Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 277–288 of 1045 reviews

Peddi Review

Peddi Movie is Ramcharan's biggest blockbuster. Ramcharan Proved that he is a an National Award Winner with his full of hearful acting ❤.
8.0
out of 9
3 weeks ago
Jun 25, 2026 Hindi

Maa Inti Bangaram Movie Review

work finish ayyaka.. ఎదో బోర్ కొడుతోంది కదా.. అని మా ఇంటి బంగారం.... ఫ్యామిలీతో సినిమాకెళ్ళాం... సినిమా చూస్తే బాగానే ఎంటర్టైన్ అయ్యాం గాని... నాకే ఎదో మిస్ అయిన feel ఒచ్చింది. fresh story ఎం కనిపించల...

work finish ayyaka.. ఎదో బోర్ కొడుతోంది కదా.. అని మా ఇంటి బంగారం.... ఫ్యామిలీతో సినిమాకెళ్ళాం... సినిమా చూస్తే బాగానే ఎంటర్టైన్ అయ్యాం గాని... నాకే ఎదో మిస్ అయిన feel ఒచ్చింది. fresh story ఎం కనిపించలేదు. Saam Perfarmance brilliant. అండ్ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా మెచ్చుకోవాలి.


but సినిమా మాత్రం ఇంటికొచ్చిన తర్వాత అంత గుర్తులేదు. as a movie lover గా ఏ సినిమా అన్నా.. నాకు నచ్చిందంటే ఇంటికొచ్చాక కూడా నా mind లో మూవీ తిరుగుతా ఉంటది... బట్ ఈ సినిమాకైతే అంత అనిపించలేదు. మా ఫ్యామిలి కైతే బానే అనిపించిందట.

6.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

Good intentions, but poor execution.

Transfer Trimurthulu feels like a story we've seen many times before, without the emotional depth or excitement needed to stand out.

5.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

A familiar story, weak execution, and lack of engaging moments make Transfer Trimurthulu a dull watch.


Vadde Naveen's comeback doesn't get the powerful treatment it deserved.

5.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

Transfer Trimurthulu is a routine political drama with an outdated storyline and slow narration. 


Despite its social message, the film fails to create much impact and ends up feeling predictable.

5.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

S

By Shiva

Transfer Trimurthulu is a routine political-action drama centered on an honest police constable fighting against a powerful politician's son accused of a serious crime. While the story aims to blend s...

Transfer Trimurthulu is a routine political-action drama centered on an honest police constable fighting against a powerful politician's son accused of a serious crime. While the story aims to blend social issues, politics, and heroism, the execution feels outdated and predictable.


The film moves at a slow pace, lacks engaging moments, and struggles to create emotional impact. Despite giving importance to Vadde Naveen's comeback and hero elevations, the character lacks the strength needed to leave a lasting impression. The screenplay feels repetitive, and the conflict never becomes truly compelling.


Verdict: An outdated and predictable drama that fails to bring anything fresh to the genre. Vadde Naveen's comeback doesn't make the impact fans might have hoped for.

6.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్‌ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీ...

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్‌ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్‌ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. 


మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్‌, ఎమోషనల్‌ అంశాలకు ప్రయారిటీ ఇస్తారు, సినిమాలను చూస్తారనే భావనతో పదే పదే ఇలాంటి అంశాలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే దాన్ని అంతే రియాలిటీగా, కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. కానీ ఇందులో అది మిస్‌ అయ్యింది. ఈ కథలో ఈ కేసుని బలవంతంగా పెట్టినట్టుగానే, ఇరికించినట్టుగానే ఉంటుంది. ప్రారంభం నుంచి సినిమా చాలా డ్రైగా, స్లోగా సాగుతుంది. వడ్డే నవీన్‌ని ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆయన పాత్రలో ఆ పవర్‌లేదు. పైగా బలమైన సీన్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఓవరాల్ గా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, రొటీన్‌, బోరింగ్‌, ఔట్‌ డేటెడ్‌ కాన్సెప్ట్ తో తీసిన మూవీ `ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు`. వడ్డే నవీన్‌ రీఎంట్రీ బెడిసికొట్టిందని చెప్పొచ్చు. 

7.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu Movie Review

90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్ర...

90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది.


ఇప్పుడు దర్శకుడు కమల్ తేజ కూడా కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. అయితే మెజారిటీ సీన్స్ స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌ గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!

6.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu movie Review

first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీ...

first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది. 


నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు. 

5.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimuthulu Movie Review

వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డా...

వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డానికి ఫ్యామిలీ తో థియేటర్ కి వెళ్ళాం. 


first of all screen మీద వడ్డే నవీన్ ని చూసాక అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అనిపించారు. కాకపోతే కొంచెం లావయ్యారు. అండ్ సినిమా మాత్రం మేం అంత ఎంజాయ్ చేయలేదు. because ఇలాంటి storys మేం చాలా చూసేసాం. మేమనే కాదు తెలుగులో చాలా movies వచ్చాయి. ఎదో హీరోని చూడ్డానికి వెళ్ళాం కానీ, సినిమాలో ఎం లేదని ఫినిష్ అయ్యాక గాని తెలీలేదు. ఇంకొంచెం మంచి స్క్రిప్ట్ తో ఎంట్రీ ఇచ్చి ఉంటె బాగుండేది.  

5.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Thrimurthulu movie Review

Tupaki

By Tupaki

సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ...

సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది.


దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పి... బోరింగ్ త్రిమూర్తులును అంటగట్టారు డైరెక్టర్. 


4.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu

Transfer Trimurthulu movie Review

Sakshi

By Sakshi

వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన...

వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.


అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి తగ్గట్టు రోల్స్ కి కూడా కనెక్ట్ అయ్యేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత లేదు. మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉండేది. ఓవరాల్ గా సినిమా అంత ఇంప్రెస్ చేయదు.


4.0
out of 9
4 weeks ago
Jun 23, 2026 Telugu
Why MRO?