కూర్మ అవతార్ (KurmaAvatar)
Kurma Avatar Teaser : ఫాంటసీ ఎలిమెంట్స్ తో గ్రాండియర్ గా "కూర్మావతార్" టీజర్... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
About This Movie
వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi sharatkumar) మెయిన్ లీడ్ లో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ (Shivaraj kumar) ప్రత్యేక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చిత్రం "కూర్మ అవతార్" (Kurma avatar). హర్షవర్ధన్ కడియాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పంచవక్త్ర బ్యానర్ లో కె.సేవిత, పూజిత కె., నరేంద్ర నిర్మిస్తున్నారు. ఇక కూర్మావతార్ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
సినిమాలో సాయికుమార్, రాజ్ తరుణ్, శివాజీ, అతిరా రాజ్, లౌక్య సాయి , గెటప్ శ్రీను , మహేష్ విట్టా , Vtv గణేశన్ , శత్రు , సప్తగిరి తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయగా, దిల్ రాజు స్పెషల్ గెస్ట్ గా హాజరయి బెస్ట్ విషెస్ అందచేశారు. ఇక టీజర్ ని గమనిస్తే... శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని రిఫరెన్స్ గా తీసుకుని ఈ మూవీకి ఫాంటసీ స్టోరీ రాసుకున్నట్టు తెలుస్తుంది. మాములుగా మనందరికీ తెలిసిన దైవ శక్తి - దుష్ట శక్తి మధ్య వార్ లాగానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా రాసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో శివరాజ్ కుమార్ కాలభైరవుడిగా కనిపిస్తున్నట్టు సమాచారం.
అలాగే రాజ్ తరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్టు టీజర్ ని చూస్తే అనిపిస్తుంది. ఇక టీజర్ గ్రాండ్ VFX విజువల్స్ తో గ్రాండియర్ గా మెప్పిస్తుంది. అలాగే ఓ టెంపుల్ కి సంబంధించిన స్థల పురాణం ఇందులో చూపించే అవకాశం ఉంది. అలాగే టీజర్ కి అజనీష్ లోక్ నాథ్ అందించిన బీజీఎమ్ కూడా బాగుంది. అయితే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్ ప్రకటించలేదు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్ లో దీపావళి టైం కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.