Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 337–348 of 1045 reviews

Peddi movie review

Gulte

By Gulte

Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teame...

Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teamed up with a one-film-old director, Buchi Babu Sana, for a multi-sport drama, Peddi.


1.⁠ ⁠Ramcharan’s Terrific Performance

2.⁠ ⁠Inspiring Emotional Drama

3.⁠ ⁠Second Half

4.⁠ ⁠R. Rathnavelu Cinematography

5.⁠ ⁠A. R. Rahman’s Music


Negatives:


1.⁠ ⁠Janhvi Kapoor’s Role In The First Half

2.⁠ ⁠Visual Effects In Pre-Interval Sequence

3.⁠ ⁠Special Song Placement


Final Verdict: Ramcharan Wins Gold


Rating – 3/5

7.0
out of 9
1 month ago
Jun 15, 2026 Hindi

Sing Geetham Movie Review

బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన...

బేసిక్ గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నా అల్ టైం ఫేవెరెట్స్ లో ఒకటైన ఆదిత్య 369 డైరెక్టర్... అండ్ టాలీవుడ్ లో వన్ అఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన "సింగ్ గీతం" సినిమా వస్తుందని తెలిసి, ఫస్ట్ డేనే నైట్ షోకి వెళ్ళిపోయా. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అదుర్స్. ముందు నేను జస్ట్ డైరెక్టర్ కోసమే లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. అందుకే జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు అనిపించింది. సింగీతం గారి మూవీస్ గురించి ఐడియా ఉంది కాబట్టి, ఆయన తీస్తే ఎట్లా ఉంటదో ఇమాజిన్ చేసుకొనే చుసిన. కాబట్టి నాకు బాగా నచ్చింది. 


నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కైతే అంత నచ్చలేదు. బికాస్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే ఒచ్చారు. ఎదో కొత్త కాన్సెప్ట్ అని ఒకే ఒకే అన్నట్టుందన్నారు. బట్ సినిమాలో నేచర్ ని నాశనం చేయొద్దు అంటూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ నాకు నచ్చింది. ఇదొక్కడానికి ఫస్ట్ నేను కనెక్ట్ అయిపోయా. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో లేదో తెల్వదు. అందుకే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ చూసేయండి. ఫైనల్ గా సింగీతం సార్ హ్యాట్సాఫ్ సార్... 

8.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie Review

సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయ...

సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం రావట్లేదు. అందుకే లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమాలు ఎలా తీయాలో నేర్పించినట్టనిపించింది. సింపుల్ స్టోరీయే అయినా డైరెక్టర్ తన విజన్ తో మనకి బాగా అర్ధమయ్యేట్టు బాగాచూపించారు. అండ్ సినిమాలో ఎక్కడా కూడా ఒక సెకండ్ వెస్ట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు బెస్ట్ అనిపించింది ఈ సినిమా. 


అండ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఎస్పీ. సీరియస్లి బ్రో సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బేసిగ్గా గోల్డ్ మైన్, చెట్టు సెంటిమెంట్ అంతా ఒకే గాని, దానికి మూలం, ఒక మనిషి ఆశ అత్యాశగా ఎప్ప్పుడు మారుతదో అప్పుడే నెక్స్ట్ వచ్చే తరాలు ఎంత నాశనమైతాయో సినిమాలో బాగా చూపించిన్రు. ఓవరాల్ గా ఇదంతా సింగీతం గారి మ్యాజిక్కె. ఎందుకంటే చాలా సినిమాలు రిస్క్ చేయకుండా, కొత్తదనం లేకుండా సేఫ్ జోన్ లో ఉండాలని మేకర్స్ ట్రై చేస్తారు. వాళ్లకి ఈ సినిమా చూపించాలి. అండ్ ఓవరాల్ గా సింగీతం సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకింత బాగా నచ్చుతదని.. సింగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో తెల్వదు గాని, ఈ సినిమాకైతే హ్యాపీగా వెళ్లిపోవచ్చు. 





8.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie Review

Thyview

By Thyview

ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని...

ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని అభినందించాలి. ఇక సినిమాలో చెప్పినట్టు కుబేరపురంలో మాటలు పాటలుగా మారే శాపం నుండి ఊరి మొత్తం ఎలా బైటపడిందన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇక సింగీతం గారు ఈ సినిమాని చివరి వరకు ఒక అందమైన కథలా ప్రెజెంట్ చేసారు. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ హవర్ అదిరిపోయింది. అండ్ ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇక సినిమాలో కొంతమంది ఎంటర్టైన్మెంట్ తగ్గిందని, బోరింగ్ గా ఉందని అనుకోవచ్చు. బట్ సింగీతం మూవీస్ అన్ని అలా డీసెంట్ గానే ఉంటాయి. ఓవర్ గా అస్సలుండవ్. అండ్ సింగీతం గారు మళ్లీ మ్యాజిక్ చెసార్రా అంటూ మూవీ లవర్స్ హ్యాపీగా బైటికొచ్చారు. అండ్ సినిమాలో లాస్ట్ లో ఒక ఫేమస్ ఆక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దానికి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్లీ సింగ్ గీతం సినిమాకి ఫ్యామిలీని, స్పెషల్లీ కిడ్స్ ని తప్పకుండ థియేటర్ కి తీసుకెళ్లండి. 


8.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie review

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోత...

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం.



సినిమాలో ఓవరాల్ గా చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. అంటూ ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం గారు. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం. ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!


7.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie Review

మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. ద...

మాటల్లో చెప్పలేని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కోసం దర్శక రచయితలు పాటలను ఎంపిక చేసుకుంటారు. కథలో పాటలకు చోటు ఇస్తారు. అసలు, మాటల బదులు పాటలే వస్తే? ప్రతి మాటను పాట రూపంలో చెబితే? ఇదీ 'సింగ్ గీతం'. దర్శకుడిగా ఎప్పుడూ అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో వచ్చే సింగీతం శ్రీనివాస రావు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో

మాటల బదులు పాటలు, పాట రూపంలో ప్రతి మాట - ఇదేనా 'సింగ్ గీతం'? కథలో ఉన్నది అంతేనా? అంటే... అసలు కాదు. ప్రేక్షకులకు అదొక సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ అంతే! ఆ పాటల మాటున మంచి ఎమోషన్ ఉంది. అంతర్లీనంగా ప్రకృతి గురించి ప్రజలకు ఇచ్చిన ఓ సందేశం ఉంది.


క్రియేటివిటీకి వయసుతో సంబంధం లేదని సింగీతం శ్రీనివాస రావు నిరూపించిన సినిమా 'సింగ్ గీతం'. కమల్ హాసన్ హీరోగా సినిమా తీయాలని సుమారు 40 ఏళ్ళ క్రితం ఈ కథ రాశారట. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ... ప్రేక్షకులందరికీ కొత్తగా అనిపించే కాన్సెప్ట్ 'సింగ్ గీతం'. ఇందులో కొత్త కాన్సెప్ట్ ఒక్కటే కాదు... రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో మేజిక్ చేసిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. హృదయానికి హత్తుకునే క్లైమాక్స్ ఉంది. ఇక కమర్షియల్ సినిమాలు అలవాటు పడిన, వాటిని ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. కానీ... థియేటర్లలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందీ సినిమా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.

7.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing Geetham movie review

భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా...

భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం చాలా అరుదుగా కనిపించే ప్రయత్నం. 


ఇక సినిమాకు DSP సంగీతం కథలో భాగమైపోతుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు, లాజిక్ గ్యాప్స్ ఉన్నా, దర్శకుడి విజన్ వాటిని అధిగమిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ కొత్త కథనాలను, సృజనాత్మక ఆలోచనలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా చూడదగ్గ చిత్రం. ఓవరాల్ గా ఈ సింగ్ గీతం మూవీ ఓ సాహసం, ఓ ప్రయోగం ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయాల్సిన సినిమాటిక్ జర్నీ. అయితే కొన్ని సినిమాలను రేటింగ్ లతో కొలవలేం. ఇది కూడా అంతే. కానీ దాదాపు క్లాసిక్ గానే ఈ సినిమాని భావించొచ్చు. 

7.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie Review

తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాల దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల డైరెక్ట్ చేసిన మూవీ "సింగ్ గీతం" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సింగ్ గీతం" సాధారణ సినిమా కాద...

తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాల దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల డైరెక్ట్ చేసిన మూవీ "సింగ్ గీతం" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సింగ్ గీతం" సాధారణ సినిమా కాదు. ఇది ఒక మ్యూజికల్ ఫాంటసీ. ఇందులో పాత్రలు సంభాషణలు చెప్పవు. వారి మాటలే పాటలుగా మారుతాయి. హాలీవుడ్, యూరోపియన్ సినిమాల్లో కనిపించే ఒపెరా శైలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. సినిమా మొదటి అరగంట ప్రేక్షకుడికి కొంత కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మనం అలవాటు పడిన కథన శైలికి ఇది పూర్తిగా భిన్నం. మొదట్లో ఈ ఫార్మాట్‌కు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ కథలోకి ప్రేక్షకుడు ప్రవేశించిన తర్వాత సినిమా తన ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్తుంది.


ఇక ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు వినూత్న ఆలోచన, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒపెరా శైలిలో తెరకెక్కిన ప్రత్యేక కథనం, అహిల్యా బమ్రూ నటన ప్రకృతి పరిరక్షణపై బలమైన సందేశం క్లైమాక్స్‌లో పండిన భావోద్వేగాలు అద్భుతమైన విజువల్స్, సినిమాటోగ్రఫీ అన్ని బలమయ్యాయి. అయితే బలహీనతల గురించి చెప్పుకుంటే... అందరికీ కనెక్ట్ కాని నరేషన్ స్టైల్ ఫస్టాఫ్‌ లో కొంత సాగదీత చాలా సింపుల్‌ గా ఉన్న ప్రధాన కథ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా నచ్చకపోవచ్చు. 


ఓవరాల్ గా సింగీతం శ్రీనివాసరావు ప్యాషన్, నాగ్ అశ్విన్ విజన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలిసి రూపొందించిన అరుదైన సినీ అనుభూతి "సింగ్ గీతం". తెలుగు తెరపై ఇలాంటి ప్రయత్నాలు రావడం నిజంగా ఆనందించాల్సిన విషయం.


6.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing geetham movie review

లెజెండరీ దర్శకుడు, ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో...

లెజెండరీ దర్శకుడు, ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో మాటలు అన్ని పాటలుగా పాడతారు, మాట్లాడుకోవడం తక్కువ అంతా పాడుకోవడమే, మొదటిసారి ప్రయోగం చేస్తున్నాము అని చెప్పడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సింగీతం కథ, మాటలు, కథనం రాయించి, ప్రీ ప్రొడక్షన్ చేయించి, వర్క్ షాప్ చేయించి నాగ్ అశ్విన్ చేతిలో ఈ సినిమా బాధ్యతలు పెట్టి ఆయన వీడియో కాల్స్ లో పర్యవేక్షణ, దర్శకత్వం చేసారని మూవీ యూనిట్ తెలిపారు.


అయితే రెగ్యులర్ కథని సింగీతం శ్రీనివాసరావు ఆయన మార్క్ కి తగ్గట్టు కొత్తగా మార్చి మంచి డైలాగ్స్ తో ఓ మెసేజ్ తో బాగా రాసుకున్నారు. కానీ కథనం పై మేకర్స్ మరింత దృష్టి పెట్టి ఉంటె బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. మొత్తంగా ‘సింగ్ గీతం’ సినిమా మనిషి ఆశ, పర్యావరణం అనే మెసేజ్ ను మ్యూజికల్ కామెడీగా ఓ ఊర్లో జరిగిన కథగా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

7.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing Geetham Movie Review

తెలుగు సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన సినిమా సింగ్ గీతం. కమల్‌ హాసన్ తో చేయాలనుకున్న ఈ సినిమాని ఇప్పుడు కొత్త వాళ్లతో రూపొందించారు. మాటలు పాటలు...

తెలుగు సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన సినిమా సింగ్ గీతం. కమల్‌ హాసన్ తో చేయాలనుకున్న ఈ సినిమాని ఇప్పుడు కొత్త వాళ్లతో రూపొందించారు. మాటలు పాటలుగా మారితే జనం పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకృతిని, చెట్లని రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. మైనింగ్‌ పేరుతో చెట్లని కొట్టడం, ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల వచ్చే అనర్థాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు సింగీతం. దాన్ని సరదాగా, ఫన్నీగా, కొంత ఎమోషనల్‌గా, ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు.


 అయితే కథనం పరంగా సినిమా సాగే తీరు మాత్రం కొంత సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. పాటలుగా మాట్లాడే తీరు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంది. బాగా సాగదీసినట్టుగా ఉంటుంది. చాలా సీన్లు లాజిక్‌ లెస్‌గా ఉంటాయి. సహజత్వం మిస్‌ అయ్యింది. ఈ సినిమా విషయంలో అభినందించే విషయం ఏంటంటే.. 95ఏళ్ల వయసులో సింగీతం చేసిన ప్రయత్నం. కొత్త ప్రయత్నానికి అభినందనలు చెప్పొచ్చు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన లెజెండ్‌ ఆయన. ఆడియెన్స్ కోణంలో, కమర్షియల్‌ యాంగిల్‌లో చూస్తే ఈ మూవీ ఆకట్టుకోకపోయినా, ఒక కొత్త కథని మనకు చూపించే విషయంలో మాత్రం ఆయన సక్సెస్‌ అయ్యారు. ఓవరాల్ గా సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో కొత్త ప్రయత్నం. ఆయనపై అభిమానంతో చూస్తే ఓకే, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌ లో చూస్తే డిజప్పాయింట్‌ తప్పదు. 


6.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing Geetham movie Review

94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారతీయ సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంచుకొనే సినిమాలు అందించారు. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన సింగ్ గీతం మూ...

94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారతీయ సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంచుకొనే సినిమాలు అందించారు. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన సింగ్ గీతం మూవీ ఆడియన్స్ ముందుకు రాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే కాగితం మీద రాసుకోవడానికి బాగుందనిపించే కథ అయినప్పటికీ.. తెర మీదకు వచ్చే సరికి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు.


ఎమోషనల్ డ్రామాగా, సెంటిమెంట్ సినిమానా, కామెడీ ప్రధానంగా సాగే సినిమానా అనే విషయాన్ని తేల్చుకోలేక సినిమా మొత్తం గందరగోళంగా మార్చారు. మాటలు కాకుండా పాటలు అనే కాన్సెప్ట్‌తో సినిమాను నడపడం పూర్తిగా బెడిసి కొట్టింది. ఇక ఈ సినిమాలో విషయం లేదని ఫిక్స్ అయ్యే టైమ్‌లో ముఖ్యంగా 10, 15 నిమిషాలు ఎమోషనల్‌ గా చెప్పిన కథతో అప్పటి వరకు వేగిన నసతో కొంత ఊరట కలిగించేలా ఉంటుంది. టోటల్‌ గా సింగ్ గీతం ప్రయోగం వికటించిందనే చెప్పాలి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అంతగా లేకపోయినా, కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషనల్ కంటెంట్ బాగా ఎలివేట్ చేశారు. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. కానీ కథ, కథనాల విషయంలో ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమా చూడటానికి ఒకే ఒక కారణం సింగీతం శ్రీనివాసరావు గారిపై ఉన్న అభిమానమే తప్పా.. కంటెంట్ గురించి, ఇతర విషయాల గురించి వెళితే నిరాశపడే అవకాశం ఉంది. ఓన్లీ మ్యూజిక్.. నో మ్యాజిక్.


5.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu

Sing Geetham movie review

సింగీతం శ్రీనివాసరావు చాలా ఏళ్ళ తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా సింగ్ గీతం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఫాంటసీ టచ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎంటెర్టైన్మెంట్ జ...

సింగీతం శ్రీనివాసరావు చాలా ఏళ్ళ తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా సింగ్ గీతం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఫాంటసీ టచ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎంటెర్టైన్మెంట్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే సింగీతం వారి కాన్సెప్ట్ తో పాటు దర్శకత్వం డీసెంట్ గా ఉంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాత సినిమాలు గుర్తు రాక మానవు. ముఖ్యంగా జంబలకడి పంబ లాంటి పేరడీ కాన్సెప్ట్ మూవీ సీన్స్ గుర్తొస్తాయి.


సినిమాలో చాలా భాగం పాటలతో కూడిన డైలాగ్స్ ఉండడం మంచి కాన్సెప్ట్. కానీ ఇది ఎంత వరకు ఆడియన్స్ కి నచ్చుతుందో చెప్పలేం. బట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇష్టపడే ఆడియన్స్ కి, అండ్ సింగీతం డైరెక్షన్ స్కిల్స్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఓవరాల్ గా ఒక వర్గం ఆడియన్స్ ఇష్టపడినా కూడా, మేకర్స్ పనితనాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.

6.0
out of 9
1 month ago
Jun 13, 2026 Telugu
Why MRO?