డేవిడ్ రెడ్డి (David Reddy)
డేవిడ్ రెడ్డి (David Reddy) Teaser : He Is Not a Man... Rakshas... Rakshas Reddy... డేవిడ్ రెడ్డిగా "మంచు మనోజ్" అరాచకం... దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు
Available in:
About This Movie
మంచు మనోజ్ రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్ లు లైన్లో పెట్టాడు. "మిరాయ్" మూవీతో విలన్ గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు "డేవిడ్ రెడ్డి" అంటూ మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి వస్తున్నాడు. నిజానికి రెండేళ్ల కిందే మొదలైన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ మెల్లిగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఫైనల్ గా మనోజ్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ డేవిడ్ రెడ్డి విడుదల చేసి మూవీ అప్డేట్ ఇచ్చారు.
ఇక డేవిడ్ రెడ్డి (David Reddy) టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. యానానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా టీజర్ లో మంచు మనోజ్ “డేవిడ్ రెడ్డి” అనే పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2026 దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇక టీజర్ గమనిస్తే సినిమా స్టోరీ నేపథ్యం 1897 నుండి 1920 ల మధ్య బ్రిటిష్ రూలింగ్ టైం లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కథలో డేవిడ్ రెడ్డి, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా హింసాత్మక మార్గాన్ని ఎంచుకుని పోరాడే వ్యక్తిగా చూపించారు. టీజర్ లో మనోజ్ ని చాలా పవర్ ఫుల్ గా, బ్రూటల్ గా ఇంట్రడ్యూస్ చేసిన మేకర్స్, టీజర్ లో అద్భుతమైన యాక్షన్ షాట్స్ ని కూడా స్టన్నింగ్ గా చూపించారు. అంతే కాదు టీజర్ లో జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పాత్రల్ని కూడా చూపించారు. అదే సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా డేవిడ్ రెడ్డి గురించి చర్చిస్తున్నట్టు టీజర్ లో చుపించారు. ఇక టీజర్ లో అతను దేశద్రోహిగా అయినట్టు డైలాగులని బట్టి తెలుస్తుంది. ఓ సందర్భంలో ఆ బ్రిటిషర్లు డేవిడ్ ని రాక్షస్ - “రాక్షస్ రెడ్డి” అని పిలవడం కూడా టీజర్ లో హైలెట్ గా చూపించారు.
ఇక డేవిడ్ రెడ్డి మూవీ లో మ్యారియా ర్యాబోష్ప్క (Maria Ryaboshapka) హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్య కృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తుండగా, హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇయర్ దసరాకి మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.