జైలర్ 2 (Jailer 2)
Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా నేడు (అక్టోబర్ 15) థియేటర్లలో విడుదల అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about జైలర్ 2 (Jailer 2)
Media Reviews
20 Avg: 5.9/10Above Average
Jailer 2 Movie Review
'జైలర్' చూసిన రజనీకాంత్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఎవరికి అయినా సరే... దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రైటింగ్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. నెల్సన్ కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ వినోదానికి రజనీకాంత్ స్టైల్, స్వాగ్ యాడ్ కావడంతో బాక్సాఫీస్ బరిలో 'జైలర్' రికార్డులు క్రియేట్ చేసింది. అటువంటి సినిమాకు సీక్వెల్...
'జైలర్' చూసిన రజనీకాంత్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఎవరికి అయినా సరే... దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రైటింగ్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. నెల్సన్ కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ వినోదానికి రజనీకాంత్ స్టైల్, స్వాగ్ యాడ్ కావడంతో బాక్సాఫీస్ బరిలో 'జైలర్' రికార్డులు క్రియేట్ చేసింది. అటువంటి సినిమాకు సీక్వెల్ అనేసరికి... 'జైలర్ 2' మీద అటు రజనీకాంత్ అభిమానులు, ఇటు సామాన్య ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు ఉంటాయో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar)కు తెలుసు. అంచనాలను అందుకోవడానికి, అభిమానులను శాటిస్ఫై చేయడానికి ఆయన సేఫ్ గేమ్ ఆడారు.
ఇక జైలర్ లో రజనీకాంత్ అంటే స్వాగ్, సూపర్ స్టార్ అంటే స్టైల్. తెరపై ఆయన స్లో మోషన్లో నడిస్తే చాలు అన్నట్టు రజనీ హీరోయిజాన్ని, ఆయన్ను నెల్సన్ దిలీప్ కుమార్ చూపించారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ మరోసారి అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఆ ముగ్గురి కంటే హృతిక్ రోషన్ అతిథి పాత్ర హైలెట్ అని చెప్పాలి. ఇక సినిమా చివరిలో విజయ్ సేతుపతి తళుక్కున మెరిశారు. ఫైనల్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు 'జైలర్' నచ్చిన ప్రేక్షకులను 'జైలర్ 2' మెప్పిస్తుంది. కథ, కథనం, ట్విస్టుల కంటే రజనీ స్టైల్ & స్వాగ్ తెరపై సన్నివేశాలను అలా చూసేలా చేశాయి. యోగిబాబు, నమో నారాయణతో రజనీ చేసిన సెటిల్డ్ కామెడీ నవ్విస్తుంది. అభిమానులతో మరోసారి 'వర్క్ వర్మ... వర్త్' అనిపించే సినిమా.
రేటింగ్: 3/5
Super Hit
Jailer 2 Movie Review
జైలర్ 1 కి సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేనైతే మార్నింగ్ 8:00 AM కి థియేటర్ లో సినిమా చూశానండి. చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే కంప్లీట్లీ అన్ ఎక్స్పెక్టెడ్ గా నాకు చాలా చాలా నచ్చింది సినిమా ఇది. జైలర్ 1...
జైలర్ 1 కి సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేనైతే మార్నింగ్ 8:00 AM కి థియేటర్ లో సినిమా చూశానండి. చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే కంప్లీట్లీ అన్ ఎక్స్పెక్టెడ్ గా నాకు చాలా చాలా నచ్చింది సినిమా ఇది. జైలర్ 1 కన్నా జైలర్ 2 నాకు ఇంకా బెటర్ గా అనిపించింది అండి. ఈ ఇయర్ చూసిన మోస్ట్ ఎంగేజింగ్ మూవీస్ లో టాప్ ఫైవ్ లో ఒకటి అని చెప్పాలి జైలర్ 2. ఇక ఫ్యామిలీస్ తో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్యామిలీతో కూడా. అడల్ట్ కంటెంట్ ఆర్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండవు కానీ యాక్షన్ వైలెన్స్, బ్లడ్ షెడ్, హైటెక్ క్వాలిటీ తెలుసు.
ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ స్వాగ్ అండి. బాగా వర్క్ అయ్యాయి, ఎలివేషన్ సీన్స్ విషయానికి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ అండి. డాల్బీ అట్మాస్ లో సౌండ్ డిజైన్ అండ్ మ్యూజిక్ కలిసి వచ్చిన ఇంపాక్ట్ నాకు గూస్ బంప్స్ ఇచ్చింది. నాకు మేజర్ గా చెప్పుకునే మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు కానీ, ఈ సీక్వెల్ చూస్తే క్యారెక్టర్ కనెక్షన్స్, రిఫరెన్స్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కొంచెం కొంచెం కానీ ఎక్కువ మిస్ అవుతుంది. కమర్షియల్ లాజిక్ హీరోకి అనుకూలంగా సిచువేషన్స్ టర్న్ అవ్వడం, కొన్ని ఫైట్స్ లో హీరోకి అడ్వాంటేజ్ దొరకడం లాంటి సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి,
సో ఫైనల్ గా మూవీ నా వర్డిక్ట్ ఏంటంటే నో డౌట్ అండి జైలర్ 2 నాకు చాలా చాలా చాలా నచ్చింది. నెల్సన్ గారి స్టోరీని, క్యారెక్టర్స్ ని, క్యామియోస్ ని హ్యాండిల్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇక ఈ సినిమాకు నా రేటింగ్ 3.75.
Below Average
Jailer 2 Movie Review
జైలర్ 2 విషయంలో నేనేదైతే ఎక్స్పెక్ట్ చేసిన్నో దానికన్నా దారుణమైంది. అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నా. బేసిక్ గా జైలర్ 1 నాకు యావరేజ్ అనిపించింది. జైలర్ 2 లో కూడా బేసిక్ గా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ నేను అనుకున్న దానికంటే బెటర్ వెళ్ళింది. ముఖ్యంగా నాకు జైలర్ 1 చూస్తున్నప్పుడు మరి ఈ సినిమాలో నెల్సన్ మార్...
జైలర్ 2 విషయంలో నేనేదైతే ఎక్స్పెక్ట్ చేసిన్నో దానికన్నా దారుణమైంది. అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నా. బేసిక్ గా జైలర్ 1 నాకు యావరేజ్ అనిపించింది. జైలర్ 2 లో కూడా బేసిక్ గా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ నేను అనుకున్న దానికంటే బెటర్ వెళ్ళింది. ముఖ్యంగా నాకు జైలర్ 1 చూస్తున్నప్పుడు మరి ఈ సినిమాలో నెల్సన్ మార్క్ ఎక్కువ రావడం లేదు, రజనీకాంత్ గారి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని కాపీ పేస్ట్ కొట్టేసేక నాకంతా. అంతే విలన్ సెట్ లో ఉండరు బేసిక్ అంతే. చెప్తున్నా కదా నాకు రజనీకాంత్ గారిని ఎలివేట్ చేస్తుంటే సూపర్ అనిపిస్తది చూస్తుంటే. బట్ దాన్ని చేసి చేసి సాగగొట్టి పిండి పిండి చేసినాక అర్థం పోయింది. సో కొత్తగా ఏం చేయాలి?
సో మెజారిటీ నాకు జైలర్ 1 టోటల్ సినిమా చూస్తున్నప్పుడు ఏ రకంగా అనిపించిందో నాకు జైలర్ 2 చూసినప్పుడు అదే అనిపించింది. జైలర్ లో అదే అయితది, జైలర్ 2 లో అదే అయితది. ఈసారి విలన్ లు మందలు మందలు వస్తా ఉంటారు. ఇంత మంది ఉన్నారు జోకర్స్ ఉన్నారు వెనక అందరూ. బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది ఏంటో తెలుసా సెకండ్ హాఫ్ లో జైలర్ 1 లో కొన్ని చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. దీంట్లో ఒక రకంగా వాడిరు భయ్యా. ఎమోషన్ రాదు కదా ఇంత దరిద్రంగా అంటే ఏంట్రా ఇది ఏమనుకుంటున్నావ్ అసలు ఛండాలంగా చేసారు. ఇంకా క్యామియోలు వస్తాయే ఉంటాయి దానికి ఎందుకు పెట్టిర్రా అని ఫీలింగ్ వస్తది అన్నమాట. క్యామియోలు ఎందుకు రీజనే లేదు అట్లా అనిపించింది అన్నమాట నాకు ఏదైతే మాత్రం. ఓవరాల్ గా అనిరుద్ డప్పు బాగా కొట్టిర్రు, ఒక గట్టిగా పెట్టిర్రు, బిక్కిలో తెప్పిర్రు అది సిచువేషన్ జైలర్ టు. నాకైతే నచ్చలేదు.
Above Average
Jailer 2 movie review
జైలర్ 2 సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఒకే ఉంది భయ్యా. డీసెంట్.. ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశా. సెకండ్ హాఫ్ మాత్రం డిస్సపాయింట్ అయ్యా. నాకు ఫస్ట్ హాఫ్ ఎందుకు అంత బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్ హాస్ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండి. నెల్సన్ కి ఒక పాయింట్ నుంచి ఇంటర్వెల్ కి ఒక పాయింట్ కి రీచ్ అవ్వాలి. సో ఒక...
జైలర్ 2 సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఒకే ఉంది భయ్యా. డీసెంట్.. ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశా. సెకండ్ హాఫ్ మాత్రం డిస్సపాయింట్ అయ్యా. నాకు ఫస్ట్ హాఫ్ ఎందుకు అంత బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్ హాస్ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండి. నెల్సన్ కి ఒక పాయింట్ నుంచి ఇంటర్వెల్ కి ఒక పాయింట్ కి రీచ్ అవ్వాలి. సో ఒక థ్రెడ్ ఉందన్నమాట. సో దాని చుట్టూ తను అల్లుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా అల్లాడు. ఇట్ వాస్ వెరీ వెరీ వెరీ ఎంగేజింగ్. కామెడీ, చెక్. అనిరుధ్ సాంగ్స్ అండ్ బీజీఎం, చెక్. బట్ అసలు నెల్సన్ కి తన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ తో ఏం చేయాలి, అసలు స్టోరీ ఎటు తీసుకెళ్లాలి అనే క్లారిటీ లేనట్టే అనిపించింది.
నేను జైలర్ చూసినా, అది రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ సీన్స్ ప్లాన్ చేయడానికి నేను ఎలాంటి షాట్స్ తీసుకోవాలి అనే దానితో సీన్ బై సీన్ కూడా అనిపించింది. నాకు సెకండ్ హాఫ్ లో నచ్చిందల్లా ఏంటంటే దేర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ సీన్స్ ఇన్వాల్వింగ్ రజనీ విచ్ ఐ లైక్. అండ్ దెన్ శివరాజ్ గారి క్యారెక్టర్ ని ఎలా అయితే రాప్ అప్ చేశారో అది నాకు బాగా నచ్చింది. బట్ నెల్సన్ కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ బాగా చేస్తాడు, పెక్యులర్ క్యారెక్టర్స్ ని తీసుకొస్తాడు అండ్ సినిమాటోగ్రఫీ కూడా డిఫరెంట్ ఉంటదన్నమాట. నాకైతే కపుల్ ఆఫ్ రజనీ మూమెంట్స్, శివరాజ్ గారి క్యారెక్టర్ అండ్ ఇందాక చెప్పినట్టే ఆ ఎండింగ్ కూడా నాకు బాగా నచ్చిందండి.
Hit
Jailer 2 Movie Review
ఇంక జైలర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగానే ఉంది సినిమా. అంటే see ఒక డీసెంట్ కమర్షియల్ సినిమా. కొంచెం రెగ్యులర్ టెంప్లేట్ లోనే ఉంటది. మనకి యాక్చువల్ గా కొంచెం జైలర్ చూసిన ఫీలే కలుగుతా ఉంటది మోస్ట్లీ. బట్ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ బాగా రాసుకోవడం అండ్ ఆ హై మూమెంట్స్, ఆ స్లో మోషన్ యాక్షన్ సీన్...
ఇంక జైలర్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగానే ఉంది సినిమా. అంటే see ఒక డీసెంట్ కమర్షియల్ సినిమా. కొంచెం రెగ్యులర్ టెంప్లేట్ లోనే ఉంటది. మనకి యాక్చువల్ గా కొంచెం జైలర్ చూసిన ఫీలే కలుగుతా ఉంటది మోస్ట్లీ. బట్ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ బాగా రాసుకోవడం అండ్ ఆ హై మూమెంట్స్, ఆ స్లో మోషన్ యాక్షన్ సీన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అంటే రజినీకాంత్ గారిని చూస్తాను కాబట్టి స్క్రీన్ మీద హై వస్తది లేదంటే అదర్ వైస్ ఏమీ లేదంటే. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే జైలర్ వన్ కంటే తక్కువలో లేదు. అది మేటర్.
ఫస్ట్ హాఫ్ కొంచెం యాక్చువల్ గా లైక్ కొంచెం ఎటు కొంచెం ఎటేటో పోయిన ఫీలింగ్ కూడా కలుగుతా ఉంటది. బట్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా డౌన్టేషన్ ఉంది. ఓవరాల్ గా ఇక్కడ కాన్సంట్రేషన్ అంతా కూడా రజినీకాంత్ గారి మీదే పెట్టారు. బట్ ఏందంటే చెప్తున్నా కదా కొన్ని కొన్ని చోట్ల మటుకు ఏందంటే కాన్సంట్రేషన్ కొంచెం ఎటేటో పోయిన ఫీలింగ్ ఉంటది గమనించినంత వరకు అంతే. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు బాగుంది. శివరాజ్ కుమార్ అంట, మోహన్ లాల్ క్యామియో బాగుంది. హృతిక్ క్యామియో యావరేజ్ గా ఉంది. ఇక ఈ సినిమాకు నా రేటింగ్ 3.65.
Hit
Jailer 2 movie Review
సో గైస్, అదన్నమాట జైలర్ 2. మీకు కనుక జైలర్ సినిమా కనుక నచ్చకపోతే డెఫినెట్‌గా జైలర్ 2 మీకు నచ్చదు. ఎందుకంటే సేమ్ టెంప్లేట్ లో ఆ మూవీ వెళ్తూ ఉంటది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి డైరెక్ట్ గా కంటిన్యూ అవుతూ సెకండ్ పార్ట్ లోకి వచ్చేస్తాం అన్నమాట మనం. ఫస్ట్ పార్ట్ లో ఉన్న కొన్ని సీన్స్ ని ఎ...
సో గైస్, అదన్నమాట జైలర్ 2. మీకు కనుక జైలర్ సినిమా కనుక నచ్చకపోతే డెఫినెట్‌గా జైలర్ 2 మీకు నచ్చదు. ఎందుకంటే సేమ్ టెంప్లేట్ లో ఆ మూవీ వెళ్తూ ఉంటది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి డైరెక్ట్ గా కంటిన్యూ అవుతూ సెకండ్ పార్ట్ లోకి వచ్చేస్తాం అన్నమాట మనం. ఫస్ట్ పార్ట్ లో ఉన్న కొన్ని సీన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ ఆ ఎన్హాన్స్మెంట్స్ ని కొంచెం డబుల్ చేస్తూ ఇక్కడ ఈ బ్లాక్స్ ని పెట్టుకోవడం జరిగిందన్నమాట. మన నెల్సన్ రైటింగ్ లో ఉన్న ఒక ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే అక్కడ యాక్షన్ సీన్ నడుస్తున్నా, ఏ సీన్ నడుస్తున్నా కామెడీ చాలా సీమ్‌లెస్ గా ఆ సీన్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం.
నాకున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ అంటే నాకు ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఆ స్నిపర్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ ఇప్పుడు ఏం జరుగుద్ది అన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నాకు కొంచెం తక్కువ ఉంది. ఇక ఇప్పుడు రజనీకాంత్ కి ఎలివేషన్ ఎలా ఇస్తాడు అండ్ అనిరుధ్ ఆ సీన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో మనకి ఎలా వినిపిస్తాడు అన్న ఎక్సైట్మెంట్ లోనే ఆ సీన్స్ నేను చూడడం జరిగింది. సెకండ్ హాఫ్ లో వచ్చే క్యామియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అసలు ఇంతవరకు మనం ఎప్పుడూ చూడని ఒక హృతిక్ రోషన్ లుక్ తో మన అనిరుధ్ ఇచ్చే ఒక ఫెంటాస్టిక్ బీజీఎమ్ తో ఆ లుక్ సెకండ్ హాఫ్ లో అదిరింది అని చెప్పాలి.
ఇంకా ఓవరాల్ గా ఇంకా మన రజనీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జస్ట్ అలా నించుంటే చాలు, ఆయన నడిస్తే చాలు, ఒక్క నవ్వు అని నవ్వితే చాలు, అది మనకి సూపర్బ్ గా కిక్ ని ఇస్తది. ఇక మన శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ కూడా అదరగొట్టారు. ఇక అనిరుద్ అయితే రజినీ అనగానే ఎక్కడి నుంచి వస్తదో మనోడికి అప్పుడు తెలియదు కానీ చితక్కొట్టి వదిలిపెట్టాడు. ఇంకా ఓవరాల్ గా జైలర్ వన్ చూస్తే హ్యాపీగా మీరు జైలర్ టు కి వెళ్ళిపోవచ్చు. ఆ ఎలివేషన్స్ ని, రజినీకాంత్ ని, క్యామియోస్ ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అండ్ ఓవరాల్ గా ఈ మూవీలో వచ్చే ఆ మంచి మంచి బ్లాక్స్ ని, ఎంజాయ్ చేసి థియేటర్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక ఫెంటాస్టిక్ సీన్ తో మీరు లాస్ట్ సీన్ ని చూసి థియేటర్ లో నుంచి ఇప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, చేస్తాడా లేదా, చేస్తే బాగుంటదా లేదా అన్న కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ మార్క్ తో థియేటర్ లో నుంచి బయటికి వస్తారన్నమాట.
Not Good
Jailer 2 movie Review
మనం మొదలుపెడదాం. జైలర్ 2 సినిమా ఎలా ఉంది అనే కంటే ముందు నాకు ఒకటి తెలియాలి. నెల్సన్ గారు ఏం చెప్పి ఎలా కన్విన్స్ చేశారు? జాకీ ష్రాఫ్ అంటారు, హృతిక్ రోషన్ అంటారు, మోహన్ లాల్ గారు లాస్ట్ టైం ఈసారి ఉన్నారు. అంటే భాషలో ఏమైనా కన్ఫ్యూజనా ఏమో అర్థం కావట్లేదు కానీ చాలా కష్టం అండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే...
మనం మొదలుపెడదాం. జైలర్ 2 సినిమా ఎలా ఉంది అనే కంటే ముందు నాకు ఒకటి తెలియాలి. నెల్సన్ గారు ఏం చెప్పి ఎలా కన్విన్స్ చేశారు? జాకీ ష్రాఫ్ అంటారు, హృతిక్ రోషన్ అంటారు, మోహన్ లాల్ గారు లాస్ట్ టైం ఈసారి ఉన్నారు. అంటే భాషలో ఏమైనా కన్ఫ్యూజనా ఏమో అర్థం కావట్లేదు కానీ చాలా కష్టం అండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకుందాం. సినిమాలో ఏం వర్కౌట్ అయింది అంటే కామెడీ అండి. అది పక్కన పెడితే ఇక మిగతా అంతా సినిమా ఏంట్రా అంటే అంతే. బిల్డ్ అప్, బిల్డ్ అప్ బానే ఉంది. మామూలుగా ఉండదు. హీరో విలన్ ని చంపాలి, విలన్ హీరోని చంపాలి, ఇదే ప్లాట్ అంతే సింపుల్. ఇంత సింపుల్ ప్లాట్ పెట్టుకొని ఎట్లా రా మూడు గంటలు రెండున్నర గంటలు లాగారు అంటే బిల్డ్ అప్ బిల్డ్ అప్ బానే ఉంది.
కొన్ని సీన్స్ అయితే ఒరేయ్ స్నిపర్ లు అంటే ఎప్పుడో మూల కూర్చొని కాలుస్తారు. ఇక్కడ రాకెట్ లాంచర్లు పెట్టుకొని కూడా ఉంటారు రా జనరల్ రెడీగా. ఇట్లా వస్తారు మొనోడు అంతే కళ్ళతో ఇట్లా అంటే అట్లా పోతాయి మిసైల్స్. మళ్ళీ ఎన్నిసార్లు రా అవే అవే తిప్పి తిప్పి తిప్పి అవే ఫస్ట్ టైం తీసుకురావడం క్యామియోలో అన్నట్టు ఈసారి ముగ్గురు వస్తారు ఒకేసారి. అసలు కథలో ఇంకా డెప్త్ లోకి వెళ్తే ఇంకా మొత్తం డప్పే ఉంటది. ఆడియన్స్ మీరు వెళ్ళండి చూడండి మీకు నచ్చితే వాళ్ళకి కింద రాయండి. నాకైతే అస్సలు ఎక్కలేదు.
Above Average
Jailer 2 movie Review
ముందుగా ఇది జైలర్ కి సీక్వెల్ అయినా కూడా ఆల్ మోస్ట్ జైలర్ స్టైల్ లోనే మేకింగ్ ఉంటుంది. ప్రతీ సీన్ లో మంచి ఎలివేషన్ లు సిట్చువేషన్ కి తగ్గ కామెడీతో ఫస్టాఫ్ బాగానే సాగుతూ ఉండగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకున్న సినిమా సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓ రేంజ్ లో ఊపు ఇస్తుంది. ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం...
ముందుగా ఇది జైలర్ కి సీక్వెల్ అయినా కూడా ఆల్ మోస్ట్ జైలర్ స్టైల్ లోనే మేకింగ్ ఉంటుంది. ప్రతీ సీన్ లో మంచి ఎలివేషన్ లు సిట్చువేషన్ కి తగ్గ కామెడీతో ఫస్టాఫ్ బాగానే సాగుతూ ఉండగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకున్న సినిమా సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓ రేంజ్ లో ఊపు ఇస్తుంది. ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా ఫస్టాఫ్ తో పోల్చితే పాత్రలు మరీ ఎక్కువ అవ్వడంతో ఆ కన్ఫ్యూజన్ అలాగే కథ కూడా డ్రాగ్ అవుతూ సాగుతూ ఉన్న టైంలో స్పెషల్ క్యామియోలు మళ్ళీ ఊపు పెరిగేలా చేశాయి.
ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ పోర్షన్ ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా సినిమా డీసెంట్ నోట్ తో ఎండ్ అయ్యి మంచి సినిమానే చూసిన ఫీలింగ్ ను కలిగించింది. సినిమా ఓకే అనిపించే రేంజ్ లో సినిమా ఉండటంతో సాటిస్ ఫై గానే ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు. ఓవరాల్ గా సినిమా లో రజినీని మరోసారి నెల్సన్ ఎక్స్ లెంట్ గా ప్రజెంట్ చేశాడు. కానీ.. కథ సెకెండ్ ఆఫ్ లో ఇంకొంచం టైట్ గా ఉండేలా చూసుకుంటే ఇంకా బాగుండేది. మిగిలిన యాక్టర్స్ అండ్ స్పెషల్ క్యామియోలు అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అనిరుద్ మరోసారి ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కుమ్మేసేలా ఉండగా సెకెండ్ ఆఫ్ మాత్రం ఇంకొంచం బెటర్ గా కట్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా మరీ ఎక్కువ ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే చాలా వరకు ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేసి బయటికి రావొచ్చు.
Above Average
Jailer 2 movie review
‘జైలర్-2’ను ప్రాపర్ సీక్వెల్ గానే తీర్చిదిద్దాడు నెల్సన్. ‘జైలర్’ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది. అయితే ఆల్రెడీ ‘జైలర్’లో హీరో పాత్రేంటి.. తన బలమేంటి.. బలగమేంటి.. ఈ కథ సెటప్ ఏంటి అని అర్థం అయిపోయాక.. ‘జైలర్-2’ స్టోరీ ఏంటో ట్రైలర్లోనే విప్పేశాక.. ప్రేక్షకులను కొత్తగా సర్ప్రైజ్ చ...
‘జైలర్-2’ను ప్రాపర్ సీక్వెల్ గానే తీర్చిదిద్దాడు నెల్సన్. ‘జైలర్’ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది. అయితే ఆల్రెడీ ‘జైలర్’లో హీరో పాత్రేంటి.. తన బలమేంటి.. బలగమేంటి.. ఈ కథ సెటప్ ఏంటి అని అర్థం అయిపోయాక.. ‘జైలర్-2’ స్టోరీ ఏంటో ట్రైలర్లోనే విప్పేశాక.. ప్రేక్షకులను కొత్తగా సర్ప్రైజ్ చేయడానికి ఏమీ ఉండదు. కానీ సినిమాలో పేలిపోయే ఎలివేషన్ ఎపిసోడ్లతో రజినీ అభిమానులకు కావాల్సిన స్టఫ్ ఇచ్చేశాడు నెల్సన్. ఐతే మొత్తం సినిమాను కేవలం ఎలివేషన్లతోనే నడిపించడం కష్టం కదా. కథలో ఏదో ఒక మలుపుండాలి కదా.. సర్ప్రైజులేవో పెట్టాలి కదా.. ఆ దిశగా ఏమీ ఆలోచించలేదు నెల్సన్. పేరుకేమో బోలెడంత మంది విలన్లుంటారు. కానీ అందులో ఎవ్వరూ హీరోను రవ్వంతైనా ఇబ్బంది పెట్టరు.
ఒక సీన్లో విలన్లను కాస్త పైకి లేపడం- ఆ వెంటనే కింద పడేయడం.. హీరో సమస్యల్లో పడ్డట్లు కనిపించడం- వెంటనే అతను పైచేయి సాధించడం.. హీరోకు అసలు ఎదురే లేదన్నట్లుగా సినిమాను నడిపించడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. హృతిక్ క్యామియో పెద్దగా కిక్కు ఇవ్వలేకపోయింది. ద్వితీయార్ధంలో కథకు కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ‘జైలర్’ తరహాలోనే క్యామియోల మెడ్లీ.. ఒక భారీ ఎలివేషన్ తో సినిమాను ముగించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘జైలర్-2’ ఫుల్ లెంత్ రజినీ నుంచి ఆశించే ఎలివేషన్లు.. నెల్సన్ నుంచి కోరుకునే కామెడీతో పైసా వసూల్ అనిపించే ఎంటర్టైనరే. అంతకుమించి ఎక్కువ ఆశిస్తేనే కష్టం. అయినప్పటికీ ఒకసారి చూడ్డానికి ఇది ఢోకా లేని సినిమానే. చివరగా జైలర్-2.. అదే సెటప్.. అయినా ఎంటర్టైన్మెంట్
Above Average
Jailer 2 Movie Review
మొదటి పార్ట్ తోనే ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ నెల్సన్, ఈ సీక్వెల్ లో తనకు బాగా అలవాటైన పిచ్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో నవ్విస్తూనే, ప్రతీ పది నిమిషాలకు ఒక అదిరిపోయే హై మూమెంట్ ఇస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త నెమ్మద...
మొదటి పార్ట్ తోనే ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ నెల్సన్, ఈ సీక్వెల్ లో తనకు బాగా అలవాటైన పిచ్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో నవ్విస్తూనే, ప్రతీ పది నిమిషాలకు ఒక అదిరిపోయే హై మూమెంట్ ఇస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి భాగం టెంప్లేట్లోనే సాగడంతో కొత్త విలన్లు వచ్చినా పెద్దగా ఫ్రెష్‌నెస్ కనిపించదు. పైగా ఎస్జే సూర్యతో వచ్చే సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తుంటాయి. దాదాపు 3 గంటల నిడివి ఉండటం వల్ల సెకండాఫ్‌లో మెయిన్ సీన్స్ మధ్య గ్యాప్ ఎక్కువై సాగదీసినట్టు అనిపిస్తుంది.
క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ బాగున్నప్పటికీ, దాన్ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసుంటే ఇంపాక్ట్ మరోలా ఉండేది. మొత్తానికి పార్ట్ 3 కూడా ఉండబోతోందనే హింట్ ఇస్తూ ఈ ఫ్రాంచైజీని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు రజనీకాంత్ తర్వాత అంతటి బలాన్ని ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. పాత జైలర్ థీమ్ మ్యూజిక్‌ను మళ్ళీ వాడుతూ మూడ్ సెట్ చేసిన తీరు థియేటర్లలో దుమ్మురేపింది. రైటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండి, సెకండాఫ్ పేసింగ్‌పై దృష్టి పెట్టుంటే రిజల్ట్ మరో రేంజ్లో ఉండేది. 3 గంటల రన్‌టైమ్‌ను తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. ఓవరాల్‌గా జైలర్ 2.. టైగర్ కా హుకుం.. పర్ఫెక్ట్ సీక్వెల్..
Above Average
Jailer 2 Movie Review
ఇక జైలర్ సినిమా మాదిరిగానే జైలర్ 2 కూడా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతుంది. ఫస్టాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్, రజనీకాంత్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా ఎంగేజింగ్ గా తీసుకొచ్చాడు. సినిమాలో కామెడీ, మాస్ అంశాలు, ఎమోషన్స్ ఇలా అన్నీ పక్కాగా ఉండేలా, ఏ విషయంలోనూ త...
ఇక జైలర్ సినిమా మాదిరిగానే జైలర్ 2 కూడా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతుంది. ఫస్టాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్, రజనీకాంత్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా ఎంగేజింగ్ గా తీసుకొచ్చాడు. సినిమాలో కామెడీ, మాస్ అంశాలు, ఎమోషన్స్ ఇలా అన్నీ పక్కాగా ఉండేలా, ఏ విషయంలోనూ తక్కువ కాకుండా రెండో భాగంలో మరింత జాగ్రత్తపడ్డాడు నెల్సన్. మొత్తానికి ఫస్టాఫ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అని చెప్పాలి.
అలాగే సెకండాఫ్ నుంచి కథ అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పాలి. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా సెకండాఫ్ ను లాగించాడు నెల్సన్. హృతిక్ రోషన్ కేమియో సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అలాగే మూవీ క్లైమాక్స్ లో మరో కీలక నటుడి కేమియో కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా జైలర్ 3 కు లీడ్ ఇస్తూ సినిమా ముగుస్తుంది. ఇక చివరగా సినిమాలో ప్లస్ లు చూస్తే రజనీకాంత్ యాక్టింగ్, మాస్ ఎలివేషన్స్, ఫస్టాఫ్, కామెడీ.. అలాగే మైనస్ లు చూస్తే.. సెకండాఫ్, సాంగ్స్ అని చెప్పొచ్చు.
Above Average
Jailer 2 Movie Review
మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీకిది సీక్వెల్. అందులో రౌడీలకు దగ్గరై నేరాలకు పాల్పడుతున్న సొంత కొడుకునే చంపేస్తాడు రజనీకాంత్. ఆ సమయంలో మరణించిన విలన్ వర్మకి పైన ఉన్నవాళ్లు హీరో కోసం వెతుకుతుంటారు. హీరో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువ చేసే విగ్రహాలను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హీర...
మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీకిది సీక్వెల్. అందులో రౌడీలకు దగ్గరై నేరాలకు పాల్పడుతున్న సొంత కొడుకునే చంపేస్తాడు రజనీకాంత్. ఆ సమయంలో మరణించిన విలన్ వర్మకి పైన ఉన్నవాళ్లు హీరో కోసం వెతుకుతుంటారు. హీరో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువ చేసే విగ్రహాలను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హీరోని ఎలా ఇబ్బంది పెట్టారు? ఆ స్మగ్లింగ్ మాఫియా ఆటలను ముత్తువేల్ ఎలా ఆట కట్టించాడనేది సింపుల్‌గా ఈ మూవీ కథ. ప్రారంభంలో సరదాగా, కామెడీగా వెళ్తుంది. మెయిన్ గా రజనీకాంత్ ఎలివేషన్లు, యాక్షన్‌ని బేస్ చేసుకొని సినిమాని నడిపించారు. ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ సీన్లు పూనకాలు తెప్పిస్తాయి. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎలివేషన్లని పర్ఫెక్ట్ గా రాసుకొని మూవీని నడిపించారు.
అయితే విలన్లకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ప్రారంభంలో వాహ్ అనిపించినా, ఆ తర్వాత తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. హృతిక్ రోషన్ ఎంట్రీ బాగుంది, కానీ వాహ్ ఫీలింగ్ ఇవ్వలేదు. మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే గెస్ట్ అప్పీయరెన్స్ లు ఇందులో అంతగా పేలలేదు. కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మాస్ ఎలిమెంట్లు, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ డ్రామాని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి సినిమాని నడిపించిన తీరు బాగుంది. ఓవరాల్‌గా మాస్ ఆడియెన్స్ కి, రజనీ అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటి మూవీ అవుతుంది. కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు అద్ది, మాస్ ఆడియెన్స్ కావాల్సిన అన్ని అంశాలు మేళవించి రూపొందించిన చిత్రమిది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ట్విస్ట్ లతో అల్లడించే మూవీ అవుతుంది.
Above Average
Jailer 2 movie Review
నెల్సన్ 'జైలర్' కోసం ఓ సింపుల్ కథనే ఎంచుకున్నాడు. కానీ తన స్టైల్ ఆఫ్ మేకింగ్, డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే ఫార్మాట్‌ను వాడుకున్నాడు నెల్సన్. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ నేటి ఆడియెన్స్‌కి ఏం కావాలి.. ఎక్కడ విజిల్స్ వేయించాలి.. ఎక్కడ...
నెల్సన్ 'జైలర్' కోసం ఓ సింపుల్ కథనే ఎంచుకున్నాడు. కానీ తన స్టైల్ ఆఫ్ మేకింగ్, డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే ఫార్మాట్‌ను వాడుకున్నాడు నెల్సన్. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ నేటి ఆడియెన్స్‌కి ఏం కావాలి.. ఎక్కడ విజిల్స్ వేయించాలి.. ఎక్కడ స్లోమోషన్ షాట్స్ పెట్టాలి.. ఎక్కడ ఎమోషన్ పండించాలి అని లెక్కలు వేసుకుని మరీ పకడ్బంధీగా రాసుకున్నాడు నెల్సన్. కథ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ రజినీకి పడే ఎలివేషన్స్ అదిరిపోతాయి.
సెకండాఫ్ ఆరంభంలోనే ఎస్ జే సూర్య పాత్ర ఎంట్రీ, అతని రేంజ్ చూపించే సీన్ ఇలా అన్నీ బాగుంటాయి.
ఇక సినిమా కొన్ని ల్యాగ్ సీన్స్ తో అలా డౌన్ అవుతుంది అనుకున్న టైంలోనే అదిరిపోయే ఎంట్రీలు, ట్విస్ట్‌లు, స్పెషల్ అప్పియరెన్స్‌లు అదిరిపోతాయి. చివరకు క్లైమాక్స్ ఫుల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. చివరగా.. ఊహకందేలా సాగే కథనం, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించడం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా విజిల్స్ వేయించే మూమెంట్స్ ఉండటంతో ఎక్కడా కూడా బోర్ కొట్టదు. జస్ట్ రజినీ ఆరా ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలంతే. జైలర్ 2 విషయంలోనూ.. టైగర్.. టైగర్ కా హుకూం.. అని చెప్పాల్సిందే. ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద ఈ ముత్తువేల్ పాండ్యన్ రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు.
Average
Jailer 2 Movie Review
Superstar Rajinikanth and Nelson Dilip Kumar are back with a Sequel Jailer2. Rajinikanth is elegant and stylish just like the first part, We see in him a simple look that is age-appropriate and decent costumes.Nelson Dilip Kumar directs Jailer 2. The best part of his work is the first half where he...
Superstar Rajinikanth and Nelson Dilip Kumar are back with a Sequel Jailer2. Rajinikanth is elegant and stylish just like the first part, We see in him a simple look that is age-appropriate and decent costumes.
Nelson Dilip Kumar directs Jailer 2. The best part of his work is the first half where he brilliantly embedded entertainment and heroism.
Positives:
1. First Half
2. Superstar Rajinikanth’s Swag
3. Adrenaline-Thumping Moments
Negatives:
1. Second Half
2. Bland Family Drama
3. Not-So-Effective Cameos
Finally, Jailer 2 is a mixed bag. The first half of the film has everything in it to become a blockbuster but a lackluster second half brought down the overall graph of the film. It is because of this mismatch in execution between both the halves of the films, it ended up giving a mixed feeling.
Bottomline: Blockbuster First Half, Weak Second Half!
Above Average
Jailer 2 Movie Review
సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2'. మొదటి భాగం భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సీక్వెల్ లో నెల్సన్ రాసిన కథ, కథనం, మరియు సంభాషణలు ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఫస్ట్ హాఫ్ ని నెల్సన్...
సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2'. మొదటి భాగం భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సీక్వెల్ లో నెల్సన్ రాసిన కథ, కథనం, మరియు సంభాషణలు ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఫస్ట్ హాఫ్ ని నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీ, ఎమోషన్స్, మరియు పవర్-ప్యాక్డ్ యాక్షన్‌తో ఎంతో ఆసక్తికరంగా మలిచారు. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు మరియు ఇచ్చిన ఎలివేషన్లు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కల్పక్ ఫ్యామిలీ ఎంట్రీతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఇక బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఎంట్రీ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతిల క్యామియో పాత్రలు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసింది. ఫైనల్ గా ప్రథమార్థంలో కామెడీ, ద్వితీయార్థంలో డ్రామా మరియు యాక్షన్ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ దిశగా నిలబెట్టాయి.
Above Average
Jailer 2 Movie Review
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపుతోంది! ఫస్టాఫ్ అంతా మార్క్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నెల్సన్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వగా, దిలీప్ క్యారెక్టర్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ దెబ్బకి సెకండాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక సెకండ...
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపుతోంది! ఫస్టాఫ్ అంతా మార్క్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నెల్సన్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వగా, దిలీప్ క్యారెక్టర్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ దెబ్బకి సెకండాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇక సెకండాఫ్‌లో కల్పక్ ఫ్యామిలీ ఎంట్రీ, ముత్తువేల్ పాండియన్ మైండ్ గేమ్స్ వర్కవుట్ అయ్యాయి. దీనికి తోడు హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, కాంత కల్పక్, విజయ్ సేతుపతిల మాస్ కామియోలు థియేటర్లలో పూనకాలు తెప్పించగా, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌కి తీసుకెళ్ళింది. జైలర్ 3కి ఇచ్చిన క్రేజీ లీడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్! దసరా హాలిడేస్కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే పక్కా బ్లాక్‌బస్టర్ బొమ్మ! అయితే నిడివి ఇంకా తగ్గించాల్సింది. లొకేషన్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఫైనల్ గా ఒక్క మాత్రలో చెప్పాలంటే రజిని మార్క్ ఎంటెర్టైనింగ్ జైలర్ 2 విత్ అనిరుద్ మ్యూజిక్
Above Average
Jailer 2 movie review
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జైలర్ 2’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. టైగర్ ‘ముత్తువేల్ పాండియన్’ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను ఎప్పటిలాగే ఉర్రూతలూగించారు. అతిధి పాత్ర...
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జైలర్ 2’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. టైగర్ ‘ముత్తువేల్ పాండియన్’ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను ఎప్పటిలాగే ఉర్రూతలూగించారు. అతిధి పాత్రల్లో నటించిన హృతిక్ రోషన్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. అయితే జైలర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు యాక్షన్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో కొన్ని చోట్ల ట్రీట్మెంట్ ను రాసుకోలేదు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా ఇంకా బెటర్ వర్క్ చేయాల్సింది. జైలర్ 2 అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో.. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, సూపర్ స్టార్ స్వాగ్, భారీ క్యాస్టింగ్ స్పెషల్ ఎలివేషన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల రెగ్యులర్ ప్లేతో కథనం సాధారణంగా సాగింది. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ ఆకట్టుకుంటాయి.
Hit
Jailer Movie Review
జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ, సన్నివేశాలు, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి చేసిన సన్నివేశాలు నెల్సన్ ప్రతిభకు అద్దం పట్టాయి. ఇక రజనీకాంత్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు, ఆయన పాత్...
జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ, సన్నివేశాలు, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి చేసిన సన్నివేశాలు నెల్సన్ ప్రతిభకు అద్దం పట్టాయి. ఇక రజనీకాంత్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు, ఆయన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. దిలీప్‌తో ఇంటర్వెల్ సీన్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లి సెకండాఫ్‌పై అంచనాల పెంచాడు. ఇక సెకండాఫ్ లో కల్పక్ ఫ్యామిలీని ఎంట్రీ ఇవ్వడంతో ముత్తువేల్తో ఆడించిన గేమ్ సినిమాకు హైలెట్. సెకండాఫ్ లో సూర్యతో కొడుకును ముత్తువేల్ చంపారని కుటుంబానికి చెప్పే సీన్ హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది.
హృతిక్ రోషన్ ఎంట్రీ, శివరాజ్ కుమార్ చుట్టూ తిరిగే కథ ఈ సినిమాను లేపి ఎక్కడో కూర్చుండపెట్టారనిపిస్తుంది. అయితే కాంత కల్పక్, విజయ్ సేతుపతి ఎంట్రీతో జైలర్ 3 ఇచ్చిన లీడ్ మరింత అంచనాలు పెంచేలా చేసింది. అన్నిటికి మించి అనిరుద్ మ్యూజిక్ తో సినిమాని ఎక్కడో నిలబెట్టాడు. జైలర్ 2 సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రజనీ ఇమేజ్ను అసెట్ గా చేసుకొని నెల్సన్ చేసిన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్. ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌లో యాక్షన్ డ్రామా ఈ సినిమాను సూపర్ హిట్ సినిమాగా మార్చేలా చేశాయని చెప్పవచ్చు. ఇక శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి పాత్రలు క్రేజీగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉంటుంది. దసరా పండుగ సెలవుల్లో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫుల్ ఎంటర్టైన్మెంట్. డోంట్ మిస్ ఇట్.
Above Average
Jailer 2 Movie Review
#Jailer2 #IDreamMediaRating 3/5...పక్కా పైసా వసూల్కమర్షియల్ ఎంటర్ ట్రైనర్..మాస్ ఎలిమెంట్ లువినోదంసెంటిమెంట్ అన్నీసమపాళ్ళలోమిక్స్ చేయడందర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర…తొలి సగం మొత్తంస్టోరీ లీడ్ కి వదిలేసిమలి సగం నిటోటల్ కథ కివాడుకున్నారు..అందువల్ల రెండో సగంకాస్త హెవీ అనిపిస్తుంది..కానీ రజనీ లాంటిసీనియ...
#Jailer2 #IDreamMediaRating 3/5
...
పక్కా పైసా వసూల్
కమర్షియల్ ఎంటర్ ట్రైనర్
..
మాస్ ఎలిమెంట్ లు
వినోదం
సెంటిమెంట్ అన్నీ
సమపాళ్ళలో
మిక్స్ చేయడం
దర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర
…
తొలి సగం మొత్తం
స్టోరీ లీడ్ కి వదిలేసి
మలి సగం ని
టోటల్ కథ కి
వాడుకున్నారు
..
అందువల్ల రెండో సగం
కాస్త హెవీ అనిపిస్తుంది
..
కానీ రజనీ లాంటి
సీనియర్ స్టార్ కి ఈ కథ..కథనం
పక్కాగా సరిపోతాయి
అనే చెప్పాలి
…
అక్కడక్కడ నెమ్మదించినట్లు
అనిపించినా
కామన్ ప్రేక్షకుడికి
అది పెద్దగా ఇబ్బంది పెట్టదు
…
పంచ్ లైన్…
సక్సెస్ 2
Average
Jailer 2 Movie Review
#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and Anirudh’s BGM. But the writing gets weaker as it goes on, with the SJ Suryah and Vidya Balan villai...
#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!
First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and Anirudh’s BGM. But the writing gets weaker as it goes on, with the SJ Suryah and Vidya Balan villain tracks feeling tiring and impactless, while the film moves away from the entertainment that works best.
Rajinikanth’s screen presence still delivers, but even the elevation scenes don’t hit consistently. The cameos also feel more like plot devices than genuine high points and fail to create the same impact as the first film. Entertaining in stretches, but ultimately an average sequel.
Rating: 2.5/5
Public Reviews
5 Avg: 6.4/10Above Average
Jailer 2 movie Review
Just ippude Jailer 2 movie first show chusoccha.. trailer chusinappude naku doubt occhindi. idi debbesela undani.. but na expectations wrong ayyayi.. ante total ga kadu.. cinema not bad ani cheppochu. jailer first part kooda naku avarage ga anipistadi.. and rajinikanth fan ni nenu.. but fact matlada...
Just ippude Jailer 2 movie first show chusoccha.. trailer chusinappude naku doubt occhindi. idi debbesela undani.. but na expectations wrong ayyayi.. ante total ga kadu.. cinema not bad ani cheppochu.
jailer first part kooda naku avarage ga anipistadi.. and rajinikanth fan ni nenu.. but fact matladali ante.. first part lo anirudh music remove cheste em undadu.. ee second part kooda alage untadi..
ee second part ni kooda same jailer lage continue chestadu. naku nacchandi entante villan ni weak ga chestaru.. specially hero mundu em cheyalekapotadu.. alantappudu antha mandi herolanu malli cameos ga vadalsina paniledu.
and movie lo plus entante rajini swag, and sivaraj kumar, mohan lal cameos.. hrithik roshan cameo kooda parledu.. but ekkuva expect chesam... overall movie avarage gane anipinchindi.. but thalaiva kosam okasari definetly chudocchu.
Above Average
Jailer 2 Movie Review
Just now watched Jailer 2 first show.. Honestly, jailer 2 movie turned out to be a decent stress-buster, but let's be real—it's pretty much a standard, regular commercial template.The movie relies heavily on the exact same formula as part one. What actually saves the film and gives you those hype mo...
Just now watched Jailer 2 first show.. Honestly, jailer 2 movie turned out to be a decent stress-buster, but let's be real—it's pretty much a standard, regular commercial template.
The movie relies heavily on the exact same formula as part one. What actually saves the film and gives you those hype moments is pure Rajinikanth charisma on screen, Without Thalaivar's screen presence, there isn't much depth in the script.
First Half Super engaging! comedy track works really well and keeps the vibe light and fun.
Second Half Takes a noticeable dip. overall Rajini's swag, Anirudh’s score, and some solid first-half entertainment.overall decent
Above Average
Jailer 2 Movie Review
workplace lo deadline tension stress antha okkasaari ga pothadi ee movie chusthe! 'Jailer 2' aithe pakka office gang tho weekend plan cheyvalsina item! Nelson sir, Thalaivar Rajinikanth ni chupinchina vidhanam chusi office breaks lo kurchoni ade matladukuntunnam.second haf lo Middle lo Hrithik Rosh...
workplace lo deadline tension stress antha okkasaari ga pothadi ee movie chusthe! 'Jailer 2' aithe pakka office gang tho weekend plan cheyvalsina item!
Nelson sir, Thalaivar Rajinikanth ni chupinchina vidhanam chusi office breaks lo kurchoni ade matladukuntunnam.
second haf lo Middle lo Hrithik Roshan, Shivarajkumar, Mohanlal, Vijay Sethupathi cameo entries ki theaters lo mass racche! Anirudh BGM aithe project presentation lo bajan kante gattiga mind lo mothagae untadi.
but jailer 3 kooda untundani announce cheyadam assalu nacchaledu. because jailer entha bagunna.. BGM teeseste chala boring movie.. furst part kanna, takkuva nacchindi jailer 2. ippudu third part kooda ante assalu intrest undadu.. jailer 2 ayithe low expectations tho velte baga nacchuddi.
Hit
Jailer 2 Movie Review
OMG guys... నేనైతే తట్టుకోలేకపోతున్నా! 'Jailer 2' చూశా? థియేటర్ లో రచ్చ అంటే మామూలు రచ్చ కాదు.. Nelson sir, మన Rajinikanth Thalaivar ని చూపించిన తీరుకి కంప్లీట్ Fan Girl Mode ON అయిపోయింది!అసలు Mind-blowing అయిపోయా ఆ Interval Scene కి... Goosebumps వచ్చేసాయి! Second Half లో Muthuvel Mind Games, అండ...
OMG guys... నేనైతే తట్టుకోలేకపోతున్నా! 'Jailer 2' చూశా? థియేటర్ లో రచ్చ అంటే మామూలు రచ్చ కాదు..
Nelson sir, మన Rajinikanth Thalaivar ని చూపించిన తీరుకి కంప్లీట్ Fan Girl Mode ON అయిపోయింది!
అసలు Mind-blowing అయిపోయా ఆ Interval Scene కి... Goosebumps వచ్చేసాయి!
Second Half లో Muthuvel Mind Games, అండ్ ఆ Emotional Scenes కన్నీళ్లు తెప్పించేసింది
and Hrithik Roshan, Shivarajkumar, Mohanlal, Entrees కి థియేటర్లో పిచ్చి కేకలు! Anirudh BGM కి అయితే థియేటర్ ఊగిపోయింది. and last లో 'Jailer 3' Lead చూసి షాక్ అయ్యా! నాకైతే jailer ఫస్ట్ పార్ట్ రేంజ్ లో కాదు గాని బానే నచ్చింది.
Hit
Jailer 2 Movie Review
Just ippude 'జైలర్ 2' చూసొచ్చా.. థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రచ్చ జరుగుతోంది! నెల్సన్ రజనీ ఇమేజ్ ని అడ్డంపెట్టి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేశాడు. ఫస్టాఫ్ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌తో పాటు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది!ఇక సెకండాఫ్‌లో ముత్తువేల్ పాండియన్ మ...
Just ippude 'జైలర్ 2' చూసొచ్చా.. థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రచ్చ జరుగుతోంది! నెల్సన్ రజనీ ఇమేజ్ ని అడ్డంపెట్టి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేశాడు. ఫస్టాఫ్ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌తో పాటు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది!
ఇక సెకండాఫ్‌లో ముత్తువేల్ పాండియన్ మైండ్ గేమ్ లు, మధ్యలో హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మాస్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ అయిపోయింది. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిన బీజీఎం అయితే థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది! లాస్ట్‌లో 'జైలర్ 3'కి ఇచ్చిన లీడ్ చూశాక వెయిటింగ్ స్టార్ట్ అయిపోయింది. రజిని ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడని సీక్వెల్.. నాకైతే నచ్చింది.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జైలర్ అయిన టైగర్ "ముత్తువేల్ పాండియన్" (రజనీకాంత్) తన కొడుకు చనిపోయిన తర్వాత కోయంబత్తూర్ లో ఓ సూపర్ మార్కెట్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తూ, తన ఫ్యామిలీని చూసుకుంటూ సాధారణ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలాగే ఫ్యామిలీకి తెలీకుండా, తాను చంపిన వర్మ అనుచరుల గురించి, అతని బాస్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక ఓ చిన్న లోకల్ గుండా దగ్గర డ్రైవర్ గా చేస్తూ, తన కొడుకు తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కారణమైన బోధి కల్పక్ (ఎస్జే సూర్య) గురించి తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అటు కల్పక్ ఫ్యామిలీ జైలర్ ఫ్యామిలీని వెతుకుతుంటే, ఇటు ముత్తువేల్ పాండియన్ వర్మ వెనకాల ఉన్న కల్పక్ ఫ్యామిలీని ఇతర గుండాలను వెతికి చంపే పని పెట్టుకున్నాడు. మరి కల్పక్ ఫ్యామిలీ నుండి టైగర్ తన ఫ్యామిలీ ని ఎలా రక్షించుకున్నాడు. తన టీమ్ (శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్) తో కల్పక్ ఫ్యామిలీను ఎలా అంతం చేశాడన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus points :
మాములుగా రజిని సినిమాలకు ప్రమోషన్లతో పెద్దగా పని ఉండదు. పైగా ఈ జైలర్ 2 బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ కావడంతో ముందు నుండే భారీ అంచనాలున్నాయి సినిమాపై. ఇక సినిమాలో "ముత్తువేల్ పాండియన్" గా రజినీకాంత్ మరోసారి అదరగొట్టారని చెప్పాలి. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఎమోషన్స్ లోనూ వేరియషన్స్ చూపించారు. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో తన స్టైలిష్ లుక్స్ తో కూల్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాకి రెండో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ స్టార్ హీరోస్ పాన్ ఇండియా క్యామియోస్. లాస్ట్ టైం జైలర్ లో గెస్ట్ రోల్ లో నటించిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లతో పాటు ఈసారి హృతిక్ రోషన్ కూడా అదిరిపోయే క్యామియో రోల్ రఫ్ఫాడించాడు. విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా బాగుంది. ఇక మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక ట్రైలర్ చూసినపుడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి దెబ్బేస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి కానీ, జైలర్ కి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ని ప్రెజెంట్ చేసాడు. కాకపోతే విలన్ రోల్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలబగా, మూడో పార్ట్ కి ఇచ్చిన లీడ్ హైప్ కూడా బాగుంది.
Minus Points :
అయితే సినిమాలో జైలర్ గా రజిని పాత్రను, మరోసారి బాగానే చూపించిన డైరెక్టర్, సినిమా ట్రీట్మెంట్ ని సరిగా రాసుకోలేదు. స్టోరీ పాయింట్ సింపుల్ గా ఉండగా, స్క్రీన్ ప్లే పై కాకుండా ఎలివేషన్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. పైగా కొన్ని సీన్స్ స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మాములుగా నెల్సన్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయని తెలిసిందేగా. ఫస్ట్ హాఫ్ ని బాగానే రాసుకున్నా, సెకండ్ హాఫ్ ని బాగా సాగదీశారు. పైగా సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఊహాజనితంగానే ఉంటాయి. పైగా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కొంత డిస్సపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా జైలర్ 2 లో ఎమోషన్స్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. గెస్ట్ అప్పీరెన్స్ లు బాగున్నాయి, కానీ అనిరుద్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తే ఇంకా బాగుండేది.
Technical values :
టెక్నికల్ గా చూసుకుంటే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అన్ని రకాలుగా మేకింగ్ లో క్వాలిటీ మూవీని అందించాడు. అయితే దర్శకుడిగా బాగానే నడిపించినా, రచయితగా సరైన కథనాన్ని రాసుకోవడంలో తడబడ్డాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సెకండ్ హీరోగా బ్యాక్ బోన్ అయ్యాడు. స్పెషల్లీ బీజీఎమ్ తో గూస్బంప్స్ తెప్పించాడు. అలాగే విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్ లో ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
Final Review :
ఫైనల్ గా జైలర్ 2 అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా, రజిని మార్క్ మ్యానరిజం అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పవర్ ఫుల్ క్యామియోస్ తో ఫ్యాన్స్ కి మరోసారి ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. అలాగే అనిరుద్ క్రేజీ మ్యూజిక్ తో పాటు, నెల్సన్ మార్క్ డైరెక్షన్ సినిమాకి ప్లస్ అయింది. అయితే స్టోరీ రెగ్యులర్ అండ్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ తో సాగడం వల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కొంత డిస్సపాయింట్ అయినా, రెగ్యులర్ మూవీ లవర్స్ బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది.