Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Ranabaali movie Review
just ippude Ranabaali matnee show finish chesa.. movie lo content and potential aithe solid ga undi, kani execution matram total ga patience test chesindi! actually nenu idedo biopic anukunna.. but fictional story ani movie chusedaka telidu. anduke konchem dissapoint ayya.
and 1890s backdrop lo Britishers meeda fight chese story concept, and Vijay Deverakonda, Seema slang performance chaala bagunnai. Rashmika tho pair super.
Kani problem entante, super mass elevation undalsina places lo director oversized art-house movie la teesi flat ga laagessadu. Daaniki thodu sluggish narration, weak BGM, and lagging second half valla hype motham poyindi.
Intent and efforts super kani, slow pacing & limited high moments valla below-average feel ostundi.but vijay and rashmika performance kosam, makers kashtaniki okasari try cheyocchu.
Ranabaali Movie Review
just now finished Ranabaali movie first show.. the movie was decent. ranabaali had all the raw potential to be an absolute epic, but man, it turned out to be a total patience test!
The core story about a hero fighting British exploitation during a devastating 1900s famine is solid. Rahul Sankrityan clearly did his homework on history, Vijay Deverakonda gave it his all with intense Seema slang, and Rashmika looked stunning. Plus, that cave action sequence and the climax actually go hard!
flat BGM, and weak VFX to the mix, and the second half just drags down completely. overall Great intent, huge effort, and solid performances, but ruined by a slow-paced screenplay and zero theater hype. A strictly below-average affair that tests your endurance!
Ranabaali movie review
జస్ట్ ఇప్పుడే రణబాలి (Ranabaali) మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా బాగుందా అంటే.. నాకయితే అబొవ్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బెంగాలీ సినిమాలు బాగా చూస్తాడో ఏమో.. తెలుగు నేటివిటీ తన సినిమాల్లో అంతగా కనిపించదు. సినిమా చూస్తుంటే నాకు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు.
బట్ అప్పటి రాయలసీమ కరువు కష్టాలు, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేదో న్యాచురల్ గా చూపించాడు డైరెక్టర్. కొన్ని సార్లు ఎదో ఆర్ట్ ఫిలిం లాంటి ఫీల్ కూడా వచ్చింది. బట్ యాక్షన్ సీన్స్ లో మాత్రం మన తెలుగు సినిమానే అనిపిస్తది. అండ్ చాలా సార్లు సైరా సినిమా గుర్తొస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. ఏంటో మరి.. బట్ విజయ్ అండ్ రష్మిక పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్. వీళ్ళ కోసమైనా ఒకసారి చూడొచ్చు.
Ranabaali movie review
By 10TV Telugu
చారిత్రక నేపథ్యానికి కల్పిత కథ, జానపద విశ్వాసాలు, యాక్షన్ అంశాలను జోడించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ రణబాలి చిత్రాన్ని పూర్తిగా చారిత్రక సినిమా గా కాకుండా, చరిత్ర నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా చూడాలి. ‘రణబాలి’లో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రధాన అంశం కరువు నేపథ్యం. వర్షాలు లేక పంటలు పండకపోవడం, గ్రామాల్లో ఆహార కొరత ఏర్పడటం వంటి పరిస్థితులు ప్రజల జీవితాలను ఎలా కుదేలు చేస్తాయో కథ వివరిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఆయన తన మాస్ ఇమేజ్‌కు భిన్నమైన పీరియాడికల్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. జయమ్మ పాత్రలో రష్మిక కథకు భావోద్వేగ కోణాన్ని అందిస్తారు. రణబాలి వ్యక్తిగత జీవితానికి, అతడి పోరాటానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.
అయితే దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం వల్ల ఉత్కంఠ తగ్గుతుంది. కొన్ని సన్నివేశాల్లో సంగీతం మరింత సమతూకంగా ఉంటే భావోద్వేగ ప్రభావం పెరిగేది. ఫైనల్ గా ‘రణబాలి’ ఒక విభిన్నమైన చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా. కొన్ని చోట్ల నిడివి, కథనం విషయంలో మెరుగుదలకు అవకాశం ఉన్నప్పటికీ, చారిత్రక అంశాలను కమర్షియల్ కథనంతో కలపాలనే ప్రయత్నం ప్రశంసనీయం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాను పరిశీలించవచ్చు.
Ranabaali movie review
By Great Andhra
అసలు ‘రణబాలి’ చూశాక అర్థమైంది ఏంటంటే.. సినిమాలో విషయం ఉంది, టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి మాత్రం గట్టి రోప్‌వాక్ టెస్ట్ పెట్టేశారు! 1900ల నాటి కరవు కథ అని చెప్పారు కానీ, ఆ సీన్ల కన్నా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటేనే మనకి ఆకలి, నిద్ర ఎక్కువైపోతాయి. రాజమౌళి రేంజ్‌లో రచ్చ లేపాల్సిన 'బ్రిటిషర్ల ప్యాంట్లు విప్పి కారం కూరే సీన్' ని కూడా ఏదో సీరియల్‌లో ఊరగాయ నూరినంత కూల్‌గా లాగించేశారు రాహుల్ సంకృత్యన్ సర్!
ఇక విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో రణరంగం సృష్టిస్తే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సైలెంట్‌గా మెడిటేషన్ చేయిస్తుంది.రష్మిక లుక్స్, గుహ యాక్షన్ సీన్, క్లైమాక్స్ బాగున్నా.. ఆ స్లో నరేషన్ దెబ్బకి క్లైమాక్స్ వచ్చేసరికి ఆడియెన్స్ ఆల్రెడీ మైండ్ బ్లాంక్ అయిపోతారు. మొత్తానికి 'రణబాలి' ఒక మంచి ఆర్ట్ ఫిలిం విత్ ఆస్కార్ రేంజ్ ఓపిక పరీక్ష! ఫైనల్ గా తెరమీద చేసిన వాళ్ళ కష్టం పనబడింది కానీ, కూర్చోడానికి కూడా కష్టం గానే ఉంది.
Ranabaali Movie Review
By Sakshi
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘రణబాలి’ 1900ల నాటి బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామా. మరుగున పడిన ఒక అద్భుతమైన చారిత్రక కథను శోధించి రాయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.
రణబాలిగా విజయ్ తన మాస్ ఆవేశం, రాయలసీమ యాసతో ప్రాణం పోయగా, జయమ్మగా రష్మిక నటన, మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే, ఒక రాజమౌళి రేంజ్ కమర్షియల్ ఎలివేషన్లు పడాల్సిన సీన్లను కూడా ఆర్ట్ ఫిలిం తరహాలో చాలా సింపుల్‌గా తీయడం, స్లో నరేషన్ మరియు ఇంపాక్ట్ లేని బిజీఎమ్ (BGM) ప్రేక్షకుల అనుభూతిని బాగా దెబ్బతీశాయి.
అయితే గుహ యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ బాగున్నప్పటికీ, సుదీర్ఘ నిడివి వల్ల సినిమా గ్రాఫ్ పడిపోతుంది. మొత్తానికి ‘రణబాలి’ మంచి కంటెంట్ ఉన్న చిత్రమే కానీ, కానీ తక్కువ అంచనాలతో చుస్తే సినిమా నచ్చవచ్చు.
Ranabaali Movie Review
By One India
రణబాలి సినిమాలో ఫస్టాఫ్ లో దర్శకుడు కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశాడు. రణబాలి ఎవరు, అతడి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే సినిమా కాస్త నెమ్మదిస్తుంది. విజయ్, రష్మిక సన్నివేశాలు, పీరియడ్ బ్యాక్‌డ్రాప్ ఆసక్తిని నిలబెట్టినా.. ఫస్టాఫ్‌ను ఇంకాస్త క్రిస్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. సెకండాఫ్‌లో రణబాలి పోరాటం మరింత తీవ్రంగా మారుతుంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ కారణంగా కొన్ని చోట్ల సినిమా సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ కథలో వేగం పెరుగుతుంది. విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ కలిసి సినిమాను మంచి స్థాయిలో ముగిస్తాయి.
ఇక సినిమాలో 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని తెరపై చూపించిన విధానం, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, వార్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. కథలో పెద్దగా అవసరం లేని కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. స్క్రీన్‌ప్లే కూడా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ఫైనల్ గా.. భారీ అంచనాలతో వచ్చే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కంటే రణబాలి ఒక నెమ్మదిగా సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, విజువల్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు.
Ranabaali Movie Review
By ABP Desam
ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మైనస్ అని చెప్పాలి. కథ పరంగా 'సైరా', 'రణబాలి' మధ్య వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో కరువుపై ఎక్కువ ఫోకస్ చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. కానీ పోరాటం చేసినది మాత్రం బ్రిటీషర్లపైనే.
'రణబాలి'గా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక పాత్రలను... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా బాగా రాశారు. క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అంటే జస్ట్ సీన్లు, డైలాగులు మాత్రమే కాదు... ఎక్స్‌ప్రెషన్స్ నుంచి బిహేవియర్ వరకు ఎలా ఉండాలో డిసైడ్ చేయడంలో రాహుల్ సాంకృత్యాన్ తన ట్యాలెంట్ చూపించారు. అయితే... నిడివి విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఫస్టాఫ్ డీసెంట్ అనిపించినా... సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం పేలవంగా సాగింది. అజయ్ - అతుల్ సంగీతంలో పాటలు బావున్నాయి. కానీ, ఆర్ఆర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని 'రణబాలి'లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీతో పాటు వాళ్ళిద్దరి సన్నివేశాలూ బావున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథలో కొత్తదనం లేదు. కానీ, కథనంలో కొన్ని 'హై' మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను మరీ తీసిపారేయలేం. అంచనాలు తక్కువ పెట్టుకుని వెళితే విజయ్ దేవరకొండ నటన నచ్చుతుంది.
RanaBaali Movie Review
1870-80 ప్రాంతంలో మద్రాస్, రాయలసీమ, కర్నూల్.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక్షల) మంది ప్రజలు తిండిలేకచనిపోతారు. మరోవైపు బ్రిటీష్ వారిచేత చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో సింగనమల ప్రాంతంలో బ్రిటీష్ వారిపై రణబాలి చేసిన పోరాటమే ఈ చిత్రం అని చెప్పొచ్చు. ఇక రణబాలిగా విజయ్ దేవరకొండ చేసే ఫస్ట్ యాక్షన్ బాగుంది. విజయ్ పాత్ర చేసే యాక్షన్ కొత్తగా ఉంటుంది. అది కొంత ఓవర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. క్యాంప్‌లో బ్రిటీష్ వారిపై రణబాలి చేసే పోరాటం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.
అయితే సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కరువుతో ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి, కరువు రక్షసుడికి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోవడం వంటి సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి. జయమ్మ పాత్రకి సంబంధించిన సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా మరో స్థాయికి వెళ్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది. అక్కడ పూనకాలు తెప్పిస్తుంది. బీజీఎం అదిరిపోయింది. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ఎండ్‌లో మాత్రం వాహ్ ఫీలింగ్ తెప్పిస్తాడు. కొంత కమర్షియాలిటీకి దూరంగా ఉన్నా, చివర్లో దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఫైనల్‌గా.. రణబాలి మూవీ థియేటర్‌లో సర్‌ప్రైజ్ చేస్తుంది. నెగటివ్ టాక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంచనాలు లేకుండా చూస్తే నచ్చుతుంది. విజయ్ ఆకట్టుకుంటాడు. ఓవరాల్‌గా ఒక పీరియాడికల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా `రణబాలి`. అప్పటి కరువు పరిస్థితులు మాత్రం హార్ట్ ని టచ్ చేస్తాయని చెప్పొచ్చు.
Ranabaali Movie Review
బ్రిటీష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో ప్రజలకు అండగా నిలిచాడని అక్కడి వారు నమ్ముతారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ వీర గాథను లార్టర్ దాన్ లైఫ్ తరహాలో వెండితెరపై ఆవిష్కరించాడు. బ్రిటిషర్స్... భారతీయులను బానిసలుగా చూసిన నిజాన్ని విస్మరించి, వారు ఈ దేశంలో రైలు మార్గాలు వేశారు, విద్యాబోధనలు చేశారు అని గొప్పలు చెప్పుకొనే వారికి ఈ సినిమా ఓ చెంపపెట్టు.
1840 నుంచి 1880 మధ్య కాలంలో భారతదేశాన్ని కృత్రిమ కరువు రక్కసి నోట్లోకి నెట్టేసి, కోట్లాది మంది భారతీయుల అకాల మరణానికి కారణం అయిన వారు ఆంగ్లేయులనే కఠోర నిజాన్ని ఆధారాలతో దర్శకుడు రాహుల్ ఈ సినిమాలో చూపించాడు. అయితే అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలను మనసు ద్రవించేలా చూపించడంలో రాహుల్ తడబడ్డాడు. దానికి తోడు కథనం చాలా నిదానంగా నడవడం కూడా కాస్తంత ఇబ్బందిని కలిగిస్తుంది. రొటీన్ ఫార్ములా జోలికి పోకుండా... ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల అకృత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అయితే చిరంజీవి నటించిన స్వాతంత్ర సమరయోధుడు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితిలో అదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'రణబాలి' పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కానీ జయాపజయాలను బేరీజు వేసుకోకుండా మైత్రీ మూవీ మేకర్స్ చేసిన గొప్ప ప్రయత్నంగా 'రణబాలి'ని చూడాల్సి ఉంటుంది. మేకర్స్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది.
Ranabaali Movie Review
By NTV Telugu
1900ల నాటి తీవ్రమైన కరవు, బ్రిటిష్ వారి దోపిడీ నేపథ్యంలో ఆకలి తీర్చే యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ‘రణబాలి’ని తెరకెక్కించారు. రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రాయలసీమ స్లాంగ్‌తో ఆకట్టుకోగా, జయమ్మగా రష్మిక మందన్నా తన లుక్, యాక్టింగ్‌తో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా ఉన్నాయి. ఇక సినిమాలో హీరోహీరోయిన్లు సహా ఆర్టిస్టుల నటన, చరిత్ర ఆధారిత బలమైన కథాంశం తో పాటు అద్భుతమైన ఆక్షన్ సీన్స్ ప్లస్ అయ్యాయి.
అయితే డల్ అండ్ వెరీ స్లో నరేషన్, కనెక్ట్ అవ్వని ఎమోషన్స్, పేలవమైన BGM, వీఎఫెక్స్ లోపాలు, సుదీర్ఘ నిడివి వంటివి మైనస్ అయ్యాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన స్టఫ్ అంతా ఉన్నప్పటికీ, ఆర్ట్ ఫిలిం తరహా నెమ్మది నరేషన్ సినిమా ఇంపాక్ట్‌ను దెబ్బతీసింది. ఓవరాల్‌గా ‘రణబాలి’ విషయం ఉన్న చిత్రమే అయినా, స్లో పేసింగ్ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. కథ పరంగా ఎక్కడా వంకలు పెట్టడానికి లేకపోయినా, కథనంతో నడిపించిన తీరు కాస్త ఇబ్బందికరం అయ్యే పరిస్థితులున్నాయి. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఇక ఫైనల్లీ విజయ్ దేవరకొండ రణబాలి హానెస్ట్ అటెంప్ట్.
Ranabaali Movie Review
By Tupaki
‘రణబాలి’ సినిమాలో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.. ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించని బీజీఎం వల్ల.. అనుభూతి దెబ్బతిని ‘రణబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా తయారైంది. కథలో కంటెంట్ ఉన్నా.. కొన్ని స్టాండౌట్ ఎపిసోడ్లు పడ్డా.. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మురిపించినా.. స్లో నరేషన్ పెద్ద సమస్యగా మారి.. కీలక సన్నివేశాలు ఇంపాక్ట్ కలిగించక ‘రణబాలి’ ఇవ్వాాల్సిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.
చరిత్రను శోధించి ఇలాంటి కథను తయారు చేయడంలో రాహుల్ సంకృత్యన్ అభిరుచిని.. కష్టాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే ఇదే కథను రాజమౌళి లాంటి దర్శకుడి చేతికి అప్పగిస్తే.. ప్రేక్షకులను ఉర్రూతలూగించేసేవాడేమో అనిపిస్తుంది. కానీ బెంగాలీ సినిమాల ప్రభావం బాగా ఉన్న రాహుల్ సంకృత్యన్ దీన్నొక ఆర్ట్ సినిమాలా తీర్చిదిద్దడమే ‘రణబాలి’కి సమస్యగా మారింది. కొన్ని సన్నివేశాలను హృద్యంగా తీసినప్పటికీ.. కొన్నిచోట్ల ఎమోషన్ రాబట్టినప్పటికీ.. డల్ నరేషన్ తో అతను బాాగా పేలాల్సిన ఎపిసోడ్లలో కూడా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ఇక రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోవడానికి చాలానే కష్టపడ్డాడు. రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో చాాలా బాగా నటించింది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల వీఎఫెక్స్ మాత్రం సరిగా కుదరలేదు. కొన్ని చోట్ల తన అభిరుచిని చాటినా.. ఆసక్తి పెంచని స్క్రీన్ ప్లే.. డల్ నరేషన్ తో సినిమా ప్రభావాన్ని తగ్గించేశాడు. చివరగా రణబాలి.. ఎఫర్ట్ ఉంది.. ఎఫెక్ట్ తగ్గింది.