Register as a Reviewer
మయూఖ (Mayookha)

మయూఖ (Mayookha)

09 Oct 2026
Overall Rating
5.1/10
8 Reviews

Mayookha : టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ "మయూఖ". ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మయూఖ సినిమాను ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించారు. కాగా ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Director: Shree Tej SK
Cast: Payal Chengappa, Dev D, Muralidhar Goud, Lavanya Rani, Charishma Dabbara, Aman Masud and others.

Available in:

Reviews

What critics and the public are saying about మయూఖ (Mayookha)

Media Reviews

6 Avg: 5.2/10
Filmi Beat
Filmi Beat Website
5

Average

Mayookha movie review

నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ కిరాతక హత్యతో మయూఖ కథను ఆసక్తిగా దర్శకుడు శ్రీతేజ్ మొదలుపెట్టాడు. ఈ కథలోని కీలక పాత్రలను పరిచయం చేసిన విధానం ప్రొఫెషనల్‌ ఫిల్మ్ మేకర్ తరహాలో హ్యాండిల్ చేశాడు. కానీ అసలు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమాను బాగా సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే...

నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ కిరాతక హత్యతో మయూఖ కథను ఆసక్తిగా దర్శకుడు శ్రీతేజ్ మొదలుపెట్టాడు. ఈ కథలోని కీలక పాత్రలను పరిచయం చేసిన విధానం ప్రొఫెషనల్‌ ఫిల్మ్ మేకర్ తరహాలో హ్యాండిల్ చేశాడు. కానీ అసలు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమాను బాగా సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే అసలు కథ ఎప్పుడు మొదలుపెడుతారా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్లిన తర్వాత రకరకాల ట్విస్టులు వస్తాయి. స్టోరీలో ఉండే చిక్కు ముడులను ఒక్కొక్కటిగా విడదీసిన విధానం బాగుంటుంది. 


మురళీధర్ గౌడ్ పాత్ర ఆ ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు కథను మలుపుతిప్పేలా మారుతాయి. ఆ సంఘటనే బలంగా మారడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పాలి. పాయల్ చెంగప్ప ఈ సినిమా కథను తన భుజాలపై మోసిందనే చెప్పాలి. టెక్నికల్ గా సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి హైలెట్‌గా నిలిచాయి. హారర్, మిస్టరీ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. శిబి మ్యాథ్యూ అలెక్స్ వర్క్ చాలా బాగుంది. లైటింగ్, కలర్ గ్రేడింగ్ బాగుంది. అయితే ఈ సినిమా కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టాల్సింది. సినిమా కథను ప్రీ క్లైమాక్స్ నుంచి కాకుండా ముందే చెప్పడం మొదలుపెడితే సినిమా ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది. హారర్, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీలను ఇష్డపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Oct 09, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Mayookha movie Review

వెబ్ సిరీస్‌ లలో సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చే స్టోరీస్ మనం చాలానే చూస్తుంటాం. కానీ మన టాలీవుడ్‌లో మొదటిసారిగా ‘ఫ్రాంగింగ్’ అనే కొత్త పాయింట్ బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ కు కాలానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు...

వెబ్ సిరీస్‌ లలో సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చే స్టోరీస్ మనం చాలానే చూస్తుంటాం. కానీ మన టాలీవుడ్‌లో మొదటిసారిగా ‘ఫ్రాంగింగ్’ అనే కొత్త పాయింట్ బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ కు కాలానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. దీనికి న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ అవార్డు కూడా రావడం విశేషం. ఇక ఈ మూవీలో వాడిన ‘ఫ్రాంగింగ్’ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, చిన్నప్పటినుంచి వాసన తెలియని ఒక అబ్బాయి కోళ్ళను కాల్చినప్పుడు వచ్చే స్మెల్ కు అట్రాక్ట్ అవుతాడు. ఆ తరువాత మనుషులను కాల్చినప్పుడు వచ్చే వాసనకు మరింతగా ఎడిక్ట్ అయిపోయి, ఏకంగా కన్నతండ్రిని, సొంత చెల్లిని కూడా చంపే స్థాయికి వెళ్లడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. 


అయితే ఇలాంటి సీన్స్ పిల్లల్లో వయొలెన్స్ ను ఎంకరేజ్ చేసేలా ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించినా, అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో అప్పటివరకు ఓపిక పట్టాలి. ఇన్ని మలుపుల తర్వాత అసలు ఆ సైకో కిల్లర్ ఎవరనేది క్లైమాక్స్ లో రివీల్ అయినప్పుడు మాత్రం ఆడియన్స్ కు ఒక సాలిడ్ థ్రిల్ దొరుకుతుంది. ఆ ఎండ్ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మాత్రం కచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. ప్రధాన పాత్ర పోషించిన పాయల్ చెంగప్ప తన అద్భుతమైన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఫైనల్ గా మిస్టరీ అంశాలను ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మయూఖ.. డీసెంట్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ..!



Oct 10, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Mayookha movie review

హర్రర్-థ్రిల్లర్ జోనర్స్ ను డీల్ చేయడం కత్తి మీద సాము వంటిది. దర్శకుడు శ్రీ తేజ్ ఒక మంచి డిఫరెంట్ పాయింట్ ను ఎంచుకున్నప్పటికీ మయూఖ ను తెరపై ఆవిష్కరించిన తీరులో కొంత రఫ్ నేచర్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్ళడానికి టైం ఎక్కువ తీసుకున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ చెంగప్ప బాగా నటించింది. టెక్నికల్ గ...

హర్రర్-థ్రిల్లర్ జోనర్స్ ను డీల్ చేయడం కత్తి మీద సాము వంటిది. దర్శకుడు శ్రీ తేజ్ ఒక మంచి డిఫరెంట్ పాయింట్ ను ఎంచుకున్నప్పటికీ మయూఖ ను తెరపై ఆవిష్కరించిన తీరులో కొంత రఫ్ నేచర్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్ళడానికి టైం ఎక్కువ తీసుకున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ చెంగప్ప బాగా నటించింది. టెక్నికల్ గా దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదు. అయితే సాంకేతికంగా, శిబి మాథ్య అలెక్స్ అందించిన సౌండ్ మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో అద్భుతమైన ఉత్కంటను రేకెత్తించాయి. కెమరా వర్క్ బాగుంది.


అలాగే పాయల్ చెంగప్ప సహా తారాగణం తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫైనల్ గా దర్శకుడి ఈ కొత్త ప్రయత్నం అందరికీ నప్పదు. విపరీతమైన హింసను తట్టుకోలేని సున్నిత మనస్కులు థియేటర్లకు వెళ్లే సాహసం చేయకుండా ఉంటె బెటర్. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కి మయూఖ బాగా నచ్చే అవకాశం ఉంది. సింగిల్ వర్డ్ లో మయూఖ వణికించేసింది. 

Oct 09, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Mayookha movie review

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. జెనరల్ గా హరర్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. అయితే ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్, వైలెంట్ ఎక్స్‌పీరియన్స్‌ ను మిగిల్చిం...

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. జెనరల్ గా హరర్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. అయితే ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్, వైలెంట్ ఎక్స్‌పీరియన్స్‌ ను మిగిల్చింది. ఇక సైకోపాత్ జానర్‌ ను డీల్ చేయడంలో దర్శకుడు ప్రదర్శించిన తాపత్రయం, స్క్రీన్ మీద పడరాని పాట్లు పడేలా చేసింది. పన్నెండేళ్ళ పిల్లాడు తన సొంత చెల్లిని, తండ్రిని హతమార్చి కాల్చడం స్క్రీన్ మీద చూసేందుకు ఎబెట్టుగా ఉన్నాయి. 


అయితే, సాంకేతిక నిపుణుల పనితీరు మాత్రం సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు శిబి మాథ్య అలెక్స్ అందించిన సౌండ్ మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. నటి పాయల్ చెంగప్పతో పాటు ప్రధాన తారాగణం తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా కొత్తదనం పేరుతో తెరకెక్కించిన ఈ అరాచకత్వాన్ని థియేటర్ల వరకు వెళ్లి భరించడం కాస్త కష్టమే! థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే నచ్చే అవకాశం ఉంది.

Oct 09, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Mayookha movie review

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే శ్రీతేజ్ ఎస్కే రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ సస్పెన్స్ టచ్ కూడా బాగుంది. అలాగే బ్యాక్‌గ్...

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే శ్రీతేజ్ ఎస్కే రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ సస్పెన్స్ టచ్ కూడా బాగుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పాయల్ చెంగప్ప పాత్ర బాగుంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆమె ఆకట్టుకుంది. 


ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి.‘మయూఖ’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ లో.. కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన క్రైమ్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి, ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.






Oct 09, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

Mayookha movie review

హారర్ ధ్రిల్లర్ సినిమాలను ఇవాళ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీలలో పలు భాషలకు చెందిన వెబ్ సీరిస్ లు చూడటంతో వీటికి జనాలు బాగానే అలవాటు పడ్డారు. కాకపోతే... ఈ జానర్ ను సైకోపాత్‌లోకి తీసుకెళ్ళడంలోనే అసలు చిక్కంతా. సైకో కథలలో ప్రతిదీ పరాకాష్టలో ఉంటుంది. ఇందులోనూ పది, పన్నె...


హారర్ ధ్రిల్లర్ సినిమాలను ఇవాళ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీలలో పలు భాషలకు చెందిన వెబ్ సీరిస్ లు చూడటంతో వీటికి జనాలు బాగానే అలవాటు పడ్డారు. కాకపోతే... ఈ జానర్ ను సైకోపాత్‌లోకి తీసుకెళ్ళడంలోనే అసలు చిక్కంతా. సైకో కథలలో ప్రతిదీ పరాకాష్టలో ఉంటుంది. ఇందులోనూ పది, పన్నెండేళ్ళ పిల్లాడు చెల్లిని, తండ్రిని చంపేసి కాల్చడాన్ని చూపించారు. తెర మీద ఆ సన్నివేశాలు చాలా జుగుప్సను కలిగించేలా ఉన్నాయి. వాసన ఎరగని కారణంగా ఆ కుర్రాడు అలా సైకోగా తయారయ్యాడనేది ఏ రకంగానూ సమంజసం గా అనిపించదు. దర్శకుడు తన బుర్రకు తట్టిన దానిని తెర మీద చూపించాడు. అలానే కాలిన మహిళల చర్మంతో పెర్ఫ్యూమ్‌ తయారు చేయడాన్ని కూడా విపులంగా చూపించాల్సిన అవసరం ఏమీ లేదు.  


పాయల్‌ చెంగప్పతో పాటు ఇతర కీలక పాత్రలో నటించిన వారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సంగీతం అందించిన శిబి మాథ్య అలెక్స్ సౌండ్‌ మిక్సింగ్‌ కూడా బాగా ఇచ్చాడు. కేవలం సౌండ్స్ తోనే థియేటర్ లోని ప్రేక్షకుల వెన్నుల్లో వణుకు పుట్టించాడు. సినిమా పతాక సన్నివేశం ప్రతినాయకుడి మోనోయాక్షన్ ను తట్టుకోవడం కష్టమే. అయితే ఏదో కొత్తగా చెప్పాలనే దర్శకుడి తాపత్రయం ఇందులో కనిపిస్తుంది. ఏదేదో ఊహించుకుని థియేటర్లకు వెళ్ళకుండా... ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూస్తే సరిపోతుంది. అయితే కాస్తంత గుండెధైర్యం ఉన్నవాళ్ళకే ఈ సినిమా! లేకపోతే ఇందులోని అరాచకత్వాన్ని సున్నిత మనస్కులు తట్టుకోలేరు!


Oct 09, 2026 Read Review

Public Reviews

2 Avg: 5.0/10
T
Talari Snehalatha IT Employee
5

Average

Mayookha movie review

just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. Payal Chengappa carries the film well, delivering great expressions of fear and tension.Shibin Mathew Alex's backgroun...

just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. 


Payal Chengappa carries the film well, delivering great expressions of fear and tension.

Shibin Mathew Alex's background score and sound design successfully build an eerie, nail-biting atmosphere.


The first half feels a bit slow, taking time to settle into the core plot.

overall A decent watch for thriller fans who enjoy dark, suspenseful drama

Oct 11, 2026
T
Tharuni Valluru Small Business Owner
5

Average

Mayookha movie Review

బాబోయ్... ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది! డైరెక్టర్ మూవీలో మాత్రం సైకో క్యారెక్టరేషన్‌ ని నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్ళాడు. పది, పన్నెండేళ్ళ పిల్లాడు తన చెల్లిని, తండ్రిని దారుణంగా చంపి కాల్చేయడం... స్క్రీన్ మీద చూస్తుంటే కడుపులో తిప్పినట్టయింది. వాసన తెలియకపోవడం వల్లే అలా అయ్యాడనే లాజిక...

బాబోయ్... ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది! డైరెక్టర్ మూవీలో మాత్రం సైకో క్యారెక్టరేషన్‌ ని నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్ళాడు. పది, పన్నెండేళ్ళ పిల్లాడు తన చెల్లిని, తండ్రిని దారుణంగా చంపి కాల్చేయడం... స్క్రీన్ మీద చూస్తుంటే కడుపులో తిప్పినట్టయింది. వాసన తెలియకపోవడం వల్లే అలా అయ్యాడనే లాజిక్ అసలు ఎక్కడా సింక్ కాలేదు. ఎదో షాక్ వాల్యూ కోసం బలవంతంగా ఇరికించినట్టే అనిపించింది.


మూవీకి సౌండ్ మిక్సింగ్ మాత్రం థియేటర్లో వెన్నులో వణుకు పుట్టించాయి! పాయల్ చెంగప్ప బాగా పెర్ఫామ్ చేసింది. కొత్తగా ఏదో ట్రై చేయాలనుకున్నారేమో కానీ, నాకు మాత్రం ఏవో పాత ఇంగ్లీష్ సినిమాలు కాపీ చేసినట్టనిపించింది. అండ్ ఇలాంటి అరాచకమైన వైలెంట్ సినిమాని థియేటర్దాకా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీ కి షిఫ్ట్ అవడం బెటర్.

Oct 11, 2026

About This Movie

Story : 

మయూఖ (పాయల్‌ చెంగప్ప) హైదరాబాద్ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్‌ లో పని చేస్తూ, సింగిల్‌ గా ఓ ఫ్లాట్‌ లో అద్దెకు ఉంటుంది. అయితే సిటీలో వరుస హత్యలు చోటు చేసుకుంటున్న క్రమంలో, మయూఖ ఫ్లాట్ లో అప్పుడప్పుడూ అనుమానాస్పదంగా ఎవరో ఉన్న భావన తనని కలుగుతుంది. పైగా తనకు నిద్రలో కలలు కూడా వస్తుంటాయి. ఓసారి పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళు నమ్మరు. దాంతో ఫ్లాట్‌ మారాలనే ప్రయత్నాల్లో ఉండగా, ఓసారి బ్యాంకు లో ఓ కస్టమర్ తో జరిగిన గొడవలో మయూఖను బ్యాంక్‌ లోనే పనిచేసే అభిరామ్‌ సేవ్‌ చేస్తాడు. అయితే ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లి అనుకోకుండా హత్యకు గురవుతాడు. దాంతో పోలీసులు అభిరామ్‌ మరణానికి మయూఖనే కారణమని భావించి వెంబడిస్తారు. ఈ క్రమంలో అభిరాం హత్యకు కారణం ఎవరు? మయూఖ ఫ్లాట్ లో నిజంగా ఎవరైనా ఉన్నారా? మయూఖ ఈ సమస్యల నుండి బయట పడిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

మాములుగా హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఎప్పటికి మంచి గిరాకీ ఉంటుంది. ప్రేక్షకులను సినిమాలో ఎంత భయపెడితే, థ్రిల్స్ చూపిస్తే అంత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో ఆడియన్స్ ని భయపెట్టడంలో డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్కే సక్సెస్ అయ్యాడు. అంతే కాదు కథకు రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. అలాగే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ పై బాగా ఫోకస్ చేసి సాలిడ్ బీజీఎమ్ రాబట్టుకున్నారు. ఇక మెయిన్ లీడ్ లో నటించిన పాయల్ చెంగప్ప బాగా నటించింది. రియలిస్టిక్ యాక్టింగ్ తో కట్టిపడేసేలా చేసింది. ఇక కీ రోల్ లో నటించిన అమన్ మసూద్, మురళీధర్ గౌడ్, జాను వర్మ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్కే స్టోరీ లైన్ చాలా సింపుల్ గా రాసుకున్నప్పటికీ, కథలో ఉన్న సస్పెన్స్ ని మాత్రం బాగా మెయింటైన్ చేసాడు. జనరల్ గా ఇలాంటి స్టోరీస్ కి కావాల్సిందే ఇలాంటి సస్పెన్సులు, థ్రిల్స్. 

 

Minus Points :

అయితే మయూఖ సినిమాని ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచడానికి మంచి సీన్స్ రాసుకున్న డైరెక్టర్, ఆడియన్స్ ని ఉత్కంఠకి గురి చేసేలా థ్రిల్లింగ్ గా రాసుకోలేకపోయాడు. కానీ అక్కడక్కడా కొన్ని సీన్లు బానే ఉన్నాయి. ప్రేక్షకులు భయపడేలా ఉన్నా, అవి థియేటర్ నుండి బయటికి వచ్చాక గుర్తుండవు. పైగా వేరేవో సినిమాల కాపీలా కూడా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా సాగాడు. ఆడియన్స్ ని ఏదో టెన్షన్ లో పడేద్దామని, చాలా సీన్స్ ని గందరగోళంలా నడిస్పిస్తూ, సాగదీసాడు. దాంతో ప్రేక్షకులకు చాలా వరకు బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మినహా మిగతా భాగం కనెక్ట్ కాదు. సెకండ్ హాఫ్ ని స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే బాగుండు. అలాగే కిల్లర్ మర్డర్ సీన్స్ ని మరింత ఉత్కంఠగా రాసుకోవడంలో తడబడ్డారు. 

 

Technical Values : 

డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్కే మంచి స్టోరీ లైన్ రాసుకున్నా, దానికి తగ్గట్టు ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. మంచి స్టోరీయే కానీ ఆడియన్స్ ను ఉత్కంఠకి గురి చేసేంత థ్రిల్ మూమెంట్స్ లేవు. కానీ ఆయన మేకింగ్ స్టైల్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శిబి మ్యాథ్యూ అలెక్స్ సంగీతం అండ్ బీజీఎమ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్. ముఖ్యంగా నైట్ విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. 

 

Final Review : 

 
ఫైనల్ గా "మయూఖ" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ క్రైమ్  సస్పెన్స్ థ్రిల్లర్‌ డ్రామా, కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సీన్స్ వల్ల కొంతవరకు మాత్రమే ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంట్రీషిన్ట్ స్టోరీ ఉన్నా, బలహీనమైన కథనం, అండ్ కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్. అండ్ కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా కూడా అనిపిస్తాయి. అయితే డిఫరెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిలర్స్ ఇష్టపడే ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓటిటి కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. 

Review Statistics

5.1
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.2/10
Public
5.0/10
Why MRO?