Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1728 Reviews
Showing 73–84 of 1728 reviews

Mayookha movie review

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే శ్రీతేజ్ ఎస్కే రాసుకున్న మెయి...

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే శ్రీతేజ్ ఎస్కే రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ సస్పెన్స్ టచ్ కూడా బాగుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పాయల్ చెంగప్ప పాత్ర బాగుంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆమె ఆకట్టుకుంది. 


ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి.‘మయూఖ’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ లో.. కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన క్రైమ్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి, ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.






5.0
out of 9
1 week ago
Oct 13, 2026 Telugu

Mayookha movie Review

బాబోయ్... ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది! డైరెక్టర్ మూవీలో మాత్రం సైకో క్యారెక్టరేషన్‌ ని నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్ళాడు. పది, పన్నెండేళ్ళ పిల్లాడు తన చెల్లిని, తండ్రిని దారుణంగా చంపి కా...

బాబోయ్... ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది! డైరెక్టర్ మూవీలో మాత్రం సైకో క్యారెక్టరేషన్‌ ని నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్ళాడు. పది, పన్నెండేళ్ళ పిల్లాడు తన చెల్లిని, తండ్రిని దారుణంగా చంపి కాల్చేయడం... స్క్రీన్ మీద చూస్తుంటే కడుపులో తిప్పినట్టయింది. వాసన తెలియకపోవడం వల్లే అలా అయ్యాడనే లాజిక్ అసలు ఎక్కడా సింక్ కాలేదు. ఎదో షాక్ వాల్యూ కోసం బలవంతంగా ఇరికించినట్టే అనిపించింది.


మూవీకి సౌండ్ మిక్సింగ్ మాత్రం థియేటర్లో వెన్నులో వణుకు పుట్టించాయి! పాయల్ చెంగప్ప బాగా పెర్ఫామ్ చేసింది. కొత్తగా ఏదో ట్రై చేయాలనుకున్నారేమో కానీ, నాకు మాత్రం ఏవో పాత ఇంగ్లీష్ సినిమాలు కాపీ చేసినట్టనిపించింది. అండ్ ఇలాంటి అరాచకమైన వైలెంట్ సినిమాని థియేటర్దాకా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీ కి షిఫ్ట్ అవడం బెటర్.

5.0
out of 9
1 week ago
Oct 13, 2026 Telugu

Mayookha movie review

హారర్ ధ్రిల్లర్ సినిమాలను ఇవాళ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీలలో పలు భాషలకు చెందిన వెబ్ సీరిస్ లు చూడటంతో వీటికి జనాలు బాగానే అలవాటు పడ్డారు. కాకపోతే... ఈ జానర్ ను సైక...


హారర్ ధ్రిల్లర్ సినిమాలను ఇవాళ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీలలో పలు భాషలకు చెందిన వెబ్ సీరిస్ లు చూడటంతో వీటికి జనాలు బాగానే అలవాటు పడ్డారు. కాకపోతే... ఈ జానర్ ను సైకోపాత్‌లోకి తీసుకెళ్ళడంలోనే అసలు చిక్కంతా. సైకో కథలలో ప్రతిదీ పరాకాష్టలో ఉంటుంది. ఇందులోనూ పది, పన్నెండేళ్ళ పిల్లాడు చెల్లిని, తండ్రిని చంపేసి కాల్చడాన్ని చూపించారు. తెర మీద ఆ సన్నివేశాలు చాలా జుగుప్సను కలిగించేలా ఉన్నాయి. వాసన ఎరగని కారణంగా ఆ కుర్రాడు అలా సైకోగా తయారయ్యాడనేది ఏ రకంగానూ సమంజసం గా అనిపించదు. దర్శకుడు తన బుర్రకు తట్టిన దానిని తెర మీద చూపించాడు. అలానే కాలిన మహిళల చర్మంతో పెర్ఫ్యూమ్‌ తయారు చేయడాన్ని కూడా విపులంగా చూపించాల్సిన అవసరం ఏమీ లేదు.  


పాయల్‌ చెంగప్పతో పాటు ఇతర కీలక పాత్రలో నటించిన వారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సంగీతం అందించిన శిబి మాథ్య అలెక్స్ సౌండ్‌ మిక్సింగ్‌ కూడా బాగా ఇచ్చాడు. కేవలం సౌండ్స్ తోనే థియేటర్ లోని ప్రేక్షకుల వెన్నుల్లో వణుకు పుట్టించాడు. సినిమా పతాక సన్నివేశం ప్రతినాయకుడి మోనోయాక్షన్ ను తట్టుకోవడం కష్టమే. అయితే ఏదో కొత్తగా చెప్పాలనే దర్శకుడి తాపత్రయం ఇందులో కనిపిస్తుంది. ఏదేదో ఊహించుకుని థియేటర్లకు వెళ్ళకుండా... ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూస్తే సరిపోతుంది. అయితే కాస్తంత గుండెధైర్యం ఉన్నవాళ్ళకే ఈ సినిమా! లేకపోతే ఇందులోని అరాచకత్వాన్ని సున్నిత మనస్కులు తట్టుకోలేరు!


4.0
out of 9
1 week ago
Oct 13, 2026 Telugu

Hanuman Ansh movie review

Just ippude Hanuman ansh movie chusamu. naaku hindi peddaga raadu kaabatti.. telugulone chuddamani wait chesi ippudu familytho movieki vellam. ika movie gurinchi cheppalante.. Neem Karoli Baba life hi...

Just ippude Hanuman ansh movie chusamu. naaku hindi peddaga raadu kaabatti.. telugulone chuddamani wait chesi ippudu familytho movieki vellam.


ika movie gurinchi cheppalante.. Neem Karoli Baba life history base chesukuni teesaru ee movie. and ee movie lo Shobhinav Satya tana performance tho jeevinchadu. and movie lo Starting food-sharing scenes, interval block, and second half AI-scenes very good.


bgm score exellent. commerial elements em undavu. so alanti expectations tho evaru cinema chudakandi. dissapoint avutaru. nenaithe 0 expectations tho chusa. and familys ki ee weekend best option.

7.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman ansh movie review

Jai Shri Ram! finally watched hanuman ansh movie in theater. Hanuman Ansh is not our typical commercial masala flick, but a deeply moving spiritual journey inspired by Neem Karoli Baba. Tracing young...

Jai Shri Ram! finally watched hanuman ansh movie in theater. Hanuman Ansh is not our typical commercial masala flick, but a deeply moving spiritual journey inspired by Neem Karoli Baba.


Tracing young Lakshmana Narayana’s transformation, the film emphasizes selfless service, kindness, and humanity over forced cinematic twists. Shobhinav Satya delivers a remarkably serene performance as Baba, while the uplifting background score creates an authentic devotional atmosphere that stays with you long after the credits roll.


Standout moments like the meal-sharing sequences, the powerful interval block, and the clever AI integration add rich emotional depth. A soul-soothing, family-friendly watch that truly resonates

7.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman Ansh movie Review

హనుమాన్ అంశ్ మూవీ విషయానికి వస్తే 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైం తో హిందీలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేనైతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే చూశాను. అసలు ఈ సినిమా దేని గురించి అనేది కూడా నాకు తెలియదు. హనుమ...

హనుమాన్ అంశ్ మూవీ విషయానికి వస్తే 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైం తో హిందీలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేనైతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే చూశాను. అసలు ఈ సినిమా దేని గురించి అనేది కూడా నాకు తెలియదు. హనుమాన్ అంశ్ అని పోస్టర్ లో హనుమాన్ కనిపించడంతో సరే డివోషనల్ మూవీ అనుకొని వెళ్ళిపోయాను. కానీ సినిమా చూసిన తర్వాత జెన్యూన్ గా చెప్పాలంటే ఇది మనం ఎప్పుడు చూసే టిపికల్ కమర్షియల్ సినిమా కాదు. సింపుల్ గా చెప్పాలంటే మనం సాయిబాబా మహత్యం లాంటివి చూస్తాం కదా, ఈ హనుమాన్ అంశ్ మూవీ కూడా దాదాపు అదే టైప్ ఆఫ్ స్పిరిచువల్ స్టోరీ టెల్లింగ్ అనే చెప్పాలి. ఇది నీమ్ కరోలీ బాబా జీవితంలో ఇన్స్పైర్ అయిన స్పిరిచువల్ జర్నీ. 


ఇందులో టిపికల్ విలన్, హెవీ కమర్షియల్ డ్రామా ట్విస్ట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది పూర్తిగా డివోషనల్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అయితే ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఎవరు కూడా హనుమాన్ చాలీసా వినకుండా అయితే బయటికి రారు. అంత డివోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అసలు పెద్ద కమర్షియల్ స్టోరీ ఏం లేకపోయినా ఈ హనుమాన్ లో సరైన సీన్స్, సరైన ఎమోషన్స్ తో ఒక మీనింగ్ ఫుల్ సినిమా చేయొచ్చు అని ఈ సినిమా నిరూపించింది అని చెప్పాలి. శోభినవ్ సత్య గారు బాబా రోల్ లో చాలా ఈశ్వరుడిలా ఇచ్చారు. స్టార్టింగ్ లోనే 50 జంట్స్ కి భోజనం పెట్టే సీన్, ఏది తక్కువ కాదని భావన చూపించే సీన్, ఒక అన్న ముద్ద అందరికీ భోజనం పెట్టే సీన్ ఇలాంటివి చాలా సింపుల్ గా ఉన్నా చాలా స్ట్రాంగ్ మెసేజెస్ ఇచ్చాయి. అయితే కొన్ని చోట్ల నరేషన్ స్లోగా అనిపిస్తుంది. 


ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి చాలా హై కి తీసుకెళ్లి ఎండ్ చేస్తారేమో అనుకుంటాం కానీ చాలా సింపుల్ గా ముగుస్తుంది క్లైమాక్స్. అయితే ఎండ్ క్రెడిట్స్ తో సినిమా మేకింగ్, హనుమాన్ చాలీసా చాంటింగ్ విషయాలు చూపించడం మాత్రం నిజంగా బాగుంది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎన్నో సినిమాలు వచ్చేస్తుంటాయి కానీ సినిమా చూసిన తర్వాత మనకి ఉపయోగపడే ఏదో ఒక విషయం అయితే సినిమాని నేను రికమెండ్ చేస్తాను. ఫైనల్ గా ఇట్స్ ఏ సోల్ ఫుల్ డివోషనల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.2/5.

7.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman Ansh movie Review

ఇప్పుడే హనుమాన్ అంశ్ చూసొస్తున్నాను. నేను ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ అసలు ఏముందిరా ఈ సినిమాలో? ఏంటా కలెక్షన్? జనాలందరూ ఎందుకు ఈ సినిమాని అంతలా చూసేస్తున్నారు? అసలు ఏం చేశారు ఈ సినిమాలో అని తెలుసు...

ఇప్పుడే హనుమాన్ అంశ్ చూసొస్తున్నాను. నేను ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ అసలు ఏముందిరా ఈ సినిమాలో? ఏంటా కలెక్షన్? జనాలందరూ ఎందుకు ఈ సినిమాని అంతలా చూసేస్తున్నారు? అసలు ఏం చేశారు ఈ సినిమాలో అని తెలుసుకోవడానికి ఒక రీజన్ అయితే, రెండో రీజన్ నేను థియేటర్ లోకి వెళ్లే ముందు నాకు నీమ్ కరోలీ బాబా గురించి అసలు తెలియనే తెలియదు. ఓపెన్ గా అసలు ఏమిటి ఈ బాబా ఎవరు అని తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో థియేటర్ లోకి వెళ్ళాను. అండ్ థియేటర్ లోకి వెళ్లే ముందు డెఫినెట్ గా బోరింగ్ గా అనిపిస్తది. ఫోన్ బయటికి తీసి ఫోన్ లోనే ఉంటాం, సినిమా చూడడం తక్కువ ఉంటది అన్న కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంప్రెషన్స్ తో చాలా లో ఎక్స్పెటేషన్స్ తో థియేటర్ కి వెళ్లడం జరిగింది. బట్ సినిమాను చాలా సింపుల్ గా, చాలా సిన్సియర్ గా, చాలా ప్లెజెంట్ గా నీమ్ కరోలీ బాబా గురించి చెప్పడం జరిగిందన్నమాట. 


ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా సింపుల్ సీన్స్ ని అలా కూల్ గా తీసేయడం వల్ల ఆ సీన్స్ మనకి చాలా ఇంప్రెసివ్ గా, చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీ చూసేటప్పుడు నాకు ఎక్కడా ఎవరో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇక్కడేంట్రా బాబు ఇలా ఉంది ఫన్నీగా నవ్వుకుందాం మనం అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ యాక్టర్స్ చేత పర్ఫామ్ చేయించిన ఆ యాక్టింగ్ కానీ, వాళ్ళు సటిల్ గా వెనకాల ఇచ్చిన ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ మెయిన్ గా ఆ హనుమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పుడైతే వస్తుందో అవన్నీ చాలా ప్లెజెంట్ గా ఉండడం వల్ల మన డైవర్షన్ అటువైపు అసలు వెళ్ళనే వెళ్ళలేదు అన్నమాట. అండ్ మన కరోలీ బాబా లాగా యాక్ట్ చేసిన ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన యాక్ట్ చేశారు. 


ఇక నేను ఈ సినిమా నుంచి ఈ థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి ప్లెజెంట్ కూల్ ఫీలింగ్ తోనే బయటికి వచ్చాను. మీరు చూడాలి అనుకుంటే హ్యాపీగా విత్ ప్లెజెంట్ మైండ్ విత్ ఓపెన్ మైండ్ వెళ్లి థియేటర్ లో కూర్చుంటే మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అదే ప్లెజెంట్ మైండ్ అండ్ అదే ఓపెన్ మైండ్ తో థియేటర్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. థియేటర్ నుంచి అదే కూల్ ఫీలింగ్ తో బయటికి రావచ్చు.

8.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman Ansh movie review

హనుమాన్ అంశ్ హిందీ వర్షన్ లో చూశాను, యాక్చువల్ గా తెలుగులో కూడా వస్తే చూద్దామని వెయిట్ చేస్తే.. ఇప్పుడైతే రిలీజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా తెలుగులో కానీ ఫైనల్ గా ఇప్పుడైతే రిలీజ్ అయింది...

హనుమాన్ అంశ్ హిందీ వర్షన్ లో చూశాను, యాక్చువల్ గా తెలుగులో కూడా వస్తే చూద్దామని వెయిట్ చేస్తే.. ఇప్పుడైతే రిలీజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా తెలుగులో కానీ ఫైనల్ గా ఇప్పుడైతే రిలీజ్ అయింది. చాలా బాగుంది సేమ్ అదే ఫీల్ హిందీలో చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీల్ అయితే కలిగిందో సేమ్ తెలుగులో కూడా అలాంటి ఫీలే కలిగింది. చాలా బాగా అనిపించింది బేసిక్ గా ఇంతకుముందు హిందీలో చూశాను సో అప్పుడు రివ్యూ పెట్టేసాను ఆల్రెడీ, బట్ ఇప్పుడు తెలుగు వెర్షన్ గురించి చెప్తున్నా. ఒక తెలుగు సినిమా చూసినట్టే ఉంది ఎక్కడ కూడా డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. 


అయితే క్లైమాక్స్ అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది నాకు లాస్ట్ టైం చూసినప్పుడు హిందీలో చూసినప్పుడు ఏదైతే ఒపీనియన్ కలిగిందో అది ఇప్పుడు కొంచెం మారింది. సినిమా ఓవరాల్ గా చాలా చాలా బాగుంటది సినిమా. అంటే ఇది కొంతమందికి ఏంటంటే లెఫ్టిస్ట్ లకి లేదంటే దేవుడిని నమ్మని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తప్పు తప్పు లాగా లేదంటే ఒక ప్రాపగండా లాగా లేదంటే యు నో ఒక ఫేక్ నరేటివ్ సెట్ చేస్తున్నారు అన్నట్టో లేదంటే ఈ హిందూ ధర్మంకి సంబంధించిన కాన్సెప్ట్ ని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటారు అన్న పాయింట్ ఉండొచ్చు. సో ఆ లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలా మంది సో వాళ్ళని వదిలేసేయండి వాళ్ళ సంగతి పట్టించుకోకండి. వాళ్ళ కోసం తీసింది కాదు. కొన్ని సినిమాలు అందరినీ ఉద్దేశించి తీయబడవు. ఓవరాల్ గా సినిమాని చూసే వాళ్ళు చూసేయండి థియేటర్లో. 

8.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman Ansh Movie Review

Thyview

By Thyview

Review and here is our non-spoiler review of the movie Hanuman ansh. నేను కూడా ఈ సినిమా తెలుగులో వచ్చాకే చూద్దామని ఆగాను. హెవీ ఎక్స్పెటేషన్స్ ఏ ఉన్నాయి అండ్ నాకు సినిమా నచ్చింది. ఇంతకీ కథ విషయానికి వస...

Review and here is our non-spoiler review of the movie Hanuman ansh. నేను కూడా ఈ సినిమా తెలుగులో వచ్చాకే చూద్దామని ఆగాను. హెవీ ఎక్స్పెటేషన్స్ ఏ ఉన్నాయి అండ్ నాకు సినిమా నచ్చింది. ఇంతకీ కథ విషయానికి వస్తే ఈ సినిమాని Divine Detour That Changed My Life based on the life of Neem Karoli Baba లైఫ్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని బయోగ్రఫీ ఫిల్మ్ గా తీశారు. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నీమ్ కరోలి బాబాగా ఎలా మారారు, మారిన తర్వాత ఏం చేశారు ఇంతే కథ. చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ గాడ్ హనుమానే. ఇక సినిమాలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చిన్నప్పుడు హనుమాన్ భక్తుడు. ఆ భక్తి తనని ఎంతవరకు తీసుకెళ్లింది అనే పాయింట్ లో స్టార్ట్ అవుతుంది. 


ఇలాంటి మూవీస్ ఎలా హీల్ చేయాలి అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు మీరు అనొచ్చు మ్యాజిక్లు చేసే బాబా నా అని. ఆ మ్యాజిక్ అనే ఎలిమెంట్ కూడా ఇంటు ద నేచర్ వెళ్ళినట్టే ఫీలింగ్ ఇస్తది. ఒక స్పిరిచువల్ యాంగిల్ తీసుకొని వస్తది. రియల్ ఈవెంట్స్ తో ట్రాక్ చేస్తారు అండ్ ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ ఇంటర్ప్రిటేషన్ ఆడియన్స్ కి వదిలేస్తారు. ఇక బాబా రోల్ ప్లే చేసిన శోభినో సత్య స్క్రీన్ పైన జీవించేశారు. చాలా సీన్స్ లో డైలాగ్స్ లేకుండా జస్ట్ ద ఆక్టర్ కళ్ళతోనే, తన స్మైల్ తోనే ఎమోషన్స్ కన్వే చేసారు. మ్యూజిక్ విషయానికి వస్తే త్రూ అవుట్ ద మూవీ బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. డైరెక్టర్ డాక్టర్ విశాల్ చతుర్వేది సినిమాను ఎలా ప్రెసెంట్ చేయాలి అనేది బాగా తెలిసిన మనిషి. ఫైనల్ గా సినిమా అయితే బాగా నచ్చింది. 

7.0
out of 9
1 week ago
Oct 12, 2026 Hindi

Hanuman Ansh movie Review

సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. ర...

సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. రెండు కోట్లు కొడితే ఇంత కొట్టింది, నాలుగు కోట్లు కొడితే మూడు కోట్లు కొట్టింది అని కూడా చాలా చాలా పెద్ద బాగుంది బాగుంది అంటారు ఏందో అనుకున్నా. సో ఏందిరా సినిమా అనుకుంటే మాత్రం తర్వాత తెలిసింది సినిమాకి ఇంత పెద్ద బాబా లైఫ్ స్టోరీ మీద బేస్ అయిన సినిమా నిమ్కరోలి బాబా అని చెప్పేసి తెలిసిన అన్నమాట. సో సినిమా ఎలా ఉందంటే మాత్రం నేను అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇలా ఉంటది అనుకున్నా అలా ఉండకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా కూడా. చాలా స్పిరిచువల్ గా హనుమంతుడి ప్రార్థన ఎలా ఉంటది దేవునితో ఆ బాబా జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. 


ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ చాలా గట్టిగా హెల్ప్ అయింది అని చెప్తా. బడ్జెట్ తెలుస్తా ఉంది అండ్ చాలా వరకు కూడా నేచురల్ లొకేషన్ లో తీశారు, అది మంచిగా అనిపించింది. వీటన్నిటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ పర్ఫార్మెన్సెస్ శోభినవ్ సత్య గారు యాస్ నిమ్కరోలి బాబా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది అన్నమాట. ఆయన చేసేది సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయి ట్రైన్ సీన్ అని చెప్పేసి.. నేను హనుమంతుడి భక్తుడిని నాకు అట్లాంటి సీన్స్ పడ్డప్పుడల్లా మంచిగా అనిపించింది సినిమాలో. ఏదో శక్తులు ఉన్నాయి బాబాకి అన్నట్టు చూపెట్టకుండా అలా వెళ్ళిపోయింది సినిమా. సో హనుమాన్ అన్ష్ నాకైతే నచ్చింది. 

7.0
out of 9
1 week ago
Oct 10, 2026 Hindi

Hanuman Ansh movie review

T

By Tharuni

chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...Theater l...

chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...


Theater loki velli kurchogane ardam aipoyindi, idi movie la ledu, oka roju motham office lo kurchoni boring meeting lo unna feel ichindi.

Asalu story slow ga, pedda drama la konchem kuda entertainment lekunda saagindi. Eppudo 20 years back vachina old emotional melo drama serials la unnai scenes.


Commercial elements assalu levu... but story lo message chala bagunnai.. ilanti movie chuse audiance vere untaru.. nakaithe theater ki velthe kasepu navvukunnama... intiki vachesama annattu undali... may be ilanti movies chuse audiance vere vallu chalamandi undocchu.. but nenaithe kadu... overall konni manchi messages humans ki chepparu kabatti.. maree boring kakunda avarage ga undani cheppocchu.

6.0
out of 9
1 week ago
Oct 10, 2026 Hindi

Hanuman Ansh movie review

Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.movie might feel it's a bit slow. But for someone like me looking to unpl...

Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.


movie might feel it's a bit slow. But for someone like me looking to unplug, it genuinely delivers a deeply moving, serene experience.


The way they portrayed Neem Karoli Baba’s life - leaving home at twelve, moving through life like a flowing river without getting tied down -really hit home. It doesn't really on cinematic tricks; it just focuses on pure human connection and spiritual depth.


I'm walking out of the hall feeling completely calm and recharged. If you have a devotional side or just need a soul-soothing break after a chaotic workweek, i think this is definitely worth catching on the big screen!


6.0
out of 9
1 week ago
Oct 10, 2026 Hindi
Why MRO?