Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Kiku Chiranjeevi movie review
By 10TV Telugu
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.
అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పాయింట్ రేర్ గా వచ్చేదే అయినా కథనం బాగానే రాసుకున్నారు. చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సీన్స్ బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. హీరో – హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ని అక్కడక్కడా సాగదీశారు. కొత్త పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథనంతో కాస్త థ్రిల్లింగ్ గా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘కికు చిరంజీవి’ హీరోకి గుండె కుడివైపు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన సినిమా.
Kiku Chiranjeevi movie Review
‘కికు చిరంజీవి’ (Kiku chiranjeevi) Movie ఇప్పుడే చూసి వచ్చాను. పెద్దగా expectations పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి engage చేసే సినిమా అనిపించింది. movie lo heroను విలన్లు చంపడానికి కాల్చినా అతను ఎందుకు చనిపోడు? అసలు దాని వెనుక reason ఏంటి? అనేది movie లో main point. ఆ twist ఆసక్తికరంగా అనిపించింది. suspence, thriller elements తో పాటు fun, romance, action కూడా బాగానే ఉన్నాయి.
heart ఎడమ వైపు కాకుండా కుడివైపు ఉండటం అనే పాయింట్ కూడా కొత్తగా అనిపించింది. story పరంగా మంచి ఐడియా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో అక్కడక్కడా కొంత తడబాటు కనిపిస్తుంది. కొన్ని సీన్లు ఇంకా బాగా చూపించి ఉంటే impact మరింత వచ్చేది.
అయితే twist లు, climax లో వచ్చే ఎమోషన్ సినిమాకు ప్లస్. ఓవరాల్ గా naku ‘కికు చిరంజీవి’ ఫర్వాలేదనిపించింది.
Kiku chiranjeevi movie review
`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది.
సినిమాలో ఫన్, రొమాన్స్, యాక్షన్ అంశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లోనే కొంత లోపం కనిపిస్తుంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది. ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేశాడు. హార్ట్ కుడివైపు ఉండటమనే పాయింట్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత వరకు ఎంగేజ్ చేసే సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ `కికు చిరంజీవి`.
Kiku Chiranjeevi movie review
By Sakshi
‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.
క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ సినిమాకు కొంత ప్లస్‌గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ‘కికు చిరంజీవి’ ఒక డిఫరెంట్ ప్రయత్నం. కాన్సెప్ట్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి సినిమా ఓసారి ట్రై చేయొచ్చు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే స్థాయిలో మాత్రం సినిమా లేదనే చెప్పాలి.
Kiku Chiranjeevi Movie Review
By NTV Telugu
‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!
టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప్ట్. ఈ కొత్త పాయింట్ చుట్టూ దర్శకుడు రాసుకున్న పాత్రలు, కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.
కథలో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు భిన్నంగా నిలబెడతాయి. ముఖ్యంగా కథనం ముందుకు సాగే కొద్దీ వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే వారికి ‘కికు చిరంజీవి’ మంచి ఆప్షన్. ఈ వారం థియేటర్‌లో తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో దీన్ని చేర్చుకోవచ్చు.
ఫైనల్లీ కొన్ని తడబాట్లు ఉన్నా, థ్రిల్లర్ లవర్స్ కి కికు చిరంజీవి నచ్చోచ్చు.
Kiku Chiranjeevi Movie Review
I just finished watching the movie *Kiku Chiranjeevi*. It is far better than some of the worst movies I have seen recently. *Kiku Chiranjeevi* is a unique thriller featuring an interesting blend of romance, emotion, action, and plot twists. The premise—featuring a heart located on the right side of the body instead of the left—is quite novel.
The lead actor, Kiku Yanamala, delivered a good performance. Director Shubha Sai Venkat did a great job steering the narrative. The climax leaves the audience with a pleasant, feel-good vibe. Ultimately, this film will appeal to those who enjoy thrillers with unique concepts. Personally, I really liked it.
Kiku Chiranjeevi Movie Review
By Filmi Beat
లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి వెంకట్ రాసుకొన్న పాత్రలు, కథను నడిపించిన విధానం బాగుంది. స్టోరీ గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేశారు. ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీ డిఫరెంట్ జోనర్ లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను భావోద్వేగాలతో ముగించడం ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా మారిందని చెప్పాలి.
దీప్తి నడిమింటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాలో లిస్టులో ఈ మూవీని ఎలాంటి సందేహం లేకుండా చేర్చుకోవచ్చు. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాగా కికు చిరంజీవి మూవీ ఓ రకమైన అనుభూతిని కలిగిస్తుంది.
Kiku Chiranjeevi movie review
జస్ట్ ఇప్పుడే కికు చిరంజీవి మూవీ చూసి వచ్చాను. లాస్ట్ వీక్ ఇరుముడి మూవీ హడావిడిలో ఉన్నాను. ఈ వీక్ వేరే మూవీకి వెళదామని అందరూ టాక్సిక్ వెళ్దాం అని ఫ్రెండ్స్ అంటే, ఆ మూవీ టాక్ ముందే తెలిసి... ఈ మూవీకి తీసుకెళ్ళా. మూవీ చుశాక వీళ్ళని చిరంజీవి మూవీకి తీసుకొచ్చి మంచి పనే చేసాను అనిపించింది.
సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా బాగానే తీశారు. కానీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉండాల్సింది. అయితే ఈ మూవీమీద అసలు నేనేం ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసాను కాబట్టి ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ టాక్సిక్ లాంటి కళాఖండంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ మూవీ. డైరెక్టర్ పేరు కూడా తెలీదు కానీ అతను బాగానే హ్యాండిల్ చేసాడు. మంచి స్టోరీ పాయింట్ ను రాసుకున్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ వారం ఎవరైనా మంచి మూవీకి వెళ్దాం అనుకుంటే, ఆ టాక్సిక్ ని పక్కనబెట్టి ఈ చిరంజీవి సినిమాకెళ్ళండి.
Kiku chiranjeevi movie Review
By 123telugu
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.
దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ కికు చిరంజీవి చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.
Toxic movie review
టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas...
ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి... ఏం సినిమానో ఏంటో.. ఎమోషనల్ సీన్స్ కి కూడా నవ్వొచ్చింది నాకు. నాకు ఆ టీజర్ చూసినప్పుడే ఎదో రాంగ్ యాంగిల్ లో వెళ్తుంది అనుకున్నా... కానీ రిలీజ్ తర్వాత అంతకంటే ఘోరంగా కెజిఎఫ్ లాంటి ఎలివేషన్ల సినిమాలు అన్ని కలిపి కిచిడి చేసిన సినిమా ఇది.
అసలు సినిమాలో ఏమైనా చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్. హీరో పెర్ఫార్మన్స్ అంతే.. అసలు సినిమాలో ఒక కథలేదు. స్క్రీన్ ప్లే లేదు.. ఎవడు ఎవడ్ని వేసేస్తాడో తెలీదు. ఎందుకో తెలీదు. క్లైమాక్స్ లో అయితే బాగుందని కొందరున్నారు కానీ, నాకు అది కూడా నచ్చలేదు. అండ్ ఈ ఇయర్ లో నేను చుసిన వరెస్ట్ మూవీస్ లో ఇదొకటి. పైగా 20 డాలర్లు పెట్టి సినిమా చూడాల్సొచ్చింది. ఇంతకంటే ఏం చెప్పలేను.. మీకెలా అనిపించింది మరి.
Toxic movie Review
ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట్ గా అందులో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంటుంది కదా.. ఈ సినిమాని కూడా ట్రాన్సలేట్ చూస్తున్నట్టే ఉంది అంత worest గా ఉంది dubbing.
ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేను. చెత్త డైరెక్షన్.. చెత్త స్టోరీ.. చెత్త సాంగ్స్... అంతా చెత్త చెత్త... ఇంత చెప్పినా ఎవరైనా సినిమాకి వెళ్లాలనుకుంటే యష్ ని చూడ్డానికి మాత్రమే వెళ్ళండి... సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే... నిద్రపోతారు అంతే... ఓపికపట్టి సీన్స్ ఎంజాయ్ చేద్దామనుకుంటే జండూబామ్బ్ తీసుకుపోండి.
Toxic movie Review
By Thyview
టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why... అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తంలో ఏం కూడా నాకు నచ్చలేదు. అండ్ సినిమా గురించి ప్లస్ మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్... బట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే విధానం గాని, సినిమాలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను గాని అస్సలు చూపించలేకపోయారు.
అండ్ టాక్సిక్ సినిమాలో యాక్షన్ అయినా బాగుంటుందేమో అని అనుకుంటే అది కూడా నచ్చలేదు నాకు. ఒక సిన్సియర్ అడ్వైస్ నా నుంచి ఏంటంటే... తెలుగులో మాత్రం అస్సలు చూడకండి.. అంత వరెస్ట్ డబ్బింగ్ ఉంది. ఎదో ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. అండ్ సినిమాని ఎంతో కొంచెం చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయితే అది యష్ కోసం మాత్రమే అయి ఉంటుంది.