట్రాక్ కనెక్ట్ అవుతుందా అంటే… అంతగా కాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్ కొంచెం పని చేస్తుంది. పైగా లవ్ అంతగా లేదు కాబట్టి, సినిమా మొత్తం కామెడీ మీదే నడవాలి… కానీ అదే మిస్ అయింది. చాలా సీన్స్ forced గా అనిపిస్తాయి. నవ్వాలి అనుకుంటే… cringe ఫీల్ వస్తుంది.


సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే అర్థమయ్యేలా సాగుతుంది. మధ్యలో కొన్ని హై మోమెంట్స్ ఉన్నా… అవి నిలబెట్టేంత బలంగా లేవు. టెక్నికల్‌గా చూసుకుంటే… సౌండ్ కొంచెం లౌడ్‌గా ఉంటుంది. చివర్లో వచ్చే ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా హైప్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్ చేయాలనుకున్న సినిమా… పూర్తిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.

కొన్ని సీన్స్ ఓకే… కానీ మొత్తం మీద యావరేజ్ ఫీలింగ్ వస్తుంది.

4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

Thyview

By Thyview

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… బ్యాండ్‌మేళం అనే టైటిల్ చూస్తే ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే ఆ అంచనాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే ఫీలింగ్ వస్తుంది. రొటీన్ లవ్-కామ...

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… బ్యాండ్‌మేళం అనే టైటిల్ చూస్తే ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే ఆ అంచనాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే ఫీలింగ్ వస్తుంది. రొటీన్ లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా లైన్ తీసుకుని, దాన్ని కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం ఉన్నా… దర్శకుడు మంచి సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేకపోయాడు. సినిమా ప్రధానంగా కామెడీ మీదే ఆధారపడి ఉంది. కానీ అదే విభాగం పూర్తిగా కనెక్ట్ కాలేదు. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. నవ్వులు పండాల్సిన చోట, ఫోర్స్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది.


సెకండాఫ్‌లో డ్రామా డోస్ పెరగడంతో సినిమా వేగం తగ్గుతుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని హై సన్నివేశాలు ఉన్నా… అవి నిలబెట్టేంతగా ప్రభావం చూపవు. టెక్నికల్‌గా సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. చివర్లో ట్రెండింగ్ పాటను వాడిన తీరు కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ కి యావరేజ్ గా కూడా అనిపించకపోవచ్చు.

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు “ఫుల్ ఫన్ ఉండబోతుంది” అనిపిస్తుంది… కానీ సినిమా చూస్తే ఆ ఫన్ అంతగా deliver కాలేదు. బేసిగ్గా ఇది ఒక typical లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా… bu...

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు “ఫుల్ ఫన్ ఉండబోతుంది” అనిపిస్తుంది… కానీ సినిమా చూస్తే ఆ ఫన్ అంతగా deliver కాలేదు. బేసిగ్గా ఇది ఒక typical లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా… but execution దగ్గరే ఇష్యూ వచ్చింది.

హర్ష రోషన్, శ్రీదేవి pairing ఒకే… chemistry works in parts. కానీ complete హీరో-హీరోయిన్ vibe మాత్రం రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం కొంచెం ఎమోషన్ ఉంటుంది… అది plus.


ఇప్పుడు main point – కామెడీ... సినిమా మొత్తం కామెడీ మీదే depend అయ్యింది… but అదే weakest part అయింది. చాలా scenes forced గా ఉంటాయి. natural flow లేదు. నవ్వాల్సిన చోట cringe feel వచ్చే moments ఎక్కువ. సెకండ్ హాఫ్ లో drama over అయిపోతుంది. Story ముందే guess చేసేలా ఉంటుంది. మధ్య మధ్యలో highs ఉన్నా… అవి consistent గా రావు. Technical side కి వస్తే… sound కొంచెం loudగా ఉంటుంది. Last lo trending song use చేసిన విధానం కూడా impact ఇవ్వదు. Acting కూడా కొన్ని చోట్ల overగా అనిపిస్తుంది. ఫైనల్ గా 

కొన్ని moments okay అనిపించినా… overall ga cinema average zone లోనే పడుతుంది. Fun expect చేసి వెళ్తే… కొంచెం disappoint అయ్యే chance ఉంది.

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బావా మరదళ్ళు అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ బాగా చదివిన హీరోయిన్ పై తరగతులకు వెళుతుంది, హీరో మాత్రం ఫెయిల్...

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బావా మరదళ్ళు అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ బాగా చదివిన హీరోయిన్ పై తరగతులకు వెళుతుంది, హీరో మాత్రం ఫెయిల్ అయ్యి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడు…హీరోయిన్ కి హీరో చదువుకోకపోవడంతో… కోపం వచ్చి దూరం పెడుతుంది…మరి హీరో ఎలా తన మరది మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాడు…ఇద్దరు కలిశారా లేదా అనేది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్…కథ పాయింట్ వింటుంటే అప్పట్లో వచ్చిన ఉయ్యాలా జంపాల లాంటి సినిమా గుర్తుకు రావడం ఖాయం.



కానీ అక్కడ ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే ఇక్కడ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేక పోయింది. ఎటు నుండి ఎటో పోతూ సాగే కథ డ్రాగ్ అవుతూ సీన్స్ రిపీట్ అవుతూ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే సీన్స్ ఓకే అనిపించినా కూడా.. ఓవరాల్ గా చాలా చాలా ఓపిక చేసుకుని చూస్తె తప్పితే యావరేజ్ లెవల్ లో అనిపించదు సినిమా…లీడ్ పెయిర్ బాగానే ఆకట్టుకున్నా కథలో అంత దమ్ము లేకపోవడంతో ఓవరాల్ గా పెద్దగా సినిమా ఇంప్రెస్ చేయలేదు. సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి.. ఓవరాల్ గా ముందే చెప్పినట్లు చాలా లో ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్లి చాలా ఓపికగా చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు


5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

Gulte

By Gulte

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.హర్ష రోషన్, శ్...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.


హర్ష రోషన్, శ్రీదేవి జంట ఓకే. కెమిస్ట్రీ వర్క్ అయినా… హీరో-హీరోయిన్ వైబ్ మాత్రం అంతగా రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్స్ కొంచెం పని చేస్తాయి. కామెడీ ట్రాక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కావాల్సింది. కానీ అదే పెద్ద మైనస్ అయింది. చాలా సీన్లు ఫోర్స్ చేసినట్టుగా, అసహజంగా అనిపిస్తాయి. నవ్వులు రావాల్సిన చోట… చిరాకు వచ్చే పరిస్థితి.


సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే ఊహించేసుకునేలా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే హై మోమెంట్స్ ఉన్నా… అవి మూవీని సేవ్ చేయలేవు. టెక్నికల్‌గా చూసుకుంటే సౌండ్ డిజైన్ కొంచెం లౌడ్. చివర్లో పెట్టిన ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది.

4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో ప...

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో పెద్దగా మెప్పించలేదు. పాత్ర స్వభావం అలా రొటీన్ గా ఉండడం వల్లో ఏమో గాని, కొన్నిసార్లు అతని నటన హద్దులు దాటింది. రాజీ పాత్రలో శ్రీదేవి సహజంగా, పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ సినిమా ద్వితీయార్థంలో ఆమెకు నటించే అవకాశం లభించలేదు. హీరో గ్యాంగ్‌లోని స్నేహితులందరూ కొత్త ముఖాలే మరియు వారి సన్నివేశాలు సరిగ్గా రాయబడలేదు. 


విజయ్ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదనిపించినా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. నేపథ్య సంగీతం సగటు కంటే తక్కువగా ఉంది మరియు ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాలలోని కొన్ని ప్రముఖ బాణీలను ఉపయోగించారు. 'బ్యాండ్ మేళం' నిర్మాణ విలువలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. 'బ్యాండ్ మేళం' అన్ని విభాగాల్లోనూ విఫలమైన చిత్రం, ఈ సినిమాను చూడకుండా వదిలేయవచ్చు.

4.0
out of 10

Below Average

Why MRO?