Register as a Reviewer
Toxic Movie Review in Telugu, Rating & Public Talk | Yash Toxic Review

Toxic Movie Review in Telugu, Rating & Public Talk | Yash Toxic Review

26 Aug 2026
Overall Rating
4.5/10
28 Reviews

Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..

Director: Geetu Mohandas
Cast: Yash, Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasanth, Huma Qureshi

Reviews

What critics and the public are saying about Toxic Movie Review in Telugu, Rating & Public Talk | Yash Toxic Review

Media Reviews

21 Avg: 4.7/10
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
3

Not Good

Toxic movie review

టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas... ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సిని...

టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas...

ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి... ఏం సినిమానో ఏంటో.. ఎమోషనల్ సీన్స్ కి కూడా నవ్వొచ్చింది నాకు. నాకు ఆ టీజర్ చూసినప్పుడే ఎదో రాంగ్ యాంగిల్ లో వెళ్తుంది అనుకున్నా... కానీ రిలీజ్ తర్వాత అంతకంటే ఘోరంగా కెజిఎఫ్ లాంటి ఎలివేషన్ల సినిమాలు అన్ని కలిపి కిచిడి చేసిన సినిమా ఇది. 


అసలు సినిమాలో ఏమైనా చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్. హీరో పెర్ఫార్మన్స్ అంతే.. అసలు సినిమాలో ఒక కథలేదు. స్క్రీన్ ప్లే లేదు.. ఎవడు ఎవడ్ని వేసేస్తాడో తెలీదు. ఎందుకో తెలీదు. క్లైమాక్స్ లో అయితే బాగుందని కొందరున్నారు కానీ, నాకు అది కూడా నచ్చలేదు. అండ్ ఈ ఇయర్ లో నేను చుసిన వరెస్ట్ మూవీస్ లో ఇదొకటి. పైగా 20 డాలర్లు పెట్టి సినిమా చూడాల్సొచ్చింది. ఇంతకంటే ఏం చెప్పలేను.. మీకెలా అనిపించింది మరి. 

Aug 26, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
4

Below Average

Toxic movie Review

టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మ...

టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తంలో ఏం కూడా నాకు నచ్చలేదు. అండ్ సినిమా గురించి ప్లస్ మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్... బట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే విధానం గాని, సినిమాలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను గాని అస్సలు చూపించలేకపోయారు. 


అండ్ టాక్సిక్ సినిమాలో యాక్షన్ అయినా బాగుంటుందేమో అని అనుకుంటే అది కూడా నచ్చలేదు నాకు. ఒక సిన్సియర్ అడ్వైస్ నా నుంచి ఏంటంటే... తెలుగులో మాత్రం అస్సలు చూడకండి.. అంత వరెస్ట్ డబ్బింగ్ ఉంది. ఎదో ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. అండ్ సినిమాని ఎంతో కొంచెం చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయితే అది యష్ కోసం మాత్రమే అయి ఉంటుంది. 

Aug 27, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Toxic movie review

టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ్ యష్ క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్లుగా పార్ట్ లు పార్ట...

టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ్ యష్ క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్లుగా పార్ట్ లు పార్ట్ లు గా చూస్తే బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ గా సినిమా మొత్తం కలిపి చూస్తే... ఇదేమిటి సినిమా ఇలా తీశారు... అంత గ్రాండియర్ గా చెప్తున్నామంటూ, వీళ్ళు చెప్పిన స్టోరీ ఇదా అని అనిపిస్తుంది. 


బట్ వీళ్ళు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. ఆ పాయింట్ ని కొంచెం కమర్షియల్ గానే చెప్తూ, ఒక ఆర్టిఫీషియల్ గా చెప్దామన్న ప్రయత్నంలో కొంచెం పులిహోర ఎక్కువ కలపడం వల్ల... ఇదేమిట్రా బాబు... ఇంత నాన్ టాక్సిక్ లాకుందేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అసలు సినిమాలో ఎవడి గ్యాంగ్ ఎవడిదో... ఎవడు ఎవడ్ని చంపుకుంటారో కూడా తెలీదన్నట్టు ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గా ఉంటాయి. అంతే తప్ప ఇంకేమి ఎక్కవు. అసలు సినిమాలో లాస్ట్ లో వచ్చే ఆ 15 నిమిషాల స్టోరీని అనలైజ్ చేసుకుంటే.. సినిమా ఇదన్నమాట అనుకుంటూ బైటికివస్తారు. ఆ క్లైమాక్స్ కూడా నచ్చకపోతే సినిమా మొత్తం మీ మైండ్ లోంచి ట్రాష్ అయిపోతుంది అనమాట. మొత్తానికి డిస్సపాయింట్ అనే చెప్పాలి యష్ టీం కి. 

Aug 26, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేద...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేదు సినిమా. ఎంతసేపు నరుక్కోవడం, కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా సినిమాలు దీనికి సిమిలర్ గా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా అనిమల్, 1 నేనొక్కడినే సినిమా గుర్తొస్తాయి. అది ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది. 


నాకు తెలిసి యష్ కూడా సినిమా మొత్తం చూసి ఉండడు. లేకపోతే వేరేలా ఉండేది. యాష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసాడు. కానీ సీరియస్లి ఆ కష్టం వేస్ట్ అయింది. అండ్ రవిబాసుర్ అయితే పెద్ద దెబ్బేసాడు, బీజీఎమ్ కి కూడా. యాక్షన్ సినిమాలు ఇలా తీయకూడదు అనడానికి టాక్సిక్ బెంచ్ మార్క్ అని చెప్పాలి సింపుల్ గా. అండ్ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవలేదు. ఇంక నాకైతే ఈ సినిమా గురించి చెప్పే ఓపిక కూడా లేదు. నా రేటింగ్ గనక సినిమాకి ఇవ్వాలంటే.. యష్ పెర్ఫార్మన్స్ కోసం, పెట్టిన ఖర్చుకి గాను 1\5 ఇస్తాను.. ఇంతకంటే ఇవ్వలేను. 

Aug 27, 2026 Watch
T2B Live
T2B Live Website
4

Below Average

Toxic movie review

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అ...

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. 


చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండొచ్చు…లెంత్ చాలా తగ్గించవచ్చు కూడా కానీ మేకర్స్ అలా చేయలేదు. దాంతో అనవసరంగా సీన్స్ అన్నీ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించింది. మొత్తం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఎక్కువ ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యష్ కోసం స్టైలిష్ టేకింగ్ కోసం ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ కొంచం అంచనాలను పెట్టుకుని వెళ్ళినా చాలా చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. 


Aug 26, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు, పూర్తి భిన్నంగా మ...

టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు, పూర్తి భిన్నంగా మరో ముగింపు ఇస్తూ దర్శకురాలు మాయ చేశారు. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా కథను నడిపించారు. ప్రతి విషయాన్ని తెరపై నేరుగా చెప్పకుండా, ప్రేక్షకులే అర్థం చేసుకునేలా చాలా అద్భుతంగా చిత్రాన్ని మలిచారు.


దర్శకురాలి ఆలోచనా విధానం చాలా ఉన్నతంగా ఉంది. ఒక పెద్ద ఎక్స్పరిమెంట్ చేస్తూనే.. అభిమానులు కోరుకునే మాస్ అంశాలను ఎక్కడా తగ్గించలేదు. నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను చాలా భారీగా నిర్మించారు. భారీ సెట్టింగులు, యాక్షన్ సీక్వెన్స్, కెమెరా పనితనం తెరమీద బాగా కనిపిస్తాయి. ఓవరాల్ గా టాక్సిక్.. స్లో పేస్డ్ యాక్షన్ డ్రామాగా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ ని అయితే మెప్పించేలానే ఉంది. 

Aug 26, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
7

Hit

Toxic Movie Review

కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ్స్ మాఫియా డాన్ సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొ...

కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ్స్ మాఫియా డాన్ సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొటీన్ డ్రగ్స్ బిజినెస్, గ్యాంగ్ స్టర్ గొడవలు, సెల్వడర్ కూతురుతో రొమాన్స్, తాగడం, ఫైట్స్ తోనే సరిపోతుంది. కియారా ఎంట్రీ నుంచి కథ ఆసక్తిగా మారడం అక్కడో చిన్న ట్విస్ట్. ఇక సెకండ్ హాఫ్ ఊహించిన సీన్ తోనే మొదలయి మళ్ళీ రాయ ఇంకా ఎదిగినట్టు రొటీన్ తాగుడు, అమ్మాయిలు, కాసినో, యాక్షన్ సీక్వెన్స్ లతో బాగా సాగదీశారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్. అసలు ఆ ట్విస్ట్ మాత్రం ఊహించము.


హాలీవుడ్ స్టైల్ లో ఎమోషన్స్ పండిద్దాం, కొత్తగా విజువల్స్ చూపిద్దాం అనుకున్నా ఆ ఎమోషనల్ సీన్స్ ఏవి కూడా పండలేదు. రొటీన్ స్టోరీ, కెజిఎఫ్ తర్వాత చాలా సినిమాల్లో వచ్చిన రొటీన్ యాక్షన్ సీక్వెన్స్, నరుక్కోవడం,కాల్చడం, పేల్చడం.. ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ గూగుల్ ట్రాన్స్ లేషన్ చేసినట్టు అచ్చ తెలుగు పాత పదాలతో ఉన్నాయి. ఫైనల్ గా యశ్ ఎంత కష్టపడ్డా సరైన కథ, స్క్రీన్ ప్లే లేకపోతే అది వృధానే అవుతుంది. ఓవరాల్ గా యాక్షన్ అడల్ట్ సినిమా కాస్త ఒక్కసారిగా సైకాలజీ సినిమాగా మారిపోతుంది. పిల్లలతో, పేరెంట్స్ తో అయితే వెళ్లడం కష్టమే. ఎలాగో A సర్టిఫికెట్ సినిమా కాబట్టి పిల్లని రానివ్వరు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడం అనే కాన్సెప్ట్ తో ఈ కథ రాసుకున్నట్టు సినిమా అంతా అయ్యాక అర్ధమవుతుంది.

Aug 26, 2026 Read Review
One India
One India Website
5

Average

Toxic movie review

స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే అస...

స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే అసలు ఏం జరుగుతుందే విషయం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడా కూడా ఈ చిత్రం హై మూమెంట్స్ లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం.


చివరలో వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ ఉన్నప్పటికీ.. అప్పటికే కన్ఫ్యూజింగ్ గేమ్ లా మారిన కథనానికి ఆ ట్విస్ట్ ఏ మాత్రం సహాయపడదు. దాదాపు 3 గంటల నిడివి విషయం కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. యష్ మాత్రం తన వరకు సినిమాని బాగా నెట్టుకొచ్చాడు. నయనతార, కియారా అద్వానీ రోల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా... నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ కొంతవరకు మెరుగ్గా ఉండేది.ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. నిడివి ఎక్కువగా ఉండటం చిత్రానికి మైనస్ గా మారింది. ఫైనల్‌గా.. ఈ సినిమా.. మితిమీరిన వయోలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే!


Aug 26, 2026 Read Review
5

Average

Toxic movie Review

ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతుంది. `టాక్సిక్‌` సినిమా చూశాక...

ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతుంది. `టాక్సిక్‌` సినిమా చూశాక అలాంటి ఫీలింగ్‌ కలగక మానదు. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కాకపోతే అది మనకు అర్థమయ్యేలా చెప్పడంలోనే తడబాటు కనిపిస్తుంది.


హీరో లైఫ్‌ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి ఉత్కంఠభరితంగా ఉంటాయి. అదే సమయంలో విసిగించేలా ఉంటాయి. కథ ఎటువెళ్తుందో అర్థం కాదు. క్లైమాక్స్ లెన్తీగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్ గ్రాండియర్‌ గా యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు, రొమాన్స్, స్టయిలీష్‌ మూవీని తీయడంపై పెట్టిన ఫోకస్‌.. కథ, కథనంపై పెడితే బాగుండేది. సినిమాగా నిరాశ తప్పదు. నటుడిగా యష్‌ ఆకట్టుకుంటాడు. విజువల్స్ కనువిందు చేస్తాయి.


Aug 26, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

Toxic movie Review

Yash is back to testing his luck at the Pan-India Box Office after KGF 2 with Toxic. His choice of going with Geethu Mohandas raised many eyebrows and the movie has become a talking point with bold scenes in the Promotional material and postponements.  Positives:1.⁠ ⁠Granduer2.⁠ ⁠Yash’s Sc...

Yash is back to testing his luck at the Pan-India Box Office after KGF 2 with Toxic. His choice of going with Geethu Mohandas raised many eyebrows and the movie has become a talking point with bold scenes in the Promotional material and postponements. 

 

Positives:


1.⁠ ⁠Granduer

2.⁠ ⁠Yash’s Screen Presence

3.⁠ ⁠Cinematography


Negatives:


1.⁠ ⁠Aimless Writing

2.⁠ ⁠Painfully Bad Second Half

3.⁠ ⁠Patience-Testing Narration

4.⁠ ⁠Excessive Runtime

5.⁠ ⁠Lack of Emotional Connect


Overall, everything that could go wrong had gone wrong for the Toxic. Except for lavish filmmaking with some technically brilliant portions here and there, there is nothing for the audience to get engaged with. It tests your patience and makes you restless with its confused screenplay.


Aug 26, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
4

Below Average

Toxic Movie Review

కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ సీన్స్ కాదు... యాక్షన్ ఉన్నా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ప్రారంభం నుంచి చివరి వరకు కంటిన్యూ అవుతుంది, ట...

కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ సీన్స్ కాదు... యాక్షన్ ఉన్నా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ప్రారంభం నుంచి చివరి వరకు కంటిన్యూ అవుతుంది, టాక్సిక్ ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఎమోషన్ వర్కవుట్ కాలేదు. అయితే యాక్షన్ లేదంటే రొమాన్స్... బ్యాక్ టు బ్యాక్ రెండిటిలో ఏదో ఒకటి తెరపై వస్తున్నా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. 


బట్ యష్ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా అయితే... కథ మనల్ని మెప్పించేలా ఉండాలి కదా! సినిమాలో రొమాన్స్ ఉంది. యాక్షన్ ఉంది. స్టార్ కాస్ట్ ఉంది. కానీ... ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, ఆకట్టుకునే సన్నివేశాలు గానీ లేవు. సాగదీశారు సార్... మూడు గంటలు పాటు ఆ వయలెన్స్ భరించడం, థియేటర్లలో చివరి వరకు ఆడియన్స్ ఉండటం కష్టమే. టెక్నికల్ అవుట్ పుట్ కోసం లేదంటే యష్ కోసం అయితే వెళ్ళండి.

Aug 27, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Toxic movie review

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు పెట్టారో అని...

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు పెట్టారో అనిపిస్తాయి. యష్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలమైన కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంది.


అయితే అసలు యష్ లాంటి స్టార్‌కు మరింత పటిష్టమైన కథ ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తంగా, టాక్సిక్ చెత్త సినిమా కాదు.. కానీ వచ్చిన హైప్, యష్‌పై ఉన్న అంచనాలకు మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థం పర్థం లేని వృథా ప్రయాసతో కూడిన వ్యర్థ చిత్రం. సినిమా చూసాక చాలామంది అసలు సినిమాలో ఏముంది, అసలు ఎం చెప్పారు, ఎం అర్ధమైంది అని తేలిక ఆలోచిస్తూ బైటికొస్తారు. ఒక్క సీన్ గురించి కూడా మాట్లాడుకునేట్టు అనిపించదు. 

Aug 26, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి నిజం చెప్పాలంటే సినిమా మీద ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అస్సలు సంతృప్తి కలగలేదు. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం అదిరిపోయాయి. యష్‌ని తెరపై చూసిన ప్రతిసారీ ఒక మాస్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌క...

టాక్సిక్ సినిమా గురించి నిజం చెప్పాలంటే సినిమా మీద ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అస్సలు సంతృప్తి కలగలేదు. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం అదిరిపోయాయి. యష్‌ని తెరపై చూసిన ప్రతిసారీ ఒక మాస్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా కొంచెం స్లో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం ఎందుకు పెట్టారో అర్థం కానట్టుగా అనిపించాయి. యష్ మాత్రం తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ యష్ లాంటి హీరోకి ఇలాంటి కథ కాకుండా ఇంకాస్త స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది.


మొత్తంగా చెప్పాలంటే టాక్సిక్ చెత్త సినిమా కాదు… కానీ వచ్చిన హైప్‌కి, యష్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మాత్రం జస్టిస్ చేయలేకపోయింది. చివర్లో తెరమీద... నిర్మించింది వెంకట్ కె నారాయణ.. కానీ కూల్చింది గీతూ మోహన్ దాస్ అని వేయాల్సింది అనిపించింది. అంతలా చెత్తలా ఉంది సినిమా. సినిమా గురించి ఇందులోనే డబ్బింగ్ స్టాండర్డ్స్ లో లాగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... అర్ధం పర్ధం లేని వృధా ప్రయాస తో కూడిన వ్యర్ధ చిత్రం ఈ టాక్సిక్. 


Aug 26, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Toxic Movie Review

యష్‌ నుంచి ఇలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేసిన ఆడియన్స్‌కి టాక్సిక్ కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. సినిమా మొదటి నుంచి భారీగా బిల్డ్‌అప్, స్టైల్, యష్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నడిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ స్థాయిలో కథ, స్క్రీన్‌ప్లే మాత్రం బలంగా అనిపించవు. కథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. కొన్ని స...

యష్‌ నుంచి ఇలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేసిన ఆడియన్స్‌కి టాక్సిక్ కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. సినిమా మొదటి నుంచి భారీగా బిల్డ్‌అప్, స్టైల్, యష్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నడిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ స్థాయిలో కథ, స్క్రీన్‌ప్లే మాత్రం బలంగా అనిపించవు. కథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. కొన్ని సీన్స్ ఆసక్తికరంగా అనిపించినా, మొత్తం కథనం మాత్రం చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే మరింత వీక్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్, విజువల్స్ భారీగా ఉండాలని ప్రయత్నించినా, అవి ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.


VFX కూడా కొన్ని చోట్ల అండర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాకు కావాల్సిన విజువల్ గ్రాండియర్ పూర్తిగా కనిపించదు. మ్యూజిక్, యాక్షన్, మేకింగ్ అన్నీ ఉన్నప్పటికీ కథతో కనెక్ట్ అయ్యే ఎమోషన్ మాత్రం మిస్ అయింది. యష్‌ విషయానికి వస్తే, తన స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకు పెద్ద ప్లస్. కానీ హీరో ఎలివేషన్స్‌తో మాత్రమే సినిమాను ఎక్కువసేపు క్యారీ చేయడం కష్టం. కథ బలంగా ఉంటే యష్‌ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువగా ఎలివేట్ అయ్యేది. మొత్తంగా టాక్సిక్‌ లో స్టైల్ ఉంది, భారీ సెటప్ ఉంది, యష్‌ ఫైర్ ఉంది… కానీ దానికి సరిపోయే స్ట్రాంగ్ కంటెంట్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే కనిపించలేదు. భారీ హైప్‌కు తగ్గ రిజల్ట్ మాత్రం రాలేదు.


ఓవరాల్ గా ఈ టాక్సిక్... మితిమీరిన వైలెన్స్ ఇష్టపడే వారికీ మాత్రమే..

Aug 26, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Irumudi Movie Review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ. అంతేకాదు కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ తండ్రి మనో వ్యథ. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా వి...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ. అంతేకాదు కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ తండ్రి మనో వ్యథ. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా విఫలం అయ్యారు. తెరమీద విజువల్స్ ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నా... అవేవీ మనసును ప్రభావితం చేయవు. దాంతో టాక్సిక్‌ ఓ టార్చర్ గా మారిపోయింది.


సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. అండ్ యశ్‌ ఎప్పటిలానే తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. రాయ పాత్రలో ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో, కొడుకు టిక్కెట్ పాత్రలో అంత తెంపరి తనాన్ని ప్రదర్శించాడు. సినిమాలో అసలు మరబొమ్మల్లా తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతూ మోహన్ దాస్ ను నమ్మి, ఈ ప్రాజెక్ట్ ఆమె చేతిల్లో పెట్టిన యశ్, వెంకట్ నారాయణను అభినందించాలి. ఈ సినిమాలో హీరో ఒక మాట పదే పదే చెబుతుంటాడు. 'మనం తీసుకున్న నిర్ణయానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించకతప్పదు' అని. ఈ సినిమా చూడాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహిస్తే మంచిది.

Aug 26, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Toxic Movie Review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్‌ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్‌ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్య...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్‌ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్‌ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి సాదాసీదా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఓవరాల్‌ గా అంచనాలకు ఏ మాత్రం చేరుకోలేని సినిమా అనిపిస్తుంది.


ఓవరాల్‌ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. యష్ స్టైలిష్ లుక్, మాస్ ఎలిమెంట్స్‌ తో, యాక్టింగ్‌ తో మ్యాజిక్ చేశాడు. విజువల్స్ చాలా రిచ్‌ గా ఉన్నాయి. కానీ కథ మాత్రం నిల్. సినిమాకు కావాల్సిన మెయిన్ కాన్‌ప్లిక్ట్‌ లో పస లేకపోవడం వల్ల సెకండాఫ్ డల్‌ గా సాగుతుంది. అవసరం లేకపోయిన బోల్డ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా నిడివి మరో మైనస్. కనీసం 20 నిమిషాల సినిమాను కట్ చేస్తే.. కొంత బెటర్ అవుట్ పుట్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. మేకింగ్‌ పై పెట్టిన శ్రద్ద.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ మీద మరింత పెట్టి ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనిపిస్తుంది. ఫైనల్ గా యష్ కోసం, గ్రాండియర్ మేకింగ్ కోసం టాక్సిక్ సినిమా ఓసారి చూడొచ్చు.

Aug 26, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Toxic Movie Review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అం...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. మేకర్స్ ప్రయత్నమైతే గట్టిగానే చేశారు, కానీ కథలో విషయం లేకపోతే.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్సయియితే.. ఎంత భారీగా- స్టైలిష్ గా తీసినా ప్రయోజనం ఉండదు. 


‘టాక్సిక్’తో వచ్చిన సమస్య ఇదే. సినిమాలో వైలెన్స్, రొమాన్స్ తప్ప ఇంకేమీ చూపించకపోతే.. అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ‘టాక్సిక్’లో కథా కథనాలు ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తాయన్నది వాస్తవమే అయినా.. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వావ్ అనిపిస్తాయి. ఇక పాత్ర కోసం ప్రాణం పెట్టేసిన యశ్ సూపర్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కష్టాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఓవరాల్ గా టేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కంటెంట్ మరీ వీక్ అయిపోవడంతో ‘టాక్సిక్’ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్నే మిగులుస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్.. నిజంగా టాక్సికే యష్ ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకం. 

Aug 26, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Toxic movie review

కేజీయఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని ‘ టాక్సిక్ ’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయంలో కథా, నిర్మాణం అన్నింట్లోనూ యశ్ భాగస్వామ్యం ఉంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఈ సినిమా ఏ రేటెడ్ అని స్పష్టంగా చెప్పింది. అయితే సినిమా విషయానికి వస...

కేజీయఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని ‘ టాక్సిక్ ’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయంలో కథా, నిర్మాణం అన్నింట్లోనూ యశ్ భాగస్వామ్యం ఉంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఈ సినిమా ఏ రేటెడ్ అని స్పష్టంగా చెప్పింది. అయితే సినిమా విషయానికి వస్తే... గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథకి, ఎంచుకున్న నేపథ్యానికి, తెరకెక్కించిన తీరుకి ఎక్కడా పొంతన కనిపించదు. ఇందులో మితి మీరిన హింస, రక్తపాతనం, శృంగారానికి సంబంధించిన సీన్లే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. 


ఇంత గందరగోళంలో దర్శకురాలు, రచయిత రాసుకున్న ఎమోషన్స్ మాత్రం కనిపించకుండా పోతాయి. ఎక్కడా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోవడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుంది. చివరగా.. మితిమీరిన రక్తపాతం, అడల్డ్ సీన్లతో ‘టాక్సిక్’లోని ఎమోషన్స్ కనిపించకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఎంత సేపు నరకడం, కాల్చడం, శృంగార సన్నివేశాలే తప్పా.. ఒక్క చోట కూడా ఎమోషనల్ కనెక్టిటీ ఉండదు. టెక్నికల్‌ గా స్ట్రాంగ్ అయిన టాక్సిక్.. ఎమోషనల్‌గా వీక్.


Aug 26, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Toxic Movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ య...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ యాక్షన్, పెర్ఫార్మన్స్ లని కోరుకునే వారికి అక్కడక్కడా మూమెంట్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయి. 


కానీ ఒక రొటీన్ కథ ఉన్నప్పటికీ నడిపించే కథనం ఎంగేజింగ్ గా ఉంటే చూసే ఆడియెన్ కథ లైన్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోడు. కానీ టాక్సిక్ లో బలమైన కథ మిస్ అయ్యింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విషయానికి వస్తే.. తను మాత్రం డిజప్పాయింటింగ్ చేసారని చెప్పక తప్పదు. పూర్తిగా ఇలా బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేసుకున్నారా.. లేక తర్వాత పరిస్థితులు మారాయా ఏమో కానీ తను ప్లాన్ చేసుకున్న పాయింట్ ని మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనవసర హంగులు, ఆర్భాటాలు యాడ్ చేసి ఆఖరికి నిరుత్సాహన్ని మిగిల్చారు.


ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాక్సిక్” వచ్చిన హైప్ ని మాత్రం అందుకోలేకపోయింది. యశ్ వరకు తన పని నటన వరకు సిన్సియర్ గా చేసి ఇంప్రెస్ చేశారు. కానీ రచనా సహకారం డిజప్పాయింటింగ్ గా ఉంది. స్టార్ నటీనటులు పెర్ఫార్మన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, ఒకటీ రెండు చోట్ల ఎమోషన్స్ ఓకే కానీ పస లేని కథనం, బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ చూసే ఆడియెన్ లోని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. సో వీటితో టాక్సిక్ అంతగా ఆకట్టుకోదు.

Aug 26, 2026 Read Review
Man of Fiction
Man of Fiction Youtube Channel
4

Below Average

Toxic Movie Review

సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను.. కాదు భరించి.. ఆల్మోస్ట్ టార్చర్ అనుభవించి కొద్దిలో తప్పించుకున్నాను. దీనికోసం 435 రూపాయలు పెట్టాను... మళ్ళీ టికెట్ రేట్లు పెంచామాన్నోళ్లు ఈ సినిమాకోసం పెంచారు.. 3 గంటల దారుణం ఈ సినిమా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బైటికొచ్చినోళ్ళు గ్రేట్......

సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను.. కాదు భరించి.. ఆల్మోస్ట్ టార్చర్ అనుభవించి కొద్దిలో తప్పించుకున్నాను. దీనికోసం 435 రూపాయలు పెట్టాను... మళ్ళీ టికెట్ రేట్లు పెంచామాన్నోళ్లు ఈ సినిమాకోసం పెంచారు.. 3 గంటల దారుణం ఈ సినిమా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బైటికొచ్చినోళ్ళు గ్రేట్... ఫస్ట్ సినిమా పాసిటివ్స్ గురించి చెప్పుకుందాం.. సినిమాటోగ్రఫి, యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టైలిష్ గా ఉన్నాయి. అండ్ యష్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. అమ్మాయిలు అందంగా ఉన్నారు.. ఇంతకు మించి ఇంకేం లేవు. క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకున్నారు... ఎంత అంటే... ఇదా... దీని గురించి ఇంత రాసుకుని, ఇంత గందరగోళం చేసారా అన్నట్టుంటుంది సినిమా. 



హైలెట్ ఏంటంటే సినిమాలో చెప్పుకోడానికి ఎంతో కొంత కొద్దో గొప్ప ఉండాలి.. కానీ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి సీన్ లేదు. అండ్ సినిమాలో పేజీల కొద్దీ పేజీల డైలాగులు ఉంటాయి... కానీ ఒక్క డైలాగ్ చెప్పడానికి రాదు. అండ్ సినిమా కాన్సెప్ట్ పేపర్ మీద చూస్తే బాగుంటది అనుకున్నట్టుంటది.. కానీ స్క్రీన్ మీద చూస్తేనే భరించలేం.. అండ్ సినిమాలో 3 గంటల 14 నిమిషాల సినిమాలో ఆ 18+ సీన్స్ అన్ని ఎందుకు పెట్టారో ఏంటో అర్ధం కాదు. ఒక్క క్లైమాక్స్ తప్ప ఇంకే సీన్లు ఎందుకు పెట్టారో అర్ధం కాదు. రవి బాసూర్ అయితే మాత్రం ఇంకా డిస్సపాయింట్ చేసారు. ఇవన్నీ పక్కన బెడితే మంచి మంచి తెలుగు సినిమాలో హైక్ ఇవ్వలేదు గాని, ఇలాంటి చెత్త సినిమాలకిస్తారు. తీసింది కళాఖండం అంటే... దానికి మళ్ళీ మేమె డబ్బులొదిలించుకోవాలి. అది మ్యాటరు... 


Aug 26, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
4

Below Average

Toxic movie Review

టాక్సిక్... 3 hours 15 minutes రన్ టైం తో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది... జెన్యూన్ గా మాట్లాడుకుందాం. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. చాలా అడల్ట్ కంటెంట్, అండ్ హెవీ వైలెన్స్ ఉంది. కొన్ని బూతుల్ని కూడా మ్యూట్ చేయలేదు. ఇక పాయింట్ కొస్తే హాలీవుడ్ మూవీస్ టాక్ తో సంబంధం లేకుండ...

టాక్సిక్... 3 hours 15 minutes రన్ టైం తో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది... జెన్యూన్ గా మాట్లాడుకుందాం. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. చాలా అడల్ట్ కంటెంట్, అండ్ హెవీ వైలెన్స్ ఉంది. కొన్ని బూతుల్ని కూడా మ్యూట్ చేయలేదు. ఇక పాయింట్ కొస్తే హాలీవుడ్ మూవీస్ టాక్ తో సంబంధం లేకుండా చూసే కొన్ని వర్గాల ఆడియన్స్ కి మాత్రమే పొరపాటున నచ్చే ఛాన్స్ ఉంది గాని, మన ఆడియన్స్ విషయానికి వస్తే... ఈ సినిమా కనీసం కన్నడ వాళ్ళకైనా నచ్చుతుందా అని డౌట్ ఒచ్చేంత దారుణంగా ఉంది. 


అసలు ట్రైలర్ చూసినప్పుడే డౌట్ ఒచ్చింది. అసలు సినిమా స్టోరీ ఏమైనా ఉందా అంటే... నాకు ఏం అర్ధం కాలేదు. ఎదో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఇదా అసలు కథ అని అనిపించింది. ఇంతకు ముందే రీసెంట్ గా తెలుగులో వచ్చిన సత్యదేవ్ మూవీ గుర్తొస్తుంది. అసలు సినిమాలో హైలెట్ సీన్స్ ఎమున్నాయా అని చూస్తే... ఒక్కటి కూడా అనిపించలేదు. అసలు యాక్షన్ మూవీ అనేలా కూడా లేదు. అయితే హీరో యష్ పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. అండ్ నయనతార కూడా బాగా నటించింది. విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద అదిరిపోయాయి. 


మైనస్ గురించి చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కి తప్ప దేనికి కూడా కనెక్ట్ అవ్వం. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు కదా. రవి బాసూర్ మ్యూజిక్ కూడా ఏం బాగాలేదు. డైరెక్టర్ వర్క్ అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. ఇంకా మాట్లాడుకోవడమే అనవసరం అసలు. నా రేటింగ్ అయితే కేవలం యష్ పెర్ఫార్మన్స్ అండ్ విజువల్స్ కోసం 2\5.

Aug 26, 2026 Watch

Public Reviews

7 Avg: 4.0/10
A
3

Not Good

Toxic movie Review

ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట...

ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట్ గా అందులో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంటుంది కదా.. ఈ సినిమాని కూడా ట్రాన్సలేట్ చూస్తున్నట్టే ఉంది అంత worest గా ఉంది dubbing. 


ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేను. చెత్త డైరెక్షన్.. చెత్త స్టోరీ.. చెత్త సాంగ్స్... అంతా చెత్త చెత్త... ఇంత చెప్పినా ఎవరైనా సినిమాకి వెళ్లాలనుకుంటే యష్ ని చూడ్డానికి మాత్రమే వెళ్ళండి... సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే... నిద్రపోతారు అంతే... ఓపికపట్టి సీన్స్ ఎంజాయ్ చేద్దామనుకుంటే జండూబామ్బ్ తీసుకుపోండి. 

Aug 27, 2026
A
A Varadharaju Students & Youth
5

Average

Toxic movie review

KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half chala scenes routine ga anipistayi. Second half inka drag ayye feeling vastundi.Kani climax twist ma...

KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half chala scenes routine ga anipistayi. Second half inka drag ayye feeling vastundi.


Kani climax twist matram mind block! Assalu expect cheyyani reveal. Yash screen presence, performance super, visuals kuda rich ga unnayi. But strong story, engaging screenplay leka povadam biggest minus. Action, violence ekkuva…


Overall: Yash kosam, action lovers kosam once watchable. Kani KGF range expectations tho vellakandi. Mass feast anukunte… psychological twist tho shock istundi Toxic!

Aug 27, 2026
T
Talari Snehalatha IT Employee
4

Below Average

Toxic Movie Review

టాక్సిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే… సినిమా మొత్తం చూస్తున్నంతసేపు ఏదో భారీగా చూడబోతున్నామనే ఎక్స్‌పెక్టేషన్ కలిగించింది. కానీ సినిమా విషయంలో మైనస్ కథ, స్క్రీన్‌ప్లే. కొన్ని సీన్స్ బాగున్నా, connect కాలేదు. ముఖ్యంగా second half లో సినిమా కొంచెం drag అయిన ఫీలింగ్ వచ్చింది.VFX, action, visu...

టాక్సిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే… సినిమా మొత్తం చూస్తున్నంతసేపు ఏదో భారీగా చూడబోతున్నామనే ఎక్స్‌పెక్టేషన్ కలిగించింది. కానీ సినిమా విషయంలో మైనస్ కథ, స్క్రీన్‌ప్లే. కొన్ని సీన్స్ బాగున్నా, connect కాలేదు. ముఖ్యంగా second half లో సినిమా కొంచెం drag అయిన ఫీలింగ్ వచ్చింది.


VFX, action, visuals భారీగా చూపించడానికి try చేశారు. కానీ ఇలాంటి సినిమాపై ఉన్న hype తో పోలిస్తే VFX కొన్ని చోట్ల నాకు under velming గా అనిపించింది. but యష్ పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ యష్ లాంటి హీరోకి ఇంకా స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేదనిపించింది.


finally టాక్సిక్‌ లో స్టైల్ ఉంది, యష్ ఫైర్ ఉంది, భారీ సెటప్ ఉంది… కానీ దానికి తగ్గ కంటెంట్ మాత్రం నాకు కనిపించలేదు.

Aug 26, 2026
S
Shiva Teachers and Educators
5

Average

Toxic movie review

టాక్సిక్ (Toxic) టైటిల్ చూసి ఎదో అనుకున్నా... సినిమా ట్రైలర్ చూసి ఇంకేదో అనుకుని imagine చేసుకున్నా. కానీ సినిమా చూసాక ఏం లేదు అంతా డొల్ల... సినిమా తీసిన డైరెక్టర్ లేడీ అయిపొయింది కాబట్టి ఏం అనలేకపోతున్నాను గాని, లేదంటే నా నోట్లోంచి బ్యాడ్ words వచ్చేవి. ముందు ఆ దిల్ రాజు ని అనాలి. ఇలాంటి సినిమా కోస...

టాక్సిక్ (Toxic) టైటిల్ చూసి ఎదో అనుకున్నా... సినిమా ట్రైలర్ చూసి ఇంకేదో అనుకుని imagine చేసుకున్నా. కానీ సినిమా చూసాక ఏం లేదు అంతా డొల్ల... సినిమా తీసిన డైరెక్టర్ లేడీ అయిపొయింది కాబట్టి ఏం అనలేకపోతున్నాను గాని, లేదంటే నా నోట్లోంచి బ్యాడ్ words వచ్చేవి. ముందు ఆ దిల్ రాజు ని అనాలి. ఇలాంటి సినిమా కోసం ఇరుముడికి థియేటర్లు తగ్గించి మరీ టాక్సిక్ వేసుకున్నారు. 



ఇదే పెద్ద తప్పంటే... అప్పుడెప్పుడో ఎంత పెద్ద సినిమాకైనా టికెట్ హైక్స్ ఇవ్వమని ప్రెస్ మీట్లో చెప్పి, ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమా కోసం, అందులోనూ ఈ అడల్ట్ సినిమా కోసం రేట్లు పెంచాడు. నాలుగొందలు బొక్క నాకు... ఎవరైనా సినిమాకి వెళ్లాలంటే కొంచెం ఆలోచించండి... అస్సలు నచ్చలేదు నాకైతే... తట్టుకోగలమంటే యష్ కోసం, గ్రాండియర్ విజువల్స్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. బెటర్ టు షిఫ్ట్ ఇరుముడి. 

Aug 26, 2026
M
Mulollu Praveen Kumar CA/Advocate
5

Average

Toxic Movie Review

ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రాంగ్ స్టోరీ లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. బట్ యష్ వన్ మ్యాన్ షో తో మూవీని నడిపించాడు. ఎక్...

ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రాంగ్ స్టోరీ లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. బట్ యష్ వన్ మ్యాన్ షో తో మూవీని నడిపించాడు. ఎక్సెలెంట్ పెర్ఫార్మన్స్ బై యష్ అండ్ కియారా also. 


ట్రైలర్ చూసి స్టైలిష్ గా ఎదో ఊహించుకుని వెళ్తే చాలా డిస్సపాయింట్ అవుతారు... ఏం లేదు లో ఎక్సపెక్టషన్స్ తో వెళ్తే కొంచెం బెటర్ ఫీల్ తో బైటికొస్తారు. లెంగ్త్ ఒక అరగంట తగ్గించి ఉంటె ఆడియన్స్ కి బాగా నచ్చేదేమో.. ఒకసారైతే సినిమా చూసేలానే ఉంది నాకైతే. బట్ ఫ్యామిలీస్ చూడలేని సినిమా ఇది. 

Aug 26, 2026
T
Tharuni Small Business Owner
3

Not Good

Toxic Movie Review

జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్...

జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్ సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే... స్టోరీ ఏమైనా ఉందా అని డౌట్ ఒచ్చింది. 


కొట్టుకోవడం, చంపుకోవడం, మధ్యలో అప్పుడప్పుడు 18+ సీన్స్... దీనికేనా హాలీవుడ్ రేంజ్ సినిమా తీశామని చెప్పుకున్నారు... మళ్ళీ స్పెషల్ హైక్ ఒకటి... ఈ తలనొప్పి నుండి రిలీఫ్ అవడానికి ఇప్పుడే ఫ్రెష్ గా జండూ బాంబ్ కొన్నా... ఎవ్వరైనా సినిమా చూడాలనుకుంటే... ఓటిటి లోకి ఒచ్చేంత వరకు ఓపిక పట్టండి... లేదా గమ్మున ఇరుముడి వెళ్లిపోండి. 


Aug 26, 2026
A
Arige Srikanth Private Employee
3

Not Good

Toxic Movie Review

ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్...

ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకుని ఉండాల్సొచ్చింది. 


సినిమా క్లైమాక్స్ కి వస్తే గాని అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ చూసే వరకు స్టోరీ విషయంలో క్లారిటీ రాదు. ఆ ట్విస్ట్ కూడా ముందే తెలిసిపోతే ఇక సినిమా చూడ్డం కూడా వేస్ట్. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ తెలుగులో రీసెంట్ గా వచ్చాయి. అండ్ సినిమాలో యష్ పెర్ఫార్మన్స్ గురించి తప్ప ఇంక చేప్పేదేం లేదు. ఎవరికైనా ఓపికుండి... డబ్బులు వేస్ట్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి... లేదంటే మన ఇరుముడికి రెండోసారైనా వెళ్ళండి... 

Aug 26, 2026

About This Movie

Story :

 

కథ విషయానికి వస్తే... 1950స్ కాలంలో గోవా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో కథ నడుస్తుంది. చిన్నప్పట్నుంచే తల్లిదండ్రులకు దూరమైన అక్కా తమ్ముళ్లు గంగ (నయనతార) రాయ (యష్) ఎన్నో కష్టాలు పడి సాల్వదార్ బ్రదర్స్ రన్ చేసే డ్రగ్స్ మాఫియా అండతో ఎదుగుతారు. ఈ క్రమంలో సాల్వదార్ కూతురు రెబకా (తారా సుతారియా) ని పెళ్లి చేసుకొని ఆ గోవా డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి రాయ అధిపతి అవుతాడు. ఈ క్రమంలో రాయల్ సర్కస్ ని నిర్వహించే నదియా (కియారా అద్వానీ) ని ప్రేమిస్తూ ఆమెతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోతాడు. కానీ నదియా ఆత్మహత్య చేసుకున్నాక రాయ జీవితమే మారిపోతుంది. రాయ కొడుకే (టికెట్) రాయాని చంపాలని పగ పడతాడు? ఈ క్రమంలో రాయ ప్రాణంగా చూసుకునే అక్క గంగకి ఏం జరుగుతుంది? రాయ లైఫ్ లోకి మెలిసా (రుక్మిణి వసంత్) వచ్చాక ఏం జరిగింది? తండ్రీకొడుకులు ఒకర్నొకరు చంపుకునేంత పగ ఏంటి? చివరికి రాయ తాను చేసిన తప్పులకి రాయ ఏమైపోతాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus points :  

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విజువల్స్ అండ్ గ్రాండియర్. సినిమా ముందు నుండే భారీ యాక్షన్ సినిమాగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోందని మేకర్స్ చెప్తున్నారు. అలాగే సినిమా కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు, రిచ్ గా, స్టైలిష్ గా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా యష్ నుండి ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో చాలా వరకు సినిమాలో బాగా చూపించారు. అలాగే యష్ కూడా ముందు నుండి మాంచి బాడీ లాంగ్వేజ్, యాక్షన్స్ సీన్స్ తో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చాలా బాగా నటించాడు. అలాగే నయనతార, కీయారా అద్వానీ, కూడా వాళ్ళ రోల్స్ లో మెప్పించారు. ముఖ్యంగా కియారా గ్లామర్ పరంగానే కాకుండా బరువైన హావభావాలతో నటించింది. 

 

Minus Points :

అయితే టాక్సిక్ లో మైనస్ ల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. మాములుగా యాక్షన్ మూవీస్ లో కథ రొటీన్ గా ఉన్నా, వాటిని ఎంగేజ్ చేసేలా మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ ఈ సినిమాలో కథ లేదు, కథనం కూడా సరిగా లేదు. కెజిఎఫ్ తర్వాత యష్ నుండి రాబోయే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో తెలిసిందే. కానీ టాక్సిక్ లో ఆ అంచనాలకు తగ్గట్టు సగం కూడా ఉండదు. కానీ హాలీవుడ్ రేంజ్ అంటూ ముందు నుండి ఊదరగొడితే, అది ఆడియన్స్ నమ్మి చూస్తే.. బలంగా మోసపోయారు. అక్కడక్కడా కొన్ని స్టైలిష్ సీక్వెన్స్ లు తప్ప మిగతావన్ని డిజప్పాయింటింగ్ గా అనిపిస్తాయి.

 

ఫస్ట్ హాఫె దారుణం అంటే.. సెకండ్ హాఫ్ దాన్ని మించిపోయింది. 3 గంటల 15 నిమిషాల సినిమాలో ఒక్క క్లైమాక్స్ మాత్రమే బెటర్ అనిపించింది. పైగా సినిమాలో తనకు ఇష్టంతోనే వారితో ఎన్నో ఏళ్ళు ఉన్నట్టు చూపించడం లాజికల్ గా లేదు. కొంతమందితో ట్రాక్ కూడా ఎంగేజింగ్ గా లేదు. పైగా సినిమాలో వైలెన్స్ మరీ ఎక్కువైంది. అదే ఎక్కువంటే అంతకు మించిన బోల్డ్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. పోనీ ఇవేమైనా సినిమా కంటెంట్ లో భాగమా అంటే అవి కూడా కాదు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు వీటికి పూర్తిగా దూరమవ్వాల్సి వస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ రివీల్ అయ్యాక ఈమాత్రం దానికా ఇంత పెద్ద కథ నడిపారు అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా ఈ సినిమా కాన్సెప్ట్ చూస్తుంటాం. ఓవరాల్ గా బిల్డప్ తప్ప ఏం కనిపించడంలేదు.

 

Technical Values : 

అయితే టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాలో చెప్పుకొవాల్సిన విషయాలు బాగానే ఉన్నాయి. అన్నిటికంటే ముందు ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగానే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. సెట్టింగ్స్ గాని, గ్రాండ్ VFX విజువల్స్ గాని అదిరిపోయాయి. రాజీవ్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఎటొచ్చి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చాలా చేయాల్సింది. కనీసం 40 నిమిషాల సినిమాని ట్రిమ్ చేసి ఉంటే చాలా బెటర్ గా సినిమా అనిపించేది. తెలుగు డబ్బింగ్ వర్క్ ఇంప్రెసివ్ గా లేదు. పైగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ అయినా, ఆ రోజులలాగ డైలాగ్స్ లేవు. అందరికంటే ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ దెబ్బేసాడు. బీజీఎమ్ ఏమాత్రం మెచ్చుకునేలా లేదు. ఫైనల్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంతలా డిసప్పాయింటింగ్ చేస్తారని అనుకోలేదు. కథతో సంబంధం లేకుండా... అసలు కథే లేకుండా బోల్డ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమా ఎలా తీద్దామనుకున్నారో ఏమో... కానీ అస్సలు వర్కౌట్ కాలేదు. 

 

Final Review :

ఓవరాల్ గా టాక్సిక్ సినిమా నాలుగేళ్లుగా ఊరించి... ఫైనల్ గా థియేటర్లోకి వస్తే... నాలుగు నిముషాలు కూడా థియేటర్లో కూర్చోలేం అన్నట్టు తీశారు సినిమాని. సినిమాపై ఉన్న భారీ హైప్ లో సగానికి సగం కూడా మ్యాచ్ చేయలేకపోయింది ఈ మూవీ. హీరో యష్ పెర్ఫార్మన్స్ పరంగా తన సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాడు. సినిమా రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా డిజప్పాయింటింగ్ గా ఉంది. పైగా స్టార్ నటీనటులు ఉన్నా, ఫైట్స్ బాగున్నా, పస లేని కథనం, ల్యాగ్ అనిపించే సినిమా ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ మొత్తాన్ని దెబ్బతీశాయి. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ కూడా దీన్ని తట్టుకోవడం కష్టమేమో.  

Review Statistics

4.5
Overall Rating
Avg. of all reviews
28
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
4.7/10
Public
4.0/10
Why MRO?