Toxic Movie Review
By Filmi Beat
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి సాదాసీదా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఓవరాల్ గా అంచనాలకు ఏ మాత్రం చేరుకోలేని సినిమా అనిపిస్తుంది.
ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. యష్ స్టైలిష్ లుక్, మాస్ ఎలిమెంట్స్ తో, యాక్టింగ్ తో మ్యాజిక్ చేశాడు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కానీ కథ మాత్రం నిల్. సినిమాకు కావాల్సిన మెయిన్ కాన్‌ప్లిక్ట్ లో పస లేకపోవడం వల్ల సెకండాఫ్ డల్ గా సాగుతుంది. అవసరం లేకపోయిన బోల్డ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా నిడివి మరో మైనస్. కనీసం 20 నిమిషాల సినిమాను కట్ చేస్తే.. కొంత బెటర్ అవుట్ పుట్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. మేకింగ్ పై పెట్టిన శ్రద్ద.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ మీద మరింత పెట్టి ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనిపిస్తుంది. ఫైనల్ గా యష్ కోసం, గ్రాండియర్ మేకింగ్ కోసం టాక్సిక్ సినిమా ఓసారి చూడొచ్చు.
Average
Toxic Movie Review
By Tupaki
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. మేకర్స్ ప్రయత్నమైతే గట్టిగానే చేశారు, కానీ కథలో విషయం లేకపోతే.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్సయియితే.. ఎంత భారీగా- స్టైలిష్ గా తీసినా ప్రయోజనం ఉండదు.
‘టాక్సిక్’తో వచ్చిన సమస్య ఇదే. సినిమాలో వైలెన్స్, రొమాన్స్ తప్ప ఇంకేమీ చూపించకపోతే.. అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ‘టాక్సిక్’లో కథా కథనాలు ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తాయన్నది వాస్తవమే అయినా.. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వావ్ అనిపిస్తాయి. ఇక పాత్ర కోసం ప్రాణం పెట్టేసిన యశ్ సూపర్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కష్టాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఓవరాల్ గా టేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కంటెంట్ మరీ వీక్ అయిపోవడంతో ‘టాక్సిక్’ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్నే మిగులుస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్.. నిజంగా టాక్సికే యష్ ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకం.
Average
Toxic movie review
కేజీయఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని ‘ టాక్సిక్ ’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయంలో కథా, నిర్మాణం అన్నింట్లోనూ యశ్ భాగస్వామ్యం ఉంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఈ సినిమా ఏ రేటెడ్ అని స్పష్టంగా చెప్పింది. అయితే సినిమా విషయానికి వస్తే... గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథకి, ఎంచుకున్న నేపథ్యానికి, తెరకెక్కించిన తీరుకి ఎక్కడా పొంతన కనిపించదు. ఇందులో మితి మీరిన హింస, రక్తపాతనం, శృంగారానికి సంబంధించిన సీన్లే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది.
ఇంత గందరగోళంలో దర్శకురాలు, రచయిత రాసుకున్న ఎమోషన్స్ మాత్రం కనిపించకుండా పోతాయి. ఎక్కడా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోవడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుంది. చివరగా.. మితిమీరిన రక్తపాతం, అడల్డ్ సీన్లతో ‘టాక్సిక్’లోని ఎమోషన్స్ కనిపించకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఎంత సేపు నరకడం, కాల్చడం, శృంగార సన్నివేశాలే తప్పా.. ఒక్క చోట కూడా ఎమోషనల్ కనెక్టిటీ ఉండదు. టెక్నికల్ గా స్ట్రాంగ్ అయిన టాక్సిక్.. ఎమోషనల్‌గా వీక్.
Average
Toxic Movie Review
By 123telugu
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ యాక్షన్, పెర్ఫార్మన్స్ లని కోరుకునే వారికి అక్కడక్కడా మూమెంట్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయి.
కానీ ఒక రొటీన్ కథ ఉన్నప్పటికీ నడిపించే కథనం ఎంగేజింగ్ గా ఉంటే చూసే ఆడియెన్ కథ లైన్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోడు. కానీ టాక్సిక్ లో బలమైన కథ మిస్ అయ్యింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విషయానికి వస్తే.. తను మాత్రం డిజప్పాయింటింగ్ చేసారని చెప్పక తప్పదు. పూర్తిగా ఇలా బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేసుకున్నారా.. లేక తర్వాత పరిస్థితులు మారాయా ఏమో కానీ తను ప్లాన్ చేసుకున్న పాయింట్ ని మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనవసర హంగులు, ఆర్భాటాలు యాడ్ చేసి ఆఖరికి నిరుత్సాహన్ని మిగిల్చారు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాక్సిక్” వచ్చిన హైప్ ని మాత్రం అందుకోలేకపోయింది. యశ్ వరకు తన పని నటన వరకు సిన్సియర్ గా చేసి ఇంప్రెస్ చేశారు. కానీ రచనా సహకారం డిజప్పాయింటింగ్ గా ఉంది. స్టార్ నటీనటులు పెర్ఫార్మన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, ఒకటీ రెండు చోట్ల ఎమోషన్స్ ఓకే కానీ పస లేని కథనం, బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ చూసే ఆడియెన్ లోని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. సో వీటితో టాక్సిక్ అంతగా ఆకట్టుకోదు.
Average
Toxic Movie Review
సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను.. కాదు భరించి.. ఆల్మోస్ట్ టార్చర్ అనుభవించి కొద్దిలో తప్పించుకున్నాను. దీనికోసం 435 రూపాయలు పెట్టాను... మళ్ళీ టికెట్ రేట్లు పెంచామాన్నోళ్లు ఈ సినిమాకోసం పెంచారు.. 3 గంటల దారుణం ఈ సినిమా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బైటికొచ్చినోళ్ళు గ్రేట్... ఫస్ట్ సినిమా పాసిటివ్స్ గురించి చెప్పుకుందాం.. సినిమాటోగ్రఫి, యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టైలిష్ గా ఉన్నాయి. అండ్ యష్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. అమ్మాయిలు అందంగా ఉన్నారు.. ఇంతకు మించి ఇంకేం లేవు. క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకున్నారు... ఎంత అంటే... ఇదా... దీని గురించి ఇంత రాసుకుని, ఇంత గందరగోళం చేసారా అన్నట్టుంటుంది సినిమా.
హైలెట్ ఏంటంటే సినిమాలో చెప్పుకోడానికి ఎంతో కొంత కొద్దో గొప్ప ఉండాలి.. కానీ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి సీన్ లేదు. అండ్ సినిమాలో పేజీల కొద్దీ పేజీల డైలాగులు ఉంటాయి... కానీ ఒక్క డైలాగ్ చెప్పడానికి రాదు. అండ్ సినిమా కాన్సెప్ట్ పేపర్ మీద చూస్తే బాగుంటది అనుకున్నట్టుంటది.. కానీ స్క్రీన్ మీద చూస్తేనే భరించలేం.. అండ్ సినిమాలో 3 గంటల 14 నిమిషాల సినిమాలో ఆ 18+ సీన్స్ అన్ని ఎందుకు పెట్టారో ఏంటో అర్ధం కాదు. ఒక్క క్లైమాక్స్ తప్ప ఇంకే సీన్లు ఎందుకు పెట్టారో అర్ధం కాదు. రవి బాసూర్ అయితే మాత్రం ఇంకా డిస్సపాయింట్ చేసారు. ఇవన్నీ పక్కన బెడితే మంచి మంచి తెలుగు సినిమాలో హైక్ ఇవ్వలేదు గాని, ఇలాంటి చెత్త సినిమాలకిస్తారు. తీసింది కళాఖండం అంటే... దానికి మళ్ళీ మేమె డబ్బులొదిలించుకోవాలి. అది మ్యాటరు...
Below Average
Toxic movie Review
టాక్సిక్... 3 hours 15 minutes రన్ టైం తో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది... జెన్యూన్ గా మాట్లాడుకుందాం. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. చాలా అడల్ట్ కంటెంట్, అండ్ హెవీ వైలెన్స్ ఉంది. కొన్ని బూతుల్ని కూడా మ్యూట్ చేయలేదు. ఇక పాయింట్ కొస్తే హాలీవుడ్ మూవీస్ టాక్ తో సంబంధం లేకుండా చూసే కొన్ని వర్గాల ఆడియన్స్ కి మాత్రమే పొరపాటున నచ్చే ఛాన్స్ ఉంది గాని, మన ఆడియన్స్ విషయానికి వస్తే... ఈ సినిమా కనీసం కన్నడ వాళ్ళకైనా నచ్చుతుందా అని డౌట్ ఒచ్చేంత దారుణంగా ఉంది.
అసలు ట్రైలర్ చూసినప్పుడే డౌట్ ఒచ్చింది. అసలు సినిమా స్టోరీ ఏమైనా ఉందా అంటే... నాకు ఏం అర్ధం కాలేదు. ఎదో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఇదా అసలు కథ అని అనిపించింది. ఇంతకు ముందే రీసెంట్ గా తెలుగులో వచ్చిన సత్యదేవ్ మూవీ గుర్తొస్తుంది. అసలు సినిమాలో హైలెట్ సీన్స్ ఎమున్నాయా అని చూస్తే... ఒక్కటి కూడా అనిపించలేదు. అసలు యాక్షన్ మూవీ అనేలా కూడా లేదు. అయితే హీరో యష్ పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. అండ్ నయనతార కూడా బాగా నటించింది. విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద అదిరిపోయాయి.
మైనస్ గురించి చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కి తప్ప దేనికి కూడా కనెక్ట్ అవ్వం. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు కదా. రవి బాసూర్ మ్యూజిక్ కూడా ఏం బాగాలేదు. డైరెక్టర్ వర్క్ అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. ఇంకా మాట్లాడుకోవడమే అనవసరం అసలు. నా రేటింగ్ అయితే కేవలం యష్ పెర్ఫార్మన్స్ అండ్ విజువల్స్ కోసం 2\5.
Below Average
Ameer log movie review
By 10TV Telugu
అమీర్ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశారు. ముగ్గురు లైఫ్ లో సెటిల్ అవుదాం అనే దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బస్తి క్రికెట్ మ్యాచ్ తో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఏమవుతుంది అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి అయితే పెంచారు. ఇక సెకండ్ హాఫ్ లో క్రికెట్ అయిపోయి బిర్యానీ చుట్టూ కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.
ఇక సినిమాలో అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా హైదరాబాద్ బస్తి బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు. మొత్తంగా ‘అమీర్ లోగ్’ ఓ ముగ్గురు హైదరాబాదీ బస్తి కుర్రాళ్ళ కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
Above Average
Ameer Log movie Review
పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్, కల్చర్, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్ లోగ్` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, విశ్వేశ్వర్ రెడ్డి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
సినిమా పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించింది. వారి స్వచ్ఛమైన మనసులను ఆవిష్కరించింది. పాత్రల తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయ్యింది. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు, కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సాగదీత ఎక్కువగా ఉంది. సినిమాలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. సినిమా ఎలా తీశామనేది కాదు, ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ మూవీ విషయంలో ఆ మీటర్ తేడా కొడుతుందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ అమీర్ లోగ్ పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించిన మూవీ. జెన్యూన్ అటెంప్ట్. పాతబస్తీ వాళ్లని ఆకట్టుకునే మూవీ అవుతుంది.
Above Average
Ameer Log Movie Review
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముగ్గురు పనిలేని యువకులు తమ జీవితాలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం అనే స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు.. ‘మేం ఫేమస్’, ఈ మధ్యనే వచ్చిన ‘దీవానా’ చిత్రాలు ఈ తరహా కథతోనే వచ్చాయి. కాకుంటే దర్శకుడు రమణా రెడ్డి పాతబస్తీ నేటివిటీని చూపించే ప్రయత్నం చేశారు.
గతంలో డెక్కన్ సినిమా పేరుతో కొన్ని లోకల్ సినిమాలు వస్తుండేవి. ఇది కూడా ఆ తరహా సినిమానే. ఓల్డ్ సిటీ నేపథ్యం ఓకే అయినా బాష విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సగానికి పైగా ఓల్డ్ సిటీ ఉర్దూతోనే సినిమా నడిచింది. హిందీతో పరిచయం లేని వారికి ఈ సినిమా ఏమాత్రం అర్థం కాదు. సబ్ టైటిల్స్ వేసినా బావుండేది. తెలుగు ఆడియన్స్ కి అయితే అంతగా అర్థం కాకపోవచ్చు. దీనికి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. లాస్ట్ సీన్ లో ఓ చిన్న డైలాగ్ తో ‘అమీర్ లోగ్’ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వటం కొసమెరుపు.
Average
Ameer Log movie review
By NTV Telugu
హైదరాబాదీ నేటివిటీ, ఫ్రెండ్షిప్, యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో వచ్చిన ‘అమీర్ లోగ్’ అక్కడక్కడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్త ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి.
అయితే రొటీన్ కథ, ఊహించగలిగే సీన్స్, వీక్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.
ఫైనల్‌గా: ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓకే అనిపించే టైమ్‌పాస్ మూవీ. కానీ కొత్తగా ఏదైనా ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు!
హైదరాబాద్ నేటివిటీ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ అమీర్ లోగ్ నచ్చే అవకాశం ఉంది.
Average
Ameer log movie review
By Sakshi
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ డ్రామా, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి బిలో యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.
అయితే అసలు సమస్య కథ, కథనంలోనే కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు, తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించేయగలిగేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. దీంతో ఫ్రెష్‌నెస్ మిస్ అవుతుంది.
ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ, రొటీన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వీక్‌గా ఉండటం సినిమాకు మరో మైనస్. దీంతో సినిమా ఇచ్చే ఇంపాక్ట్ చివరి వరకు కొనసాగదు.
‘అమీర్ లోగ్’ అనేది ఫ్రెండ్స్ బ్యాచ్ కలిసి చూస్తే కొంతవరకు ఎంజాయ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కామెడీ, ఎమోషన్స్, హైదరాబాదీ నేటివిటీ కొన్ని చోట్ల ఆకట్టుకున్నా.. రొటీన్ కథనం, ఊహించగలిగే సన్నివేశాలు, బలహీనమైన క్లైమాక్స్ నిరాశపరుస్తాయి.
ఫ్రెండ్స్‌తో కలిసి టైమ్‌పాస్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు.. కానీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్!
Average
Ameer Log movie Review
By Filmi Beat
అమీర్ లోగ్ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రమణారెడ్డి సోమ రాసుకొన్న కథ పక్కా హైదరాబాద్ నేటివిటి కథ. బస్తీ అంటే ఓ కాలనీ కాదు.. ఓ ఎమోషన్ అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. స్నేహం, జులాయితనం, అల్లరి చిల్లరి వేషాలు, కుర్రతనం లాంటి అంశాలు మేలవించి ముగ్గురు కుర్రాళ్ల చుట్టు అల్లుకొన్న కథ బాగుంది. కొత్తవారైనా అవార్డు విన్నింగ్ ఏ మాత్రం తక్కువ కాకుండా పెర్ఫార్మెన్స్‌ను ముగ్గురు కుర్రాళ్లు ఇచ్చారు.
కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించేలా రాసుకున్నారు. ఎస్‌వీకే సినిమాటోగ్రఫి గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. పాతబస్తీని చాలా అందంగా, ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించారు. హైదరాబాద్ బ్లూస్, డాలర్ డ్రీమ్స్ తర్వాత అలాంటి ఫ్లేవర్ ఉన్న డెక్కన్ సినిమా ఇది. పాతబస్తీ కనెక్ట్ ఉన్నవాళ్లు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. డిఫరెంట్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వారం ఈ సినిమాపై తప్పకుండా ఓ లుక్కేయండి.
Above Average