Agadha movie review
అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చేసింది.. బట్ దిస్ అగధ.. నాకు తెలిసి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.. లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా మస్కా నో ఎదో ఉంది. బట్ డైరెక్టర్ గా అయితే ఫెయిల్ అయ్యారు. కొన్ని కళాఖండాలు తీసిన తర్వాత ఇప్పుడు అగధ సినిమా తీశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు కొడుతున్నాం ఈ సినిమాతో హిట్టు అన్నట్టు అన్నారు.
కానీ ఈ సినిమాలో మాత్రం అన్నంత స్టఫ్ లేదు. అస్సలు బాలేదు సినిమా. మాములుగా నాకే సినిమాకి వెళ్లినా నిద్ర రాదు. కానీ ఈ సినిమాకి మాత్రం ఇంట్రడక్షన్ నుంచే కళ్ళు మూసుకుపోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. సింపుల్ గా సినిమా రిజల్ట్ గురించి చెప్పాలంటే కష్టమే... చాలా కష్టమే... ఇంకా చెప్పాలంటే ఎవరైనా చూసుంటే వాళ్ళని సినిమాలో ఎంత సేపు నిద్రపోకుండా ఉన్నారు అని అడగాల్సొస్తుంది.
Below Average
Agadha movie review
అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు. థ్రిల్ మూవ్మెంట్స్ అసలేమీ కనిపించలేదు. రైటింగ్స్ టూ బ్యాడ్ అని చెప్పాలి. చెప్పుకోవడానికి నాకైతే ఒక్క సీన్ కూడా లేదు. పాపం కష్టపడి మేకర్స్ తీశారు అనడానికి నాకొక్క సీన్ కూడా కనిపించలేదు. పైగా సినిమాలో మనుషుల కన్నా కాకులు మెయిన్ లీడ్ గా చేసారు అనిపించింది.
సినిమాటోగ్రఫి అయితే సినిమాలో బాగుంది. బీజీఎమ్ కొంచెం బాగుంది. కాన్సెప్ట్ చిన్నగా బాగా రాసుకున్నా, స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. డైరెక్టర్ ఏం అనుకోని సినిమా తీశారో ఏం అర్ధం కాలేదు. రైటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. ఇక నా రేటింగ్ ఈ సినేమాకివ్వాలనిపిస్తే... 1.5/5
Average
Agadha Movie Review
By Great Andhra
MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its success.
Highlights
The climax twist
Cinematography
Drawbacks
Lack of novelty in the horror genre
Forced characters
Cliched episodes
Overall, “Agadha” does not provide excitment. It neither scares nor thrills consistently. Apart from the kala tantra episode and a few portions in the second half, it remains a routine horror drama. The ending also hints at a possible second part.
Average
Agadha Movie Review
By NTV Telugu
నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి ఎలాంటి విధ్వంసం సృష్టించింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అన్న అంశాలే సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. దర్శకుడు ఎంఎస్ రాజు మాటల్లో ‘అగధ’కు భారీగా బిల్డప్ ఇచ్చినప్పటికీ.. తెరపై మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.
ముఖ్యంగా సెకండాఫ్‌పై పెట్టుకున్న అంచనాలు నిరాశపరుస్తాయి. కథనం మరింత ఆసక్తికరంగా సాగాల్సిన చోట నెమ్మదించడం సినిమాకు మైనస్‌గా మారింది. ఇక బ్లాక్ మ్యాజిక్‌ను చూపించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టెక్నికల్ టీమ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ఎమ్మెస్ రాజు కథ కొత్తగా ఎంచుకున్నా, ట్రీట్మెంట్ పాత గానే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అగధ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది.
Average
Agadha Movie Review
దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు.
డైరెక్టర్ ఎమ్మెస్ రాజు మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు. ఫైనల్ గా వన్ టైం వాచబుల్.
Average
Agadha movie review
By Tupaki
దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ అగధ సినిమా.
కానీ ఎప్పుడో ఒక సీన్లో మెరుపులు మెరిపించడమే తప్ప.. ఈ సినిమాలో ఫ్లో మాత్రం మిస్ అయింది. ఎగుడు దిగుడు కథనం.. అసహనం కలిగించే కొన్ని పాత్రల చిత్రణ.. ఆ పాత్రల్లో ఆర్టిస్టుల నటన.. స్లో నేరేషన్ అగధ ఫ్లోను దెబ్బ తీశాయి. రైటర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ కోసం ఎఫర్ట్ పెట్టారు కానీ.. అది సరిపోలేదు. ఆయన క్లారిటీ లేని రైటింగ్ వల్ల కథనం ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని సన్నివేశాల వరకు రాజు టేకింగ్ బాగున్నా.. కంప్లీట్ సినిమాను అందించలేకపోయారు. చివరగా: అగధ.. సరిపోని థ్రిల్
Average
Agadha Movie Review
ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్ స్పిరిట్ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్ అయినట్టే.
సినిమాలో.. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్. కాకపోతే దాన్ని టెక్నికల్ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు. టెక్నికల్ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.
Average
Agadha Movie Review
By TV9 Telugu
దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ ఇందులో అదే మిస్ అయింది.
టెక్నికల్ గా ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ పేలవమైన బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి చూసేలానే ఉంది. ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..!
Average
Agadha movie Review
మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్ రాజుగారు `అగధ` ని సీరియస్ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కొన్ని బాగున్నాయి. బీజీఎం ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉంటుంది. మహాదేవి పాత్రలో కామాక్షి అదరగొట్టింది. శ్రావణ్ రెడ్డి పాత్రలోని ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. గుహలోని సన్నివేశాలు థ్రిల్‌కి గురి చేస్తాయి. కానీ కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో థ్రిల్స్ సరిపోవని చెప్పొచ్చు. ఎంఎస్ రాజు చెప్పింతనంతగా అయితే సినిమా లేదు. డివైన్ హర్రర్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది. అగధ కొత్త అనుభవాన్నిస్తుంది. కొంత వరకు ఎంగేజ్ చేస్తుంది.
Average
Agadha movie review
By Sakshi
దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు.
ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అవి ఊహించిన దానికంటే తక్కువే ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ వన్ టైం వాచబుల్.
Average
Agadha movie Review
By Filmi Beat
ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. అయితే ఈ సినిమాలో నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను ఎంఎస్ రాజు రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే.. హిందూ మతమే గొప్పది. హిందూ మతంలో ఆచరించే పద్దతులే ఉత్తమం అనే కోణంలో కథను నడించిన తీరు ఆకట్టుకొంటుంది.
ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ కొత్త రకమైన హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఎలిమెంట్స్, హిందూ మత అచారాలను జోప్పించి చేసిన మిస్టిక్ డివైన్ మిస్టరీ, సైకాలజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను ఎంగేజింగ్‌గా చెప్పడానికి ఎంఎస్ రాజు విజన్ బాగా ప్లస్ అయింది. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ. ఈ వారం మంచి హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకొంటే అగాధ మూవీ బెస్ట్ ఆప్షన్.
Above Average
Agadha movie Review
By 123telugu
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అగధ’ అక్కడక్కడా ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్ గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.
Above Average