Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

655 Reviews
Showing 301–312 of 655 reviews

Dhurandhar The Revange Movie Review

Sakshi

By Sakshi

‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జ...

‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని బాగా ప్రయత్నించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌లో ఉన్న ఆగ్రహం, బాధ, ప్రతీకారం వంటి భావాలను బాగా చూపించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ వేగం పెరుగుతుంది. కొన్ని ట్విస్ట్స్, క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కథనం కొన్నిచోట్ల డ్రాగ్ అయ్యిందనే ఫీలింగ్ వస్తుంది. నటీనటుల విషయానికి వస్తే హీరో రణవీర్ సింగ్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్ర కూడా కథకు సరిపడేలా ఉంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం టైట్‌గా ఉండాల్సింది. మొత్తంగా ‘ధురంధర్: ది రివేంజ్’ అద్భుతమైన రివెంజ్ డ్రామాగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాగా ఆకట్టుకుంటుంది.

7.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

Sakshi

By Sakshi

ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆ అంచనాలకు చాలా దూరంగా నిలిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపిన ఈ చిత్రం కథ పరంగా, కథనం పరంగా పూర్తిగా నిరాశపరుస్తుంది. ప్రారంభం నుంచి చివ...

ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆ అంచనాలకు చాలా దూరంగా నిలిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపిన ఈ చిత్రం కథ పరంగా, కథనం పరంగా పూర్తిగా నిరాశపరుస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకు పాత టెంప్లేట్‌ను అనుసరించినట్లు కనిపిస్తూ, ఎలాంటి కొత్తదనం లేకుండా సాగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యారు. కామెడీ పనిచేయదు, ఎమోషన్ కనెక్ట్ కాదు, సన్నివేశాల మధ్య సరైన లింక్ లేకపోవడంతో సినిమా ఫ్లో పూర్తిగా దెబ్బతింది. చాలా సీన్స్ అనవసరంగా పొడిగించినట్టుగా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, ఆయన పాత్రకు సరైన బలం లేదు. ఆయన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ కూడా ఎక్కువ భాగంలో కనిపించదు. విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం వల్ల కథలో ఎలాంటి టెన్షన్, థ్రిల్ అనిపించదు. టెక్నికల్ పరంగా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా ఉన్నా ఇంపాక్ట్ లేకపోవడం, ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కమర్షియల్ సినిమా పేరుతో వచ్చినా, కంటెంట్ పరంగా పూర్తిగా బలహీనంగా ఉండి ప్రేక్షకులను నిరాశపరచే అవకాశం ఉంది.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాత టెంప్లేట్ ఫీలింగే. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కానీ సినిమా మొత్తం ఒక ఫ్లోలో నడవదు… వేరువేరు సీన్స్‌ని కలిపేసినట్టుగా అనిపిస్తుంది. హరీష్ శంకర్ ఈసారి కామెడీ, కమర్షియల్ రైటింగ్ రెండింట్లోనూ మిస్ అయ్యాడు. నవ్వు రాదు, హైప్ ఫీల్ కూడా పూర్తిగా రాదు. థమన్ BGM‌తో లిఫ్ట్ చేయాలని ట్రై చేశాడు కానీ స్కోప్ లేకపోయింది. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని చోట్ల బాగానే ట్రై చేసినా… తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ మాత్రం మిస్సింగ్. ఓవరాల్ గా సినిమాలో భజన సీన్లే ఎక్కువ ఉన్నట్టుంటుంది. మొత్తానికి కొన్ని మాస్ మూమెంట్స్ తప్ప… సినిమా చాలా బోర్ కొడుతుంది.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ కి తక్కువే. సినిమా చూస్తే ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది. ఇది కథ చెప్పాలనుకున్న సినిమా కాదు, హీరోని సెలబ్రేట్ చేయాలనుకున్న సినిమ...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ కి తక్కువే. సినిమా చూస్తే ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది. ఇది కథ చెప్పాలనుకున్న సినిమా కాదు, హీరోని సెలబ్రేట్ చేయాలనుకున్న సినిమా. సార్టింగ్ లో మాస్ ఎలివేషన్స్ బాగానే హైప్ క్రియేట్ చేస్తాయి… కానీ ఆ తర్వాత సినిమా స్టెడీగా పడిపోతూ ఉంటుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా కదలదు… సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి కానీ మనకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ కనిపించదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంత వరకూ ఓ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ రైటింగ్ లేదు. ఒక్కోసారి మంచి మూమెంట్ వస్తుంది. వెంటనే ఫ్లో బ్రేక్ అయిపోతుంది. మంచి కథ లేదు, ఒక బలమైన విలన్ లేడు. ఒక సరైన కామెడీ కూడా లేదు, మ్యూజిక్ పరంగా పెద్దగా గుర్తుండిపోయేలా ఏమీ లేదు. డిఎస్పీ, థమన్ ఇద్దరూ డిస్సపాయింట్ చేసారు. సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్, వింటేజ్ వైబ్స్ వర్క్ అవుతాయి… కానీ అప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అభిమానులకు కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. మిగతావాళ్లకి మాత్రం ఇది జస్ట్ ఓ రొటీన్, హాఫ్-బేక్డ్ కమర్షియల్ సినిమా.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్ కాదు... తేరి రీమేక్ కాదు.. దాని నుండి ఒకటి రెండు సీన్స్ మాత్రమే తీసుకుని దానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని కలిపి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దామని హరీష్ శంకర్ ట్రై చేసార...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్ కాదు... తేరి రీమేక్ కాదు.. దాని నుండి ఒకటి రెండు సీన్స్ మాత్రమే తీసుకుని దానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని కలిపి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దామని హరీష్ శంకర్ ట్రై చేసారు. నిజం చెప్పాలంటే… ఈ సినిమా స్టార్ట్ అయ్యాక కొంచెం టైమ్ వరకే హైప్ ఉంటుంది. ఆ తర్వాత “ఇంకా ఎంత ఉంది?” అనిపించే టైమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కొన్ని మాస్ షాట్స్ బాగానే ఉంటాయి. కానీ అవే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటే బోర్ కొడుతుంది. కథ సంగతి అడగకండి… ఎక్కడో చూసిన స్టోరీని మళ్లీ కొత్తగా చూపించడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. అలాగే హీరోయిన్లు ఇద్దరూ ఎందుకున్నారో కూడా తెలీదు. ఫస్టాఫ్ చాలా స్లో… సెకండాఫ్‌లో కాస్త పికప్ ఉన్నా, మొత్తం సినిమాను లిఫ్ట్ చేయడానికి సరిపోదు. విలన్ ట్రాక్ అస్సలు పని చేయదు… డైలాగులు బాగున్నా, కథకి అవసరం లేనట్టు ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుత పాలిటిక్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో ఫినిషింగ్ బాగున్నా ఏమాత్రం కిక్కివ్వదు.. ఓవరాల్ గా ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా గాని, కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కథ కోసం తీసిన సినిమా కాదు… పవన్ కళ్యాణ్ భజన కోసం తీసిన సినిమా అనిపిస్తుంది. ప్రతి సీన్‌ లో హీరో ఎలివేషన్, డైలాగ్, స్లోమోషన్… ఇద...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కథ కోసం తీసిన సినిమా కాదు… పవన్ కళ్యాణ్ భజన కోసం తీసిన సినిమా అనిపిస్తుంది. ప్రతి సీన్‌ లో హీరో ఎలివేషన్, డైలాగ్, స్లోమోషన్… ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్స్‌కు సరిపోయే కథ, ఎమోషన్ మాత్రం కనిపించవు. ఎక్కడైనా కథ ముందుకు వెళ్లాలంటే మళ్లీ భజన మోడ్ ఆన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీని స్ట్రాంగ్ సీన్స్‌లో వాడాల్సింది పోయి… ఎక్కడ పడితే అక్కడ ఎలివేషన్ షాట్స్‌తో వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుండి ఈ మధ్య డాన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఇందులో మంచి డాన్స్ మూవ్స్ పెట్టించారు... ఆ ఫోకస్ ఎదో హరీష్ శంకర్ కంటెంట్ మీద కూడా పెట్టి ఉంటే బాగుంటుంది. విలన్ ట్రాక్ వీక్ గా ఉంది. కామెడీ అస్సలు వర్క్ కాలేదు, మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు. ఓవరాల్ గా సినిమాలో అసలు స్టోరీయే లేదన్నట్టు అనిపిస్తుంది.. ఫాన్స్ విషయానికి వస్తే... స్క్రీన్‌ప్లే పక్కన పెట్టి… హీరో భజన చూడాలనుకుంటే ఓకే.. ఇక నార్మల్ ఆడియన్స్ సంగతి సరే సరి.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్క...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనేది కొత్తదేమీ కాదు… పాత టెంప్లేట్‌ని మళ్లీ రీపీట్ చేసినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం టాప్. కానీ డైరెక్టర్ ఆ ఎనర్జీని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు. ఒక్కోసారి మంచి సీన్ వస్తుంది… వెంటనే రెండు వీక్ సీన్స్ వచ్చి ఫ్లోని బ్రేక్ చేస్తాయి. విలన్ ట్రాక్ అసలు థ్రెట్ ఫీల్ ఇవ్వదు. కామెడీ కూడా పెద్దగా వర్క్ కాలేదు. మ్యూజిక్, BGM—లౌడ్‌గా ఉంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం జీరో. ఫస్టాఫ్ డ్రాగ్, సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ ఉన్నా… మొత్తం సినిమాను సేవ్ చేయడానికి సరిపోవు. ఓవరాల్ గా ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సేఫ్ గేమ్… కానీ ఆడియెన్స్‌కు కొత్తగా ఏమీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వరకు ఒకసారి థియేటర్ కి వెళ్లొచ్చు... నార్మల్ ఆడియన్స్ చూడడం కష్టమే.

5.0
out of 9
2 months ago
Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

Thyview

By Thyview

మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలి...
మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలింగ్ తప్పదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ ఫైర్. ఆయన ఎంట్రీలు, డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్—all good. కానీ సమస్య ఏమిటంటే… ఆ హైకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ కంటిన్యూగా రావు. మధ్యలో డ్రాప్ అవుతుంది. ఫస్టాఫ్ ఎక్కువగా డ్రాగ్ అనిపిస్తుంది… సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ వర్క్ అవుతాయి. కానీ మొత్తం సినిమా లిఫ్ట్ అవ్వడానికి మాత్రం సరిపోవు. విలన్ ట్రాక్ వీక్, కామెడీ కూడా మిస్ అయింది. మ్యూజిక్ పరంగా… పాటలు ఓకే కానీ BGM మాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. కొంచెం లౌడ్‌గా అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాన్స్‌కి “పవన్ కళ్యాణ్ స్వాగ్” కోసం ఓకే.. థియేటర్‌కి వెళ్లాలా అంటే… ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్తే బెటర్!
5.0
out of 9
2 months ago
Mar 21, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్ట...

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావడం లేదు, సీన్స్ మధ్యలో డ్రాగ్ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎనర్జీ మాత్రం టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ మాత్రం లేవు. కొన్ని డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ బాగున్నా… మొత్తం సినిమాను సేవ్ చేయలేవు. విలన్ ట్రాక్ పూర్తిగా వీక్. మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు… బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ లేదు. కామెడీ కూడా చాలా చోట్ల ఫ్లాట్. మొత్తానికి ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా తప్ప… జనరల్ ఆడియెన్స్‌కి మాత్రం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. టైమ్ పాస్ కోసం అయితే ఓకే… కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రం థింక్ చేయాలి!

5.0
out of 9
2 months ago
Mar 21, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత్తం కథనం కొంచెం నెమ్మదిగా, ఫ్లాట్‌ గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతగా స్ట్రాంగ్‌గా ఏం లేదు. హరీష్ శంకర్ తన మార్క్ లో బాగానే సినిమాని ప్రెజెంట్ చేసినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. మొత్తానికి ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా, కొత్తదనంలేని కథా కథనాలతో ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా ఉంటుంది.

5.0
out of 9
2 months ago
Mar 21, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి...
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించారు. దర్శకుడిగా టేకింగ్ తో హరీష్ మెప్పించినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. థమన్ బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. దేవిశ్రీ సాంగ్స్ కూడా అంతగా ఏం లేవు. కానీ హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ఆయన పంచ్ డైలాగ్స్, యాక్షన్, డాన్స్ అభిమానులకు నచ్చుతాయి. అయితే… ఆసక్తిగా మొదలైన సినిమా మధ్యలో ఎక్కడో తిరిగి చివరకు ఆపరేషన్ సింధూర్ డైలాగులతో ఎండ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే ఈ సినిమాను మిగిలిన వాళ్లు కూడా ఓసారి ట్రై చెయ్యొచ్చు. అంటే ఎక్కువగా కొత్తదనం ఆశిస్తే తీవ్ర నిరాశ తప్పదు.
5.0
out of 9
2 months ago
Mar 21, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సె...

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అయ్యాడు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గొప్పగా లేదు. థమన్‌ బీజీఎం కూడా రొటీన్‌ గానే ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్‌ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. రొటీన్‌ ఫీలింగ్‌నే తెస్తాయి. ఓవరాల్ గా సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.

6.0
out of 9
2 months ago
Mar 21, 2026 Telugu
Why MRO?